1 ENS Live Breaking News

12 మందికి నియామక పత్రాలను అందజేత.

శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల  కుటుంబాలలోని 12 మందికి బుధవారం  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ కారుణ్య నియామక పత్రాలను అందజేసారు. కారుణ్య నియామక కమిటీ నిర్ణయం మేరకు  12 మందికి కారుణ్య నియామకాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లవేళల తోడుగా ఉంటుందని, అందులో భాగంగానే నేడు కారుణ్య నియామక పత్రాలను అందిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, సభాపతి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, కళింగకోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ పురపాలక సంఘ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, బి.సి.సంక్షేమ శాఖాధికారి జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-20 07:33:04

వాల్మీకి రామాయణం ప్రపంచానికే ఆదర్శం

శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్  పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ తో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన తరుణమిది అని పేర్కొన్నారు. వాల్మీకి పూర్వశ్రమ జీవితం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందని అన్నారు. ఆ కథనం ప్రకారం వాల్మీకి బందిపోటుగా బాటసారుల నుండి సొత్తును దోచుకొని జీవితం సాగించేవాడని తెలిపారు. ఒకనాడు నారద మహర్షిని కూడా దోచుకోబోగా నారదడు ఈ దోపిడి ద్వారా వచ్చిన పాపాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా అని అడిగాడని, దానికి భార్య నిరాకరించడంతో ఆత్మసాక్ష్యాత్కారం పొంది నారదుడిని క్షమాపణ కోరి జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు అని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. నారదుని రామ మంత్ర ఉపదేశంతో వాల్మీకి ఉన్నచోటనే తపస్సమాధిలోకి వెళ్లాడని, వల్మీకం నుండి ఉద్భవించినందున వాల్మీకి అయ్యాడని ఉపముఖ్యమంత్రి వివరించారు. అటువంటి మహర్షుల జీవిత చరిత్రలు మనందరికి నేడు ఆదర్శమని, తాను రచించిన రామాయణం యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయమని  ఉపముఖ్యమంత్రి స్పష్టం చేసారు.  

        శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించుకోవడం, ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఆయన రచించిన రామాయణం దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు రామాయణాన్ని వారి బాషలోకి అనువదించుకొని మరీ చదువుతున్నారని, రామయణంలోని ప్రతి ఘట్టం మనందరకీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తండ్రి మాటకోసం రాజ్యాధికారాన్నే వదలిన తనయుడుగా రాముడు, అన్నకోసం సర్వభోగాలను వదలిన తమ్ముడుగా లక్ష్మణుడు, భర్తతోనే తన జీవితమంటూ అడవులకు సైతం వెళ్లిన సతీమణీగా సీత ఇలా అన్ని పాత్రలు మనకు ఆదర్శంగా ఉంటాయని, అందుకే ప్రతీ ఒక్కరూ రామాయణాన్ని పవిత్ర గ్రంధంగా పూజిస్తారని గుర్తుచేసారు. అటువంటి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందని సభాపతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, కళింగకోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ పురపాలక సంఘ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, బి.సి.సంక్షేమ శాఖాధికారి జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-20 07:26:54

స్వ‌చ్ఛ సంక‌ల్పంలో భాగ‌స్వామ్యం కావాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంతా భాగ‌స్వామ్యం కావాల‌ని ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. మ‌న ప్రాంతాల‌ను మ‌న‌మే ప‌రిశుభ్రంగా ఉంచుకుందామ‌న్నారు. గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని సాధించేందుకు.. ఆయ‌న ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు అంద‌రూ క‌లిసి రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మంలో భాగంగా బుధ‌వారం కోట జంక్ష‌న్ వ‌ద్ద ఏర్పాటు చేసిన స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ చిత్ర‌ప‌ట్టానికి పూల‌మాల వేసి జోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, అధికారులు, ప్ర‌జ‌ల చేత మంత్రి స్వ‌చ్ఛ సంక‌ల్పం ప్ర‌తిజ్ఞ చేయించారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ‌ ప్రాంతాల్లో చెత్త త‌రలించేందుకు జిల్లాకు వ‌చ్చిన వాహ‌నాల‌ను మంత్రి, క‌లెక్ట‌ర్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దామన్నారు. ఆరోగ్య వంత‌మైన సమాజం నిర్మించేందుకు జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం కార్య‌క్ర‌మం ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఎవ‌రికి వారే బాధ్య‌త‌గా ఉంటూ ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. జిల్లాలోని అవ‌స‌రాల దృష్ట్యా మున్సిపాలిటీల‌కు 62, గ్రామ పంచాయ‌తీల‌కు 62 వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని వెల్ల‌డించారు. వీటి ద్వారా ప్ర‌తి ప‌ట్ట‌ణం, ప‌ల్లె ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని, స్వ‌చ్ఛ విజ‌య‌న‌గ‌రం నిర్మాణానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. చివ‌రిగా స్వ‌చ్ఛ సంక‌ల్పం తాలూక పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, స్థానిక ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఎమ్మెల్సీలు సురేశ్ బాబు, ర‌ఘువ‌ర్మ‌, జిల్లా ప‌రిష‌త్ సీఈవో వెంక‌టేశ్వ‌ర‌రావు, డీపీవో సుభాషిణి, మున్సిప‌ల్ కమిష‌న‌ర్ వ‌ర్మ‌, కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్రతినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-20 06:10:33

స్వచ్ఛ సంకల్పదీక్షలో భాగస్వాములు కండి..

పరిసరాల పారిశుద్యాన్ని నిత్య జీవన శైలిగా మలచుకుని ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ జగనన్న స్వచ్చ సంకల్ప దీక్షలో భాగస్వాములు కావాలని  జిల్లా ఇన్ చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సెంటరులో జిల్లాలో 100 రోజుల పాటు నిర్వహించ నున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమాన్ని  జిల్లా ఇన్ చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణగోపాలకృష్ణ, కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగాగీతలతో కలిసి ప్రారంభించారు.  అలాగే క్లాప్ లోగోను ఆవిష్కరించి, స్వచ్చాంద్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన 155 హైడ్రాలిక్ పవర్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించి, గ్రామపంచాయితీలకు అందజేశారు.  ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టనంలో పరిశుబ్రత వెల్లివిరిసే ఆరోగ్యవంతమైన ఆహ్లాదకర పరిసరాలను తీర్చిదిద్దేందుకు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 2వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని  ప్రారంభించారన్నారు.  ఈ కార్యక్రమం క్రింద   గ్రామీణ, పట్టన ప్రాంతాల్లో  పటిష్టమైన పారిశుద్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర  ప్రభుత్వం సుమారు 100 కోట్ల నిధులతో  వెయ్యి పారిశుద్య వాహనాలను  కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు అందిస్తోందని,  ఇందులో భాగంగా 155 వాహనాలను తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.  ప్రజా భాగస్వామ్యంతో యాంత్రికంగా ఇంటింటి నుండి సేకరణ, వ్యర్థాల శుద్ది, ప్రతి ఇంటిలో కంపోస్ట్ ఎరువుల తయారు చేసేలా ప్రోత్సాహం స్వచ్ఛ సంకల్పం ప్రధాన అంశాలన్నారు.  వ్యాధుల నివారణ, ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పారిశుద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, వ్యర్థాల నియంత్రణ, శుద్దితో పాటు వాటిని ఎరువుగా మార్చి ఆదాయ వనరుగా మార్చవచ్చునన్నారు.  ప్రతి కుటుంబం ఇంటి వ్యర్థాలను కేంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వాడుకోవాలని ఆయన సూచించారు.  ప్రతిష్టాత్మమైన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ప్రజలు అందరూ భాగస్వామ్యం వహించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాతలుగా నిలవాలని మంత్రి కృష్ణదాస్ కోరారు. 
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బృహత్ సంకల్పాన్ని చేపట్టారన్నారు.  క్లాప్ కార్యక్రమం క్రింద కేటాయించిన వాహనాలను ఆయా గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గాల, సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.   చాలా గ్రామాల్లో గుండా ప్రవహిస్తున్న కాలువ గట్లపై ప్రజలు చెత్తను కుప్పలుగా వేస్తున్నారని, వీటి వల్ల వర్షాకాలం సీపేజి వల్ల మంచినీటి కాలువలు కూడా మురుగు కాల్వలుగా మారుతున్నాయన్నారు.  అలాగే  జనావాసాల్లో పందులు స్వేచ్చగా తిరుగుతూ మురుగు కాల్వలను ద్వంసం చేస్తున్నాయని, వీటి నియంత్రణకు పెంపకందారులను ప్రత్యామ్నాయ ఉపాది చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.  జిల్లాలో లూజ్ సాయిల్ నేలలు కావడంతో తడి, చెమ్మ ఎక్కవ కాలం నిలిచి ఉండి మురుగు సమస్య ఎదురౌతోందని, దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు.
    రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ  రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను సాధించవచ్చునని ఉద్దేశంతోనే  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి అడుగు వేశారన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలలో చైతన్యం తీసుకురావడంతో పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఒక మహోద్యమంలా సాగాలన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పారిశుద్ధ్య వ్యవస్థల పటిష్ట అమలు చేసినందుకు ఇచ్చిన నిర్మల్ గ్రామీణ్ పురస్కారాల్లో తూర్పు గోదావరి జిల్లా ఎప్పుడూ అగ్ర స్థానాల్లో నిలిచేదని మంత్రి వేణు గోపాల కృష్ణ గుర్తుచేస్తూ, ఆదే స్పూర్తితో  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రధానంగా రోడ్లపై చెత్త వేసే గ్రామాలను గుర్తించి అక్కడ ప్రజలలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి వేణుగోపాల కృష్ణ అధికారులకు సూచించారు.
      కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన స్వచ్ఛ సంకల్పం నూరు శాతం సాఫల్యత ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమన్నారు.  దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే పారిశుధ్యం మెరుగుపరచుకోవడం చాలా అవసరమని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలని ఎంపీ తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావు గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు క్లాప్ కార్యక్రమం ద్వారా సుమారుగా 11.20 కోట్ల వ్యయంతో 155 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందన్నారు. వీటిని అమలాపురం డివిజన్ కు -39, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం డివిజన్లకు -49, పెద్దాపురం డివిజన్ కి - 31, కాకినాడ డివిజన్ కి-35, రంపచోడవరం డివిజన్ కు-1 చొప్పున వాహనాలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ వాహనాలు  ఆయా గ్రామాలకు చేరుకుని బుధవారం నుంచి చేత్త సేకరణ నిర్వహిస్తాయని ఆయన తెలిపారు.  కార్యక్రమంలో జడ్.పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ సభికులచేత జగనన్న స్వచ్చ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. 
       ఈ కార్యక్రమంలో  కాకినాడ, పి.గన్నవరం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా.జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) కీర్తి చేకూరి,  కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడిపల్లి వెంకట సత్య ప్రసాదు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆర్. చంద్రకళ దీప్తి, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి నాగేశ్వరనాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ గ్రామీణం, కరప మండలాల జడ్పీటీసీ సభ్యులు ఎన్.రామకృష్ణ, వై.సుబ్బారావు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-19 07:57:02

సచివాలయాలనుమూడు సార్లు తనిఖీ చేయాలి..

విజయనగరం జిల్లాలో అధికారులు గ్రామ, వార్డు  సచివాలయాల వారానికి మూడు రోజులు తనిఖీ చేయాలని సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాల పర్యటనలో  సిబ్బందిన హాజరును  సంబంధిత  స్పందన , ఈ-సేవ దరఖాస్తులు పెండింగ్ లేకుండా డిస్పోస్  జరిగేల చూడాలన్నారు. సచివాలయ సిబ్బంది రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో కూడా తనిఖీలు చేయాలన్నారు.  ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రారంభిస్తున్న సంక్షేమ పధకాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నదీ లేనిది తనిఖీ చేయాలన్నారు. ప్రజలకు ఈ పధకాల పట్ల అవగాహన కలిగించే బాధ్యత సచివాలయ సిబ్బంది  పై ఉందని స్పష్టం చేసారు.  సచివాలయ సిబ్బంది  గ్రామాల్లో పర్యటిస్తున్నదీ  లేనిది కూడా ప్రత్యేకా ధికారులు తనిఖీ చేయాలన్నారు.   ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి కిషోర్ కుమార్,  జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-18 12:50:35

స్పందన అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి..

అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి అర్జీదారులు నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్పందనకు వచ్చే  దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు.  వివిధ సమస్యలపై ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలుపై 288 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-18 12:45:17

నరేగా పనుల ప్రతిపాదనలు పంపాలి..

ఉపాధి హామీ పధకం క్రింద చేపట్టనున్న పనుల కోసం అన్ని శాఖలకు చెందిన పనుల ప్రతిపాదనలను ఈ నెల 22 లోగా  డుమా పి.డి. కి పంపాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  2022-23 కు సంబంధించిన పనులను  నరేగా నుండి నవంబర్ 15 లోపల గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని  పంపవలసి ఉన్నదని తెలిపారు.  సుమారు 500 కోట్ల రూపాయల పనులు నరేగా ద్వారా జరగడానికి అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని  ప్రభుత్వ శాఖలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో ఉపాధి హామీ పనులు,  సచివాలయాల తనిఖీలు, హాజరు , గృహాల వన్ టైం సెటిల్మెంట్ , సుస్థిర అభివృద్ధి తదితర అంశాల పై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పధకం  క్రింద ఇప్పటికే 11 వేల పనులను ప్రతిపాదించడం జరిగిందని,   అయితే ఇంకను ముఖ్యమైన శాఖల ద్వారా ప్రతిపాదనలు రావలసి ఉందని అన్నారు.   హౌసింగ్,  పంచాయతి రాజ్, డి.పి.ఓ, మత్స్య శాఖ, ఆర్.డబ్ల్యు.ఎస్., విద్య శాఖ, పశు సంవర్ధక, అటవీ  తదితర శాఖల నుండి ప్రతిపాదనలు రావాలన్నారు. చెక్ డాం లు ,  స్మశానాల నిర్మాణాలు,  కాంపౌండ్ వాల్స్,  రహదారులు,  ఇంకుడు గుంతలు, నర్సరీలు వ్యవసాయ బావులు, పశువుల షెడ్లు, పశు గ్రాసం అభివృద్ధి తదితర అంశాలను ప్రతిపాదనలో చేర్చవలసి ఉందన్నారు.  ఇంకను ఏవైనా  ప్రజా అవసరాలకు ఉపయోగ పడే పనులున్నా  ప్రతిపాదిన్చాలన్నారు.  గతం లో ఇండ్ల కోసం రుణాలు తీసుకొని చెల్లించలేని లబ్ది దారుల నుండి వన్ టైం సెటిల్ మెంట్ క్రింద చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని,  జిల్లాలో 3.4 లక్షల మంది  లబ్ది దారులు ఉన్నారని, వారందరిని క్షేత్ర స్థాయి లో తనిఖీ లు చేసి జాబితాను సిద్ధం చేయాలనీ ఆదేశించారు.  ఇందుకోసం నియోజక వర్గాల ప్రత్యేకా ధికారులు, మండల ప్రత్యేకాధి కారులు , సచివాలయాల సిబ్బంది  బాధ్యత తీసుకొని వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.   నీతీ అయోగ్ సుస్థిర అభివృద్ధి  సూచీలు  కొన్ని రంగాల్లో వెనకబడి  ఉన్నాయని, అధికారులంతా  ఈ సూచీ ల పై దృష్టి పెట్టాలని  అన్నారు.  విద్యా ప్రమాణాలు,  జెండర్ సమానత, రైట్ టు ఎంప్లొయ్మెంట్, స్కూల్ డ్రాప్ ఔట్స్ ,  టాయిలెట్ల వినియోగం, హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర అంశాల్లో వెనకబడి ఉన్నామని, ఈ రంగాల్లో ఆయా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.  కోవిడ్ వలన కొన్ని రంగాల్లో వెనకాబడి  ఉండవచ్చని, అండర్ రిపోర్టింగ్ కూడా కొంత కారణం కావచ్చని, వీటిని నోడల్ అధికారి పరిశీలించాలని అన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి కిషోర్ కుమార్,  జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-18 12:42:37

గోస‌మ్మేళ‌నం విజ‌య‌వంతానికి కృషి చేయాలి..

గోశాల నిర్వ‌హ‌ణ, గో సంర‌క్ష‌ణ, గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ నెల 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న గోస‌మ్మేళ‌నం విజ‌య‌వంతానికి ఆయా విభాగాల అధికారులు కృషి చేయాల‌ని టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మం కోరారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ గోస‌మ్మేళ‌నాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు క‌మిటీలు ఏర్పాటు చేశామ‌ని, అధికారులు ఇప్పటినుంచే ముంద‌స్తు ఏర్పాట్ల‌కు సిద్ధం కావాల‌ని సూచించారు. ఇందులో తిరుమ‌ల రిసెప్ష‌న్‌, తిరుప‌తి రిసెప్ష‌న్‌, అకామిడేష‌న్‌, రిజిస్ట్రేష‌న్‌, కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, ప్ర‌చారం, ఫుడ్ అండ్ హాస్పిటాలిటి, ర‌వాణా, ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్‌, స్టేజ్ డెకరేష‌న్‌, ఎగ్జిబిష‌న్‌, ద‌ర్శ‌నం, స‌న్మాన క‌మిటీలు ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. మొద‌టి రోజు వెయ్యి మంది, రెండో రోజు వెయ్యి మంది రైతులు విచ్చేస్తార‌ని, వీరంద‌రికీ తిరుచానూరు ప‌ద్మావ‌తి నిల‌యం, తిరుప‌తిలోని 2, 3 స‌త్రాలు, ఎస్వీ విశ్రాంతిగృహం త‌దిత‌ర ప్రాంతాల్లో బ‌స ఏర్పాటు చేయాల‌న్నారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని అన్న‌దానం డెప్యూటీ ఈవోలు ఆహారం శుచిగా, రుచిగా అందించాల‌ని ఆదేశించారు. స్వామీజీలను ఆహ్వానించే విష‌యంలో ధార్మిక ప్రాజెక్టుల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. రెండు రోజుల కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ఆధ్వ‌ర్యంలో రికార్డు చేయాల‌ని, స‌మాచారాన్ని క్రోడీక‌రించి సావ‌నీర్ రూపొందించేందుకు చీఫ్ ఎడిట‌ర్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని కోరారు. స్టేజి వ‌ద్ద సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు.    ఈ స‌మావేశంలో యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు  శివ‌కుమార్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి  విజ‌య‌సార‌థి, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి త‌దితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-18 12:39:59

ఆరోగ్యకర సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి..

ప్రజలందరికీ జీవన విధానంపై అవగాహన కలిగివుండాలని, మంచి ఆహారం, మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు.    సోమవారం ఐఎంఎ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నేచర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన బాలల హక్కుల అవగాహనా కార్యక్రామానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా వుంటే సమాజం ఆరోగ్యంగా వుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, హైమావతి, బాలరాజు, ఐసిడిఎస్. పిడి. రాజేశ్వరి తదితరులు పాల్గోన్నారు.

Vizianagaram

2021-10-18 12:37:29

స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి..

స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీల‌ను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్  అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, త‌దిత‌రులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన అర్జీలు వాటి పరిష్కారం, రీఓపెన్ అర్జీల ప‌రిష్కారంలో పురోగ‌తిపై  కలెక్టర్ హరికిరణ్ స‌మీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా మండలాల వారీగా త్వరితగతిన పరిష్కరించాలనన్నారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖల ప‌రిధిలో ఉన్న కోర్టు కేసులపై  ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించే విధంగా చూడాల‌ని ఆదేశించారు. ప్రతి వారం మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ కు  మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా ఆయా ప్రధాన కేంద్రాల నుంచి పాల్గొని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ నెల 25 సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రజల కొరకు ప్రత్యేకంగా నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి  అధికారులు సిద్ధం కావాలన్నారు. ఈ గ్రీవెన్స్ లో ఎస్సీ, ఎస్టీ ప్రజల మాత్రమే తమ సమస్యలపై అర్జీలు అందించే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి  ప్రజలు పాల్గొని, ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ ఉపాధి కల్పన, పెన్ష‌న్లు, ఉపకార వేతనం, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరు, బీమా, భూముల స‌ర్వే తదితరాలకు సంబంధించి సుమారు 397 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని  కలెక్టర్ హ‌రికిరణ్  అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-18 11:37:05

పొటాష్ కు బదులు ప్రత్యామ్నాయ ఎరువులు వాడాలి..

పొటాష్‌కు బ‌దులు ప్ర‌త్యామ్నాయ ఎరువుల‌ను వాడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలో 1,23,650 హెక్టార్లమేర వ‌రి పంట చిరుపొట్ట‌ద‌శ‌లో ఉంద‌ని, దీనికి పొటాష్ మ‌రియు ఎరువులు వేయాల్సి ఉంద‌ని తెలిపారు. ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్లో 10,000 మెట్రిక్ ట‌న్నుల పొటాష్(ఎంఓపి) ఎరువుల‌కు గానూ 7,453 మెట్రిక్ ట‌న్నుల స‌ర‌ఫ‌రా జరిగింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా ముడిప‌దార్థాల కొర‌త కార‌ణంగా, పొటాష్ ఎరువుల ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ జిల్లా అవ‌స‌రాల‌కోసం ఈ నెలాఖ‌రునాటికి సుమారు 600 మెట్రిక్ ట‌న్నుల పొటాష్ వ‌స్తుంద‌ని వివ‌రించారు.  ఈ పొటాష్‌(ఎంఓపి)కి ప్ర‌త్యామ్నాయంగా 13-0-45 (పొటాషియం నైట్రేట్‌), 0-0-50 (స‌ల్ఫేట్ ఆఫ్ పొటాష్‌)  త‌దిత‌ర ప్ర‌త్యామ్నాయ పొటాష్‌ ఎరువుల‌ను పిచికారీ చేయ‌డం ద్వారా, అతిత‌క్కువ ఖ‌ర్చుతోనే, ఎక్కువ ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. ఈ ప్ర‌త్యామ్నాయ ఎరువులు రెండు ర‌కాలూ రైతు భ‌రోసా కేంద్రాల‌వ‌ద్దా, డీల‌ర్ల‌వ‌ద్దా త‌గినంత అందుబాటులో ఉన్నాయ‌ని, వీటి ధ‌ర‌లు కూడా కిలోకి రూ.110 నుంచి రూ.130 వ‌ర‌కు మాత్ర‌మేన‌ని తెలిపారు. ఒక లీట‌రు నీటికి 10 గ్రాములు చొప్పున వంద‌లీట‌ర్ల నీటిలో క‌లిపి ఎక‌రాకి వారం, ప‌దిరోజుల వ్య‌వ‌ధిలో రెండు సార్లు పిచికారీ చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. పూత‌ద‌శ‌లో ఉన్న వ‌రిపంట పుష్పాలు సంప‌ర్క‌ద‌శ‌లో ఉండే స‌మ‌యం ఉద‌యం 8 గంట‌లు నుంచి 11 గంట‌లు కాబ‌టి, ఈ స‌మ‌యంలో  ఎరువుల‌ను పిచికారీ చేయ‌కూడ‌ద‌ని, మ‌ధ్యాహ్నం 2 నుంచి 5 గంట‌లు లోపు మాత్ర‌మే పిచికారీ చేయాల‌ని సూచించారు.
              అంత‌ర్జాతీయ కొర‌త కార‌ణంగా, ర‌బీకి అవ‌స‌ర‌మైన డిఏపి, ఎంఓపి ఎరువుల‌కు ప్ర‌త్యామ్నాయంగా, కాంప్లెక్స్ ఎరువుల‌ను వినియోగించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. సుమారు 3,148 మెట్రిక్ ట‌న్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతు భ‌రోసా కేంద్రాల‌వ‌ద్దా, స‌హ‌కార సంఘాల‌వ‌ద్దా, ప్ర‌యివేటు డీల‌ర్ల‌వ‌ద్దా సిద్దంగా ఉన్నాయ‌ని తెలిపారు. డిఏపి, ఎంఓపి ఎరువుల‌తో పోలిస్తే, కాంప్లెక్స్ ఎరువుల్లో పొటాష్‌, న‌త్ర‌జ‌ని, భాస్వ‌రం, గంధ‌కం వంటి పోష‌కాలు చాలా ఎక్కువ‌ని, వీటివ‌ల్ల నేల సారం కూడా పెరుగుతుంద‌ని, చీడ‌పీడ‌లు త‌గ్గి, ఇవి పంట‌ల‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని, దిగుబ‌డి పెరుగుతుంద‌ని పేర్కొన్నారు.  కాంప్లెక్స్ ఎరువుల ధ‌ర‌లు కూడా చాలాత‌క్కువ‌ని తెలిపారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో భాగంగా, పొటాష్ ఎరువుల‌కు బ‌దులుగా వివిధ ర‌కాల క‌షాయాల‌ను, వృద్ది ద్రావ‌కాల‌ను వినియోగించాల‌ని సూచించారు. వీటిని రైతు భ‌రోసా కేంద్రాల‌వ‌ద్దా, ఎన్‌పిఎం షాపుల‌వ‌ద్దా డ్ర‌మ్ముల్లో త‌యారు చేయించి, విక్ర‌యించేందుకు ఉంచ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు.  ఈ కోడిగుడ్లు, నూనెల ద్రావ‌ణం, జిల్లేడు క‌షాయం, పుల్ల‌టి మ‌జ్జిగ ద్రావ‌ణం, మీనామృతం త‌దిత‌ర‌ వృద్ది ద్రావ‌కాల‌ను, క‌షాయాల‌ను, సిబ్బంది చెప్పిన విధంగా, నిర్ణీత ప‌ద్ద‌తిలో పిచికారీ చేయాల‌ని క‌లెక్ట‌ర్  సూచించారు.

Vizianagaram

2021-10-18 11:15:56

గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలి..

గ్రామ స్థాయిలో స‌చివాల‌యాల‌కు వ‌చ్చే విన‌తుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించి సాధ్య‌మైనంత వ‌ర‌కు గ్రామ‌స్థాయిలోనే వాటిని ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి మ‌ళ్లీ విన‌తులు వ‌చ్చి ఇక్క‌డ జాప్యం జ‌రిగే ప‌రిస్థితి వుండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టంచేశారు. గ్రామ‌స్థాయి నుంచి వ‌చ్చే విన‌తుల‌ను సానుకూల దృక్ప‌థంతో ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ఏదైనా విన‌తిని సానుకూలంగా ప‌రిష్క‌రించే అవ‌కాశం లేని ప‌క్షంలో ఏకార‌ణంతో సంబంధిత ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తున్నారో ఫిర్యాదు దారుకు త‌ప్ప‌నిస‌రిగా కార‌ణం తెలియ‌జేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వ‌స్తున్న విన‌తుల ప‌రిష్కారంపై అధికారుల‌తో స‌మీక్షించారు. జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాల జారీలో కొంత జాప్యం జ‌రుగుతోంద‌ని, దీనిని నివారించాల‌ని ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అర్హుల‌కు ఏమేర‌కు అందుతున్నాయో తెలుసుకొనే సిటిజ‌న్ ఔట్ రీచ్ కార్య‌క్ర‌మాన్ని చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని చెప్పారు. మండ‌ల ప్ర‌త్యేకాధికారులు త‌మ ప‌రిధిలోని మండ‌లాల్లో గ్రామాల‌ను సంద‌ర్శించి నేరుగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడి ఆయా ప‌థ‌కాల అమ‌లుపై తెలుసుకోవాల‌న్నారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ పై ఎవ‌రికైనా అపోహ‌లు ఉన్న‌ట్ల‌యితే వాటిని తొల‌గించే దిశ‌గా కృషి చేయాల‌న్నారు. స‌చివాల‌యాల‌కు అందుతున్న విన‌తుల ప‌రిష్కారంపై జిల్లా క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో స‌మీక్షించారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన గ్రీవెన్స్‌కు సోమ‌వారం 85 విన‌తులు అందాయి. వైద్య ఆరోగ్య శాఖ‌కు సంబంధించి 12, డి.ఆర్‌.డి.ఏ.కు 15, జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారికి 3, రెవిన్యూ శాఖ‌కు సంబంధించి 50, పౌర‌సర‌ఫ‌రాల శాఖ‌కు 5 వ‌చ్చాయి. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో సోమ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న విన‌తుల కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్‌, డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, స్పెష‌ల్ డిప్యూటీ కలెక్ట‌ర్ ప‌ద్మావ‌తి త‌దిత‌రులు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో విన‌తులు స్వీక‌రించారు.

Vizianagaram

2021-10-18 10:17:57

అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చుదిద్దుతా..

రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషిచేస్తానని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ గా తన ఛాంబరులో ఆమె పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా కీలక భాద్యత తన భుజస్కంధాలపై ఉందని అన్నారు. నిత్యం జనబాహుళ్యంలో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రజలకు అందించే అవకాశం తనకు కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ పదవిని కల్పించారని, ఆయన ఆశయసాధనకు నిత్యం కృషిచేస్తానని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్య నేతలు, పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులందరినీ కలుపుకుంటూ జిల్లాను అభివృద్ధిపథంలో అగ్రగామిగా తీర్చు దిద్దుతానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పదవిని తనకు అందించేందుకు కృషిచేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా, సీదిరి అప్పలరాజు, విశాఖ పార్లమెంట్ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు, జిల్లాప్రజాపరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక సభ్యులకు, మండల అధ్యక్షులకు, ప్రజలకు, అధికారులకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని, అందరి నమ్మకాలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో, పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా అన్ని గ్రామాల్లో జగనన్న సుపరిపాలనను అందించేందుకు సాయశక్తుల శ్రమిస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. అక్షర క్రమంలో జిల్లా ముందు ఉన్నట్లే అభివృద్ధి పథంలో కూడా జిల్లాను ముందు వరసలో ఉండేవిధంగా ఆదర్శంగా నిల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి,  ప్రజల మదిలో సుస్థిరస్థానం సంపాదించేందుకు కృషిచేస్తానని తెలిపారు. ఈ పదవిని కట్టబెట్టిన ప్రజలకు తామంతా రుణపడి ఉన్నామని, అర్హులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో తాను బాధ్యత కల్గిన పాత్ర పోషిస్తానని స్పష్టం చేసారు. సిక్కోలు అభివృద్ధి కొరకు దూరదృష్టి కలిగిన నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారుల సలహాలు, సూచనలు తప్పక తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మేలు జరిగేందుకు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి నుంచి జిల్లాకు చెందిన ముఖ్యనేతల వరకు మన్ననలను పొందుతాననే విశ్వాసం తనకు ఉందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. తొలుత జిల్లా ప్రజాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి జిల్లా ప్రజాపరిషత్ చైర్ పర్సన్ గా తొలి సంతకం చేయించి, దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అధ్యక్షురాలుకు పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు.

Srikakulam

2021-10-18 08:32:26

సింహాద్రి అప్పన్న భక్తులకు శుభవార్త..

విశాఖజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సించలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామి వారి దర్శన సమయం పెంచినట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు సింహాచలంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు   వేకువ జాము నుంచి ప్రతీ రాత్రి 9గంటల వరకూ స్వామి వారి దర్శనాల సమయం పెంపుదల చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు.  రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈఓ తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. 

Simhachalam

2021-10-18 06:20:04

సిరిమాను ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి - కలెక్టర్

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని  జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, అమ్మవారి దర్శనానికి నిన్న, ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారాన్నరు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విధిగా మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. అలాగే పైడి తల్లి అమ్మవారి ఆశిసుల తో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

Vizianagaram

2021-10-18 06:07:08