1 ENS Live Breaking News

త్వరితగతిన నిర్మాణాలు పూర్తికావాలి..

ప్రభుత్వ భవనాల నిర్మాణపనులు నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతుభరోసా కేంద్రం, విలేజ్ వెల్నెస్ కేంద్రం భవనాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించారు. కూలీలను ఎక్కువ మందిని పెట్టి నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రతినిధులను  కలెక్టర్ ఆదేశించారు. పూర్తి అయిన పనులు వెంటనే ఎంబుక్లో రికార్డు చేసి బిల్లుల చెల్లింపుకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పనుల రోజువారి పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్మాణ ఏజెన్సీలకు అవసరమైన సహకారం అందించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఎస్ఈ నతానియోల్, కర్లపాలెం ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీ తహశీల్దారు సాంబశివరావు, ఈవోపీఆర్డీ శరత్ బాబు,  పీఆర్ ఏఈ ప్రసన్న కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Karalapalem

2021-05-30 12:07:01

460 మందికి కోవిడ్ వేక్సినేషన్..

శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో శనివారం 460 మందికి కోవిడ్ టీకా(కోవీషీల్డ్) వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన వేక్సినేషన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముందుగా వేక్సినేషన్ కి టోకెన్లు జారీచేసిన తరువాత వాటిని ఆన్ లైన్ చేసి వెంట వెంటనే వేక్సిన్ నేషన్ పూర్తిచేసినట్టు చెప్పారు.  కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

Sankhavaram

2021-05-29 13:56:33

ధన్వంతరుడే జీవకోటికి ఆరోగ్యప్రదాత..

దేశంలో ప్రజలంతా సుభిక్షింగా ఉండాలని, కరోనా విపత్తు నుంచి ప్రతీ ఒక్కరూ ఆరోగ్యవంతంగా బయటపడాలని ఇక్కడ సీతమ్మధార షిరిడిసాయి మందిరంలో శుక్రవారం ధన్వంతరి హోమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ ఇవో కె.శిరీషా ఆధ్వర్యంలో ఈ హోమాన్ని వేదపండితులు , అర్చకులు ఘనంగా జరిపించారు. వేదమంత్రోశ్చరణలు , మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ హోమంలో తొలుత కళశారాధన గావించారు. ఆ తరువాత హోమాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పలు మార్లు వేదమంత్రాలు పఠనం చేశారు. అనంతరం ఆలయ ఈవో శిరీషాతో వేదపండితులు  మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో  మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ధన్వంతరిహోమాన్ని షిరిడీ సాయి ఆలయము లో  నిర్వహించడం జరిగిందన్నారు . లోకకళ్యాణార్ధం ఈ హోమాన్ని తలపెట్టామన్నారు . ధన్వంతరి హోమంతో దేశప్రజలందరికి మెరుగైన ఆరోగ్యం సిద్ధించాలని తాము స్వామిని వేడుకున్నట్లు ఇవో చెప్పారు . ఇటువంటి  దైవ హోమాలుతో కరోనా విపత్తు నుంచి  ప్రజలు బయటపడేందుకు అపారమైన అవకాశాలున్నాయన్నారు . ధన్వంతరి అంటే దేవవైద్యుడని అటువంటి స్వామిని పూజిస్తే అన్ని రుగ్మతులు పూర్తిగా తొలగిపోతాయని ఇవో ఆకాంక్షించారు .  ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీసుబాబు ధన్వంతరి హోమము లోపాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీను బాబు  మాట్లాడుతూ దేశంలో ప్రజల ఆరోగ్యం  కోసం రాష్ట్ర దేవాదాయశాఖ ఇటువంటి ధన్వంతరి హోమాలు చేపట్టడం అభినందనీయమన్నారు . ఇటీవలే సింహాచలంలోనూ శుక్రవారం షిరిడిసాయి మందిరంలోను ఈ ధన్వంతరి హోమాలు జరిగాయని , మిగిలిన ఆలయాల్లో కూడా ఈ తరహా హోమాలు జరిపించి ప్రజలను కరోనా నుంచి కాపాడే అసీస్సులు ప్రసాదించాలని ఆ ధన్వంతరి స్వామిని అందరూ వేడుకోవాలని ఆకాంక్షించారు.

Seethammadara

2021-05-28 09:26:58

512 మందికి కోవిడ్ వేక్సినేషన్..

శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో గురువారం 512 మందికి కోవిడ్ టీకా(కోవీషీల్డ్) వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన వేక్సినేషన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముందుగా వేక్సినేషన్ కి టోకెన్లు జారీచేసిన తరువాత వాటిని ఆన్ లైన్ చేసి వెంట వెంటనే వేక్సిన్ నేషన్ పూర్తిచేసినట్టు చెప్పారు.  కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

Sankhavaram

2021-05-27 13:36:34

నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ చేయాలి..

కోవిడ్ వేక్సినేషన్ కేంద్రం వద్ద ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ ప్రజలకు కోవిడ్ టీకాలు వేయాలని శంఖవరం మండల ఈఓపీఆర్డీ కెవివిఎస్ కాశీవిశ్వనాధ్, శంఖవరం పంచాయతీ కార్యదర్శి రాంబాబులు సిబ్బందికి సూచించారు. గురువారం శంఖవరం జిల్లాపరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ కేంద్రంలో కోవిడ్ వేక్సినేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిల్లోనూ వాలంటీర్ల ద్వారా టోకెన్లు జారీచేయిస్తున్నామన్నారు. వాటితోపాటు కేంద్రం దగ్గర కూడా టోకెన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ టీకా లక్ష్యాలను శంఖవరం మండలం అధిగమించేలా త్వరగా వేక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. కేంద్రానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, వేక్సిన్ వేసిన తరువాత సేద తీరడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. సచివాలయ సిబ్బంది ద్వారా టోకెన్లు ఆన్ లైన్ చేయించి వేక్సినేషన్ చేపడుతున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వాతవరణంలో వేక్సినేషన్ ప్రక్రియ జరగాలన్నారు. కార్యక్రమంలో మూడు సచివాలయాల వీఆర్వోలు సీతారామ్, గణేష్, కార్యదర్శిలు సత్య, శంకరాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, మహిళా పోలీసులు, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-05-27 13:34:39

క్రీ.శ.1118 నాటి ఐనవోలు మల్లమ్మ ఆలయ విశేషమేమిటనగా..

తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక ఆలయాల్లో ఐనవోలు మలమ్మ ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచినది. నాటి రాజుల కాలంటా ఈ మహత్తర ఆలయం చరిత్రను ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.. ఈ ఆలయ చరిత్ర తెలుసుకుంటే..క్రీ.శ.1118లో త్రిభువనమల్ల బిరుదాంకితుడైన, పశ్చిమ చాళుక్య రాజు, ఆరవ విక్రమాదిత్యుడు, దండనాయకుడైన సూరయ్య (అయ్యన్నమరస) కు అయ్యనవోలు సూరేశ్వర దేవుని నిత్యారాధనకు, బిక్షుకుల నిత్యాన్నదాన నిమిత్తం భూదానం చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ అయ్యనచే నిర్మింపబడి అయ్యన్నప్రోలుగా పిలువబడి, ప్రస్తుతం ఐనవోలుగా రూపాంతరం చెందింది.మైలారదేవుని ఆలయాన్ని కాకతీయ రాజు రెండ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు నిర్మించాడని సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తున్నది. ఆలయానికి తూర్పు, దక్షిణ దిశలలో రెండు కీర్తితోరణాలను కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే ఇక్కడ నిర్మింపజేశాడు. అందుకు తార్కాణంగా ఇదే శైలిలో నిర్మింపబడిన కాకతీయ కీర్తితోరణాలను ఈ నాటికీ మనం ఓరుగల్లు కోటకు నాలుగు దిక్కులా చూడవచ్చును. అయితే ఓరుగల్లులోని కీర్తితోరణాల శిల్పనిర్మాణ శైలి, సౌందర్యం చాలా పరిణతి చెంది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంతటి శిల్పసౌందర్యం ఐనవోలు తోరణాలలో మనకు కనిపించదు. అయితే, ఐనవోలు దేవాలయానికి శిలాతోరణాలను నిర్మించడం వెనుక ఒక కథను ఉటంకిస్తారు. అదేమంటే, కాకతీయ ప్రోలరాజు ఒకరోజున వేయిస్తంభాల దేవాలయంలో, నిద్రలో ఉన్న తనకుమారుడు రుద్రదేవుణ్ణి పుత్రవాత్సల్యంతో స్పృశించగా, మగతనిద్రలో ఉన్న రుద్రదేవుడు, తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చినారని భావించి, తన మొలలోఉన్న కైజారును తీసి రుద్రదేవుణ్ణి పొడుస్తాడు. తండ్రి చావుకు కారకుడనైనానన్న పాపభీతితో ఐనవోలు ఆలయానికి శిలాతోరణాలను నిర్మింపజేశాడు. ఈ అంశం,1935వ సం.లో మారేమండ రామారావు సంపాదకత్వంలో వెలువడిన కాకతీయ సంచికలో పేర్కొనబడింది.

#ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం:
ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జునస్వామి ఆలయం అయినవోలు మల్లన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందినది.12వ శతాబ్దంలో మైలార లేదా మల్లారి దేవుని ఆలయంగా నిర్మింపబడిన ఈ ఆలయం, ఆ తరువాతి కాలంలో మల్లన్న, మల్లికార్జునఆలయంగా రూపాంతరం చెందింది. క్రీ.శ.1369 లో ఐనవోలు ఆలయ ప్రాంగణంలోని ఒక స్తంభంపై రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన సింగమనాయకుని కుమారుడు, అనపోత చెక్కించిన సంస్కృతాంధ్ర దాన శాసనంలో మల్లరి వృత్తాంతము వర్ణించబడిండి. అర్జునున్ని కాపాడటానికి శివుడు ఒక శబరుని వేషం ధరించి, మల్ల అనే రాక్షసున్ని సంహరించాడు. అలా మల్ల+అరి=మల్లరి అన్న పేరు తెచ్చుకున్నాడు. మల్లరి అనే పేరు కాలక్రమంలో మైలార అయ్యింది.
స్వామివారి రూపం భీకరంగా పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో ఉంటుంది. చతుర్భుజాలు కలిగి నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం క్రింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి-మల్లాసురుల శిరస్సులుంటాయి. ఈస్వామివారిని మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్ రాయుడు అని పిలుస్తారు. ఆలయంలో ఉన్న శివలింగం అర్థప్రాణవట్టంపై ఉంది. ఇది అరుణ వర్ణంలో ఉంటుంది. కుజ గ్రహానికి అధిష్టాన దైవతం. శివలింగంపై పార్థప్రహారం స్పష్టంగా కనిపిస్తుంది.

#బ్రహ్మోత్సవాలు:
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో, అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున ప్రాతః కాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి. ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారికళ్యాణం. ప్రతీ మాస శివరాత్రిరోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను  ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.

#ఎల చేరుకోవచ్చునంటే..
అయినవోలు, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లా,ఐనవోలు మండలానికి చెందిన గ్రామం అయినవోలు (ఐనవోలు) పిన్ కోడ్: 506310.
ఇది వరంగల్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు షేర్ ఆటోలు, సమీప గ్రామాల నుండి తిరుగుతాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరం వరకూ ఉణ్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఈ ఆలయం ఉంటుంది. చారిత్రక అంశాలు తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఆలయం సందర్శన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి వీలుపడుతుంది...

Inavolu Mallanna Temple

2021-05-27 04:17:04

వయస్సు నిబంధన లేకుండా వేక్సిన్ వేయాలి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వయస్సుతో సంబంధం లేకుండా కోవిడ్ వేక్సిన్ వేయాలని ఈఎన్ఎన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(www.enslive.net, ens live mobile news app) ప్రధాన సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) ప్రభుత్వాన్ని కోరారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకెండ్ వేవ్ ఉద్రుతంగా ఉన్న సమయంలో కూడా జర్నలిస్టులందరూ ప్రాణాలకు తెగించి బాహ్య ప్రపంచంలోని సమాచారాన్ని అటు ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో కేవలం 45 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకే వేక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 సంవత్సరాల లోపు వున్న జర్నలిస్టులే అధికంగా ఉన్నారని చెప్పిన ఆయన సకాలం వేక్సిన్, వైద్యం అందక ఒక్క విశాఖ జిల్లాలోనే సుమారు 13 మంది జర్నలిస్టులు మ్రుత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జర్నలిస్టులకు వయస్సు నిబంధన తొలగించి అన్ని వయస్సుల వారికి కోవిడ్ వేక్సిన్ వేయాలని ఈఎన్ఎస్ బాలు డిమాండ్ చేశారు.

Dwaraka Nagar

2021-05-27 03:37:30

292 మందికి కోవిడ్ వేక్సినేషన్..

శంఖవరం మంలంలోని అన్ని గ్రామ సచివాలయాల నుంచి టోకెన్ల ద్వారా 292 మందికి వేక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్టు వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. బుధవారం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు రెండు పూటలా వేక్సినేషన్ చేపట్టామన్నారు.  ప్రభుత్వ సూచించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేక్సినేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈరోజు కార్యక్రమాన్ని ఎంపీడీఓ రాంబాబు కూడా పరిశీలించినట్టు డాక్టర్ తెలియజేశారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కోవిడ్ టీకాలు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని మూడు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నట్టు వైద్యాధికారి వివరించారు.

శంఖవరం

2021-05-26 14:53:20

సచివాలయాల పరిధిలో వాక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో అన్ని సచివాలయాల పరిధిలో వాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాక్సినేషన్ జరుగుతుందన్నారు. మంగళవారం, బుధవారం ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 835 సచివాలయాల పరిధిలో కోవిషీల్డ్  మొదటి విడత వాక్సినేషన్ కార్యక్రమంను సాధారణ ప్రజానీకానికి చేపడుతున్నామని చెప్పారు. 45 సంవత్సరాలు వయస్సు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. రోజుకు ముందుగా సమాచారం అందించిన 150 మందికి వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న  ప్రతి కేసును కవర్ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 3 లక్షల మంది ఉంటారని అంచనా ఉందని, వారందరికీ వారం, 10 రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

Srikakulam

2021-05-26 13:25:08

ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో కోవిడ్ సేవలు..

రౌతులపూడి ప్రభుత్వ హాస్పిటల్ లో పూర్తిస్థాయిలో కోవిడ్ వైద్యసేవలు అందాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలు, ఇక్కడి వార్డులను ఆర్డీఓ మల్లిబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సెకెండ్ వేవ్ లో కరోనా వైరస్ కేసులు తీవ్రంగా ఉన్నాయని, వచ్చే థర్డ్ వేవ్ ను ద్రుష్టిలో పెట్టుకొని ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో మందులు, బెడ్ లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని సేవలు అందించాలన్నారు.  అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈమేరకు ఆసుపత్రికి కావాల్సిన వనరుల అంశాన్ని సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.

Rowthulapudi

2021-05-25 14:49:56

శంఖవరంలో 28 కరోనా పాజివ్ కేసులు..

శంఖవరంలో 28 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు. సోమవారం శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 85 మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందలో 28 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలు ఉన్నా తక్షణమే పీహెచ్సీలో పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం ఇచ్చే కరోనా మందుల కిట్ ను హోమ్ ఐసోలేషన్ లో ఉండి వాడాలన్నారు. నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ బలవర్తక ఆహారం తీసుకోవడం ద్వారా 14 రోజుల్లో కరోనా వైరస్ భారి నుంచి బయట పడటానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వుంటే తక్షణమే 104కి కాల్ చేయడం ద్వారా వారికి వారిని హాస్పటల్ ఐసోలేషన్ కి తరలిస్తారని డా.ఆర్వీవీ సత్యన్నారాయణ వివరించారు.

Sankhavaram

2021-05-24 14:50:57

చెత్తబుట్టలు లేకపోతే ఫైన్లు వేయండి..

 అపరిశుభ్ర వాతావరణంలో  కిరాణాషాపులు, దుఖాణాలు నిర్వహిస్తూ..చెత్తబుట్టలు ఏర్పాటు చేయని నిర్వాహకులపే అపరాద రుసుము వసూలు చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన  అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని నాలుగవ జోన్ పరిదిలోని 31వ వార్డు గొల్లలపాలెంలో  కమిషనర్ పర్యటించి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  తడి –పొడి చెత్త నిర్వహణ ఎలాఉందనే విషయాన్ని స్థానిక ప్రజలను అడిగితెలుసుకున్నారు. పారిశుధ్య సిబ్బంది ప్రతీ రోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ ఆరా తీసారు. కొన్ని దుకాణాల వద్ద డస్ట్ బిన్స్ లేకపోవడం ఆ దుకాణాల చెత్త రోడ్లపై ఉండడం గమనించి ఆయా దుకాణాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. ఇక పై ప్రతీ దుకాణం వద్ద మూడు డస్ట్ బిన్లు ఉండేలా చూడాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. రోడ్లపై చెత్తను చూసి ఆ చుట్టు ప్రక్కలున్న 50 ఇళ్ళకు అపరాధ రుసుము వసూలుచేయాలని ఆదేశించారు. చెత్తను సకాలంలో తొలగించనందుకు వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్త్తం చేసారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. చెత్తను తడి – పొడి చెత్తగా విభజించి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని స్థానిక ప్రజలకు సూచించారు. గొల్లలపాలెం లోని అంగన్వాడి కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్నారని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయగా పోలీసు కంప్లైంట్ ఇవ్వాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, రోడ్లపై విచ్చలవిడిగా తిరగరాదని, మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఫీవర్ సర్వే జరుగుచున్న తీరుతెన్నులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వార్డు వాలంటీర్లు ద్వారా తెలియపరచాలని కోరారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని  కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ ఫణిరాం, పర్యవేక్షక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి,  శానిటరి ఇన్స్పెక్టర్, శానిటరి సూపర్వైజర్, వార్డు సచివాలయ  కార్యదర్శులు పాల్గొన్నారు.      

City Central

2021-05-24 13:10:05

యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి పూర్తికావాలి..

కరోనా నేపథ్యంలో తాడిపత్రి వద్ద అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రిలో చేపడుతున్న పనుల పూర్తి పై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ, ఎడి డ్రగ్స్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ, ఆర్అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ లు, ఏపిఎంఎస్ఐడిసి ఈఈలు, తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేస్తోందని, నిర్దేశించిన సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు.  అన్నిరకాల పనులు పూర్తి చేసిన తర్వాత ముందుగా  ట్రయల్ డెమో చేపడతామన్నారు.   తాత్కాలిక ఆస్పత్రిలో పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు కోసం ఆక్సిజన్ మ్యానీ ఫోల్డ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, మ్యానీ ఫోల్డ్ ల తరలింపులో జాప్యం ఉండరాదన్నారు.  త్వరితగతిన   మ్యానీ ఫోల్డ్ లను తెప్పించాల ని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరాలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యానీ ఫోల్డ్ లను ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా ఆటోమేటిక్ గా పనిచేసి ఆక్సిజన్ సరఫరా నిరంతరం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్జ్ ట్యాంక్, మ్యానీ ఫోల్డ్ యూనిట్లను ఆపరేట్ చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. 2, 3 జర్మన్ హ్యాన్గర్స్ లో ఇంటర్నల్ పైప్ లైన్ వర్క్స్ , అందుకు సంబంధించిన వాల్వులు, రెగ్యులేటరులు, హుమిడి ఫైర్స్ లాంటి పరికరాలన్నీ మంగళవారం  లోగా సిద్ధం కావాలన్నారు. తాత్కాలిక ఆస్పత్రిలో అవసరమైన డాక్టర్లను, స్టాఫ్ నర్స్ లను, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలను, ఇతర సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ కు జిల్లా కలెక్టర్ సూచించారు. ఇప్పటికే కాల్ లెటర్లు అందించిన వారిని విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. వారందరికీ అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. ఆస్పత్రి వద్ద బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ టీమ్స్ ను పెట్టుకోవాలని, ఆసుపత్రికి అవసరమైన మందులను 100 శాతం పూర్తిగా సిద్ధంగా ఉంచాలని డ్రగ్స్ ఎడిని ఆదేశించారు. తాత్కాలిక ఆసుపత్రి వద్ద అవసరమైన అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లు, నర్సులు కోసం డాక్టర్స్, నర్సింగ్ స్టేషన్లలో బెడ్ లు, ఛార్జింగ్ పాయింట్లు, అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని సదుపాయాలు కల్పించామని లేదా అనేది పరిశీలన చేయాలన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కి అవసరమైన వసతి, భోజన సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించాలని ఆర్డీఓ గుణభూషన్ రెడ్డిని ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని వారి వసతి ప్రదేశం నుండి  ఆస్పత్రి వద్దకు వెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.ఆస్పత్రి కి వచ్చే పాజిటివ్ వచ్చిన వారి బంధువుల కోసం  కూడా భోజన ఏర్పాట్లు చేయాలన్నారు.

తాత్కాలిక ఆస్పత్రి చుట్టూ ఫెన్షింగ్ నాణ్యత గా చేపట్టాలి :

తాత్కాలిక ఆస్పత్రి చుట్టూ పెన్షింగ్ నాణ్యత గా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వెంటనే ఆస్పత్రిలో విద్యుత్ పని అంతా పూర్తి చేయాలని, అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తాత్కాలిక ఆస్పత్రి కొరకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పైప్లైన్ రక్షణ కోసం ఫెన్షింగ్ ,దాని చుట్టూ లైటింగ్,  మంగళవారం సాయంత్రం లోపు ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బి ఎస్ఈని ఆదేశించారు. అలాగే తాత్కాలిక ఆస్పత్రి వద్ద బిటి రోడ్డు పూర్తిచేయాలన్నారు. లైటింగ్ కోసం విద్యుత్ సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పగలు రాత్రి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఉండాలన్నారు.  అడిషనల్ స్టోరేజ్ వర్క్ను కూడా  తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. తాత్కాలిక ఆస్పత్రి వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రి శుభ్రంగా, అందంగా ఉండాలని, ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతం అంతా పార్క్ మాదిరిగా ఉండేలా చూడాలని, శానిటేషన్ పనులు బాగా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తాత్కాలిక ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం నోడల్ అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Anantapur

2021-05-24 11:03:39

ఆసుపత్రి నిర్మాణానికి పూర్తి స‌హ‌కారం..

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో ఇ.ఎస్‌.ఐ. సంస్థ ఆధ్వ‌ర్యంలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి స‌హ‌కారం వుంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు.  కార్మిక రాజ్య బీమా సంస్థ ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డ గ‌తంలో మంజూరు చేసిన ఆసుప‌త్రి నిర్మాణం త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గాజుల‌రేగ వ‌ద్ద సెంట్ర‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్శిటీకి స‌మీపంలో గ‌తంలో కేటాయించిన‌ 5 ఎక‌రాల స్థ‌లాన్ని ప్ర‌భుత్వ మెడిక‌ల్ కళాశాల ఏర్పాటు కోసం కేటాయిస్తున్నామ‌ని తెలిపారు. అయితే గ‌తంలో కేటాయించిన స‌ర్వే నెంబ‌రు ప‌రిధిలోనే మ‌రో చోట ప్ర‌త్యామ్నాయంగా ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని ఇ.ఎస్‌.ఐ. ఆసుప‌త్రి నిర్మాణం కోసం కేటాయిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ స్థలం కూడా రోడ్డుకు ఆనుకునే వుంద‌ని, గ‌తంలో కేటాయించిన స్థ‌లానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఈ స్థ‌లం వుంద‌న్నారు. ఇందుకు ఇ.ఎస్‌.ఐ. సంస్థ స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఇ.ఎస్‌.ఐ. ఆసుప‌త్రికి స్థ‌లం కేటాయింపుపై ఆ సంస్థ ప్రాంతీయ అధికారి ఇన్ చార్జి డిప్యూటీ డైర‌క్ట‌ర్ పి.ఎస్‌.పండా, జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్‌, ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్ త‌దిత‌రుల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం త‌న ఛాంబ‌రులో స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లా ప్ర‌భుత్వ ప‌రంగా ఉన్న‌త విద్యాసంస్థ‌లేవీ లేవ‌ని, ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం జిల్లాకు రూ.110 కోట్లతో మెడిక‌ల్ క‌ళాశాల ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింద‌ని, ఒకే చోట 50 ఎక‌రాల స్థ‌లం కేటాయించాల్సి వున్నందున గాజుల‌రేగ‌లో స్థ‌లం కేటాయించామ‌న్నారు. జిల్లాకు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క వైద్య క‌ళాశాల మంజూరైనందున దీని ఏర్పాటుకోసం జిల్లా కేంద్రంలో 50 ఎక‌రాల స్థలం ఒకేచోట కేటాయించ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో రూ.75 కోట్ల‌తో ఇ.ఎస్‌.ఐ. ఆసుప‌త్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ 2019 డిశంబ‌రు 19న శంకుస్థాప‌న చేశారు. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కార్మిక మంత్రి జ‌య‌రాం, స్థానిక ఎం.పి. ఎమ్మెల్యే తదిత‌రులంతా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ ఆసుప‌త్రి ఏర్పాటుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఇ.ఎస్‌.ఐ. సంస్థ‌కు ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించింది.  అయితే శంకుస్థాప‌న జ‌రిగిన‌ప్ప‌టికీ ఇ.ఎస్‌.ఐ. సంస్థ ఇప్ప‌టివ‌ర‌కు దీని నిర్మాణాన్ని చేప‌ట్ట‌లేదు.

ఈ స‌మావేశంలో ఏపి వైద్య మౌలిక స‌దుపాయాల సంస్థ ఎస్‌.ఇ. శివ‌కుమార్‌, ఇ.ఇ. స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, క‌లెక్ట‌రేట్ సూప‌రిటెండెంట్ టి.గోవింద త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-24 10:57:53

కార్యదర్శిలు మళ్లీ డీడీఓలైనా ఈ2నెలలే..

గ్రామ, వార్డు సచివాలయాల్లో వీఆర్వోలను డిడిఓలుగా చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓనెం 1,2లను రెండు నెలలు ప్రభుత్వం గాల్లో పెడుతూ మళ్లీ గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ఎన్.భరత్ గుప్తా సర్క్యులర్ నెంబరు.RoC.No.GWS01-COOR/103/2021-GWS,1396763,21/05/2021న జారీచేశారు. ఆ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ఆధారాలతో సహా బయటకు తీసుకు వచ్చింది.. తమ ఆందోళన వలనే ప్రభుత్వం నేరుగా డిడిఓ బాధ్యతల నుంచి వీఆర్వోలను తప్పించేసి మళ్లీ తమకే ఇచ్చేసిందని సచివాలయ కార్యదర్శిలంతా సంబరపడిపోయారు. అయితే ఆ ఉత్తర్వులు కేవలం రెండు నెలల కాలానికి మాత్రమే పరిమితం చేస్తూ ఆ సర్క్యులర్ లో పేర్కొన్న విషయం ఈఎన్ఎస్ లైవ్ యాప్ ఆధారాలతో తెలియజేయడంతో వారంతా  ఖంగుతిన్నారు. చాలా మీడియా సంస్థలు కూడా అదేవిధంగానే ఎలాంటి ఆధారాలు చూపకుండానే మళ్లీ వీఆర్వో డిడిఓ బాధ్యలు కార్యదర్శిలకు ప్రభుత్వం అప్పగించేసిందని తెగ ప్రచారాలు చేశాయి కూడా. వాటినే నిజమనుకున్న సచివాలయ కార్యదర్శిలు రాష్ట్రవ్యాప్తంగా ఆ వార్తలను వాట్సప్ గ్రూపుల్లో తెగ వైరల్ చేసేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో వచ్చే సాంకేతిక కారణాలను ద్రుష్టిలో పెట్టుకొని డిడిఓల బాధ్యతలు పంచాయతీ కార్యదర్శిలకే ఇస్తూ ఈ సర్క్యులర్ జారీచేశారు.  ఏడాదిన్నరగా సచివాలయల్లో కార్యదర్శిలే డిడిఓలుగా ఉంటూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ప్రభుత్వం గ్రామస్థాయిలో వీఆర్వోలు సచివాలయాల్లోనూ, మండలాల్లో తహశీల్దార్లను, జిల్లా స్థాయిలో కలెక్టర్లను ముఖ్య అధికారులుగా చేయాలనే ఉద్దేశ్యంతో సచివాలయాల్లో వీఆర్వోలను డిడిఓలుగా చేస్తూ జీఓ నెంబరు2 జారీచేసింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న 15005 సచివాలయాల్లో జీతాలు ఇతరత్రా కార్యకాలపాలకు ఇబ్బందులు రావడంతో జీఓనెంబరు2 ని రెండు నెలలు పాటు అంటే మే, జూన్ నెలలకు నిలుపుదల చేస్తూ మళ్లీ సర్క్యులర్ జారీచేసింది. ఈ ఉత్తర్వులు కేవలం రెండు నెలలకు మాత్రమే ఇచ్చారని తెలియడంతో పంచాయతీ కార్యదర్శిలంతా నీరస పడిపోయారు. విషయం తెలియక అలిగి కూర్చున్న వీఆర్వోలంతా రెండు నెలల తరువాత మళ్లీ డిడిఓలు, గ్రామ సచివాలయ ప్రధాన అధికారి తమరే అన్నట్టు దీమాల వ్యక్తం చేస్తున్నారు. సర్క్యులర్ జిల్లా పంచాయతీ అధికారులకే వెళితే గ్రామసచివాలయాలకు సత్వరమే తెలియదనే ఉద్దేశ్యంతో ఈసారి ఆ సర్య్యులర్ లను జిల్లా ఖజానాశాఖ అధికారులకు, ఉప ఖజానా అధికారులకు, అన్ని మండలాల ఎంపీడీఓలకు పంపడం విశేషం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ శాఖలో జరిగే అభివ్రుద్ధి పనులు, ఉత్తర్వులు, ప్రత్యేక జీఓలను మొట్టమొదటిసారిగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రమే బాహ్య ప్రపంచానికి, ఇటు సచివాలయ ఉద్యోగులకు తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా అటు డిడిఓలుగా వీఆర్వోలు, రెండు నెలలకే అధికారాలు ఉంటాయనే సర్క్యులర్ అందుకున్న పంచాయతీ కార్యదర్శిలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈప్రత్యేక కధనాన్ని అందిస్తున్నాం. వాస్తవానికి గ్రామసచివాలయాల్లో కార్యదర్శిలు కాకుండా వీఆర్వోలు డిడిఓలుగా ఉండటం, మళ్లీ కార్యదర్శిలు సెల్ఫ్ డిడిఓలుగా ఉండే అంశం కాస్త గజిబిజిగానే ఉంది. ఈ విషయంలో తమకు అధికారాలు కల్పించాలని చాలా మంది కార్యదర్శిలకు తమ గోడును ఎంపీడీఓల ద్వారా ప్రభుత్వానికి నివేదించిన ఆందోలన చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కాకపోతే గ్రామసచివాలయాల్లో కార్యదర్శిలే డిడిఓలుగా ఉంటే పరిపాలనా పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయనే విషయం సర్వత్రా వినిపిస్తుంది. అంతేకాకు ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా విడుదల చేసే అవకాశాలు లేకుండా పోతాయి..మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం రెండు నెలల తరువాత గానీ తేలేటట్టు కనిపించడం లేదు..చూడాలి ఈ సర్క్యులర్ ను ప్రభుత్వం కొనసాగిస్తుందా..లేదంటే రెండు నెలల తరువాత మళ్లీ డిడిఓ అధికారాలు వీఆర్వోలకు అప్పగిస్తుందా..తేలాల్సి వుంది..!

Tadepalle

2021-05-23 17:05:52