ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బిసి ఉద్యోగుల సమస్యలను ఐక్య కార్యాచరణతోనే పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కోసెట్టి అప్పారావులు పేర్కొన్నారు. శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశం చిలుకూరి బృందావన ఎస్టేట్ లో జరిగింది. ఈ సందర్భంగా 2024 డైరీ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ, రాబోయే 3సంవత్సరాలకు రాష్ట్ర, కంపెనీలు, జిల్లా కార్యవర్గాలను ప్రస్తుతం ఉన్నవాటినే కొనసాగించాలని తీర్మనించినట్టు చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రధానంగా ఈపీఎఫ్ టు జిపిఎఫ్ సదుపాయాలను 2004 ఆగస్టు 31 ముందు జాయిన్ అయిన ఉద్యోగులందరికీ అందరికీ కల్పించాలని, ఉద్యోగులకు మెడికల్ సదుపాయం పూర్తిగా కల్పించాలని , డిపార్ట్మెంట్ జారీ చేసిన మెడికల్ క్రెడిట్ కార్డులను అన్ని హాస్పిటల్ వారు తక్షణమే ఆమోదించుటట్టుగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని,
ప్రతినెల జీతాలు ఒకటో తారీఖున ఉద్యోగులకు జమ చేయాలని,పి అర్ సి బకాయిలను ఒప్పందం ప్రకారం వెంటనే విడుదల చేయాలని,జేఎల్ఎం గ్రేడ్ 2 ఎంప్లాయిస్ ను విద్యుత్ సంస్థ ల ఎంప్లాయీస్ లాగా పరిగణించి అన్ని ప్రయోజనాలను కల్పించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్స్ ఉద్యోగుల కు నేరుగా జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన అత్యవసర సెలవులను మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ,విద్యుత్ సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని , కొత్తగా ఏర్పడిన డివిజన్ వలన కొంతమంది ఉద్యోగులు ఒక్క జిల్లా పరిధి నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన వారిని పాత జిల్లాలోని వారి ని కొనసాగించాలనే సమస్యల పరిష్కారం కోసం ఏకవాఖ్య తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ
సనపల వెంకటరావు, కంపెనీ ప్రెసిడెంట్ సాయిబాబా,వర్కింగ్ ప్రెసిడెంట్ కె వి నరసింహారావు, ఐదు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు ప్రతినిధులు, బీసీ సభ్యులు హాజరయ్యారు.