అనాధ పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు రూ 4000/- అందించడం జరుగుతుందని, అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకం ప్రాజెక్టు అధికారిణి పద్మావతి కోరారు. ఈ సందర్భంగా ఆమె శనివారం శంఖవరంలో మీడియాకి పథకం యొక్క వివరాలను తెలియజేశారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో 72 వేలు, పట్టణ ప్రాంతాల్లో 96 వేల లోపు ఉండాలన్నారు. జనన ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు తల్లి/తండ్రి ఆధార్ కార్డు తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం మరణ కారణం గార్డియన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బాలిక బాలుడి కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఫోటో, ఆదాయ ధ్రువీకరణ బ్యాంకు ఎకౌంటు వివరాలు జత చేయాలన్నారు.
తల్లిదండ్రులు లేని అనాధలు, ప్రాణాంతక వ్యాధి తో బాధపడే తల్లిదండ్రులు గలవారు తల్లి లేదా తండ్రి నీ కోల్పోయిన పాక్షిక అనాధలు, విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నవారు, ప్రకృతి వైపరీత్యానికి గురైన, యాచకులైన , బాల కార్మికులు బాల్య వివాహం జరిగిన వారు ఇవి బాధిత పీడిత బాలలు దివ్యాంగులకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందుటకు అర్హులని ఆవిడ పేర్కొన్నారు. ఇతర వివరములకు దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి ణి అంగనవాడీలలోనూ, గ్రామ, వార్డు సచివాలయాలలోనూ సంప్రదించాలని సూచించారు.