1 ENS Live Breaking News

టోకెన్లు ఉన్నవారికే కోవిడ్ వేక్సిన్..

శంఖవరం పీహెచ్సీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన కోవిడ్ టోకెన్లు తీసుకున్నవారికి టీకా వేస్తామని వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఈమేరకు పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ పీహెచ్సీ పక్కనేవున్న జిల్లా పరిషత్ స్కూలులో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిభందనల మేరకు టోకెన్లు పొందిన వారు మాత్రమే వేక్సినేషన్ దగ్గరకు రావాలన్నారు. అదే సమయంలో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ వేక్సినేషన్ ప్రక్రియకు సహకరించాలన్నారు. శంఖవరంలో కోవిడ్ కేసులు అధికంగా వున్నందున ప్రజలు వైద్యసిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

శంఖవరం

2021-05-23 13:04:23

గ్రామస్థాయి కోవిడ్ కమిటీలు ఏర్పాటు

ప్రతీ పంచాయితీలో విలేజ్ కోవిడ్ మేనేజ్ మెంటు కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  శనివారం విఎంఆర్.డిఎ. లో పెరి- అర్బన్, గ్రామీణ, ఏజన్సీ ప్రాంతాలలో కోవిడ్-19 కంటైన్ మెంట్ అండ్ మేనేజ్ మెంట్ అంశముపై ఆయన ఎంపిడిఓలు, వైద్యాధికారులకు వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జివియంసి ఔట్స్ కట్స్, గ్రామీణ, ఏజన్సీ ప్రాంతాలలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, పి.హెచ్.సి. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  గ్రామ స్థాయిలో వైద్యాధికారులు అప్రమత్తతతో ఉండాలని చెప్పారు.  మండల స్థాయిలో ఎంపిడిఓలు, వైద్యాధికారులు ఒక టీముగా ఏర్పాటై పనిచేయాలన్నారు.  గ్రామ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని ఇందులో సర్పంచ్ అధ్యక్షులుగాను, ఎఎన్ఎం కన్వీనర్, సభ్యులుగాను,  వార్డు సభ్యులు,  గ్రామ వాలంటీర్ సభ్యులుగా ఉంటారన్నారు.  హోం ఐసోలేషన్ లో ఉన్న వారిని బయటికి రాకుండా తగు సూచనలు గావించాలన్నారు.  ప్రతీ గ్రామాన్ని కోవిడ్ రహిత గ్రామంగా మార్చడానికి కృషి చేయాలన్నారు.  ఆశా కార్యకర్త, గ్రామ వాలంటీర్ ప్రతి ఇంటిని సర్వే చేయాలని, ఏజన్సీలో మలేరియా పైన కూడా సర్వే చేయాలన్నారు.  సస్పెక్ట్ కేసులకు ర్యాపిడ్ ఏంటిజన్, ట్రూనాట్ పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే హోం ఐసోలేషన్ లో ఉంచి వారికి కిట్ అందజేయాలని, ప్రతీరోజు ఆశా కార్యకర్త వెళ్లి పరిశీలించాలని చెప్పారు.  గ్రామ స్థాయిలో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేయాలని, కో- మార్పిడిటీస్ ఉంటే టెలీకన్ సల్టెన్సీ తీసుకోవాలి పేర్కొన్నారు. నియోజక వర్గాల నుండి సీరియస్ కేసులు మాత్రమే విశాఖపట్నం పంపాలని నియోజక వర్గాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.  మాస్క్ లు లేకుండా ఎవరూ బయటకు రాకుండా ప్రచారం గావించాలన్నారు.  గ్రామాల్లో హోర్డింగ్ లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఈ విషయంలో సర్పంచ్ ల సహాయ, సహకారాలను తీసుకోవాలన్నారు.  ప్రతి పి.హెచ్.సి.కి ఆంబులెన్స్ సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని ఆదేశించారు.  
  అంతకు ముందు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ కోవిడ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, రిస్క్ కమ్యూనికేషన్, క్లీనింగ్ అండ్ ఇన్ఫెక్షన్, క్లినికల్ మేనేజ్ మెంట్, కమ్యూనిటీ మొబలైజేషన్, ట్రైబల్ కోవిడ్ - 19 కేర్ లపై  ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 
అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పెరి అర్బన్, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో కమిటీలు ఉన్నాయని వారిని మరింత అవగాహన పరచి కోవిడ్ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.               ఏజన్సీ ప్రాంతంలో మండలానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు గావించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.
  ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, డిఎంహెచ్ సూర్యనారాయణ, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, జె.సి.-3 ఆర్. గోవిందరావు, విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు ఆర్డిఓలు పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివజ్యోతి, జడ్పి సిఇఓ నాగార్జున సాగర్, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-22 14:00:03

తాత్కాలిక ఆసుపత్రిలో ఆక్సిజన్ మిషన్లు..

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రిలో ఈఓ సంస్థ విరాళంగా అందించిన 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం కరోనా నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత సూచనల మేరకు ఈఓ (ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్) తరఫున హైదరాబాద్ లో ఉన్న ఈఓ మెంబర్ వడ్లమూడి శ్రీహర్ష ఆదేశాలతో ఒక్కొక్కటి 1 లక్ష 3 వేల రూపాయల విలువ చేసే 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో ముఖ్యమైనవన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్ లతో మాట్లాడుతూ ఈ ఓ సంస్థ అందించిన 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను  నగరంలోని శారదా నగర్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న జర్మన్ హ్యాంగర్స్ తాత్కాలిక ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా విపత్కర సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత సూచనల మేరకు ఈఓ మెంబర్ వడ్లమూడి శ్రీహర్ష 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందించడం చాలా గొప్ప విషయమని, కరోనా వేళ సేవ చేసేందుకు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈఓ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత సూచనల మేరకు ఈఓ మెంబర్ వడ్లమూడి శ్రీహర్ష ఆదేశాలతో రాష్ట్రంలో ఈరోజు ఏలూరు, అనంతపురం జిల్లాల్లో 50 చొప్పున ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ అందజేసినట్లు తెలిపారు. ఒక్కొక్కటి 1 లక్ష 3 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను బ్యాంకాక్ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లాకు కూడా ప్రజల ప్రాణాల రక్షణకు అవసరమైన ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ అందజేయాలని తమ ఈఓ సంస్థ కు సూచించారన్నారు. మాజీ మంత్రి సూచనలతో ఈఓ సంస్థ మెంబర్ శ్రీహర్ష స్పందించి 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయాలని ఆదేశించడంతో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను ఈరోజు జిల్లా కలెక్టర్ కి అందజేశామన్నారు. తమ సంస్థ తరఫున త్వరలోనే మరిన్ని ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ మెంబర్లు కె.హరి, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-22 13:32:26

కరోనాపై యుద్దాన్ని ఉద్రుతం చేయాలి..

అనంతపురం జిల్లాలో కరోనాపై పోరాటాన్ని ఉధృతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ మునిసిపల్ , మండల స్థాయిలో  కోవిడ్ వార్ రూమ్ లు ఏర్పాటు చేసుకుని కరోనాపై పోరాటం చేస్తున్నామని, ఇక నుంచి గ్రామ స్థాయిలో సర్పంచ్ నేతృత్వంలో గ్రామ కరోనా కట్టడి కమిటీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  శనివారం  వివిధ  అభివృద్ధి పనుల పురోగతిపై   జాయింట్ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్   టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. నిర్వహించారు. జిల్లాలో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతోందని, ఇలాంటి సమయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే పాజిటివిటీ రేటు మరింతగా తగ్గించొచ్చన్నారు. జిల్లాలో కరోనాపై పోరాటంలో భాగమైన  ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలన్నారు.  వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, హోమ్ ఐసోలేషన్ కిట్ల పంపిణీ అన్నీ పక్కాగా నిర్వహించాలన్నారు. 104 సేవల్లో లోపాలు లేకుండా చూడాలన్నారు. పట్టణాలలో,గ్రామాల్లో  శానిటేషన్ కార్యక్రమాలు ఉధృతం చేయాలని డి పి ఓ, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.

 అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వద్దు 

కరోనా సాకుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఉపాధి హామీ పనులలో రోజుకు నాలుగున్నర లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. డ్వామా పీడీ మరింత శ్రద్ద తీసుకుని  సోమవారం నాటికి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా చూడాలన్నారు. 

గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు,అంగన్వాడీ భవనాలు, పాల శీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.  బేస్మెంట్ స్థాయి, గ్రౌండ్ ఫ్లోర్ స్థాయి లో వున్న నిర్మాణాలను పురోగతి చూపించి తదుపరి స్థాయిలకు వెళ్లేలా చూడాలన్నారు.ఆ పై స్థాయిలో వున్న భవన  నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. పాల శీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణ పనులను గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెటీరియల్ ఎక్స్పెండించర్ లో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. అంగన్వాడీ భవనాలకు త్వరితగతిన సైట్ ను గుర్తించాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మ్యాపింగ్, జియో ట్యాగింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలన్నారు. ఇళ్ల కాలనీల అభివృద్ధి పనులు, కాలనీలకు నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నవరత్నాల ఫలాలను అందించడంలో ముందుండాలన్నారు. పెన్షన్ల పంపిణీ, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, బియ్యం కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. 

వ్యవసాయ సీజన్ లో విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. బ్యాంకుల వద్ద రుణ వితరణ, లోన్ రెన్యూవల్ కార్యక్రమాలు కరోనా నిబంధనలు పాటిస్తూ కోసాగేలా చూడాలన్నారు. వైఎస్సార్ జలకళ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఎత్తున బోర్లు తవ్వించాలన్నారు. ఇప్పటికే వీఆర్వోల వద్ద పెండింగులో ఉన్న జలకళ అప్లికేషన్లను ప్రాసెస్ చేయాలన్నారు.90 రోజుల్లో పు ఇళ్ళ స్థలాల పంపిణీకి సంబంధించి  దరఖాస్తులను క్లియర్ చేయాలన్నారు.స్పందన సమస్యలన్నీ గడువు లోపు పరిష్కరించాలన్నారు...పట్టణాల్లో శానిటేషన్,,వీధి దీపాలు, తాగు నీటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడద ని మునిసిపల్ కమిషనర్ లను ఆదేశించారు.

Anantapur

2021-05-22 13:26:56

శంఖవరంలో మరో 36 పాజిటివ్ కేసులు..

శంఖవరంలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా..ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. శనివారం ఆయన  ఆసుపత్రిలో మీడియాలో మాట్లాడుతూ, 79 మందికి రేపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 36 పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

Sankhavaram

2021-05-22 11:58:39

పాజిటివ్ వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి..

కరోనా పాజిటివ్ రోగులు జాగ్రత్తలు పాటించాలని సచివాలయ ఆరోగ్యకార్యదర్శి ఎ.నాగమణి సూచించారు. యలమంచిలి పురపాలకసంఘం పరిధిలోని 6వ వార్డులో శనివారం కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో వున్న రోగుల బంధువలకు ప్రభుత్వం సూచించిన సలహాలను ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చిన వారు 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో వుంటూ ప్రభుత్వం సరఫరాచేసిన మందులను క్రమం తప్పకుండా వాడాలన్నారు. అదే సమయంలో బలవర్ధక ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాసకోస సమస్యలు వస్తే తక్షణమే 104కి సమాచారం తెలియజేయడం ద్వారా వారు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారని అన్నారు. పాజిటివ్ వచ్చిన రోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని హెచ్చరించారు. వారికి దూరం నుంచే ఆహారాలను, వేడినీరు అందించాలని సహాయకులకు సూచించారు.

Yalamanchili

2021-05-22 10:10:37

మే 24న ఆశాల దేశవ్యాప్త సమ్మె..

ఆశాల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 24న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా శ్రామిక మహిళా సంఘం నాయకులు లంగశాంతమ్మ పిలుపునిచ్చారు. శనివారం బొబ్బిలిలో ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ఆశవర్కర్లను తక్షణమే ప్రభుత్వం పర్మినెంటు చేయాలన్నారు. మిగిలిన శాఖ మాదిరిగా కనీస వేతనం రూ.21000 చెల్లించడంతోపాటు ఇన్య్సూరెన్సు సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కరోనా రోగులకు విశేషంగా సేవలు చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లతో చేపట్టే ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలియజేయాలని కోరారు. ఈకార్యక్రమంలో  శ్రామిక సంఘం నాయకులు మాలతి, ఇందిరా, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Bobbili

2021-05-22 09:54:54

కరోనాలో దాతల సహాయం మరువలేనిది..

విశాఖ కె.జి.హెచ్.లో నూతనంగా నిర్మించిన సహజ సిద్దమైన ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ శుక్రవారం ప్రారంభించారు. ప్లాంట్ అంతటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.  ఆక్సిజన్ తయారీ విధానంగా గూర్చి కలెక్టర్ అడుగగా వాతావరణం నుండి సేకరించిన గాలి నుండి ఆక్సిజన్ నిల్వ, సరఫరా చేయు విధానం గూర్చి ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్ వివరించారు.   కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను కె.జి.హెచ్.లోని నర్సింగ్ కళాశాల వసతి గృహంనకు ప్రక్కనే నిర్మించారు.  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మిషనరీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సివిల్ పనులు కలిపి 3.4 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు.  రోజుకు 400 వందల ఆక్సిజన్ సిలిండర్లు (2 x 1000 LPM ప్లాంట్) ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్. సూపరింటెండెంట్ డా. మైథిలి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. డి.ఎ. నాయుడు, ప్రొఫెసర్ డా. ఎం.విజయ శేఖర్, డా. మనోజ్ పాత్రుని, ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్, డి.ఇ.ఇ. సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.  

King George Hospital

2021-05-21 13:30:20

శంఖవరంలో 22 కరోనా పాజివ్ కేసులు..

శంఖవరంలో 22 మందికి కరోనా  పాజిటివ్ గా నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు. శుక్రవారం శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 54 మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందలో 22 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలు ఉన్నా తక్షణమే పీహెచ్సీలో పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం ఇచ్చే కరోనా మందుల కిట్ ను హోమ్ ఐసోలేషన్ లో ఉండి వాడాలన్నారు. నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ బలవర్తక ఆహారం తీసుకోవడం ద్వారా 14 రోజుల్లో కరోనా వైరస్ భారి నుంచి బయట పడటానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వుంటే తక్షణమే 104కి కాల్ చేయడం ద్వారా వారికి వారిని హాస్పటల్ ఐసోలేషన్ కి తరలిస్తారని డా.ఆర్వీవీ సత్యన్నారాయణ వివరించారు.

Sankhavaram

2021-05-21 09:33:09

అన్నవరంలో జోరుగా సోడియం క్లోరైడ్ స్ప్రేయింగ్..

కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని పంచాయతీ కార్యదర్శి రాంబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం అన్నవరం మేజర్ పంచాయతీలోని పలు వీధుల్లో సోడియం హైపోక్లైరైడ్ ద్రావణాన్ని ఆయన దగ్గరుండి పిచికారీ చేయించారు.  బిసి కాలనీ, సుబ్బరాయపురం ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బంది ప్రతీ ఇంటి వద్ద ఈ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ తోపాటు, ఈ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. తరచూ చేతులకు శుభ్రపరుచుకోవడం తోపాటు, పరిశరాలను కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. వీధుల్లో చెత్త అధికంగా వున్న గ్రామవాలంటీర్ల ద్వారా సమాచారం ఇస్తే తక్షణమే చెత్తను శుభ్రం చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కె.సూరిబాబు, ఎ.శ్రీనివాస్, కె.శ్రీను. సోము గౌరిశంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-05-21 09:00:15

పోలీసులకు మజ్జిగ, ఆహారం వితరణ..

కరోనా మహమ్మారి ప్రజాజీవితాలను అతలాకుతలం చేస్తున్న వేళ అన్ని వర్గాలకు రక్షణగా  నిలిచే పోలీసులను, పారామెడికల్, సచివాలయ , పారిశుధ్య  సిబ్బందినీ గౌరవించాలని సామాజిక వేత్త విజినిగిరి భాలభాను మూర్తి పిలపునిచ్చారు. శుక్రవారం ఎండలో సింహాచలం నుంచి ఎన్ఏడీ వరకూ రోడ్డులో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మజ్జిగ, ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ కరోనా సమయంలో ప్రభుత్వ నిభందనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం కార్యదర్శి లోగిశ గణేష్,  కె.వి.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-05-21 08:07:38

క్రిష్ణదేవిపేట లో కానరాని BSNLసిగ్నల్..

విశాఖజిల్లా, గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేటకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ రానంటుంది. ఇక్కడ ప్రైవేటు నెట్వర్కులతో పోల్చుకుంటే బీఎస్సెనెల్ సిగ్నల్ చాలా తక్కువగా వుంది. క్రిష్ణదేవిపేట టెలీఫోన్ ఎక్స్చేంజి పరిధిలో వున్న ఒకే ఒక్క సెల్ టవర్ ఇక్కడ ఉండే వినియోగదారులకు సిగ్నల్ లైన్ అందించలేకపోతుంది. ఈ టవర్ మీద ఆధారపడి సుమారు 40 గిరిజన గ్రామాలున్నాయి. కరోనా సమయంలో విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు, ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తుండటంతో వీరందరికీ ఇంటర్నెట్ బాగా అవసరం పడుతుంది. కానీ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ స్పీడు  సిగ్నల్ లేమితో రావడం లేదు. దానీతో తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తుంది. ఒక్క క్రిష్ణదేవిపేట, ఏజెన్సీ లక్ష్మీపురం, కొంగసింగి, ప్రాంతాల్లోనే 30వేల మందికి పైగా బిఎస్సెన్నెల్ వినియోగదారులు ఉన్నారు. bsnlతోపాటు jio, airtel మొబైల్ నెట్వర్క్ లు ఇక్కడ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. క్రిష్ణదేవిపేట గ్రామం ఏజెన్సీకి ముఖద్వారం కావడంతో ఇక్కడకు నిత్యం వందలాది మంది వస్తూ పోతూ ఉంటారు. అదే సమయంలో వినియోగదారుల మొబైల్స్ సిగ్నల్ ఒత్తిడి పడుతుంది. ఈ విషయమై బీఎస్ఎన్ఎల్ అధికారులు ఎన్నిసార్లు విన్నవించానా ఫలితం లేకుండా పోతుందని, ఈ ప్రాంతంలోని కొత్తగా ఎన్నికైన సర్పంచులు వాపోతున్నారు. ఈ విషయమై ఒక్కో పంచాయతీ నుంచి ప్రత్యేకంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా చేసినట్టు చెబుతున్నారు.  ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మెరుగు పరచాలని, లేదంటే కొత్తగా మరో టవర్ నిర్మాణం చేపట్టి వినియోగదారుల ఇబ్బందులు తీర్చాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

Krishnadevipeta

2021-05-21 05:14:20

విలేజ్ ఐసోలేషన్ కేంద్రాలు వినియోగించుకోవాలి..

విలేజ్ ఐసొలేషన్ సెంటర్  కోవిడ్ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మి శ తెలిపారు. గురువారం పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేజ్ ఐసొలేషన్ సెంటర్ ను జాయింట్ కలెక్టరు లక్ష్మీ షా ప్రారంభించారు. అనంతరం  పాత్రికేయులతో జేసీ మాట్లాడుతూ ప్రతి గ్రామ స్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, యువత, అధికారులు విలేజ్ ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు కు కృషి చేయాలనీ అన్నారు. కోవిడ్ వచ్చిన పేషంట్లు 14 రోజులు క్వారైంటైన్ లో వుండి మందులు వేసుకుంటూ కరోనా వ్యాధి నుండి సురక్షితంగా బయటపడవలసి ఉంటుందని అన్నారు. కొంతమందికి ఇంటిలో అవకాశం లేని వారికి విలేజ్ ఐసొలేషన్ సెంటరు ఉపయోగపడుతుందనితెలిపారు.  కరోనా బారినపడినవారు విలేజ్ లో ఐసొలేషన్ సెంటర్ ఉండడం వల్ల వేరే ప్రాంతలకు వెళ్ళకుండా గ్రామంలోనే వుండే అవకాశం ఉంటుందని తెలిపారు. కులాలు, మతాలు మరిచి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో ప్రజలు ముందుకు వస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా 3000 మంది కరోనా బాధితులకు కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.500 మంది వెంటిలేటర్ లో ఉండగా, 2500 మంది ఆక్సిజన్ తీసుకుంటున్నారని, 500 మంది నార్మల్ బెడ్స్ లో వుంటున్నారని జెసి తెలిపారు. కోవిడ్ బాధితులకు కరోనా మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్లను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. మానవతాదృక్పధంతో ముందుకు వచ్చి కోవిడ్ పేషంట్ల కు ప్రతి ఒక్కరు చేయూతను ఇవ్వాలని అన్నారు.జి. రాగంపేట గ్రామం లో సర్పంచి శేఖర్ ,  ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు, అధికారులు సమన్వయంతో  ఐసొలేషన్ సెంటరను ఏర్పాటు చేయడం అభినందనియమని అన్నారు. ఇదే స్ఫూర్తి తో  ప్రతి గ్రామంలోనూ విలేజ్ ఐసొలేషన్ సెంటరను ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్లు కు బాసటగా నిలవాలని అన్నారు. పాజిటివ్ కేసులు వున్న వ్యక్తులు బహిరంగంగా తిరగడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. దీనిని అదిగమించడానికి వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఎ,హెన్ ఎం ల ద్వారా పాజిటివ్ కేసుల హౌసలను గుర్తించి  కోవిడ్ స్టిక్కరింగ్ ను అంటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మి శ ఐసొలేషన్ సెంటర్ లో వున్న కోవిడ్ బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై అరా తీశారు. వారికీ పండ్లను అందచేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కోవిడ్ పోజిటివ్ కేసు ఇంటికి వెళ్లి  స్వయంగా కోవిడ్ పాజిటివ్ స్టిక్కరింగ్ను, గోడపై అంటించడం జరిగింది. జెసి తో పాటు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, ఆర్డీఓ ఎస్. మల్లి బాబు ఇరువురు కోవిడ్ పాజిటివ్ స్టిక్కరింగ్ ఇంటికి   అంటించడం జరిగింది. ఈ 6కార్యక్రమంలో  అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ సరితా, పులిమేరు పి హెచ్ సి వైద్య అధికారి రాంబాబునాయక్, .అని ఎంపీడీఓ రమణ రెడ్డి, తహసీల్దార్ బి శ్రీదేవి,దవలూరి సుబ్బారావు, పంచాయతీ  సెక్రటరీ సెలెక్ట్ రాజు  గ్రామంలో ప్రజా ప్రతినిధులు, ఏఎన్ఎంలు , ఆశా వర్కర్లు, వాలంటీర్ల్ తదితరులు పాల్గొన్నారు.

Peddapuram

2021-05-20 12:01:27

ఘనంగా భగీరథ జయంతి..

భగీరథ జయంతిని జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన భగీరథ జయంతి కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టీ.సవరమ్మ భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సవరమ్మ మాట్లాడుతూ దీక్ష, సహనానికి మారుపేరు భగీరథుడు అన్నారు. ఎంత కష్టం అయినా లెక్కచేయకుండా సాధించగల ధీరుడు అన్నారు. దివి నుండి గంగను భూవికి తీసుకు వచ్చిన మహానుభావుడని ఆమె తెలిపారు. భగీరథ దీక్ష, సహనం, పట్టుదల ప్రతి ఒక్కరికి అవసరమని దాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా గొప్ప కార్యాలను సాధించగలమని ఆమె వివరించారు. సమాజానికి భగీరథుడు ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి కే.కే.కృత్తిక, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పి.చంద్ర ప్రతి రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-19 15:46:05