1 ENS Live Breaking News

లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు వేగంపెంచాలి

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో కొమరగిరి లేఅవుట్ లో నిర్మిస్తున్న ఇంటి సముదాయాలను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ మంగళవారం సందర్శించారు. నగరపాలక సంస్థ,గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి అక్కడకు వెళ్లిన కమిషనర్ ఇళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ ప్రాంతవాసులకు కొమరగిరి లేఅవుట్లో 16000 ఇళ్ళు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలంలో ఇళ్ళు నిర్మించుకునేలా ఆయా శాఖల అధికారులు ప్రోత్సహించి అవగాహన కల్పించాలని కమిషనర్  సూచించారు. లేఅవుట్ ప్రాంతం లో అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం  అనువైన సమయమని, వర్షాలు పడే లోపుగా  ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు  ముందుకు రావాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను బ్యాంకులతో అనుసంధానం చేయడం, సొంతంగా నిర్మించుకోవాలనుకుంటే అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఆయన వెంట అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, గృహ  నిర్మాణ శాఖ ఏడిఈ వెంకట్రావు, పలువురు అధికారులు సిబ్బంది  ఉన్నారు.

Komaragiri

2022-05-17 10:28:09

మంచినీటి కొళాయి పనులు వేగం పెంచాలి

జల జీవన్ మిషన్ ద్వారా ఆమదాలవలస నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచి నీటి కొళాయి పథకాన్ని సకాలంలో పనులు పూర్తి చేసి త్రాగు నీటిని అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఆమదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశం లో ఆమదాలవలస నియోజవర్గం లో జన జీవనం ద్వారా జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 275 గ్రామాలకు గాను 221 గ్రామాలు టెండర్లు పూర్తిచేసుకొని పనులు ప్రారంభ దశలో ఉన్నాయాన్నారు, 20 గ్రామాల్లో ఇంటిoటికి మంచి నీటి కొళాయి పనులు పూర్తి చేసుకొని ప్రారంభ దశలో ఉన్నాయన్నారు.  మండలంలో బెల్లమం, లోద్దల పేట గ్రామాలలో పనులు జరుగుతున్నాయని అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఆమదాలవలస మండలానికి సంబంధించి 51 గ్రామాలకు మరియు బూర్జ మండలం సంబంధించి 77 గ్రామాలకు నారాయణపురం నుండి మంచి నీటిని లిఫ్ట్ చేసుకునే విధంగా సుమారు 100 కోట్లతో జరుగు పనులకు ప్రతిపాదనలు పంపించామన్నారు.  పొందూరు మండలం లో 60 కోట్లతో 75 గ్రామాలకు గండ్రేడు నుండి  మంచి నీటిని లిఫ్ట్ చేసుకునే విధంగా మరియు సరుబుజ్జిలి మండలం సంబంధించి 60 కోట్లతో 75 గ్రామానికి సంబంధించి తెలిగి పెంట వద్ద ఉన్న కెనాల్ నుండి మంచి నీటిని లిఫ్ట్ చేసుకునే విధంగా ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  జనజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలనే దృడ సంకల్పంతో ఉన్నారని ఆయన అన్నారు. ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో మహిళలు మంచినీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. పనులు వేగవంతం చేయాలని ఇంటింటికి మంచి నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో ఎస్ ఈ పి సూర్యనారాయణ, డి ఈ ఈ లలిత కుమారి, జె ఈ ఈ అబ్బాస్,మౌళి,పూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-05-17 10:11:15

హాజరు లేని వాలంటీర్లను తీసేయండి

హాజరు సక్రమంగా లేని వలంటీర్లపై జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి  ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సక్రమంగా విధుల‌కు హాజ‌రుకాని వలంటీర్లను తొలగించాలని ఆదేశించారు.  విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని  సత్యనారాయణపురం వార్డు సచివాలయాన్ని, గుర్ల మండలం జమ్ము సచివాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్ల‌ను ఆమె ప‌రిశీలించారు. ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. స్పంద‌న విన‌తులుపై ఆరా తీశారు. స‌చివాల‌య ప‌రిధిలో వివిధ ప‌థ‌కాల అమ‌లును తెలుసుకున్నారు.  జ‌గ‌నన్న ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు.  మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని, ముందుకురాని ల‌బ్దిదారుల ఇళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. ఓటిఎస్ ప‌థ‌కంపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. రిజిష్ట్రేష‌న్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు రుణాలను ఇప్పించాలని సూచించారు. పిల్ల‌ల‌కు, గ‌ర్భిణిల‌కు ర‌క్త ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆరా తీశారు. హెమోగ్లోబిన్ శాతం చాలా త‌క్కువ‌గా ఉన్న‌వారిపై ప్ర‌త్యేక దృష్టిపెట్టి, పోష‌కాహారాన్ని అందించాల‌ని సూచించారు. ముఖ్యంగా నెల‌నెలా పంపిణీ చేస్తున్న‌ రేష‌న్ బియ్యాన్ని వినియోగించ‌డం ద్వారా, ర‌క్త‌హీన‌త‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని అన్నారు. జమ్ము గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గ్రామంలో రు.35 లక్షలతో ప్రతిపాదించిన జల జీవన్ మిషన్ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. చదువుకొనే పిల్లలందరూ బడులకు, కళాశాలలకు వచ్చేటట్టు చూడాలని, డ్రాపౌట్ల పై దృష్టి పెట్టాలని కలెక్టర్ కొరారు. ఈ పర్యటనలో ఆయా మండలాల తాసిల్డార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.

Gurla

2022-05-16 11:50:48

స్టీల్ ప్లాంట్

2022-05-16 06:16:06

ఆ కుటుంబాలకు నేనుసైతం సాయం

కొయ్యూరు మండలం లో వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన రెండు కుటుంబాలకు నేను సైతం ట్రస్ట్ వ్యవస్థాపకులు, అరకు ఎంపీ భర్త కుసిరెడ్డి శివప్రసాద్ అండగా నిలిచారు.. నేనున్నాను.. అంటూ  బాలరేవుల గ్రామానికి వెళ్లి ఆయా బాధిత కుటుంబాలను పరామర్శించారు.  జరిగిన సంఘటనపై తల్లిదండ్రులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. ఇలా ఏ కుటుంబానికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు నిత్యావసరాలు, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామస్తులకు, బాధిత కుటు బాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. ఈ గ్రామంలో ఈ తరహా సంఘటనలుచోటుచేసుకొకుండా ఇప్పటికే కేజీహెచ్ నుంచి వైద్యుల బృందం ఈ గ్రామాన్ని సందర్శించి వారికి పూర్తిగా అవగాహన కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా బూదరాళ్ల  గ్రామస్తులు తెలిపిన తాగునీటి ఇబ్బంది పై తక్షణమే స్పందించిన ఆయన మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై త్వరలోనే మినరల్ ప్లాంట్ ఇచ్చేందుకు ప్రకటించిన ఎంపి మాధవి, శివప్రసాద్ దంపతులకు బాలరేవుల ప్రజలు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

Koyyuru

2022-05-16 06:13:10

ఘనంగా శ్రీవాసవీమాత 1030వ జయంతి

విశాఖలోని వన్ టౌన్ ఏరియా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో  అత్యంత వైభవంగా అమ్మవారి 1030 వ జయంతిని నిర్వహించారు. మంగళ ధ్వని వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు సాంప్రదాయ రీతిలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని జరిపి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతేకాకుండా ఆలయ సన్నిధానంలో మధ్యాహ్నం 12 గంటలకు  భక్తులకు చల్ మాజీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అన్నప్రసాద వితరణ చేశారు. అంబికాబాగ్ దేవస్థానం నుంచి అమ్మవారి ఆలయం వరకూ   రథోత్సవాన్ని మేళతాళాలతో కోలాటాలతో సంకీర్తనలతో నిర్వహించారు. నవదుర్గల వేషధారణ కార్యక్రమంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం.వి.రాజశేఖర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పి.చంద్రశేఖర్ కార్యదర్శి డి.వి.బాలాజీ కుమార్, కోశాధికారి ఎస్ వెంకట శివకుమార్, ఉత్సవ కమిటీ చైర్మన్ వి శ్రీనివాసరావు అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు వివిధ వాసవి సంఘాల ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.  

విశాఖపట్నం

2022-05-11 09:56:19

అసనీని ఎదర్కోవడానికి నిశిరాత్రంతా అక్కడే

అసని తుఫానును ఎదుర్కోవడానికి కరప మండల అధికారులు నడుంబిగాంచారు. నిశిరా త్రంతా కంటిమీద కునుకులేకుండా ఉప్పలంక గ్రామసచివాలయంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి అధికారులు ఆరోగ్యసిబ్బందితో సహా పనిచేశారు. ఎంపీడీఓ కె.స్వప్న, తహశీ ల్దార్ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్రకుమార్, వీఆర్వో వెంకటేశ్వర్రావు, సర్పంచ్ ఎన్.సతీష్ లతో కలిసి ప్రత్యేకంగా తుపాను ప్రత్యేక విధినిర్వహణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్వప్న మాట్లాడుతూ,  కరప మండలంలోని ఉప్పలంక తీరంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం మొత్తం అప్రమత్తం చేసినట్టు ఎంపీడీఓ వివరించారు. విద్యుత్ సౌకర్యం లేకపోతే ఇబ్బందులు రాకుండా మొబైల్ పవర్ బ్యాంకులతో సెల్ ఫోన్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసి మరీ రాత్రి కంట్రోల్ రూమ్ ను నిర్వహించారు. అంతేకాకుండా గ్రామంలో ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా తెలియజేసేవిధంగా గ్రామవాలంటీర్లను కూడా అప్రమత్తం చేసినట్టు ఆమె వివరించారు. ఎంపీడీఓ, తహశీల్ధార్ లు ప్రత్యేంగా తీర ప్రాంత ప్రజల కోసం 24గంటల పాటు రాత్రి సైతం లెక్కచేయ కుండా విధినిర్వహణ చేపట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.

Karapa

2022-05-10 17:22:51

ఆర్బీకేల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలి..

పండించిన ధాన్యాన్ని నేరుగా రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మధ్య దళారీలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విక్రయించిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరుగుతాయని, టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షలు చేసి తగిన ధర నిర్ణయిస్తారని చెప్పారు. ఉద్యమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు లో ఇది కూడా ఒక భాగమని తెలిపారు.  కాబట్టి రైతులు అధికారుల సలహాలను పాటించి తమ పంటకు తగిన గిట్టుబాటు ధర పొందాలన్నారు. ఈ పర్యటనలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత, మండల వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

Rambilli

2022-05-10 11:37:08

ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి

ప్రసవాలు ఆసుపత్రుల్లో జరగాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.. బి. జగన్నాథ రావు అన్నారు.  జిల్లా టి. బి. నియంత్రణ  ఇన్ ఛార్జి అధికారి  డా|| సి హెచ్. విజయ కుమార్, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. డా..అనిల్ కలిసి సీతానగరం పి.హెచ్.సి, పెదంకలం పి.హెచ్.సిని సందర్శించారు. పెదంకలం పి.హెచ్.సిలో ప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రసవాలు, పనితీరు మెరుగు పడాలని ఆయన ఆదేశించారు. గర్భిణీగా ఉన్నప్పటి నుండే మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సరైన సూచనలు, సలహాలు అందించి ఆసుపత్రిలో ప్రసవం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిర్మాణ దశలో వున్న  సీతానగరం పి.హెచ్.సిని సందర్శించి పనుల వివరాలను ఆరా తీశారు. నాడు- నేడు,  ఫీవర్ సర్విలెన్స్, మతా శిశు మరణాలు, అంటు వ్యాధులు,  ఎనీమియా ముక్త్ భారత్, కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం, సార్వత్రిక టీకాల కార్యక్రమం, టి బి కార్యక్రమం తదితర కార్యక్రమ నిర్వహణ గురించి ఆరా తీస్తూ వాటిని పక్కాగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.

Seethanagaram

2022-05-10 11:14:25

మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి

ఆజాద్ కి అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలోని ఆమదాలవలస మండలం జొన్నవలస కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ శిబిరంలో గుండె వ్యాధులు, క్షయ వ్యాధి, చర్మ వ్యాధులు, క్యాన్సర్, బీపీ, షుగర్, ఎముకలు, దంత వ్యాధులు వంటి పన్నెండు రకాల వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షలు చేసి వైద్యం చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కల్పించిన ఈ అవకాశాన్ని పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో లో డీఎం & హేచ్ ఓ కె అనురాధ, మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-05-10 10:32:51

మహాయోగి విద్యారణ్య స్వామి

ఆదిశంకరుని అనంతరం ఆ స్థాయి వ్యక్తిగా పేరెన్నికగన్న విద్యారణ్యస్వామి బ్రహ్మ విద్య పారంగతుడు, వేదత్రయ భాష కర్త అని ఆధ్యాత్మికవేత్త హేమ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో విద్యారణ్య స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 1267 లో వైశాఖ శుక్ల సప్తమి రోజున ఆయన జన్మించారని అన్నారు. భారత జాతిని జాగృతి పరిచేందుకు   అహరహం శ్రమించి, విశేష కృషి సల్ఫీ లక్ష్య సాధనలో సిద్ది పొందారని అన్నారు. ఆయన  1400 గ్రంథాలను రచించారని తెలిపారు. 1331 లో సన్యాసం స్వీకరించి శృంగేరి పీఠాధిపతి నిర్వహించారని అన్నారు. 1380 లో శృంగేరి పీఠాధిపతులై లౌకిక వైదిక అంశాలలో అసమాన ప్రతిభలై  , మత రాజ్యాధరణ గావించినట్లు చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని హేమ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరేష్ ప్రసాద్ ,అడబాల రత్న ప్రసాద్, కృష్ణ మోహన్, బాపిరాజు, ఓం నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-05-08 10:29:17

పట్టుదలకు మారుపేరు భగీరథుడు

పట్టుదలకు మారుపేరు, సహనానికి ప్రతి రూపం, పరోపకారానికి పెట్టింది పేరు అయిన భగీరథుడు మహా జ్ఞాని అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి. కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కృష్ణ మోహన్ మాట్లాడుతూ, వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథుడు జన్మించారని అన్నారు. అనుకున్న కార్యం సిద్ధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు మహర్షి భగీరథ అని అన్నారు. కటోర శ్రమపడి గంగను దివి నుండి భువికి తీసుకు వచ్చాడని కృష్ణ మోహన్ తెలిపారు. భగీరధుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ కే వెంకటరమణ, అడబాల రత్న ప్రసాద్, ఓం నమశ్శివాయ , వెంకటేశ్వరరావు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-05-08 08:00:59

భారతదేశానికి ఒక వజ్రం గోపాలకృష్ణ గోకులే

స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక సేవకుడు అయిన గోపాలకృష్ణ గోకులే మన దేశానికి లభించిన ఒక వజ్రమని విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో  గోపాలకృష్ణ గోకులే జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటేశ్వర రావు మాట్లాడుతూ,1866  మే 8న మహారాష్ట్రలో గోపాలక్రిష్ణ గోఖలే జన్మించారని   అన్నారు. స్వాతంత్రం రాక ముందు విదేశాలలో ఉన్న భారతీయ హక్కుల సాధన పట్ల గోపాలకృష్ణ గోకలే  శ్రద్ధ చూపేవారని అన్నారు. ఆయన ఉదారవాది,  రాజ్యాంగబద్ధ ఉద్యమ సిద్ధాంతానికి   నిబద్ధుడు అని అన్నారు .గోపాలకృష్ణ గోకలే తనకు రాజకీయ గురువని మహాత్మా గాంధీ కొనియాడడం గర్హనీయమని  వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట రమణ, అడబాల రత్న ప్రసాద్, రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-05-08 07:52:40