రాష్ట్రంలో వైఎస్సా్రసీని గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి పరుచూరి భాస్కరరావు అన్నారు. అనకాప ల్లి కోట్నివీధిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం పరుచూరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాక్షస
పాలన అంతమొందించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. మధ్య నిషేధాన్ని ప్రకటిస్తామని చెప్పిన జగన్ రాష్ట్రంలో ఎరులై పారించారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్లి అనకాపల్లిలో వైఎస్సార్సీపి ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు రాష్ట్రం నుంచి తరిమివేయాలని తెలియజేసే 120 ప్రశ్నలతో కూడిన పాంప్లెట్ ను తెలుగుదేశం జనసేన పార్టీ రంగులతో ముద్రించి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు ఈ ప్రచారాన్ని
వార్డుల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో జనసేన జెండా ఎగురవేయాలని, ప్రతి వార్డులో కమిటీలు తక్షణమే నియమించి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయానికి ఉచితంగా ఇచ్చిన రాజేష్ ను పరుచూరి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. అంతకుముందు రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కోట్ని సూరిబాబు, మజ్జిశ్రీనివాసరావు, దుడ్డు నాగేశ్వరరావు, సేనాపతి గణేష్, (బాలు) వీర మహిళ స్వాతి, అడ్వకేట్ కళావతి, రామచంద్రరావు, జనసేన టౌన్ వర్కింగ్ కమిటీ సభ్యులు గంటా గోవింద, శ్రీకాకుళపు జగ్గారావు, శిరసపల్లి ప్రసాద్, టిడిపి నాయకులు కోట్ని రాంబాబు, కోట్ని రామకృష్ణ, తలారి లక్ష్మీప్రసాద్ బైండింగ్ శ్రీను, తెలుగు మహిళలు కోట్ని ఉమా, భీశెట్టి హేమ, కాయల ప్రసన్నలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.