ప్రతీ నిరుపేద అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. మంగళవారం నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాలల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీ ,బిసి ,మైనారిటీ మహిళా లబ్ధిదారులకు రెండవ విడత వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల లో భాగంగా తను ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని , వారు సామాజికంగా అభివృద్ధిని సాధించేందుకు వైయస్సార్ చేయూత ను అందిస్తున్నారన్నారు. నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికీ రూ 18,750/- చొప్పున మొత్తం 75 వేల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసి అండగా నిలబడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి 16,508 మంది అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ18,750/- చొప్పున రూ 30,95,25000/- చెక్కు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు ,సర్పంచులు, మహిళలు హాజరయ్యారు.