1 ENS Live Breaking News

ఒంటరి మహిళకు యువ సర్వేయర్లు ఆపన్నహస్తం..

కరోనా సమయంలో ఒంటరిగా ఉంటూ  అంగవైకల్యంతో వున్నతన చిన్నకూతురి పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబానికి చేయూతనందించడానికి యువసర్వేయర్లు  కె.సత్య(వేలంగి సర్వేయర్) శంఖవరం-1 గ్రామసచివాలయం సర్వేయర్ వీర్ల సురేష్ లు ముందుకి వచ్చారు. మంగళవారం వేలంగిలో మద్ది మంగ అనే ఒంటరి మహిళ కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించి తమ దాత్రుత్వాన్ని చాటుకున్నారు. ఈకుటుంబాన్ని పోషించే ఈమె పెద్దకూతురు ఇటీవలే మ్రుత్యువాత పడటం, చిన్నకూతురు అంగవైక్యంతో ఉంటం, వయస్సు మళ్లిన ఆమె ఒంటరి మహిళ కావడంతో వీరు పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువసర్వేయర్లు  వారికి నిత్యవసర సరుకులు అందించి చేయూతనందించారు. ఈ సందర్భంగా సర్వేయర్ సురేష్ మాట్లాడుతూ, కరోనా సమయంలో ఎందరో నిర్భాగ్యులు మూడుపూటల తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ ద్రుష్టికి వచ్చిన వారికి తమవంతుగా కొద్దిమేరక సహయం చేస్తున్నామని చెప్పారు. అలాంటి వారికి సహాయం అందించడానికి మరింత మంది దాతలు ముందుకి రావాలని పిలుపునిచ్చారు. మరో సర్వేయర్ సత్య మాట్లాడుతూ, తమ సహచర సర్వేయర్ సురేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆలోచింపజేశాయని, దానితో తాను కూడా  తనకున్న దానిలోనే నిరుపేదలకు సేవచేయాలని తపించి  ముందుకి వచ్చినట్టు వివరించారు. దాతలు, ఉద్యోగులు కూడా ముందుకి వస్తే ఇలాంటి ఎందరో నిరుపేదలకు ఈ కరోనా సమయంలో చేయూతనందించిన వారవుతారని పేర్కొన్నారు. శంఖవరం మండలంలో నిత్యం ఈ యువ సర్వేయర్లు చేస్తున్న సేవకార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.

Sankhavaram

2021-05-18 10:30:30

ఫీవర్ సర్వే పారదర్శకంగా చేపట్టాలి..

 గ్రామాల్లోని ఇంటింటా ప్రతి ఒక్కరికీ నిర్వహించే జ్వర పీడితుల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని శంఖవరం  తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బందికి సర్వేపై మార్గనిర్దేశం చేసారు. ఈ సందర్భంగా తహశీల్దార్  మాట్లాడుతూ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏడో విడత ఫీవర్ సర్వే జరుగుతుందన్నారు. ఆ విధంగా మే నెలాఖరు వరకు 11 విడతలుగా సర్వే చేయాల్సి ఉంటుందని సిబ్బందికి వివరించారు.  ఈ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు, వి ఆర్ ఓ లు, సచివాలయ సిబ్బంది, ఎఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, సచివాలయాల వలంటీర్లు మమేకమై ప్రతీ గృహాన్ని సందర్శించి సభ్యులు వారీగా సర్వే చేయాలన్నారు.  జ్వరం, దగ్గు‌‌, రొంప, అయాసం వంటి ప్రాధమిక లక్షణాలును గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ ల ద్వారా అంతర్జాలంలో నమోదు చేయాలని  ఆదేశించారు. ఈ సర్వేలో రోగాలని తేలిన వారికి అవసరమైన మందులను నేరుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి తీసుకుని వచ్చి బాధితులకు ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. కత్తిపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసామని, ఇప్పటికే మండల వ్యాప్తంగా కరోనా సోకిన వ్యక్తులకు ఇంటి వద్ద నివశించడానికి అనుకూలమైన ప్రదేశం లేని వారికీ ఈ కేంద్రాన్ని సూచించాలని తాహసిల్దార్ ఆదేశించారు. ఇది కేవలం ఉండడానికి మాత్రమే ఉపకరిస్తుందని, ఆహారం, ఇతరత్రా సామాగ్రి కరోనా బాధితులే సమకూర్చు కోవాలని తెలపాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోనేలా చూడాలన్నారు. కొన్ని గ్రామాల్లో రేషన్ ఇవ్వడం పూర్తి కాలేదని త్వరితగతిన పూర్తి చెయ్యాలని తాహసిల్దార్  సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ తేజస్విని, విఆర్ఓలు సితారామ్, నరేష్, శ్రీనివాస్, శ్రీరాములు, షేక్ బాబ్జీ, దేవసహాయం, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, లోవరాజు, సత్యనారాయణ, వీరలక్ష్మీ పాల్గొన్నారు.

Sankhavaram

2021-05-17 15:38:04

ప్రపంచానికే ఆదిశంకరాచార్యులు జగద్గురువులు..

జగద్గురు ఆదిశంక రాచార్యుల జయంతి వేడుకలను విశాఖ శ్రీ శారదాపీఠం ఘనంగా  నిర్వహించింది. సోమవారం ఉదయం పీఠాధిపతులు శ్రీ  శ్రీ  శ్రీ  స్వరూపానందేంద్ర, శ్రీ  శ్రీ  శ్రీస్వాత్మానందేంద్ర రిషికేశ్ లోని విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిశంకరాచార్యునికి విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పీఠాధిపతులు  శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అధ్యాస భాష్యాన్ని పారాయణ చేసారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆదిశంకరులు యావత్ ప్రపంచానికే జగద్గురువులు అని కీర్తించారు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందని వివరించారు. శంకర భాష్యంపై  ప్రపంచంలోనే గొప్ప గొప్ప  శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేవభూమిగా పేరున్న రిషికేశ్ ప్రాంతంలో పవిత్ర గంగానదీ తీరాన శంకర జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తన పరమ గురువులు శ్రీ  సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామి అనుగ్రహంతో ఈరోజు నుంచి మూడుపూటలా వేద విద్యార్థులకు శంకర భాష్యాన్ని బోధించనున్నట్లు ప్రకటించారు. చాతుర్మాస్య దీక్ష ముగిసే వరకు నాలుగు నెలల పాట ఈ పాఠాలు ఉంటాయని శ్రీ  స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాల్లోను ఆదిశంకరుని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2021-05-17 08:06:12

అనాధ పిల్లల కోసం ప్రత్యేక పునరావాసం..

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోవిడ్ కేర్ లో చికిత్సపొందే సమయంలో అనాధలైన పిల్లల కోసం, ప్రభుత్వం ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు శంఖవరం సిడిపిఓ ఊర్మిల తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ కారణంగా అనాధలైన పిల్లల సమాచారం అందించేందుకు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లు 181, 1098 పనిచేస్తున్నాయన్నారు. అలాంటి సమాచారం చైల్డ్ లైన్ నిర్వాహకులు వచ్చే సమయంలోవారికి గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శిలు సహాయం అందించాలని కూడా తెలియజేశారు. అంతేకాకుండా అంగన్ వాడీలు, ఆశ కార్యకర్తల ద్వారా ఇలాంటి అనాధ పిల్లల సమాచారం ఉంటే తెలియజేయాలని కూడా ఆ ప్రకటనలో సూచించారు. ఇందుకోసం జిల్లాలో డైరెక్టర్ జువెనైల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బాల బాలికల కొరకు వేరువేరుగా రెండు బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించినట్లు తెలియజేసారు. అలాగే ఇలాంటి పిల్లల గురించి సమాచారం ఇచ్చేందుకు 181 మరియు 1098 (చైల్డ్ లైన్ )అనే టోల్ ప్రీ నెంబర్లు పని చేస్తున్నాయి అని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకటరావు 9441819904, 8555060818లోనైనా సంప్రదించవచ్చునన్నారు. అంతేకాకుండా కరోనాతో తల్లిదండ్రులు మ్రుత్యువాత పడినా తక్షణమే సమాచారం అందిస్తే చైల్డ్ లైన్ నిర్వాహకు ద్వారా వారిని పునరావాస కేంద్రాలకు తీసుకెళతారని వివరించారు. అంతేకాకుండా కోవిడ్ ను ఆసరాగా చేసుకొని బాల్య వివాహాలును గ్రామాల్లో చేసే వారిపై & వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన శిక్షలు విదిస్తారని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు శంఖవరం ప్రాజెక్టు పరిధిలోని అందరు అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు  ఆదేశాలు జారీచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Sankhavaram

2021-05-16 07:06:57

చిన్నారులకు సమిథ మాస్కులు వితరణ..

కరోనా వైరస్ కేసులు ఎక్కువతున్న తరుణంలో చిన్నారులను ఆ వైరస్ నుంచి కాపాడేందుకు యలమంచిలికి చెందిన సమిథ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఆదివారం రావికమతం మండలంలోని చీమలపాడు, ములకల పల్లి, జోగుంపేట, కుంజర్తి గ్రామాల్లో ఆశ కిరణ్ ప్రత్యేక పాఠశాలలో చదువుతున్న  చిన్నారులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు మాస్కులు ముక్కూ, నోరు మూసుకుంటూ ఎలా ధరించాలి, శానిటైజర్లను ఎలా వినియోగించాలి, చేతులు ప్రతినిత్యం సబ్బుతో ఎలా శుభ్రం చేసుకోవాలనే విషయాలను సంస్థ కార్యదర్శి వీరభద్రరావు అవగాహన కల్పించారు. అంతేకాకుండా చిన్నారుల తల్లిదండ్రులకు కూడా కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. రోటరీ ఇండియా లిటరీ మిషన్ సహకారంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ దాడి పోతురాజు, సంస్థ అధ్యక్షులు పడాల రమణ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గోపీ వరప్రసాద్, ఆశాకిరణం కేంద్రం ఉపాధ్యాయులు కళ్యాణ్, పవన్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Ravikamatham

2021-05-16 04:21:59

మానవతా దృక్పదంతో సేవ చేయాలి..

కరోనా వైరస్ అధికంగా వున్న సమయంలో అధికారులు, సిబ్బంది మానవతా దృక్పదంతో  సేవలందించాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చూసించారు. శనివారం విశాఖలోని  విమ్స్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పర్యాటక శాఖమంత్రి, మేయర్ వెంకట హరి కుమారిలతో  కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే పేషెంట్లతో ఆప్యాయతతో మాట్లాడి సమస్య తెలుసుకొని, ఆక్సిజన్ ఉన్న పడకలు కావాలా, వెంటిలేటర్, ICU పడకలు కావాలో తెలుసుకొని కేటాయించాలన్నారు. ఆక్సిజన్ పడకలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ICU పడకలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. పేషెంటు యొక్క సమాచారంను వైద్యుల ద్వారా తెలుసుకొని బందువులకు  తెలియజేయాలన్నారు.  మన ఇంటి వారికి ఏ విధముగా  అయితే చేస్తామో ఆలాగే చేసి మానవతా దృక్పథంతో ఉండాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ లో  ఎంత మంది సిబ్బంది ఉంటున్నారు, ఎన్ని సిప్టులుగా ఉంటున్నారని, తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.  ఒక రోజులో ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, పడకల వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.  ఈ సందర్శనలో జెసిలు వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మి, సంచాలకులు రాంబాబు, తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2021-05-15 15:55:16

శంఖవరం మండలంలో జోరుగా ఫీవర్ సర్వే..

శంఖవరం మండలం లోని 14 పంచాయితీలు, 16 సచివాలయాల పరిధిలోని ఫీవర్ సర్వే శనివారం ప్రారంభమైంది. శంఖవరం, పెదమల్లాపరం  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని ఆశా కార్యకర్తలతో పాటు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో కుటుంబంలోని ప్రతీ సభ్యుల వారీగా జ్వరం, దగ్గు, రొంప, ఆయాసం వంటి ప్రాధమిక లక్షణాలను గుర్తించి వాటిని ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ వివరాలు ఆధారంగా అవసరమైన మందులను ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి తీసుకొని నేరుగా బాధితుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి స్వయంగా అందజేస్తున్నారు.  అవసరం, బాధితుల ఇష్టం మేరకు వారి అంగీకారంతో కరోనా తదితర పరీక్షలను నిర్వహించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఏఎన్ఎమ్ లు, వీఆర్వోలు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల హంగూ ఆర్భాటం లేకుండా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 268 మంది వలంటీర్లు, శంఖవరం ఆస్పత్రి ఆశా కార్యకర్తలు 37మంది, పెదమల్లాపురం ఆస్పత్రి ఆశ కార్యకర్తలు 13 మంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-05-15 10:23:06

విద్యుత్ లోఓల్టేజీతో నానా పాట్లు..

అన్నవరంలో  విద్యుత్ సరఫరా లోఓల్టేజీ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది..కర్ఫ్యూ కావడంతో ప్రజలంతా ఇంటికే పరిమితం అవుతున్న తరుణంలో కరెంటు ఉన్నా ఉపయోగం కనిపించడం లేదు. కనీసం ఫ్యాన్లు కూడా స్పీడుగా తిరిగే అవకాశం లేకుండా పోతుంది. చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు ఆన్ అవడం లేదు. ఇన్వైటర్ మీద పనిచేసుకుందామంటే విపరీతమై విద్యుత్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇన్వైటర్ బ్యాటరీలు కూడా చార్జింగ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాత్రి సమయంలో అప్రకటితంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఓల్టేజీ రావడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాత్రిలు లోఓల్డేజీ సమస్యతో చదువుకోవడానికి కూడా వీలులేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Annavaram

2021-05-14 07:18:37

ప్రణాళిక బద్దంగా వేక్సినేషన్ ప్రక్రియ..

వెక్షినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.  గురువారం పీఓ తన పర్యటనలో భాగంగా సాలూరు మండలం భాగువలస పి.హెచ్.సిలో  ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ వున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. అలాగే టీకా వేయించు కోవడానికి వచ్చిన వారికి ఏటువంటి ఆసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని, అలాగే వారికి టీకా వేయించుకున్న ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రం చేసుకోనెలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ డాక్టర్ రవి కుమార్ రెడ్డి, పి.హెచ్.సి వైద్యులు, ఎ.ఎన్.ఎం లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Salur

2021-05-13 13:52:53

100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్..

అరకువాలీ యూత్ శిక్షణా కేంద్రంలో ఈనెల 14 వతేదీ నుంచి వంద పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను  ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేశారు. గురువారం  స్థానిక యూత్ శిక్షణా కేంద్రం, ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో చేరిన కోవిడ్ బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభత్వం నిర్దేశించిన మెనూ అందించాలని సూచించారు. మరుగుదొడ్లు, స్నానపు గదులకు నీటి సరఫరా ఉండేవిధంగా చూడాలని కోవిడ్ కేర్ సెంటర్ ఇంచార్జి అధికారులను ఆదేశించారు. అన్ని చోట్లా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఏరియా ఆసుపత్రికిలో కోవిడ్  వార్డ్  ను  పరిశీలించారు. కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చి లక్షణాలు లేనివారిని  కోవిడ్ కేర్ సెంటర్ కు తలరలించి తగినవైద్యం అందించాలని సూచించారు. ట్రూ నాట్ పరీక్షలపై ఆరాతీశారు.సేకరించిన నమూనాలను జాప్యం చేయకుండా పరీక్షలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు ,ఏరియా ఆసుపత్రి ప్రత్యేక అధికారి జి.విజయకుమార్ , ఆసుపత్రి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Araku Valley

2021-05-13 12:53:42

కరోనాలో సేవచేసే వారు నిజమైన దేవుళ్లు..

కరోనా సమయంలో సేవచేయడానికి ముందుకి వచ్చే ప్రతీ ఒక్కరూ దేవుడితో సమానమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ అన్నారు. బుధవారం రామ్ కో సిమెంట్ కర్మాగారం యాజమాన్యం కోవిడ్ సేవల కోసం రూ.20లక్షలను ఎమ్మెల్యే సమక్షంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంతో ఉదార స్వభావంతో రామ్ కో సిమెంట్ యాజమాన్యం కోవిడ్ బారిన పడిన వారి సహాయార్ధం చేసిన సహాయం ఎంతో భరోసాని ఇస్తుందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో మనసున్న దాతలు ముందుకి వచ్చి కోవిడ్ రోగులకు నచ్చిన రూపంలో సహాయ సహకారాలు అందించవచ్చునని అమర్నాద్ పిలుపు నిచ్చారు. ఇలాంటి సమయంలో అన్నార్తులకు నిండు హ్రుదయమున్న దాతల సహాయం ఎంతో అవసరమన్నారు. రామ్ సిమెంట్ జీఎం రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పిలుపుతో తాము ముందుకి వచ్చి ఆక్సిజన్ సహాయం కోసం తమవంతు సేవ చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో  ఆర్డీవో జిక్కుల సీతారామారావు, పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు, మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరి బాబు, నాయకులు  పీలా రాంబాబు, కొణతాల భాస్కర్, పలకా రవి, ఆళ్ళ నాగేశ్వరరావు, రాంకో కర్మాగారం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2021-05-12 15:26:50

కరోనాలో దాత్రుత్వం చాటుకున్న సర్వేయర్..

కరోనా వైరస్ విళయతాండం చేస్తున్న వేళ బాధితుల కష్టాలను చూసి చలించిన ఆ సర్వేయర్ తనవంతు సహాయంగా అన్నపానియాలు అందించి తన దాత్రుత్వాన్ని చాటుకుంటున్నాడు. ఎప్పుడూ నిరుపేదలకు సేవలు అందించే ఆ సేవకుడు.. కరోనా సమయంలో  సేవలను మరింతగా విస్త్రుతం చేస్తున్నాడు.. ఆసుపత్రుల వద్ద బాదితులకు బలవర్ధక ఆహారాన్ని అందించి వారికి సహాయం చేస్తున్నాడు. శంఖవరం మండలంలోని గ్రామ సచివాలయం-1లో సర్వేయర్ గా పనిచేస్తున్న సురేష్ రౌతుల పూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కోవిడ్ కేర్ రోగులకు, గర్భీణి స్త్రీలకు  బుధవారం ఉచితంగా భోజనాలు, మంచినీటి ప్యాకెట్లను అందించాడు. తనకున్న దానిలోనే పలు సేవా కార్యక్రమాలు చేసే ఈ యువకుడు కరోనా సమయంలో తాను సహాయం చేస్తూ అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నాడు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం, వారి ప్రాణాల కోసం సేవచేస్తున్న సమయంలో సేవ చేద్దామని అనుకున్నవారంతా ముందుకి వచ్చి బాధితులకు, నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా వారికి ఇలాంటి సమయంలో కాస్త దైర్యాన్ని ఇచ్చినవారమవుతామని చెబుతున్నాడు. తనతోపాటు సహాయం చేయడానికి ముందుకొచ్చే వారితో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలోని ఆసుపత్రుల్లో భోజనాలను అందిస్తున్నాడు. సర్వేయర్ సురేష్ చేస్తున్న ఈ ప్రజాసేవ పట్ల సచివాలయంలో పనిచేసే సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారంటూ ప్రోత్సహిస్తున్నారు. పెద్దగా ప్రచారం కోరుకోని ఈ యువ సేవకుడు దాత్రుత్వం సేవచేసేవారికి తెలిస్తే మరింత మంది ముందుకు వచ్చే అవకాశం వుంటుందనే కారణంతోనే ఈ సహాయాన్ని బాహ్య ప్రపంచం ద్రుష్టికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా తీసుకువస్తున్నాం. మనసున్న దాతలూ మీరూ ముందుకి వస్తే మరింత మంది నిరుపేదలకు సహాయం అందుతుంది..

శంఖవరం

2021-05-12 13:30:53

ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యత..

ప్రజా ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని అనంతపురం నగర మేయర్ వసీం పేర్కొన్నారు. మంగళవారం ఆవరణలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బెల్ మిస్టర్ స్ప్రేయింగ్ మిషన్ ద్వారా సోడియం హైపోక్లోరైట్  స్ప్రేయింగ్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో భాగంగానే నగరంలో పారిశుద్ధ్య మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనితోపాటు హైపో క్లోరైడ్ ను నగరంలో పెద్ద ఎత్తున స్పేయింగ్ చేయిస్తున్నామని చెప్పారు.  ప్రజలు కూడా తమ వంతుగా సహకరించాలని మేయర్  కోరారు.అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. బయటకు వస్తే మాస్క్ దరించడంతో పాటు బౌతిక దూరం పాటించాలని సూచించారు. మీ ఆరోగ్యం మీ రక్షణ మీ చేతుల్లోనే ఉందదనే విషయాన్ని గుర్తించాలని మేయర్ సూచించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-11 13:06:14

కోవిడ్ కేర్ కేంద్రాన్ని వినియోగించుకోండి..

అనకాపల్లిలోని రేబాకలో పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కోవిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ కేంద్రంలో సుమారు 200 పడకలు, వైద్యులు, మందులు సిద్దం చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అన్నివిధాల ప్రజలను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. మాస్కు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీతారాం, తహశీల్దార్ శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ ఈశ్వర్రావు, వైద్యాధికారులు, జివిఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

2021-05-08 08:33:44

శంఖవరంలో 61మందికి కోవిడ్ వేక్సినేషన్..

శంఖవరం పీహెచ్సీలో 61 మందికి కోవిషీల్డ్ కోవిడ్ వేక్సిన్ వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. శుక్రవారం ఆయన  ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మండల అధికారుల ద్వారా టోకెన్ విధానం అమలు చేసిందని, వాటి ఆధారంగా వేక్సినేషన్ ప్రక్రియ జరిపినట్టు చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినట్టు ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సమయంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు డాక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లతోపాటు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.

శంఖవరం

2021-05-07 14:35:59