1 ENS Live Breaking News

సూర్యభగవానుడి రథసప్తమి వేడుకలకు సిద్దమైన రాజుపాలెం

అనకాపల్లి మండలంలోని రాజుపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 16న రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లు అన్ని పూర్తిచేసామని ఆలయ చైర్మన్ కొణతాల బాబురావు తెలియజేశారు. శతకంపట్టు కనకదుర్గ అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ సహకారంతో ప్రముఖ బిల్డర్ కాండ్రేగుల నాయుడు రూ.3 లక్షల ఆర్థిక సహకారంతో  శ్రీ సూర్య భగవాన్ క్యూ కాంప్లెక్స్ లు నిర్మించామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మధ్యాహ్నం అన్నదానం, పలు సంస్కృతి కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈనెల 14న ఉదయం ఆలయ అర్చకులు దొడ్డిపట్ల కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో  శ్రీ ఉష పద్మిని చాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందని, సాయంత్రం స్వామి వారికి భక్తులు సహకారంతో సారి ఊరేగింపు జరుగుతుందని వివరించారు.

Anakapalle

2024-02-13 15:44:01

ప్రతీ వివాహం ముందస్తు నమోదు జరిగేలా సహకరించాలి

బాల్య వివాహాలు నిర్మూలనకు రాష్ట్రంలో జరిగే ప్రతీ వివాహానికి సంభందించిన వివరాలు ముందస్తుగా నమోదు జరిగేందుకు అధికారులు సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సిపిసిఆర్) చైర్ పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సిఫారసులు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు.అనకాపల్లి జిల్లా స్త్రీ,శిశు  సంక్షేమ శాఖ ప్రోజెక్ట్ డైరెక్టర్ అనంత లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  జిల్లా చైల్డ్ వెల్ఫేర్ పోలీసు అధికారులు,పోలీసు స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు బాల్య వివాహాలు నిలుపుద లలో పోలీసుల పాత్ర,ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ బాలల సంక్షేమ కార్యక్రమాలు,చట్టాలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాహాలు ముందస్తు నమోదు ద్వారా బాల్య వివాహాలు అరికట్టేందుకు ఆస్కారం వుంటుందన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల ప్రకారం వదువు, వరుడి వయ స్సులను కూడా నిర్ధారించ వచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొబేషనరీ అధికారి ఎం.శరత్ బాబు, ఉమ్మడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బి.లూసీ కార్డులియా,జిల్లా లోని 33 పోలీసు స్టేషన్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు,సబ్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
               

Anakapalle

2024-02-13 15:02:00

జివిఎంసి లో డయిల్ యువర్ మేయర్ కు 13 ఫిర్యాదులు

నిర్ణీత సమయం లో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కారించాలని జివిఎంసి అధికారులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జివిఎంసి అదనపు కమీషనర్ కె.ఎస్.విశ్వనాధన్ ఆదేశించారు. సోమవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యలయం లో జరిగిన డయిల్ యువర్ మేయర్,  జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమము లో పాల్గొని ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్బముగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డయిల్ యువర్ మేయర్ కు 13, జగనన్నకు చెబుదాం కు 96 ఆర్జీలు వచ్చాయన్నారు. అందులో డయిల్ యువర్ మేయర్ కార్యక్రమములో ఇంజినీరింగు విభాగానికు 05, పట్టణ ప్రణాళిక విభాగానికు 02,  ప్రజారోగ్య విభాగానికి 01, మొక్కల విభాగానికి 01, పిడి(యుసిడి) విభాగానికి 04 వచ్చాయని తెలిపారు. అలాగే జగనన్నకు చెబుదాం కార్యక్రమములో 2వ జోన్ కు 17, 3వ జోన్ కు 17,  4వ జోన్ కు 10,  5వ జోన్ కు 09, 6జోను కు 20,  8వ జోన్ కు 15, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 08 ఫిర్యాదులు అందాయిని.. అలాగే పరిపాలనా విభాగానికి 01,  రెవెన్యూ విభాగానికి 09,  ప్రజారోగ్య విభాగానికి 07,  పట్టణ ప్రణాళిక విభాగానికి 29, ఇంజినీరింగ్ విభాగానికి 34, హార్టికల్చర్ విభాగానికి 02, యుసిడి విభాగానికి 14 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మేయరు మాట్లాడుతూ సంబంధిత అధికారులు మూడు రోజుల్లో లేదా నిర్ణీత సమయంలో ఆర్జీలను పరిష్కరించాలని, వచ్చేవారానికి నివేదికలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు రవి క్రిష్ణం రాజు, ఎగ్జామీనర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఎఫ్.ఎ & ఎ.ఓ మల్లికాంబ, అన్ని జోన్ల పర్యవేక్షక ఇంజినీర్లు, డిపిఓ చంద్రిక, ఇన్ చార్జి డిడిహెచ్ చక్రవర్తి,  ఎసిపి శ్రీలక్ష్మి, యుసిడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Visakhapatnam

2024-02-12 14:23:24

గ్రంథాలయాల ఆధునీకరణతో పాఠకులకు టెక్నాలజీ సౌలభ్యం

గ్రంథాలయాలను ఆధునీకరించడం ద్వారా పాఠకులకు మంది టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని విశాఖజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ పేర్కొ న్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో నూతనంగా నిర్మించిన శాఖా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన గ్రంథాలయానికి కంప్యూట ర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రంథాలయాలకు సొంత భవనాలు సమకూరుతు న్నాయ న్నారు. అంతేకాకుండా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంక ట్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, లైబ్రేరియన్ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

పెదబయలు

2024-02-11 09:13:18

గ్రంథాలయాలతో పఠనాశక్తి పెంపొందించుకోవాలి..కొండా రాజీవ్

గ్రంథాలయాలతో విద్యార్ధులు పఠనా శక్తి పెంపొందించుకోవాలని విశాఖజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో నూతనంగా నిర్మించిన శాఖా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విశాఖజిల్లా గ్రంథాలయ సంస్థను అగ్రగామిలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. గ్రంథాలయాల్లో విద్యార్ధుల సౌకర్యార్ధం అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, లైబ్రేరియన్ మహేష్, స్థానికి ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Gangaraju Madugula

2024-02-11 07:29:40

ఏపీలో అధికారంలోకి వచ్చేది జనసేన-టిడిపి ప్రభుత్వమే

జనసేన - టీడీపి కూటమి ప్రభుత్వమే వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రానున్నదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పీఎసీ సభ్యులు కొణిదెల నాగబా బు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, అనకాపల్లిని పట్టి పీడిస్తున్నవి ప్రధానంగా దోమలు, వైఎస్సార్సీపీ నాయకులు పట్టి పీడిస్తున్నారన్నారు.  సిగ్గు, యగ్గు వదిలేసి రోడ్ల పై గుండాల్లాగ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసారు అని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జన సైనికులకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం నేర్పారని, మీ దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైఎస్సార్సీపీ నాయకులను ఈ ఐదేళ్ళలో ఏం అభివృద్ధి చేసారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అన్నారు. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో అనకాపల్లి బెల్లం వాడేవారని దానిని కూడా వైఎస్సార్సీపి ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీను తిరిగి ప్రారంభించక పోగా అమ్మకానికి పూనుకున్నారని, ఫ్యాక్టరీ పై ఆధారపడిన లక్షలాది మంది రైతుల పొట్ట కొడుతున్నారని అన్నారు. 

మీ అనకాపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పేరు నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదని, ఇలాంటి మంత్రిని నేను ఎక్కడా చూడలేదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా ఉంటూ అనకాపల్లికి ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు చెప్పాలని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని ఇంత నీచమైన, నికృష్టమైన, బఫూన్ ప్రభుత్వం లేదని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దొరికిందని, ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం ఎక్కువైపోయిందని ఉమ్మడి విశాఖ జిల్లా లోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుందని రాష్ట్రమంతా అంటున్నారని అందులో ఇక్కడ మంత్రికి కూడా వాటా ఉందని తెలిసిందని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐరన్ హ్యాండ్ తో గంజాయి వ్యాపారాన్ని పెకిలిస్తామని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆక్రమణలు, కబ్జాలు చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసి జరిమానా వేసి మరీ వసూలు చేస్తామని హెచ్చరించారు. జగన్ అద్భుతమైన నటుడు అని, పచ్చి అబద్ధాలు కొరు అని భూ ప్రపంచంలో అంతడి వాడు మరొకడు లేడని అన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమని కొనియాడారు.

అంతకు ముందు అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సైకో ముఖ్యమంత్రి ఎలాగో, ఇక్కడ కొడు గుడ్డు మంత్రి కూడా అలానే ఆక్రమణలు చేస్తున్నారని, విస్సన్నపేటలో 600 ఎకరాలు దోచుకుంటున్నారని అన్నారు. బీఆర్టి కాలనీలో 80 ఎకరాల ఢీ ఫారం భూములు అక్రమిస్తున్నారని, మండల పార్టీ ప్రెసిడెంటుల పేరుతో మైన్స్ లో దండుకుంటున్నారని, ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేస్తున్నారని అన్నారు. మాకవరంలో ఐదు ఎకరాలు మంత్రి బంధువుల పేరిట క్వారీ ఏర్పాటు చేసుకున్నారని, జన సైనికులు పోరాడి క్వారీల్లో తప్పులను ఎత్తి చూపి ఇటీవల 8.16 కోట్లు జరిమానా కూడా వేయించారాని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 వేల ఇండస్ట్రీస్ ఉన్నాయని, పరిశ్రమల శాఖ మంత్రి మన జిల్లాలోనే ఉన్నప్పటికీ 100 మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యారావు, ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల కమిటీ ఇంచార్జి సుందరపు వెంకట సతీష్, అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ యాదవ్, రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు, కొట్ని సూరిబాబు, సత్యారావు గెంజి, జనసేన వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-10 16:20:33

సిహెచ్.నాగాపురంలో టిడిపి పతనానికి ఆ వ్యక్తే కారణం..?!

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొనఊపిరితో ఉన్న తెలుగుదేశం పార్టీ పతనానికి అనకాపల్లి జిల్లాలోని గొలుగొండ మండలం, సిహెచ్.నాగాపురం గ్రామ పంచా యతీలో ఒక వ్యక్తి ప్రధాన కారణంగా మారుతున్నాడనే ప్రచారం గుప్పుమంటుంది. అంతేకాదు ఆ అంశాన్ని నిజం చేసేలా మారుతున్న ఆయన వ్యవహార సైలి అటు వైఎస్సార్సీపీ మండల నాయకత్వానికి వరంగా మారిందనే ఆరోపణలు లేకపోలేదు. ఎలాగైనా పార్టీని బ్రష్టు పట్టించి, అధికార వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టి సొంతింటి కార్యకర్తలను కూడా అధికార పార్టీలోకి వెళ్లిపోయేలా చేస్తున్న ఆ వ్యక్తి అరాచకాలు ఇపుడు మండల పార్టీ,జిల్లా పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఎలాగైనా చే జారిపోయిన్న కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఓటర్లను కూడగట్టుకునే పనిచేస్తున్న తరుణంతో ఆవ్యక్తి వ్యక్తిగత స్వలాభం, ఫాల్స్ ఫ్రెస్టేజీతో గ్రామ పంచాయతీలోని అన్ని విషయాల్లోనూ వేలు పెడుతుండటంతో కొద్దో గొప్పో ఓట్లు పడతాయనుకున్న పంచాయతీలో పూర్తిగా పార్టీ చతికబడి స్థితికి చేరుకుందనే వాదన బలంగా వినిపిస్తున్నది.

ఇప్పటికే సదరు వ్యక్తిపై మండల నాయకత్వం ఫిర్యాదుచేసినప్పటికీ పట్టించుకోకపోవడం, అటు జిల్లా నాయకత్వం చర్యలు తీసుకోకపోవడంతో సదరు వ్యక్తి పంచాయతీలో చేస్తున్న స్వలాభపనులకు పార్టీగ్రామస్థాయి కార్యకర్తలు కూడా దూరమయ్యే పరిస్థితి దాపురించింది. గత కొద్ది రోజుల నుంచి గ్రామపంచాయతీలో పూర్తిగా పార్టీని బ్రష్టు పట్టించి, ఎవరూ పార్టీలో ఉండకుండా చేయడంలో సదరు వ్యక్తి యొక్క వ్యక్తిగత పనులకు పార్టీని దారు ణంగా వాడుకోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ఈకారణంతోనే మొన్న కదలిరా టిడిపి మాడుగుల మండలంలోని మహాసభకు సైతం కార్యకర్తలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంతకు కొద్ది రోజుల ముందు నిర్వహించిన సిద్దం వైఎస్సార్సీపి సభకు టిడిపి కార్యకర్తలు సైతం అధికార వైఎస్సార్సీపీ పార్టీతో తెలియకుండా కలిసి వెళ్లారనే ఆరోపణలు కూడా బగ్గుమంటున్నాయి. పేరుకి చిన్నగ్రామ పంచాయతీ అయినప్పటికీ సదరువ్యక్తి చేసే పనులకు, తేడా రాజకీయాలకు మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులకు సైతం ఫిర్యాదులు వెల్లువత్తే పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఉన్న ఆ కాస్త ఓట్లు, కార్యకర్తలు కూడా చేజారిపోయే పరిస్థితి లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా పార్టీకి నష్టం చేకూర్చే వ్యక్తి విషయంలో మండల, జిల్లా పార్టీ దృష్టిసారిస్తుందా లేదంటే ఆయన వ్యక్తగత పనుల కోసం పార్టీని వినియోగించుకుంటున్నా పర్వాలేదనుకొని ఊరుకుండిపోతుందా అని..!

Nagalapuram

2024-02-06 17:35:55

రామానుజ సమతా కుంభ్ కు ఆడారి కిషోర్ కు ఆహ్వానం

ఈనెల 20 నుంచి త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరుగుతున్న రామానుజ సమతా కుంభ్ 2024 మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా టిడిపి యువనేత, మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ కు ఆహ్వానం లభించింది. ప్రపంచ ఖ్యాతి గాంచిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ట జరిగి 3వ వార్షికోత్సవం సందర్భంగా  సమతా కుంభ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే విశాఖ వచ్చిన ఆయన 50వ అవగాహన సదస్సు బ్రోచర్ ను విడుదలచేసి అభినందించారు.

Visakhapatnam

2024-02-04 14:34:29

సోమవారం జీవీఎంసీలో జగనన్నకు చెబుదాం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జగనన్నకు  చెబుదాం ( స్పందన) కార్యక్రమం సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్టు జివీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, మొక్కల విభాగం, రెవిన్యూ, యు సి డి, ఇంజనీరింగ్ మొదలైన విభాగాలకు సంబంధించిన సమస్యలను నగర ప్రజలు స్వయంగా ఈ కార్యక్రమం తమ సమస్యలపై అర్జీలు పెట్టుకొని పరిష్కారం పొందాలని తెలియజేశారు.

Visakhapatnam

2024-02-04 14:25:57

మునగపాకలో గౌరీపరమేశ్వరుల ఉత్సవానికి భారీ ఏర్పాట్లు

అనకాపల్లి జిల్లా మునగపాకలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఫిబ్రవరి 3 న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పెంటకోట ఆదినారాయణ, ఆడారి అప్పలనాయుడు తెలిపారు.బుధవారం ఈ మేరకు గ్రామం లో సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.కొబ్బరి బొండాలు, చెరకు గడలు,కొత్త పంటలు ఎడ్లు బండి పై ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తో పాటు, వివిధ రకాల స్వీట్స్, పిండి వంటకాలు తో పెద్ద ఎత్తున మహిళలు  ఊరేగింపు లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహోత్సవం లో  భారీ స్టేజ్ ప్రొగ్రాం లు , నేల వేషాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది మునగపాక లో ఫిబ్రవరి 3 న గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ  తెలియజేసింది. ఉత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసినట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు.

Munagapaka

2024-01-31 18:18:10

మిషన్ కర్షకదేవోభవకు చినజీయర్ స్వామి ప్రశంసలు

రైతులు శుభిక్షంగా ఉంటేనే జీవకోటికి సమయానికి ఆహార దినుసులు అందుతాయని, అలాంటి ప్రాజెక్టు చేపట్టి వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధిచేయడానికి కృషిచే స్తున్న టిడిపియువనేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ ను చినజీయర్ స్వామి అభినందించారు. మంగళవారం విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కిషోర్ తాను చేపడుతున్న మిషన్ కర్షకదేవోభవ ప్రాజెక్టు బ్రోచర్ ను చినజీయర్ స్వామికి అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయరంగం అన్నిచోట్ల పెరగాడానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, తక్కువ సమయంలో అధిక దిగుబడి వచ్చే వంగడాల రూపకల్పనకు మిషన్ కర్షకదేవోభవ కేంద్రబిందువు కావాలన్నారు. ఆదిశగా ప్రోత్సాహక, చైతన్య కార్యక్రమాలు మిషన్ కర్షకదేవోభవ ప్రజల కోసం కార్యక్రమాలను రూపొందించాలన్నారు. మంచి పనిచేస్తున్న కిషోర్ అండ్ టీమ్ సభ్యులను చినజీయర్ స్వామి అభినందించి.. అనంతరం బ్రోచర్ ను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో ఆడారి కిషోర్ కుమార్ యువసేన ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-01-30 15:42:56

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం..

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం ముందుకి సాగుతూ, తనవంతు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు పేర్కొన్నారు. గ్రామంలో జరుగుతున్న చర్చి నిర్మాణానికి  ప్రకటించిన సహాయాన్ని ఆయన నిర్వాహకులకి అందజేశారు. ఈ సందర్భంగా  గుర్రాజు మాట్లాడుతూ, తాను సర్పంచ్ గా వైఎస్సార్సీపి నేతగా గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు. గ్రామంలో జరిగే ఎలాంటి సేవాకార్యక్రమాలకైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి స్పూర్తితోనే తాను సేవాకార్యక్రమాలు చేపడుతున్నానని స్పష్టం చేశారు. శంఖవరం మండలంలో వజ్రకూటం పంచాయతీని అన్ని రంగాల్లోనూ ముందువరుసలో నిలబెట్టాలన్నదే తన ప్రధాన ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో సకురుసోమరాజు, సకురు రాజా, మొరాతి అప్పారావు, మొరాతి రాజు తదితరులు పాల్గొన్నారు.

2024-01-29 06:39:27

మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు .. జిల్లాకలెక్టర్

అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణన్ శెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశం లో చైర్మన్ చిక్కాల రామారావు తో కలిసి ఆయన పాల్గొ న్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించే రుణ సదుపాయాలను గూర్చి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అర్హత ఉన్న వారిలో అవస రమైన వారందరికీ వ్యవసాయ పశుసంవర్ధక మత్స్య ఉద్యానవన, బిందు సేద్య మొదలగు శాఖలకు సంబంధించి రుణాలను సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆదే శించారు. వీలైనంత ఎక్కువ మందికి రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎటువంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పాడి పశువుల కొనుగోలుకు సంబంధించిన రుణాల విషయంలో పిఎం ఈజిపి సంస్థలైన కెవిఐసి, డిఐసి అధికారుల సమన్వయంతో రుణ ధరఖాస్తులను ఎక్కువ శాతం మంజూరు చేయించాలన్నారు.  పంటలు దిగుబడి శాతం పెంచేందుకు, మార్కెటింగ్ చేసేందుకు రైతులు వ్యాపార సంస్థ లకు అవగాహనతో రైతులకు మేలు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు అధికారులు దిశానిర్దేశం చేయాలన్నారు.  అనంతరం వ్యవసాయ శాఖ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు ఎస్ .రమణ, ఏ.సూరి అప్పారావు వ్యవసాయ శాఖ జేడీ మోహనరావు, సహకార బ్యాంకు మేనేజర్ వర్మ, పశుసంవర్ధక శాఖ జెడి ప్రసాద రావు, మత్స్య శాఖ డిడి ప్రసాద్, ఉద్యానవన శాఖ డిడి ప్రభాకర్ రావు, ఏపీఎంఐపీ ఏడి జీవీ లక్ష్మి, డీఎస్ఓ కె వి ఎల్ ఎన్ మూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనా రాయణ, తదితర శాఖల అధికారులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2024-01-19 14:02:48

ఓటర్ల సవరణకు లక్షా 13వేల దరఖాస్తులు.. ఈఆర్వో

రాజకీయ పార్టీలతో సమావేశం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే –2024 కుసంబంధించి ఫారం–6,7,8 ద్వారా ఇప్పటి వరకు 1,13,504 దరఖాస్తులు అందాయని కాకి నాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. గురువారం సాయంత్రం కార్పొరేషన్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమా వేశం జరిగింది. సవరణ ప్రక్రియ ప్రగతిని ఆయా పార్టీల ప్రతినిధులకు ఈ ఆర్ ఓ  వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు లక్షా 436 దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించామన్నారు. 12,023 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. ఇంకా సుమారు వెయ్యి దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు నూతన దరఖాస్తులను కూడా స్వీకరించి పరిష్కరిస్తామన్నారు.ఈ  సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కమిషనర్‌ నివృత్తి చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు(వైఎస్‌ఆర్‌సీపీ), తుమ్మల రమేష్‌ (టిడిపి), అప్పారావు(బిఎస్‌పి), ఏఈఆర్వోలు జాన్‌బాబు, వరహాలయ్య, మురళి, సీతాపతిరావు, హరిదాసు, నాగశాస్త్రులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2024-01-18 15:13:48

పారదర్శకంగా కులగణన.. కమిషనర్ నాగ నరసింహారావు

కుల గణన పై శిక్షణా కార్యక్రమం  కాకినాడ లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కులగణన ను పారదర్శకంగా  నిర్వహించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్. నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో కుల గణన పై సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ యాప్ లో  కులాన్ని నమోదు చేయాలన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేని ప్రజల సౌలభ్యం కోసం... ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆయా సచివాలయాలలో నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు.కుల గణన ప్రక్రియకు వాలంటీర్ తో పాటు సచివాలయ కార్యదర్శి కూడా తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. కులగణన నమోదు అనంతరం ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ వరకు  పరిశీలనా కారులు వెరిఫికేషన్ చేస్తారన్నారు. ఈ ప్రక్రియ కు  సంబంధించి ప్రజలనుంచి సేకరించాల్సిన సమాచారం, విధివిధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో  స్పెషల్ ఆఫీస ర్లు,నోడల్ అధికారులు, అడ్మిన్ సెక్రటరీలు,ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు హాజరయ్యారు.

Kakinada

2024-01-18 15:09:33