1 ENS Live Breaking News

కొత్తజిల్లాల్లో కలెక్టర్లకు నివాస సముదాయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించిన 13 జిల్లాల అభివ్రుద్ధి లక్ష్యంగా ముందుకి అడుగులు వేస్తోంది. మొన్నటి వరకూ కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలకు స్థలసేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం ఇపుడు తాజాగా కొత్త జిల్లాల్లోని కలెక్టర్లు, జెసిలు, ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి వంటి సివిల్ సర్వీస్ అధికారులు, జిల్లా అధికారులకు నివాస సముదాయాలను కూడా నిర్మించాలని యోచిస్తున్నది. దానికోసం కూడా ప్రభుత్వ స్థలాల ఎంపిక పూర్తిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేసే జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఉమ్మడి 13 జిల్లాల్లో మాత్రమే సివిల్ సర్వీస్ మరియు జిల్లాశాఖలకు చెందిన అధికారులకు నివాస సముదాయాలు ఉన్నాయి. అదే తరహాలలో కొత్త జిల్లాల్లోని అధికాకులకు కూడా నివాస స్థలాలు, క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొత్తజిల్లాల్లోని చాలా మంది కలెక్టర్లు ప్రైవేటు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారందరికీ నివాస సముదాయాలు నిర్మిస్తే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వసతి సమకూర్చినట్టు ఉంటుందని భావిస్తున్నారు.

75 ప్రభుత్వ శాఖల అధికారులకు క్వార్టర్స్..
రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల జిల్లా అధికాకులకు కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, జెసి స్థాయిలోనే నివాస సముదాయాలను కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల నుంచి అధికారులు కొత్త జిల్లాలకు రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలా అయితే పరిపాలన ముందుకు సాగడం కష్టమని, కొత్త జిల్లా అభివ్రుద్ధి కష్ట తరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం జిల్లా అధికారులకు కూడా నివాస సముదాయాలు కల్పించాలని చూస్తోంది. ఆ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం జిల్లాశాఖల అధికారులు కూడా ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులో ఉంటారనేది ప్రభుత్వ భావన. ఉమ్మడి జిల్లాల్లో అయితే చాలా చోట్ల రెవిన్యూ క్వార్టర్స్ నిర్మించి అందులో జిల్లా అధికారులకు సముదాయాలు ఏర్పాటు చేశారు. ఇపుడు అదే విధంగా ప్రత్యేకంగా క్వార్టర్స్ ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల అభివ్రుద్ధితోపాటు కొత్త జిల్లాల్లో కూడా అన్ని రకాల మౌళిక వసతులు కూడా కల్పించినట్టు అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు స్థలాల గుర్తింపు వేగవంతం చేస్తున్నారు.

సర్క్యూట్ హౌస్..జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లు
ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లో మాదిరిగా కొత్త జిల్లాల్లో కూడా ప్రభుత్వంలోని ముఖ్యమైన అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి విడిది చేసేందుకు వీలుగా సర్క్యూట్ హౌస్ లు, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లు,  కొత్తజిల్లాల్లోకి జిల్లా పరిషత్ లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ విధంగా గెస్ట్ హౌస్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఏ జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు ఆ జిల్లాల్లోనే ఉంటారనేది కూడా ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా విభజించి పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ.. అధికారుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉమ్మడి జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనే తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. అలా చేయడం ద్వారా ప్రజలకు ప్రజా ప్రతినిధులు కూడా దూరంగా ఉంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనితో ఏ కొత్త జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, జిల్లాశాఖల అధికారులకు సంబంధించి వేర్వేరుగా నివాస సముదాయాలు, సర్క్యూట్ హౌస్ లు, జిల్లా పరిషత్ లు, గెస్ట్ హౌస్ ల నిర్మాణం చేపట్టడం ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ప్రజాప్రతినిధులు జిల్లాలకు వచ్చినపుడు అక్క బసచేయానికి వీలవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా కొత్త జిల్లాలకు అధికారులకు బదిలీలు జరిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివాసాలకోసం ఆలోచించే పని కూడా ఉండదు.

కొత్తజిల్లాల అభివ్రుద్ధి దిశగా అడుగులు
రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు నివాస సముదాయాలు నిర్మాణాలు చేపట్టడం ద్వారా కొత్త ప్రాంతాల్లో కూడా అభివ్రుద్ది వేగం పుంజుకుంటుందని తద్వారా కొత్త జిల్లాలకు నిజమైన గుర్తింపు, కొత్త రూపు వస్తాయని కూడా రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాల విభజన, అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారించినట్టుగా కూడా కనిపిస్తుందని రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వ పరంగా భవనాలు, క్వార్టర్స్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరిగితే ప్రైవేటు పరంగా కూడా విద్యా సంస్థలు హోటళ్లు, కమర్షియల్ మాల్స్ ఇలా అన్ని రకాలుగా కూడా కొత్త జిల్లా కేంద్రాలు అభివ్రుద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో జరిగిన అభివ్రుద్ధి కంటే కొత్త జిల్లాలో మరింత ఎక్కువగా జరగాలంటే ప్రభుత్వపరంగా నిర్మాణాలు ఉండాలని సీఎం వైఎస్ జగన్ భావించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆలోచన మేరకు అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు, గెస్ట్ హౌస్ లు, జిల్లా పరిషత్ ల నిర్మాణాలు జరిగితే 2024 తరువాత వచ్చే ప్రభుత్వం మరింతగా కొత్త జిల్లాలను అభివ్రుద్ధి చేయడానికి ఆస్కారం వుంటుంది. ఇప్పటికే కొత్తజిల్లా కేంద్రాలు కొద్ది కొద్దిగా రూపు రేఖలు మారుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ శాస్వత ప్రభుత్వ నిర్మాణాల ఆలోచన మరింతగా అభివ్రుద్ధికి బాటలు వేయనున్నది.

Amaravati

2022-08-29 01:58:02

వినాయకచవితికి ఎలాంటి ఆంక్షలు లేవు

వినాయక చవితి నిమజ్జనం ఘనంగా జరుపుకోవడానికి పోలీసు శాఖ సహకరిస్తుంది..పండుగ నిర్వహణకుఎటువంటి ప్రత్యేక ఆంక్షలు విధించటం లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎప్పటిలాగే వినాయక నిమజ్జనం ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ఎస్పీ, కమిషనర్, డీఐజీను సంప్రదించాలని సూచించారు. పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లలో ముందుగా సమాచారం అందించాలలన్నారు. అంతేకాకుండా ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి కూడా  తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన వివరాలు తెలియజేయాలన్నారు. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలన్నారు.

 పందిళ్ళు, మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నింబంధనలు 2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను వినియోగం ఉండాలన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాటిని వినియోగించాలని, మండపాల వద్ద క్యూలను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ తీసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ  ప్రతినిధులు కాపలా ఉండాలని సూచించారు. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్ లకు ఆదేశాలు జారిచేసినట్టు వివరించారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు, వేషధారణలు, డీజేలపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడం తప్పని సరి స్పష్టం చేశారు.

Guntur

2022-08-28 16:36:10

సీఎం ప్రకటనతో కుప్పకూలిన ఫ్లెక్సీ బ్యానర్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష్ పార్టీల నాయకులు,  ప్రభుత్వ అధికారులు ఎక్కడి వస్తే అక్కడ ఫ్లెక్సీ..పుట్టినరోజుకి ఫ్లెక్సీ..ఎవరైనా చనిపోతే ఫ్లెక్సీ..సినిమా ప్రచారాలు..ప్రముఖల పర్యటనలు ఇలా దేనికైనా ప్లాక్టిక్ ఫ్లెక్సీలే..ఇవన్నీ ఆగస్టు 26 వరకూ మాత్రమే.. ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖలో ప్లాస్లిక్  ఫ్లెక్సీలపై నిషేధం ప్రకటించిన తరువాత ఒక్కసారిగా ఫ్లెక్సీలు,  ప్రింటర్లు అంతా కుప్పకూలిపోయాయి. ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు వేయకూడదని..వాటిపై నిషేదం ప్రకటిస్తున్నామని చెప్పిన ప్రకటన అన్ని వర్గాలు, వ్యారస్తులు, కంపెనీలు, సినిమా పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేటివరకూ కిరాణా షాపుల్లో నేటికీ ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రభుత్వం హెచ్చరికలు చేసినా నియంత్రించలేకపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లలోనే మంచినీరు.. కూల్ డ్రింకులు..ఆఖరికి షాపింగ్ మాల్ లో సామాన్లు తెచ్చుకోవడానికి కూడా ప్లాస్టిక్ కవర్లు మాత్రమే వినియోగిస్తున్నారు. వీటిపై నిషేదం వున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ఈ తరుణంలో సీఎం చేసిన ప్రకటన ఒక్కసారిగా వ్యాపార వర్గాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. వాస్తవానికి ప్లాస్టిక్ నియంత్రణ మానవాళి మనుగడకు శాపంగా మారిన తరుణంలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగా అవి ఎక్కడా అమలు కావడం లేదు. అలాంటిది ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ ప్రకటించగానే అవి ప్రింటింగ్ చేసే ప్రింటర్లు, పరిశ్రమల వారంతా లబో దిబో మంటున్నారు. 

ప్రింటర్ల మనుగడ ప్రశ్నార్ధకం
ఇప్పుడిప్పుడే మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఫ్లెక్సీ  ప్రింటర్లు ఏర్పాటు చాలా జోరుగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇపుడు ప్రతీ చిన్నకార్యక్రమానికి ఫ్లెక్సీలు ప్రింట్ చేయించడం అలవాటు చేసుకున్న సమయంలో ఒకేసారి దానిని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించడం ఒకింత ప్రజాప్రనిధులకు కూడా మింగుడు పడటం లేదు. ఇకపై ఏ గ్రామానికి వెళ్లినా రంగు రంగుల ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిదారి కనిపించాయా..వారి చుట్టూ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకునే పరిస్థితిలు ఇపుడు అధికంగా ఉన్నాయి. అలాగని గుడ్డపై ప్రింటింగ్ వేయిస్తే ప్లాస్టిక్ ఫ్లెక్సీ కంటే రెండింతలు రేటు అధికం అవుతుంది. రేటు పోయినా..ఫ్లెక్సీలో కనిపించినంతగా గుడ్డపై ప్రింటింగ్ కనిపించదు ప్రజలను ఆకట్టుకోదు. ఈ తరుణంలో ప్రింటర్లు, వారికి అత్యధికంగా వ్యాపారాలు ఇచ్చే ప్రజాప్రతినిధులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఫలింతంతా ఫ్లెక్సీ ప్రింటర్ల మనుగడ ప్రశ్నార్ధకం కానుంది. సీఎం ప్రకటనలో ఉన్న ప్రింటర్లంతా వాటిని బేరం పెట్టే పనిలో పడతారనే ప్రచారం కూడా అపుడే ప్రారంభమైంది.

ప్రభుత్వ కార్యాలయాల్లోనే అత్యధిక వినియోగం
ప్రభుత్వం ప్లాస్టిక్ పై బ్యాన్ ప్రకటించడం శుభ పరిణామమే అయినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వినియోగం అధికంగా జరుగుతుంది. ప్రజలకు అవసరయ్యే విధంగా ఏర్పాటు చేసే బోర్డులు కూడా ప్రభుత్వశాఖల్లోనే అధికంగా ప్రింట్ చేయిస్తుంటారు. ప్రతీ కార్యాలయం ముందు, కార్యాలయం లోపల కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తిచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, ఇతర మండల కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా బోర్డులన్నీ ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. ప్రజాప్రతినిధులు ఎంత ఎక్కువగా ఫ్లెక్సీలు వినియోగిస్తారో..దానికి వందరెట్లు రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరుగుతుంది. ఈనేపథ్యంలో సీఎం చేసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తో అందరి గొంతులోనూ పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యాలయాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. వాటిని సీఎం ప్రకటన నేపథ్యంలో తొలగిస్తారా అంటే ఏ ఒక్క అధికారి  దగ్గర నుంచీ సరైన సమాధానం ఇంకా వెలువడలేదు.

ప్లాస్టిక్ కవర్లనే నియంత్రించలేకపోయారు..?
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్నే పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోయింది. ఈ తరుణంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తే అలమలు జరుగుతుందా అంటే ఖచ్చితంగా అమలు జరగదని..ప్లాస్టిక్ ఫ్లెక్సీల వరకూ అనుమతులు మళ్లీ అత్యధిక మంది అభ్యర్ధనతో తిరిగి అనుమతిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చేసిన ప్రకటనకు, సింగిల్ యూజ్ ప్లిస్టిక్ నియంణత్రకు తీసుకున్న కఠిన నిర్ణయాలు గాలికి ఎగిరిపోయినట్టే అవుతుందనే వాదన కూడా మరో వైపు బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రముఖ కంపెనీలు సీతల పానియాలు, మంచినీరు, ఇతర ఉత్పత్తులన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిళ్లలోనే పెట్టి వ్యాపారాలు చేస్తున్నాయి. వాటిపై నాటి నుంచి నేటి వరకూ ఎక్కడా నిషేధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గ్లాసులు వ్యర్ధాలనే పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. అలాగని అవి తయారు చేసే సంస్థలపై చర్యలు తీసుకుంటారా అంటే ఆ ఒక్కటీ ప్రభుత్వం చేయడం లేదు. ప్లాస్టిక్ వినియోగించేవారిపైనా.. చిన్న చిన్న వ్యాపార సంస్థలపైనా కేసులు నమోదు చేస్తున్నది. ఇలాంటి తరుణంలో సీఎం చేసిన చేసిన ప్లాక్ ఫ్లెక్సీలు రద్దు ప్రకటన ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఎంచేసిన  ప్రకటనతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా నేటి వరకూ ఏ ఒక్కరూ తమ తమ కార్యాలయాలతోపాటు పార్టీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీలను మాత్రం తొలగించకపోవడం విశేషం.

సీఎం ప్రకటన  ఆచరిస్తే గ్రీన్ ఏపీగా రూపాంతరం 
ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, కవర్లు, గ్లాసులు, బాటిళ్లు ఇతర సింగిల్ యూజ్ ప్లాస్లిక్ ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించగలిగితే రాష్ట్రం గ్రీన్ ఏపీగా అవతిరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలా జరగాలంగే చాలా అడ్డంకులను ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులను చేస్తే తప్పా అది సాధ్యం కాదు. అన్నింటికంటే ముందుగా ప్లాస్టిక్ బాటిళ్లు తయారు చేసే సంస్థలను ప్రభుత్వం పనిగట్టుకొని నియంత్రించాల్సి వుంటుంది. అయితే అది జరిగే వీలు లేదు సరిగా ఆ పనిగా మాత్రం కార్య రూపంలో  కనిపించడం లేదు. భూమిని తినేస్తున్న ప్లాస్టిక్ బూతాన్ని తరిమికొట్టాలంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగంపై బ్యాన్ విధించాల్సి వుంటుంది. అలా జరిగిన క్రమంలో కొంత మేరక వినియోగం నేరుగా తగ్గే పరిస్థికి వస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో ప్రకటించిన ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందనని విశ్లేషకులు రక రకాల అంచాలు వేస్తున్నారు. చూడాలి ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ స్టేట్ గా మార్చాలనుకున్న సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కల ఏ మేరకు సాకారం అవుతుందనేది.. కాకపోతే ఖచ్చితంగా అవ్వాలనే ప్రతీ ఒక్కరం కోరుకుని.. ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..లేదంటే ఇదే ప్లాస్టిక్ భూమితోపాటు జీవకోటి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుంది..!

Guntur

2022-08-28 04:09:08

ఇక ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు

సామజిక మాధ్యమాల్లో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోవడంపై హైకోర్టు మండిపడింది. అంతేకాకుండా కోర్టులపై బాధ్యతరహితంగా వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.  సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు విపరీతంగా పెరిగిపోయాయని వ్యాఖ్యానించిన హైకోర్టు  కోర్టులు, న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా, ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని సుమోటోగా తీసుకుంది.  నమోదైన కేసులో హైకోర్టుకు క్షమాపణలు తెలిపానని చంద్రశేఖర్ వాదనలు వినిపించారు.  తనను ప్రతివాదుల జాబిత నుంచి తొలగించినా .. సీబీఐ అరెస్ట్ చేసి పది రోజులు జైల్లో పెట్టిందన్నారు.  వాటిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఆ పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Guntur

2022-08-27 14:04:30

అయ్యా మహాప్రభో మాగోడు కాస్త వినండి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని  కార్యక్రమాల, సంక్షేమ పథకాలపై ప్రచారారం, సామాచా రాన్ని ప్రజలకు మీడియా ద్వారా చేరవేసే సమాచార, పౌరసంబంధాల శాఖను సిబ్బంది కొరత అత్యంత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి 13 జిల్లాల్లోనే అనుకుంటే..ఇపుడు ఆ ఇబ్బందులు కొత్త 13 జిల్లాల్లో మరింత అధికం అయ్యాయి. సిబ్బంది కొరత సమాచారశాఖను దారుణంగా వెంటాడుతుండటంతో అన్నిపనులూ ఉన్న కొద్దిపాటి సిబ్బందే చేసుకోవాల్సి వస్తున్నది. దీనితో సరైన సమాయానికి మీడియాకి ప్రభుత్వ సమాచారం ఇవ్వడానికి వీలుపడటం లేదు. ప్రభుత్వం రాష్ట్రంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఖాళీలలను అంచెలంచలుగా భర్తీచేస్తున్నప్పటికీ ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియజేసే సమాచారశాఖపట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నట్టే కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఈ శాఖలో ప్రధాన విభాగాల ఖాళీలు భర్తీకావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉండాల్సిన సిబ్బందిలో కనీసం సగం కంటే తక్కువగా ఉండంటంతో కొత్త జిల్లాల్లో కూడా సమాచారశాఖ కార్యాలయంలో కేవలం ముగ్గురు, నలుగురు సిబ్బందితోనే నెట్టుకు రావాల్సిన దుస్థిని ఏర్పడుతోంది. దీనితో మహా ప్రభో మా శాఖలో సిబ్బంది లేక నానా పాట్లు పడాల్సి వస్తోంది.. దయచేసి కొద్దిమందినైనా నియమించాలని రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సమాచారశాఖ అధికారులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అన్నిశాఖల మంత్రుల వద్ద తమశాఖ గోడును వెల్లబోసుకుంటన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.

సమాచారశాఖలో ఉండాల్సిన సిబ్బంది
సమాచార, పౌరసంబంధాల శాఖలో ప్రభుత్వ సమాచారాన్ని సంక్షేమ పథకాల వివరాలను సకాలంలో మీడియాకి అందించాలంటే కింద పేర్కొన్నట్టుగా సిబ్బంది ఉండాల్సి ఉంది. జిల్లా పౌరసంబంధాల అధికారి, సహాయ పౌరసంబంధాల అధికారి, ఫోటో గ్రాఫర్, కార్ డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, వీడియో గ్రాఫర్, కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, జూయిర్ అసిస్టెంట్, కంపోజర్ లేదా మెసెంజర్, ప్రొజక్షన్ ఆపరేటర్,  అటెండర్ ఉండాల్సి వుంది. ఉమ్మడి 13 జిల్లాల్లోనే ఈ శాఖలో ప్రభుత్వం ఈ విధంగా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. దానితో ఆయా విభాగాల్లోని సిబ్బందిని అత్యవసర పనులకు వినియోగించుకుంటూ కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు ఈ శాఖలోని అధికారులు. అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, ఎపుడైనా మంత్రుల కార్యక్రమాలు తప్పితే..ఇతర జిల్లాశాఖల వివరాలు మీడియాకి ఇవ్వడం లేదు. అదేంటని ప్రశ్నిస్తే..మాకు సమయం అంతా కలెక్టరేట్ ని కవర్ చేయడానికే సరిపోతుందని, సిబ్బంది లేకపోతే ఉన్న కొద్దిమందితో ఎలా అన్ని ప్రభుత్వశాఖల సమాచారాన్ని ఇవ్వగలమని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

అక్కరకు రాని ఏపీఆర్వోల నియామకాలు..
సమాచారశాఖలోని అధికారులు నెత్తీనోరూ కొట్టుకుంటే ప్రభుత్వం గతంలోని ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు 13 మంది ఏపీఆర్వోలను మాత్రమే నియమించి ఊరుకుంది. వారంతా ఉమ్మడి జిల్లాలకే డీపీఆర్వోలు, డీడీ, ఏడీల దగ్గర పరిమితం అయిపోయారు. చాలా సంవత్సరాల నుంచి ఈ శాఖలో ఫోటోగ్రాఫర్లు, ఏపీఆర్వోలు, కార్యాలయ 4వ తరగతి సిబ్బంది ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీనితో ఉన్న సిబ్బందితోనే సమాచారశాఖ సర్ధుకొని పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా వున్న ఈ శాఖలో ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులను నియమించాల్సి వున్నా.. కారుణ్య నియామకాల్లో తప్పా ప్రత్యేకంగా ఈ శాఖకు సరిపడ సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. ప్రభుత్వాలు మారినా..ఈ శాఖకు ప్రత్యేకంగా మంత్రులు వచ్చినా కూడా ఎందుకనో ఇక్కడ మాత్రం నియామకాలు చేపట్టడం లేదు ప్రభుత్వం. 

నోటిఫికేషన్లకు అతీగతీలేదు
గత కొన్ని నెలల క్రితం పరిమితంగా డీపీఆర్వోలు, ఏపీఆర్వో రెగ్యులర్ ఉద్యోగాలకు ఏపీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా వాటికి పోటీ పరీక్ష నేటివరకూ పెట్టకపోవడం విశేషం. ఆ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పరీక్షలు పెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియడం లేదని సదరు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నవారు వాపోతున్నారు. పాత ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఇచ్చిన ఆ నోటిఫికేషన్ లో ఇపుడు తాజాగా కొత్త పోస్టులను పెంచడానికి ఆ పోటీపరీక్ష నిర్వహించ లేదా..? లేదంటే పూర్తిగా రద్దు చేయడానికి ఇంత ఎక్కువ కాలం పరీక్ష్ పెట్టలేదా? అనే ప్రశ్నలకు సమాచారశాఖ, ఏపీపీఎస్సీ నుంచి సమాధానం నేటికీ రాలేదు.

రాష్ట్రంలో అరకొరగానే మీడియాకి సేవలు..
ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో మీడియాకి సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా మీడియాకి సహకారం పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న ఆ కొద్ది మందిలో వేళ్లపై లెక్కపెట్టే జిల్లాలు మాత్రమే మీడియాకి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందిస్తూ సహకారం అందిస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో ప్రెస్ అక్రిడిటేషన్లు, పెద్ద, చిన్న పత్రికలు, టీవీఛానళ్ల నెపంతో అనుకున్నవారికి తప్పా ఇతర చిన్న, మధ్యతరహా మీడియాకి సమాచారం అందించడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే తమకు కమిషనర్ నుంచి ఆదేశాలున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోలేని మీడియా సంస్థలకు, పత్రికలకు స్థానిక జిల్లా అధికారులు తప్పా.. ఇతర జిల్లాల డీపీఆర్వోలు, డీడీలు, ఏడీలు సమాచారం ఇవ్వడంలో కరాఖండీగా వ్యవహరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ సమాచారం ఎన్ని జిల్లాలకు  మీడియా ద్వారా వెళితే అంతగా జిల్లా సమాచారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలుస్తుందనే విధంగా అధికారులు వ్యవహరిస్తూ అన్ని రకాల మీడియాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా కమిషనర్ చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను పట్టించుకోనవసరం లేదని చెప్పారో లేదో తెలియదు గానీ..అడ్మిన్ యాక్సెస్ మాత్రమే ఉన్న ప్రెస్ వాట్సప్ గ్రూపుల్లో కూడా నెంబర్లు యాడ్ చేయడానికి ఆయా జిల్లాల్లోని డిపీఆర్వోలు తెగ నొప్పులు పడిపోతున్నారు. 

ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, సమాచారశాఖ మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లినా అటు సమాచాశాఖ కమిషనర్ నుంచి గానీ, డీపీఆర్వోల నుంచి గానీ ఎక్కడా చలనం రాకపోగా..సహకారం అందించే డీపీఆర్వోలపై మీడియాను దూరం పెట్టే ఇతర డీపీఆర్వోలు గొడవలకు దిగుతుండటం విశేషం. చాలా సంవత్సరాల నుంచి సమాచారశాఖలో ఏపీ కేడర్ కి చెందిన అధికారులను నేరుగా కమిషనర్లుగా నియమించకపోవడం, రాష్ట్రంలో జిల్లాల్లో మీడియాకి సమాచారశాఖ ద్వారా అందుతున్న సేవలను కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో సమీక్షలు జరగక పోవడం వలనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిన్న, మధ్య తరహా మీడియా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. చూడాలి ఇప్పటికై ప్రభుత్వం సమాచార శాఖలోని ఖాళీలు భర్తీచేసి, మీడియాకి పూర్తిస్థాయిలో సమాచారం ఇస్తుందో లేదంటే ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వ సమాచారాన్ని మీ పత్రిక, ఛానల్ లో వేయకపోతే దేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని మాట్లాడుతున్నట్టుగా అలాగే వదిలేస్తుందో అనేది..!

Guntur

2022-08-27 02:35:37

సీఎం YS.జగన్ ప్రకటనతో ఉలిక్కిపడ్డ ఏపీ

సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి విశాఖలో సంచనల ప్రకటన చేశారు. దీనితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలిక్కిపడింది. ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.  శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. ఈ వేదిక నుంచే ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించడంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అత్యధికంగా ప్లాస్టిక్ ప్లెక్సీలతో ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇంకా సీఎం ఏమన్నారంటే..  పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని, గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.  ఉదయం కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను వలంటీర్లు క్లీన్‌ చేశారు. ఈ సందర్భాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. ఈరోజు విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందన్నారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోందని.. అందుకే సముద్రాన్ని మనమంతా కాపాడుకోవాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలోని సాగర తీరప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరూ తీసుకోవాలని పిలుపు నిచ్చారు.

పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుందని... రీసైకిల్‌ చేసి పలు ఉత్పత్తులు తయారు చేయడంతోపాటు..పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్‌..  2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చి చూపిస్తామన్నారు. ప్లాస్టిక్‌ నుంచి రీసైక్లింగ్‌ నుంచి తయారు చేసిన షూస్‌, కళ్ల జోడులను స్వయంగా ధరించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పార్లే సంస్థ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-26 06:52:52

ens న్యూస్ ఏజెన్సీకి subeditors కావలెను

భారతదేశపు తొలితెలుగు నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్, త్వరలో రానున్న దినపత్రిక లో పనిచేసేందుకు సబ్ ఎడిటర్లు కావలెను, అభ్యర్ధులు కనీసం డిగ్రీ చదివి ఉండి.. అన్ని రకాల అంశాలను న్యూస్ ఫార్మాట్ లో రాయడంతోపాటు, ఇంటర్నెట్ పై పూర్తిస్థాయి అవగాహన, వార్తలను చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో ఎడిటింగ్ చేయగల సామర్ధ్యం కలిగి వుండాలి. అభ్యర్ధులు కనీసం డిగ్రీ పాసై ఉండాలి..జర్నలిజం చదివి, గతంలో మీడియాలో పనిచేసిన వారికి  ప్రాధాన్యత ఇవ్వబడును.  ఆశక్తి ఉన్నవారు 9490280270, 9390280270లో వెంటనే సంప్రదించగలరు. ఎంపికైన వారికి గుర్తింపు కార్డుతోపాటు, ఆకర్షణమైన జీతం ఇవ్వబడును.

Visakhapatnam

2022-08-26 06:23:32

ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో శిక్షణలు

రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే ధ్యేయంగా,  ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో పెద్ద  ఎత్తున రైతు శిక్షణా  కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్వేతా భవనం లో గురువారం టీటీడీ గోసంరక్షణ శాల  ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులకు, రాష్ట్రంలోని నోడల్ గోశాలల నిర్వాకులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం చేపట్టింది.  కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా  సుబ్బారెడ్డి మాట్లాడుతూ,  దేశంలో ఎక్కడా  లేని విధంగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ఏర్పాటు చేసి రైతులను ఈ దిశగా అడుగులు వేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా టీటీడీ కూడా గో సంరక్షణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు టీటీడీ గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తోందన్నారు.

నోడల్ గో శాలలు తమ పరిధిలో ఉన్న గోశాలలను సమన్వయం చేసుకుంటూ,  వాటి నిర్వాహకులకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.  ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ ఉచితంగా ఆవులు, ఎద్దులు ఇస్తోందన్నారు. రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి,  ఆ ఉత్పత్తులను టీటీడీ ఎలా సేకరిస్తుందనే అంశాలపై నిపుణులతో అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరూ తమ పరిధిలోని మిగిలిన రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించాలని చైర్మన్ పిలుపునిచ్చారు. గో పోషణకు ఇబ్బంది ఉన్న గోశాలల ను ఆదుకునే ఆలోచన చేస్తామన్నారు.

గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి గత ఏడాదిన్నరగా ప్రసాదాలు తయారు చేస్తున్నామని, ఇది శాశ్వతంగా కొనసాగేందుకు రైతులను  గో ఆధారిత వ్యవసాయం వైపు నడిపించే లా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రైతులు గో ఆధారిత వ్యవసాయం పై దృష్టిపెట్టి నేలతల్లిని, తద్వారా మానవాళిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇస్కాన్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు రేవతి రమణ దాస్ మాట్లాడుతూ, టీటీడీ గోవు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలిపేలా చేపట్టిన కార్యక్రమాలు  అభినందనీయమన్నారు. ఆవు పాలు అల్జీమర్స్ రాకుండా చేయడానికి  మంచి మందులా పని చేస్తాయన్నారు.  గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం అంశాల్లో  ఇస్కాన్  టీటీడీ తో కలసి పనిచేస్తోందన్నారు. గోమాత వైశిష్ట్యం, గో ఆధారిత వ్యవసాయం వలన సమాజానికి కలిగే  మేలును ఆయన వివరించారు.

టీటీడీ  గో సంరక్షణ కమిటీ సభ్యులు  రామ్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ,  రైతుల గురించి అప్పట్లో దివంగతముఖ్యమంత్రి వైయస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచించి ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ లాంటి కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ఆయన కుమారుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రకృతిని కాపాడటానికి రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్నారన్నారు. స్వతహాగా రైతు బిడ్డ , గో ప్రియుడు అయిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.  టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి,  జెఈవో లు సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, గోశాల  డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి , శ్వేతా డైరెక్టర్  ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న  తిరుపతి జిల్లా డివి సత్రం కు చెందిన రైతులకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 8 గోవులను ఉచితంగా అందించారు. గోవులను తీసుకుని వెళుతున్న వాహనాన్ని ఆయన ఈవో  ధర్మారెడ్డి ,జె ఈవో లు సదా భార్గవి  వీర బ్రహ్మం తో  కలసి జెండా ఊపి సాగనంపారు .

Tirupati

2022-08-25 14:03:47

ENS న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లు కావలెను

భారతదేశపు తొలితెలుగు నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ కి ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో పనిచేసేందుకు జిల్లా రిపోర్టర్లు, కెమెరామాన్లు, అడ్వర్ టైజ్ మెంట్ మేనేజర్లు కావలెను. కనీసం డిగ్రీ చదివి ఉండి.. తెలుగులో వార్తలు కంపోజ్ చేయగల సామర్ధ్యం, సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన కలిగిఉండాలి. యాడ్స్ మేనేజర్లకు అన్ని రకాల ప్రకటనలు సేకరించడంలో అవగాహన ఉండాలి. ఆశక్తి ఉన్నవారు 9490280270, 9390280270లో వెంటనే సంప్రదించగలరు. ఎంపికైన వారికి ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యంతో పాటు ఆకర్షణమైన జీతం, టార్గెట్లు ఉంటాయి.

Amaravati

2022-08-25 06:35:16

గ్రామ సచివాలయాల్లో అవినీతి రాబంధులు-2

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాల్లో ఈ-క్రాప్ బుకింగ్ లో కోట్ల రూపాయాల్లో జరిగిన అవినీతి వెనుక చాలా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న సర్వీసుల్లో చేరిన సచివాలయాల్లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ విలేజ్ అసిస్టెంట్లకు అసలు స్థానికంగా వున్న బినామీ రైతులు, భూములు, సర్వే నెంబర్ల జాబితాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై లోతుగా పరిశోధన జరుగుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతున్న ఈ-క్రాప్ బినామీ స్కామ్ వెనుక భారీ గుంటనక్కలు దాగివున్నాయని చెతున్నారు. ప్రభుత్వం రైతులకు పంటనష్టాలు ఈక్రాప్ లో నమోదైన మొత్తాలన్నింటికీ పరిహారం ఇస్తుందని రాష్ట్ర సచివాలయం నుంచి సమాచారం అందుకునే రాష్ట్రవ్యాప్తంగా ఈ భారీ అవినీతికి పాల్పడినట్టు ఇప్పుడిప్పుడే అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రెవిన్యూ రికార్డులు, సర్వే నెంబర్ల జాబితా మొత్తం సేకరించడంతోపాటు, వ్యవసాయశాఖలో రైతులు, కౌలు రైతుల జాబితాలను సేకరించి భారీమొత్తాన్ని కొల్లగొట్టడానికి పథక రచన చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు చెబుతున్న లెక్కలు, షోకాజ్ నోటీసులు ఇచ్చిన మొత్తాలు చూస్తుంటే ఇందులో ఎవరి పరిధిలో వారు చక్కగా సర్దేసుకున్నట్టుగానే కనిపిస్తున్నది..

సర్వేశాఖతో కాకుండా రెవిన్యూశాఖతో విచారణ..?
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు పాల్పడిన బినామీ బాగోతాన్ని వాస్తవానికి జిల్లా అధికారులు సర్వేశాఖతో విచారణ చేయిస్తే ఏ సర్వే నెంబరులో ఎంతెంత పరిధిలోని విస్తీర్ణంలో భూములు ఉన్నాయనే విషయం బయటకు తెలుస్తుంది. కానీ అధికారులు తెలివిగా రెవిన్యూశాఖలోని వీఆర్వోలు, ఆరఐలతో విచారణ చేపడుతున్నారని ఈ విషయంలో ముందుగానే రెవిన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్ సిబ్బంది గ్రామపరిధిలోనే మిలాఖత్ అయినట్టు తెలిసింది. పంపకాలు, పర్శంటేజీలు కుదిరన చోట రికార్డులు బాగానే ఉన్నాయని, వీరిచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు కూడా ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మమ అనే విచారణ పూర్తిచేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంతే తప్పా అసలు భూముల రికార్డులకు సంబంధించి సర్వేశాఖలోని గ్రామ సర్వేయర్లతోగానీ, మండల సర్వేయర్లతో గానీ విచారణ చేయించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. కోట్ల రూపాయాల్లో అవినీతి జరగడంతో రెవిన్యూ అధికారుల వద్ద అయితేనే రికార్డులు సక్రమంగా ఉంటాయని జిల్లా అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు విచారణ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అందులోనూ విచారణ మొత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అంతా సక్రమంగానే జరుగుతుందనే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి తమకు అవినీతి మరకలను అంటుకోకుండా జిల్లా అధికారులు జాగ్రత్త పడుతున్నట్టుగా తెలిసింది.

తేడా వచ్చిన కోట్ల రూపాయలు అవినీతి కాదట..
ఈ-క్రాప్ బుకింగ్ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతిని కప్పిబుచ్చేందుకు జిల్లా అధికారులు కూడా రోజు మాట.. పూటకో ప్రకటన మీడియాకి లీకులిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అగ్రికల్చర్, హార్టికల్చర్ సహాయకులు ఇచ్చిన సంజాయిషీలు నమ్మసక్యంగా లేవని ప్రకటించిన అధికారులు..ఈరోజు షోకాజ్ నోటీసులైతే ఇచ్చాం గానీ తేడాగా వచ్చిన మొత్తం అంతా అవినీతి జరిగినట్టు కాదని..అది ప్రాధమిక సమాచారం మాత్రమేనని మాట మార్చుతుండటం వెనుక జరిగిన అవినీతి మొత్తాన్ని కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా అనుకుంటే నెల్లూరు, పశ్చిమగోదావరి, అంభేద్కర్ కోనసీమ జిల్లాల్లో సుమారు 50 మందికి పైగా వీఏఏలు, వీహెచ్ఏలను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నిస్తే.. అక్కడి సంగతి మాకు తెలియదు కానీ..మా జిల్లాల్లో మాత్రం పక్కాగా విచారణ చేపడుతున్నామని మిగిలిన జిల్లాల్లో అధికారులు రక రకాలు మాట్లాడుతుండటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుఫాను సమయంలో పంట నష్టం పెద్దగా జరగలేదని ప్రకటించిన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు ఇపుడు ఈ-క్రాప్ బుకింగ్ పక్కాగానే జరిగిందని చెప్పడం వెనుక పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.

తేడా మిల్లర్ల దగ్గర నుంచి బినామీరైతుల సమాచారం
అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఈ-క్రాప్ బుకింగ్ చేసే సమయంలో కొందరు అవినీతి మిల్లర్ల దగ్గర నుంచి బినామీ రైతుల జాబితా సేకరించి ఈ భారీ స్కామ్ కి పాల్పడినట్టు తెలుస్తుంది. గతంలో మిల్లర్ల ద్వారానే ధాన్యం కొనుగోలు చేసిన సమయంలో రైతులు, కౌలు రైతులు సమాచారం మొత్తం సేకరించి ఈ-క్రాప్ పంటనష్టాలు నమోదు చేసే సమయంలో గ్రామ సచివాలయ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా నమోదు ప్రక్రియ తతంగం నడిపి ఆపై వచ్చిన మొత్తాలను కూడా నేరుగా రైతుల ఖాతాల నుంచే డ్రా చేసినట్టుగా చెబుతున్నారు. అలా డ్రా చేసిన సమయంలో అటు రెవిన్యూ అధికారులు, ఇటు అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖల్లోని కొందరు అధికారులు, రెవిన్యూ అధికారులకి ఇవ్వాలని చెప్పి పంపకాలు కూడా చేసినట్టుగా తెలిసింది. చాలాచోట్ల సక్రమంగా పర్శంటేజీలు పంపకాలు జరిగిన చోట రికార్డులు సక్రమంగా ఉన్నాయని.. అలా పంపకాలు పూర్తికాని చోట్ల మాత్రమే అవినీతి జరిగినట్టుగా బయటకి వచ్చిన తరువాత.. సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు రావడానికి కారణం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

అవినీతిని కప్పిబుచ్చేందుకు రంగంలోకి దిగిన మధ్యవర్తులు
రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయాల్లో జరిగిన ఈ-క్రాప్ బుకింగ్ బినామీ అవినీతిని ఏం జరగనట్టుగా కప్పిబుచ్చేందుకు అన్నిజిల్లాల్లో కొందరు ఆయా నియోజకవర్గాల్లోని వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదని పక్కాగా నమ్మకానికి వచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగినట్టుగా జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో మరికొందరు ఎమ్మెల్యేలు, ఇతర మాజీ మంత్రులు ఈ అవినీతి అంశాన్ని తమ దగ్గరకు తీసుకొచ్చి తమను మధ్యలోకి లాగొద్దని చెప్పినట్టుగా కూడా చెబుతున్నారు. అధికారికంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ గ్రామసచివాలయ సిబ్బంది అవినీతికి పాల్పడినా అందులో బయటకు తెలియకుండా రెవిన్యూశాఖకు చెందిన వీఆర్వోలు, ఆర్ఐలు కొన్ని చోట్ల తహశీల్దార్లు కూడా ఉన్నట్టుగా తెలిసింది. భూములు విషయం, సమాచారం, సర్వేనెంబర్లు కేవలం రెవిన్యూ అధికారులు, సిబ్బంది దగ్గరే ఉండటంతో జరిగిన అవినీతికి సంబంధించి నొక్కేసిన మొత్తం పంచుకోవడానికి, పర్శంటేజీలు ఇప్పించడానికి రెవిన్యూ భాగస్వామ్యం అయినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యవర్తులను కూడా వీళ్లే గుర్తించి రాయబారం కూడా నడుపుతున్నట్టు తెలిసింది. ఆ విధంగా నొక్కేసిన దానిలో సింహభాగం ఇస్తే అసలు అవినీతే జరగనట్టుగా చూస్తామని సచివాలయ అవినీతి రాబంధులకు భరోసా ఇచ్చారని సమాచారం.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రం
2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు చేసిన ఈ భారీ ఈ-క్రాప్ బినామీ అవినీతినే అస్త్రాలు చేసుకోవాలని చూస్తున్నట్టుగా అపుడే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏఏ జిల్లాల్లో ఎంతెంత మొత్తంలో అవినీతి జరిగింది, ఎంత మంది సిబ్బంది సస్పెండ్ కి గురయ్యారనే సమాచారాన్ని సేకరించి ఎదురుదాడి చేయడానికి సిద్దమవుతున్నారని తెలిసింది. దానికోసం బినామీ రైతుల పేర్లతో జరిగిన మోసాన్ని బయటపెట్టి ప్రజల ముందుకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ కూడా చేపట్టినట్టుగా చెబుతున్నారు.అంతే కాకుండా ఏ బినామీ రైతుల పేర్లు, సర్వే నెంబర్లతో అయితే భారీ మొత్తంలో కొల్లగొట్టారో సదరు రైతులు, కౌలు రైతులతోనే ఆందోళనలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బినామీ రైతులే రోడ్డెక్కడం విశేషం.

ముఖ్యగమనిక..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ విషయాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్లే భాద్యతను స్వీకరించిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ Ens Live, అధికారికి న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా జరిగిన వాస్తవాలను ప్రత్యేక కథనాలుగా అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. అంతే తప్పా సచివాలయ ఉద్యోగులపై గానీ, ప్రజాప్రతినిధులపైగానీ, ప్రభుత్వంపై గానీ ఎలాంటి తేడా అభిప్రాయాలు లేవని ప్రకటిస్తున్నాం. ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందుకి ప్రత్యేక కథనాలు తెచ్చే ఈఎన్ఎస్ భారీ స్థాయిలో జరిగిన అవినీతి విషయంలో కూడా వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా పెద్ద సాహసమే చేస్తున్నామని..అయినా అవినీతిని బయట పెట్టే ప్రక్రియలో ఎవరికీ భయపడేది లేదని కూడా దైర్యంగా ప్రకటికిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావివ్వకుండా ప్రజల పక్షాన మాత్రమే నిలబడి, ప్రభుత్వానికి నష్టం తెచ్చిన గ్రామసచివాలయ అవినీతి రాబంధుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గమని కూడా మాటిస్తున్నాం..!

Amaravati

2022-08-25 02:56:45

గ్రామ సచివాలయాల్లో అవినీతి రాబంధులు-1

గ్రామ సచివాలయాల్లో పట్టుమని వారి సర్వీసు మూడేళ్లు పూర్తిగా నిండలేదు.. నిన్నకాక మొన్ననే వారి 33నెలల సర్వీసు ప్రొభేషన్ రెగ్యులర్ అయ్యింది.. దానికంటే ముందుగానే ఒక్కొక్కరూ రూ.లక్షల్లో ఈ-క్రాప్ బుకింగ్ లో బినామీ పేర్లతో అవినీతి. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయల నిలువుదోపిడీ.. ఏపీ సీఎం.వైఎస్.జగన్మోహనరెడ్డి దేశం మొత్తం తొంగి చూసేలా ఏర్పాటు చేసిన మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కనీవినీ ఎరుగని అవినీతి.. ఇప్పటికే మూడు జిల్లాల్లో సుమారు 50 మందికి పైగా  గ్రామీణ వ్యవసాయ, గ్రామీణ వాణిజ్యశాఖలకు చెందిన సహాయకుల సస్పెండ్.. కోట్లలో అవినీతి నమోదు..ఇదే ఇపుడు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో హాట్ టాపిక్. అసలు ఏ దైర్యంతో ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారో తెలియక ఇటు అధికారులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగాల్లో చేరిన కొత్తల్లోనే లక్షల రూపాయాల్లో అవినీతికి పాల్పడితే మొత్త సర్వీసులో వీరంతా ఏ స్థాయిలో స్కాములు చేస్తారోనంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  సభలు సమావేశాల్లో ఎంతో ఘనంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోసం ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ..ప్రజలకు చేరువ చేస్తున్న వేళ..ఇదేశాఖలో నియమితులైన గ్రామీణ సిబ్బంది ఇంత పెద్ద మొత్తంలో చేసిన అవినీతి మిగిలిన ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి ఒక ప్రధాన చర్చగా మారిపోయింది. రాష్ట్రప్రభుత్వశాఖల చరిత్రలోనే అతిపెద్ద అవినీతిగా..అత్యధిక మంది సిబ్బంది పాలుపంచుకున్న స్కాముగా ఈ-క్రాప్ బినామీ బుకింగ్ స్కామ్ పేరుపొందింది.

అవినీతి జరిగిన విధానమెట్టిదనినా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రక్రుతి వైపరీత్యాల జరిగిన వెంటనే ఆదుకునేందుకు ఈ-క్రాప్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనితో నష్టపోయిన సాగు రైతులు ఎంత విస్తీర్ణంలో పంటలు నష్టపోయారో ఈవిధానం ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. సరిగ్గా ఇక్కడే గ్రామ, వార్డు సచివాలయశాఖలో సిబ్బందిగా వున్న గ్రామీణ వ్యవసాయ, వాణిజ్యపంటల సహాయకులు బినామీ రైతులు, బినామీ విస్తీర్ణం పేరుతో ఆన్ లైన్ లో పంటల నష్టాన్ని నమోదు చేశారు. పంటల నష్టంపై ప్రభుత్వానికి భారమైనా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సిబ్బంది నమోదు చేసిన నష్టానికి పరిహారం చెల్లించింది. కట్ చేస్తే సిబ్బంది నమోదు చేసిన సుమారు 60శాతానికి పైగా భూములు, పంట నష్టాలు అన్నీ బినామీ, నకిలీ అని ప్రభుత్వ ఉన్నతాధికారులకే అనుమానం కలిగింది. దీనితో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అనుకున్న మొత్తం కంటే ఎందుకు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందనే విషయంలో జిల్లాల్లోని వ్యవసాయశాఖ జెడీఏలు, ఏడీలు సచివాలయాల్లో పనిచేసే వీఏఏలకు, వీహెచ్ఏలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. దానితో సచివాలయ సిబ్బంది  వాటికి ఇచ్చిన సమాధానాలు పొంతన కుదరకపోవడంతో అధికారులు లోతుగా విచారణ చేయడంతో సిబ్బంది అవినీతికి పాల్పడిన విషయం బట్టబయలు అయ్యింది. ఫలితంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 24 మందిని, పశ్చిమగోదావరి జిల్లాలో 23 మందిని, కాకినాడ జిల్లాలో ఒక్కరిని ఆయా జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేశారు. పెద్ద ఎత్తున  వ్యవసాయ, వాణిజ్య పంటలశాఖలో జరిగిన అవినీతి గుప్పుమని బయటకు పొక్కింది.

4 జిల్లాల్లో 227 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో జరిగిన అవినీతికి సంబంధించి ఇప్పటి వరకూ శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లాలో 64 మందికి, కాకినాడ జిల్లాలో 80 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో 84 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 25 మంది, గ్రామీణ వ్యవసాయ, వాణిజ్య పంటల సహాయకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే దానికి సచివాలయ వీఏఏలు, వీహెచ్ఏల నుంచి వచ్చిన సమాధానాలు సంత్రుప్తికంగా లేవని అధికారులే నిగ్గు తేల్చారు. ఇదే సమయంలో కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో షోకాజ్ విచారణ దశలోనే ఉండిపోయింది. కాని మూడు జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా సచివాలయ సిబ్బంది చేసిన తప్పు తేలడంతో నిందితులైన వారందరినీ సస్పెండ్ చేసేస్తున్నారు.

రెవిన్యూశాఖకు వాటా ఇవ్వనందుకే అసలు ముసలం..
ప్రభుత్వశాఖలైన ఆగ్రికల్చర్, హార్టికల్చర్ కు చెంది గ్రామ సచివాలయ సహాయకులు బినామీ పేర్లతో ఈ-క్రాప్ బుకింగ్ చేయడం.. ఆపై జిల్లా అధికారులు విచారణ చేసిన సమయంలో రెవిన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, ఆర్ఐలు ద్వారా అధికారులు సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలో నొక్కేసిన మొత్తంలో వాటాలు ఇచ్చిన చోట మాత్రం రికార్డులన్నీ బాగానే ఉన్నాయని..వాటాల పంపకాలు కుదరని చోట మాత్రమే అవినీతి బయటకు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కొద్ది సమయంలోనే లక్షల రూపాయలు బినామీ పేర్లు పెట్టి.. ఆమొత్తాలను రైతుల ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్టు తెలుసుకున్న రెవిన్యూశాఖ సిబ్బంది గ్రామస్థాయిలో కొర్రీలు వేయడం ప్రారంభించిందని చెబుతున్నారు. మొత్తానికి పంపకాల్లోని తేడాల వలనే రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయాల్లో జరిగిన అవినీతి బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. విశేషం ఏంటంటే ఉబయ గోదావరి జిల్లాల్లో చాలా మంది వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన వారు కూడా ఈ అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా నొక్కేసిన మొత్తంలో ఇటు మూడు శాఖలకు చెందిన గ్రామీణ సహాయకులు వారి వారి జిల్లా అధికారులకు కూడా ముడుపులు ఇవ్వాలని అక్కడ పర్శంటేజీల్లో తేడాలు బెడిసికొట్టిన పిదప అసలు విషయం రచ్చ రచ్చ అయినట్టు ఇపుడు జిల్లా అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారని తెలిసింది..

అవినీతి రుజువైనా విచారణలతోనే కాలక్షేపం..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయ శాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, రెవిన్యూ విభాగాలకు చెందిన గ్రామీణ సహాయకులు కోట్లలో అవినీతికి పాల్పడినా ఇటు ప్రభుత్వం, జిల్లా అధికారులు షోకాజు నోటీసుల పేరుతో కాలయాపన చేయడం..కొన్ని జిల్లాల్లో సస్పెండ్ లు చేసి చేతులు దులుపుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ..షోకాజు నోటీసులు అందుకున్నవారు ఇచ్చిన సంజాయిషీలు సంత్రుప్తికరంగా లేవంటూనే విచారణ కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు విచారణ విశేషాలను జెసీలు, జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నామని చెబుతున్న జిల్లా అధికారులు చెప్పే మాటలకు కూడా పొంతన అస్సలు కుదరడం లేదు. ప్రభుత్వ ఉద్యోగలంలోకి వచ్చిన 33నెలలకే లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కేవలం సస్పెండ్ లు చేసి.. రికవరీలకు పూనుకోవాలని చూడటం పట్ల కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మరోవైపు ప్రభుత్వంలోని కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖలో వెలుగుచూసిన ఈ భారీ స్కామ్ పై ఆధారాలు సేకరించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగడం కూడా విశేషం.. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి వ్యవసాశాఖ ముఖ్యకార్యదర్శి నుంచిగానీ, ప్రభుత్వం నుంచి నేటి వరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు. చూడాలి ప్రభుత్వశాఖలో అతి పెద్ద భారీ అవినీతి విషయంలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!

tadepalli

2022-08-24 04:31:58

గ్రామ సచివాలయశాఖలో రూ.కోట్లలో స్కామ్..!

తాడితన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడని ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్ శాఖకు చెందిన గ్రామీణ సహాయకులు నిరూపించారు.. ఒక్కొక్కరూ బినామీ రైతుల పేర్లతో రికార్డులు స్రుష్టించి పది లక్షలకు పైగానే అడ్డంగా నొక్కేసి జిల్లా అధికారులతో సహా పంచేసుకున్నారు. కొన్ని చోట్ల ఈ విషయం బయటకు పొక్కకపోయినా.. కొన్ని జిల్లాల్లో నొక్కేసిన మొత్తం లక్షలు, కోట్లు దాటేయడం, బినామీలుగా చూపించి రైతులు రోడ్డెక్కడంతో జరిగిన అవినీతిపై అధికారులు విచారణ చేపడితే డొంకంతా కదులుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అత్యధికంగా అత్యధికంగా రూ.15కోట్లు నెల్లూరు జిల్లాలో అధికారులు లెక్కలు తేల్చి 25 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులపై వేటు వేయగా..కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకూ రూ.11 లక్షలు లెక్కలు తేల్చి ఒక గ్రామీణ ఉద్యానవన సహాయకుడిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలు, విభజన జరిగిన తరువాత 26 జిల్లాల్లోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్టు అధికారులు గుర్తించినప్పటికీ కొన్ని చోట్ల అధికారులు, దెబ్బ నప్పించిన ఉద్యోగులు, మరికొందరు ప్రజాప్రతనిధిల అండదండలంతో విషయం బయటకు పొక్కలేదని చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రంగంలోకి దిగడంతో అసలు విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. రాష్ట్రవ్యాస్తంగా కోట్ల రూపాయాల్లో జరిగిన ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎంత మందికి ఎంతెంత ముట్టింది.. జిల్లాల వ్యాప్తంగా బినామీ పేర్లతో జరిగిన మోసం ఎంత అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారనే విషయం ఇపుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది.

9నెలలు అదనంగా పనిచేయించినందుకేనా..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయంలో తమతో అదనంగా 9నెలలు పనిచేయించి.. పేస్కేలులో నష్టం వచ్చేలా చేసి.. పెంచిన పీఆర్సీకి ఎరియర్స్ ఇవ్వకుండా అదనంగా పనిచేయించుకుందని అనుకున్నారో ఏమో..ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి బినామీ పేర్లు పెట్టి నొక్కేయాలని పథకం వేశారు. ఒకరో ఇద్దరో అనుకుంటే పర్వాలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది కూడబలుక్కొని చేసినట్టుగానే ఈ భారీ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయాల్లో ఈ స్కామ్ జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వశాఖ అయిన గ్రామ, వార్డు సచివాలయం పరువు పోకుండా ఉండేందుకు అవినీతికి పాల్పడిన వారి దగ్గర నుంచి రికవరీలు పెట్టినా..కొన్ని చోట్ల మాత్రం విషయం బయటకు వచ్చేసింది. దీనితో ఏం చేయాలో తెలియని అధికారులు సచివాలయ సిబ్బందిపై సస్పెండ్ వేటు వేశారు. అయితే ఈ అవినీతి తవ్వేకొద్దీ బయపడుతుండటంతో తమ మెడలకు ఎక్కడ చుట్టుకుంటుందేమోనని భయపడుతున్న జిల్లాశాఖల అధికారులు విచారణలు చేపట్టి దొరికిన వారిని దొరికినట్టుగా చేసిన అవినీతిని గుర్తించి సస్పెండ్లు చేస్తున్నారు. చేసిన అవినీతి మొత్తాన్ని రికవరీలు పెడుతున్నారు.

పూర్తిగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖలకు చెందిన సిబ్బందిపై ఆయా జిల్లా శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం ఇప్పటిది కాదు. ప్రభుత్వంలో శాఖ ఏర్పాటైన దగ్గర నుంచే ఉంది. జిల్లా అధికారులు తాము ఏం చేసినా పట్టించుకోవడం లేదనే విషయాన్ని గుర్తించిన వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా భారీ అవినీతికి తెరలేపారు. చేసిన అవినీతికి లక్షల రూపాయల ప్రభుత్వ, ప్రజా ధానాన్ని అప్పనంగా నొక్కేసినా విషయం బయటకు రాలేదు. కొన్ని చోట్ల జరిగిని మోసం రైతులు గుర్తించి అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడంతో ఏమీ చేయలేని స్థితిలో మాత్రమే అధికారులు విచారణ జరిపి బినామీ పేర్లతో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై సస్పెండ్ వేటు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బినామీ స్కామ్ జరిగినా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇప్పటి వరకూ బయటకు వచ్చింది. మిగిలిన జిల్లాల్లో కొందరు అధికారులు విచారణల పేరుతో విషయాన్ని బయటకు రానీయలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

పంపకాల వద్ద తేడాలే బెడిసి కొట్టాయా..
గ్రామ సచివాలయశాఖలోని వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది చేసిన ఈ అవినీతి విషయంలో జిల్లా అధికారులు, మండల అధికారులకు సిబ్బంది చేసిన చేతి వాటంలో ఇచ్చే పర్శంటేజీలు కుదరకే జరిగిన భారీ స్కామ్ బయటకు వచ్చినట్టుగా కూడా చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ స్కాము బయటకు రానీయకుండా మీడియా ప్రతినిధులు కూడా తలో కొంత పుచ్చుకున్నారనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది. అలా విషయాన్ని బయటకు రానీయకుండా ఉండేందుకు మీడియాకు కూడా వారు చేసిన అవినీతిలో రెండుశాతం మొత్తాన్ని బినామీ పేర్లతో అవినీతికి పాల్పడిన సిబ్బంది ఖర్చు చేసి ముడుపులు ఇచ్చారని..దానికోసమే చాలా జిల్లాల నుంచి అవినీతి జరిగిన విషయం బయటకు రాలేదని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో అధికారులు జరిగిన మోసం, అవినీతిని బయటపెట్టిన తరువాత మీడియాకూడా ఏమీ తెలియనట్టుగా అధికారులు చెప్పింది రాస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కొన్ని చోట్ల అవినీతికి పాల్పడిన సిబ్బందిని కాపాడేందుకు పర్శంటేజీలు తీసుకున్న మీడియా వెనుకేసుకు వచ్చే ప్రతయత్నాలు.. విచారణ జరగుతున్న సమయంలో హడావిడి కూడా చేస్తుందనే ప్రచారం గుప్పుమంటోంది.

ఈ భారీ అవినీతికి దూరంగా స్థానిక ఎమ్మెల్యేలు..
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖల్లో బినామీపేర్లతో గ్రామ సచివాలయ సిబ్బంది నొక్కేసిన ఈ అవినీతి వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేల ద్రుష్టికి వెళ్లినా.. తాము కూడా అవినీతిలో భాగం పంచుకున్నట్టు ప్రభుత్వం ద్రుష్టికి, ఇంటెలిజెన్సు అధికారుల ద్రుష్టికి వెళితే వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కవని ముందుగానే గ్రహించిన చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. తప్పుచేసిన అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ద్రుష్టికి విషయాన్ని తీసుకెళ్లి చేసిన తప్పుని మాఫీ చేయాలని భారీ ఎత్తున రాయబారాలు నడిపినా..ఆ బురదను తమకు అంటించవద్దని చాలా మంది అధికారపార్టీ ప్రజాప్రతినిధులు  మూడు శాఖల అధికారులకు, అవినీతికి పాల్పడిక సిబ్బందికి మొహం మీదే చెప్పేసి.. వెనక్కు పంపేసినట్టుగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ సీటు రాదని, ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోయిన ప్రజాప్రతినిధులు మాత్రం కొన్ని జిల్లాల్లో గ్రామసచివాలయశాఖ సిబ్బంది చేసిన తప్పును కప్పి పుచ్చేందుకు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పుడిప్పుడే జనాల్లోకి తీసుకెళుతున్నారని సమాచారం అందుతోంది.. ఏది ఏమైనా.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశం మొత్తం తొంగిచూసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇంత పెద్ద స్థాయిలో మూడు శాఖలకు చెందిన సిబ్బంది అవినీతికి పాల్పడటం, అది కాస్త పెద్ద రచ్చ జరగడం నిజంగా అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా కొందరు అధికారులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారంతా కూడా ఈ భారీ స్కాములో భాగస్వాములుగా మారే ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్టుగా చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది సిబ్బంది చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతే లోలోన దాగిన మరింత అవినీతి బయటకు వచ్చే అవకాశాలున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.. చూడాలి ఈ విషయంలో ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందోనని..!

Tadepalli

2022-08-23 05:01:15

పదోన్నతలూ లేవు.. పూర్తిస్థాయి అధికారులూ లేరు

ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా విభజించిన 13 జిల్లాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఐ లాంటి సివిల్ సర్వీస్ అధికారులు తప్పా రాష్ట్రప్రభుత్వానికి చెందిన 75 ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయి జిల్లా అధికారులు లేరు. ఆగ మేఘాలపై రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా అయితే విభజించి గెజిట్లు విడుదల చేసింది తప్పితే..కొత్త జిల్లాలో మాత్రం అన్నిశాఖలకు జిల్లా అధికారులను నియమించకపోగా.. జిల్లాస్థాయి అధికారి హోదా లేకపోయినా..నియమించిన అధికారే జిల్లా అధికారి అవుతారని పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖలకు ఇన్చార్జి అధికారులు, డిప్యూటేషన్ పై అధికారులు తప్పా..పూర్తిస్థాయి పదోన్నతి పొందిన అధికారులు లేరు. దీనితో కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిన పడటం లేదు.. అలాగని ఉన్న ప్రభుత్వ శాఖల్లోనైనా పదోన్నతుల దస్త్రాలు కదులుతున్నాయా అంటే అవన్నీ ఆయా ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిల పేషీల్లో మూలుగుతున్నాయి. ఇటు పదోన్నతులు లేక..అటు పూర్తిస్థాయి అధికారి అని చెప్పుకోలే..కొన్ని జిల్లాల్లో ఒకే అధికారి రెండు మూడు శాఖలు కూడా అదనపుబాధ్యతలతో చూడాల్సి వస్తున్నది. ఇటు రాష్ట్రప్రభుత్వం కూడా సివిల్ సర్వీస్ అధికారులకి ఇచ్చే ప్రాధాన్యత రాష్ట్రశాఖల్లో జిల్లా అధికారులకు ఇవ్వడం లేదనే విషయం జిల్లా విభజనల తరువాత మరోసారి తేటతెల్లమవుతోంది.

అరకొర సిబ్బంది..జిల్లాకి ఒక్కరే అధికారి..
ప్రస్తుతం 75 ప్రభుత్వశాఖల్లో మినిస్టీరియల్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్త జిల్లాల్లో వేళ్లపై లెక్కపెట్టేంత మందిని మాత్రమే ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వున్న సిబ్బందితో పనిచేయించాలంటే ప్రభుత్వ అధికారులు అదనపు సమయం పనిచేయాల్సి వస్తున్నది. అరకొర సిబ్బందితో కొత్తజిల్లాల్లో పనులు ముందుకి సాగకుండా ఎక్కడికక్కడే చతికలబడి ఉండిపోతున్నాయి. కొందరు జిల్లా అధికారులు తమ పైస్థాయి అధికారులతో మాట పడేకంటే అదనంగా రెండు మూడు గంటలకు పనిచేస్తే ఇచ్చిన పని పూర్తవుతుందనే ఉద్దేశ్యంతో ఉన్నసిబ్బందినే బ్రతిమిలాడుకొని పనులు చేయించాల్సి వస్తున్నది. కొన్నిచోట్ల మినిస్టీరియల్ సిబ్బందికి పని భారం అధికం కావడంతో తమను ఉంచితే ఉంచాలని..లేదంటే సెలవులు పెట్టి వెళ్లిపోతామని చెప్పే పరిస్థితికి తీసుకు వస్తున్నారు. దీనితో జిల్లా అధికారులు ఉన్నసిబ్బందితోనే ఎంత వరకూ పనులు జరిగితే అంతవరకూ పనులు చేయించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వశాఖకు 5 నుంచి 13 రకాల మొబైల్ యాప్స్ ని అందుబాటులోకి తీసుకురావడంతో వాటి వినియోగానికే సమయం అంతా కేటాయించాల్సి వస్తున్నది. అందులోనూ జిల్లా అధికారులకే ప్రభుత్వం జిల్లాశాఖలకు ఇచ్చిన యాప్స్ వినియోగించడం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అయితే జిల్లా అధికారి కింద డివిజనల్ స్థాయి, వారికింద మండల స్థాయి అధికారులు, అధిక సంఖ్యలో మినిస్టీరియల్ సిబ్బంది ఉండేవారు దానితో సాంకేతికంగా అవగాహన ఉన్నవారితో జిల్లా అధికారులు పనిచేయించుకునేవారు. ఆ పరిస్థితి జిల్లాల విభజన తరువాత పూర్తిగా మారిపోవడంతో ఉన్న ఒకే ఒక్క జిల్లా అధికారి నానా పాట్లు పడాల్సి వస్తున్నది.

పదోన్నతులకు ఆమడదూరంలో అధికారులు..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వశాఖల్లో ఎక్కడో ఒకటి అరా ప్రభుత్వ శాఖలకు మినహా మిగిలిన ప్రభుత్వ శాఖల్లో సిబ్బందికి, అధికారులకూ పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది. పదోన్నతులు కల్పించడం ద్వారా ఉద్యోగులకు, అధికారులకు ఇచ్చే జీతాలు పెరుగుతాయి. కొందరు అధికారులకైతే వసతులు కూడా సమకూర్చాల్సి వుంటుంది. ప్రభుత్వం ఆదాయంలోని అత్యధిక భాగం మొత్తం సంక్షేమ పథకాలకు కేటాయించడంతో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఆర్ధిక భారం నెపంతో చాలా ప్రభుత్వశాఖల్లో ఇప్పటికే కల్పించాల్సిన పదోన్నతులు కల్పించకపోవడంతో సీనియర్ అధికారులు కూడా జూనియర్ అధికారులతో సమానంగానే విధులు నిర్వహించాల్సి వస్తున్నది. అలాగని పదోన్నతులు కల్పిస్తే ఆర్ధిక భారం పడి.. దాని ప్రభావం ప్రభుత్వంపై పడి ఖాళీ అయిన ఉద్యోగాల ప్రదేశంలో కొత్త ఉద్యోగాలు తీయాల్సి వస్తుందనే కారణంతో ఇటు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా ఏళ్ల తరబడి అలాగే వదిలాశారు. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో అలా పదోన్నతులు కల్పించకపోవడం వలన పూర్తిస్థాయి జిల్లా అధికారులను ప్రభుత్వం నియమించలేక.. ఉన్నవారినే సర్ధుబాటు చేసి అందరినీ జిల్లా అధికారుల కోవకే తీసుకు వచ్చి పనులు చేయిస్తున్నది.

విధాన పరమైన నిర్ణయాలకు అన్నీ అడ్డంకులే..
ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల్లోనూ పూర్తిస్థాయిలో జిల్లా అధికారులను నయమించకపోవడం వలన ప్రభుత్వశాఖల్లో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతిక కారణాలు మోకాలడ్డుతున్నాయి. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులను వారి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి..వారికి కొత్త పేస్కేలు ఇవ్వడానికి ప్రభుత్వం పాత ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టర్లు, జిల్లా అధికారులనే వినియోగించాల్సి వచ్చింది. అప్పటికి కొత్త జిల్లాలు ఏర్పాటై అన్ని ప్రభుత్వ శాఖలకూ అధికారులు, అన్ని జిల్లాలకు కలెక్టర్లను ప్రభుత్వం నియమించినా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ ఫైలు విషయంలో పాత జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి జిల్లాల అధికారులకే అధికారం కట్టబెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో జిల్లాలో అధికారులు, కొత్తగా వచ్చిన కలెక్టర్లు, ఎస్పీలు అలిగి ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి కూడా తీసుకెళ్లారు. దానితో ఉమ్మడి జిల్లాల్లో ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ ఉమ్మడి జిల్లాల అధికారులతోనే పూర్తిచేయించాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.  అన్ని ప్రభుత్వశాఖలకు జిల్లా అధికారులు లేకపోవడంతో ఒక్కో జిల్లా అధికారికి రెండు మూడు జిల్లాలు ఇన్చార్జి బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. అదే ప్రభుత్వం ఉన్న అధికారులకు, ప్రభుత్వశాఖల్లో పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో కొత్త జిల్లాల్లోనూ అధికారులను నియమించడానికి మార్గం సుగమం అవుతుంది. కానీ ఇది ఆర్ధిక పరమైన అంశం కావడంతో ప్రభుత్వం రెండు అడుగులు వెనక్కివేసి ఉన్న అరకొర అధికారులతోనే పనులు చేయిస్తున్నది. ఇదే పద్దతి కొనసాగితే 2024 తరువాత అత్యధిక సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తారు. అపుడు ఒకే సారి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అపుడు ఇపుడున్న ఆర్ధిక భారం కంటే వందరెట్లు భారం ప్రభుత్వంపై పడుతుంది. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ప్రభుత్వశాఖల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కొత్తజిల్లాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించడానికి, రానున్న కాలంలో కొత్త ఉద్యోగాల కల్పనకు, అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించవచ్చును. దీనితో మార్గం సుగమం అయి విధాన పరమైన నిర్ణయాలు అమలు చేయడానికి, పరిపాలనను గాడిలో పెట్టడానికి వీలుపడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!


Guntur

2022-08-22 01:44:28

కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ

విజయవాడ నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. విజయవాడ కోర్టుతో జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌ మోహనరెడ్డిలు కలిసి మొక్క నాటారు.

Vijayawada

2022-08-20 07:24:13

సచివాలయ బదిలీలకు సర్వీస్ రూల్స్ మోకాలడ్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపినా.. ఇంకా పూర్తికాని ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్, విడుదల కానీ సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్  మోకాలడ్డుతున్నాయి. వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉన్నా ఇది ప్రక్రియ ముందుకి సాగడానికి వీలులేకుండా ఉన్న సాంకేతిక వాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక లక్షా 21 వేల మంది సచివాలయ ఉద్యోగల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం జీఓనెంబరు 5 ద్వారా ఇటీవలే ప్రకటించి ఆగస్టు1 నాటికి కొందరికి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసి.. కొత్త పేస్కేలు కూడా అమలు చేసింది. ఇదే సమయంలో మెటర్నటీ లీవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ మాత్రం ఆరు నెలలు సెలవులు తీసుకోవడంతో వారి సర్వీస్ ప్రొబేషన్ మరింత ముందుకి వెళ్లింది. ఫలితంగా జూలై 31 నాటికి రాష్ట్రంలో చాలా మంది సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ నిలిచిపోయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయిన తరువాత మాత్రమే ఉద్యోగులకు బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఇపుడు అన్నీ సాంకేతిక ప్రతిబంధకాలు మోకాలడ్డటంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాస ఎదురవుతున్నది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేయాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిని కోరిన వెంటనే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై కార్యాచరణ మొదలు పెట్టి, పాత ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఎంత మంది ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయింది..? ఇంకా ఎంత మంది ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ కావాల్సి వుంది..? అనే సమాచారం తెలుసుకున్నపుడు.. ఇంకా చాలా మంది ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తవలేదనే విషయాన్ని రాష్ట్ర అధికారులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని సీఎంఓకి సమాచారం అందించారు. వెంటనే సీఎంఓ నుంచి ఉద్యోగులందరి సర్వీసు ప్రొభేషన్ మొత్తం పూర్తయిన తరువాత మాత్రమే బదిలీలకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని..లేదంటే చాలా మంది ఉద్యోగులు బదిలీలకు అర్హత సాధించరని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది.

కారుణ్య నియామకాలు, పదోన్నతులు అలా..
రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో చాలా మంది సిబ్బందిని కారుణ్య నియామకాలు, మరికొందరిని నేరుగా వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించింది. అలా వచ్చిన వారు చాలా మంది సచివాలయ శాఖలో ఉన్నారు. వారితోపాటు ఉద్యోగం వచ్చిన తరువాత ఆలస్యంగా చేరినవారు, మెటర్నటీ లీవులు తీసుకున్నవారు అత్యధిక సంఖ్యలోనే సచివాలయశాఖలో సర్వీస్ ప్రొభేషన్ కాకుండా ఉండిపోయారు. వాస్తవానికి పోయిన నెలలో రోజుల వ్యవధిలో కొంత మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ పూర్తి అయినా జిల్లాశాఖల అధికారుల నుంచి ఆఖరి దస్త్రాలు డిఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సంతకం అయి జాబితాలు సిద్దం కాలేదు. దీనితో చాలా మంది ఉద్యోగులకి గత నెలలో సర్వీసు పూర్తయినా లిస్టులు రాని కారణంగా వారి సర్వీసు ప్రొబేషన్ పూర్తికాలేదు. అలాగని ఈ ఆగస్టు నెలలో అయినా వారికి సంబంధించిన జాబితాలు వస్తాయనుకుంటే ఆ జాబితాలు ఇంకా జిల్లా శాఖల కార్యాలయాలకు డిఎస్సీ కమిటీ చైర్మన్ నుంచి రాలేదు. దీనితో ఈనెలలో 20 నుంచి 25వ తేదీలోగా సాలరీలు పెట్టే సమయానికి జాబితాలు వస్తే తప్పా మరికొందరు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ అయి పేస్కేలు అందుకునే పరిస్థితి ఉండదు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19జిల్లాశాఖలకు చెందిన జిల్లా అధికారులు ఇప్పటికే జాబితాలు రూపొందించి డిఎస్పీ చైర్మన్ కు ఫైల్స్ పంపారు. కానీ అటునుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీనితో తమ సర్వీసు ప్రొభేషన్ ఈనెలలో నైనా పూర్తవుతుందా..? లేదా అనే అనుమానాన్ని  సచివాలయ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ తలనొప్పి..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖల సిబ్బందికి సంబంధించి చాలా శాఖల సిబ్బందికి ప్రభుత్వం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగులకు బదిలీలు చేయాల్సి వస్తే ముందుగా ప్రభుత్వం రూపొందించిన సర్వీసు నిబంధనల ఆధారంగా బదిలీలు చేపడతారు. బదిలీల్లో లోకల్ జిల్లాలు, నాన్ లోకల్ జిల్లాలకు ఉద్యోగులు బదిలీలు కోరుకుంటే దానికోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించాల్సి వుంటుంది. అయితే వాటికోసం ప్రభుత్వం ఏవిధంగా నిబంధనలు రూపొందిస్తుందనే విషయంలో నేటి వరకూ క్లారిటీ లేదు. తొలుత అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రమోషన్ ఛానల్, సర్వీస్ రూల్స్ రూపొందిస్తే తప్పా బదిలీల విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఈ అంశాలన్నీ ద్రుష్టిలో పెట్టుకుంటే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏ ఒక్క పని కూడా ముందుకి కదిలే పరిస్థితి లేదు. సచివాలయ ఉద్యోగులంతా విధుల్లోకి చేరి సుమారు మూడేళ్లు కావొస్తున్నా ప్రభుత్వం నేటికీ వారి సర్వీసు రూల్స్ విషయంలో ఎలాంటి జీఓలు జారీ చేయలేదు. కొన్ని శాఖలకు పదోన్నతులకు సంబంధించిన ఛానల్ ఏర్పాటు చేసినా..ఎన్నేలకు పదోన్నతి కల్పిస్తారనే విషయాన్ని కూడా అందులో పొందుపరచలేదు. దీనిని బట్టీ చూస్తే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ విషయంలో శాఖల వారీగా ప్రత్యేక జీఓలు వస్తే తప్పా బదిలీలకు సంబంధించిన ఫైలు ముందుకి కదిలే పరిస్థితి లేదు. ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్రశాఖల అధికారులు చేసిన తప్పిదాల వలన ఇప్పట్లో బదిలీలు జరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

బదిలీల ఆశలపై నీళ్లు చిలకరింపే..
సచివాలయ ఉద్యోగుల బదిలీల ఆశలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సాంకేతికంగా నీళ్లు చల్లినట్టే కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా తమ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్, బదిలీలకు సంబంధించిన అర్జీలు ప్రభుత్వానికి పెడుతున్నారు తప్పితే.. 19శాఖలకు సంబంధించినంత వరకూ సర్వీసు రూల్స్, పదోన్నతుల విషయంలో ప్రత్యేకంగా జీఓలు విడుదల చేయాలనే విషయంలో ప్రభుత్వం ద్రుష్టికి ఒక్క అర్జీ కూడా వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటైతే ఏ శాఖకు అనుబంధంగా శాఖ ఏర్పాటవుతుందో..పాత శాఖలోని సర్వీసు నిబంధనలను కొత్తగా ఏర్పాటు చేసే శాఖలకు జతచేస్తారు. కానీ.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ప్రత్యేకంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కి సంబంధించి ప్రత్యేక జీఓలు జారీచేస్తూ వచ్చింది. రెండు మూడు ప్రభుత్వశాఖలు మినహా ఇతర శాఖలకు సంబంధించినంత వరకూ జీఓలు రాకపోవడంతో ఇపుడు ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలిపినా..సాంకేతికంగా బదిలీలు చేపట్టలేని పరిస్థితి ఎదురైంది. దీనితో సచివాలయ ఉద్యోగుల బదిలీల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. అయితే ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని, చూడని విధి విధానాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రస్థాయి అధికారులు అమలు చేస్తుండటంతో..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖలో నెలకొంది. చూడాలి.. గ్రామ, వార్డు సచివాల ఉద్యోగులకు సంబంధించి నేటి వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా, జీఓలు కూడా ఇవ్వకుండా బదిలీల విషయంలో అటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు, ఉద్యోగులకు ప్రభుత్వం ఏ విధమైన హామీ ఇస్తుంది.. ఏం చేసి చూపిస్తుందనేది..!

Guntur

2022-08-20 01:22:59