1 ENS Live Breaking News

భాస్కరనాయుడుని సత్కరించిన కేంద్ర మంత్రి

వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్,  చిటికెల భాస్కరనాయుడుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖలో ఘనంగా సత్కరించారు. విశాఖజిల్లా, గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట గ్రామంలోకి అల్లూరి అడుగుపెట్టిన సమయంలో చిటికెల భాస్కరనాయుడు కుటుంబం ఆశ్రయం కల్పించింది. ఆ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి విశాఖకు భాస్కరనాయుడుని రప్పంచి సత్కరించారు. అల్లూరి వంటి మహానుభావుడికి ఆశ్రయం కల్పించి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అంతేకాకుండా అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టంచడానికి తప్పకుండా చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లూరి సంచరించిన ప్రదేశాలను కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్డడానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రిని భాస్కరనాయుడు కోరడంతో దానికి కూడా ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ పురం ఎంపీటీసీ సభ్యుడు చింత బుల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-07 15:30:29

ఆ..ఎల్ఎల్ఆర్ కి వారం రోజులే గడువుంది

ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు వారం రోజులు మాత్రమే గడువు ఉందని మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.శ్రీనివాస్ తెలిపారు. ఈ లోగా తమ డ్రైవింగు పరీక్షలను అభ్యర్ధులు ఫూర్తి చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.శ్రీనివాస్ శనివారం తన కార్యాలయం నుంచి ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసారు. కోటనందూరు, తుని, తొండంగి , రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సుల కోసం  దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు 800 మంది వరకూ ఉన్నారని, వీరంతా రాష్ట్ర రవాణాశాఖ పాత సాఫ్టవేర్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారని, ఈ పాత సాఫ్ట్ వేర్ ను వారం రోజుల్లో రద్దు చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఈ వారం రోజుల్లోగా  ఆయా దరఖాస్తుదారులు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ బుక్ చేసుకుని, డ్రైవింగ్ పరీక్షలకు హాజరు కావాలని, లేని పక్షంలో గతంలో వేరే సాఫ్ట్ వేర్ లో దరఖాస్తు చేసిన ప్లాట్స్ రద్దవుతాయని, అలా రద్దు కాకుండా ఉండాలంటే  దరఖాస్తుదారులు అందరూ విధిగా కొత్త సాఫ్ట్ వేర్ లో మరలా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కత్తిపూడి రవాణాశాఖ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.శ్రీనివాస్ వెల్లడించారు.

Sankhavaram

2022-05-07 14:56:56

YSRCP కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలి

అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంపీటీసీ సభ్యుడు, సీనియర్ నాయకులు చింతల బుల్లిప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన క్రిష్ణదేవీపేటలో మీడియాతో మాట్లాడారు.  గొలుగొండ మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, తన సహచర ఎంపీటీసీలు వారి వారి ప్రదేశాల నుంచి పెద్ద పసంఖ్య కార్యకర్తలను, నాయకులను కార్యక్రమానికి తీసుకురావాలని తెలియజేశారు. పాతూరు, క్రిష్ణదేవీపేట, లింగంపేట ఇలా మండలంలోని అన్ని పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కార్యాలయానికి మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకొని.. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కాన్వాయ్ తోపాటు కార్లు, బైకులు పెద్ద సంఖ్యలో భారీ వాహన యాత్రగా బయలుదేరి వెళతామని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త సహకరించాలని బుల్లిప్రసాద్ కోరారు. 

Krishnadevipeta

2022-05-07 13:26:39

తెల్లవాడిపై అల్లూరి పోరాటం దేశానికే ఆదర్శం

భరతమాత దాశ్య శ్రుంఖలాలు తెంచడం కోసం మన్యం వీరుడు, విప్లవాగ్ని అల్లూరి సీతారా మరాజు 27 సంవత్సరాలకే తన ప్రాణాలను త్రుణప్రాయంగా వదిలిపెట్టారని అల్లూరి చరిత్ర పరిశోధకులు, పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) కొనియాడారు. అల్లూరి 89వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా, శంఖవరం మండల కేంద్రంలో నిర్మించిన అల్లూరి విగ్రహానికి ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ బాలు మాట్లాడుతూ, అల్లూరి మరణించి నేటికి 98 సంవత్సరాలు అవుతుందన్నారు. అల్లూరి బ్రిటీష్ సేనలపై చేసిన తిరుగుబాటు ఉద్యమం ఒక చారిత్రాత్మకమైనదని, అది భారత దేశంతోపాటు ప్రపంచ దేశాలకు నేటికీ దిక్సూచి అని అన్నారు. అప్పటి బ్రిటీష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్  కి అల్లూరి సీతారామరాజు ఇదే శంఖవరం గ్రామం నుంచి మిరపకాయ్ టపా వర్తమానం పంపి, దమ్ముంటే తనను నేరుగా వచ్చి కలవాలని, సాయంత్రం వరకూ స్థానిక పాఠశాలలో బస చేస్తానని సవాల్ విసిరారని, అయితే అల్లూరి మిరపకాయ్ టపా యావత్ బ్రిటీషు ప్రభుత్వాన్నే గడ గడ లాడించి అల్లూరిని కలిసే దైర్యం ఆ కలెక్టర్ చేయలేకపోయారని గుర్తుచేశారు. అంతటి దైర్యసాలి అల్లూరి మన్యం పితూరీ ఉద్యమం శంఖరం, అన్నవరం, బెండపూడి గ్రామాల్లో కూడా కొనసాగిందని ఆయన తెలియజేశారు. అల్లూరి మన్య పితూరి విప్లవం దేశానికే ఒక ఆదర్శమని కొనియాడారు. ఉప సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు క్రుషి చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష లు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన శంఖవరం గ్రామంలో ఆయనకు నివాళులు అర్పించడం గర్వంగా ఉందన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు ఇతోదికంగా సచివాలయాల ద్వారా మరింతగా సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏబీసి రమణమూర్తి, మూడు సచివాలయాల సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-05-07 07:06:06

ఇంటర్ పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

కాకినాడ జిల్లాలో శుక్రవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కాకినాడ శ్రీనగర్ లో ఉన్న ఆదిత్య జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వర్తించే అధికారులు, ఇతర సిబ్బంది మొబైల్ ఫోన్లు,  ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించడానికి వీలు లేదన్నారు. జిల్లా అంతటా పరీక్షల నిబంధనలు పటిష్టంగా అమలు చేసేవిధంగా చూడటంతోపాటు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా అధికారులు అందరు  పరీక్షా కేంద్రాలను పగడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని  కలెక్టర్ తెలిపారు.

Kakinada

2022-05-06 09:46:19

జగనన్న కాలనీ లేఅవుట్ పరిశీలన

పార్వతీపురం మన్యం జిల్లా  వెంకట బైరిపురం జగనన్న కాలనీ లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. కాలనీలో ఇప్పటివరకు మంజూరైన ఇల్లు, గ్రౌండింగ్ అయిన వివరాలను తాసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. మే 15 నాటికి అన్ని ఇల్లు  గ్రౌండింగు కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ అదేశించారు. అవసరమగు నిర్మాణ సామగ్రి త్వరిత గతిన లబ్దదారులకు సమకూర్చాలని ఆయన అన్నారు. లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో 2,589 ఇల్లు మంజూరు అయ్యాయని, వెంకట భైరిపురం గ్రామంలో 85 ఇళ్లకు 55 ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయని తాసిల్దార్ డి.వీరభద్ర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.

వెంకట బైరిపురం

2022-05-06 09:20:12

గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి

నీటి ఎద్దడి సమస్యపై వెంటనే స్పందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మక్కువ మండలం వెంకట బైరి పురం, కాశీ పట్నం గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ శుక్ర వారం తనిఖీ చేశారు. వేసవి తీవ్రత, నీటి ఎద్దడిపై ఆరా తీశారు. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఫిర్యాదులు  గూర్చి అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య రాకూడదని అవసరమైన చోట్ల బోర్ల మరమ్మత్తులు జరిపించాలని అదేశించారు. సచివాలయాల స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామాల్లో తాగు నీటి పరిస్థితిని గూర్చి సమాచారం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఏ గ్రామంలోనూ తాగు నీటి సమస్య తలెత్తరాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సచివాలయంలో సిబ్బంది బయో మెట్రిక్ హాజరు పరిశీలించారు. సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఆయన అదేశించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలు,  సర్వే నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని, ప్రజల దరఖాస్తులు, స్పందన అర్జీలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, గ్రామాలలో  సచివాలయ వ్యవస్థ ఉన్నందున ప్రజలకు కావలసిన అన్ని  సేవలు సకాలంలో అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలు సచివాలయంలో అందుబాటులో ఉండాలని, సామాజిక తనిఖీ పక్కాగా జరగాలని ఆయన ఆదేశించారు. 

Makkuva

2022-05-06 09:18:49

ములక్కాలయవలసలో పరీక్షలు పరిశీలిన

 పార్వతీపురం మన్యంజిల్లాలో పదవ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు ములక్కాయలవలస మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  విద్యార్థుల కేటాయింపు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో సౌకర్యాల పట్ల ఆరా తీశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని చర్యలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిశీలించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుటకు బస్ సౌకర్యాల ఏర్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షలు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

ములక్కాయలవలస

2022-05-06 09:16:35

ప్రభుత్వాశయానికి అనుగుణంగా పనిచేయాలి

ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా మండల, గ్రామ స్థానిక సంస్థల ప్రతినిధులు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచారపౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కోరారు. గురువారం సాయంత్రం సామర్లకోట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ సమావేశ హాలును రాష్ట్ర మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా విశ్వనాధ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు లతో కలిసి ప్ర్రారంభించారు.  15వ ఆర్థిక సంఘం నిధులు 24 లక్షల రూపాయలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనం మొదటి అంతస్తులో సమావేశ హాలు, వీడియో కాన్ఫరెన్స్ హాలులను నిర్మించారు. ఈ సందర్భంగా సామర్లకోట ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు.  స్వయంగా తాను రాజకీయ ఓనమాలు దిద్దుకుని, పరిణితి చెందిన ప్రజా సేవకుడిగా, రాష్ట్ర మంత్రిగా ఎదగడానికి స్థానిక సంస్థల ప్రతినిధిగా గడించిన అమూల్య అనుభవాలే దోహదం చేశాయన్నారు.  పంచాయితీ రాజ్ వ్యవస్థ పాలనా వికేంద్రికరణకు దోహదం చేస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న, చారిత్రక ఒరవడిగా అమలులోకి తెచ్చిన గ్రామ సచివాలయ, గ్రామ వలంటీర్ వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, సుపరిపాలనా ఫలాలను ప్రజలకు వారి గడపలోనే అందుబాటులోకి తెచ్చాయన్నారు. 
తమ గత వైఫల్యాలను మరిచిపోయి, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జనరంజకంగా అందిస్తున్న సంక్షేమ పాలనపై కొందరు, కొన్ని పత్రికలు, ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారాలు, దుష్ట ప్రచారాలను విజ్ఞత కలిగిన రాష్ట్ర ప్రజలు నమ్మరని, ప్రజల ఆదరాభిమానాలు ఎన్నటికీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పట్ల సుస్థిరంగా ఉంటాయన్నారు. ఇటీవవలి  స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక సంఖ్యలో యంపిపిలు, యంపిటిసిలు, జడ్పిటిసిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాలన పట్ల ప్రజలు హర్షానికి నిలువెత్తు దర్పణం పడుతోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులు అంకిత భావంతో సేవలు అందించి ఈ ప్రజాదరణను చెక్కుచెదరనీయకుండా చిరకాలం నిలపాలని కోరారు.  నూతనంగా నిర్మించిన  సమావేశ హాలు ప్రజోపయోగ చర్చలు, ప్రణాళికలకు వేదికగా నిలిచి, మరింత మెరుగైన సేవలందించేందుకు దోహదం కావాలని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కాక్షించారు. కాకినాడ ఎంపి వంగా గీత విశ్వనాధ్ మాట్లాడుతూ 2009 జడ్పిచైర్మన్ గా సామర్లకోట మండల పరిషత్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి వేణగోపాలకృష్ణ చేతుల మీదుగానే మొదటి అంతస్తు ప్రారంభం కావడం ముదాహమని, ఆయన హస్తవాసితో భవనం మరిన్ని హంగులతో మరింత అభివృద్ది కావాలని కాక్షించారు. ప్రజలకు చేరువలో ఉండి వారితే మమేకమై సేవలు అందించే అపూర్వ అవకాశాన్ని స్థానిక సంస్థల ప్రతినిధులు సద్వినియోగం చేసుకుని మన్ననలు పొందాలని కోరారు.  నూతన భవన వసతి సమకూరిన సందర్భంగా సామర్లకోట మండల పరిషత్ అధ్యక్షులు, సభ్యులకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.   

అనంతరం సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు బొబ్బరాడ సత్తిబాబు, సభ్యులు మంత్రి, ఎంపిలను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సామర్లకోట జడ్పిటిసి ఎలిశెట్టి అమృత, రాష్ట్ర్ర అయ్యారక కార్పొరేషన్ చైరపర్సన్ ఆవాల రాజేశ్వరి, సామర్లకోట మున్సిపల్ చైర్పపర్సన్ గంగిరెడ్డి అరుణ, వైస్ చైర్పర్సన్ వుబా జాన్ మోజేష్, ఎంపిడిఓ కె.నరేంద్రరెడ్డి, తహసిల్థారు వి.జితేంద్ర, ఈఓపిఆర్డి సూర్యనారాయణ, పలువురు పట్టన, మండల ప్రముఖులు పాల్గొన్నారు.  

Samarlakota

2022-05-05 15:11:28

సాంఘిక సంస్కర్త రామానుజాచార్యులు

దిగువ వర్గాల సముద్ధరణకు మానవతా దృక్పథంతో కృషిచేసిన సాంఘిక సంస్కర్త భగవాన్ రామానుజాచార్యులు అని విశ్రాంతి తాసిల్దార్ రేలంగి బాపిరాజు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  శ్రీ రామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ,  1017 లో తమిళనాడు శ్రీ  పెరంబదూర్ లో  ఆయన జన్మించారని అన్నారు. వేదానికి సరైన నిర్వచనం చెప్పి సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు అన్నారు. భారతీయ హిందూ తత్వ, వేదాంత తత్వాన్ని వెయ్యేళ్ళ కిందటే ప్రచారం చేశారని  అన్నారు. పరమాత్ముని  దృష్టిలో అందరూ సమానమేనని ,మోక్షానికి అందరూ అర్హులేనని శ్రీ రామానుజాచార్యులు    ఉపదేశించారు అని బాపిరాజు తెలిపారు.  రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, పలివెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-05-05 08:24:53

రణస్థలంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ( సి.హెచ్.సి)లో ఈ నెల 7న ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎన్. అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గత నెల 21న శ్రీకాకుళంలో మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించడంతో ప్రతి నియోజక వర్గంలో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వేలాది రోగులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆమె చెప్పారు.అందులో భాగంగా మే 7న రణస్థలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వివరించారు. రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి, నిపుణులైన వైద్యులచే తగిన మందులు, సలహాలు , సూచనలు ఇవ్వనున్నట్లు ఆమె ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కావున 7వ తేదీ శనివారం నాడు నిర్వహించే మెగా వైద్య శిబిరానికి వేలాదిగా తరలివచ్చి ఉచిత వైద్య సేవలను పొందాలని ఆమె కోరారు.

Ranastalam

2022-05-05 08:11:08

గ్రామాల్లో వైద్య శిభిరాలు నిర్వహించాలి

గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు ఆదేశించారు. అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శనివారం తనిఖీ చేశారు. వైద్య అధికారి, సిబ్బందిని సమీక్షించారు. ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు గమనించాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వ్యాప్తి చెందే వ్యాధులు, వ్యాప్తి చెందని వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. బయో మెట్రిక్ లో సిబ్బంది హాజరు విధిగా నమోదు కావాలని ఆయన చెప్పారు. ప్రజలకు మంచి సేవలు అందించడం పరమావధిగా భావించాలని ఆయన పేర్కొన్నారు. పి.హెచ్.సిలలో ప్రసవాలు జరగాలని అందుకు వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు అండగా ఉంటుందనే నమ్మకం కల్పించాలని ఆయన అన్నారు. మంచి సేవానిరతి కలిగిన శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Annavaram

2022-04-30 10:12:13

జీడితోటల నష్టాలను పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురం మండలం డోకిశిల గ్రామంలో జీడి పంట నష్టాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. జిల్లాలో జీడి పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు ఉద్యానవన శాఖ అదనపు సంచాలకులు ఎం. వెంకటేశ్వర్లు నేతృత్వంలో బాపట్ల జీడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డా. ఉమా మహేశ్వర రావు, డా. నాగేంద్ర రెడ్డి, రస్తా కుంటుబాయి శాస్త్రవేత్త డా. హరి కుమార్, విజయనగరం ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు డా. ఆర్.శ్రీనివాసరావు బృందం డోకిశిల గ్రామంలో శనివారం పర్యటించింది.  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బృంద సభ్యులతో కలిసి పరిశీలించారు. బృంద సభ్యులు, రైతులతో మాట్లాడారు. పంట నష్టపోయిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో అకాల వర్షాలు, గాలుల వల్ల నష్టపోయిన విధానం, ఇతర వివరాలు తెలుసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో దిగుబడులు, విపత్తుల పరిస్థితుల్లో దిగుబడుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తోటల పునరుజ్జీవనానికి చేపడుతున్న అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటకు సంబంధించిన నష్టాలకు తగు న్యాయం చేయాలని కోరారు. వాటిని పరిశీలించి నివేదిక అందజేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.  ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా ఉద్యానవన అధికారి కె.వి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డోకిశిల

2022-04-30 08:03:07

మీ గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( నరేగా) ద్వారా మీ గ్రామంలోని రహదారులు, చెరు వులను  అభివృద్ధి చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని వేతనదారులకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ భైరి నాగులపేట, గార మండలం వాడాడలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం వేతనదారులతో ముచ్చటించిన కలెక్టర్ మీరు ఎంత పనిచేస్తారో అంత వేతనం లభిస్తుందని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వేతనదారులు ఇబ్బంది పడకుండా ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నుండి రోజుకు రూ.250/-ల వరకు వేతనం లభించే అవకాశం ఉందని , కాని రూ.140/-లు వేతనం లభించేలా పనులు చేస్తున్నారని, ఈ పనులు మరింత చురుగ్గా సాగాలన్నారు. మీరెంత పనిచేస్తారో ప్రభుత్వం నుండి మీ గ్రామానికి, మండలానికి అన్ని నిధులు వస్తాయని కలెక్టర్ సూచించారు. మన ఊరికి ఎంత చేయగలుగుతామో అంత చేయాలని, తద్వారా మీ గ్రామానికి మంచి రహదారి, చెరువు లభిస్తుందని కలెక్టర్ హితవు పలికారు. మీరు చేపట్టే పనుల వలన మండలానికి మరిన్ని నిధులు వచ్చేలా చేయగలుగుతామని, పనిదినాలు కల్పించడం, రోజువారి వేతనం లభించేలా చేయడమే కాకుండా మీ ప్రాంత అభివృద్ధి చేసుకునేలా అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఒక్కో గ్రామంలో సుమారు రూ.10 లక్షల వరకు ఉపాధి పనులు ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తిచేసుకుని వేతనదారులు లబ్దిపొందాలని కోరారు.  ఈ పర్యటనలో శ్రీకాకుళం ఎం.పి.డి.ఓ ఆర్.వెంకట్రామన్, తహశీల్దార్ కె.వెంకటరావు, డ్వామా పథక సంచాలకులు ఎం.రోజారాణి, ఏ.పి.డి అలివేలు మంగమ్మ, జూనియర్ ఇంజినీర్ పి.ముకుందబాబు, ఏ.పి.ఓ కె.సీతారాం, టెక్నికల్ అసిస్టెంట్ జి.రజనీ,వేతనదారులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం రూరల్

2022-04-30 06:25:10

రమ్య హత్య కేసులో తీర్పు అభినందనీయం

గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు ముద్దాయికు విధించిన శిక్షను స్వాగతిస్తున్నామనీ, కేవలం 9 నెలల కాలంలో హత్య కేసులో శిక్ష విధించటం సంచలనం అని రాష్ట్ర వైసిపి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ మేరకు ఆమె శుక్రవారం కాకినాడ రూరల్ లో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది ఆగస్ట్ 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా శశికృష్ణ అనే దుర్మార్గుడు రమ్యను కత్తితో పొడిచి హత్య చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందనీ సదరు కేసులో  పొలీసు వారు హత్యా నేరానికి సంబంధించిన అన్ని విషయాలను కోర్టుకు అందజేయటంవలన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడుకి మరణశిక్ష  విధించటం ఆనందకరమన్నారు. ఆది నుంచి రాష్ట్ర వైసిపి ప్రభుత్వం మహిళలకు రక్షణగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. దిశా లాంటి చట్టాలు తీసుకురావటం, కఠినమైన శిక్షలు విధిస్తామనీ ప్రచారం చేస్తున్నా కొంతమంది దుర్మార్గుల వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనీ ఈ కేసులో ముద్దాయికు ఉరిశిక్ష అమలు చేయడం వలన సమాజంలో కాస్త అవగాహన రావచ్చుననీ తెలిపారు. ఈ కేసులో త్వరగతిన వివరాలు సేకరించి కోర్టుకు అందచేసిన పోలీసువారికి కృతజ్ఞతలు తెలుపున్నామనీ, ఇలాంటి శిక్షలు అమలు చేయటం వలన మహిళలపై దాడులు తగ్గవచ్చుననీ, పోలీసువారికి  ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికు  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామనీ ఆమె మీడియాకి విడుదల చేసిన ప్రకనటలో పేర్కొన్నారు. 

కాకినాడ రూరల్

2022-04-29 12:51:02