1 ENS Live Breaking News

ప్రైవేటులోను యాప్స్ ఉచ్చులో పడకండి

అనుకున్నదే తడవుగా రుణం లభించి క్షణాల్లో, ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో అవసరం లేకపోయినా జల్సాలకు గాను పలువురు యువకులు లోను యాప్  ద్వారా రుణం పొంది అప్పుల పాలవుతున్నారని  న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని శేషాద్రి నగర్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సెల్ ఫోను ద్వారా రుణం కావాలా అంటూ అడగడంతో వాటి నియమ నిబంధనలు పరిశీలించకుండా ఆధార్,  బ్యాంకు ఖాతా,  పాన్ కార్డు నెంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని  యాప్ ల నిర్వాహకులకు ఇస్తున్నారన్నారు. రుణం సకాలంలో చెల్లించకపోతే ఇష్టం వచ్చినట్లు వడ్డీలు, పెనాల్టీలు వేసి పెద్ద మొత్తాన్ని గుంజుతున్నారని అన్నారు. డబ్బులు చెల్లించక పలువురు యువకులు మానసికంగా వేదనకు గురవుతున్నారని అన్నారు. అత్యవసరమైతే తప్ప లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకోరాదని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-07 08:18:39

మహిళలకు దిశయాప్ తో స్వీయ భద్రత

మహిళలు తాము వినియోగించే ఆండ్రాయిడ్ ఫోన్లలో దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా స్వీయ భద్రత పొందవచ్చునని శంఖవరం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-1 మహిళా పోలీస్ జి.ఎన్ఎస్.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఆపదలో వున్నవారిని రక్షించేందుకు తీసుకువచ్చిన దిశయాప్ ను ఆడ, మగ తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ తమ ఫోన్ లలో ఇనిస్టాల్ చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా కళాశాలకు వెళ్లే విద్యార్ధినిలు, విధి నిర్వహణలో నిత్యం ప్రయాణాలు చేసే మహిళా ఉద్యోగినిలు, గ్రుహిణిలు ఈ దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా అత్యవసర సమయంలో పోలీసుశాఖ ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. ఆపదలో వున్న సమయంలో ఎస్.ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు ఫోన్ వెళుతుందని..వెంటనే పోలీసులు అప్రమత్తమై తిరిగి వెంటనే ఫోన్ చేసి విషయం తెలుసుకోవడంతోపాటు, రక్షణ కల్పిస్తారని అన్నారు. మహిళలకు రక్షణ కవచంగా వుండే ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఎంతో రక్షణగా వుంటుందన్నారు. అదేవిధంగా యువత కూడా దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి, పోలీసుల సహాయంతో కాపాడటానికి ఆస్కారం వుంటుందని తెలియజేశారు. ప్రతీ ఒక్కరూ దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకి రావాలని మహిళా పోలీస్ జి.ఎన్ఎస్.శిరీష మీడియా ద్వారా ప్రజలకు సూచించారు.

Sankhavaram

2022-07-06 16:31:43

శంఖవరం వ్యవసాయాధికారిగా పి.గాంధీ

శంఖవరం మండల వ్యవసాయాధికారిగా పడాల గాంధీ నియమితులయ్యారు. ఇటీవల అధికారుల బదిలీల్లో భాగంగా రైతులపూడి మండలంలో వ్యవసాయాధికారిగా పనిచేసే ఈయనను శంఖవరం మండల వ్యవసాయాధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు మర్యాదపూర్వకంగా వెళ్లి కలుసుకుని పరిచియాలు చేసుకున్నారు. ఎవరెవరు ఏ గ్రామ సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నారో నూతన వ్యవసాయాధికారికి వివరించారు. అనంతరం వ్యవసాయాధికారి మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయ పరంగా, సాగు పరంగా అందుబాటులో వుంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే దిశగా చిత్తశుద్దితో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో విఏఏలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-07-06 15:27:04

వ్యాధుల సోకకుండా జాగ్రత్త వహించాలి

పాడి పశువులు, పశుపక్షాదులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మనోజ్ కుమార్ రైతులకు సూచించారు. బుధవారం జునోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు ఫ్రీ  వ్యాక్సిన్ కార్యక్రమం మండల కేంద్రమైన శంఖవరం పశువుల ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,  పాడి పశువులకు పశుపక్షాదుల పట్ల ఎంతో మెలకువగా ఉండాలన్నారు. వాటికి వచ్చే జబ్బులకు వారి యజమానులకు తగు సలహాలు అందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎల్లప్పుడూ గ్రామీణ పశుసంవర్ధక సహాయకులు అందుబాటులో ఉంటారని, వారి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో రౌతులపూడి డాక్టర్  ఎం.వీరరాఘవ, హాస్పటల్ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-07-06 15:18:27

వర్మీ కంపోస్టుతో ఆదాయం పెంచాలి

వర్మీ కంపోస్ట్ కేంద్రాలను ఆదాయ వనరుగా మరింత అభివృద్ధి చేయడం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కొవ్వూరు మండలం ఐ.పంగిడి లో ఎస్ డబ్ల్యు పి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత కేంద్రంలో ఉన్న సిబ్బందితో ముఖాముఖి సంభాషించడం జరిగింది. ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి అవుతున్న వర్మి కంపోస్ట్, తదుపరి ఆ మొత్తం మార్కెటింగ్ చేసే విధానం పై వివరాలు అడిగారు. ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు వంటి వివరాలు అడగడం జరిగింది. అనంతరం అధికారులకు సూచనలు చేస్తూ  ఘనవ్యర్ధల సంపద సృష్టి కేంద్రాలను మంచి ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడం పై దృష్టి సారించాలన్నారు. అంతే కాకుండా వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవ్వూరు మునిసిపాలిటీ  ప్రాంతంలో ఇటీవల డంపింగ్ తొలగించిన ప్రాంతంలో  కూడా ఎస్ డబ్ల్యు పి కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

అన్ని గ్రామాలలో పరిశుభ్రత పాటించడం లో భాగంగా  సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ల (SWPC) ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని కలెక్టర్ మాధవీలత తెలిపారు.ప్రతి ఒక్క పౌరుడు తన సామాజిక బాధ్యతగా   తడి చెత్త, పొడి చెత్త ఇంటింటికీ చెత్త సేకరణ కోసం వొచ్చే వారికి అందించాలన్నారు. అందువల్ల సులువుగా  తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం సాధ్యం అవుతుందన్నారు. రెండు రకాలు కలపడం వల్ల తిరిగి చెత్తను విడదీసి చెయ్యాల్సి ఉంటుందని , ఇది ఎంతో శ్రమతో కూడి, మానవ వనరుల వృధా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీ చెత్త సేకరణ రిక్షలను దశల వారీగా పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్ది జిల్లాను ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు. తొలుత వర్మి కంపోస్ట్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ మహాత్మా గాంధీ విగ్రహానికి  పూల మాల వేసి నివళులర్పించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డ్వామా పీడీ పి. జగదాంబ, సర్పంచ్ గోసాల నాగార్జున, సిబ్బంది పాల్గొన్నారు. 

Pangidi

2022-07-05 12:38:53

హౌసింగ్ లక్ష్యాలు మరింత పెంచాలి

శ్రీకాకుళం జిల్లాలో వారంలో నిర్ణయించిన లక్ష్యాలు మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు.   మంగళవారం గృహ నిర్మాణాల పురోగతి పై ఇఇ, డిఇ, ఎఇ లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న నవరత్నాలలో భాగంగా గృహ నిర్మాణాలపై లబ్ధిదారులను అవగాహన పరచి  గృహ నిర్మాణాలు వేగం పెంచాలన్నారు. వారంలో నిర్ణయించిన లక్ష్యాలను అధికమించాలని  ఆదేశించారు. సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సహాయం తీసుకోవాలని చెప్పారు. నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ యన్. గణపతిరావు, ఇఇ, డిఇ, ఎఇలు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-05 12:25:29

7న కొవ్వూరు డిగ్రీకాలేజీలో జాబ్ మేళా

ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కొవ్వూరు  ప్రాంగణంలో వికాస అధ్వర్యంలో 300 ఉద్యోగాల భర్తీకి గాను జూలై 7 జాబ్ మేళా ఏర్పాటు చెయ్యడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జే.సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  వికాస, కలెక్టరేట్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో దేశీయంగా ఏడు ప్రఖ్యాత గాయించిన బహుళ జాతియ కంపెనీలు తమ సంస్థలో ఉద్యోగ భర్తీ కోసం ఇంటర్వ్యూ లను గురువారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 9.00 నుంచి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా  కొగ్నిజెంట్ , ఇసుజు ,ఇండిగో ఏర్లైన్స్ ,హుండై మొబిస్ ,ఎన్‌ఐ‌ఐ‌టి,డెక్కన్ కెమికల్ వంటి బహుళ జాతీయ కంపెనీలు అభ్యర్థులకు  మౌఖిక పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈదిగువ పేర్కొన్న అర్హత గల అభ్య ర్ధులందరు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని  కోరారు.. కంపెనీల విషయానికొస్తే.. 1) కోజెంట్ ఇ సేవలు బి పి వో (Business process outsourcing) పోస్ట్, విద్యార్హత ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ ,ఉండాలి ఖాళీలు 50,  పనిచేయు ప్రదేశం  మంగళూరు , 

2)  ఇసుజు మోటార్స్ లిమిటెడ్,  సాంకేతిక నిపుణుడు పోస్ట్ కు విద్యార్హత   ఐ టి ఐ/ డిగ్రీ (BSC, BCOM, BA) / డిప్లొమా / B.TECH /B.E, ఖాళీలు 50 - పనిచేయు ప్రదేశం శ్రీసిటీ (నెల్లూరు) , 

3) ఇండిగో ఎయిర్‌లైన్స్ లోడర్లు / డ్రైవర్లు 10వ తరగతి , ఇంటర్ (హెవీ డ్రైవింగ్ లైసెన్స్) (2018 పాస్‌పోర్ట్ తప్పనిసరి) ఖాళీలు  50 ఉద్యోగాలు, పనిచేయు ప్రదేశం హైదరాబాద్, 

 4) హ్యుందాయ్ మోబిస్ సాంకేతిక నిపుణుడు డిప్లొమా (EEE, ECE, MECH) (సివిల్ & CSE మినహా), B.TECH (EEE, MECH, ECE) ITI అన్ని ట్రేడ్స్ ఖాళీలు 50, పనిచేయవలసిన ప్రాంతం అనంతపురంలో 

5)  ఎన్ ఐ ఐ టి (ICICI బ్యాంక్) రిలేషన్షిప్ మేనేజర్ / సీనియర్ ఆఫీస్ ఏదైనా డిగ్రీ,(X,XII & గ్రాడ్యుషన్‌లో 55%) ఖాళీలు 50,  పనిచేయు ప్రదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 

 6) డెక్కన్ కెమికల్స్ ట్రైనీ (ఉత్పత్తి) బీస్సి (కెమిస్ట్రీ) ఐటిఐ- ఫిట్టర్/ఎలక్ట్రికల్ - ఖాళీలు 50 ,  పనిచేయవలసిన ప్రాంతం తుని (కేశవరం) లో ఉద్యోగాల నియామకానికి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Kovvur

2022-07-05 12:02:04

విద్యార్ధులకు జీవిత జ్ఞానాన్ని కూడా నేర్పండి

విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో బాటు, జీవిత జ్ఞానాన్ని కూడా పంచాలని, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ చదువుకొనే విధంగా ప్రోత్సహించాలని, ఏ ఒక్క విద్యార్థీ, ఏ కారణం చేతా చదువుకు దూరం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.  బాడంగి జిల్లాపరిషత్ పాటశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ  కార్యక్రమం, సమగ్ర శిక్ష  ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. జిల్లాలోని 1,70,232 మందికి రూ. 33,43,35,648 విలువైన విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు. అంతకు ముందు కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగనోహన రెడ్డి ప్రారంభించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా  ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో బాటు, జీవితానికి సంభందించిన ఇతర అంశాల పట్ల కూడా అవగాహన కల్గించి, అర్థవంతమైన జీవనాన్ని అలవాటు చేయాలని సూచించారు. బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా చదువుకొనేటట్లు చూడాలని కోరారు. వివిధ కారణాలవల్ల మధ్యలో బడి మానేసిన వారి చదువును ఏదో ఒక రూపంలో కొనసాగేలా చూడాలని సూచించారు. కొవిడ్ కారణంగా చదువు దెబ్బతిందని, ప్రాథమిక పాటశాలల విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి, గత పాఠాలను పునచ్చరణ చేయించాల్సిన అవసరం వుందన్నారు.  ఆడపిల్లలు కూడా, చదువును పూర్తి చేసి, ఆర్థికంగా తమ కాళ్ళమీద నిలబడే వరకు వివాహం చేసుకోకూడదని సూచించారు. 

ఇటీవల కాలంలో చదువుకొనే వారి సంఖ్య బాగా పెరిగిందని, ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం అభినందనీయమని అన్నారు. పదోతరగతి విద్యార్థులకు ఇంటర్లో ఉన్న విద్యావకాశాలపై ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. అవసరాన్ని బట్టి ఇంటర్ హెచ్ఈసి, సిఈసి గ్రూపుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని కలెక్టర్ చెప్పారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కేరళ కు ధీటైన విద్యావ్యవస్థను ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాటశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్ళారని కొనియాడారు. ఒక్కో విద్యార్థికి రూ.1964 విలువైన అత్యంత నాణ్యమైన 8 రకాల వస్తువులతో విద్యా కానుకను అందించడం జరుగుతుందని చెప్పారు. త్వరలో 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను ఉచితంగా ట్యాబ్ లను అందజేయనున్నట్లు తెలిపారు.  సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పల నాయుడు మాట్లాడుతూ, విద్య కోసం ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముఖ్యమంత్రి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు వినియోగించుకొని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేజిబివి సెక్రటరీ నాగమణి, డీఈవో డాక్టర్ జయశ్రీ, సమగ్ర శిక్ష ఏపిసి డాక్టర్ స్వామి నాయుడు, జెడ్పీటీసీ పెద్దింటి రామారావు, ఎంపిపి బి. గౌరి, ఎంపీడీఓ బి.అక్కారావు, తాసిల్డార్ బాలమురళి కృష్ణ, ఎంఈఓ జి.కృష్ణమూర్తి, హెచ్ఎం  ఎస్ త్రినాధరావు, సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Badangi

2022-07-05 11:44:57

విద్యుత్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి

ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి పల్లెలోనూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.మంగళవారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఏపీఈపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, డి ఈ,ఏ ఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సీఎం తీసుకున్న పలు సంస్కరణల వలన విద్యుత్ రంగం పురోగతిలో పయనిస్తోందన్నారు.పలుచోట్ల విద్యుత్ కూడా ఆదా అవుతుందన్నారు.. గ్రామాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టడం వలన గణనీయంగా విద్యుత్ ఆదా అవుతుందన్నారు. గత మూడేళ్లుగా విద్యుత్ మీటర్ల సంఖ్య, వినియోగం అంశాలు పరిశీలిస్తే విద్యుత్ రంగం ప్రగతి బాటలో ఉందన్న విషయం తేటతెల్లం అయింది అన్నారు.రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్ డిమాండ్,సప్లై,పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్తులో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు తదితర విషయంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.సెకి  తో ఒప్పందం మూలంగా సుమారు 45 మిలియన్ల యూనిట్ల విద్యుత్ రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులోకి వస్తుందని  స్పీకర్ తమ్మినేని తెలిపారు.హైడ్రో ప్రాజెక్టు అంశంపై కూడా సీఎం దృష్టి సారించారన్నారు.పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు,విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతులన్నారు.రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారన్నారు.ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందన్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో తాను పాల్గొన్నప్పుడు పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యల ప్రజల నుండి వినతులు వచ్చాయన్నారు. వాటిని విద్యుత్ శాఖ అధికారులతో  చర్చించారు.వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో వేలాడుతున్న వైర్లు,మరమ్మతులకు నోచుకోని ట్రాన్స్ఫార్మర్లు,అవసరమైన చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాట్లు, కొన్ని చోట్ల లైన్ మెన్లు కొరత వంటివాటిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ఆమదాలవలస మండలం తాళ్లవలస గ్రామంలో 400kv ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే,వాటి స్థానంలో కొత్త  ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు.ప్రతి గ్రామంలోనూ విద్యుత్ సమస్యలు ఉంటే తక్షణం మరమ్మతులు చేసి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు.రైతులకు కరెంటు సప్లై విషయంలో అంతరాయం కల్పించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాగునీరు అందుబాటులో ఉన్న చోట సోలార్ పంప్ సెట్ లు ద్వారా రైతులకు సాగు పట్ల అవగాహన కల్పించాలని కోరారు. సోలార్ పంపుసెట్ల కొనుగోలు వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆయన కోరారు.

ఉచిత విద్యుత్ బిల్లులను రైతులు ఖాతాల్లోకే జమ చేసి వారి ద్వారానే చెల్లించే ఏర్పాట్లు చేసేలా సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతు ప్రశ్నించగలుగుతారని  అభిప్రాయపడ్డారు. విద్యుత్తు శాఖ కూడా ప్రజలు, రైతులనుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారంపై నిరంతరం ధ్యాస పెట్టాలన్నారు.ఈ మేరకు జిల్లాలో  పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన విషయాన్ని స్పీకర్ గుర్తుచేశారు.ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చిన చోట రైతుల ఖాతాల నుంచి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. సంస్కరణల వల్ల,రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని,రైతులకూ నాణ్యమైన విద్యుత్తు అందుతోందని, ఈ విషయంలో సీఎం ముందు చూపు తో వ్యవహరించారన్నారు.ఇక వైయస్సార్ జలకళను పారదర్శకంగా అమలు చేయాలని స్పీకర్ సూచించారు. మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పామని.., కానీ మోటారు ఉచితంగా ఇస్తున్న మాట వాస్తవం అన్నారు.అనూహ్య డిమాండ్ ఉన్న సమయాల్లోనూ మిగులు విద్యుత్తు ఉండేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ దైవప్రసాద్, డీ ఈ పైడి మహేషేశ్వరారావు, డీ ఈ ఈ డి.రాంబాబు, ఏ ఈ లు  రామారావు,వెంకటప్పలనాయుడు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆముదాల వలస

2022-07-05 11:02:09

కలెక్టరేట్ మహాధర్నా జయప్రదం చేయండి

ప్రజలు సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడం, ప్రజలను సమీకరించడం, సమస్యలు పరిష్కారమయ్యే వరకు కృషి చేసే లక్ష్యంతో ‘జనం కోసం ఇంటింటికి సిపిఎం కార్యక్రమం’చేపట్టిందని, దానికి విశేష స్పంద వచ్చిందని నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు.  ఆదాయాలు తక్కువ, భారాలు ఎక్కువ. బ్రతుకు భారంగా వుంది. మా సమస్యలు పరిష్కారం కావాలి అంటూ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేసారు. ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11 ఉ.10గం.ల.కు కలెక్టరు ఆఫీస్‌ వద్ద మహా ధర్నా జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యల ధరకాస్తులతో పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి రావాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు.
 కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతో ప్రజలపై పెద్ద ఎత్తున పన్నులు, ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రతీ సేవకు యూజర్‌ ఛార్జీల పేరుతో ధరలు భారాలు వేస్తోంది. విద్యుత్‌ను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు.ఈ దుష్ట విధానాలను జగన్‌ ప్రభుత్వం ఎదిరించడం లేదు సరి కదా! అన్ని రాష్ట్రాల కన్నా ముందే మన రాష్ట్రంలో అమలు చేస్తోంది. అధికార పార్టీతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా కేంద్రంతో పోరాడాలన్నారు. మన రాష్ట్రానికి రావల్సిన నిధులు, హక్కులు రాబట్టాలి. కానీ వీరెవ్వరూ కేంద్ర బిజెపిని నిలదీసేందుకు సిద్ధపడడం లేదు. ప్రజల ప్రయోజనాల కన్నా తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బిజెపికి ఇది ఒక వరంగా మారింది. కనుకనే రోజు రోజుకీ ప్రజలపై భారాలు, సమస్యలు తీవ్రమౌతున్నాయి. కష్టాల్లో వున్న ప్రజలకు అండగా నిలిచేందుకు సిపిఎం పార్టీ నిబద్దతతో కృషి చేస్తోందని చెప్పారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా వుంటుందన్నారు. 

Visakhapatnam

2022-07-05 07:56:17

మీ సమస్యలు తీర్చేందుకే నేనొచ్చాను

అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తాను మీ ముందుకి వస్తున్నానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చీడికాడ మండలం శిరిజం గ్రామం, ఎస్సీ కాలనీలో  గారు పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి , అవ్వ తాత, అక్క చెల్లెమ్మలను, యువతను, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం నిరుపేదల పక్షపాతి అని, దానికోసమే నవరత్నాలు ప్రజల ఇంటిముంగిటకే తీసుకు వచ్చిందన్నారు. గ్రామస్థాయిలో సమస్యలు, ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పిందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే సంప్రదించాలని, అపరిష్క్రుతంగా వున్న సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్టు ఆయన వివరంచారు. మంత్రి తిరిపే ప్రతీ చోట ప్రజలు ఆప్యాయంగా పలుకరిస్తూ..హారతులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Madugula

2022-07-05 07:18:40

ఈవిఎం గోదాములను త‌నిఖీచేసిన క‌లెక్ట‌ర్‌

విజయనగరం జిల్లాలోని నెల్లిమ‌ర్ల‌లోని ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి శనివారం త‌నిఖీ చేశారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. సీళ్ల‌ను ప‌రిశీలించారు. సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు.  ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, నెల్లిమర్ల తాశిల్దార్ రమణ రాజు, మున్సిపల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మహేష్,  ఇత‌ర రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ సముద్రపు రామారావు, టిడిపి నాయకుడు స్వామి, సిపిఐ నాయకులు తాలాడ సన్నిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Nellimarla

2022-07-02 10:41:06

గ్రామాల్లో మునగ సాగును ప్రోత్సహించాలి

శ్రీకాకుళంజిల్లాలో మునగ తోటల సాగును ప్రోత్సహించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎం.రోజారాణి  అధికారులను ఆదేశించారు. శనివారం ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించిన ఆమె కూలీలు మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, మునగ తోటలు సాగువలన రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో మునగ తోటలు వేసుకునే వెసులుబాటును ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. రైతులు, ఉపాధి హామీ పథకం కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మునగ తోటల సాగుకు కనీస విస్తీర్ణం 25 సెంట్లు భూమి ఉండాలని ఆమె సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మునగ తోటల పెంపకానికి చర్యలు చేపట్టాలని సిబ్బందిని కోరారు. పని ప్రదేశాల వద్ద మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రతి జాబ్ కార్డుదారుడు పనికి వచ్చేలా చూడడంతో పాటు గరిష్ట వేతనం కూలీలకు అందేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిదేనని ఆమె అన్నారు. పిడి వెంట ఏపీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.

Echherla

2022-07-02 10:40:02

దేవాలయాల్లో మంచినీటి కుళాయిలు

విశాఖ జీవీఎంసీ పరిధిలోని 93వ వార్డు పరిధిలోని పలు దేవాలయాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆవార్డ్ కార్పొరేటర్ రాపర్తి కన్నా తెలిపారు. శుక్రవారం సింహాచలంలోని అప్పన్న సోదరి, శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయం లో తాజాగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ పలు దేవాలయాల్లో మంచినీటి  కొలాయలు  సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు భవిష్యత్తులో విరాట్ నగర్, సాయి మాధవ్ నగర్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వార్డ్ ను పూర్తి స్థాయిలో .అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు , అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అప్పన్న సోదరిగా, పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న ఈ ఆలయాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పీ. వెంకట రావు, బలిరెడ్డి శ్రీనివాస రావు , గ్రామ పెద్దలు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Simhachalam

2022-07-01 16:09:55

ఏఐఐఈఏ 72వ ఆవిర్భావ వేడుకలు

ఆలిండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నర్సీపట్నం బేస్ క్యాంపు ఎల్ఐసీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా జరిగిగాయి. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి కె.కేశవభద్రపడాల్, అధ్యక్షులు విసిహెచ్ఎన్.రాజు ఆధ్వర్యంలో అసోసియేషన్ జండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్యదర్శి పడాల్ మాట్లాడుతూ, ఉద్యోగుల కోసం అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలను, ప్రాధాన్యతను వివరించారు. ప్రతీ ఒక్క సభ్యుడు యూనియన్ అభివ్రుద్ధికి క్రుషిచేయడంతోపాటు, కలిసికట్టుగా పనిచేసి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సంఘం బలోపేతానికి నడుంబిగించి ముందుకు సాగాలన్నారు. ఏఐఐఈఏ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం సభ్యులకు, ఏజెంట్లకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ ఎస్ ధనార్జన్, ఏఏఓ దశధరధరామయ్య, డీఓ శ్రీనివాస శర్మ, ఏజెంట్స్ లీడర్ శ్రీరామ్మూర్తి, ఉద్యోగులు, ఎల్ఐసీ పాలసీ దారులు పాల్గొన్నారు.

Narsipatnam

2022-07-01 11:13:11