1 ENS Live Breaking News

ఉచిత ఆధార్ సేవలు వినియోగించుకోవాలి

ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడ్ సేవలను 5నుంచి 15 సంవత్సరాల లోపు విద్యార్ధినీ, విద్యార్ధుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్వచంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం-1లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్ర సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్కూలు పిల్లల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధార్ అప్డేట్ కార్యక్రమం ఉచితంగా చేపట్టిందన్నారు. దానికోసం గుర్తించిన గ్రామ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ సేవలను అందిస్తుందన్నారు. ఆధార్ అప్డేడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో వీలుగా వుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ పర్వత రాజు బాబు ,ఎంపిడిఓ రాంబాబు,సర్పంచ్  బందిలి గన్నియమ్మ,ఎంపీటీసీ సభ్యులు వీరబాబు, పంచాయతీ కార్యదర్శులు,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు, పిల్ల తల్దిదండ్రులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-06-29 07:51:12

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Golugonda

2022-06-29 03:01:15

బైకెనక బైకులెట్టి.. YSRCPప్లీనరీకి దారికట్టి

గొలుగొండ మండలం సీహెచ్.నాగాపురం గ్రామ సర్పంచ్ రఘురామ్ ఏం చేసినా అది వినూత్నంగానే వుంటుంది. ఎల్లప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను ప్రజలకు చేర్చడంతోపాటు, సోషల్ మీడియాలోనూ చురుకుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా నర్సీపట్నం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి కూడా యువతను వెంటబెట్టుకొని..బైకెనక బైకులెట్టి ప్లీనరీకి తరలి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమం అయినా సర్పంచ్ రఘురామ్ దగ్గరుండి యువతను, కార్యకర్తలను వెంటబెట్టుకొని తీసుకెళ్లడం గొలుగొండ మండలంలోనే హైలేట్ గా నిలుస్తుంటుంది. వైస్సార్సీపీ ప్లినరీ సమావేశానికి  బైక్, ఆటోలలో మహిళలంతా కలిపి 50మంది వరకూ తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Krishnadevipeta

2022-06-27 08:50:37

కష్ట పడిపనిచేసే ప్రతీ కార్యకర్తకూ పెద్ద పీట

పార్టీ అభివ్రుద్ధి కోసం కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు పెద్ద పీట వేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గ ప్లీనరీ సమావేశం శనివారం అచ్చుతాపురంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  హాజరైన మంత్రి అమర్ నాధ్ మాట్లాడుతూ, కార్యకల శ్రమ, జగన్ కాయకష్ట మీద పార్టీ ఎదిగిందే తప్ప, ఏసాను భూతిని అడ్డు పెట్టుకొని  పైకి రాలేదని ఆయన అన్నారు.  వైసిపీ జెండా  నీడలో మనమంతా ఎదిగామన్న వాస్తవాన్ని కార్య కర్త లు,   నాయకులు గుర్తించాలని, తన వల్లే పార్టీ నడుస్తోందని యెవ్వరు భావించవద్దని మంత్రి అమర్ హితవు పలికారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి,  ఒంటరి పోరుతో జగన్  అధికారంలోకి. వచ్చారని ఆయన అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హాయాంలో ప్రవేశపెట్టిన పథకం ఏ ఒకటైన జనానికి గుర్తుందా? అని అమర్ ప్రశ్నించారు.

బాబు పేరు చెడితే వెన్నుపోటు తప్ప జనానికి మరేదీ. గుర్తు రాదని ఆయన విమర్శించారు. జగన్ని జైలుకు పంపించాలని, సోనియాతో కలసి చంద్రబాబు కుట్రలు పన్నినా, జగన్ మొక్క ఓని ధైర్యంతో జనాల మధ్యకు వెళ్ళి ముఖ్యమంత్రి  అయ్యారని  అన్నారు.  వచ్చే రెండు నెలల్లో సీఎం జగన్ అచ్చుతాపురం ప్రాంతానికి రానున్నారని, ఇక్కడ సుమారు రెండు వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న కర్మగారాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని అమర్ చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ధర్మశ్రీ మాట్లాడుతూ గుడివాడ గురునాధరావు ను, అమర్ నాథ్ లో చూస్తున్నామని, అనకాపల్లి నియోజకవర్గంలో వారి కుటుంబానికి ప్రత్యేక స్థానం వుందని అన్నారు.అర్హత వున్న వాళ్లకు పథకాలు ఇచ్చారని, అందులో ఎటువంటి అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గానికి ఈ మూడేళ్లలో 831 కోట్ల విలువైన పథకాలు అందాయని చెప్పారు. గడప గడపకూ వైసిపి కార్యకర్తలు వెళుతుంటే ప్రజలు చిరు నవ్వుతో స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమువేశంలో డి సి సి బి మాజీ చైర్మన్ సుకుమార వర్మ ఎం.పి. సత్యవతి, సతీష్ వర్మ, బొడేటిప్రసాద్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Atchutapuram

2022-06-25 15:19:38

వడి వడిగా టీడీపీ సభ్యత్వ నమోదు

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వడివడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని టిడిపి నాయకులు మిరియాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ప్రత్తిపాడు మండలం, చిన శంకర్లపూడి గ్రామంలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు.  నియోజవర్గ ఇంఛార్జి వరుపుల రాజా గారి పిలుపు మేరకు కార్యక్రమాన్ని నాలుగు మండలాల పరిధిలో పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ప్రతీరోజూ సుమారు 100 నుంచి 130 మంది సభ్యత్వ నమోదు ఆన్ లైన్ లో జరుగుతుందని శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు అప్పారావు, శ్రీను, వంశీ, రాము తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు

2022-06-24 13:25:41

ఎస్.పైడిపాల కొండల్లోనే పులి సంచారం

కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల అడవుల్లోనే పులిసంచారం వుందని జిల్లా అటవీశాఖ అధికారి రాజు వెల్లడించారు. శుక్రవారం పులి ఆచూకీ కోసం అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసి టీవీలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత రెండు రోజులుగా పశులపై పులి దాడి చేస్తుందని ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఎవరూ రాత్రి సమయంలో అటవీ ప్రాంతం గుండా వెళ్లవద్దని హెచ్చరించారు. పులి ఈ ప్రాంతంలోనే తిరుగుతుందని దాని పాద ముద్రల ద్వారా ఒక అంచనాకి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఫుటేజీలు పరిశీలించిన అనంతరం మరికొన్నింటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సాయంత్రం సమయంలో గ్రామ శివారుల్లోగానీ రైతులు పశువుల మేతకు కూడా తీసుకెళ్లవద్దన్నారు. పులి సంచారం పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని..కాగా ప్రస్తుతం ఈ గ్రామంలో అటవీశాఖ సిబ్బంది పహారా ఉంటుందని ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని అన్నారు.  గ్రామానికి చెందిన రైతులకు చెందిన పశువులను భద్రమైన ప్రదేశాల్లోనే పులి దొరికేవరకూ ఉంచాలని జిల్లా అటవీశాఖ అధికారి రాజు ఎస్.పైడిపాల వాసులకు సూచించారు.

Rowthulapudi

2022-06-24 13:15:52

అప్పన్నకు 3వ విడత చందన సమర్పణ

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామికి మంగళవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా  మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు. సోమవారము నృసింహ జయంతి సందర్భముగా అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సింహాద్రి నాధుడుని  దర్శించుకున్నారు. ఈ నేపధ్యంలో చందాన సమర్పణ వివరాలు వెల్లడించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు అప్పన్న నిజరూప దర్శనం రోజు రాత్రికి తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించారు.. ఆ తర్వాత వచ్చే వైశాఖ ,జ్యేష్ఠ ,ఆషాఢ పౌర్ణమిల లో మూడేసి మణుగుల చొప్పున ఏడాదిలో నాలుగు విడతల కింద 12 మణుగుల చందనాన్ని(500కేజీ లు) స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ నేపథ్యంలో మంగళవారం నాడు  చందన సమర్పణ కి  ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ  ఆధ్వర్యంలోఅర్చక వర్గం, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా సోమవారం సింహగిరి పై నరసింహ స్వామి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ అర్చక పరివారము స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమంలు నిర్వహించింది


శ్రీనుబాబు కు ఘనసత్కారం

అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ల  ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఘనంగా సత్కరించాయి.. తన సేవలను గుర్తించి సన్మానించిన వారికి శ్రీను బాబుప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Simhachalam

2022-06-13 07:33:20

వ్రుద్ధుల్లో వెలుగులు నింపిన విశాలాంధ్ర

విశాలాంధ్ర 70వ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలం కలిగోట్ల గ్రామంలో మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వ్రుద్ధులకు, చిన్నాలరుకు కంటి పరీక్షలు నిర్వహించారు. విశాఖజిల్లా బ్యూరో పి.రామకృష్ణ,  దేవరాపల్లి మండల రిపోర్టర్ గొర్రుపోటువాసు, ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో ఉన్న అనేక మంది వృద్ధులు, చిన్నారులు, వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈ వైద్య శిబిరం లో పాల్గొన్నారు. శంకర్ ఫాండేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది ఈ ఉచిత కంటి శిబిరం లో పరీక్షలు జరిపి అవరమైన వారిని ఆపరేషన్లు చేయించేందుకు విశాఖలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరికొందరికి మందులు పంపిణీ చేశారు.  కలిగొట్ల గ్రామంతో తోపాటు చుట్టుపక్కల వాకపల్లి, తిమిరాం, అర్జునగిరి, బోయల కింతల, కొత్తూరు, గవరవరం, వేచలం గ్రామాల నుండి 300 మందికి పైగా ప్రజలు వైద్యసేవలు పొందారు.

Devarapalli

2022-06-07 08:20:47

ఈవీఎం గోదాముల ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఈవీఎంల గోదాముల ఆవరణలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మొక్కలు నాటారు. నెలవారీ తనిఖీలో భాగంగా శుక్రవారం ఆమె గోదాములను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పటిష్ఠ భద్రత కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా విజిటింగ్ బుక్ లో కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం డి.ఆర్.వో. ఎం. గణపతిరావు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మహేష్ లతో కలిసి గోదాముల ఆవరణలో వివిధ మొక్కల్ని నాటి నీరు పోశారు. కార్యక్రమంలో నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, తహశీల్దార్, ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.

Nellimarla

2022-06-03 08:53:33

సంతృప్తికరంంగా సేవలందించంండి..

 వివిధ సమస్యలపై సచివాలయాలకు వచ్చే ప్రజలతో సఖ్యతగా మెలగాలని, సంతృప్తికర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సూచించారు. నెల్లిమర్ల మండల పరిధిలోని జరజాపుపేట -1, 2 సచివాలయాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడందుతున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రగతి నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సచివాలయ సిబ్బందికి, ఇతర అధికారులకు మార్గ నిర్దేశకాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఓటిఎస్ పైన మరొక్కసారి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. లే ఔట్ కి అప్రోచ్ రోడ్డు నిర్మించాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.

ఆమె వెంట నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్. రామారావు, పంచాయతీ రాజ్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లు, ఆశాలు తదితరులు ఉన్నారు.

Nellimarla

2022-06-03 06:14:00

ఉపాధి పనులను పరిశీలించిన డ్వామా పిడి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎం.రోజా రాణి మంగళవారం పరిశీలించారు. చిలకపాలెం, చిన్నరావుపల్లి తదితర ప్రాంతాలను విస్తృతంగా పర్యటించి ఉపాధి హామీ పనుల తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి కూలీలతో మాట్లాడుతూ రెండు పూటలా నిర్దేశించిన పని చేసినట్లయితే వేతనదారులు గరిష్ఠవేతనం రూ.250/-లకు పైగా  పొందవచ్చని ఆమె సూచించారు. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, మీరు చేసిన పనులు మీ గ్రామానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె వేతన దారులను ఉద్దేశించి అన్నారు. జాబ్ కార్డు ఉన్న వారందరికీ వందరోజుల పని దినాలు కల్పించే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఏపీఓ,సాంకేతిక సహాయకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Echherla

2022-05-31 13:36:27

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-05-31 05:39:15