1 ENS Live Breaking News

స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి..

స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీల‌ను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్  అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, త‌దిత‌రులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన అర్జీలు వాటి పరిష్కారం, రీఓపెన్ అర్జీల ప‌రిష్కారంలో పురోగ‌తిపై  కలెక్టర్ హరికిరణ్ స‌మీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా మండలాల వారీగా త్వరితగతిన పరిష్కరించాలనన్నారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖల ప‌రిధిలో ఉన్న కోర్టు కేసులపై  ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించే విధంగా చూడాల‌ని ఆదేశించారు. ప్రతి వారం మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ కు  మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా ఆయా ప్రధాన కేంద్రాల నుంచి పాల్గొని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ నెల 25 సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రజల కొరకు ప్రత్యేకంగా నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి  అధికారులు సిద్ధం కావాలన్నారు. ఈ గ్రీవెన్స్ లో ఎస్సీ, ఎస్టీ ప్రజల మాత్రమే తమ సమస్యలపై అర్జీలు అందించే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి  ప్రజలు పాల్గొని, ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ ఉపాధి కల్పన, పెన్ష‌న్లు, ఉపకార వేతనం, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరు, బీమా, భూముల స‌ర్వే తదితరాలకు సంబంధించి సుమారు 397 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని  కలెక్టర్ హ‌రికిరణ్  అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-18 11:37:05

పొటాష్ కు బదులు ప్రత్యామ్నాయ ఎరువులు వాడాలి..

పొటాష్‌కు బ‌దులు ప్ర‌త్యామ్నాయ ఎరువుల‌ను వాడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలో 1,23,650 హెక్టార్లమేర వ‌రి పంట చిరుపొట్ట‌ద‌శ‌లో ఉంద‌ని, దీనికి పొటాష్ మ‌రియు ఎరువులు వేయాల్సి ఉంద‌ని తెలిపారు. ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌న్లో 10,000 మెట్రిక్ ట‌న్నుల పొటాష్(ఎంఓపి) ఎరువుల‌కు గానూ 7,453 మెట్రిక్ ట‌న్నుల స‌ర‌ఫ‌రా జరిగింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా ముడిప‌దార్థాల కొర‌త కార‌ణంగా, పొటాష్ ఎరువుల ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ జిల్లా అవ‌స‌రాల‌కోసం ఈ నెలాఖ‌రునాటికి సుమారు 600 మెట్రిక్ ట‌న్నుల పొటాష్ వ‌స్తుంద‌ని వివ‌రించారు.  ఈ పొటాష్‌(ఎంఓపి)కి ప్ర‌త్యామ్నాయంగా 13-0-45 (పొటాషియం నైట్రేట్‌), 0-0-50 (స‌ల్ఫేట్ ఆఫ్ పొటాష్‌)  త‌దిత‌ర ప్ర‌త్యామ్నాయ పొటాష్‌ ఎరువుల‌ను పిచికారీ చేయ‌డం ద్వారా, అతిత‌క్కువ ఖ‌ర్చుతోనే, ఎక్కువ ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. ఈ ప్ర‌త్యామ్నాయ ఎరువులు రెండు ర‌కాలూ రైతు భ‌రోసా కేంద్రాల‌వ‌ద్దా, డీల‌ర్ల‌వ‌ద్దా త‌గినంత అందుబాటులో ఉన్నాయ‌ని, వీటి ధ‌ర‌లు కూడా కిలోకి రూ.110 నుంచి రూ.130 వ‌ర‌కు మాత్ర‌మేన‌ని తెలిపారు. ఒక లీట‌రు నీటికి 10 గ్రాములు చొప్పున వంద‌లీట‌ర్ల నీటిలో క‌లిపి ఎక‌రాకి వారం, ప‌దిరోజుల వ్య‌వ‌ధిలో రెండు సార్లు పిచికారీ చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. పూత‌ద‌శ‌లో ఉన్న వ‌రిపంట పుష్పాలు సంప‌ర్క‌ద‌శ‌లో ఉండే స‌మ‌యం ఉద‌యం 8 గంట‌లు నుంచి 11 గంట‌లు కాబ‌టి, ఈ స‌మ‌యంలో  ఎరువుల‌ను పిచికారీ చేయ‌కూడ‌ద‌ని, మ‌ధ్యాహ్నం 2 నుంచి 5 గంట‌లు లోపు మాత్ర‌మే పిచికారీ చేయాల‌ని సూచించారు.
              అంత‌ర్జాతీయ కొర‌త కార‌ణంగా, ర‌బీకి అవ‌స‌ర‌మైన డిఏపి, ఎంఓపి ఎరువుల‌కు ప్ర‌త్యామ్నాయంగా, కాంప్లెక్స్ ఎరువుల‌ను వినియోగించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. సుమారు 3,148 మెట్రిక్ ట‌న్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతు భ‌రోసా కేంద్రాల‌వ‌ద్దా, స‌హ‌కార సంఘాల‌వ‌ద్దా, ప్ర‌యివేటు డీల‌ర్ల‌వ‌ద్దా సిద్దంగా ఉన్నాయ‌ని తెలిపారు. డిఏపి, ఎంఓపి ఎరువుల‌తో పోలిస్తే, కాంప్లెక్స్ ఎరువుల్లో పొటాష్‌, న‌త్ర‌జ‌ని, భాస్వ‌రం, గంధ‌కం వంటి పోష‌కాలు చాలా ఎక్కువ‌ని, వీటివ‌ల్ల నేల సారం కూడా పెరుగుతుంద‌ని, చీడ‌పీడ‌లు త‌గ్గి, ఇవి పంట‌ల‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని, దిగుబ‌డి పెరుగుతుంద‌ని పేర్కొన్నారు.  కాంప్లెక్స్ ఎరువుల ధ‌ర‌లు కూడా చాలాత‌క్కువ‌ని తెలిపారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో భాగంగా, పొటాష్ ఎరువుల‌కు బ‌దులుగా వివిధ ర‌కాల క‌షాయాల‌ను, వృద్ది ద్రావ‌కాల‌ను వినియోగించాల‌ని సూచించారు. వీటిని రైతు భ‌రోసా కేంద్రాల‌వ‌ద్దా, ఎన్‌పిఎం షాపుల‌వ‌ద్దా డ్ర‌మ్ముల్లో త‌యారు చేయించి, విక్ర‌యించేందుకు ఉంచ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు.  ఈ కోడిగుడ్లు, నూనెల ద్రావ‌ణం, జిల్లేడు క‌షాయం, పుల్ల‌టి మ‌జ్జిగ ద్రావ‌ణం, మీనామృతం త‌దిత‌ర‌ వృద్ది ద్రావ‌కాల‌ను, క‌షాయాల‌ను, సిబ్బంది చెప్పిన విధంగా, నిర్ణీత ప‌ద్ద‌తిలో పిచికారీ చేయాల‌ని క‌లెక్ట‌ర్  సూచించారు.

Vizianagaram

2021-10-18 11:15:56

గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలి..

గ్రామ స్థాయిలో స‌చివాల‌యాల‌కు వ‌చ్చే విన‌తుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించి సాధ్య‌మైనంత వ‌ర‌కు గ్రామ‌స్థాయిలోనే వాటిని ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి మ‌ళ్లీ విన‌తులు వ‌చ్చి ఇక్క‌డ జాప్యం జ‌రిగే ప‌రిస్థితి వుండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టంచేశారు. గ్రామ‌స్థాయి నుంచి వ‌చ్చే విన‌తుల‌ను సానుకూల దృక్ప‌థంతో ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ఏదైనా విన‌తిని సానుకూలంగా ప‌రిష్క‌రించే అవ‌కాశం లేని ప‌క్షంలో ఏకార‌ణంతో సంబంధిత ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తున్నారో ఫిర్యాదు దారుకు త‌ప్ప‌నిస‌రిగా కార‌ణం తెలియ‌జేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వ‌స్తున్న విన‌తుల ప‌రిష్కారంపై అధికారుల‌తో స‌మీక్షించారు. జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాల జారీలో కొంత జాప్యం జ‌రుగుతోంద‌ని, దీనిని నివారించాల‌ని ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అర్హుల‌కు ఏమేర‌కు అందుతున్నాయో తెలుసుకొనే సిటిజ‌న్ ఔట్ రీచ్ కార్య‌క్ర‌మాన్ని చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని చెప్పారు. మండ‌ల ప్ర‌త్యేకాధికారులు త‌మ ప‌రిధిలోని మండ‌లాల్లో గ్రామాల‌ను సంద‌ర్శించి నేరుగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడి ఆయా ప‌థ‌కాల అమ‌లుపై తెలుసుకోవాల‌న్నారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ పై ఎవ‌రికైనా అపోహ‌లు ఉన్న‌ట్ల‌యితే వాటిని తొల‌గించే దిశ‌గా కృషి చేయాల‌న్నారు. స‌చివాల‌యాల‌కు అందుతున్న విన‌తుల ప‌రిష్కారంపై జిల్లా క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో స‌మీక్షించారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన గ్రీవెన్స్‌కు సోమ‌వారం 85 విన‌తులు అందాయి. వైద్య ఆరోగ్య శాఖ‌కు సంబంధించి 12, డి.ఆర్‌.డి.ఏ.కు 15, జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారికి 3, రెవిన్యూ శాఖ‌కు సంబంధించి 50, పౌర‌సర‌ఫ‌రాల శాఖ‌కు 5 వ‌చ్చాయి. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో సోమ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న విన‌తుల కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్‌, డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, స్పెష‌ల్ డిప్యూటీ కలెక్ట‌ర్ ప‌ద్మావ‌తి త‌దిత‌రులు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో విన‌తులు స్వీక‌రించారు.

Vizianagaram

2021-10-18 10:17:57

అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చుదిద్దుతా..

రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషిచేస్తానని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ గా తన ఛాంబరులో ఆమె పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా కీలక భాద్యత తన భుజస్కంధాలపై ఉందని అన్నారు. నిత్యం జనబాహుళ్యంలో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రజలకు అందించే అవకాశం తనకు కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ పదవిని కల్పించారని, ఆయన ఆశయసాధనకు నిత్యం కృషిచేస్తానని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్య నేతలు, పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులందరినీ కలుపుకుంటూ జిల్లాను అభివృద్ధిపథంలో అగ్రగామిగా తీర్చు దిద్దుతానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పదవిని తనకు అందించేందుకు కృషిచేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా, సీదిరి అప్పలరాజు, విశాఖ పార్లమెంట్ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు, జిల్లాప్రజాపరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక సభ్యులకు, మండల అధ్యక్షులకు, ప్రజలకు, అధికారులకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని, అందరి నమ్మకాలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో, పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా అన్ని గ్రామాల్లో జగనన్న సుపరిపాలనను అందించేందుకు సాయశక్తుల శ్రమిస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. అక్షర క్రమంలో జిల్లా ముందు ఉన్నట్లే అభివృద్ధి పథంలో కూడా జిల్లాను ముందు వరసలో ఉండేవిధంగా ఆదర్శంగా నిల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి,  ప్రజల మదిలో సుస్థిరస్థానం సంపాదించేందుకు కృషిచేస్తానని తెలిపారు. ఈ పదవిని కట్టబెట్టిన ప్రజలకు తామంతా రుణపడి ఉన్నామని, అర్హులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో తాను బాధ్యత కల్గిన పాత్ర పోషిస్తానని స్పష్టం చేసారు. సిక్కోలు అభివృద్ధి కొరకు దూరదృష్టి కలిగిన నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారుల సలహాలు, సూచనలు తప్పక తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మేలు జరిగేందుకు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి నుంచి జిల్లాకు చెందిన ముఖ్యనేతల వరకు మన్ననలను పొందుతాననే విశ్వాసం తనకు ఉందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. తొలుత జిల్లా ప్రజాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి జిల్లా ప్రజాపరిషత్ చైర్ పర్సన్ గా తొలి సంతకం చేయించి, దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అధ్యక్షురాలుకు పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు.

Srikakulam

2021-10-18 08:32:26

సింహాద్రి అప్పన్న భక్తులకు శుభవార్త..

విశాఖజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సించలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న) స్వామి వారి దర్శన సమయం పెంచినట్టు ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు సింహాచలంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు   వేకువ జాము నుంచి ప్రతీ రాత్రి 9గంటల వరకూ స్వామి వారి దర్శనాల సమయం పెంపుదల చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు.  రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈఓ తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. 

Simhachalam

2021-10-18 06:20:04

సిరిమాను ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి - కలెక్టర్

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని  జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, అమ్మవారి దర్శనానికి నిన్న, ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారాన్నరు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విధిగా మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. అలాగే పైడి తల్లి అమ్మవారి ఆశిసుల తో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

Vizianagaram

2021-10-18 06:07:08

Vizianagaram

2021-10-17 16:42:36

పైడితలమ్మ సిరిమాను ఉత్సవానికి అంతా సిద్ధం..

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరి కొలిచేవారి కొంగుబంగారం.. విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు జిల్లా కేంద్రం సిద్ధమయ్యింది. సోమ, మంగళ వారాల్లో జరిగే తోలేళ్ళ ఉత్సవం, సిరిమాను ఉత్సవాల నిర్వహణ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం తో పాటు నగరంలోని ప్రధాన ఆకర్షణలు కోట, గంటస్తంభం తదితర ప్రదేశాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆధ్వర్యంలో అధికారులు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు మద్యం షాపులను అధికారులు మూయించేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు కూడా ఏర్పాటు చేశారు.

Vizianagaram

2021-10-17 16:41:24

మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..

మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అ ఉపముఖ్యమంత్రి ఇ ధర్మాన కృష్ణదాస్ అన్నారు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ముగింపు ఉత్సవాలను నరసన్నపేటలో నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు అనంతరం నరసన్నపేట లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పట్ల దృష్టి సారించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు. మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెజారిటీ పథకాల్లో లబ్ధిదారులు మహిళలేనని ఆయన పేర్కొన్నారు. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుందని తద్వారా రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ ఆలోచన అన్నారు. మాట ఇచ్చిన విధంగానే 4 విడతల్లో అక్క చెల్లెమ్మలకు ఆసరా అందుతుందని కృష్ణ దాస్ చెప్పారు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు మహిళల పేరుమీదే ఇచ్చామని ఆయన అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళ ఎదగాలని వారికి సమాన అవకాశాలను సీఎం జగన్ కల్పిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, డీఅర్డిఎ పీడీ బి.శాంతి శ్రీ, ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, పొందర, కూరాకుల, వెలమ కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రతినిధులు రాజాపు అప్పన్న, పంగ బావాజీ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పొన్నాన దాలినాయుడు.,కె సి హెచ్ బి. గుప్త,  స్థానిక సర్పంచ్ బురెళ్ళ శంకర్, జెడ్పీటీసీ ప్రతినిధులు చింతు రామారావు, మెండ రాంబాబు, ముద్దాడ బైరాగి నాయుడు, తంగి మురళీకృష్ణ, సురంగి నరసింగరావు, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Narasannapeta

2021-10-17 12:05:16

సింహాద్రి అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా సింహాచలం లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు పలికారు. ఈక్రమంలో శనివారం రాత్రి కొండ దిగువున ఉన్న బంగారమ్మ తల్లి ఆలయంలో హుండీ దొంగతనం జరగడంతో మంత్రి ఆలయ ఈవో సూర్యకళతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో దొంగతనం జరగడం విచారకరమని అన్నారు. రాత్రి ఆలయంలో నైట్ వాచ్ మెన్ ను విచారించి, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించాలని 24 గంటల్లో దొంగల్ని పట్టుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆలయ ఈవో, పోలీసులకు మంత్రి సూచించారు.

Simhachalam

2021-10-17 11:33:54

కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు వినియోగించుకోవాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే పిలుపునిచ్చారు. ఆదివారం సర్క్యూట్ హౌస్ లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కులాంతర వివాహాలకు రూ 2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ముద్ర యోజన, ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, జన్ యోజన మొదలైన పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల వారికి చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రశంసించారు.  స్వర్గీయ డాక్టర్ వైయస్ శేఖర్ రెడ్డి తో తనకు గల అనుబంధాన్నితలచుకున్నారు.  మీడియా వారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు తోడ్పడాలని కోరారు.   ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక అధ్యక్షులు బి అనిల్ కుమార్, ఏపీ తెలంగాణ ఇంచార్జ్ బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-17 11:25:48

20న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం..

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20వ తేదీ అన్నాభిషేకం జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా ఉద‌యం 8 నుంచి 11 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులను అన్నలింగ దర్శనంకు అనుమ‌తిస్తారు.

Tirupati

2021-10-17 08:46:35

Simhachalam

2021-10-16 13:46:48

కనీస మద్దతుధరపై అవగాహన కల్పించాలి..

ఖరీప్ 2021-22 పంట కాలనాకి కనీస మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేసే విధంగా పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించాలని ఇన్ చార్జి కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశపు మదిరంలో నెలవారీ జిల్లా స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశం నిర్వహించారు. వరికి కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలకు రూ. 1940 లు, 75 కేజీ బస్తా రూ. 1455 లు, గ్రేడు ‘ ఎ ’ రకము క్వీంటారుకు రూ. 1960లు, 75కేజీ బస్తా రూ.1470లు ప్రభుత్వ ధరగా నిర్ణయించామన్నారు. సందేహాల కొరకు కంట్రోల్ రూం నెం.0884-6454341 సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాశాఖ జాయిట్ డైరెక్టర్ ఎన్.వియజకుమార్, ఇతర వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-16 12:40:09

పోస్టల్ కస్టమర్లకు టెక్నాలజీ ఆధారిత సేవలు..

తపాలాశాఖ ద్వారా వినియోగదారులకు సాంకేతిక ఆధారిత సేవలు అందిస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఎన్.సోమశేఖరరావు అన్నారు. విశాఖలోని పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 75వ జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు కార్యక్రమం(వినియోగదారుల సదస్సు)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ పోస్టల్ శాఖలో కూడా మొబైల్ డెలివరీ విధానాన్ని(పోస్టల్ మొబైల్ యాప్) ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. అదేవిధంగా నోడల్ డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అక్టోబరు 9వ తేది నుంచి 16వ తేదీ వరకూ వారోత్సవాలు ఎంతోబాగా జరిగాన్నాయన్నారు. ఆఖరిరోజు పోస్టల్ డేని నిర్వహించారు. పలువురు వినియోగదారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆదిత్యకుమార్, వై.నర్శింగరావు, ఇతర అధికారులు,  తపాలాశాఖ ప్రభుత్వ వినియోగదారలు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-10-16 12:06:35