1 ENS Live Breaking News

స్కానింగ్ కేంద్రాలు నివేదికలను సమర్పించాలి..

శ్రీకాకుళం జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు విధిగా తమ స్కానింగ్ వివరాలను ఆన్ లైన్ లో సమర్పించాలని స్పష్టం చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో నెలరోజుల్లోగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి వ్యత్యాసం ఎక్కువగా ఉందని, ఇది భవిష్యత్తుకు మంచిది కాదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉండటం సంతోషాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాధ రావు మాట్లాడుతూ కంచిలి, ఆమదాలవలస, హిరమండలం, సరుబుజ్జిలి, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉందని అన్నారు. స్కానింగ్ కేంద్రాల నిర్వహణపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.జయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కే. శ్రీనివాసులు, అదనపు ఎస్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కె. రామ్మూర్తి, లీల, కే.అప్పారావు, కృష్ణ మోహన్, బి.సూర్యారావు, జెమ్స్ ఆసుపత్రి టి.తిరుపతి రావు, యూత్ క్లబ్ అధ్యక్షులు ఎం. ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-12 14:23:27

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వ‌గ్ర‌హ హోమం..

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు. హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 13 నుండి 21వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-11-12 08:39:20

తుపాను నష్టాన్ని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి..

విజయనగరం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, అయితే ఇంతవరకూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిశోర్ కుమార్ తెలిపారు.  మరో రెండు రోజులు తుఫాన్ హెచ్చరికలు ఉన్నందున మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని అన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు తో కలసి జె.సి కిషోర్ కుమార్  శుక్రవారం కంట్రోల్ రూమ్ ను సందర్శించి   రియల్ టైం మాప్ ల ద్వారా, వర్ష పాతాన్ని, అల్ప పీడనం దిశ ను పరిశీలించారు.  అనంతరం మాట్లాడుతూ  రెవిన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని డి.ఆర్.ఓ కు సూచనలు జారీ చేశారు. తహశీల్దార్లు,  సచివాలయ సిబ్బంది   పని చేసే చోటే ఉండాలని అన్నారు. తుఫాన్ వలన ఎలాంటి సంఘటనలు జరిగినా  వెంటనే కంట్రోల్ రూమ్ కి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఇప్పటికే కోత చేసి పొలాల్లో ఉన్న   వరి  పంట నష్టం జరగకుండా టార్పలీన్  కప్పాల న్నారు.  కోత దశ లో ఉన్నందున పొలంలో నీరు నిల్వ లేకుండా  చూడాలని, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిగించేలా చూడాలని జె.డి కి సూచించారు.  నూర్పు చేసిన ధాన్యాన్ని సమీప సేకరణ కేంద్రం అయిన రైతు భరోసా కేంద్రాల్లో  సంప్రదించి తేమ శాతాన్ని  తనిఖీ  చేసుకోవాలన్నారు.  గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో  శుక్రవారం ఉదయానికి అత్యధికంగా గరివిడి లో 27.2 మిమి లు, అత్యల్పంగా  కోమరాడ మండలం లో 5.2 మిమి ల  వర్షపాతం నమోదైందని తెలిపారు.

Vizianagaram

2021-11-12 08:17:10

విశాఖలో రేపు విజెఎఫ్‌ ప్రతిభకు ప్రోత్సాహం..

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌.దుర్గారావులు తెలిపారు. శుక్రవారం విశాఖలోని డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  వీరు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఏయూ వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో వివిధ విభాగాలకు చెందిన జర్నలిస్టులకు అతిథులు చేతుల మీదుగా మీడియా అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. కపిల గోపాలరావుతో పాటు,వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తామన్నారు. జర్నలిస్టుల పిల్లలకు సుమారు 120 మందికి ఉపకార వేతనాలను అందజేస్తామన్నారు. ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన పిల్లలకు నగదు,మెమోంటో, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. 14వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నాం విందు భోజనం వరకూ జరిగే ఆయా కార్యక్రమాల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు.  జర్నలిస్టుల సంక్షేమానికి తమ పాలకవర్గం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఇటీవలే ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ను విజయవంతంగా ముగించుకోవడం జరిగందని, ఆ తరువాత దీపావళి పండగను అత్యంత వేడుకుగా నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.  మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ మాట్లాడుతూ అవార్డుల ఎంపికకు సంబంధించి వివిధ అసోసియేషన్ల సహకారం తీసుకున్నామన్నారు. అంతే కాకుండా చిన్న,పెద్ద పత్రికలతో పాటు ఫోటో,వీడియో, క్రైం జర్నలిస్టులకు, న్యూస్‌ రీడర్స్‌లకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. అవార్డు పొందిన వారికి అతిధులు చేతుల మీదుగా సత్కరించడంతో పాటు, నగదు, జ్ఞాపికతో పాటు వివిధ రకాల బహుమతులు అందజేస్తామన్నారు. కపిలగోపాలరావు అవార్డుతో పాటు మరో 31 మందికి వేర్వేరు కేటగిరీల కింద అవార్డులను అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఈ సమావేశంలో విజెఎఫ్‌ జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌,కార్యవర్గ సభ్యులు ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌,ఇరోతి ఈశ్వరరావు, పైలా దివాకర్‌,డేవిడ్‌రాజు, గయాజ్‌, దొండా గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

DABA GARDENS

2021-11-12 08:14:00

ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి ఒత్తిడిలేదు..

ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నవి  అలా కొనసాగవచ్చని, ప్రభుత్వానికి అప్పగించాలని  ఎటువంటి వత్తిడి లేదని జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టరు ఈ విషయముపై జిల్లాలోని ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమన్యాలు/ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన  అవకాశమునును తప్పుగా అర్ధం చేసుకోవలదని సూచించారు.   విద్యా సంస్థలు, విద్యార్ధుల  ఇంటరెస్ట్ లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తగు చర్యలు  ఉంటాయని, ఎటువంటి వత్తిడి ఉండదన్నారు.  ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి  అయ్యే వరకు ఎటువంటి మార్పులు ఉండదన్నారు. అంగీకారం తెలిపిన పాఠశాలలోని  విద్యార్దులను అసౌకర్యం లేకుండా దగ్గరలోని పాఠశాలలలో మాత్రమే చేర్చడం జరుగుతుంది.   విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ఎటువంటి  ఇబ్బందులు కలుగ నీయమని,   ఆందోళన చెందవద్దని తెలియజేశారు.  ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు పునరాలోచించుకొని వారి నిర్ణయాన్ని తెలుప వచ్చన్నారు. 
ఈ విషయంలో ఎవరికైనా ఎటువంటి సందేహలున్నా  అడిగి నివృత్తి చేసుకోవచ్చన్నారు.  పాఠశాలల యాజమన్యాలెవరూ కూడా ప్రచారం  కోసం,  అశాంతిని కలుగజేసి సమస్యలు సృష్టించరాదని హెచ్చరించారు.  విద్యార్దులు వారి తల్లి దండ్రులలో పూర్తి నమ్మకం కలుగ జేయాలన్నారు. 
ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు వారిపై ఎటువంటి వత్తిడి లేదన్న విషయాన్ని గ్రహించాలని తెలిపారు.  వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసం ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని హెచ్చరించారు. 
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా విద్యా శాఖాధికారి ఎల్. చంద్రకళ, జిల్లా వృత్తివిద్య అధికారి కె.అప్పలరాము, డిగ్రీ కళాశాలల కోఆర్డినేటర్ విజయకుమార్, 8 డిగ్రీ కళాశాలలు, 15 జూనియర్ కళాశాలలు, 32 పాఠశాలలుకు చెందిన ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-11-11 16:41:16

ఎమ్మెల్సీ ఎన్నికలకై నోడల్ అధికారుల నియామకం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వివిధ అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మిస్తూ క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు ఆయా నోడ‌ల్ అధికారికి కేటాయించిన విభాగాన్ని పేర్కొంటూ గురువారం ప్ర‌త్యేక ఉత్వ‌ర్వులు జారీ చేశారు. సిబ్బంది కేటాయింపు, స‌ర్దుబాటు అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు జాయింట్ క‌లెక్ట‌ర్ జె. వెంక‌ట‌రావును, ర‌వాణా వ్య‌వ‌హారాలు చూసేందుకు మోట‌ర్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ దుర్గాప్ర‌సాద్‌ను, ఎన్నిక‌ల సిబ్బంది శిక్ష‌ణ‌, ఎన్నిక‌ల ఖ‌ర్చు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించేందుకు కో-ఆప‌రేటివ్ ఆడిట్ అధికారి ఎస్‌. అప్ప‌ల‌నాయుడును, ఎన్నిక‌ల సామాగ్రి, ఇత‌ర ఏర్పాట్ల‌ను చూసుకునేందుకు మెప్మా ప్రాజెక్ట్ అధికారి బి. సుధాక‌ర్‌ను, మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అమ‌లు తీరును ప‌రిశీలించేందుకు సీపీవో జె. విజ‌య‌ల‌క్ష్మిని, ఎన్నిక‌ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ అధికారిగా డీఎస్‌వో ఎ. పాపారావును, శాంతి భ‌ద్ర‌త‌లను ప‌ర్య‌వేక్షించేందుకు అద‌న‌పు ఎస్పీ పి. స‌త్యనారాయ‌ణ‌ను, బ్యాలెట్ పేప‌ర్‌, డ‌మ్మీ బ్యాలెట్ వ్య‌వ‌హారాల‌ను చూసేందుకు జిల్లా టూరిజం అధికారి వ‌ర్మ‌ను, మీడియా వ్యవ‌హారాలు ప‌ర్య‌వేక్షిందుకు స‌మాచార పౌర సంబంధాల శాఖ స‌హాయ సంచాల‌కులు డి. రమేష్‌ను నియ‌మించిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఆయా నోడ‌ల్ అధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా, స‌జావుగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి సూచించారు.

Vizianagaram

2021-11-11 16:25:31

ఘ‌నంగా అబుల్ క‌లాం ఆజాద్‌ జ‌యంతి..

స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు, స్వ‌తంత్ర భార‌త దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ క‌లాం జ‌యంతి వేడుక‌లు ప‌ట్ట‌ణంలో ఘ‌నంగా జ‌రిగాయి. గురువారం ఆయ‌న జ‌యంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక ఉర్దూ పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ముఖ్య అతిథిగా, జాయింట్ క‌లెక్ట‌ర్ జె. వెంక‌ట‌రావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా అబుల్ క‌లాం ఆజాద్ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని, ఆయ‌న జీవితాన్ని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. పిల్ల‌లే రేప‌టి త‌రం భ‌విష్య‌త్త‌ని.. వారిని బాగా చదివించాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో కాసేపు ఉర్దూ పాఠ‌శాల విద్యార్థుల‌తో క‌లెక్ట‌ర్ ముచ్చ‌టించారు. అంద‌రూ బాగా చ‌దువుకోవాల‌ని, గొప్ప‌వారు కావాల‌ని ఆకాంక్షించారు. వివిధ పోటీల్లో విజేత‌లుగా నిలిచిన విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం స్థానిక పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని క‌లెక్ట‌ర్‌, జేసీలు ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మంలో మైనారిటీ సంక్షేమ శాఖ స‌హాయ సంచాల‌కులు బి. అరుణ కుమారి, డీఈవో స‌త్య‌సుధ‌, ముస్లిం పెద్ద‌లు, మ‌హిళ‌లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-11-11 16:23:21

తూర్పుగోదావరి జిల్లా నలు చెరగులా ‘దిశ’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు, విద్యార్ధినిలు, గ్రుహిణిల సంరక్షణార్ధం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశ యాప్ తూర్పుగోదావరి జిల్లా నలు చెరగులా దావానంలా వ్యాప్తి చెందుతూ మహిళల ‘దశ’ను మరుస్తోంది. జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు సారధ్యంలో నోడల్ ఆఫీసర్, డిఎస్పీ మురళీ మోహన్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని  మహిళా పోలీసులతో దిశ యాప్ ను జిల్లా అంతటా అత్యంత వేగంటా విస్తరింప చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 95లక్షల మంది ఈ దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోగా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలా పరిధిలో 10 లక్షల 62 వేల 494 మందికి పైగా దిశ యాప్ ని ఇనిస్టాల్ చేయించారు. దిశయాప్ ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశించడంతో ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అన్ని జిల్లాల దిశ నోడల్ ఆఫీసర్లు కూడా ఈ దిశ యాప్  వినియోగం, ఇనిస్టాలేషన్స్ పై ప్రత్యేకంగా మండల, డివజనల్ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి మరీ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

 ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని దిశ ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో కూడా ఉంచారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో  నెట్ వర్క్ ఉన్న చోట్ల దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించే కార్యక్రమాన్ని గ్రామసచివాలయ సిబ్బంది ముఖ్యంగా మహిళా పోలీసులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మురళీ మోహన్ మాట్లాడుతూ, దిశ యాప్ ఒక్క మహిళలకే కాకుండా పురుషులు కూడా ఉపయోగించుకొని, ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.  చదువు రాని వారు కూడా  మొబైల్ ను 5 సార్లు షేక్ చేస్తే  ఎస్.ఓ.ఎస్ ఓపెన్ అవుతుందనే విషయాన్ని అన్ని వర్గాలతోపాటు గిరిజ గ్రామాల్లోని గిరిజనులకు తెలియజేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీని ద్వారా వారికి అవసరమైన రక్షణ అందుతుందనే భరోసా కల్పించడానికి వీలుపడుతందన్నారు. గత సంవత్సరం నుండి దిశా చట్టం మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుండటం కూడా దిశయాప్ ప్రజల్లోకి త్వరగా వెళ్లడానికా ఆస్కారం ఏర్పడింది.  

దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నది.  ప్రతి ఇంటిలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకొనే  విదంగా  అవగాహన కలిగించేలా ఆ బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు తీసుకునేలా జిల్లా అధికారులు సైతం క్యాంపైన్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ ను ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల దిశయాప్ ను పురుషులు సైతం తమ మొబైల్స్ లో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో ఉన్నవారికి సహాయం అందిచడానికి వీలుపడుతుందే జిల్లా పోలీసు సందేశాన్ని ప్రతీఒక్కరూ స్వీకరిస్తున్నారు. ఈ విషయంలో మీడియా ప్రత్యేక పాత్ర పోషించడం, దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి వెంటేనే తీసుకెళ్లడంలో తమవంతు బాధ్యతను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ, పత్రిక, ఆన్ లైన్ మీడియా కంటే, మొబైల్ న్యూస్ యాప్స్ ద్వారా సత్వరమే ప్రజలకు సమాచారం తెలుస్తున్నది. రాష్ట్రప్రభుత్వం దీనిని పూర్తిస్థాయిలో చట్టంగా మారిస్తే మరిన్ని ఫలితాలు రావడానికి, ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అన్ని వేళల్లో ఉపయోగపడి.. ఒక రక్షణ కవచంలా మారివుంది. రానున్న రోజుల్లో ప్రతీ ఒక్కరి మొబైల్ లోనూ దిశయాప్ ఒక అత్యవసర వనరుగా ఉపయోగపడి రాష్ట్రప్రభుత్వ ఆశయం, మహిళలకు 24 గంటలూ రక్షణ కల్పించేలా మరింత అభివ్రుద్ధి చెందాలని ఆశిద్దాం..!

Kakinada

2021-11-11 13:31:39

మత్స్యకారుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం.. ఫిషరీష్ డిడి నిర్మలకుమారి

మత్స్యకారుల ఆర్ధిక అభివ్రుద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేకచర్యలు చేపడుతుందని  విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి అన్నారు. మంళవారంవారం విజయనగరం జిల్లాలోని చేప పిల్లల పెంపక కేంద్రాల నుంచి తీసుకు వచ్చిన 2.44.లక్షలు చేప పిల్లలను, పాచిపెంట మండలం కొండికనలవలస పెద్దగెడ్డ రిజర్వాయర్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వానితులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం మత్స్య సంపదను అభివ్రుద్ధిచేసి తద్వారా మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి చేప పిల్లల పెంపకాన్ని చేపడుతుందన్నారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్ లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలిపెట్టామన్నారు. చేపల వినియోగాన్ని పెంపకాన్ని మరింత పెంచాలనే మత్స్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతన్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీలు, మత్స్యశాఖ సిబ్బంది, అధిక సంఖ్యలో మాత్సకారులు పాల్గొన్నారు.

Pachipenta

2021-11-09 15:53:55

తూ.గో. లోనే టస్సార్ పట్టు అత్యధిక సాగు..

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా టస్సార్ పట్టు సాగు జరుగుతోందని ఉద్యనావనశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో టస్సార్ పట్టుసాగు, ఎగుమతులు ఉన్నాయన్నారు. సుమారు 1200 ఎస్టీ కుటుంబాలతో జిల్లాలో ఈ సాగు చేపడుతున్నామన్నారు. పట్టుతయారీకి సంబంధించిన రైతులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం ఈరకం పట్టుపై రైతులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని సాగుచేయడానికి ముందుకి వస్తున్నారన్నారు. గతంలో హార్టికల్చర్ కు వనరులు, సిబ్బంది తక్కువగా ఉండేవారని, ప్రస్తుతం గ్రామసచివాలయాలు ఏర్పాటైన తరువాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. వాణిజ్యపంటలను మరింత ప్రోత్సహించేందుకు ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యవంతం చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Kakinada

2021-11-09 07:26:22

2021-11-08 18:13:08

విశాఖజిల్లాలో స.హ.చట్టం అమలు పరిశీలన..

విశాఖజిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలిస్తామని రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావు తెలియజేసారు. సోమవారం జిల్లాలో పర్యాటనకు వచ్చిన  సమాచార హక్కు చట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావును, డి ఆర్.ఓ శ్రీనివాసమూర్తి,  ప్రత్యేక ఉపకలెక్టర్ రంగయ్య, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రామోహన్ రావు , తహశీల్దార్ జ్నానవేణి, డిప్యూటి డైరక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ   సర్క్యుట్ హౌస్ లో కలిసారు.  ఈ సందర్భంగా కమిషనరు జిల్లాలో  సమాచార హక్కు చట్టం  అమలు సంబంధిత విషయాలపై  జిల్లా రెవెన్యూ అధికారి ను అడిగి తెలుసుకున్నారు.  జిల్లాలో అధికారులతో ఈ విషయంపై సమీక్ష సమావేశం, అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన  తెలియజేసారు. 

Visakhapatnam

2021-11-08 17:23:25

Rajahmundry

2021-11-08 09:32:55

సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి..

హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి విశాఖ శారదా పీఠం నిరంతరం కృషి చేస్తుందని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు.' నాగుల చవితి పర్వదినం రోజున జన్మించిన స్వరూపానందేంద్ర కు సోమవారం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు స్వరూపానందేంద్రను పీఠంలో  కలుసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామీజీని ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడు జ్ఞాపికను శ్రీనుబాబు దంపతులు అందజేశారు. ఈసందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సినసమయం ఆసన్న మయ్యిందన్నరు. ఆ విషయము లో విశాఖ శారదా పీఠం ముందువరుసలో ఉంటుందని భరోసా ఇచ్చారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధి కి పూర్తి స్థాయిలో కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు.

Pendurthi

2021-11-08 08:10:41

విశాఖలో 18 మందితో స్నేక్ రెస్క్యూ టీమ్ ..

నాగులచవితి పర్వదినం సందర్భంగా మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని 18 మంది స్నేక్ రెస్క్యూ టీమ్ ప్రత్యేక సేవలు అందించనున్నట్టు స్నేక్ సేవర్ సొసైటీ అధ్యక్షుడు రొక్కం కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలుపోసే సమయంలో ఎక్కడైనా పాములు కనిపించినా, ఇబ్బందులు ఎదురైనా తమ రెస్క్యూ బ్రుందం సహాయ సహయసహకారాలు అందిస్తుందన్నారు. దానికోసం మహానగర వాసులు 98491 40500 లేదా 8331840500 నెంబర్లలో సంప్రదించాల్సి వుంటుందన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులు, ప్రభుత్వ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని స్నేక్ సేవర్ సొసైటీ నిర్వాహకులు కోరారు.

Visakhapatnam

2021-11-07 15:42:57