1 ENS Live Breaking News

శ్రీవారి వైభవాన్ని భక్తులకు చూపండి

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసారమాధ్యమాలు, పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చూపాలని టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి మీడియా ప్రతినిధులను కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన మంగ‌ళ‌వారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ కోవిడ్ కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ ఏడాది అధిక సంఖ్య‌లో విచ్చేసే  భక్తులకు సేవలందించేందుకు అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి మూలవిరాట్టు దర్శనంతోపాటు వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

    మంగ‌ళ‌వారం సాయంత్రం ధ్వ‌జారోహ‌నం సంద‌ర్భంగా రాష్ట్ర  ప్ర‌భుత్వం త‌రుపున ముఖ్య‌మంత్రి   వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌వారికి పట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని చెప్పారు. అదేవిధంగా దాత‌ల స‌హ‌కారంతో రూ.23 కోట్ల‌తో నిర్మించిన ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని బుధ‌వారం ఉద‌యం సిఎం ప్రారంభించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. మీడియా సెంటర్‌లో భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఫ్యాక్స్‌, టెలిఫోన్‌ వసతి కల్పించామని, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు. టీటీడీ జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, పిఆర్వో డా.టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ‌, ఒఎస్డీ  నాగేశ్వ‌ర‌రావు, సూపరింటెండెంట్‌  శ్రీ‌నివాసులు రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2022-09-27 15:58:11

నూత‌న పరకామణి భ‌వ‌నంలో ఈవో తనిఖీ..

తిరుమలలోని అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న నూత‌న‌ పరకామణి భవనాన్ని టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి గురువారం సాయంత్రం సివిఎస్‌వో  నరసింహకిషోర్‌తో కలిసి త‌నిఖీ చేశారు. ఈ భ‌వ‌నాన్ని సెప్టెంబ‌రు 28న ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఆ త‌రువాత శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో రూ.4 కోట్లతో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఈవో పరిశీలించారు. ఇక్క‌డి భోజ‌న‌శాల‌లో దాదాపు 150 మంది భోజ‌నం చేసేలా అభివృద్ధి చేస్తున్నారు. ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఇఇలు జగన్మోహన్ రెడ్డి,  సురేంద్రనాథ్ రెడ్డి, డిఇ  రవిశంకర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు వెంకటయ్య, సెల్వం, విజివో  బాలిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

Tirumala

2022-09-22 14:49:33

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గవర్నర్ కు ఆహ్వానం

తిరుమల బ్రహ్మోత్సవాలకు స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కు  తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వ హణాధికారి ఏ.వీ ధర్మారెడ్డి ఆహ్వాన పత్రికను అందచేసారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వీరు స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను బహుకరించి బ్రహ్మోత్సవాల విశిష్టతను గురించి వివరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, సతీసమేతంగా ఈ అధ్యాత్మిక వేడుకకు హాజరై స్వామివారి ఆశ్సీస్సులు అందుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-09-21 13:14:23

ఎన్టీఆర్ పేరు మార్పు.. యార్లగడ్డ రాజీనామా

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహానుభావుడి పేరు ఆరోగ్య వర్సిటీకి ఉంచాలన్నదే తన అభిప్రాయమని కుండ బద్దలు కొట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి వున్న ఎన్టీఆర్ పేరు మార్చడం, ఎన్టీఆర్ అభిమానుల మనసు గాయపడటంతోపాటు, ఆ మహానుభావుని ఆత్మకూడా క్షోభిస్తుందన్నారు. ఆయన పేరు మార్పును తట్టుకోలేక బాధతోనే తాను ప్రస్తుతం ఉన్న పదవికి రాజీమా చేస్తున్నానని చెప్పారు. తన రాజీమా లేఖను ప్రభుత్వానికి పంపించానని చెప్పారు.  మరోవైపు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై టీఎన్‌టీయూసీ, తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఇటు వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం హెల్త్ యూనివర్శిటీకి డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు చక్కగా వుందంటూ తమ వాదనని వినిపిస్తున్నారు.

Visakhapatnam

2022-09-21 10:43:35

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకి ఆహ్వానం

కలియుగ వైకుంఠం తిరుమలలోని  ఈ నెల 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల‌ని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి టిటిడి ఆహ్వానం అందించింది. ఈ మేరకు బుధవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి  ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. వెల‌గ‌పూడి సచివా‌లయంలోని ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్‌లో సీఎంను క‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల వివరాలను తెలియజేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు. 

        బ్ర‌హ్మోత్సవాల తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.

Tadepalli

2022-09-21 09:29:30

తిరుమలలో బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్‌

రాష్ట్ర బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్మ‌న్  కేస‌లి అప్పారావు, స‌భ్యులు  త్రిప‌ర్ణ ఆదిల‌క్ష్మి,  ముడిమేల ల‌క్ష్మీదేవి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని వేద పాఠ‌శాల‌, క‌ల్యాణ‌వేదికను ప‌రిశీలించారు.వేద పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో స‌మావేశమ‌య్యారు. అక్క‌డి వ‌స‌తులు, త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. బాల‌ల‌కు ఒత్తిడి లేకుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య అందించాల‌ని సూచించారు. క‌ల్యాణ‌వేదికలో వివాహాలకు అనుమ‌తి ఇచ్చే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు జ‌రుప‌రాద‌ని బోర్డులు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. అనంత‌రం శ్రీ‌వారి ఆల‌య ప‌రిస‌రాలు, ముఖ్య‌మైన కూడ‌ళ్ల‌లో భిక్షాట‌న చేస్తున్న బాల‌ల‌ను గుర్తించి వారికి పునరావాసం క‌ల్పించాల‌ని అధికారులకు సూచించారు. 

అంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహాల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను కమిషన్ పరిశీలించింది. క‌మిష‌న్ వెంట టిటిడి ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిసిపివో  సురేష్‌, హెల్త్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ శ్రీ‌దేవి, లైజాన్ ఆఫీస‌ర్ ఆనంద‌రాజు, డెప్యూటీ ఈవో సెల్వం, విజివో  బాలిరెడ్డి, క‌ల్యాణ‌క‌ట్ట ఏఈవో  ర‌మాకాంత్ త‌దిత‌రులు ఉన్నారు.

Tirumala

2022-09-07 11:36:15

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సామాన్యల‌కు పెద్ద‌పీట

తిరుమ‌ల‌లో రెండేళ్ల త‌రువాత శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లను మాడ వీధుల్లో నిర్వ‌హించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌డుతోంది. క‌రోనా కార‌ణంగా గ‌తంలో రెండు బ్ర‌హ్మోత్స‌వాలు శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌కు పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే అమ‌లు చేయాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. అన్నిర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసింది. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలను టిటిడి ర‌ద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్ల‌తోపాటు శ్రీవాణి ట్ర‌స్టు దాత‌ల‌కు, ఇత‌ర ట్ర‌స్టుల దాతలకు ద‌ర్శ‌న‌ టికెట్లు రద్దు చేశారు. 

స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది. గ‌దుల‌కు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గ‌దుల‌ను ఆఫ్‌లైన్‌లో తిరుమ‌ల‌లోని వివిధ కౌంట‌ర్ల ద్వారా భ‌క్తుల‌కు కేటాయిస్తారు. అక్టోబ‌రు 1న గ‌రుడ‌సేవ కార‌ణంగా భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ట్ర‌స్టుల దాత‌ల‌కు, కాటేజీ దాత‌ల‌కు సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 2వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో గ‌దుల కేటాయింపు ఉండ‌దు. దాత‌లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

              అదేవిధంగా ఎంతో ప‌విత్రంగా భావించే పెర‌టాసి మాసంలో బ్ర‌హ్మోత్స‌వాలు రానుండ‌డంతో పెద్దసంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, తిరుమ‌ల‌లో గ‌దుల ల‌భ్య‌త ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ విషయాన్ని గమనించి భక్తులు తిరుప‌తిలో గ‌దులు పొంది బ‌స చేయాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Tirumala

2022-09-05 09:21:06

భ‌క్తుల స‌మ‌క్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమ‌ల‌లో రెండేళ్ల తర్వాత భ‌క్తుల స‌మ‌క్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వ‌హిం చేందుకు టిటిడి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ కార‌ణంగా రెండేళ్ల‌పాటు ఆల‌యంలో ఏకాంతంగా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని టిటిడి అంచ‌నా వేస్తోంది. ఈ క్ర‌మంలో భ‌క్తుల‌కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతోంది. బ్ర‌హ్మోత్స‌వాల్లో తొమ్మిది రోజుల పాటు జ‌రుగ‌నున్న వాహ‌న‌సేవల వివ‌రాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబ‌ద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగ‌నుంది.


సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు చూసుకుంటే.. సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంట‌ల మ‌ధ్య‌ అంకురార్పణ,  సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15  గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం,  సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం,  సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం, సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం. అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం, 


అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం, అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం సేవలతో పాటు అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను టిటిడి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వీటి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులు దేశవ్యాప్తంగా ఇంటి దగ్గర ఉంటే తిలకించవచ్చు.

Tirumala

2022-09-02 13:07:36

ప్రసూతి కష్టాలు వారిని వెంటాడుతున్నాయ్

మహిళ జీవితంలో తల్లికావడం ప్రతీ అమ్మకు దేవుడిచ్చిన అమూల్యమైన ఒక వరం.. అది సాఫీగా జరిగితే దానంత పండుగ మరొకటి ఉండదు.. అదే తల్లికావడం ప్రభుత్వ ఉద్యోగుల కైతే, ఒక్కోసారి అధికారులు చేసే తప్పిదాలకు ఆ ప్రసూతి కష్టాలు వారిని నిత్యం వెంటా డుతూనే ఉంటాయి.. సరిగ్గా ఇలాంటి ప్రసూతి వేధన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులను నేటికీ వెంటాడుతూనే ఉంది.. తల్లికావడానికి తీసుకున్న ప్రసూతి సెలవుల విషయంలో వచ్చిన సాంకేతిక ఇబ్బందులు, సర్వీసు రెగ్యులర్ అయినా వారి జీతాల కోతల నష్టాలు వారిపై తీవ్రంగా పడుతున్నాయి. 6నెలల ప్రసూతి సెలవుల పొడిగింపు తరువాత సర్వీసు క్రమబద్దీకరణ జరిగినందుకు ఆనందపడాలో.. చివరి నెలలో మిగిలిపోయిన రోజులకు జీతాలు కోత పడినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందీ ఆ సచివాలయ ఉద్యోగులకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెల1 నుంచి క్రమబద్దీకరించిన జీతాలు రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఇస్తున్నామని ప్రకటించింది గానీ, ప్రసూతి సెలవులు తీసుకున్నవారి విషయంలో ఏ విధమైన నిబంధనలు పాటించాలో మాత్రం తెలియజేయలేదు. దీనితో పాత పద్దతిలోనే సెలవుల గడువు ముగియకపోవడంతో( పదిరోజుల తేడాతో) ప్రసూతి సెలవులు తీసుకున్న సచివాలయ మహిళా ఉద్యోగులందరికీ  రూ.15వేలే జీతాలు వచ్చాయి.. మిగిలిపోయి పోయిన రోజుల బకాయి జీతాలు మాత్రం ఇప్పటికీ గాల్లో ఉండిపోయాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు..రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని వుంది.



రాష్ట్ర అధికారుల తప్పిదమే ప్రధాన కారణం
గ్రామ, వార్డు సచివాలయ శాఖలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరికీ ఉద్యోగాలను క్రమబద్దీకరించే సమయంలో, ఎవరైనా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకున్న సమయంలో ఎన్ని రోజుల్లో వారికి అదనంగా ఆరునెలలు పూర్తవుతుందనే విషయాన్ని తెలుసుకొని జీతాల బిల్లు పెట్టాలనే విషయాన్ని సూచించలేదు. దీనితో పాత పద్దతిలోనే సచివాలయ ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టడంతో పాత జీతం రూ.15వేలు మాత్రమే అందుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు జ్యోతి(పేరు మార్చాం) అనే సచివాలయ ఉద్యోగి ప్రసూతి సెలవులు తీసుకున్న సమయంలో ఆమె సెలవులు  జూలై 18కి ఆరునెలలు పూర్తయ్యాయి. కానీ సదరు ఉద్యోగికి జిల్లాశాఖ నుంచి సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేయలేదు. దీనితో ఆమెకు యధావిధిగా పాత పద్దతిలోనే జీతాల బిల్లు పెట్టేశారు. అలా ఆమెకు ఆ నెలలో అంటే ఆగస్టు నెల జీతం రూ.15వేలు మాత్రమే వచ్చింది. కానీ సచివాలయ ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టే సమయంలో 12 రోజు తగ్గించి జీతాల బిల్లులు పెడితే..పెరిగిన జీతం, మరుసటి నెలలో పెట్టాల్సిన జీతంతో కలిపి సాలరీ బిల్లు పెట్టడానికి ఆస్కారం ఉండేది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎవరూ ఆ విధంగా బిల్లులు పెట్టలేదు. కానీ మరుసటి నెల మాత్రం సర్వీస్ డిక్లరేషన్ సాలరీ బిల్ పెట్టడంతో పూర్తి జీతం వచ్చి ముందు నెల మిగిలిపోయిన 12 రోజులకు జీతం మాత్రం గాల్లోనే ఉండిపోయింది.

అధికారుల అవగాహనా రాహిత్యం..
ఒక నెలలో ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులైజేషన్ పూర్తవుతున్న సమయంలో ఏ రోజుకైతే సర్వీసు పూర్తవుతుందో ఆ తేదీనాటికి సర్వీసు రెగ్యులైజేషన్ ఫైలు సదరు గ్రామ, వార్డు సచివాలయానికి రావాలి. కానీ ఆవిధంగా జిల్లా అధికారులు ఆయా ప్రభుత్వశాఖల నుంచి పంపలేదు. దీనితో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడి సచివాలయాల్లో కూడా ఉద్యోగులు వారికి పూర్తిస్తాయిలో సాలరీ బిల్లులు తగ్గించిగానీ, పూర్తిస్థాయిలో గాని పెట్టలేక..పాత పద్దతిలోనే పెట్టారు. ఈ విధంగా పెట్టడం ద్వారా ఒక నెలలో మిగిలిని పోయిన రోజులకు ఇపుడు సదరు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు సాలరీ బిల్లులు ఏ విధంగా పెట్టాలనే విషయమై అధికారులు, సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంత జీతం తగ్గించి పెట్టాలో తెలియక, మరెంత జీతం పెంచి మరుసటి నెలలో పెట్టాలో బోధపడక చాలా సచివాలయాల్లో సర్వీసు రెగ్యులర్ అయినా చాలా మందికి జీతాల బిల్లులు పెట్టలేదు. దీనితో ప్రసూతి సెలవులుు తీసుకున్న ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు రాలేదు. కొన్ని చోట్లు కొత్త జీతాలు వచ్చినా..ముందు నెలలో మిగిలిపోయిన జీతాలను వారంతా కోల్పోవాల్సి వచ్చింది. కొత్త జీతం వచ్చిందనే ఆనందంలో ఆ పదిరోజుల జీతం వదిలేద్దామనుకుంటే సర్వీస్ క్రమబద్దీకరణ జరిగిన సమయంలో పూర్తిస్థాయిలో జీతం తీసుకోనందుకు కారణం ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియాల్సి వుంటుంది. అలా తెలియజేస్తే సచివాయాల్లో సిబ్బంది చేసిన తప్పుని ఒప్పుకోవాలి..అలా చేయని సిబ్బంది ఏటూ తేల్చుకోలేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందితో ఎటూ పాలుపోని స్థితిలో ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు.


చేతులెత్తేసిన ఖజానా శాఖ..
ఎలాంటి ముందస్తు సమాచారం గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సూచించకపోవడంతో  పాత పద్దతిలోనే సాలరీ బిల్ పెట్టడం ద్వారా మహిళా ఉద్యోగులు ముందు నెలలో మిగిలిపోయిన జీతం కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ట్రజరీ అధికారుల ద్రుష్టికి తీసుకెళితే అంతా అయిపోయిన తరువాత తామేంచేస్తామని వారు కూడా చేతులెత్తేశారు. ఈ సమస్య ఒకరో, ఇద్దరో పడితే ఏదో అనుకోవచ్చు  జూలై, ఆగస్టు నెలలకి తీసుకున్న ఆరు నెలల సెలవులకి రెండేళ్లు పూర్తిచేసుకున్న మహిళా ఉద్యోగులంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వీరికోసం కొందరు సీనియర్ పంచాయతీ కార్యదర్శిలు ప్రస్తుతం ట్రజరీ అధికారులు, సిబ్బందితో సంప్రదింపులు జరిపినా ఫలితం మాత్రం రావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారిక ఉత్తర్వులు వస్తే తప్పా తామేమీ చేయలేమని ట్రజరీ అధికారులు తెగేసి చెబుతున్నారు. జీతాల్లో తీవ్రమైన కోత నష్టంతో ఇబ్బంది పడుతున్న ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రకటన జారీ చేస్తుందా..లేదంటే ట్రజరీ అధికారులు ద్వారా ప్రత్యేక మార్గాన్ని చూపిస్తుందా అనేది నేటికీ తేలలేదు. ఇదే పద్దతి కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా సర్వీసు పూర్తికాకుండా, ప్రసూతి సెలవుల్లోనే ఉండిపోయిన మహిళా ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో జీతాలు కోల్పోవాల్సి వస్తుంది. చూడాలి జీతాలు నష్టపోయిన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏవిధమైన పరిష్కారం చూపిస్తుందనేది..!

Guntur

2022-09-02 01:11:03

ens live హాస్పటల్ ప్రొఫైల్ లో మీకోసం

మీరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులా.. మంచి ఆరోగ్య సేవలు అన్నివర్గాల ప్రజలకు అందిస్తారా.. తక్కువ సమయంలో మీ ఆసుపత్రికోసం సమస్త ప్రజలకు తెలియ జేయాలనుకుంటున్నారా.. అయితే మీకు చక్కటి వేదిక Ens Live మొబైల్ న్యూస్ యాప్ మరియు అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.esnlive.net భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! ద్వారా మీ ఆసుపత్రిలో అందించే చక్కటి వైద్యం కోసం అన్నివర్గాల ప్రజలకు మేం తీసుకువెళతాం. దానికి మీరు చేయాల్సిందల్లా మీ పూర్తివివరాలు, ఆసుపత్రి ఫోటో, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తదితర వివరాలు మాకు సమర్పించడమే. ఇంకెందుకు ఆలస్యం ఇపుడే 9490280270, 9390280270లో సంప్రదించి..మీ ఆసుపత్రి సేవలు ప్రపంచానికి తెలియజేయండి..!

Tadepalli

2022-09-01 02:06:14

బయోమెట్రిక్ పడితేనే ఇక జీతభత్యాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇలా అన్నిచోట్ల ప్రజలకు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా భయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సును పక్కాగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సు పక్కాగావేస్తే తప్పా నెలాఖరుకి జీతబత్యాలు వచ్చే పరిస్థితితి లేదని తేల్చి చెప్పింది. అందుకోసం సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేసింది.  ఈ విషయంలో ఏ ఒక్కప్రభుత్వశాఖకు వెసులుబాటు లేదని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే సమయంలో అధికారులతోపాటు, ఉద్యోగులూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్యాలయాల పనివేళల్లో ప్రజలు ఏ పనిపై వచ్చినా వారికి సిబ్బంది అందుబాటులో ఉండి వారి పనులు సత్వరమే చేస్తారనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

సచివాలయాల్లో 3సార్లు బయో మెట్రిక్..
ప్రభుత్వ శాఖల్లో తొలిసారిగా తీన్ మార్ బయోమెట్రిక్ ను గ్రామ, వార్డు సచివాలయశాఖలో అమలు చేశారు. ఇక్కడ ఉద్యోగులు రోజులో మూడు సార్లు భయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. మొత్తం 19శాఖలకు చెందిన సిబ్బందిలో అత్యవసర పని ఉన్నప్పుడు తప్పా బయటకు వెళ్లే వీలులేకుండా ఏర్పాట్లను పక్కాగా అమలు చేస్తోంది. నెలలో హాజరు లో తేడాలు, తక్కువ వస్తే సదు ప్రభుత్వశాఖ జిల్లా, డివిజన్, మండల శాఖ అధికారుల నుంచి డ్యూటీ సర్టిఫికేట్ తెస్తే తప్పా జీతాల బిల్లులు కూడా సచివాలయాల్లో పెట్టడం లేదు. దీనితో రోజులో మూడు సార్లు బయోమెట్రిక్ వేసే తొలి ప్రభుత్వ శాఖగా గ్రామ,వార్డు సచివాలయశాఖ తొలిస్థానంలో ఉంది. చాలా చోట్ల పాత పంచాయతీ కార్యదర్శిలు, కొందరు సచివాలయ కార్యదర్శిలు బయో మెట్రిక్ హాజరు విషయంలో తేడాలు చేస్తున్నవారిని కూడా ప్రభుత్వం గుర్తించి ఒక్కొక్కరినీ ఇంటికి పంపే కార్యక్రమానికి కూడా తెరలేపింది.

విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్..
విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తోపాటు, పిల్లల హాజరుని కూడా ఇకపై ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో చేపట్టాల్సి వుంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీఓ కూడా జారీచేసింది. ఒక్క విద్యాశాఖలోనే ఉపాధ్యాయులు మొత్తం 13 రకాల యాప్ లలో డేటా ప్రతినిత్యం అప్లోడ్ చేయాల్సి వుంటుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠ్యాంశాలు చెప్పే సమయం కంటే ప్రభుత్వం ఇచ్చిన యాప్స్ లలో డేటాను నమోదు చేయడానికే అత్యధిక సమయం పడుతోంది. అందులోనూ ఇన్ని రకాల యాప్ లు ఇచ్చిన ప్రభుత్వం ఎవరికీ సెల్ ఫోన్లు మాత్రం ఇవ్వలేదు. దీనితో ఉపాధ్యాయుల సొంత సెల్ ఫోన్లు కొనుగోలుచేసి ఒక ఫోన్ ను పాఠశాల యాప్ ల కోసం, మరో ఫోను వారి సొంత కార్యకలాపాలకోసం వినియోగించాల్సి వస్తున్నది. ప్రతినిత్యం చాలా అంశాలకు చెందిన ఫోటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేయాల్సి రావడంతో  ఫోన్ మెమొరీలు సైతం నిండిపోయి సొంత అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థి ఏర్పడి ఒక్కొక్క ఉపాధ్యాయుడూ రెండు ఫోన్లు కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇపుడు ప్రభుత్వం ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లోనే డేటాను అప్లోడ్ చేయాలని చెప్పడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది.

నిబంధనలు పాటించకపోతే వేటు తప్పదు
ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వ యాప్ లను ఖచ్చితంగా వినియోగించాలి. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లోనే బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. అలా కాకుండా నచ్చినట్టు చేయాలని చూస్తే ఇంటికి వెళ్లిపోవడానికి సిద్దపడాలి. మొన్నటి వరకూ పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది వారికి నచ్చినట్టుగా విధులు నిర్వహించేవారు ఇపుడు అక్కడ కూడా విధులకు ఎన్నిగంటలకు వస్తున్నారు..? ఎన్నిగంటలకు విధులు ముగించుకొని వెళుతున్నారు తదితర వివరాలు తెలుసుకునేందుకు ఆన్ లైన్ అటెండెన్సును ప్రభుత్వం ఖచ్చితంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మండల కార్యాలయాల్లో కూడా ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. అమలు చేసిన శాఖల వివరాలను రాష్ట్ర కార్యాలయంలోని డేష్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పరిపాలనలో మార్పులు, చేర్పులు తీసుకు వచ్చి ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలను అందుబాటులో ఉంచేలా చేయడంలో వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ యాప్ లపై ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నవేళ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్ లైన్ అటెండెన్సు అమలు చేసే చర్యలు ముందు ముందు ఎలాంటి ఫలితాలు తెస్తాయనేది..!

Guntur

2022-09-01 01:40:31

వైద్యరంగంలో 45వేల ఉద్యోగాలు భర్తీచేశాం

పేద, మధ్య తరగతి ప్రజలందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి వినూత్న మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. గత మూడేళ్లలో వైద్య శాఖలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేసామన్నారు. విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్ లోని బుధవారం రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య, వైద్య సేవల వివరాలను మీడియా ప్రతినిధులకు వివరించారు.  ఈ సందర్భంగా ఎం.టీ. కృష్ణబాబు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  వైద్యరంగంలో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామని,  ఇప్పటికే 45 వేల మందిని నియమించామని తెలిపారు. కొత్తగా 5వేల మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వైద్యరంగంలో నాడు-నేడు కింద రూ.16,255 కోట్లతో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, అన్నిస్థాయిల్లో వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలతో పాటు మరో 16 క్రొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తున్నామని.. వీటిలో 5 మెడికల్ కాలేజీలు 2023 నాటికి సిద్దం చేస్తున్నామని, మిగతా కాలేజీలు 2024 నాటికి పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. అలాగే గ్రామస్థాయి నుంచి ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువచేస్తూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో కలిపి మొత్తం 5 మంది వైద్యసిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అలాగే ప్రతీ మండలంలో 2 పీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి పీహెచ్‌సీ నుంచి టెలి మెడిసిన్‌ సదుపాయం కల్పించి అందరికీ వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఒక మెడికల్ హాబ్ ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. 

గ్రామ స్థాయి నుంచి.. ప్రతి పీహెచ్‌సీలో 67 రకాల మందులు, 14 రకాల టెస్టులు అందుబాటులో​ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పీహెచ్‌సీలో గర్భిణీలు, బాలింతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలకనుగుణంగా ప్రతి గర్బిణీకి రెండు సార్లు స్కానింగ్ చేయిస్తున్నామని, బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు డాక్టర్, ఆశా, ఏఎన్ఎంల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తూ ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నప్పటికీ 1, 2 శాతం లోపాలను కొన్ని మీడియా సంస్థలు ఎత్తిచూపుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా ప్రచారం కల్పించి ప్రజలకు మరింత మేలు కలిగేలా వారు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.  

రాష్ట్రంలో 2,400 ఆసుపత్రుల్లో, ఇతర రాష్ట్రాల్లో 238 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సమర్థవంతంగా అమలు జరగుతుందని ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. జూలై నెల వరకూ ఆరోగ్యశ్రీ అన్ని బిల్లుల చెల్లింపులు పూర్తి చేశామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83,400 మంది ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు పొందారని, వీరికి ప్రభుత్వం 85 కోట్లు ఖర్చు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 40 కోట్లు ప్రభుత్వం వెచ్చించి ఈ పథకం కింద వైద్య సేవలు అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25 శాతం వరకూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనిని 50 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భవ, ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో  పనిచేసే వైద్యులకు అందించే ప్రొత్సాహకాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. 

రిమోట్ ప్రాంతాల్లో పని చేయటానికి నిపుణులు, వైద్యులు ముందుకు రావటం లేదనే కారణంతో అటువంటి ప్రాంతాల్లో పని చేయటానికి వచ్చే స్పెషలిస్టులకు 50 శాతం, ఎంబీబీఎస్ వైద్యులకు 30 శాతం అదనపు ప్రయోజనాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. స్పెషలిస్టుల కొరత తీర్చేందుకు ఏడాది పాటు పీజీ విద్యార్థులకు రూరల్ ఏరియాలో సర్వీస్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ ల కొరత ఉందన్నారు. పులివెందులలో 17 మంది డాక్టర్లు ఉన్నారని, మిగతా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశామన్నారు. బయోమెట్రిక్ హాజరు పెట్టిన తర్వాత డాక్టర్ల పనితీరు మెరుగుపడిందన్నారు. 

వైద్య రంగంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను సెప్టెంబర్ చివరి నాటికి భర్తీ చేస్తామన్నారు. పాడేరు ప్రాంతంలో ఏడుగురిలో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయని, కానీ పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జె. నివాస్ తెలిపారు. అయినా టిష్యూ కల్చర్ కోసం శాంపుల్స్‌ ను విశాఖకు పంపించామని, గురువారం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. 

Vijayawada

2022-08-31 16:24:56

ఏపీపీఎస్సీలో కొత్త సిలబస్ బీఅలర్డ్..!

ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) పోటీ పరీక్షలకు సంబంధించి భారీ స్థాయిలో మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని పరీక్షలకు సంబంధించి సిలబస్ మార్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. దానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం ఎపీపీఎస్సీ నిర్వాహకులతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. చాలా ఏళ్ల నుంచి పోటీ పరీక్షలకు సంబంధించినంత వరకూ సిలబస్ పాతదే ఉండటమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తోపాటు ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి స్టాండర్డ్ సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఆ పాత సిలబస్ తో కాకుండా మారిన పరిస్థితులకు అనుగునంగా సిలబస్ మార్చి ఇకపై వచ్చే పదేళ్లలో పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతీ ఏడాదీ ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ కేలండర్ ను కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు అధికారులు సైతం చెప్పుకొస్తున్నారు.

పదేళ్ల నుంచి ఒక సిలబస్సే కారణం..
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ఏళ్ల నుంచి ఒక ఆనవాయితీని అనుసరిస్తున్నది. ప్రతీ పదేళ్లకు ఒకసారి సిలబస్ ను వివిధ పోటీపరీక్షలకు ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు మారుస్తూ వస్తున్నది. అందులోభాగంగానే ఈ ఏడాది కూడా నోటిఫికేషన్లు ఇచ్చే ముందు సిలబస్ మార్పు విషయాన్ని ప్రకటిస్తుందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. అంతేకాదు చాలా ఏళ్ల నుంచి ఈ విధానమే కొనసాగుతుండంతో పోటీపరీక్షల అభ్యర్ధులను కూడా అలెర్ట్ చేస్తూ వస్తున్నది. ప్రతీ ఏడాదీ జాబ్ కేలండర్ ను ప్రకటించకపోయినా..ప్రతీ పదేళ్లకు ఒకసారి ఏపీపీఎస్సీ సిలబస్ ను మాత్రం మార్పు చేస్తూ కమిషన్ తన గుర్తింపును చాటుకుంటోంది. దానికి తోడు చాలా కాలం నుంచి గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్ధులు లాంగ్ గ్యాప్ నుంచి ప్రిపరేషన్ లోనే ఉండిపోయారు.

ముందస్తుగా స్టాండర్డ్ సిలబస్ పైనే కోచింగ్..
APPSC సిలబస్ ఎప్పుడు ఏవిధంగా మార్చినా తమ కోచింగ్ సెంట్ల అభ్యర్ధులు నష్టపోకుండా అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఇతర జనరల్ స్టడీస్ పై కూడా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సిలబస్ మార్పులకు అనుగుణంగా కోచింగ్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్లు త్వరలోనే రాబోతున్నాయనే ప్రచారం నేపథ్యంలో మారబోయే సిలబస్ కి తగ్గట్టుగా కూడా మార్పులు, చేర్పులు చేసే కోచింగ్ లు ఇస్తున్నారు. ఇటు అభ్యర్ధులు కూడా  5వ తరగతి నుంచి డిగ్రీ వరకూ పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలపైనే ఎక్కువగా ద్రుష్టిపెడుతున్నారు. పైగా పోటీ పరీక్షల సరళిపై ప్రతీ ఒక్కరికీ పూర్తిగా అవగాహన పెరిగిన ద్రుష్ట్యా ప్రభుత్వం గానీ, ఎపీపీఎస్సీ గానీ సిలబస్ మార్చినా ఎక్కడా ఇబ్బంది పడకూడదనే విధంగాతోనే ప్రిపరేషన్ లో మునిగి తేలుతున్నారు అభ్యర్ధులు.

కొత్తసిలబస్ పట్ల జాగ్రత్తలు..విజయం మీదే
ప్రస్తుతం ఎపీపీఎస్సీ అన్ని పోటీ పరీక్షలకు సిలబస్ మారుస్తుందనే ప్రచారం నేపథ్యంలో అభ్యర్ధులు కూడా చాలా జాగ్రత్తలు పడాలని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఏపీపీఎస్సీ అభ్యర్ధులను ఒడపోత పోసే విధానంలో భాగంగా సిలబస్ లో మార్పులు చేసినా దానికి అనుగుణంగానే ప్రిపరేషన్ లో తేడాలు గమనించుకొని వ్యూహాత్మకంగా ముందుకి సాగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సమకాలీనా రాజకీయాలు, రాష్ట్రీయ, జాతీయ అంశాలతోపాటు, అంతర్జాతీయ విషయాలను, కరెంట్ అఫైర్స్  విషయంలో జాగ్రత్తలు పాటించడంతోపాటు అర్ధమెటిక్, రీజనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే..స్టాండర్డ్ గా ఉండే జనరల్ స్డడీస్ విషయంలో భయపడే పనుండదని కూడా పలువురు ప్రముఖ కోచింగ్ ఎక్స్ పర్ట్ లు తెలియజేస్తున్నారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి ఏపీపీఎస్సీ సిలబస్ ను మార్పు చేయడం అనాదిగా వస్తున్న విషయమే అనే విషయాన్ని అభ్యర్ధులు పూర్తిస్థాయిలో ద్రుష్టిలో పెట్టుకొని తమ కోచింగ్ ను కూడా గత పదేళ్ల మోడల్ పేపర్లను ద్రుష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ చేసుకోవాలని..అదేవిధంగా ప్రస్తుత అంశాలను కూడా కలగలిపి చదువుకోవాలని చెబుతున్నారు. ఎప్పుడు..ఏ విధంగా ఒడపోత కార్యక్రమానికి ఎపీపీఎస్సీ తెరలేపినా అభ్యర్ధులు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా విజయ సంకల్పంతోనే ముందుకు సాగాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net కూడా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.!

Guntur

2022-08-31 08:00:21

ens live పొలిటికల్ ప్రొఫైల్ లో మీ పబ్లిసిటీ

మీరు రాజకీయ నాయకులా..మీరు చేస్తున్న కార్యక్రమాలు బాహ్య ప్రపంచానికి తక్కువ సమయంలో ఎక్కువగా తెలియజేయాలనుకుంటున్నారా.. అయితే దానికి సరైన వేదిక Ens Live మొబైల్ న్యూస్ యాప్ మరియు అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.esnlive.net భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్ (ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! ద్వారా మీ పొలిటికల్ గ్రాఫ్ ను అన్ని వర్గాల ప్రజలకు మేం తీసుకు వెళతాం. దానికి మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, రాజకీయపార్టీకి చెందిన లోగో లేదా ఫోటో, మీ చక్కనైనా పాస్ పోర్టు సైజు ఫోటో, మీ చదువు, అనుభవం, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తదితర వివరాలు మాకు సమర్పించడమే. ఇంకెందుకు ఆలస్యం ఇపుడే 9490280270, 9390280270లో  సంప్రదించగలరు. మీకోసం బాహ్య ప్రపంచానికి తెలియజేయండి..!


Visakhapatnam

2022-08-31 04:37:45

కాష‌న్ డిపాజిట్‌పై పనిగట్టుకొని దుష్ప్ర‌చారం

తిరుమలలో కాష‌న్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్ర‌భుత్వం వినియోగించుకుంటోంద‌ని, ఈ కార‌ణంగానే ఆల‌స్యంగా భ‌క్తుల ఖాతాల్లోకి చేరుతోంద‌ని కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇలాంటి అవాస్త‌వాల‌ను భక్తులు న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. కాష‌న్ డిపాజిట్ సొమ్మును భ‌క్తుల ఖాతాల్లోకి పంపుతున్నామ‌ని తెలియ‌జేసింది. ఈ విష‌యంలో అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసిన ఎంఎల్‌సి  బీటెక్ ర‌విపై టిటిడి అధికారులు సోమ‌వారం తిరుమ‌ల టూ టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు క‌రంట్ బుకింగ్‌, ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో గ‌దులు బుక్ చేసుకుంటున్నారు. భ‌క్తులు గ‌దులు ఖాళీ చేసిన త‌రువాతి రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌లోపు కాష‌న్ డిపాజిట్ రీఫండ్ ఎలిజిబిలిటి స్టేట్‌మెంట్‌ను అధీకృత బ్యాంకులైన ఫెడ‌ర‌ల్ బ్యాంకు లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల‌కు పంపడం జ‌రుగుతుంది. ఈ బ్యాంకుల అధికారులు అదేరోజు అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌లోపు(బ్యాంకు ప‌నిదినాల్లో) సంబంధిత మ‌ర్చంట్ స‌ర్వీసెస్‌కు పంపుతారు. 

మ‌ర్చంట్ స‌ర్వీసెస్ వారు మ‌రుస‌టిరోజు క‌స్ట‌మ‌ర్ బ్యాంకు అకౌంట్‌కు పంప‌డం జ‌రుగుతుంది. క‌స్ట‌మ‌ర్ బ్యాంకు వారు సంబంధిత అమౌంట్ క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్‌(ఏఆర్ నంబ‌రు)ను, సొమ్మును సంబంధిత భ‌క్తుల అకౌంట్‌కు పంపుతారు. క‌స్ట‌మ‌ర్ బ్యాంకు వారు భ‌క్తుల అకౌంట్‌కు సొమ్ము చెల్లించ‌డంలో జాప్యం జ‌రుగుతోంద‌ని టిటిడి గుర్తించ‌డం జ‌రిగింది. ఒక‌వేళ భ‌క్తులు యాత్రికుల స‌మాచార కేంద్రాలు, కాల్ సెంట‌ర్, ఈ-మెయిల్‌ ద్వారా స‌మ‌స్య‌ను టిటిడి దృష్టికి తీసుకొచ్చిన ప‌క్షంలో పైవివ‌రాల‌తో సంబంధిత బ్యాంకుల్లో విచార‌ణ చేయాల‌ని భ‌క్తుల‌కు సూచించ‌డం జ‌రుగుతోంది.

           రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం 7 బ్యాంకు ప‌నిదినాల్లో కాష‌న్ డిపాజిట్ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులై 11 నుండి 4, 5 రోజుల్లో రీఫండ్ చేరే విధంగా టిటిడి యుపిఐ విధానంలో రీఫండ్ చేయ‌డం జ‌రుగుతోంది. దీనివ‌ల్ల నేరుగా భ‌క్తుల అకౌంట్‌కే రీఫండ్ సొమ్ము చెల్లించ‌డం జ‌రుగుతోంది.

            ఇదిలా ఉండ‌గా కొంద‌రు వ్య‌క్తులు ప‌నిగ‌ట్టుకుని కాష‌న్ డిపాజిట్‌కు సంబంధించి టిటిడిపై దుష్ప్ర‌చారం చేయ‌డం మంచిది కాదు. వాస్తవంగా కాష‌న్ డిపాజిట్ సొమ్ము నేరుగా భ‌క్తుల ఖాతాల‌కే చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి వినియోగించుకుంటున్నాయని ఆరోపించడం శోచనీయం.  వాస్త‌వాల‌ను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి తెలియజేస్తోంది.

Tirumala

2022-08-29 12:26:55