లక్ష్య సాధన దిశగా అధికారులు కృషి చేసి.. నిర్ణీత గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం రాజధాని నుండి.. "భవన నిర్మాణ పక్షోత్సవాలు", "జగనన్న పచ్చతోరణం" "జగనన్న స్వచ్ఛ సంకల్పం" తదితర కార్యక్రమాల కార్యాచరణపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు (అభివృద్ది, సంక్షేమం)తో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని విసి హాలు నుండి జేసీలు సిరి ,గంగాధర్ గౌడ్, హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. రానున్న 15 రోజులు అధికారులకు అత్యంత కీలకం అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో.. ఈ నెల 17వ తేదీ నుండి జులై 2వ తేదీ వరకు "భవన నిర్మాణ పక్షోత్సవాలు" నిర్వహించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా.. ఆయా జిల్లాల్లోని గ్రామ సచివాలయాల పరిధిలో నిర్మించ తలపెట్టిన, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్ర భవనాలను.. నిర్ణేత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించా లన్నారు. జులై 8వ తేదీలోపు రైతు భరోసా కేంద్రాలను, జులై 31వ తేదీలోగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా చేపడుతున్న ఉద్యాన వన మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలకు నిర్ణయించిన లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. "జగనన్న పచ్చతోరణం" కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో, రైల్వే పరిసరాలు, రోడ్లు తదితర సామాజిక ప్రదేశాలతో పాటు.. ప్రైవేటు భూముల్లో కూడా విరివిగా మొక్కలను నాటి.. పచ్చదనాన్ని పెంచాలన్నారు.
జులై 8న రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న.. "జగనన్న స్వచ్ఛ సంకల్పం" కార్యక్రమంను విజయవంతం చేసేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ నీటి వ్యవస్థ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖల జిల్లా స్థాయి అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు.. బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా.. డివిజనల్ పంచాయతీ అధికారులు, అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. సంబందిత శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు ఎంపిడివోలు, వారివారి గ్రామీణ స్థాయి సిబ్బంది చేత.. పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగు పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన తీసుకురావాలన్నారు.
అనంతరం జేసీ సిరి మాట్లాడుతూ... జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ భవన నిర్మాణాలకు 300 సంబంధించి.. ఇప్పటికే వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే 30% పైగా పూర్చి చేయడం జరిగిందని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణ పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయన్నారు. నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
"జగనన్న స్వచ్ఛ సంకల్పం" కార్యక్రమంలో భాగంగా.. జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్లో పరిశుద్యంపై సంపూర్ణ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా.. పంచాయతీరాజ్, డ్వామా, డీఆర్డీఏ, సచివాలయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామ, వార్డు, మండల స్థాయి టీములుగా ఏర్పడి... ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. . ఈ కార్యక్రమంలో డ్వామా పిడి, పంచాయతీ రాజ్ శాఖ సూపర్డెంట్ ఇంజనీరు, సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.