1 ENS Live Breaking News

సీపీఎస్ పై మళ్లీ కథ ముందుకొచ్చింది..

సీపీఎస్ పై కథ మళ్లీ ముందుకొచ్చింది.  ఆర్థిక భారం కారణంగా సీపీఎస్​ను రద్దు చేసి ఓపీఎస్​ను అమలు చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం సీపీఎస్‌ అంశంపై వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు 5 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. పాత పింఛను విధానమే కావాలి, జీపీఎస్‌పై చర్చకు కూడా సిద్ధంగా లేమని సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. దీనితో సీపీఎస్​ రద్దుపై పీఠముడి వీడలేదు. మధ్యే మార్గంగా జీపీఎస్​ను అమలు చేస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపినా.. ఉద్యోగులు మాత్రం సీపీఎస్​ను రద్దు చేసి, ఓపీఎస్​ను అమలు పరచాలని ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్​ను ఒప్పుకోబోమని చెప్పారు. అంతేకాకుండా సెప్టంబర్ ఒకటిన సీఎం ఇంటి ముట్టడి మాత్రం జరిగి తీరుతుందని స్పష్టంచేయడంతో ప్రభుత్వం కూడా తమ వాణిని బలంగానే వినిపించింది. సీపీఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)పై చర్చకు కూడా తాము సిద్ధంగా లేమని.. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్‌) అమల్లోకి తేవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పినా ప్రభుత్వం ససేమిరా అనడం విశేషం.  ఓపీఎస్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్టెంబరు 1న తలపెట్టిన ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, విజయవాడలో మిలియన్‌ మార్చ్‌, బహిరంగ సభ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో ప్రతిష్టంభన వీడలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీలో మరో సభ్యుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశానికి హాజరవలేదు. దీనితో బుగ్గనతో మాట్లాడాక, మరోసారి చర్చలకు పిలుస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రి బొత్స, సజ్జల తెలియజేశారు. అయితే జీపీఎస్‌ అంశంపై చర్చించేందుకైతే తాము రాబోమని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమల్లోకి తెస్తామని విస్పష్టమైన ప్రకటన చేస్తేనే చర్చలకు వస్తామని చెప్పడంతో సీపీఎస్ అంశం మళ్లీ రసకందాయంలో పడింది.

ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఉంది. పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ సమస్యకు త్వరలోనే ముగింపు పలకాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఉద్యోగులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటుందని వారికి సజ్జల చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు’’ అని సమావేశం అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే  మరియదాస్‌పాత పింఛను విధానంపైనా.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అమలవుతున్న విధానంపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చామని.. సానుకూల స్పందన ఆశిస్తున్నామనుకున్నాం కానీ ప్రభుత్వం ఆ దిశగా కాకుండా జీపీఎస్ అమలు చేస్తామని చెప్పడం పట్ల ఉద్యోగ సంఘాలు అభ్యంతరం తెలియజేశాయి. దీనితో సీపీఎస్ కధ మళ్లీ ముందుకొచ్చినట్టు అయ్యింది. సాధ్యమైనంత వరకూ సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం ఎక్కడా అనుకూలంగా లేదనే సంకేతాలు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తెలియజేసింది.

Guntur

2022-08-19 14:39:18

శ్రీ వారి సేవలో సుప్రీం చీఫ్ జస్టిస్..

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ  కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఆలయం ఎదుట  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి జస్టిస్ రమణ కు స్వాగతం పలికారు . ఆలయ ప్రదక్షిణగా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు . రంగనాయకుల మండపంలో  వేద ఆశీర్వచనం అనంతరం చైర్మన్  వైవి సుబ్బారెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు . తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్ , టీటీడీ ఈవో   ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ  ఈవో రమేష్ బాబు పాల్గొన్నారు.

Tirumala

2022-08-19 11:25:08

ఎన్నికల ముందే బకాయి డీఏలకు మోక్షం..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఇవ్వాల్సిన డీఏ బకాయిలకు మోక్షం కలగాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ ఆగాల్సిందేనా.. ఎన్నికల ముందు బకాయి డీఏలే తాయిలాలుగా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ద్రుష్టి మొత్తం సామాన్య ప్రజల సంక్షేమం మీదే వుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజల సంక్షేమం కాదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను మంజూరు చేస్తే సంక్షేమ పథకాల అమలుకి ఆర్ధిక ఇబ్బందులు వచ్చిపడతాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సమయానికి జీతాలు అందుతున్నాయి కనుక డీఏల బకాయిలన్నీ ఎన్నికల ముందు రిలీజ్ చేయడం ద్వారా ఉద్యోగులకు ఒకే సారి డిఏలు ఇచ్చినట్టుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు బకాయి డిఏలు ప్రభుత్వ అధికారులకిచ్చే మొత్తంతో నవరత్నాల్లోని ఒక పథకానికి అర్హులైన వారికి నగదు బదిలీల చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా ఉండటంతోనే బకాయి డిఏల ఊసెత్తడం లేదని ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ తీరుపైన తీవ్ర ఆగ్రహం ఉన్నారు.

డిఏ ఇవ్వాల్సి వస్తే.. సచివాలయాల భారం కూడా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు డీఏలు ఇవ్వాల్సి వస్తే ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసులు రెగ్యులర్ అయ్యాయి కనుక రాష్ట్రవ్యాప్తంగా వున్న ఒక లక్షా 21వేల మంది సచివాలయ ఉద్యోగులకు కూడా డిఏ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే బకాయి డీఏ భారం ప్రభుత్వంపై పడుతుండగా..ఇపుడు గ్రామ,వార్డు సచివాలయాలు కూడా తోడవుతాయి. అపుడు మరింత ఆర్ధిక భారం అవుతుంది. అయితే ఇప్పటి కిప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు డీఏ ఇస్తే సచివాలయ ఉద్యోగులకు డీఏ ఇచ్చే పనుండదు. అలా కాకుండా డీఏ బకాయిలు ఇవ్వడానికి సమయం తీసుకుంటే..సచివాలయ ఉద్యోగులకు కూడా డీఏ ఇవ్వాల్సి వచ్చి ప్రభుత్వానికి మరింత ఆర్ధిక భారంగా పరిణమిస్తుంది. కాగా ఇప్పటికే దగ్గర దగ్గర రెండు డీఏలు కోల్పోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలో ఇచ్చే డీఏ ఇవ్వకపోతే మాత్రం అటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే పీఆర్సీ ప్రకటించి సచివాలయ ఉద్యోగులకు ఎరియర్స్ మొత్తాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇపుడు డీఏల కోత కూడా విధిస్తే దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై చాలా తీవ్రంగా పడే అవకాశాలు కూడా లేకపోలేదు.

పీఆర్సీకి ముసలం తెచ్చింది సచివాలయాలే..
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు పీఆర్సీకి ముసలం తెచ్చింది గ్రామ, వార్డు సచివాలయ శాఖ అనే విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం.ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ద్రుష్టిలో ఉంచుకొనే పీఆర్సీ ఇచ్చే సమయానికి పాత డీఏలు, హెచ్ఆర్ఏ స్లాబులను ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్ధిక భారం లేకుండా కుదించింది. అలా కుదించిన మొత్తాన్ని భర్తీచేస్తున్నట్టుగా అదే మొత్తాన్ని ఉద్యోగులకు పీఆర్సీ కింద మంజూరు చేసింది.  దాని ప్రభావంతో సచివాలయ ఉద్యోగులు 9నెలలు పీఆర్సీ పేస్కేలు, ఆ సమయంలో ఒక డీఏ, పెరిగిన పీఆర్సీ ఎరియర్స్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆవిషయాన్ని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించకుండా ఉండేందుకు నేరుగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తున్నట్టుగా ప్రకటించి రెండేళ్లు దాటిన ఉద్యోగులకు ఆగస్టు1కి కొత్తగా పెరిగిన పేస్కేలును అమలు చేసింది ప్రభుత్వం. దీనితో ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య, వారికి ఏ అదనపు మొత్తం ఇచ్చినా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపే ఇవ్వాల్సి రావడంతో ఆ భారాన్ని ప్రభుత్వం మోసే పరిస్థితి కనిపించడంలేదు. దీనితో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేయకుండా దాటవేస్తూ వస్తున్నది. వాస్తవానికి పాత పేస్కేలు ప్రకారం పెంచిన పీఆర్సీ మొత్తం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిఉంటే ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు చాలా మొత్తం జీతం ఇవ్వాల్సి వచ్చేది. అలా ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేందుకే సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయానికి హెచ్ఆర్ఏ, డీఏ స్లాబులను పూర్తిగా కుదించేసింది ప్రభుత్వం.

సచివాలయ ఉద్యోగులకు తప్పా..అందరికీ డీఏలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యేనాటికి 9నెలల పేస్కేలతోపాటు ఒక డీఏ, పీఆర్సీ ఎరియర్స్ కూడా కోల్పోయారు. వాళ్ల సర్వీసు రెగ్యులైజేషన్ ఆగస్టులోనే అయ్యింది కనుక సర్వీస్ రెగ్యులర్ అయిన తరువాత ఆరునెలలకు ఒక డీఏ ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు అయితే సచివాలయ ఉద్యోగులు మరో డీఏ కూడా కోల్పోతారు. అలా పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులకు డీఏలు, హెచ్ఆర్ఏ, ఇతర ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఏటూగానీ సమయానికి అంటే.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన రెండేళ్ల ప్రొబేషన్ సమయానికంటే ఆలస్యం 9నెలలు ఆలస్యంగా ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించింది.  ఇంకా అందులో చాలా మంది మహిళా ఉద్యోగిణిలు మెటర్నటీ లీవు తీసుకున్న సందర్భంగా వారి సర్వీసు మరో ఆరు నెలలు పొడిగింపు వర్తించింది. ప్రభుత్వం జీఓ నెంబరు 5లో ప్రకటించినట్టుగా ఒక లక్షా 21 వేల మంది ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ కాలేదు. ఆగస్టు1వ తేదీ నాటికి కొంతమంది ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యింది. మెటర్నటీ లీవులు తీసుకున్నవారందరూ పాత పద్దతిలో రూ.15 వేలు మాత్రమే జీతాలు తీసుకున్నారు. అలా సెప్టెంబరు 1నాటికైనా మిగిలిన వారికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ అవుతుందా అంటే దానికి ఇంకా డీఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ల నుంచి క్రమబద్దీకరణ ఉత్తర్వులు రాలేదు. ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీనాటికి ఉద్యోగులందరికీ జీతాలు పెట్టాల్సి వుంది. అయినప్పటికీ నేటికీ గత నెలలో సర్వీసు క్రమబద్దీకరణ కానివారి జాబితాలు ఇంకా సచివాయాలకు చేరలేదు. దీనితో సచివాలయ ఉద్యోగులకు తప్పా మిగిలిన ఉద్యోగులందరికీ డీఏ వచ్చే అవకాశం వుంది అదీ కూడా ఎన్నికల ముందు తప్పా.. అంతకు ముందు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం బకాయి డీఏల విషయంలో ఏం చేస్తుంది..ఎప్పుడు చెల్లిస్తుంది..దానికోసం ఎప్పుడు ప్రకటిస్తుందనేది..!

Guntur

2022-08-19 01:58:54

2023 ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి జిల్లాల్లోనే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి 13 జిల్లాల్లోనే 2024 వరకూ ఇస్తుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను అయితే మార్చింది తప్పితే చాలా వరకు విధాన పరమైన కార్యకలాపాలు ఉమ్మడిజిల్లాల్లోనే చేపడుతుండటమే దీనికి కారణం కనిపిస్తుంది. ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫైళ్లపై పాత జిల్లా కలెక్టర్లు, పాత జిల్లాశాఖల అధికారులే సంతకాలు చేసి ఆర్డర్లు జారీ చేశారు. ఇపుడు కొత్త జిల్లాల్లో పనిచేసే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు కూడా పాత ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఉన్నచోటనే సమాచారశాఖ చేయించాలని చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఆయా జిల్లాల సమాచారశాఖ డీడీలు కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర సమాచారశాఖకు తెలియజేశారని చెబుతున్నారు. వాస్తవానికి ఏ జిల్లాలో కలెక్టర్ ఉంటే ఆ జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్ చైర్మన్ హోదాలో కలెక్టర్ కార్డులు జారీ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్నీ నిబంధనలకు విరుద్దంగానే జరుగుతుండంటంతో ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో పాత నిబంధనే పాటించాలని సమాచారశాఖ యోచిస్తుందనే ప్రచారం జరుగుతుంది.

జిల్లా పరిషత్ లు మారేంత వరకూ ఉమ్మడి జిల్లాలే
ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు 26 జిల్లాలు అయినా జిల్లా పరిషత్ లు మాత్రం ఉమ్మడి జిల్లా కేంద్రంగానే పనిచేస్తున్నాయి. పాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవీకాలం పూర్తయ్యేంత వరకూ ఉమ్మడి జిల్లాల కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయని..అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒక్క జిల్లా పరిషత్ లు మాత్రమే కాకుండా పాత ఉమ్మడి జిల్లాల కార్యాలయాల వ్యవహారాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని.. కొత్త జిల్లాల్లో మాత్రం పరిపాలన కేంద్ర సర్వీసులకు సంబంధించినంత వరకూ ఇప్పుడిప్పుడే అధికారాల బదలాయింపులు జరుగుతున్నాయని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. వాస్తవానికి చాలా సంస్థలకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండి పలు కీలక వ్యవహారాలు చేయాల్సి వుంటుందనే విషయాన్ని ప్రస్తావించినపుడు.. ఉమ్మడి జిల్లాల్లో చేపట్టే కార్యకలాపాలు తప్పించి ఇతర కార్యక్రమాలు, అధికారాలు అన్నీ కొత్త జిల్లాల కలెక్టర్లకు జిల్లా అధికారులకు సంక్రమిస్తాయని.. కొన్ని వ్యవహారాలు మాత్రం పాత ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారులు మాత్రం చేస్తారని అన్నారు. ఇదే ఫార్ములా మొన్నటి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ సమయంలో కూడా పాత జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులే ఆఖరి దస్త్రాలుపై సంతకాలు చేసి ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల విభజన జరిగినప్పటికీ చాలా వరకూ విధానపరమైన బదలాయింపులు మాత్రం జరగాల్సి వుందని వివరించారు.

కొత్త జిల్లాల్లో పేరుకే సమాచార పౌరసంబంధాల శాఖ..
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల్లో పేరుకే సమాచారశాఖ కార్యాలయాలు, సిబ్బంది పనిచేస్తున్నారు. విధాన పరమైన నిర్ణయాలు, వ్యవహారాలు మాత్రం మాత్రం ఉమ్మడి జిల్లాకేంద్ర కార్యాలయాల నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులకు ప్రభుత్వం జారీ చేసే ప్రెస్ అక్రిడిటేషన్లు కూడా పాత జిల్లా కార్యాలయాల్లోనే ఈసారి చేపడతారని జిల్లా సమాచారశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి కొత్త జిల్లాల్లో పదోన్నతులు పొందిన అధికారులను, జిల్లా అధికారులగా నియమించాల్సి వుంది. కానీ ప్రభుత్వ శాఖల్లో పరిపాలనా సౌలభ్యం కోసం సీనియర్ అధికారులను జిల్లా అధికారులుగా, డిప్యూటేషన్ పద్దతిపై కొత్త జిల్లాల్లో అధికారులుగా ప్రభుత్వం నియమించింది. దీనితో చాలా వరకూ కార్యక్రమాలు, కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాలు కొత్త జిల్లాలలోని అధికారులకు లేవు. దీనితో యదావిధిగా మళ్లీ పాత జిల్లా కార్యాలయాల నుంచే పనులు చేయించాల్సి వస్తుంది. ఇలా ఒక్క సమాచార పౌర సంబంధాల శాఖ మాత్రమే కాకుండా 75 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని పనులు, వ్యవహారాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసుకు వస్తుంది.

మీడియాకి సమాచారం ఇవ్వడంలో పూర్తివైఫల్యం..
ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పాత జిల్లాల్లోని పాత వ్యవహారం మాదిరిగానే సామాచర పౌర సంబంధాల శాఖ మీడియాకి సమాచారం ఇవ్వడంలో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తోంది. పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు మినహా ఇతర చిన్నతరహా మీడియాకి మాత్రం సమాచారం ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వానికి చెందిన అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు కేవలం పెద్ద మీడియా సంస్థల్లోలని జర్నలిస్టులకే సమాచార శాఖ ఇవ్వడం, వారి నెంబర్లు మాత్రమే అధికారిక ప్రెస్ గ్రూపులో యాడ్ చేయడం ఇపుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అంతేకాకుండా సమాచారశాఖ అవినీతి వ్యవహారాలు బయట పెట్టే చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను ప్రభుత్వ వ్యతిరేక మీడియాగా ముద్ర వేసి వారికి సమాచారం అందించడం మానేస్తున్నది. ఈ విషయమై కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలను మీడియా సంప్రదిస్తే.. అక్రిడేటెడ్ మీడియా జర్నలిస్టులను మాత్రమే రాష్ట్ర కార్యాలయం ప్రెస్ గ్రూపులో యాడ్ చేయాలని ఆదేశాలున్నాయని వీరు చేసే తప్పును కమిషనర్ కార్యాలయం మీదకు నెట్టేస్తున్నది. చిన్న పత్రికలకు చాలా వరకూ ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వలేదనే విషయాన్ని పదే పదే ప్రశ్నించి జిల్లా కలెక్టర్ లేదా.. రెవిన్యూ అధికారుల ద్రుష్టికి తీసుకెళితే తప్పా మీడియా వాట్సప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో జర్నలిస్టుల పేర్లు, నెంబర్లను చేర్చడం లేదు.

సమాచారశాఖ నిర్లక్ష్యమే కొత్త జిల్లాలకు శాపం..
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అధికారుల ఇష్టారాజ్యం, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కొత్తజిల్లాలకు శాపంగా పరిమణమిస్తోంది. కొత్త జిల్లాల్లో అధికారులు, ప్రభుత్వ శాఖల సమాచారం పెద్ద మీడియా సంస్థలకు తప్పితే చిన్న మధ్య తరహా జిల్లా మీడియాకి తెలియడం లేదు. అలాగని పెద్ద మీడియా సంస్థలకు చెందిన పత్రికలు, టీవీ ఛానళ్లు అన్ని వర్గాల ప్రజలకు వెళుతున్నాయా అంటే అదీ జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తప్పితే మరెవర వద్దకూ పెద్ద పత్రికలు చేరడం లేదు. ఈ క్రమంలో  అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లే చిన్న, మద్య తరహా మీడియా, పత్రికలకు సమాచారశాఖ సమాచారం అందించడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమపథకాలకు సంబంధించిన సమాచారం మీడియాకి విడుదల చేయడం అంటే సమాచారశాఖ జేబులో నుంచి తమ నెలజీతం మొత్తం మీడియాకి ఖర్చు చేసేస్తున్నట్టు కొత్త జిల్లాల్లో డీపీఆర్వోలు, ఏపీఆర్వోలు తెగ ఫీలైపోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత పెద్ద పత్రికల కంటే ముందుగా చిన్న, మధ్య తరహా పత్రికలు మాత్రమే కొత్త జిల్లాల్లో కార్యాలయాలు, జర్నలిస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకున్న కొందరు డీపీఆర్వోలు కొత్త జిల్లాల్లోని జర్నలిస్టులకు సమాచారాన్ని సకాలంలో అందిస్తుంటే నేటికీ అధికశాతం డీపీఆర్వోలు కొత్తజిల్లాల్లో మీడియాకు సమాచారం ఇచ్చేందుకు మాత్రం ముందుకి రావడంలేదు. ఈవిషయం సమాచారశాఖ కమిషనర్ కి తెలిసినా అంటీముట్టనట్టే వ్యవహరిస్తుండటం వలనే మీడియాకి కొత్త జిల్లాల్లో సమాచారం అందడం లేదనేది స్పష్టమవుతున్నది. పరిస్థితి ఇలానే ఉంటే కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో పరిపాలన ప్రారంభమైతే పరిస్థితి మరింత జఠిలంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇదే పరిస్థితి జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో కూడా తలెత్తుతుందని కూడా జర్నలిస్టులు రాష్ట్ర సమాచారశాఖకు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా సమాచార పౌర సంబంధాల శాఖ తీరు మారుతుందా లేదా అనేది..!

Guntur

2022-08-18 01:29:29

అన్ని ప్రభుత్వశాఖలకూ ఫేస్ రికగ్నైజేషన్

ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లోని అధికారులు, సిబ్బంది ముందుకి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వస్తుందా అంటే అవుననే సమాధానం వస్తున్నది రాష్ట్ర అధికారుల నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే అధికారులు, సిబ్బంది సమయానికి విధులకు రావాల్సి వుంటుందనే ప్రభుత్వ ఆలోచన, అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. తొలుత విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టపెట్టిన ప్రభుత్వం టైమ్ బాండ్ ఏర్పాటు చేసింది. తద్వారా ఉపాధ్యాయులంతా సరిగ్గా 9గంటలకు యాప్ లో అటెండన్స్ వేయాల్సి వుంటుంది. అలా సమయానాకి అటెండెన్సు వేయకపోతే ఆరోజు లీవుగా పరిగణిస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ ఒక్క యాప్ విషయంలో ఉపాధ్యాయులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమకు సమయపాలన పెట్టడం నచ్చలేదని ఎదురు తిరిగినా దానిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా యాప్ వినియోగాన్ని అమలు చేసింది. చచ్చినట్టు 70శాతం మంది ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను తమ మొబైల్ లో వేసుకొని అటెండెన్సు వేయాల్సి వచ్చింది. యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలనే డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చి కొంత మంది యాప్ లో అటెండెన్సు వేయకుండా ఉండిపోయారు. ఇపుడు ఈ అంశమే రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది..

పాఠాలు చెప్పకుండా మరుగు దొడ్లకు ఫోటోలు తీయాలా..
సమాజంలో ఉపాధ్యాయులంటే ఎంతో ఉన్నతమైన గౌరవం వుంది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల యాప్స్ వలన పిల్లలకు పాఠాలు చెప్పడం మాట దేవుడెరుగు మరుగుదొడ్లు, భోజనాల వద్ద ఫోటోలు, వీడియోలు తీసేందుకే ప్రతీరోజూ విలువైన గంట సమయం వ్రుధా అవుతోందని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ ఈ విధానమే అమలులో వుంటే ఇపుడు ప్రతీ రోజూ ఉదయం టంచనుగా 9గంటలకల్లా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేసే విధానాన్ని కూడా ఉపాధ్యాయులంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఏవేవో పనులు, కాగితాలపైనే మొత్తం పనంతా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగం అంటే సమాయానికంటే గంట ఆలస్యంగా వచ్చి.. గంట ముందుగానే ఇంటికి తిరుగు ముఖం పట్టే విధానాలకు చరమ గీతం పాడేందుకే ఈ కొత్తరకం యాప్ ని అమలులోకి తీసుకొచ్చామని చెబుతోంది ప్రభుత్వం.

నాడు-నేడుతో పాఠశాలల రూపం మారినా విద్యలో..?
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చినా..విద్యావిధానంలో మాత్రం ప్రభుత్వం అనుకున్నట్టుగా మార్పులు మాత్రం ఇంకా నోచుకోలేదు. నూతన విద్యాసంవత్సరం నుంచి సరికొత్త విద్యావిధానాలను అమలు చేయాలని చూసినా..ఇంకా ఎక్కడా ఫలితాలు మాత్రం ప్రభుత్వానికి కనిపించలేదు. దీనితో ప్రభుత్వం వ్యూహాత్మంగా తన అడుగులు వేస్తుందనే విషయం నేడు ఫేస్ రిగ్నైజేషన్ యాప్ ద్వారా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ముందుకి వచ్చినట్టుగా చెబుతున్నారు. నాడు-నేడు పథకం ద్వారా అమలు చేసిన అభివ్రుద్ధి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్నివిషయాల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టుగానే ఉన్నట్టు కనిపిస్తోంది. టైమ్ బాండ్ యాప్ అటెండెన్సును నిరుపేద విద్యార్ధులకు నిశ్వార్ధంగా ప్రభుత్వ ఉచిత విద్యను అందించాలనుకునే ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నప్పటికీ.. ఆడుతూ, పాడుతూ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. యాప్ లు రూపొందించిన ప్రభుత్వం, వాటి వినియోగానికి సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి కూడా తీసుకెళ్లినా దానిని ప్రభుత్వం లైట్ తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుకు, ఉద్యోగులకు ఈ యాప్ వినియోగం, అమలు కాస్త కష్టంగా ఉన్నా..ప్రజల నుంచి మంచి స్పందన రవాడంతో ప్రజామోదం మేరకే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వినియోగంలోకి తేవడానికి యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. 

అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తరహా యాప్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వశాఖల్లోనూ విద్యాశాఖ తరహా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందాలని పైలట్ ప్రాజెక్టుగా ముందుగా విద్యాశాఖలోనే దీనిని ఏర్పాటు చేసింది. అయితే ఉపాధ్యాయుల నుంచి తీవ్రంగా ప్రతిఘటన ఎదురైనప్పటికీ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రభుత్వశాఖల్లో ఈ తరహా యాప్ ని అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింతగా చేరువ చేయాలని చూస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రస్తుతం అమలు చేస్తున్న యాప్ డేటా ఆధారంగా.. ఫేస్ రికగ్నైజేషన్ డేటాబేస్ కి లింక్ చేయడం ద్వారా మిగిలిన శాఖల్లో కూడా యాప్ ను వినియోగంలోకి తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. ఒకప్పటి బయో మెట్రిక్ అటెండెన్సు కంటే నేటి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన 8గంటలూ విధులు ప్రభుత్వ ఉద్యోగులు క్రమం తప్పకుండా చేయకుండా వెనుతిరిగే పరిస్థితి ఉండదు. అలా ప్రభుత్వ పనిగంటల్లో ప్రజలకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలంటే పనిచేసే చోట మాత్రమే యాప్ పనిచేసేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. చూడా ఫలితాలు రానున్న రోజుల్లో ఈ యాప్ ద్వారా మిగిలిన ప్రభుత్వ శాఖల ద్వారా ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది..!

Guntur

2022-08-17 01:58:02

శ్రీవారి వైభవోత్సవాల్లో పాల్గొని తరించండి

నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో జిల్లా వాసులు పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి   కాకాణి గోవర్ధన రెడ్డి కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో  మంగళవారం నుంచి ఈ  నెల 20వ తేదీ  వరకు వైభవోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా  తొలి రోజు ఉదయం నిర్వహించిన  వసంతోత్సవ పూజా కార్యక్రమంలో మంత్రి  గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సూళ్ళూరుపేట  శాసనసభ్యులు  టీటీడీ బోర్డు సభ్యులు  కిలివేటి సంజీవయ్య, నుడ ఛైర్మన్ ముక్కాల ద్వారాకానాథ్ లతో కలసి వసంతోత్సవంలో పాల్గొన్నారు.  ఈ సంధర్భంగా మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ప్రజలందరికీ కల్పించాలని ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  సంకల్పంతో   వైభవోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం, వి పి ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో 5 రోజుల పాటు జరుపుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తిరుమలలో స్వామి వారికి జరిగినట్లుగానే ఇక్కడ శ్రీవారి సేవలు నిర్వహిస్తారని, జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుని  శ్రీ వారి వైభవోత్సవాల్లో పాల్గొని  భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత వైభవోత్సవాలు మళ్ళీ నెల్లూరులో నిర్వహించుకుంటున్నట్లు మంత్రి  తెలిపారు.  కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఐదు రోజుల పాటు నెల్లూరులోనే కొలువై ఉన్నట్లుగా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ల అధ్వర్యంలో   చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి  వెంకట నారాయణమ్మ, విశేష సంఖ్యలో భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Nellore

2022-08-16 13:40:31

సీపీఎస్ రద్దుపైనే 2024 ఎన్నికల ప్రభావం

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేడి ఈసారి సీపీఎస్ రద్దుతోనే మొదలయే దాని ప్రభావంతోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి మడమ తిప్పేసిన ప్రభుత్వ తీరుతో ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా.. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తమకి అనుకూలంగా మాత్రమే అడుగులు వేసుకుంటూ వస్తోంది. దీనితో ఆగ్రహంతో వున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. ఇప్పటికే రివర్స్ పీఆర్సీతో తీవ్ర ఆగ్రహంతో వున్న ఉద్యోగులకు ఇపుడు సీపీఎస్ రద్దు కూడా ఒక ప్రత్యేక ఛాలెంజ్ గా మారింది. ఎలాగైనా సీపీఎస్ రద్దు చేసే పార్టీలకే మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకోగా..తాము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సీపీఎస్ రద్దు చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. రద్దు చేస్తామన్న వైఎస్సార్సీపీ మాత్రం పీఆర్సీ అమలు చేసినట్టుగానే సీపీఎస్ రద్దు విషయంలో కూడా రివర్స్ గేర్ లోనే రావాలని చూస్తోందని ఉద్యోగులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఇచ్చిన హామీని అమలు చేసి మమ అనిపించుకోవాలనే లక్ష్యంతో ఇటు ప్రభుత్వం సీపీఎస్ విషయంలో మరోసారి రాజకీయం చేసి దానిని వచ్చే 2024 ఎన్నికల బూచీగా చూపించే ప్రయత్నాలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్దం చేస్తోందనే ప్రచారం జరుగా సాగుతోంది.

సీపీఎస్ రద్దు విషయంలో తగ్గేదేలేదు..
స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధి విధానాలన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చవి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి అసలు ప్రభుత్వాలు రాజకీయం చేస్తే ఎలా వుంటుందనే అంశం చాలా స్పష్టంగా అర్ధమైంది. ఈ విషయంలో సమ్మెలు, పెన్ డౌన్ లు కాకుండా ప్రభుత్వశాఖలు, ఉద్యోగ సంఘాల వారీగా ఒకే తాటిపైకి వచ్చి ప్రధాన డిమాండ్ల సాధన చేసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల మనుగడ కష్టమనే నిర్ణయానికి ఉద్యోగులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. చేస్తున్న ఆందోళన బయటకు తెలియనీయకుండా సీపీఎస్ రద్దు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తే తప్పా ఏ రాజీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చే వ్యూహాత్మంగా అడుగులు వేయాలని చూస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా విభజించు పాలించు అన్న సూత్రాన్ని పాటిస్తూ.. ఉద్యోగ సంఘాలను అనుకూలంగా చేసుకొని ఆడిస్తున్న విషయాన్ని ఇటు ఉద్యోగులు కూడా గుర్తించి తమన పని తాము చాపకింద నీరులా చేసుకు పోతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నవేళ ఉద్యోగుల తమ స్వరం పెంచడంతోపాటు, ఎన్నికల కార్యాచరణ కూడా ఈసారి చాలా గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎలా పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం 2024 ఎన్నికల్లో చూపించాలని కంకణం కట్టుకున్నాయని చెబుతున్నారు.


ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఏపీ ప్రత్యేకంగా..
 సీపీఎస్ రద్దు విషయంలో ఇప్పటికే అమలు చేసిన రాజస్థాన్, చత్తీస్ ఘడ్  రాష్ట్రాలు మాదిరిగా కాకుండా..ప్రభుత్వానికి కలిసొచ్చే విధంగా సీపీఎస్ రద్దు విషయంలో సమూల మార్పులు చేయాలని ఇటు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాల్లో అధ్యయనాలు కూడా చేయించి..అక్కడ రద్దు చేసినట్టుగా కాకుండా సీపీఎస్ రద్దులో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ మార్కు కనిపించేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనపిస్తోందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. పీఆర్సీ విషయంలో ఏ విధంగా అయితే జీతాలు పెంచినట్టుగా ఏ విధంగా అయితే కాగితాలపై లెక్కలు చూపించి.. ముందుగానే హెచ్ఆర్ఏ, డీఏ శ్లాబుల్లో కోతలు విధించి.. ఆ పై పీఆర్సీ అమలు చేసి.. అదే మొత్తం పెరిగినట్టుగా చూపిచిందో..ఆ విధంగానే ఇపుడు సీపీఎస్ రద్దు కూడా చేస్తే..ఇచ్చిన హామీ అమలు చేసినట్టుగా అవుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నదని..ఉద్యోగ సంఘాలు తమ సమాజిక మాద్యమాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వం మూడో కంటికి తెలియకుండా ఏ విధంగా రహస్య అధ్యయనాలు, కార్యాచరణ చేస్తున్నదో ఆ విషయాలన్నీ మొత్తంగా ముందే తెలుసుకొని ఉద్యోగ సంఘాలు 2024 ఎన్నికలకు సిద్దం కావాలనే సంకేతాలను కూడా పంపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్ని సమయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఏ పనైనా చేసుకుంటే..ఇక ఉద్యోగులు, అధికారులు ఉన్నది ఎందుకనే అంశాన్ని తెరపైకీ తీసుకువచ్చారు.

తేడా సీపీఎస్ రద్దును ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీల అమలు ఇప్పటి వరకూ కాస్త తేడాగానే అమలు చేసిన ప్రభుత్వం అదేవిధంగా సీపీఎస్ రద్దు కూడా తేడాగానే చేయాలని చూస్తే దానిని నమ్మకుండా తమ తీర్పు అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా చూపించాలనే నిర్ణయాయినికి ఉద్యోగులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా రెండేళ్ల సర్వీసు అనంతరం ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అధనంగా 9నెలలు కేవలం రూ.15వేలకే ఉద్యోగాలు చేయించి, ఆ పై పీఆర్సీ బెనిఫిట్స్ ఇవ్వకుండా చేతులు దులుపుకున్న వైనాన్ని కూడా ఉద్యోగ సంఘాలు ఎన్జీఓల ద్వారా అందరిలోనూ చైతన్యం కల్పిస్తున్నాయి. ఇదే పద్దతి కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుకున్న విధానాలనే అమలు చేస్తుంది తప్పితే ఉద్యోగుల డిమాండ్లలన్నీ అలానే ఉండిపోతాయని.. మనుగడ కూడా ప్రశ్నార్ధకం అవుతుందని.. దానికోసం సమూహంగా ఉద్యోగుల భద్రత కోసం తీసుకునే నిర్ణయాలు చరిత్ర కావాలనే లక్ష్యంతో పనిచేయాలని హిత బోద చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తేడాగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగుల పవర్ ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామనే సంకేతాలు కూడా అపుడే విడుదల చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.

సీపీఎస్ విషయంలో సామ, వేద, దండోపాయాలు..
సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగుల విషయంలో సామ, వేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్న ప్రభుత్వం ఇదే పద్దతిని కొనసాగించి 2024 ఎన్నికల్లో మరోసారి ఉద్యోగులను నమ్మించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు వారి వారి కూటముల్లో పెద్ద ఎత్తున ప్రాచారానికి తెరలేపారు. ఈ విషయంలో ఉద్యోగులంతా కలిసికట్టుగా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టపోతామనే విషయాన్ని, ఏ విధంగా నష్టం జరుగుతుంది..పీఆర్సీ విషయంలో ఇపుడు జరిగిన నష్టాన్ని గ్రాఫ్ లు గా వేసి మరీ ప్రచారం చేస్తున్నారు ఉద్యోగులు. ఈ విషయం ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లినా తాడో పేడో అన్నట్టుగా ఉండటంతో.. ప్రభుత్వ ఉద్యోగులను సీపీఎస్ రద్దు అంశం తోనే బురిడీలను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సీపీఎస్ రద్దు విషయంలో కొత్తగా అధ్యయనాలు చేసి.. సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో మాదిరిగా కాకుండా.. ప్రభుత్వం అనుకున్న విధంగా విధి విధానాలు ఖరారు చేయడానికి ప్రభుత్వం చూస్తోందని మీడియా సైతం కోడై కూస్తోంది. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రచారం చేస్తూనే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను, ఉద్యోగులను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడంలో పై చేయి సాధిస్తున్నది ప్రభుత్వం. అయితే అన్నింటినీ నిసితంగా పరిశీలిస్తున్న ఉద్యోగులు, మొన్నటి వరకూ ఉద్యోగ సంఘాల్లో మాత్రమే చైతన్యం తీసుకు వచ్చి..నేడు ప్రజలను కూడా చైతన్య పరిచే కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. ఎక్కడైనా జన సమ్మర్ధం ఉన్నచోట ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చేస్తున్న వ్యవహారాలను పనిగట్టుకొని ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. ప్రభుత్వం ఒకలా ఆలోచిస్తుంటే..దానికి రెండు రెట్లు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగ సంఘాలు ముందుంటున్నాయి. మొత్తానికి సీపీఎస్ రద్దు విషయంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న వ్యవహారం 2024 ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపించే విధంగా అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వ కార్యాచరణ దెబ్బా దెబ్బగా ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతున్నది. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Guntur

2022-08-16 02:09:42

ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మార్గదర్శకాలు రెడీచేసే పనిలో పడ్డారు అధికారులు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖల్లో సచివాలయ ఉద్యోగుల శాఖ కొత్తది కావడం.. సుమారు 19 శాఖల ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం కూడా ఇపుడు బదిలీల విషయంలో ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉత్పన్నమవుతున్నది. దానిని అధిగమించడం కోసం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖల ఉద్యోగులకు సంబంధించిన మాత్రుశాఖల్లో అమలు జరుగుతున్న సర్వీసు నిబంధనలు అమలు చేయాలా, లేదంటే అందరు ఉద్యోగులకు సంబంధించినంతవరకూ కొత్త శాఖ కావడంతో వాటికి ప్రత్యేకంగా నిబంధనలు, పదోన్నతుల చార్టు ఏర్పాటు ఏర్పాటు చేయాలా అనే మీమాంశలో ప్రభుత్వం పడినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం సచివాలయ శాఖ ఏర్పాటై అక్టోబరు 2 వస్తే మూడేళ్లు పూర్తవుతుంది. అందులోనూ చాలా వరకూ ఉద్యోగాల భర్తీ స్థానికత ఆధారంగానే జరిపినా.. కొందరికి మాత్రం పక్కజిల్లాల్లో పోస్టింగులు ఇచ్చారు. వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకొని సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేసే విషయంలో పాత జిల్లాశాఖల నిబంధనలు అమలు చేస్తారా..లేదంటే  అంతర్ జిల్లాల బదిలీల కోసం కొత్త నిబంధనలు తెరపైకి తీసుకు వస్తారా అనే విషయంలో రాష్ట్ర స్థాయి అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.


బదిలీలు  ఏ విధంగా జరుగుతాయో..
గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులకు సంబంధించినంత వరకూ స్థానికత ఆధారంగా సచివాలయాల్లో పోస్టింగులు ఇచ్చారు. ప్రస్తుతం వాటి ఆధారంగానే జిల్లా పరిధిలో అయితే రోస్టర్ విధానంలో బదిలీలు చేయాల్సి వుంటుంది. అదే రోస్టర్ లో ఎంత శాతం మేర బదిలీలు చేస్తారు. ఇందులో మహిళలు, పురుషులకు ఎంత పర్శంటేజిలో బదిలీలు చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఒక వేళ మొత్తంగా బదిలీలు చేపట్టినా కదిలి పోవడానికి సచివాలయ సిబ్బంది మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి బదిలీలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేయడంతో సాధ్యమైనంత త్వరగా అంటే డిసెంబరు లోగా బదిలీలకు సంబంధించిన జీఓ విడుదల చేయడానికి రాష్ట్ర సచివాలయశాఖ అధికారులు కరసత్తు చేపట్టారు. అంతేకాకుండా ఎంత మంది సిబ్బందికి ప్రస్తుతం రెండేళ్లు పూర్తి చేసుకొని సర్వీసు రెగ్యులర్ అయ్యింది.. ఇంకా ఎంతమందికి కావాల్సి వుంది..డిసెంబరు లోగా ఇంకా ఎంత మందికి సర్వీస్ ప్రొబేషన్ పూర్తికాదు..అందులో మెటర్నటీ సెలవులు తీసుకున్నవారెంతమంది. తదితర వివరాలతో కూడా జాబితా కూడా సేకరించే పనిలో పడ్డారు రాష్ట్ర అధికారులు. ఇటు జాబితా.. అటు బదిలీల నిబంధనలు పూర్తయితే జీఓ జారీకి మార్గం సుగమం అవుతుంది.

ఉద్యోగుల అభిప్రాయ సేకరణకు వెబ్ సైట్..
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో భాగంగానే ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో జిల్లాల వారీగా అన్ని శాఖలకు సంబంధించి ఎంత మంది ఉద్యోగులు బదిలీలకు ముందుకొస్తున్నారు..ఎంతమందికి కోరుకోవడం లేదనే సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అభిప్రాయాలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ప్రత్యేకంగా జీఓ జారీ చేసి ఆపై బదిలీలకు డిఎస్సీ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తారని కూడా చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే సుమారు మూడు నుంచి ఐదు నెలలు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం విధినిర్వహణలో వున్న లక్షా 21 వేల మంది ఉద్యోగులకు సంబంధించి మొత్తం సర్వీస్ ప్రొబేషన్ పూర్తయిన తరువాత బదిలీలు చేపడితే అందరికీ న్యాయం చేసినట్టుగా వుంటుందనే కోణంలో అధికారులు ప్రభుత్వానికి, మంత్రులకు తెలియజేయగా వారంతా అంగీకరించారని సమాచారం. దీనితో ఈ అంశం ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈసీ నిబందన కూడా తోడయ్యే అవకాశం..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ఎన్నిక కమిషన్ ఆదేశాలు కూడా తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో గ్రామస్థాయిలో సిబ్బందిని మార్చకపోతే ఉద్యోగులు ప్రజలను వివిధ సంక్షేమ పథకాల విషయంలో ప్రభావితం చేసే అవకాశాలపై ఈసీ కూడా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం వుంటుంది. అలా ఎన్నికల సంఘాలనికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే సచివాలయ సిబ్బందికి బదిలీలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, సచివాలయాల పరిధిలో సిబ్బంది మొత్తం కొత్తవారే విధుల్లోకి చేరుతారు. తద్వారా అక్కడి ప్రజలను ఏ విషయంలోనూ ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వశాఖల్లో ఎప్పుడు బదిలీలు జరిగినా..అవి ఎన్నికలకు ముందు జరిగితే వాటిని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడే ప్రభుత్వాలు చేపడతాయి. అలా సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు అమలు జరిగినా జరవచ్చుననే సంకేతాలు కూడా ఉద్యోగుల్లోకి వెళుతున్నాయి.


అంతర్ జిల్లాల బదిలీల్లో మరో కొత్త మెలిక..
ఆంధప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో సాధారణ బదిలీలతోపాటు, అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి కూడా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. ఒక వేళ రెండికీ జీఓ విడుదల చేస్తే.. పక్క జిల్లాల బదిలీలు కోరుకునేవారు లాస్ ఆఫ్ సర్వీసు నిబంధనకు అంగీకరించాల్సి వుంటుందా అంటే అవుననే వాదనే బలంగా వినిపిస్తుంది. ఆ విధంగా జరిగితే స్థానిక జిల్లాలో ఉన్న సర్వీసు మొత్తం రద్దై..కొత్త గా బదిలీ జరిగిన జిల్లాలో సర్వీసు మొదలవుతుంది. ఆ విధంగా జరిగితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడేళ్లో, లేదంటే ఎనిమిదేళ్లకో జరిగి పదోన్నతుల విషయంలో ఇలా లాఫ్ సర్వీస్ కోల్పోయిన ఉద్యోగులు పదోన్నతులు కూడా కోల్పోతారు. ప్రభుత్వం ఆవిధంగా బదిలీలు చేపడుతుందా..లేదంటే మ్యూచ్ వల్ విధానంలో బదిలీలు చేపడుతుందా.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్న ద్రుష్ట్యా అందరికీ ఒకే నిబంధన అమలు చేసి బదిలీలు చేస్తుందా..? అనేవిషయంలో క్లారిటీ రావాల్సి వుంది. ఏది ఏమైనా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో అతి తక్కువ సమయంలోనే అంటే మూడేళ్లకే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పచ్చజెండా ఊపడం..దానికి అనుగుణంగానే పనులన్నీ చకా చకా జరిగిపోవడం నేడు రాష్ట్ర వ్యాప్తం అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ చర్చనీయాంశం అవుతోంది..!

Guntur

2022-08-15 07:11:07

పంద్రాగస్టుకి మహిళా పోలీసులకు యూనిఫాం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు పంద్రాగస్టు వేడుకల్లో ఖాకీ దుస్తులతో గౌరవ వందనం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14వేలకు పైగా వున్న మహిళా పోలీసులకు ప్రభుత్వం యూనిఫారం ఇవ్వాలని నిర్ణయించింది. దానికోసం మూడు నెలలు ముందే పోలీస్ స్టేషన్లు వారీగా సచివాలయ మహిళా పోలీసులకు డ్రెస్ కొలతలు కూడా తీసుకున్నారు. ఆ మేరకు అన్ని జిల్లాలకు 2 నెలల క్రితమే యూనిఫారం చేరుకుని కుట్టు పనులు కూడా పూర్తిచేసుకుంది. ఈ కార్యక్రమం మొత్తం జూలై నెలాఖరుకే ప్రభుత్వం పూర్తిచేసింది. ఆగస్టు 1వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరించిన ప్రభుత్వం మిగిలిన శాఖల సిబ్బందికి యూనిఫాం ఇచ్చినట్టుగానే సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన ఖాకీ యూనిఫాం కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాల వారీగా ఆయా పోలీసు స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య ఆధారంగా వీటిని అందించనున్నారు.

ఆగస్టు 15న యూనిఫాంతో జెండా వందనం..
గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు యూనిఫారం ఈవారంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మహిళా పోలీసులంతా ఖాకీ యూనిఫాంతోనే 2022 పంద్రాగస్టు వేడుకల్లో
 పాల్గొంటారు. ఇప్పటికే యూనిఫాం కుట్టు కార్యక్రమాలు, షూ, బెల్ట్, విజిల్, నేమ్ బోర్డు, కేప్ ఇలా అన్ని సిద్దం చేయడంతో డీజీపీ ఆదేశాల కోసం మేరకు మాత్రమే ఎదురు చూస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్పుకొస్తోంది. డీజీపీ నుంచి ఉత్తర్వులు రాగానే వాటిని మహిళా పోలీసులకు పంపిణీ చేసి తద్వారా గ్రామస్థాయిలో మహిళల రక్షణ ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ మహిళా పోలీసులంటే పేరుకే సచివాలయాల్లో ఉన్నారు తప్పితే వారిని ప్రజలు గుర్తించడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఖాకీ యూనిఫాం వేసుకోవడం ద్వారా ప్రజలు కూడా సచివాలయాల్లో మహిళా పోలీసులను సులువుగా గుర్తుపట్టడంతోపాటు వారి సమస్యలు నేరుగా వచ్చి చెప్పుకోవడానికి, వారి ద్వారా స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి.

యూనీఫాంలోనే సచివాలయ సిబ్బంది..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం అందరూ ప్రభుత్వం కేటాయించిన యూనిఫాంలోనే విధులకు హాజరవుతున్నారు. ఒక్క మహిళా పోలీసులు మాత్రమే సివిల్ డ్రెస్ లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వీరు కూడా ఖాకీ యూనిఫాం వేసుకుంటే సచివాలయ సిబ్బందికి మొత్తం డ్రెస్ కోడ్ అమలు జరిగినట్టే. ఇప్పటి వరకూ అరకొరగా యూనిఫాం వేసుకు వస్తున్న సిబ్బంది ఇకపై పూర్తిస్థాయిలో ప్రజలకు కనిపించే విధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నది. ఏ ఒక్క సిబ్బంది అయినా యూనిఫాం వేసుకురాకపోతే కఠిన చర్యలు కూడా తీసుకునే విధంగా అధికారులు ప్రత్యేక ద్రుష్టిసారిస్తున్నారు. ప్రజలు సచివాలయ సిబ్బందిని కేవలం ప్రభుత్వం కేటాయించిన డ్రెస్ కోడ్ ఆధారంగానే గుర్తిస్తున్నారు. అయితే దానికి భిన్నంగా చాలా మంది సచివాలయ ఉద్యోగులు డ్రెస్ సక్రమంగా వేసుకోకపోగా ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాంను బ్యాండ్ మేళంగా అభివర్ణిస్తూ వరి నచ్చిన దుస్తులతో విధులకు హాజరవుతున్నారు. ఇకపై అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకొని..డ్రెస్ కోడ్ లోనే విధులకు హాజరయ్యే విధంగా చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అన్ని ప్రభుత్వశాఖల అధికారులను ఆదేశించినట్టుగా చెబుతున్నారు. చూడాలి మహిళా పోలీసులకు ఖాకీ యూనిఫాం అందజేసిన తరువాతనైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందితో తరచుగా యూనిఫాం వేసుకుని వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటారో..లేదంటే యదావిధిగా పేరుకే ప్రకటనలు చేసి.. అమలుని గాలికి వదిలేస్తారో..!

Guntur

2022-08-06 01:02:41

ఆ యూనిఫారం బ్యాండ్ మేళంలా ఉందట

గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే ప్రజలందరి కనీస అవసరాలు గ్రామస్థాయిలో తీరాలి..సమస్యలన్నీ గ్రామస్థాయిలో పరిష్కరింపబడాలి..ఆ లక్ష్యంతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రికగా సరికొత్త ప్రభుత్వ శాఖగా నిర్మితమైంది గ్రామ, వార్డు సచివాలయ శాఖ. ఇంత వరకూ బాగానే ఉన్నా..సచివాలయంలో సిబ్బంది అంటే 33నెలలు గడుస్తున్నా ప్రజల్లో నేటికీ కనీస అవగాహన లేదంటే లోపం ఎక్కడ ఉంది..?  కాదు కాదు అవగాహన రానీయకుండా చేస్తున్నారు..! ఈ వార్త చదివిన సచివాలయ సిబ్బందికి, ఈ శాఖ ముఖ్య అధికారులకి ప్రభుత్వానికి కాస్త నొచ్చుకున్నట్టుగా ఉన్నా ఇది అక్షర సత్యం.. సచివాలయ ఉద్యోగులను ప్రజలను సులువుగా గుర్తుపట్టడం కోసం సిబ్బందికి కేటాయించిన యూనిఫారం బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉందని.. సిబ్బంది వాటిని వేసుకోవడమే మానేస్తున్నారు. కొన్నిచోట్ల అధికారుల పర్యటనలు, సమావేశాలు ఏర్పాటు చేసే సమయంలోనే వేసుకొని వస్తూ అధికారులను బురిడీలను చేస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారంలోని షర్ట్ ఒకటి, ఫ్యాంటు ఒకటి వేసుకొని వస్తున్నారు. ఇదేమంటే ఈ డ్రెస్సు వేసుకుంటే బేండ్ మేళం బ్యాచ్ అని వెటకారం చేస్తున్నారని సిబ్బందే ఎగతాలిగా మాట్లాడుతుండటం ఇపుడు దుమారాన్ని రేపుతోంది. కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు కఠినంగా వ్యవహరించడంతో సిబ్బంది ఖచ్చితంగా యూనిఫారం వేసుకొని వస్తున్నా..కొన్ని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సచివాలయ యూనిఫాం ను వేసుకోవడానికి సిబ్బంది చాలా నామోషీగా ఫీలైపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాం ఖచ్చితంగా వేసుకోవాలా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

కొరవడిన ఎంపీడీఓల పర్యవేక్షణ..
గ్రామ సచివాలయ సిబ్బంది రెగ్యులర్ గా యూనిఫాం వేసుకు రాకపోవడం వెనుక పూర్తిస్థాయిలో మండల స్థాయిలో ఎంపీడీఓల పర్యవేక్షణ కొరవడిందనే చెప్పాలి. దానికి కారణం కూడా లేకపోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడోగానీ సచివాలయాలను సందర్శించరు. కానీ ఎంపీడీఓ అనునిత్యం పంచాయతీలు, గ్రామసచివాలయాల సందర్శన చేస్తూనే ఉంటారు. కనీసం ఆ సమయంలోనైనా సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రభుత్వం నిర్ధేశించిన యూనిఫాంను వేసుకుని వస్తున్నారా..లేదా అనే విషయాన్ని గమనించాల్సి వుంటుంది. కానీ ఎంపీడీఓలు ఆ పనిని చేయడం లేదు. ఎప్పుడు సచివాలయానికి వచ్చినా రికార్డులు తిరగేసి వెళ్లిపోవడం తప్పితే సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ స్థాయిలో చేరువ అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అలా అంటే ఎంపీడీఓలకు కోపం వచ్చినా అది మాత్రం అక్షర సత్యం. కనీసం అప్పుడప్పుడైనా విజిటింగ్స్ కి వచ్చే డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులదీ అదీ తీరు. ఎవరూ సిబ్బంది విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయం సిబ్బంది తమకు నచ్చిన సమయంలోనే యూనిఫాం వేసుకొరి రావడాన్ని స్పష్టం చేస్తున్నది. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యద్శిలు ఇద్దరు మాత్రమే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వస్తారు. మిగిలిన వారంతా వివిధ శాఖలకు చెందినవారే కావడంతో అధికారులు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. పట్టించుకోవడం లేదు. కొన్నిసమయాల్లో అధికారులు సచివాలయాలకు పర్యటనలకు వచ్చినపుడు వేసుకుని వచ్చే సమయంలో కూడా సిబ్బంది మొత్తం రెగ్యులర్ గా యూనిఫాం వేసుకొని వస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆరా తీయడం లేదు. మరీ ముఖ్యంగా మండల కేంద్రాల్లోని సచివాలయాల్లోనే ఈ విధంగా సిబ్బంది యూనిఫాం వేసుకొని రాకపోవడం విచిత్రంగా, మరి కాస్త వెటకారంగానూ కనిపిస్తోంది.

కొందరు సిబ్బంది అసత్య ప్రచారం..
గ్రామసచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు యూనిఫాం విషయంలో వారికి నచ్చినట్టుగా సొంత ప్రచారాలను ఎడా పెడా చేసుకుంటూ అటు ప్రజలకి, ఇటు అధికారులకు కళ్లుమూసి జెల్ల కొడుతున్నారు. పంచాయతీ కార్యదర్శిలకు ప్రభుత్వం యూనిఫారం వేసుకోవడంలో వెసులు బాటు ఇచ్చిందని..  తెగ చెప్పేసుకుంటున్నారు. ఆ కారణంగానే తాము రెగ్యులర్ గా యూనిఫాం వేసుకోవడం లేదని చాలా ధీమాగా అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా అయితే అధికారుల పర్యటనల సమయంలో ఎందుకు యూనిఫాంతో దర్శనమిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం చిలకనవ్వు నవ్వుతూ..ప్రతీది మీరు గుచ్చి గుచ్చి అడిగితే మేము ఏం చెప్పగలమండీ.. ఇప్పటికే యూనిఫాం వేసుకుంటే బ్యాండ్ మేళం బ్యాచ్ అంటున్నారని..దానికోసం కోసం కాస్త వెసులుబాటు తమకు తామే ఇచ్చుకొని అధికారులు వచ్చినపుడు మాత్రం నిత్యం వేసుకుంటున్నట్టుగా నటించాల్సి వస్తుందని కొందరు సచివాలయ కార్యదర్శిలు తప్పని తెలిసినా కుండ బద్దలు కొడుతున్నారు.  జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల్లోని వార్డు సచివాలయాల్లోని సిబ్బంది మాత్రం  యూనిఫాం తప్పక వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ మున్సిపల్ చైర్మన్, కమిషనర్, జోనల్ కమిషనర్ ఇలా ఎవరో ఒకరు రావడంతో నగరాలు, పట్టణాల్లో వార్డు సచివాలయ సిబ్బంది మాత్రం తప్పక వేసుకోవాల్సి వస్తున్నారు. ఒకటి అరా వేసుకొని రాకపోయినా పెద్దగా అక్కడ కూడా పట్టింపు ఉండటం లేదు.

అధికారులు మరీ అంతలా కనిపిస్తున్నారా..
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జిల్లా అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరీ అంతలా కనిపిస్తున్నారా.. అంటే నిజంగానే అలా కనిపిస్తున్నారనే చెప్పాలి. జిల్లా కలెక్టర్ నుంచి మండస్థాయిలో ఎంపీడీపీఓ, ఈఓపీఆర్డీ, ఆఖరికి ప్రజా ప్రతినిధుల వరకూ ఇదే పరిస్థితి. ఏ అధికారి, ఏ నాయకుడు సచివాలయానికి వచ్చినా పథకాలు అమలు కోసం మాట్లాడటం తప్పితే.. ప్రజలకు  ప్రభుత్వం సిబ్బందికి కేటాయించిన యూనిఫాం ఎవరు వేసుకుని వస్తున్నారు.. ఏస్థాయిలో ప్రజలకు చేరువ అయ్యారు..ఎంత మంది ప్రజలు నేరుగా సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్నారనే ప్రశ్నలు వేయడం లేదు.. లేదో చెప్పండనే ప్రశ్న వేయరంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ విధంగా సచివాలయ సిబ్బంది, చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శిలు అలా అధికారులకు మేకప్ వేస్తున్నారు. కొంత మంది ఏకంగా బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఒకేలా కనిపిస్తున్నామని చెబితే మేము వచ్చినపుడు అలా వేసుకురండి..తరువాత మీ సౌలభ్యాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండని చెప్పే అధికారులు కూడా ఉన్నారనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. అంటే  ప్రజలకు సచివాలయ సిబ్బంది పలానా యూనిఫాంలో ఉంటారనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రభుత్వ అధికారులే గాలి తీసేస్తున్నారని అనుకోవాలా..? అలా కాకపోతే యూనిఫాం వేసుకోని సిబ్బందిని ఎందుకు ప్రశ్నించడం లేదు..నేటికీ సక్రమంగా వేసుకొని కార్యదర్శిలు ఇతర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాత్రం ఏ ఒక్క అధికారి వద్ద సమాధానం దొరకని పరిస్థితి. 

ప్రజల కోసం ఏర్పాటు చేసిన  గ్రామ సచివాలయంలో ప్రజలు గుర్తుపట్టే విధంగా కాకుండా వారికి నచ్చినట్టుగా వారు యూనిఫాం కాకుండా రక రకాల దుస్తులు వేసుకొని వచ్చి మరీ విధులు నిర్వహిస్తుంటే వారిని జిల్లా అధికారులే ప్రోత్సహిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉద్బవిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేసి ప్రజలకు సేవలు అందిస్తే అంతే స్థాయిలో దేశం మొత్తం గర్విస్తుందనే కోణంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా ఆలోచించాల్సి వుంది. అలా జరగాలంటే సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఎలా ఉంటారు..ఏ దుస్తుల్లో ఉంటారు..ఎలాంటి సేవలు అందుతాయనే విషయం ప్రజలకు చైతన్యం, గుర్తింపు కలిగించాల్సిన బాధ్యత మొట్టమొదటిగా జిల్లా అధికారులపైనే ఉంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై 33 నెలలు కావస్తున్నా..సిబ్బంది మొత్తం గ్రామాల్లోని సచివాలయాల్లోనే పనిచేస్తున్నా నేటికీ ఎవరు ఏంటో ఏ ఒక్క ప్రజానీకానికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఒక వ్యవస్థ ప్రజల్లోకి వెళ్లాలన్నా..గుర్తింపు రావాలన్నా..ప్రజలు మొచ్చాలన్నా జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోతే అది సాధ్యం కాదనేది వాస్తవం. ఇకపై జిల్లా అధికారులు సచివాలయ సిబ్బంది డ్రెస్ కోడ్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారిస్తారనేది దైవాదీనం .!

Guntur

2022-08-02 01:40:41

ఆట మొదలైంది.. ఏపీ ప్రభుత్వ న్యూస్ ఛానల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లోమీడియా అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు భారీ వ్యూహమే రచించింది. దాని వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకుంటే దుష్ట చతుష్టయం అనబడే ఎక్స్ పార్టీ మీడియాకు కౌంటర్ పడటమే కాదు.. ఏపీలో అసలైన ఆట మొదలైనట్టుగా భావించాల్సి వుంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం సొంత ఛానల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు యువత పనికి వచ్చే అన్ని రకాల ప్రసారాలు ఇందులో చేయాలని చూస్తున్నది. ఏది నిజం..ఏది అవాస్థవం.. మరేది తప్పుడు, అసత్య ప్రచారం అనేది ప్రభుత్వ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల కళ్లముందు ఉంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకి వేస్తోంది. దానికోసం ఏపీఎస్ఎఫ్ఎల్ ను వేదికగా చేసుకుంది రాష్ట్రప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీఫైబర్ నెట్ ను భారీ ఎత్తున విస్తరిస్తున్నారు. కేబుల్ టీవీతోపాటు, ఇంటర్నెట్ సౌకర్యం అతి తక్కు మొత్తానికే రావడంతో రాష్ట్రప్రజలందరూ దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా ఎక్కువ మంది ప్రజలకు చేవరుగా ఉండే ఏపీఎస్ఎఫ్ఎల్ వేదిక ద్వారా ప్రభుత్వ న్యూస్ ఛానల్ వుంటే ప్రతిపక్ష మీడియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు సంక్షేమ పథకాలు, వాటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా వుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసి రంగంలోనికి దిగింది.

నిరుద్యోగ యువతకు ఉపాది..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం సొంత ఛానల్ ను ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు, రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని జర్నలిస్టులకు ఉపాది దొరుకుతుంది. జిల్లాకి ఒక రిపోర్టర్, ఒక కెమెరా మేన్ తోపాటు కేంద్ర కార్యాలయంలో సబ్ ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు, వీడియో ఎడిటర్లు, బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీర్లు, ఎస్ఎన్జీ టెక్నీషియన్లు, డ్రైవర్లు,  పీసీఆర్, ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వారికి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఇంజనీర్లుగా, కార్యాలయ సిబ్బందిగా మరికొంత మందికి కూడా అవకాశాలు లభిస్తాయి. యువతకు ఉపాది చూపడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతీ ఇంటికి చేరవేసేందుకు వీలుగా వుండేలా ప్రసారాలు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

కొత్త జిల్లాలకి వినూత్న ప్రచారం..
ఇప్పటి వరకూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియా వలన రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటైనా దాని సమాచారం గానీ, అధికారులు, ఇతర 75 ప్రభుత్వ శాఖలకు చెందిన ఆఫీసర్ల వివరాలును తెలియజేసేందుకు ఏ ఒక్క మీడియా కూడా ముందుకి రావడం లేదు. దీనితో ఇప్పటికీ చాలా మంది ప్రజలు పాత జిల్లాల కలెక్టరేట్లకే స్పందన కార్యక్రమాలకు వెళ్లి తమ సమస్యలపై అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించడంతోపాటు కొత్త జిల్లాల స్వరూపం, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల ఇంటర్వ్యూలు ఇలా అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వ అధికారిక న్యూస్ ఛానల్ లో ఏర్పాటు చేసి ప్రచారం కల్పించ నున్నారు. దాని ద్వారా ఏఏ కొత్త జిల్లాల్లో ఎన్ని మండలాలు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయనే విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన రావడంతోపాటు ప్రజలు కూడా చైతన్యం కావడానికి ఆస్కారం వుంటుంది.

ప్రత్యక్ష ప్రసారాల లీజులకు చెల్లు చీటి..
ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా టీవీ ఛానళ్లకు ఫీడ్ ఇచ్చేందుకు వివిధ ప్రైవేటు సంస్థలకు వందలాది కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వ అధికారిక టీవీ ఛానల్ లకే అప్పగించి ఆ మొత్తాన్ని ఇదే సంస్థకు వెచ్చించడం ద్వారాప్రత్యక్ష ప్రసారాలు చేసే యూనిట్లు, కెమెరాలు, ఇతర సాంతికే వ్యవస్థ కొనుగోలు చేసుకోవడానికి వీలుపడుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానికితోడు ఒక్కసారి పెట్టుబడి పెడితే వాటితో చాలా సంవత్సరాల పాటు సేవలు అందించవచ్చునని..తద్వారా ప్రభుత్వంపై ప్రతీ ఏటా ప్రచారాల ఖర్చు భారం తగ్గుతుందని కూడా ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.  అంతేకాకుండా ఈ ప్రభుత్వ టీవీ ఛానల్ ను సమాచారశాఖ కు అనుసంధానించడం ద్వారా  ప్రతీ జిల్లాలోనూ జరిగే కార్యక్రమాలను, సదరు న్యూస్ వీడియోలను డీపీఆర్వో కార్యాలయాల నుంచే పంపించుకునే ఏర్పాటు చేయాలని కూడా సమాచాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సమాచారశాఖలో ఖాళీగా వున్న సిబ్బందిని భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ న్యూస్ ఛానల్ కు సిబ్బంది కూడా అందుబాటులోకి తీసుకు రావొచ్చుననేది ప్రభుత్వ బావన. చూడాలి ప్రభుత్వం సొంతంగా న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తే ప్రతీపక్ష మీడియా ప్రచారాన్ని ఏవిధంగా తిప్పికొడుతుందో..ప్రజలకు ఏలాంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా  అందిస్తుందనేది..!

గుంటూరు

2022-07-31 01:23:08

నేను రాను బిడ్డో ఆ కారుణ్య నియామకానికి..

ఆంధ్రప్రదేశ్ లో కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు పొందిన వారంతా తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒక శాఖలో తమకు నాల్గవ తరగతి కింది ఉద్యోగాలిచ్చినా బాగుండు..అది పోయి గ్రామ,వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాలిచ్చారు..అక్కడ కేవలం రూ.15వేలకే రెండేళ్ల పాటు ప్రొబేషన్ చేయాలి.. ఆ ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.. ఎటూచాలని జీతంతో కుటుంబాలను నెట్టుకొచ్చేది ఎలా అంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం సచివాలయ శాఖలో లక్షా 21వేల ఉద్యోగాలు రెండు నోటిఫికేషన్ల ద్వారా భర్తీచేసింది. ఆ తరువాత మిగులు ఉద్యోగాలను కారుణ్య నియామకాల క్రింద మళ్లీ సచివాలయ శాఖలోనే భర్తీచేస్తోంది. ఇప్పటికే సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ పూర్తికావడానికి రెండు సంత్సరాల 9నెలల సమయం పట్టింది. ఇపుడు మా పరిస్థితి కూడా అలానే వుంటుందనుకొని బెంగ పెట్టుకుంటున్నారు ఉద్యోగులు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ..సర్వీసులో చనిపోతే నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగాలను పిల్లలకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అయితే ఉద్యోగం వచ్చినందుకు ఆనందించాలో.. ప్రొబేషన్ లేట్ అయిపోయే సచివాలయశాఖలో వచ్చినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగుల్లో. ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖలో విధులు నిర్వహిస్తూ మ్రుతిచెందినా ఉద్యోగుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే వారి విద్యార్హతలను బట్టీ నియమిస్తుంది. ఇక్కడైతే ఉద్యోగులు రెండేళ్ల వరకూ రూ.15వేలకే ఉద్యోగాలు చేయాల్సి వుంటుంది(పెరిగిన పీఆర్సీప్రకారం జీతం ఇస్తారో అనే విషయంలో క్లారిటీ లేదు) . అదే ఇతర ప్రభుత్వ శాఖల్లో అయితే ప్రభుత్వం నిర్ధేశించిన పేస్కేలు అమలు చేస్తారు. దీనితో ఇపుడు సచివాలయ శాఖలో ఉద్యోగం అంటే కారుణ్య నియామక ఉద్యోగార్ధులు హడలి పోతున్నారు.

ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ చాలా ఉద్యోగాలను భర్తీచేస్తారని అందరూ అనుకున్నారు. అక్కడ భర్తీచేయాల్సిన సుమారు 850కి పైగా ఉద్యోగాలను కూడా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే బర్తీచేయాలని రాష్ట్ర జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ శాఖలో భర్తీకాకుండా మిగిలిపోయిన ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం సచివాలయ శాఖలో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హబ్జండరీ, మహిళా పోలీస్ శాఖల్లో అధికంగా ఖాళీలు ఉన్నాయి. ఇక పంచాయతీ కార్యదర్శిలు ఇతర శాఖలకు చెందిన పోస్టులు మాత్రం తక్కువగానే ఉన్నాయి. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల జాబితా వచ్చిన తరువాత కారుణ్య నియామకాలు చేపట్టాలనుకునే కుటుంబాల పిల్లల నుంచి విద్యార్హతలను సేకరించి వారిని సదరు ఉద్యోగాల్లో భర్తీచేయనుంది ప్రభుత్వం. అయితే ఇతర శాఖల్లో అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా అయినా వెళ్లడానికి ఇష్ట్ పడుతున్నారు తప్పితే ఏ కేటగిరీకి చెందిన ఉద్యోగమో నేటికీ తెలియని గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగాల్లో జాయిన్ కావడానికి ఎవరూ ముందుకి రావడం లేదు.  ప్రభుత్వం మాత్రం మిగులు ఉద్యోగాలన్నీ కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయడం ద్వారా సచివాలయ శాఖలో అన్ని మిగులు ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తుంది. తద్వారా సచివాలయ శాఖలో అన్ని ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయనే ఆలోచనలో వున్నది.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఆగస్టు 1 నుంచి పెరిగిన పేస్కేలు ప్రకారం పేస్కేలు ఇవ్వాలని జీఓ నెంబరు-5ని విడుదల చేసినా.. కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాల్లో చేరే వారికి పెరిగిన పేస్కేలు వర్తిస్తుందా లేదా అనే విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడమే కొత్తగా ఉద్యోగాల్లోకి చేరేవారు సచివాలయ శాఖకు రావడానికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చినా..ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలతో కుటుంబాలను నెట్టుకు రావడం చాలా కష్టం అవుతుంది. అందులోనూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఖాళీలు ఉంటే ఆ జిల్లాల్లో వారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక జిల్లాలో ఖాళీలు లేకపోతేమాత్రం పక్కజిల్లాకు పంపే అవకాశాలూ కూడా లేకపోలేదు. అదే జరిగితే ఉద్యోగార్ధులపై ఆర్ధిక భారం మరింత ఎక్కువగా పడుతుంది. వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకొని కారుణ్య నియామకాలన్నీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మిగులు ఉద్యోగాలన్నీ ప్రభుత్వం భర్తీచేయాలన్నా ఎవరూ ముందుకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తరువాత చాలా ప్రభుత్వ శాఖలకు జూనియర్ అసిస్టెంట్లు కూడా అవసం వుంది. అయితే దానికి ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వాటిని భర్తీచేస్తే..చచ్చినట్టు ఉద్యోగార్ధులంతా సచివాలయ శాఖలో ప్రభుత్వం చూపించిన విధంగా విధుల్లోకి చేరాల్సి వుంటుంది. చూడాలి ప్రభుత్వం కారుణ్య నియామకాల విషయంలో ఏ విధమైన విధి విధానాలను అవలంభించి మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తుందనేది..!

Tadepalli

2022-07-30 02:56:39

ఆ ఒక్క కారణంతోనే రెగ్యులైజేషన్ ఆపేశారు..!

అమ్మతనం ఏ మహిళకైనా తన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది..కానీ ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ  మహిళా ఉద్యోగులకు మాత్రం తీరని వేదనను, కన్నీటిని మిగుల్చుతోంది. పురిటి సమయంలో పండంటి బిడ్డ పుట్టిందని ఆనంద పడాలో.. ఆ సమయంలో ప్రసూతి సెలవులు తీసుకున్నందుకు సర్వీస్ ప్రొబేషన్ మరో ఆరు నెలలు పొడిగింపు వర్తించినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఎదురైంది. పోనీ ఆ ఆరునెలలు పూర్తయిన తరువాత నైనా అందరి ఉద్యోగులతోనైనా సర్వీసు రెగ్యులైజేషన్ చేస్తారా అంటే ఆ విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది. విధి నిర్వహణలో ఉండగా పెళ్లై, పురిటి సెలవులు తీసుకున్న గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులకు జూలై నెలలో కొన్ని కొన్ని తేదీలతో రెండేళ్లు ప్రొబేషన్ సమయం తీసుకున్న ఆరు నెలల సమయంతో కలిపి పూర్తయిపోయింది. కానీ మిగిలిన సహచర ఉద్యోగులతోపాటూ సర్వీస్ రెగ్యులైజేషన్ కి సంబంధించిన ఆఖరి దస్త్రాలు నేటికీ గ్రామ, వార్డు సచివాలయాలకు చేరలేదు. దీనితో తన సహచర ఉద్యోగులంతా ఆగస్టు1వ తేదీ నాటికి పెరిగిన పేస్కేలు సాలరీలు తీసుకుంటే.. ప్రసూతి సెలవులు తీసుకొని.. ఆగడవు పూర్తయినా.. క్రమ బద్దీకరణ దస్త్రాలు అందుకోని సచివాలయ మహిళా ఉద్యోగులు మాత్రం ఆగస్టు నెలలో కూడా ఆ పాత జీతం రూ.15 వేలు మాత్రమే తీసుకోబోతున్నారు. ఇప్పటికే సర్వీస్ ప్రొబేషన్ పూర్తయి సంబంధిత జిల్లా శాఖల నుంచి ఫైనలైజ్డ్ డాక్యుమెంట్ల జాబితాలు సచివాలయాలకు చేరకపోవడంతో వారందరికీ పాత పద్దతిలోనే జీతాలు పెట్టారు సచివాలయ డిడిఓలు.

 ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తరువాత ప్రభుత్వ నిబంధన ప్రకారం తొలుత రెండేళ్లు సర్వీస్ ప్రొబేషన్ పూర్తిచేయాల్సి వుంటుంది. తరువాత అదే ప్రభుత్వ నిబంధనతో సదరు ఉద్యోగులను ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించిన విధంగా సర్వీస్ రెగ్యులర్ చేసి, పూర్తిస్థాయిలో పేస్కేలును అమలుచేయాలి. కానీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాటు కోసం ఏకంగా 9నెలలకు పొడిగించి, అదే రూ.15వేలతోనే అదనంగా ఉద్యోగులతో పనిచేయించింది.  ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు 6నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగించింది. ఇలా చేయడం వలన నేటికీ చాలా మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం జీఓనెంబరు 5లో పేర్కొన్నవిధంగా చూస్తే రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని పక్కాగా పొందు పరిచింది. అదే ఉద్యోగ నియామకం సమయంలో ఇచ్చిన జీఓ, ఉద్యోగులు విధుల్లోకి చేరినపుడు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రెండేళ్ల తరువాత సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పూర్తి పేస్కేలు ఎందుకు అమలు చేయాలేదని ప్రశ్నిస్తే.. అ ఒక్కటీ మీరు అడక్కూడదంటూ ఆ విషయాన్ని దాట వేసింది ప్రభుత్వం.  ఈ విధంగా చేయడం వలన సచివాలయ ఉద్యోగులు 9నెలలు అదనంగా రూ.15వేలకే పనిచేయడంతోపాటు, 9 నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు, 27% ఐఆర్, ఒక డీఏ, పీఆర్సీ పెంపుతో రావాల్సిన ఎరియర్స్  ఉపయోగాలన్నీ కూడా ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది.

ఆగస్టు1కి కొందరికి పెరిగిన జీతం..మరికొందరికీ పాత జీతం..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు1 నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారందరికీ పూర్తిస్థాయి పేస్కేలు అమలు చేయడంతో ఆ ప్రక్రియ పూర్తయిన వారందరూ కొత్త పేస్కేలు అందుకోనుండగా.. రెండేళ్లు పూర్తయినా ప్రసూతి సెలవులు గడువు పూర్తయినా క్రమబద్దీకరణ దస్త్రాలు రాని వారు మాత్రం ఎప్పటి మాదిరిగానే పాతజీతం రూ.15వేలతోనే సరిపెట్టుకోవాల్సి వుంది. ఇప్పటికే జీతాలు ఆన్ లైన్ లో ననమోదు కావడంతో ఆఖరి నిమిషంలో క్రమబద్దీకరణ దస్త్రాలు వచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది.  జూన్ నెలాఖరు నాటికే సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని జీఓనెంబరు-5 ద్వారా ప్రభుత్వం ఆదేశించింది.  అయితే ప్రసూతి సెలవులు తీసుకున్నవారి సర్వీసు ప్రొబేషన్ సాలరీలు పెట్టే సమయం నాటికే పూర్తయినా వారు కొత్త పేస్కేలు పొందే పరిస్థితి లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బినిఫిట్స్ ను తప్పించుకునేందుకు.. ప్రభుత్వానికి అనుకూలంగా జీఓలను అమలు చేసినప్పటికీ, ప్రసూతి, సిక్ లీవ్ లను అమలు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం తమ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది ప్రభుత్వం. ఈ ఒక్క కారణంతోనే నేటికీ చాలా మందికి మహిళా ఉద్యోగలకు సర్వీసు ప్రొబేషన్ కి సంబంధించిన డిక్లరేషన్ ఫైనల్ డాక్యుమెంట్లు జిల్లాశాఖల కార్యాలయాల నుంచి సచివాలయాలకు చేరుకోలేదు. దానితో ఆగస్టు 1నాటికి కూడా చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెరిగిన పేస్కేలు జీతం తీసుకోలేరన్నమాట. అంతేకాదు ఇంకా ప్రసూతి సెలవులు తీసుకున్నవారు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది మహిళా ఉద్యోగులు మిగిలిపోయారో వారందరికీ ఒకేసారి సర్వీస్ ప్రొబేషన్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అదే నిజమైతే మరో రెండు నెలల వరకూ కూడా కొత్త పేస్కేలు పొందలేరు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులు. అందరు సహచర ఉద్యోగులతోపాటు తాము కూడా ఆగస్టు 1నాకిటికి కొత్త పేస్కేలు జీతం తీసుకునే అవకాశం లేకుండా కేవలం ప్రసూతి వేదన మిగిల్చిన శాపమే అంటున్నారు మహిళా ఉద్యోగులు. చూడాలి ప్రసూతి సెలవుల గడువు పూర్తయిన వారికి సెప్టెంబరు నెలలో నైనా పాత తేదీలలో మిగిలిన జీతం కలిపి ఇస్తారా లేదా అన్నది..!

Tadepalli

2022-07-29 01:30:56

బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట

క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు మాడ వీధుల్లో నిర్వ‌హించ‌నుండ‌డంతో పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే ఉంటుంద‌ని, అన్నిర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం జిల్లా క‌లెక్ట‌ర్  వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, ఇత‌ర టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయ‌ని, ఇందులో ప్ర‌ధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం జ‌రుగుతాయ‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రివైఎస్‌.జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. పెర‌టాసి మాసం మూడో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో త‌మిళ‌నాడు భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశ‌ముందని, ర‌ద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల‌నే విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు తెలిపారు.
            
           గ్యాల‌రీలు, క్యూలైన్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని, జ‌న‌రేట‌ర్లు కూడా సిద్ధంగా ఉంచుకుంటామ‌ని చెప్పారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు చేప‌డ‌తామ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులను ఆహ్వానిస్తామ‌ని తెలిపారు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు చేసుకుంటామ‌ని వెల్ల‌డించారు. వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని, నిర్దేశిత ప్రాంతాల్లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. అంబులెన్సుల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు. .

          భ‌క్తుల‌కు ర‌వాణాప‌రంగా ఇబ్బందులు లేకుండా ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ముఖ్యంగా గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు న‌డుపుతామ‌ని చెప్పారు. ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా చూసేందుకు వీలుగా గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిషేధిస్తామ‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ద‌ర్శించే శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ముందు హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో విభిన్న క‌ళారూపాల‌ను, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

          తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్  వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హణ‌కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు. జిల్లాస్థాయిలో అన్ని విభాగాల‌ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించి పూర్తి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తామ‌ని, మ‌రోసారి ఈవోతో స‌మావేశం నిర్వ‌హించి దాన్ని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు. ఈసారి గ‌రుడ‌సేవ‌కు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో, ఏర్పాట్ల‌పై ప్ర‌త్యేకంగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌న్నారు. తిరుప‌తి జిల్లా ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశముంద‌ని, ఇందుకు అనుగుణంగా భ‌ద్ర‌త‌ప‌రంగా ఎలాంటి రాజీకి తావులేకుండా బందోబ‌స్తు ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే ఉంటుంది కావున క్యూలైన్లు వెలుప‌లికి వచ్చే అవ‌కాశం ఉంద‌ని, క్యూలైన్ల వ‌ద్ద కూడా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా, ట్రాఫిక్‌, పార్కింగ్ ప‌రంగా ఇబ్బందులేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

             ఈ స‌మీక్ష‌లో టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌)  స‌దా భార్గ‌వి, జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో ష‌ణ్ముఖ కుమార్‌, శ్రీవారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  వేణుగోపాల దీక్షితులు,  గోవింద‌రాజ దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ముఖ్య అర్చ‌కులు  కిర‌ణ్ స్వామి, అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య‌, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  వేంక‌టేశ్వ‌ర్లు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ట్రాన్స్‌పోర్టు జిఎం  శేషారెడ్డి, ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్  చెంగ‌ళ్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-07-28 10:45:27