శంఖవరం మండల కేంద్రంలోని మూడు గ్రామ సచివాలయాల పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, వన్ టైమ్ సెటిల్ మెంట్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మండల ఉపాధ్యక్షులు దారా వెంకటరమణ సూచించారు. మంగళవారం శంఖవరం గ్రామసచివాలయంలో మూడు సచివాలయాల సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఒటిఎస్ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, రెండు కార్యక్రమాల్లో ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అవసరాలు వచ్చినా తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, సచివాలయ కార్యదర్శిలు శ్రీరామచంద్రమూర్తి,శంకరాచార్యులు, సత్య, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, ఎంపీటీసీ వీరబాబు, పడాల సతీష్, సచివాలయ సిబ్బంది, గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.