1 ENS Live Breaking News

10 పరీక్షలు ప్రశాంతంగా జరపాలి

అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరపాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఆయన దేవరాపల్లి, కె.కోటపాడు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కే కోటపాడు లో అయ్యన్న ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పరిశీలించారు.  పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు మొదలైన ఏర్పాట్లు చేయాలని, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  కలెక్టర్ వెంట అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

కె.కోటపాడు

2022-04-29 12:10:51

సచివాలయాలనికి వస్తే సంత్రుప్తిగా వెళ్లాలి

గ్రామ సచివాలయానికి వచ్చినవారు సంతృప్తిగా తిరిగి వెళ్లేలా పనిచేయడం లేదా సమాచా రం ఇవ్వడం చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఆయన దేవరాపల్లి మండలం లో దేవరాపల్లి పెద్దనందిపల్లి సచివాలయాలను సందర్శిం చారు. ప్రజలకు అందుతున్న సేవలు పరిశీలించారు.  రిజిస్టర్ లను తనిఖీ చేశారు.  పౌరులకు అందించే సేవల గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ రోజూ మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని తగు సమయంలో పరిష్కరించాలన్నారు. పలు ప్రభుత్వ పథకాల అమలులో అర్హత లేనివారికి సౌమ్యంగా చెప్పి పంపించాలన్నారు.  విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Devarapalli

2022-04-29 12:07:37

సచివాలయ సేవలు ప్రజలకు చేరువచేయాలి

గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం, పారదర్శకతతో కూడిన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. శుక్రవారం అనపర్తి లో సచివాలయం-4 , అర్భికే-4 లను జాయింట్ కలెక్టర్  తనిఖీ చేశారు. అనంతరం దుప్పలపూడి లే అవుట్ లో గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో గ్రామ స్థాయిలో సచివాలయ, ఆర్భికే లను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.  పౌర సేవలు అందించే క్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  సచివాలయం లోని వివిధ రీజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆర్భికే ను సందర్శించి, ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియపై సిబ్బందిని వివరాలు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలుసుకున్నారు.  రైతులకు సరైన తూకం వేసి, సరైన ధర అందించేందుకు సిబ్బంది నిబద్దతతో పనిచేయాలన్నారు. రైతు వివరాలు, బ్యాంకు ఖాతా సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డేటా ఎంట్రీ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎటువంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జేసీ వెంట మండల స్థాయి అధికారులు, సచివాలయ, అర్భికే సిబ్బంది పాల్గొన్నారు.

Anaparthi

2022-04-29 12:03:04

దుప్పలపూడిలో లే అవుట్ పరిశీలన..

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పథకం లక్ష్యాలను నిర్ణీత సమయం లోగా పూర్తి చేయాల్సి ఉందని జేసీ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. శుక్రవారం తుప్పలపూడి లే అవుట్ ను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ లే అవుట్ వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా ఇసుక, సిమెంట్, ఐరన్ వంటి ముడి సరుకులు అందుబాటులో ఉంచుతున్నామని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, హౌసింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు అవగాహన పెంచి ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ వెంట మండల స్థాయి అధికారులు, సచివాలయ, అర్భికే సిబ్బంది పాల్గొన్నారు.

Duppalapudi

2022-04-29 12:00:06

వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా పక్షపాతి

మహిళల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి అనుగుణంగానే  సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన వైయస్ఆర్ సున్నా వడ్డీ చెక్కు ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా  పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ,  నర్సీపట్నం మునిసిపాలిటీలో  2019 నాటికి డ్వాక్రా మహిళలకు 30 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నాయన్నారు. గత రెండు సంవత్సరాలుగా సుమారు 15 కోట్ల రూపాయలు రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసిందన్నారు. నియోజకవర్గం లో 2019 నాటికి సుమారు 160 కోట్ల రూపాయలు రుణాలు ఉండగా, 80 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు. డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు బ్యాంకు రుణాల వడ్డీ భారం పడకుండా  ఆ వడ్డీని నేరుగా బ్యాంకులకు చెల్లిస్తున్న ప్రభుత్వం ఒక్క  జగనన్న ప్రభుత్వమే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, మాఫీ చేయలేదు సరికదా 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల ఆర్థిక పరిస్థితి చూసి చలించి పోయిన ముఖ్యమంత్రి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం సున్నా వడ్డీ పథకాన్ని నవరత్నాలలో చేర్చారన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా సున్నా వడ్డీ బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిoదని, మూడో విడతగా 2020 -21 సంవత్సరానికి గాను సకాలంలో రుణాలు చెల్లిస్తున్న అన్ని సంఘాలకు సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే అన్నారు. మూడో విడతలో నర్సీపట్నం మున్సిపాలిటీలో  సున్నా వడ్డీ పథకం ద్వారా  1276 డ్వాక్రా గ్రూపులకు గాను రూ.2 కోట్ల  31 లక్షల 40 వేలు  ఆర్థిక లబ్ధి చేకూరింది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్లు గొలుసు నరసింహమూర్తి, తమరాన అప్పలనాయుడు, మెప్మా పిడి సరోజిని, మున్సిపల్ కౌన్సిలర్లు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, వైఎస్ఆర్ నాయకులు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు, పాల్గొన్నారు.

Narsipatnam

2022-04-29 10:03:08

నర్సీపట్నం మండలంలో చిరుత సంచారం

నర్సీపట్నం మండలం అప్పన్నపాలెం గ్రామ సమీపంలో చిరుత పులులు సంచరిస్తున్నా యి. అంతేకాదు పులుల పంజాకు రెండు ఆవులు మ్రుత్యువాత పడ్డాయి. ఇక్కడ చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పడానికి సంఘటనా స్థలంలో చిరుత నడిచిన ఆనవాళ్లు, కాలి ముద్రలు కూడా ఉన్నాయి. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తు న్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా కాకుండా చిరుత గాండ్రింపులు కూడా వినిపిస్తున్నాయని ఆందోలన వ్యక్తంచేస్తున్నారు. చిరుత దాడిలో మ్రుత్యువత పడిన విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతేకాకుండా అక్కడ చిరుత పులి పాదముద్రలను గుర్తించినట్టు పేర్కొన్నారు. వాటి చిత్రాలను మీడియాకి విడుదల చేశారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో ఎవరూ బయట తిరగ వద్దని కూడా హెచ్చరికలు జారీచేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గస్తీ కూడా ఏర్పాటు చేస్తామని అప్పన్నపాలెం గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. చిరుత సంచార విషయం నర్సీపట్నం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. 

Narsipatnam

2022-04-29 06:57:15

లబ్దిదారులతో ఫోటో దిగిన సిఎం జగన్..

అనకాపల్లి జిల్లాలోని  పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 20 మంది గృహ లబ్దిదారులతో బృంద ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను చిరు నవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. సమావేశం అనంతరం ఆ బృంద ఫోటోని ఫ్రేమ్ కట్టించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. మంత్రులు బూడి ముత్యాల నాయుడు, అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజనీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-28 11:52:00

సొంతింటితో సామాజిక హోదా, భరోసా..

సొంత ఇంటితో జీవితానికి భరోసా, సామాజిక హోదాతో పాటు పిల్లలకు వారసత్వ ఆస్తి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో నవరత్నాలలో భాగంగా పేదలందరికి ఇళ్లు పథకంలో విశాఖ నగరంలో లక్షా 24 వేల 581 కుటుంబాలకు ఇళ్ల స్థల పట్టాలు, రాష్ట్రంలో ఫేజ్-2 కింద 3,03,581 కుటుంబాలకు గృహ మంజూరు పత్రాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఒక్క గ్రామంలోనే 10,228 ఇళ్లు నిర్మాణమవుతున్నాయన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్, పార్కలు, రోడ్లు తదితర సౌకర్యాలు వస్తాయన్నారు. పాదయాత్ర సమయంలో 25 లక్షల గృహాలకు హామీ ఇచ్చినప్పటికి అంతకు మించి 30 లక్షల 70 వేల గృహాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ పరిధిలో సెంటు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో  16 లక్షల ఇళ్లు నిర్మాణంలో వున్నాయని, ఇంకా 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నట్లు తెలిపారు. 2.60 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ గృహ నిర్మాణానికి 5 వేల 469  కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు. పేధలందరికీ ఇళ్ల నిర్మాణాల కారణంగా రాష్ట్ర జిడిపి వృద్ధి రేటు పెరుగుతోందని తెలిపారు. కార్మికులకు 25.92 కోట్ల పని దినాలు కల్పించామని, 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 

ఇళ్లు మంజూరు కానివారు బాధపడవద్దని వెంటనే  గ్రామ సచివాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకొంటే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. రు. 2 లక్షల 12 వేల మంది ధరఖాస్తు పెట్టుకోగా ఒక లక్షా 12 వేల మందికి మంజూరు చేసినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి మహిళలలకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి  రూ.35 వేల రుణం ఇప్పిస్తామన్నారు. దీని వలన గృహ నిర్మాణాలు మరింత వేగవంతం అవుతాయన్నారు. కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కాలనీల్లో తాత్కాలిక గొడౌన్లు ఏర్పాటు చేసి ఇసుక, సిమెంటు, శానిటరీ, తదితరమైనవి ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. 340 అడుగుల గృహంలో ఒక బెడ్ రూం, నివాసం గది, కిచెన్, బాత్రూం, వరండాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికి రెండు ఫ్యాన్లు, ఎల్ఇడి బల్బులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి పథకాలు అందిస్తున్నారని తద్వారా అవినీతిలేని వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా అక్కా చెల్లెమ్మలకు మంచి చేయడంలో జగనన్న వెనుకడుగు వేయడన్నారు.

  పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యల పై మాట్లాడుతూ పంచగ్రామాల సమస్యలు ప్రస్తుతం కోర్టులో ఉన్నదని చెప్పారు. తాడి గ్రామ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుందని, ఆ ప్రాంతానికి రూ. 56 కోట్లు వారం రోజుల్లోనే మంజూరు చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ఎడమకాల్వ ద్వారా శ్రీకాకుళం వరకు గోదావరి నీరు తీసుకువెళతామన్నారు.  అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, గృహ మంజూరు పత్రాలు ఆయన పంపిణీ చేశారు.  గాజువాక నుండి వచ్చిన మహిళ నాగమణి మాట్లాడుతూ చాలి చాలని జీతంతో పిల్లలుతో జీవనం సాగిస్తున్నామని, అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు.  కరోనా సమయంలో ఇంటి యజమాని వచ్చి ఇళ్లు ఖాలీ చేయమని చెప్పేసరికి బాధపడ్డామని, ప్రస్తుతం అటువంటి ఇబ్బందులు కలుగకుండా జగనన్న ఇస్తున్న గృహంలో కుటుంబంతో సంతోషంగా ఉంటామని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల పట్టాలు, గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు మూడు సంవత్సరాలలో పైడివాడ అగ్రహారం మున్సిపాలిటీగా మారబోతుందన్నారు. పెందుర్తి శాసన సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 70 వేల కుటుంబాలకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 2 లక్షల మందికి శాశ్వత గృహాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.  పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో ఉన్న  పంచగ్రామాల భూ సమస్య, తాడి గ్రామ కాలుష్య సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. 
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ, పట్టాల పంపిణీకి ల్యాండ్ పూలింగ్, జిల్లా అభివృద్ధిని వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, విశాఖపట్నం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ అధ్యక్షులు జి. సుభద్ర, విఎమ్ఆర్డిఏ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల,  టిటిడి ఛైర్మన్  వై.వి. సుబ్బారెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్,  విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఎ. మల్లికార్జున, రవి శుభాష్, పార్లమెంటు సభ్యులు బివి సత్యవతి, ఎంవివి సత్యనారాయణ, జి. మాధవి, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు,, శెట్టి ఫల్గుణ, కె. భాగ్యలక్ష్మి వాసుపల్లి గణేష్ కుమార్, శెట్టి ఫాల్గుణ, జివిఎంసి కమీషనర్ లక్ష్మీశా, ఎస్పీ గౌతమ్ శాలిని, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అదనపు ఎస్పీ కె. శ్రావణి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికిపూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Sabbavaram

2022-04-28 11:49:50

సూర్యభగవానుడి కళ్యాణంలో స్పీకర్

కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ దంపతులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం మంగళవారం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమానికి శాసనసభాపతి దంపతులతో హాజరయ్యారు. తొలుత ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాశ్ శాసనసభాపతికి ఆలయ మర్యాదలతో పూలమాలను వేసి స్వాగతం పలుకగా, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ  వేదమంత్రాలు, పూర్ణకుంభంతో దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి తీర్ధ ప్రసాదాలను దంపతులకు అందజేసారు. ఈ సందర్భంగా స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ రూ.25వేల నగదును ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేసారు. ఈ  కళ్యాణ మహోత్సవంలో పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, మండల మన్మధరావు, యామిజాల గాయత్రి, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Arasavilli

2022-04-26 10:22:18

ఇద్దరు ఉద్యోగులకు పదోన్నతులు

కాకినాడ నగర పాలక సంస్థలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్ లుగా లభించింది. ఇంజనీరింగ్ విభాగంలో టైపిస్ట్ గా  పనిచేస్తున్న కె. సతీష్ బాబు,  జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ భాగ్యలక్ష్మి లకు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు  మంగళవారం  పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు.  ఎస్.ఈ సత్య కుమారి, మేనేజర్ కర్రి సత్యనారాయణ  ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సిబ్బంది వీరిని అభినందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతగా ప్రజలకు సేవలు  అందించాలని ఈ సందర్బంగా వారికి సూచించారు. కార్యక్రమంలో సహచర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-26 10:18:54

బాల్య వివాహాలు చేస్తే శిక్ష తప్పదు..

 పరిపక్వత లేని వయసులో బాలికలకు వివాహం  తలపెడితే పెండ్లి కుమారుడు తో పాటు వధూవరుల తల్లిదండ్రులు, ఫోటోగ్రాఫర్, పురోహితుడు, బంధువులు ఇలా అందరిపై కేసులు నమోదు అవుతాయి అని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మంచి చెడు  తెలియక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసి  బాధ్యత వదిలించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఆడ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేక పెళ్లిళ్లకు  ఒప్పుకుంటున్నారని అన్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో శారీరక పరిపక్వత సాధించక ముందే తల్లులు అవుతున్నారని అన్నారు. దీంతో బిడ్డ ఎదుగుదలలో కూడా లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. బాల్య వివాహం జరిగితే 1098, 100 నెంబర్లకు ఫోన్ చేసి  ఫిర్యాదు చేయాలని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,పట్నాయక్, ఓం నమశ్శివాయ, బాపిరాజు  తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-04-26 07:43:21

కోట సత్తెమ్మతల్లికి జిల్లా కలెక్టర్ పూజలు

నిడదవోలు కోట సత్తెమ్మ తల్లిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు.  సోమవారం నిడదవోలు నియోజవర్గం పరిధిలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో పాల్గొనడానికి నిడదవోలు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కి స్థానిక శాసన సభ్యులు జీ. శ్రీనివాస నాయుడు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.  ఈ  సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి,  వేదపండితులు పూర్ణకుంభంతో  స్వాగతం పలుకగా తదుపరి శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి కలెక్టర్ డా. కె.మాధవిలత దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో. బల్లా నీలకంఠం స్వాగతం పలుకగా , ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసారు. అమ్మవారిని దర్శించుకున్న  కలెక్టరు జిల్లాప్రజలు తరపున అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ వెంట స్థానిక శాసన సభ్యులు జి.శ్రీనివాసనాయుడు, జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్, ఆలయ చైర్మన్  దేవులపల్లి రామసుబ్బరాయశాస్త్రి, ఎఎంసి చైర్మన్ పొలయ్య, మున్సిపల్ కమిషనర్ పద్మావతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితులున్నారు.

Nidadavole

2022-04-25 08:59:46

గ్రామ స్వరాజ్యమే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ లక్ష్యం

గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యం దిశ‌గా జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం ప‌య‌నిస్తుంద‌ని జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్  జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర  అన్నారు. ప్రభుత్వ పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువు చేసే దిశగా  గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చి దేశంలో గొప్ప వ్యవస్థనును సీఎం వైఎస్. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్థాపించారని అన్నారు. ఆదివారం జాతీయ పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ముంచంగిపుట్టు మండ‌లం సుజ‌న‌కోటలో జరిగిన  గ్రామ స‌భ‌ను ఆమె పాల్గొని మాట్లాడారు.  దేశం అభివృద్ధి చెందాలంటే ప‌ల్లెలు అభివృద్ధి చెందాలన్న సిద్దాతాన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం ప్ర‌జా పాల‌న‌కు తెర‌తీశార‌ని తెలిపారు. దివంగత  రాజ‌శేఖ‌ర‌రెడ్డి  నిత్యం ప‌ల్లెలు, ప‌ల్లె ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తూ ఉండేవారని ఆయ‌న శ్వాస ఉన్నంత‌వ‌ర‌కూ గ్రామాలు అభివృద్ధి చెందాల‌నే త‌పించారని సుభ‌ద్ర పేర్కొన్నారు. ఉత్త‌మ‌ గ్రామీణ పాల‌న అందించేందుకు పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను 1992లో భార‌త రాజ్యాంగం 73వ స‌వ‌ర‌ణ ద్వారా గ్రామ‌, జిల్లా స్థాయిలో పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఏడాది త‌ర్వాత రాజ్యాంగంలో చేసిన ఈ స‌వ‌ర‌ణ 1993 ఏప్రిల్ 24న అమ‌ల్లోకి వ‌చ్చిందని జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ పేర్కొన్నారు.   తొలిసారిగా పంచాయ‌తీరాజ్ దినోత్స‌వాన్ని సంబంధించి ప్ర‌త్యేకంగా పండ‌గ‌లా చేసుకోవాల‌ని మన మాజీ ప్ర‌ధాని  మ‌న్మోహ‌న్ సింగ్  2010 ఏప్రిల్ 24 జాతీయ పంచాయ‌తీరాజ్ దినోత్స‌వాన్ని ప్రారంభించారని ఆమె చెప్పారు. పంచాయ‌తీలు, గ్రామాల అభివృద్ధిలో అటు కేంద్ర‌ప్ర‌భుత్వ‌మూ, ఇటు రాష్ట్ర‌ప్ర‌భుత్వం స‌మాన ప్రాధానాలు ఇస్తున్నాయని చెప్పారు.  గ‌తంలో గ్రామాల్లో ఏ ప‌ని చేయాల‌న్న స‌రే రాజ‌కీయ నాయ‌కుల సిఫార్సు ఉంటే త‌ప్ప ఏ ప‌నీ అయ్యేదీ కాదని, ఏ ప్ర‌భుత్వాలు వ‌చ్చినా వారికి అనుకూలంగా ఉన్న‌ వ్య‌క్తుల‌కే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందించేవారని ఆమె తెలిపారు.  కానీ నేడు ఏ ప‌థ‌కం అందాల‌న్నా గ్రామంలో మీ ఇంటికొచ్చే గ్రామ వాలంటీర్‌కు చెబితే చాలు.. మీరు అర్హులైతే ఈ ప‌థ‌కం మీకు వ‌ర్తించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు  ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న అనే నినాదం తీసుకొచ్చారని, దానికి అప్ప‌ట్లో మంచి స్పంద‌న ల‌భించిందని, ఇప్పుడు దానికి మించిన పాల‌న గ్రామ సచివాలయాల ద్వారా  ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి  తీసుకొచ్చారని కొనియాడారు.  ఈ కార్య‌క్ర‌మంలో సుజన కోట సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు జగబందు, సాధన, తిరుపతి, ప్రసాద్, పద్మారెడ్డి, దామోదరం, సుజనకోట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Munchangiputtu

2022-04-24 14:05:58

చెరువులతో భూగర్భజాలలు అభివ్రుద్ధి

చెరువులను అభివృద్ధి చేస్తే భూగర్భజలాలు సమృద్ధిగా లభిస్తాయని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ చెప్పారు. ఆదివారం చోడవరం మండలం రాయపు రాజుపేట శివారు నరసాపురం గ్రామం లో చెరువు అభివృద్ధి పనులను  కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ ఉత్సవంలో భాగంగా ప్రకృతి వనరులను పటిష్ట పరిచేందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో చెరువులలో మట్టి పూడికతీత పనులు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ తవ్వకాలు మూలంగా ఎక్కువ నీరు నిల్వ ఉంటుందని దానివలన చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను ముఖ్యంగా నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఉపాధిహామీ కూలీల తో మాట్లాడుతూ  వేతనాలు సకాలంలో వస్తున్నాయా లేదా, సచివాలయ సేవలు రేషన్ సరఫరా ఎలా ఉన్నాయి అని ఆరా తీశారు.  తమకు అన్ని సకాలంలో వస్తున్నాయని ఇంటి వద్దకే రేషన్ తీసుకొస్తున్నారని కూలీలు చెప్పారు. మండలంలోని వెంకన్నపాలెం, గజపతినగరం గ్రామాలలో జగనన్న కాలనీలు లేఅవుట్లు కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి అవ్వాలని, అవసరమైన చోట్ల బోర్లు వేయాలని, విద్యుత్ సరఫరా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.  గృహాలకు దగ్గరగా ఉన్న విద్యుత్ స్తంభాలను కొంత దూరంలో వేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో ఆర్డీవో చిన్నికృష్ణ తాసిల్దార్ తిరుమల బాబు ఎంపీడీవో శ్యామ్ సుందర్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ శివ ప్రసాద్ గృహ నిర్మాణ, డ్వామా అధికారులు పాల్గొన్నారు.

Chodavaram

2022-04-24 09:05:04

సత్యసాయి మార్గం అనుసరణీయం..

ప్రార్థించే పెదవుల కన్నా  సేవచేసే చేతులు మిన్న  వంటి ప్రబోధాలు ద్వారా సమాజసేవ చేయమని  భక్తులను ప్రోత్సహించిన సత్య సాయి బాబా ఆశయసిద్ధి కోసం  ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సత్య సాయి బాబా ఆరాధనోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని  ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన, మెరుగైన వైద్యం, ప్రకృతి వైపరీత్యాలలో నిరాశ్రయులకు నీడ కల్పించడం, ఆకలిదప్పులు తీర్చడం.. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను సత్య సాయి బాబా ప్రవేశపెట్టారని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, దేశాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు సేవా మార్గంలో పయనిస్తున్నారు అని అన్నారు. సేవల ద్వారా ప్రపంచ దేశాలలో లక్షలాదిమంది హృదయాలలో పిలిస్తే పలికే దైవంగా నిలిచిపోయిన సమాజవాది, సంస్కర్త సత్య సాయి బాబా అని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, మల్లీశ్వరి, రాజా, రేలంగి బాపిరాజు,  రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2022-04-24 07:28:32