1 ENS Live Breaking News

నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం

సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆమదాలవలస రైల్వే స్టేషన్ (శ్రీకాకుళం రైల్ రోడ్) ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల ప్రజానీకానికి రైల్వే కనెక్టివిటీ గా ఉంటూ,సుదీర్ఘ కాలంగా  సేవలు అందించింద న్నారు.చారిత్రక నేపథ్యం ఉన్న రైల్వే స్టేషన్ కు,  అన్ని వసతులు ప్రాధాన్యత క్రమంలో సమకూర్చి,సర్వాంగ సుందరంగా రూపుదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.సోమవారం రైల్వే స్టేషన్ లో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను స్పీకర్ ప్రారంభించారు.స్టెయిన్లెస్ స్టీల్ తో ఏర్పాటు నిర్మించిన, ఈ బ్రిడ్జ్ దేశంలోనే రెండవది కావడం విశేషమన్నారు.త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి,వారధిని  ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా కృషి చేసిన తూర్పు తీర రైల్వే డి ఆర్ ఎం అనూప్ కుమార్ శతపతి, సిబ్బంది ని స్పీకర్ అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో గల ఆమదాలవలస రైల్వేస్టేషన్ పురాతనమైందని, అటువంటి రైల్వేస్టేషనుకు మహర్ధశ పట్టేలా సంబంధిత శాఖ అధికారులు సేవలను విస్తరించేలా చొరవ చూపడం అభినందనీయమన్నారు.ఆమదాలవలస రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకుందని, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలనేది దశాబ్ద కాలంగా ఈ ప్రాంత ప్రజానీకం యొక్క ఆరాటం అన్నారు.20 గ్రామాల ప్రజానికం రైల్వే రోడ్డుకు ఇరువైపులా రాకపోకలను సాగిస్తున్నారన్నారు.శిథిలావస్థకు చేరుకున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్థానములో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి తాను ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న సమయంలో రైల్వే ఉన్నతాధికారులతో ప్రాతినిధ్యం చేశానన్నారు.ఇందుకోసం ప్రత్యక్ష పోరాటాలు కూడా తన ఆధ్వర్యంలో నిర్వహించిన  విషయాన్ని స్పీకర్ గుర్తు చేశారు.ఈ ప్రాంత ప్రయాణికుల మెరుగైన సౌకర్యాల కోసం పోరాటానికి కూడా వెనుకాడని విషయాన్ని,అప్పటి సంఘటనలను స్పీకర్ గుర్తు చేశారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత,  స్పీకర్ గా తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం దీనికోసం పలు మార్లు రైల్వే ఉన్నత అధికారులతో ప్రాతినిధ్యం చేయడం జరిగిందన్నారు.

ఈ విషయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించిన సహకారం మరువలేనిదన్నారు. దీని నిర్మాణం కోసం సంవత్సరాల తరబడిగా, పట్టువదలని పోరాటం, ప్రాతినిధ్యం ల మూలంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సాకారం  అయిందన్నారు. రైల్వే ఉన్నత అధికారులతో తాను చేసిన ప్రాతినిధ్యం మూలంగా,  విశాఖపట్నం- పలాస డి ఎo యు పాసింజర్  జూలై 1 నుండి పట్టాలెక్కనుందన్నారు.ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో 14 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లకు త్వరలో హల్ట్ సౌకర్యం కలగనుందని తెలిపారు.ఇందుకు తూర్పుతీర ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు స్పీకర్ తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పొందూరు సమీపంలో   ఊసవానిపేట వద్ద రూ.42 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి తూర్పు తీర రైల్వే ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఆర్.ఓ.బి ఏర్పాటు కానుందని అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,ఇతర అధికారులు దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తిచేసినట్లు ఆయన చెప్పారు.ఆమదాలవలస రోడ్ అండర్ టన్నెల్ లో నీటి నిల్వ సమస్య ఉందని, నీరు నిలిచిపోవడంతో కొన్నిసమయాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు..ఆధునిక పరికరాల సహాయంతో వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూస్తామని, డి ఆర్ ఎం స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఈ దిశగా పనులు కూడా ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, జె కె వెంకబాబు,గురుగుబెల్లి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూసుమంచి శ్యాం ప్రసాద్, శిల్లా మళ్ళీ,బొడ్డేపల్లి రవి కుమార్, బొడ్డేపల్లి నారాయణ రావు తదితర వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Amadalavalasa

2022-05-30 10:04:19

విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్

ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథాలుగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.. ప్రభుత్వ జనరంజక పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమదాలవలస బ్రిడ్జి డౌన్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అయన పూలమాలవేసి  కేక్ కట్ చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాతూ మూడేళ్లలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.వృద్ధులకు పింఛన్లు, పేదలకు రేషన్ మొదలుకుని అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని పునరుద్ఘాటించారు.కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. యువతకు ఉపాధి కల్పన, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, జగనన్న విద్యా దీవెన, విద్యాకానుక, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, అగ్రకులాల్లోని పేదలకు ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవటంతో పాటు విమానాశ్రయాలు,నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి.. అంతే స్థాయిలో సంక్షేమాన్ని అందించటమే సీఎం  ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారన్నారు. ప్రజల్లో తన స్థానాన్ని మరింత పదిల పరుచుకొని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా  ఎంతో నిబ్బరంగా పాలన సాగిస్తున్నారన్నారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలు అమలు పరుస్తూ...మూడేళ్లుగా ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.నేను విన్నాను... నేను ఉన్నాను..అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తానంటూ ఇచ్చిన భరోసా అనుగుణంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు   చేశారన్నారు. మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామల రావు, దుంపల చిరంజీవి, గురుగుబెల్లి శ్రీనివాసరావు, మామిడి ప్రభాకర్,కూసుమంచి శ్యాం ప్రసాద్, పొన్నాడ చిన్నారావు, తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-05-30 09:51:47

Tirumala

2022-05-25 14:27:37

పరిశుభ్రత ప్రతీఒక్కరి బాధ్యతగా భావించాలి

ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ పరిశుభ్రత తమదిగా భావించాలని  జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లిఖార్జున పేర్కొన్నారు. మంగళవారం ఉదయం  ఆనందపురం మండలం ఆనందపురం గ్రామంలో  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీని చూడచక్కని గ్రామ పంచాయతీగా మార్చుట కొరకు ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం swpc షెడ్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజలకు చెత్తను వేరు చేసి   ఎరువులను మరియు ఆదాయం ను సమకూర్చుట గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి రెండు బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఆకు పచ్చ తడి చెత్తకు, నీలం పొడి చెత్తకు ఉపయోగించాలి అని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను పునః వినియోగ కేంద్రాలకు తరలించి గ్రామమును ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి అన్నారు.తడి చెత్తను హరిత రాయబారులు ద్వారా ఆరోగ్య కరమైన సేంద్రియ ఎరువులను తయారు చేయాలన్నారు. కొంత నిర్ణీత సమయాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా వ్యాపార కూడళ్లు నుండి అధికంగా చెత్త వస్తుందని, తగు ప్రణాళికలు తో సంపద కేంద్రాలకు తరలించాలి అన్నారు. వ్యర్ధాలు పేరుకుంటే రక రకాల వ్యాధులకు గురికావలసి వస్తుందని తెలిపారు. 

ఈ విషయాలపై విద్యార్థులకు, మహిళలకు తరచుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్ని అడిగి వివిధ పారిశుధ్య సమస్యలను పరిశీలించి దాని పరిష్కారం ప్రణాళికను తయారు చేయుటకు మార్గనిర్దేశం చేశారు. గ్రామంలో అవసరమైన సామగ్రి , సిబ్బంది వివరాలు సచివాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎప్పటి కప్పుడు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. కాలువల నిర్మాణాలకు ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. తరువాత మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణ కుమారి, ఎంపీపీ మజ్జి శారద ప్రియాంక, జడ్పిటిసి కొరాడ వెంకట్రావు , సర్పంచ్ చందక లక్ష్మి , ఎంపీడీవో, తాసిల్దార్ ,మరియు మండల పంచాయతీ కి చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Anandapuram

2022-05-24 14:31:02

ఇళ్ళు నిర్మించండి..గృహ ప్రవేశం చేయండి

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేయాలని సీతంపేట ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. నవ్య పిలుపునిచ్చారు. పాలకొండ పట్టణ లబ్ధిదారులతో మంగళ వారం రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో అవగాహన సదస్సును ప్రాజెక్టు అధికారి నిర్వహించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ పేదలు అందరికీ సొంత ఇళ్లు ఉండాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. ఈ మేరకు పాలకొండ పట్టణంలో అర్హులకు లుంబూరు లే అవుట్ లో గృహాలు మంజూరు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. బిల్లుల సమస్య లేదని, లే అవుట్ లో నిర్మాణాలకు అవసరమగు సామగ్రి అందుబాటులో ఉంచడంతోపాటు విద్యుత్, నీరు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాలకు అనుకూలమైన వాతావరణం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తూ మంజూరు చేసిందని ఒక్కో స్థలం, గృహం కనీసం రూ.25 లక్షలు విలువ చేస్తుందని అన్నారు. సొంత ఇళ్ళు కలిగి ఉండటం కల అని దానిని సాకారం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 13:55:37

సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న సీఎం

సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సీతానగరం మండలం వెంకటాపురం గ్రామ సచివాలయం పరిధిలో గల చెళ్ళంనాయుడు వలస గ్రామంలో మంగళ వారం శాసన సభ్యులు అలజంగి జోగారావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించారు. ప్రజా సంక్షేమమే పరమావదిగా, గ్రామాల అభివృద్దియే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.  ప్రజాబాట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల ఆశీర్వాదము పొందుతుందని ఆయన అన్నారు. ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వం అందించిన పథకాలు తద్వారా కుటుంబాలు పొందిన లబ్దిని వివరించారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని వాటిని సకాలంలో పరిష్కారం చేస్తామని చెప్పారు. పేదల సంక్షేమం కోసమే నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పేదలు అందరికీ ఇళ్ళు, అరోగ్య శ్రీ, విద్యా, వైద్య తదితర అన్ని రంగాల్లో పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

Seethanagaram

2022-05-24 12:08:44

బస్సుయాత్రను విజయవంతం చేయాలి

నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో తిరుగుతూ, క్షేత్ర స్థాయిలో ప‌థ‌కాల అమ‌లు తీరు తెన్నులు తెలుసుకుంటూ కార్య‌క‌ర్త‌లు విప‌క్షాల విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని, ఎమ్మెల్యే కంబాల జోగులు  పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజంలోని పార్టీ కార్యాలయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బస్సుయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించి అర్హులైన వారిని గుర్తించే బాధ్య‌త వ‌లంటీర్ల‌దేన‌ని తెలిపారు. ఈ నెల 26 న నిర్వ‌హించే - బ‌స్సు యాత్ర‌కు సంబందించి విజయనగరంలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు భారీగా త‌ర‌లి రావాల‌ని ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ప‌థ‌కాల అమ‌లు అన్న‌ది ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటోంద‌ని అన్నారు. ఎవ్వ‌రికీ ఏ లోటూ లేకుండా అవినీతికి తావే లేకుండా నేరుగా ల‌బ్ధిదారుల అకౌంట్ల‌లోకే న‌గ‌దు జ‌మ చేసి, సంబంధిత ఆర్థిక ల‌బ్ధి ద‌క్కేందుకు కృషి చేస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ వారి అర్హ‌తను అనుస‌రించి ఒక్కో ప‌థ‌కం అందుతుంద‌ని, అంద‌రికీ అన్ని ప‌థ‌కాలూ వ‌ర్తించ‌వ‌ని, దీనిని అర్థం అయ్యే విధంగా వ‌లంటీరు చెప్పాలి అని, అదేవిధంగా వీధిలో ఉండే కార్య‌క‌ర్త కూడా వివ‌రించాల‌ని కోరారు. ఒక్కో కుటుంబానికి ల‌క్ష‌న్న‌ర నుంచి మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ ల‌బ్ధి చేకూరింద‌ని, అస‌లీ ఆర్థిక ప్ర‌యోజ‌నం అన్న‌ది వాళ్ల‌కు అంద‌కుంటే ఇవాళ పేద కుటుంబాలు ఇంత హాయిగా ఉండేవా? అందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రాధాన్యం ఇస్తూ, మీ మ‌ద్ద‌తు ఇవ్వండి అని నాలుగు మండలాలు  ఎంపీపీలు, జెడ్పీటీసీలు ముఖ్య నాయకులును కోరారు. క‌రోనా కాలంలోనూ ఇదే విధంగా పూర్తి బాధ్య‌త‌తో, ప్ర‌జ‌ల‌కు ఆక‌లి ద‌ప్పిక‌ల‌న్న‌వి లేకుండా చూసిన ప్ర‌భుత్వం ఇదేన‌న్న విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని విన్న‌వించారు. అదేవిధంగా ఆ రోజు బాబు చేసిన త‌ప్పిదాల‌నూ ప్ర‌స్తావించారు. స‌మ స‌మాజ స్థాప‌నే ధ్యేయంగా ప‌నిచేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Razam

2022-05-24 11:59:10

సమయానికి స్ప్రేయింగ్ పూర్తిచేయాలి..

షెడ్యూల్ ప్రకారం స్ప్రేయింగ్ జరగాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్ అన్నారు. పార్వతీపురం మండలం ములగ, మక్కువ మండలం మక్కువ గ్రామ సచివాలయాలను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మంగళ వారం తనిఖీ చేశారు. ఈ సేవ రిజిస్టర్లను, ఓటీస్ -  జగనన్న పేదలకు ఇళ్ళు స్కీం, సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.   ఆన్‌లైన్‌లో హాజరు నమోదును తనిఖీ చేసారు. పార్వతీపురం మండలం పిండిలోవ, వెలగవలస గ్రామాలను, మక్కువ మండలాన్ని సందర్శించి మలేరియా సోకకుండా స్ప్రేయింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందో లేదో పరిశీలించారు.  ఆశ వర్కర్ తోరియాతో మాట్లాడి స్వయంగా  తెలుసుకున్నారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Makkuva

2022-05-24 11:49:55

మే27 నుంచి సామాజిక న్యాయభేరి యాత్ర

సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర  రాష్ట్రంలో ఈనెల 26 నుంచి 29వరకు నిర్వహిస్తు న్నామని, మే 27 న రాజమహేంద్రవరం కు రానున్నదనని  జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర వెనుకబడిన సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ తెలిపారు. స్థానిక మున్సిపల్ స్టేడియం ఆవరణలో మే 27న తలపెట్టిన సామాజిక  భేరీ ఏర్పాట్లను శాసన సభ్యులు జక్కంపూడి రాజా తో కలిసి  మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర ప్రజల ట్రాఫిక్ సమస్యకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజమహేంద్రవరంలో సామాజిక న్యాయం  సదస్సు 25 వేల మందితో నిర్వహిస్తున్నామన్నారు. కోనసీమ, కాకినాడ,  రాజమహేంద్రవరం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు బస్సు యాత్ర ద్వారా ఈ సదస్సు కి  చేరుకుంటున్నారని తెలిపారు. ఈ యాత్ర  మే 29వ తేది అనంతపురం లో ముగియనున్నదని తెలిపారు.  రాష్ట్రంలో ఈ బస్సు యాత్ర విజయవంతం చేయడానికి నాలుగు చోట్ల పబ్లిక్ మీటింగ్స్ జరుగనున్నాయన్నారు.   సామాజిక న్యాయాన్ని సామాజికంగా  ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలు ఆర్థికంగా అన్నివిధాల అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రాన్ని సుధీర్ఘ కాలం పాలించిన పాలకులు  ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలను అణిచివేశరని వారిని ఓటు బ్యాంక్ గా మాత్రమే తప్ప రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేశారని తెలిపారు. బీసీ లు అంటే బ్యాక్ బోన్ అని గుర్తించిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ట్రాఫిక్ డిఎస్పీ లు కేవీఎన్ వరప్రసాద్, సంతోష్, సౌత్ జోన్ డిఎస్పీ ఎం.శ్రీలత,ట్రాఫిక్ సిఐ ఐ. రమణి తదితరులు ఉన్నారు.

Rajahmundry

2022-05-24 11:47:48

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమ్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు అన్నారు. గుమ్మలక్ష్మిపురం మండలం నీలకంఠాపురం, మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మంగళ వారం తనిఖీ చేశారు. ఏఎన్ఎంలు, సి.హెచ్.సిలతో మాట్లాడారు.  అకాల వర్షాలు కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలుతాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంటువ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, అతిసార వంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డే విధిగా పాటించాలని దీనిపై ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. మలేరియా ఎక్కడా ప్రభల కుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. స్ప్రేయింగ్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని మండల అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు తనిఖీలు నిర్వహించాలని, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి కాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగే విధంగా అలవాటును పెంపొందించాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య చిట్కాలు తెలియజేయాలని ఆయన చెప్పారు. చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. అంటు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు ఉండాలని, ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలి ఆయన ఆదేశించారు. కోవిడ్ వాక్సిన్ వేయించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన ఉండాలని, మంచి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.

గుమ్మ లక్ష్మీపురం

2022-05-24 11:37:58

పచ్చిరొట్ట ఎరువుపట్ల అవగాహన పెంచాలి

ప్రకృతి సిద్ధంగా లభించే పచ్చిరొట్ట ఎరువులు పట్ల రైతులకు పూర్తి అవగాహన కలిగించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఆమె వెంకుపాలెం తగరం పూడి గ్రామాల రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. అక్కడ వివిధ అంశాలపై రైతులకు ఇచ్చే శిక్షణ సలహాల గురించి అడిగి తెలుసుకున్నారు.  రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులైన పచ్చిరొట్ట ఎరువుల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి అన్నారు. అన్ని రకాల పచ్చిరొట్ట విత్తనాలు 50 శాతం రాయితీ పై అన్ని రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తున్నాయి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు.  తగరంపూడి రైతు భరోసా కేంద్రంలో మహిళ పాడి రైతులను కలసి పాలవెల్లువ కార్యక్రమం ఎలా ఉందని  అడిగి తెలుసుకున్నారు.  మహిళ సహకార డైరీ ద్వారా పాలకు ఎక్కువ ధర లభిస్తుందని వారు చెప్పారు.  ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి లీలావతి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎం.శ్రీలత, జిల్లా సహకార అధికారి కిరణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Venkupalem

2022-05-24 11:20:21

పేదలకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం

పేదలకు అండగా ప్రభుత్వం ఉందని పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ గ్రామ సచివాలయం పరిధిలోని పాలవలస గ్రామంలో గడప గడపకు - మన ప్రభుత్వం కార్యక్రమంలో పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి గురు వారం పాల్గొన్నారు. శాసన సభ్యులు గడప గడప కు వెళ్లి ప్రభుత్వం మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు  ప్రభుత్వం వచ్చాక కలిగిన మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలవలస గ్రామానికి రచ్చబండ కావాలని ప్రజలు విజ్ఞప్తి చేయగా లక్ష రూపాయల అంచనా విలువతో రచ్చబండను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, అనధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

Bhamini

2022-05-19 13:09:08

నిరు పేదల పాలిట వరం నవరత్నాలు

పేదల పాలిట  నవరత్నాలు వరం అని పార్వతీపురం  శాసన సభ్యులు అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నూకలవాడ గ్రామంలో గురు వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను వివరించారు. లబ్దిదారులకు అందిన ప్రయోజనాలను తెలుసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నూకలవాడ గ్రామానికి చెందిన ప్రధాన రహదారి నిర్మాణానికి దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలు ఆశయం నెరవేరబోతుంది. శాసన సభ్యులు అలజంగి జోగారావు ఇటీవల గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండు వారాలు వ్యవధిలో బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేయుటకు అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే రహదారికి మట్టి, గ్రావెల్ లెవెలింగ్ తదితర పనులు సాగుతున్నాయని శాసన సభ్యులు తెలిపారు. గురు వారం గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన శాసన సభ్యులు నిర్మాణ పనులు, కంకర్ లెవలింగ్ పరిశీలించారు. రోడ్ లెవెల్ చేసిన అనంతరం గ్రావెల్ వేసి రోలరింగ్ చేయాలని సూచించారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ రవికుమార్, సర్పంచ్, ఎంపీటీసీ, మండల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Balijipeta

2022-05-19 13:07:17

' దిశ యాప్' భారత దేశానికే దిక్సూచి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకువచ్చిన దిశ యాప్ భారత దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఆమోదం పొంది చట్టంగా మారనుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) పేర్కొన్నారు. పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉండాలని భావించే స్థితికి మిగతా రాష్ట్రాలు వస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని మహిళలకు ప్రమాదాలు జరిగిన తర్వాత రక్షణ శాఖ అప్రమత్తం కావడం కంటే అసలు ప్రమాదాలు జరుగక ముందే అప్రమత్తమై రక్షణ కల్పించాలనే లక్ష్యంతో  రూపొందించిన 'దిశ' అనువర్తనంపై అవగాహన, భారీ నమోదు ప్రత్యేక ఏకైక కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపం రోడ్ఠు కూడలిలో ఓ ప్రైవేట్ స్థలంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్వహించారు. దిశ అనువర్తనం వినియోగం, ఉపయోగం గురించి యువతులు, మహిళలకు అవగాహన కల్పించే ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా రాజా మాట్లాడారు.

మహిళల ఆండ్రాయిడ్ ఫోన్లలో దిశ అనువర్తనం ఉంటే అక్క చెల్లమ్మలు అందరికీ జగనన్న తోడున్నట్టేనని  మిగతా మహిళలకు అవగాహన కల్పించమని ఆయన సభికులకు పిలుపు నిచ్చారు. ఈ రాష్ట్ర మహిళలు అందరూ జగనన్నకు అండగా ఉండడానికీ, జగనన్న అండ తీసుకోడానికి ఈ రాష్ట్రంలోని మహిళలు అందరూ సంసిద్దంగా ఉన్నారనీ, ఈ విషయంలో ఏ సంకోచం వద్దని, గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్ళి వారి మనస్సును, వారి శ్రద్దను తాను తెలుసుకున్నానని, దిశ అనువర్తనం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరా పాటు జగనన్నే గుర్తుకు వస్తారని  రాజా వివరించారు. రాష్ట్రంలో మహిళలు అందరికీ సమాన భాగస్వామ్యం జగన్ కల్పిస్తున్నారని, చిత్తశుద్ది ఉంటే సాధించి చూపించొచ్చని జగన్ నిరూపించారు అన్నారు. దిశ చట్టాన్ని రూపొందించడమే గాకుండా దాని ఆమోదానికి కేంద్రప్రుత్వానికి పంపి ఊరుకోకుండా దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్నీ జగన్ ఏర్పాటు చేసారనీ ఆయన పేర్కొన్నారు. 

ఏ దేశంలోనైనా మహిళలకు అన్నీ ఉన్నా ముఖ్యంగా శాంతి, భధ్రత ఉండాలని, ఇవి లేకుంటే బ్రతుకును ఈదలేమని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించే సమాజం ఎప్పుడూ వృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రధమ స్థానాన్ని ఇచ్చిన జగన్ వారి రక్షణకు దిశ చట్టాన్ని ప్రవేశ పెట్టారని, రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ చట్టం లోపాలను సవరించిందని, దీనిని ఆమోదానికి రాష్ట్ర మహిళా కమీషన్ కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని, దీని ఆమోదానికి పార్లమెంటులో తలలు పట్టుకుంటూ ఉన్నారని, దీనిపై మేధోమధనం జరుగుతోందనీ, ఇది ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉందని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఈ దిశ చట్టం ఆమోదం పొందుతుందని ఆమె తన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసారు. తల్లి, తండ్రులు పిల్లలతో స్నేహ పూర్వకంగా ఉండాలని, అరమరికలు లేకుండా ప్రతీ విషయాన్ని పరస్పరం పంచుకుంటూ ఒకరికొకరు సహకారిగా ఉంటూ ప్రమాదాలను నివారించుకోవాలని హితవు చెబుతూ ముఖయమంత్రి జగన్ కు మహిళల ఆదరణ, ఆశీస్సులూ ఎప్పుడూ ఉండాలని ఆమె కోరారు. 

ప్రభుత్వం కాపాడుతున్నప్పటికీ, చట్టం రక్షిస్తున్నప్పటికీ సమాజంలో మహిళలు ఏదో రూపంలో విపత్కర పరిస్థితులకు, అనుకోని ప్రమాదాలకు, ఇబ్బందులకు  గురవుతూనే ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో నిమిషాల వ్యవధిలోనే పోలీసుల రక్షణ, సహాయం పొందడానికి దిశ అనువర్తనం ఉపయోగపడుతుందని మరో అతిధి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఒంటరి ప్రయాణాల్లో మహిళలకే గాక పురుషులకు కూడా మన పక్కనే పోలీసులు, పోలీస్ స్టేషన్ ఉన్నట్టు దిశ రక్షణగా ఉంటుదని ఆయన పేర్కొన్నారు. మీ రక్షణ, భద్రత కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపొందించిన దిశ అనువర్తనం వినియోగంపై అపోహలను తొలగించు కోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ పిలుపు నిచ్చారు. 

సమాజంలో ఇంకా మార్పు రావాలని, పరుషులు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని, అప్పడు మహిళలకు ఇబ్బందులు తగ్గుతాయని జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం మహిళలపై జరిగే నేరాల విచారణ, రక్షణ కోసం మొత్తం 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి, మహిళా సిబ్బందిని నియమించామని ఆమె  తెలిపారు. అంతే గాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సాధారాణ పోలీస్ స్టేషన్లలోనూ మహిళల అవసరం కోసం మహిళా సహాయక కేంద్రాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసామన్నారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగుకు ద్విచక్ర వాహనాలను, దిశ కేసులో తక్షణం రక్షణ ఇవ్వాలి కాబట్టి ప్రత్యేక వాహనాలను కేటాయించా మన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఐదారు ప్రభుత్వ శాఖలు కలసి సమన్వయంతో దిశ పోలీస్టేషన్లలో పని చేస్తున్నారని, ఆపదలో ఉన్న మహిళలకు పోలీస్ స్టేషన్లలో, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వన్ స్టాప్ కేంద్రాల్లో తక్షణ సహాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వన్ స్టాప్ కేంద్రాలు సరిగా పని చేయడం లేదని, మన రాష్ట్రంలో మహిళల సమస్యలు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ఇంత బాగా పని చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా ఫోక్సో చట్టం ద్వారా సేవలందు తున్నాయని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహ మిస్తోందని, వారి సంక్షేమం కోసం అనేక పధకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, మహిళల చేతికి డబ్బు ఇస్తే మొత్తం కుటుంబానికి మేలు జరుగు తుందనే పధకాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ కృతికాశుక్లా వివిరించారు. కలెక్టర్ అనంతరం మాట్లాడిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు దాదాపుగా కలెక్టర్ చెప్పిన విషయాలనే ప్రస్తావించారు.  అతిధులుగా కాకినాడ జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీ పి.శ్రీనివాస్, పెద్దాపురం ఎస్డీపీఓ అదనపు ఎస్పీ. అరిటాకుల శ్రీనివాసరావు, కాకినాడ దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ సుంకర మురళీ మోహన్, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. 10.43 గంటలకు సంగీత నృత్య విద్యా సంస్థ బాలికా చిన్నారుల "స్వాగతం... స్వాగతం... గాన నృత్యంతో సభకు ఆహ్వనం పలుకగా కత్తిపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినుల వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమై, జాతీయ గీతాలాపన లేకుండా ముగిసిన ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు సీఐ కే.కిషోర్ బాబు, శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు, వైస్ ఎంపీపీ దారా వెంకటరణ, శంఖవరం మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, మండల పరిషత్తు అభివృద్ధి అధికారి జాగారపు రాంబాబు, 
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు,  వివిధ ప్రభుత్వ శాఖల అధికారులూ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Annavaram

2022-05-18 17:55:29

కళాంజలి, జి.శిరీషలకు దిశ అవార్డులు

కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో ప్రజల ద్వారా అత్యధికంగా దిశ యాప్ ఇనిస్టాల్స్ చేయించిన గ్రామసచివాలయ మహిళా పోలీసులు  పిఎస్ఎస్.కళాంజలి, జిఎన్ఎస్.శిరీషలకు అవార్డులు లభించాయి. అన్నవరం వన్ హోటల్ లో జిల్లా కలెక్టర్ క్రుతికా శుక్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు లతోపాటు పోలీసులు పాల్గొన్న ప్రత్యేక దిశ కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టిరాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్వణచంద్రప్రసాద్ లు ఈ అవార్డులను అందజేశారు. జిల్లాలో శంఖవరం, అన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో దిశయాప్ లు రిజిస్ట్రేషన్లు చేయించడంలో వీరిద్దరు ప్రత్యేకంగా ప్రతిభను కబరిచారు. వీరికి అవార్డులు రావడం పట్ల సహచర మహిళా పోలీసులు నాగమణి, గంగగౌతమి, రజియాసుల్తానా, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామసచివాలయాలకు చెందిన మహిళా పోలీసులు, అన్నవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2022-05-18 15:19:18