1 ENS Live Breaking News

చంద్రయాన్-3 విజయవంతంపై మంత్రి అమర్నాథ్ హర్షం

చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పెద్ద లక్ష్యాన్ని సాధించగలిగారని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద  అడుగు పెట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నించినా సాధించలేని విజయాన్ని భారత శాస్త్రవేత్తలు సాధించి సరికొత్త అధ్యాయానికి తెర తీశారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ విజయం భారతీయులందరికీ అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి, వాటిలో విజయం సాధించి ప్రపంచ దేశాలలోని భారతదేశం  అగ్రస్థానంలో  నిలవాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇస్రో శాస్త్రవేత్తలు మార్గదర్శకులుగా నిలిచే రోజు అతి దగ్గరలోనే ఉందని మంత్రి అమర్నాథ్ అన్నారు.

Anakapalle

2023-08-23 14:24:14

శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..డిఎస్పీ

శాంతిభద్రతలు విషయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. మంగళవారం పరవాడ సబ్ డివిజనల్ కార్యాలయంలో నెలవారి క్రైమ్ సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో గల పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి, సబ్బవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రైమ్ రేట్ పెరగకుండా చూడాలని శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని పోలీస్ స్టేషన్ లకువచ్చే బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసులు నమోదు చేసి బాధ్యత యుతముగా వ్యవహరించాలని సిఐ, ఎస్ఐలకు సూచించారు. బాధితులు యొక్క సమస్యలు, ఫిర్యాదులు వివరాలను తెలుసుకుని వాటిని తొందరగా పరిష్కరించడానికి పని చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో,పట్టణ ప్రాంతాల్లో నిరంతరం పోలీస్ నిఘ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు .పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ అవి పని చేసే స్థితిలో ఉండే విధంగా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో పరవాడ పోలీస్ సబ్ డివిజన్లో గల సిఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


Paravada

2023-08-22 16:42:50

నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమిస్తా..దిలీప్

మూడున్నర దశాబ్దాల రాజకీయాలలో ప్రజా సేవే పరమావధి గా నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అధారిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ అన్నారు. స్థానిక రింగ్ రోడ్డు లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం లో గెలుపు ఓటమి లతో సంబంధం లేకుండా తన వెన్నంటే ఉన్నవారందరికీ అభినందనలు తెలిపారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అధారిటీ చైర్మన్ వంటి రాష్ట్ర స్థాయి ఛైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి,  రాష్ట్ర మంత్రి అమర్నాథ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనవంతు గా వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేస్తానన్నారు.  సిఎం గా మరలా జగన్మోహన్ రెడ్డి రావాలని, అనకాపల్లి ఎమ్మెల్యే గా అమర్నాథ్ విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, రాష్ట్ర బిసి వెల్ఫేర్ గవర కార్పొరేషన్ చైర్మన్ బోడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ దిలీప్ కుమార్ మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ లోఎందరో  ముఖ్యమంత్రి లతో సన్నిహితంగా ఉండే వారున్నారు.

 స్వర్గీయ గుడివాడ గురునాథ్ రావు సమకాలీక రాజకీయాలు చేసిన మహోన్నత వ్యక్తి దిలీప్ కుమార్ అని ఆయన అన్నారు. గడచిన ఎన్నికల్లో అనకాపల్లిలో అమర్నాథ్ గెలుపు కోసం కృషి చేసిన  దిలీప్ కుమార్  ముందుండి వైసిపి శ్రేణులను నడిపించారని ప్రసాద్ అన్నారు. తొలుత వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు బో‌డ్డేడ ప్రసాద్, కశింకోట ఎంపిపి కలగా లక్ష్మీ గున్నయ్యనాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు మలసాల కిషోర్, డాక్టర్ రాంమూర్తి తదితరులు దిలీప్ కుమార్ కు శాలువా కప్పి,పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించారు. అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు బో‌డ్డేడ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మలసాల కిషోర్, వైఎస్సార్ సీపీ నాయకులు సూరిశెట్టి రమణ అప్పారావు, జాజుల రమేష్,పలకా రాము, ఎవి రత్నకుమారి, అళ్ళ నాగేశ్వరరావు, గైపూరి రాజు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి గోవింద, తుమ్మపాల సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-22 16:12:28

అనకాపల్లిలో దిలీప్ కుమార్ కు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ గా నియమితులై అనకాపల్లి వచ్చిన దంతులూరి దిలీప్ కుమార్ కు వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఆయన అను చరులు బ్రహ్మరథం పట్టారు. సోమవారం ఉదయం అనకాపల్లి చేరుకున్న దిలీప్ కుమార్ ను రైల్వేస్టేషన్ నుండి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. పార్టీ కార్యా లయంలో  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను దంతులూరి దిలీప్ కుమార్ ఘనంగా సత్కరించారు. తర్వాత మంత్రి అమర్నాథ్ కూడా దిలీప్ కుమార్ ను అభినందిస్తూ సత్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్ మీద దిలీప్ కుమార్, మంత్రి అమర్నాథ్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తదిత రులు పార్టీ కార్యాలయం నుంచి  బయలుదేరి పట్టణంలోని ప్రధాన మార్గాలగుండా ఊరేగింపుగా వెళ్లారు. దారి పొడవునా అభిమానులు దంతులూరికి, మంత్రి అమ ర్నాథ్కు పూలమాలలు వేసి సత్కరించారు. దంతులూరి అభిమానులు అతనిని ఒక క్రేన్ ద్వారా తీసుకువచ్చిన గజమాలతో సత్కరించారు. అలాగే విచిత్ర వేషధారణలు, బైక్ ర్యాలీలతో వైసిపి అభిమానులు హోరెత్తించారు. 

Anakapalle

2023-08-21 16:05:15

సత్యదేవుడిని దర్శించుకున్న ఏపిఈఆర్సీ చైర్మన్

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఏపిఈఅర్ సి చైర్మన్ వి.నాగార్జున రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు.  ఈమేరకు దేవస్థానం చైర్మన్ ఐ వి రోహిత్, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతరాలయంలో ఆయన స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందజేయగా, చైర్మన్ స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, అన్నవరం సత్యదేవుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆదేవ దేవుడిని ప్రార్ధించినట్టు ఆయన వివరించారు. ఈ  కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు.

Annavaram

2023-08-20 15:51:10

బెస్ట్ సర్వేయర్ గా వీర్ల.సురేష్

 కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం సచివాలయంం-1 సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న వీర్ల.సురేష్  ఉత్తమ సర్వేయర్ గా అవార్డు అందుకున్నాడు. మంగళవారం జిల్లాకేంద్రంలో జరిగిన 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో  వీర్ల.సురేష్ కు ఉత్తమ సర్వేయర్ అవార్డును జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, ఎంపి వంగా గీతా విశ్వనాధ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీదిరి.అప్పలరాజు,జాయింట్ కలెక్టర్ లు సమయుక్తంగా ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్వేయర్ అవార్డు గ్రహీత వీర్ల.సురేష్ మాట్లాడుతూ, తనకు 2వ సారి ఉత్తమ సర్వేయర్ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని.. ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని తెలిపారు. సురేష్ కు ఉత్తమ సర్వేయర్ అవార్డు రావడం పట్ల ప్రత్తిపాడు  ఎమ్మెల్యే పర్వత.పూర్నచంద్ర ప్రసాద్, శంఖవరం మండలం సచివాలయ సిబ్బంది..కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, జూ.సహాయకులు రమణమూర్తి, చిన్నానలు వీర్ల.సురిబాబు,వీర్ల.చక్రరావు,వీర్ల.రాము,స్దానిక గ్రామ సర్పంచి శెట్టిబత్తుల.కుమార్ రాజా,గ్రామస్థులు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

కాకినాడ

2023-08-15 07:34:20

దళితవాడల అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం

దళిత వాడలు అభివృద్ధి చెందాలంటే అంది చంద్రబాబుతోనే సాధ్యమని అనకాపల్లి టిడిపి ఇన్చార్జి పీలా గోవింద సత్యన్నారాయణ పేర్కొన్నారు. బుధవారం ఎఎంసి కాలనీలో 83వ వార్డు ఇంచార్జీ బొద్దపు ప్రసాద్, అర్బన్ జిల్లా కార్యదర్శి శంకర్ల పద్మలత ల ఆధ్వర్యంలో మహాశక్తి పథకం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ, ఏపీకి త్వరలోనే మంచిరోజులు రానున్నాయన్నారు. తెలుగు మహిళలు తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణి చేశారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , టీడీపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు  విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు,పార్టీ నాయకులు పోలవరపు త్రినాథ్, అధికసంఖ్యలో కార్యకర్తలు ,అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 16:19:05

విశాఖజిల్లాలో వారాహి యాత్రను విజయవంతం చేయండి

విశాఖ ఉమ్మడి జిల్లాలో ఈనెల 10 నుంచి 19 వరకు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్రను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని  నియో జకవర్గ జనసేన ఇంచార్జి పరుచూరి భాస్కరరావు పిలుపునిచ్చారు. బుధవారం అనకాపల్లి బైపాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు 11 గంటలకు విచ్చేసి, అక్కడి నుండి దసపల్లా హోటల్ కు చేరుకుంటారని చెప్పారు. పార్టీ నాయ కులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. 19వ తేదీ వరకు పవన్ కళ్యాణ్  విశాఖ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు.అలాగే జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనకాపల్లి ఎప్పుడు వస్తారనేది త్వరలో తేదీ ఖరారు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రగతి బాటన నడవాలంటే జనసేన అధికా రంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అంశాన్నిఅందరూ గుర్తించాలన్నారు.

Anakapalle

2023-08-09 15:29:28

డుంబ్రిగుడలో ఘనంగా ఆదివాసి దినోత్సవం

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని డుంబ్రిగుడ మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మండల కేంద్రంలోని జంక్షన్ వరకు  గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించి మనోహరం చేపట్టారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బి పోతురాజు, టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం  వచ్చి దశబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ అనేక గిరిజన గ్రామాల్లో రోడ్లు, వంతెనలు తాగునీరు, విద్యా వైద్యం వంటి సౌకర్యాలు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజ్యాంగంలో కల్పించిన గిరిజన చట్టాలను అమలు చేయకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఖండ్రు మ్ ఎంపీ యూపీ పాఠశాలలో కూడా విద్యార్థులు ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కే.సంజీవరావు, యుటిఎఫ్ మండల అధ్యక్షుడు ఎస్ బాలకృష్ణ, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Dumbriguda

2023-08-09 14:57:12

18ఏళ్లు దాటితే ఓటరుగా నమోదు చేయించుకోవాలి

18ఏళ్లు నిండి అర్హత కలిగిన  ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకోవాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తెలిపారు.  బుధవారం దక్షిణ నియోజక వర్గంలోని వెలం పేట పరిధిలో  91 మరియు 98 నెంబరు గల  పోలింగ్ బూత్  పరిధిలో గల  ఇంటింటికి ఓటరు సర్వే కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బి ఎల్ ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు ఓటరు వివరాలు, డోర్ నెంబరు సరిగా ఉన్నది, లేనిది ఓటరు బి ఎల్ ఓలను అడిగి తెలుసుకోవాలన్నారు . బి.ఎల్.ఓ డోరు టు డోరు సర్వే పై  స్థానికంగా అపార్ట్  మెంట్ లలో నివాసం ఉంటున్న ఓటర్లను కలిసి వివరాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. అదే విదంగా పాత వారి వివరాలు, కొత్తగా చేరిన వారి నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటు అనేది భారత రాజ్యంగం మనకు కల్పించిన హక్కు అని, కుటుంబంలో ఎవరైనా 18 సంవత్సరాలు వయస్సు నిండిన  ప్రతి ఒక్కరూ భాద్యతగా తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో విశాఖ పట్నం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, మహారాణిపేట తాహాసీల్దార్ టి.ఆనంద్ కుమార్, బూత్ లెవెల్ అధికారులతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-08-09 09:19:43

రైతులకు అన్నింటా పెద్దపీట వేయాలి..ఆడారి కిషోర్

దేశానికి వెన్నుముకలా నిలబడ్డ రైతులకు అన్నింటా పెద్ద పీట వెయ్యాలని, మిషన్ కర్షక దేవో భవ  చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ కోరారు.  బుధవారం విశాఖ నగరం లోని భీష్మ  కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో మిషన్ కర్షక దేవో భవ ప్రచార కార్యక్రమం లో భాగంగా 12వ రోజు అవగాహనా సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన ఆహారం పండించే రైతులకు అత్యున్నత హోదా కల్పించాలన్నారు. మనం రోజు తినే ఆహారాన్ని పండించే రైతులుఅమ్మే కూరగాయలు ఇతర పంటలు కొనుగోలు సమయంలో ఎటువంటి బేరసారాలు చేయవద్దని.. ఎంతో శ్రమ చేసి పండిస్తే తప్ప అవి దిగుబడికి రావన్నారు. అలాంటి రైతులకు కృతఙ్ఞతలు చెప్పడం మన కనీస ధర్మం అన్నారు. అంతేకాకుండా రైతులకు ప్రతి ఆర్టీసి బస్సులోనూ,  ప్రత్యేక సీటు కేటాయించాలన్నారు.

  సమాజంలో తమ వంతు భాద్యతగా రైతాంగానికి సహకారాన్ని అందించాలన్నారు.  కర్షక దేవోభవ ప్రాజెక్ట్,  రైతులకు సంక్షేమం కోసం ప్రజల్లో అవగాహనా కల్పించేం దుకు అన్నిప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో రైతులకు తగిన సహకారం అందించాలన్నారు. రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులను ప్రత్యేకించి అభినందించారు.  కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేస్తున్న వ్యవయం, పంటల కోసం వివరించారు. యువత, విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ మిషన్ లో వాలంటీర్లు గా చేరేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమం లో కాలేజ్ అధికారులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-09 08:57:55

విశాఖలో వారాహి యాత్రను విజయవంతం చేయండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ అన్నారు.  మంగళవారం హరిపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వారాహి 3వ విడత యాత్ర ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతుందన్నారు. 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై అదే రోజు సాయంత్రం జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. దానితో పాటుగా జనవాణి కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. అధికార వైసీపీ పార్టీ అవినీతి, భూకబ్జాలు ఎక్కడ బయటపడతాయనో భయంతో గతంలో జనవాణి కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారని ఇలాంటి ఎన్ని కుయుక్తులు పన్నినా ఈసారి మటుకు ఖచ్చితంగా జనవాణి కార్యక్రమం కూడా జరగడంతో పాటుగా కొంతమంది అధికార పార్టీ నేతల కనుసన్నలలో అక్రమాలు జరిగిన విస్సన్నపేట భూములను కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు. డేటా చోరీతో పాటుగా వాలంటీర్ల శ్రమను దోచుకుంటుందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే నియోజకవర్గ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజుతో పాటుగా మరో ప్రజాప్రతినిధి కూడా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేశారని మరి అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామ సచివాలయంలో వాలంటీర్ ద్వారా జరిగిన అక్రమాన్ని గురించి ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు.

 ఇప్పటికీ కూడా యలమంచిలి నియోజకవర్గములో అధికార పార్టీ నేతలలో వర్గ పోరు నడుస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అభివృద్ధి ఎక్కడా కనిపించని దుస్థితి ఏర్పడిందని ఘాటుగా విమర్శించారు. తాను ఇన్నాళ్లు అధికారంలో లేకపోయినా ప్రజలకోసం నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో ప్రజలకి తోడుగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం మండల మాజీ జడ్పిటిసి సభ్యులు జనపరెడ్డి శ్రీనివాసరావు, యలమంచిలి మున్సిపాలిటీతో పాటుగా మండలాల అధ్యక్షులు బైలపూడి శ్రీరామదాసు, పప్పల నూకన్న దొర, టెక్కలి పరశురాం, బొద్దపు శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల శేఖర్, ఇతర నాయకులు లాలం సోము నాయుడు, కార్యదర్శులు చోడపల్లి ప్రసాద్, నాని, బుల్లిబాబు, చొప్ప శ్రీను, కొలగాని భాస్కర్, వీర మహిళ సుందరపు సత్యవతి, జనసైనికులు పాల్గొన్నారు.

Yalamanchili

2023-08-08 16:25:34

ఈనాం భూముల సర్వేకై రేపు ఎల్లవరంలో గ్రామసభ

గొలుగొండ మండలంలోని కొత్త యల్లవరం గ్రామంలో ఈనాం భూమలు సర్వే కోసం మంగళవారం గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించనున్నట్టు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడారు. అక్కడి భూముల సర్వే విషయమై అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని కలిసి అక్కడి పరిస్థితిని వివరించినట్టు పేర్కొన్నారు. అనంతరం నర్సీపట్నంలో ఆర్డీఓ తో కూడా ఇదే విషయమై చర్చించిన ఎమ్మెల్యే తొలుగ గ్రామ సభ ఏర్పాటు చేసి అనంతరం ఈనాం భూముల సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇక్కడి భూములు సర్వేపూర్తయితే ఎల్లవరం గ్రామపంచాయతీ ప్రజలు త్వరలో రైతులందరికీ పట్టాదారు పుస్తకాలు మంజూరవుతాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు.

Narsipatnam

2023-08-07 11:03:09

18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదుకావాలి

18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేయించుకోవాలని కొయ్యూరు మండల బూత్ కన్వీనర్ రమణ మండల మహాశక్తి మహిళా కార్యదర్శి మీనా అన్నారు. సోమవారం కొయ్యూరు గ్రామంలో ఓటర్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ఓటరు నవీకరణ కార్యక్రమం చేపడుతోందని, ఓటరు కార్డులు తప్పులు, అడ్రసు, నూతన కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భారతదేశంలో ఓటు హక్కు  వజ్రాయుధంతో సమానమని దీనివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ముఖ్యంగా యువత స్వచ్చందంగా ముందుకివచ్చి ఓటరుగా నమోదు చేయించుకోవాలని అన్నారు. దానికోసం ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలోని బిఎల్వోలను సంప్రదించాలని సూచించారు.

Koyyuru

2023-08-07 10:12:41

చంటి పిల్లలకు తల్లిపాలతో సంపూర్ణ ఆరోగ్యం

చంటి పిల్లలకు తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ బ్లాక్ కో ఆర్డినేటర్ ఎం.హారిక అన్నారు. సోమవారం తల్లిపాల వారోత్స వాల సందర్భంగా టాటా ట్రస్ట్,  ఏషియన్ పెయింట్స్ ఆధ్వర్యంలో రామన్నపాలెం గ్రామంలో తల్లిపాలు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురిపాలు ఫస్ట్ టీకాలా పనిచేస్తాయన్నారు. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతుంద సూచించారు. తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి బిడ్డలకి ఆరోగ్య సమస్య లు నివారణ అవుతాయన్నారు. అనంతరం డబ్బా పాలు వద్దు తల్లిపాలే ముద్దు అంటూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లాలం శ్రీను, నాయుడు  అంగన్వాడీ టీచర్ పద్మ,పోశన్.సఖి అనూష, సివలక్ష్మి , ఎంఎల్ హెచ్పీ, ఆశా వర్కర్లు, పిల్లల తల్లిదండ్రుడు హాజరయ్యారు.

2023-08-07 09:24:08