1 ENS Live Breaking News

ఇంటి పంటతో మెరుగైన ఆరోగ్యం మనసొంతం

మన ఇంటి పెరటి లేదా మేడపై సేంద్రియ పద్ధతిలో ఆహార పదార్థాలను పండించడం వలన శారీరక శ్రమతో పాటు ఆరోగ్యంగా జీవించవ చ్చని కంకణాలపల్లి రాధ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్  వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నేడు  రసాయనాల తో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వలన పలు దీర్ఘకాలిక రోగాలకు గురవుతున్నామని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం తమ ఇంటి మేడపై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను పండిస్తున్నామని అన్నారు. అవకాశం ఉన్న మేరకు ఎవరికి వారు సొంతంగా ఆహార పదార్థాలను సేంద్రీయ పద్ధతిలో పండించుకోవడం వలన శారీరక శ్రమతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను స్వీకరించవచ్చని రాధా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్. శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-03-17 07:28:27

YSRCPపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల వ్యతిరేకత సుస్పష్టం

ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీపై వ్యతిరేకతను పట్టభద్రులు స్పష్టంగా చూపించారు. వారికితోడుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా వారి వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించడం వలన టిడిపికి ఆది నుంచి మెజార్టీ వస్తోందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అధికార దుర్వినియోగంతో 5, 6, 7చదువుకున్నవారికి పట్లభద్రుల ఓట్లు ఇచ్చారనే ఆధారాలను ప్రభుత్వం ద్రుష్టికి, మీడియా ద్వారా ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లడంలో టిడిపి, పిడిఎఫ్ లో పార్టీలు కీలకంగా వ్యవహరించాయి. కొన్నిచోట్ల డబ్బు లు పంచుతూ కూడా అధికారపార్టీకి చెందిన కొందరు నగదుతో పట్టుబడ్డారు. మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వ ఉపా ధ్యాయులు పనిగట్టుకొని మరీ ఈ ఎన్నికలకు ఓట్లు నమోదు చేయించుకొని వారి వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయడానికి వేదికగా వినియోగించుకున్నారు. ఒక్క ఉత్తరాంధ్రాలోనే కాదు రాష్ట్రంలో అన్నిచోట్ల టిడిపి ఆదిక్యంలో ఉంది.

2023-03-17 01:57:44

పారిశుద్ధ్య శానిటరీ ఇనెస్పెక్టర్ కి షోకాజ్ నోటీసు

కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు గురువారం రెండో సర్కిల్ పరిధిలోని భాస్కర్ నగర్, శాంతినగర్ ప్రాంతాలలో పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల చెత్త తొలగింపులో సిబ్బంది అలసత్వాన్ని గుర్తించా రు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఎన్నో పాలనా సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది క్రింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన అక్కడి శానిటరీ సెక్రటరీ సూర్య కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశిం చారు. ఈ సందర్భంగా ఏడిసి నాగ నరసింహారావు మాట్లాడుతూ, ప్రజలు తడి పొడి- చెత్తను వేరువేరుగానే ఇవ్వాలని స్పష్టం చేశారు.  ఆదివా రం కూడా చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా  నాలుగో డివిజన్ లో పూడిక తీత పనులను ఏడిసి నాగ నరసింహారా వు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ సూపర్వైజర్ జిలాని, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Kakinada

2023-03-16 11:34:00

ఘనంగా సిగడంపేట ఎల్లమ్మ తల్లి పండుగ

అడవివరం సిడగంపేట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ ఎల్లమ్మతల్లి పండుగ  మహోత్సవం  గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు.  తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ఆరాధన చేశారు. అనంతరం భక్తులందరికీ అమ్మవారి  దర్శన భాగ్యం కల్పిం చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు , జాతీయ జర్న లిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతల పండగలు ఎంతో విశిష్టమైనవని ఆయా అమ్మవార్ల ఆశీస్సుల వల్లే ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారన్నారు. అమ్మవార్లే ప్రధాన రక్షణ అని కొనియాడారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన  భారీగా అన్న సంతర్పన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. నిర్వాహకులు పాల్గొన్నారు.

Simhachalam

2023-03-16 10:32:24

నెలాఖరులోగా జిల్లాలో రీ-సర్వే పూర్తిచేయాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స‌మ‌గ్ర భూముల రీస‌ర్వేను నెలాఖ‌రులోగా పూర్తిచేసేందుకు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి రెవిన్యూ అధికారులు, స‌ర్వే సిబ్బందిని ఆదేశించారు. భూముల రీస‌ర్వే జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించే నిమిత్తం జిల్లా క‌లెక్ట‌ర్ బుధ‌వారం పూస‌పాటిరేగ‌, డెంకాడ మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. పూస‌పాటిరేగ మండ‌లం లంక‌ల‌ప‌ల్లి పాలెం, డెంకాడ మండ‌లం గంట్లాంలో రీస‌ర్వేను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. అవ‌స‌ర‌మైన సంఖ్య‌లో గ్రామ స‌ర్వేయ‌ర్ల‌ను డిప్యూటేష‌న్‌పై రీస‌ర్వే ప‌నుల కోసం నియమించినందున వారి సేవ‌ల‌ను వినియోగించుకొని త్వ‌ర‌గా స‌ర్వే పూర్తిచేయాల‌ని ఆదేశించారు. డెంకాడ మండ‌లంలో రెండు బృందాల‌తో రీస‌ర్వే జ‌రుగుతున్న‌ట్టు త‌హ‌శీల్దార్ ఆదిల‌క్ష్మి వివ‌రించారు. ప‌ది గ్రామాల్లో పూర్తిచేశామ‌ని, మ‌రో 16 గ్రామాల్లో పూర్తికావ‌ల‌సి వుంద‌ని వివ‌రించారు. పూస‌పాటిరేగ‌లో రీస‌ర్వే జ‌రుగుతున్న లంక‌ల‌ప‌ల్లి పాలెంను సంద‌ర్శించి డిప్యూటీ త‌హ‌శీల్దార్ ద్వారా మండ‌లంలో జ‌రుగుతున్న స‌ర్వే గురించి తెలుసుకున్నారు. 

Pusapatirega

2023-03-15 15:43:22

వరుపుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గంటా

 ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ దివంగత నేత వరుపుల రాజా లేని లోటు పూడ్చలేనిదని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ప్రత్తిపాడులోని వరుపుల కుటుంబాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రు, వైస్సార్సీపీ యువ నాయకులు  జక్కంపూడి గణేష్ టిడిపి శ్రేణులు మండల నాయకులతో కలిసి రాజా చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం  రాజా గారి సతీమణి   సత్య  ప్రభని పలకరించారు. మేము, పార్టీ  రాజా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి కష్టకాలంలో మనసుని కాస్త దిటవు చేసుకోవాల ఓదార్చారు. ఈ సందర్భంగా రాజా పార్టీకి చేసిన సేవను కొనియాడారు. ఆయనలోటు మీకుటుంబంతోపాటు పార్టీకి తీరనిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు టిడిపీ నాయకులు, నెహ్రూ అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Prathipadu

2023-03-15 15:20:36

లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25లక్షలు విరాళం

విశాఖలోని లయన్స్ కేన్సర్ ఆసుపత్రికి లారస్ ల్యాబ్ సిఈఓ చావ సత్యనారాయణ రూ . 25,00,000/- (ఇరవై ఐదు లక్షల రూపాయలు) హైదరాబాద్ లో గల లారెస్ చారిటబుల్ ట్రస్ట్ నుండి సిఎస్ఆర్ కార్యకలాపాల క్రింద అందజేశారు.  విశాఖపట్నం, సీతమ్మథారలో గల లయన్స్ క్యాన్సర్, జనరల్ హాస్పిటల్ , లయన్స్ డిస్ట్రిక్ట్ 324 సి 1 ద్వారా నడుస్తున్న ఈ హాస్పిటల్ కు క్యాన్సర్ ట్రీట్మెంట్,  రీసెర్చ్ సెంటర్ కు  వైద్య పరికరాలు  కొనుగోలు,  ఇతర అభివృద్ధి కార్యకలాపాలలు రోగులకు సహాయం నిమిత్తం ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్యాన్సర్ జనరల్ హాస్పిటల్ మేనిజింగ్ ట్రస్టి వి. ఉమామహేశ్వర రావు లారెస్ చారిటబుల్ ట్రస్ట్ వారికి థన్యవాదాలు తెలియ జేశారు. దీనివలన రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి క్రృషి చేస్తామని ఈ సందర్భంగా వీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Visakhapatnam

2023-03-15 15:05:10

సచివాలయాల ద్వారా విస్త్రుతంగా సేవలందించాలి

గ్రామ సచివాలయాల  ద్వారా ప్రజలకు విస్త్రుతంగా సేవలు అందించాలని జిల్లా పంచాయతీ అధికారి విక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోని సచివాలయాలన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ, ప్రభుత్వం అములుచేసే సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అందించాలన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాలు, వీధులు ఎక్కడా చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. శానిటేషన్, మురుగునీటి కాలువలు క్లీనింగ్, వీధిలైట్లు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సచివాలయ కార్యదర్శిని శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు. సిబ్బంది అటెండెన్సు, రికార్డులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సచివాలయ జేఏబిసి రమణమూర్తి, సచివాలయ కార్యదర్శిలు శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Shankhavaram

2023-03-14 11:46:47

జనసేన ఆవిర్భావ దినోత్సవంలో స్వచ్చంద రక్తదానం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ స్థా పించి 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో సేవ కార్య క్రమాలు ఏర్పాటుచేశారు. కళాభారతి జనసేన జెండాను ఎగరవేసి జనసైనికులు  జెండా వందనంచేశారు. అనంతరం 10కేజీల కేక్ కట్ చేసి జనసైనికులకు అందజేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.  అనంతరం రక్త దాన శిబిరంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జనసైనికులు, అభిమానులు రక్తదానం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. 100మ జనసైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో చైతన్య, రూప, శేఖర్, మదుసూదన్ రావ్, పండు, సత్యం, తిరుమల, రవి, కిషోర్ పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-14 09:59:10

ఘనంగా శ్రీసత్తెమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర

సింహద్రినాధుడి సొదరి, అడవివరం శ్రీనివాస్‌ నగర్‌ పరిసర 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్తెమ్మతల్లి మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిఏటా మార్చి14న అమ్మవారి పుట్టినరోజు నేపధ్యంలో ఈజాతరను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తూవస్తున్నారు. ఇం దులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కోలిపి, ఆరాధన నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం క్యూలైన్లలో ఉన్న  దర్శ నం కల్పించారు. సింహచలం  దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ  కమిటీ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వేంకటరావు ఆధ్వర్యంలో భక్తుల కు అన్ని ఏర్పాట్లుచేశారు. మధ్యాహ్నాం బలిరెడ్డి చినఅప్పారావు కుటుంబ సభ్యుల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి దంపతులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు.

Simhachalam

2023-03-14 08:40:41

ఒమ్మంగి గ్రామంలో 10లీటర్ల నాటుసారా సీజ్ ముగ్గురు అరెస్టు

ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామంలో నాటు సారా విక్రయిస్తుండగా దాడులు చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్గు ప్రత్తిపాడు ఎస్ఈబి సిఐ పి.అశోక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ముందస్తు సమాచారం మేరకు ఈ.గోకవరం గ్రామంలో వాహన తనిఖీలు చేస్తుండగా AP07 BZ 8065 హీరో స్ప్లెండర్ ప్రోమోటార్ బైకుపై పూజలు సత్తిబాబు, మాడెం గణేష్ అను ఇద్దరు వ్యక్తులు బురదకోట గ్రామం నుండి సుమారు 10లీటర్లు నాటు సారాయిని తీసుకొచ్చి కొప్పన అప్పారావు అనే వ్యక్తికి ఒమ్మంగి గ్రామం రామాలయం దగ్గర  ఇస్తుండగాపట్టు కుని వీరిపైకేసు నమోదు చేసి మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకున్నామని వివరించారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.మోహన్ రావు, కానిస్టేబుల్స్ కృష్ణార్జున, ఆర్. దొరబాబు , రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Prathipadu

2023-03-14 06:58:29

సాధారణ అధికారిలా సిద్ధార్ధజైన్ ఎన్నికల పరిశీలిన

ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీరును రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధజైన్ ఒకసాధారణ అధికారిగా విశాఖలోని ఎంవీపి కాలనీలోని ఆల్వార్ దాస్  పోలింగ్ కేంద్రంలో పరిశీలించిన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్నికల కేంద్రంలోనికి తనవాహనాన్ని తీసురాకుండా రోడ్డుపైనే నిలిపివేసి, ఒక సాధారణ అధికారిలా వచ్చి ఎన్నికలు జరుగుతున్న తీరును సూక్ష్మంగా పరిశీలించారు. ఈక్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు సైతం పోలింగ్ కేంద్రాల నెంబర్లు కూడా ఆయనేచెప్పారు. అన్ని బూత్ లలోనూ స్వయంగావెళ్లి పరిశీలించారు. రాష్ట్రస్థాయి ఐఏఎస్ అధికారిఅనే విషయం ఎక్కడా ఎవరికీ తెలియకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఎన్నికజరుగుతున్న సమయంలో బారులుతీరిన ఓటర్లు మాట్లాడుకునే మాటలను సైతం నిశితంగా విన్నారు. జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాలకు వచ్చినపుడు వెనుక ఉన్నబలగం చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. ఈయన సింగిల్ గానేవచ్చి అంతా పరిశీలించారు.

2023-03-13 10:35:25

ఎమ్మెల్సీ ఓటువేసిన విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు

భారత ప్రజాస్వామ్యం లో పట్టభద్రుడుగా శాసన మండలి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించు కోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జాతీయ జర్నలిస్ట్ లు సంఘము కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు. సోమవారం విశాఖలోని అక్కయ్యపాలెం అక్కయ్య పాలెం జివిఎంసీ హైస్కూల్ లో తనఓటు హక్కును వినియోగించుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఓటర్లు శాతం అనూహ్యంగా పెరిగిందని, పట్టభద్రుల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చిందన్నారు. ప్రతీ పట్టభద్రుడూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా పెద్దల సభకు ప్రజలు మెచ్చిన నాయకుడిని పంపడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఇదే స్పూర్తి ప్రతీ పట్టభద్రుడూ కొనసాగించాలని శ్రీనుబాబు కోరారు.

Visakhapatnam

2023-03-13 09:41:55

మార్చి 14న అడవివరం సత్తెమ్మతల్లి వార్షిక జాతర

సింహాద్రి అప్పన్న సోదరి, అడివివరం శ్రీనివాస్ నగర్ పరిసర14 గ్రామాల ప్రజలు పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీసత్తెమ్మ తల్లి, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం నిర్వహించేందుకు విసృత ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అభివృద్ది కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు పి.వెంకటరావులు తెలియజేశారు. ఈ మేరకు సింహాచలంలో శనివారం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి పుట్టినరోజు నేపథ్యంలోమా ర్చి14నఅత్యంత వైభవంగా జరిపించనున్నామన్నారు. తెల్లవారుజామునే అమ్మవారిని సూప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన అనంతరం ప్రత్యేక జలు చేసిన తరువా త భక్తులకు అమ్మవారి దర్శనాలు కల్పిస్తారని వివరించారు. అన్నసంతర్పణ కార్యక్రమం తో పాటు ప్రసాద వితరణ, రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామ న్నారు. అభివృద్ధి కమిటీ సంఘం ప్రతినిధులు గంట్ల కనకరాజు, బలిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.

Simhachalam

2023-03-11 13:30:57