1 ENS Live Breaking News

ఇక సురక్షితంగా పాపికొండల జల యాత్ర..

చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో సుమారు రూ. 70 లక్షలతో ప్లోటింగ్‌ రెస్టారెంటు ప్రారంబించుకోవడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన స్దానిక పద్మావతి ఘాట్‌ వద్ద  బోటు ప్లోటింగ్‌ రెస్టారెంటును ఆయన ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  గోదావరి అందాలను ఇష్టపడని తెలుగు వారు ఉండరని, స్దానికంగా ఉన్న సాహితీ వేత్తలు గోదావరి అందాలపై చక్కటి పుస్తకాలు రచించారని కొనియాడారు. రాజమహేంద్రవరం ఒక పురాతన సాహితీ నగరంగా విరాజిల్లుతోందన్నారు. గోదావరి నదికి ఇరువైపులా పర్యాటక రంగ అభివృద్దికి అవకాశాలు మెండుగా వున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ వారు నిర్వహించిన సమావేశంలో గొదావరి నది ప్రాంత పర్యాటక రంగ అభివృద్దికై పలు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. ఇన్వెస్టరు ప్రెండ్లీ పాలసీ విదానం పునరుద్దరించడం జరిగిందని దీనిద్వారా ప్రభుత్వ, ప్రవేట్‌ భాగస్వామ్యంతో రిసార్టు నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని పిచ్చుకలంక రిసార్డును సుమారు రూ 250 కోట్లతో త్వరలో పిపిటి విధానంతో నిర్మాణం చేపడతామన్నారు.  95 మంది సభ్యులు కెపాసిటి గల ప్లోటింగ్‌ రెస్టారెంటు ప్రారంభం అయిందని త్వరలో అన్ని చోట్ల  ప్లోటింగ్‌ రెస్టారెంట్ల విదానాన్ని అమలు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్దికి మన రాష్ట్రంలో 945 కిలోమీటర్లు పొడవుగల సముద్రతీరం, జీవనదులు ఉన్నాయన్నారు. అడ్వంచర్‌ టూరిజం టెంపుల్‌ టూరిజంల్లో. అభివృద్దికి అవకాశాలు ఎక్కువగా వున్నాయన్నారు. రాష్ట్రంలో మూడు చోట్ల సీప్లేన్‌ సౌలభ్యాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు చర్యలు  ప్రతిపాదించామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు మనకు ఉన్నాయన్నారు.13 జిల్లాలను పర్యాటక రంగ అభివృద్దికై నాలుగు సర్క్యుట్లుగా విభజించడం జరిగిందన్నారు. పలు దేవాలయాల్లో ప్రసాదం స్కీము అమలు దిశగా చర్యలు చేపట్టి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు, రైల్‌ మార్గాలు, జాతీయ రహదారులు కనెటివిటీలు విసార్తంగా ఉన్నాయన్నారు. విశాఖలో టూరిస్టుల కోరకు ఒక జెట్టీని ఏర్పాటు చేయడం జరుగుతోందని త్వరలో ప్రారంబించడం జరుగుతుందన్నారు. ఇన్వెస్టరు ప్రెండ్లీ పాలసీ విదానంలో పెట్టుబడి దారులను పిపిటి విదానం ద్వారా ఆహ్వానించడం జరుగుతోందన్నారు. పెట్టుబడి దారులు  ప్రాజెక్టు ప్రారంభం నాటినుంచే లీజ్‌  చెల్లించాల్సి వుంటుందన్నారు. అంతర్జాతీయ టూరిజం చార్డులలో ఎపిని నిలపాలనే  తపనతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సీని షూటింగ్‌లకు మోక్షానికి అనువైనా ప్రాంతంగా గోదావరి ప్రాంతం విరాజిల్లుతోందన్నారు. గోదావిరి పాపికొండలు విహార యాత్రకు 11 బోట్లను అనుమతి ంచడం జరిగిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం 29 రకాలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను కోట్లాది నిధులు వెచ్చించి నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతోందన్నారు బోట్ల సామర్ద్యాలను పరిగణనలోనికి తీసుకొని అనుమతులు ఇవ్వండం జరుగుతోందన్నారు.గోదావరి ప్రాంత పర్యాటకరంగ అభివృద్దికి పార్లమెంటు సభ్యులు వారి ఆకాంక్షకు అనుగుణంగా పలు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ గోదావరి పాత రైల్వే హెవలాక్‌ బ్రిడ్జ్‌ ఇతర ప్రాంతాలలో పర్యాటక రంగ అభివృద్దికి అవకాశాలను పరిగణనలోనికి తీసుకొని నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. నగర కమీషనరు అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ రెస్టారెంటు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుందని,,నగరంలో పురాతన కట్టడాలు అభివృద్దికి నగర ఆర్దికాబివృద్దికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ది సంస్ద చైర్మన్‌ ఎ వరప్రసాదరెడ్డి, రుడా చైర్మన్‌ షర్మిళారెడ్డి, జె.సి.ఎ భారవతేజ,సబ్‌ కలెక్టరు ఇలాక్కియా ఇడి మాల్‌ రెడ్డి వీరనారాయణ, వెంకటాచలం, తదితరులు పాల్గొన్నారు. 

Rajahmundry

2021-11-07 13:16:01

నిర్దేశిత కాల వ్యవధిలో గృహాలు పూర్తి చేయాలి..

ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధిలో గృహ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని  శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను నిరుపేదలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అందులో మొదట విడత గా సుమారు 16 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 10,237 ఇల్లు నిర్మాణం దశ లో ఉన్నాయని చెప్పారు.ఇంకా నిర్మాణం ప్రారంభించని గృహాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.  గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు సలహాలు, సూచనలు అందజేసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసే విధంగా సహాయ పడాలని సూచించారు. ప్రతి లే అవుట్ అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నక్కా గణపతి, డిఇ గాలి రామ్మూర్తి, బొడ్డేపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-07 13:03:21

నేడు స్పందన కార్యక్రమం రద్దు..

శ్రీకాకుళంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీచేసారు. గత కొన్ని వారాలుగా ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరిస్తున్న సంగతి విదితమే. అయితే జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున నవంబర్ 8న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, వ్యయప్రయాసల కోర్చి ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకోవద్దని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-11-07 13:01:49

ఒడిషా–ఏపిల మధ్య సమస్యల పరిష్కారానికి సిఎం కృషి..

శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన వంశధార – నేరేడి ప్రోజెక్ట్ నిర్మాణంలోని సమస్యలు తొలిగి త్వరలోనే పూర్తిచేసుకోనున్నట్లు మాజీమంత్రివర్యులు, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టౌన్ హాలులో ఈ మేరకు ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి ప్రోజెక్టు నిర్మాణంపై చర్చించనున్నట్లు చెప్పారు. సిఎం చేస్తున్న అవిరళ కృషితో ప్రోజెక్టుకు ఒడిషాతో ఉన్న జలవివాద సమస్యలకు చరమగీతం పడనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 1962లో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నేరేడి బ్యారేజుకు శంకుస్థాపన చేసారని, అది నేటికి సఫలం కాలేదన్నారు. సరిహద్దు రాష్ట్రమైన ఒడిషాతో తలెత్తిన బేధాభిప్రాయాల వలన గడిచిన 62 ఏళ్లలో బ్యారేజ్ నిర్మాణానికి నోచుకోలేదని, ముఖ్యమంత్రి తీసుకున్న సాహోసోపేతమైన నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పెద్ద వరం కాబోతుందని తెలిపారు. ఇందుకు  జిల్లా ప్రజలు, రైతాంగం తరపున హృదయపూర్వక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు లభించారని, ఈగోలకు పోకుండా ప్రజల మంచి చెడ్డలను ఆలోచించి, జీవనప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పనిచేయడం ఉన్నతమైన సంప్రదాయమని, ఆ సంప్రదాయం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని ఆయన స్పష్టం చేసారు. జిల్లా ప్రజల కోసం సిఎం తీసుకుంటున్న చర్యను అందరూ అభినందించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆంధ్రా ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు  ఉందని, ప్రజల కోసం ఆలోచించే ఆదర్శవంతమైన వ్యక్తి నవీన్ పట్నాయక్ అని కొనియాడారు. 1936కు ముందు శ్రీకాకుళం ఒడిషా రాష్ట్రంలో ఉండేదని, తదుపరి ఆంధ్రా ప్రాంతంగా విభజించబడిందని ఆయన గుర్తుచేసారు. నేరేడి బ్యారేజ్ నిర్మాణంలో కోర్టులు ఇచ్చే తీర్పులు కంటే నేరుగా సిఎం గారిని కలిసి సమస్యలను పరిష్కరించుకోవడం సంతోషకరమని, సిఎం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఈ ప్రోజెక్టు నిర్మాణంతో ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద ప్రోజెక్టు కాగలదని ధర్మాన పేర్కొన్నారు. ఈ ప్రోజెక్టును నాటి ముఖ్యమంత్రి దివంగత డా.వై.యస్.రాజశేఖరరెడ్డి మంజూరుచేసారని, రాష్ట్రంలో జలయజ్ఞం పేరిట ఒకే టెర్ములో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రోజెక్టులకు శ్రీకారం చుట్టారని అన్నారు. అందులో భాగంగానే వంశధార, తోటపల్లి, మడ్డువలస- ఎక్స్ టెన్షన్, మహేంద్రతనయపై నిర్మించిన ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించబడ్డాయని, తోటపల్లి పూర్తయిందని, వంశధార ప్రోజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద ప్రోజెక్టు వంశధార అవుతుందని అన్నారు. బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే జల ఒప్పందం ప్రకారం మన వాటాకు 57.5 టి.ఎం.సిలు వస్తాయని, ఆ వాటాలో 45 టి.ఎం.సిల నీటిని ఇపుడే వినియోగించుకునే అవకాశం ఉందని ఇంజినీరింగ్ అధికారుల సమాచారమని ఆయన వివరించారు. ఒడిషాకు పెద్దఎత్తున నీటివనరులను వినియోగించుకునే భూభాగం గాని అవకాశంగాని, అనువుగా లేదన్నారు. ఇటువంటి పరిస్థితిల్లో నీటిని వృధా కానివ్వకుండా భారతీయులుగా గుర్తించి విశాలమైన ఈ ఒప్పందాన్ని అమలుచేయడానికి నవీన్ పట్నాయక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రజలందరి తరపున వినమ్రంగా కోరుతున్నట్లు చెప్పారు. ఇది ఒడిషా ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల వాదన, ఆవేదన, కోరిక, మనోవాంఛ అని, ఇది రేపటి సమావేశానికి దోహదం కావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలతో జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీరనుందని ధర్మాన స్పష్టం చేసారు. 

Srikakulam

2021-11-07 12:47:53

సెల్ ఫోన్లు ఇచ్చారు సిమ్ కార్డులు మరిచారు..

తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళాపోలీసులకు ప్రభుత్వం విధినిర్వహణ నిమిత్తం సెల్ ఫోన్లు పంపిణీ చేసింది. అయితే సెల్ ఫోన్లు అయితే పంపిణీచేసింది తప్పితే అందులో వినియోగించే సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఆ సెల్ ఫోన్లన్నీ మూలన పడి ఉన్నాయి. జిల్లాలో సుమారు 850 మంది మహిళా పోలీసులకు ప్రభుత్వం సెల్ ఫోన్లు పంపిణీ చేసింది. ఫోన్లలో వినియోగించేందుకు గ్రూప్ సిమ్ కార్డులు పంపిణీ మాత్రం చేపట్టలేదు. ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించే సెల్ ఫోన్లు కావడంతో వాటిని మహిళా పోలీసులు అలాగే ఇంట్లో ఓ మూలన భద్రంగా దాచిపెట్టి ఉంచారు. అటు జిల్లా అధికారులు సైతం ప్రభుత్వం నుంచి సిమ్ కార్డుల విషయమై ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.

Kakinada

2021-11-07 05:46:49

జిల్లాలో శాశ్వత భూ హక్కు సర్వే పక్కాగా చేయాలి..

శ్రీకాకుళంజిల్లాలో జగనన్న భూ సర్వే శాశ్వత భూ హక్కు కార్యక్రమంను  గ్రామాల్లో పక్కాగా రీ సర్వే నిర్వహించాలని సర్వే శాఖ కర్నూల్ ప్రాంతీయ ఉప సంచాలకులు మరియు ప్రధాన శిక్షకులు ఎ. వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ భూములు, దేవదాయ శాఖ భూములు, ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. భూతగాదాలకు తావులేకుండా రీ సర్వే సక్రమంగా జరిగి శాశ్వతంగా భూ హక్కు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సక్రమంగా పనిచేయాలని వెంకటేశ్వరరావు సర్వేయార్లకు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం రీ సర్వే ఆపరేషన్స్ వర్క్ షాప్ మరియు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) పై శిక్షణ తరగతులు జరిగింది. డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు, అన్ని మండలాల సర్వేయర్లు,   గ్రామ సర్వేయర్ల రీ సర్వే కార్యకలాపాలకు  శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీకాకుళం, విజయనగరం సర్వే శాఖ సహాయ సంచాలకులు  కె .ప్రభాకర్,  టి.త్రివిక్రమ్, సర్వే తనిఖీఅధికారి కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-06 10:52:49

లక్ష్యాలను అధిగమించేందుకు క్రుషిచేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్ణ‌యించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కృషి చేయాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ అంశాల్లో భాగ‌మైన వ్య‌వ‌సాయం, నీటి వ‌న‌రులు వినియోగం, ఉద్యాన‌పంట‌ల విస్త‌ర‌ణ‌, సూక్ష్మ నీటి పారుద‌ల త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌పై త‌న ఛాంబ‌ర్‌లో శ‌నివారం సంబంధిత అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా ఆయా శాఖ‌ల వారీగా నీతి అయోగ్ ర్యాంకుల‌ను, ఇండికేట‌ర్ల‌ను స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ప్ర‌తీ శాఖా నీతి అయోగ్ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కృషి చేయాల‌ని కోరారు. ర‌బీలో పంట‌ల సాగు పెరిగేలా చూడాల‌ని, చిన్న‌, స‌న్న‌కార రైతుల‌కు విరివిగా రుణాల‌ను అంద‌జేయాల‌ని సూచించారు. రైతులు కేవ‌లం సంప్ర‌దాయ పంట‌ల‌కే ప‌రిమితం కాకుండా, ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగును ప్రోత్స‌హించాల‌ని కోరారు. భూసార ప‌రీక్ష‌ల‌ను విరివిగా నిర్వ‌హించి, స‌ర్టిఫికేట్ల‌ను రైతుల‌కు అంద‌జేయాల‌ని, భూ సారాన్ని బ‌ట్టి పంట‌ల‌ను సూచించాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ‌ను ఆదేశించారు. ప్ర‌జ‌లు కేవ‌లం ప్ర‌భుత్వం ఇచ్చే స‌బ్సిడీల‌కోసం ఎదురు చూడ‌కుండా, బ్యాంకు రుణాలను తీసుకొని అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టేలా చైత‌న్యం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ‌, తుంప‌ర సేద్యం అమ‌లుపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆస‌క్తి ఉన్న రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, ఈ విధానాన్ని అవ‌లంబించేలా చూడాల‌న్నారు. వారికి పూర్తి సాంకేతిక స‌హ‌కారాన్ని అందించాల‌ని ఎపిఎంఐపిని ఆదేశించారు.  ఈ స‌మావేశంలో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి జె.విజ‌య‌ల‌క్ష్మి, వ్య‌వ‌సాయ‌శాఖ జెడి వి.టి.రామారావు, ఉద్యాన‌శాఖ డిడి ఆర్‌.శ్రీ‌నివాస‌రావు, ఎపిఎంఐపి పిడి పాండురంగారావు, ఎల్‌డిఎం ఎం.శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-06 08:52:16

చేపల ఉత్పత్తితో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలి.. ఫిషరీష్ డిడి ఎన్.నిర్మలకుమారి..

మత్స్యకారులు చేపల పెంపకం, ఉత్పత్తితో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పిలుపు నిచ్చారు. బుధవారం విజయనగరం జిల్లాలోని చేప పిల్లల పెంపక కేంద్రాల నుంచి తీసుకు వచ్చిన 10.87లక్షలు చేప పిల్లలను, సాలూరు మండలంలోని, చిన చీపురువలస వెంగళరాయునిసాగరం రిజర్వాయర్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వానితులతో కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం మత్స్య సంపదను అభివ్రుద్ధి పెంచాలనే  లక్ష్యంలో జిల్లాలోని అన్ని రిజర్వాయర్ లలో చేపపిల్లల పెంపకాన్ని చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలిపెట్టామన్నారు. చేపల వినియోగాన్ని పెంపకాన్ని మరింత పెంచాలనే మత్స్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతన్నట్టు వివరించారు. ఆహ్వానితులు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం మత్సకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పార్వతి, ఎఫ్డీఓ నాగమణి, స్థానిక సర్పంచ్ రాములమ్మ, ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలు రెడ్డి సురేష్ కుమార్, త్రినాధ్, , ఎంపీటీసీ అనూష, సొసైటీ అధ్యక్షుడు తిరుపతి,  అధిక సంఖ్యలో మాత్సకారులు పాల్గొన్నారు.

Salur

2021-11-04 03:53:44

వీజెఎఫ్ లో ఘనంగా దీపావళి వేడుకలు..

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బాణాసంచా, మిఠాయిలు, ప్రమిదులు తదితర సామాగ్రిని పంపిణి  చేశారు.ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిధిగా హాజరైన  నెడ్ క్యాప్ ఛైర్మన్ కె.కె.రాజు మాట్లాడుతూ, సమాజానికి నిరంతరం సేవలందించే జర్నలిస్టులు దీపావళి పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలన్నారు. సుమారు వెయ్యి మంది జర్నలిస్టులకు క్రమం తప్పకుండా దీపావళి సామాగ్రిని అందజేస్తున్న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, పండుగలు, క్రీడలు, విద్య, వైద్యం ఇలా అన్నింటా కూడా తమ సభ్యులకు వీజెఎఫ్ అందజేయడం అభినందనీయమన్నారు. తాను జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటానన్నారు.. పురాన ఇతిహాస కథనాల ప్రకారం దీపావళి పండుగకి విశిష్టమైన స్థానం ఉందన్నారు. మహాలక్ష్మిని పూజించడంతో పాటు ప్రతీ ఒక్కరూ పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా ఈ పండుగను జరుపుకోవాలని, పిండి వంటలతో పర్వదినాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరికి ఆ సింహాద్రినాధుడు ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు,ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ అన్ని పండుగలు నిర్వహించిన ఘనత వైజాగ్ జర్నలిస్టుల ఫోరంకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సభ్యుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందరి సహకారంతోనే అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయగలుగుతున్నామన్నారు. త్వరలోనే జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం, మీడియా అవార్డుల ప్రధానం ఘనంగానిర్వహించనున్నట్లు చెప్పారు. మీడియా అవార్డుల కమిటీ ఛైర్మన్, వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె. రామేశ్వరి తదితరులు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి.నానాజీ, కోశాధికారి పి ఎన్ మూర్తి. జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, పి. నానాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తొలుత అతిధులు చేతులు మీదుగా బాణాసంచా, మీఠాయిలు, ప్రమిదలు ప్యాక్లను పలువురు జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.

Visakhapatnam

2021-11-03 17:32:02

ఏఓబీలో ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్..

తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్ కి శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి అత్యధికంగా గంజాయి రవాణా కావడం.. దానికి మూలాలు తెలుసుకున్న పోలీసులు ఆపరేషన్ గ్రీన్ గంజాహంట్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు తెరలేపారు. ఇందులో బుధవారం భాగంగా ఎక్కడైతే గంజాయిని పండిస్తారో ఆ ప్రాంతం మోతుగూడెం మండలం ఒడిసా కేంప్  ప్రాంతానికి తాను స్వయంగా వెళ్లి గంజాయి మొక్కలను పెకిలించారు. ఆపై వాటిని స్వయంగా తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడి జిల్లా కేంద్రంలోని మీడియా కూడా అక్కడికి వెళ్లింది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు వెళ్లి అక్కడ సుమారు రూ.2 కోట్ల విలువైన గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అంతేకాదు ఈ గంజాయి సాగు వలన కలిగే నష్టాలు, నమోదవుతున్న కేసులను ఏఓబీ(ఆంధ్రా ఒడిసా బోర్డర్) లో ఏ ఎవరెవరు గంజాయి సాగుచేయిస్తున్నారో వారికి పడిన శిక్షలను అక్కడి గిరిజనులకు, సాగు దారులకు వివరించారు. ఇదంతా స్టేట్ పోలీస్ బాస్ డీజీపీ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఎస్పీ తెలియజేశారు. రాష్ట్రంలో అత్యధికంగా గంజాయి రవాణా ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి జరుగుతుండటం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతున్న కేసుల్లో కూడా జిల్లాకి చెందిన వారు ఉండటంతో మొత్తం మూలాలతో సహా గంజాయిని నిర్వీర్యం చేయాలని పోలీసుశాఖ భావించి ఈ నిర్మూళన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వం ఈ గంజాయి, నాటుసారా వ్యవహారంలో కాస్త సీరియస్ గా ఉండటంతో పోలీసులు తమ దూకుడుని పెంచారు.  జిల్లాఎస్పీ  స్వయంగా తన సిబ్బందితో కలిసి వెళ్లి మరీ ఈ కార్యక్రమం చేపట్టడం, అదీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టడం విశేషం. కార్యక్రమం మొత్తం పోలీసు తుపాకీ పహారా మధ్య కట్టుదిట్టంగా సాగింది. విధినిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఎస్పీ దైర్యంగా ముందగు వేయడంతో మీడయా కూడా ఆయన వెంటన నడిచింది. అక్కడి గిరిజనులు కూడా ఇకపై గంజాయి పంటను పండించమని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ చర్యలతో మంచి ఫలితాలు వస్తాయని పోలీసుశాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ డిఎస్పీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

ఏఓబీ కేంప్

2021-11-03 15:42:24

ఉప రాష్ట్రపతికి విమానాశ్రమంలో ఘన స్వాగతం..

విశాఖ జిల్లాలో 5 రోజుల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ఉప రాష్ట్రపతి కి విమానాశ్రయంలో పలువురు అధికారులు,  ప్రజా ప్రతినిధులు, నేవీ అధికారులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు కు విమానాశ్రయంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్.ఎల్.ఎ. పి.వి.జి.ఆర్.నాయుడు, రాష్ట్ర డి.జి.పి. గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ సిన్హా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బి.క్రిష్ణా రావు, నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్టి, వి.ఎస్.ఎమ్,  ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్  ఈస్టర్న్ ఫ్లిట్ (FOCEF) తదితరులు ఘన స్వాగతం పలికారు.

Visakhapatnam

2021-11-02 07:35:47

గురుకులాల్లో సీఆర్టీల సర్వీసు పొడిగింపు..

రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల (సీఆర్టీలు) సర్వీసును 2021-22 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో 1798 మంది కాంట్రాక్ట్ రిక్రూటెడ్ టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 794 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండగా, 1004 మంది ఎస్జీటీలు, పీఇటీలు, లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి కాంట్రాక్ట్ సర్వీసును పొడిగిస్తుండగా ఈ ఏడాది కొన్ని సాంకేతిక కారణాలతో సీఆర్టీల సర్వీసు పొడిగింపును అధికారులు నిలిపివేసారు. దీంతో పలు పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లోనే సీఆర్టీలు తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఆర్టీల సమస్య గురించి ఉప ముఖ్యమంత్రి గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సీఆర్టీల సర్వీసును పొడిగించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో సీఆర్టీల సర్వీసును ఈ విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులను జారీ చేసారు. కాగా సీఆర్టీల సమస్యను గురించి తాను చెప్పిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కృతజ్ఞతలు తెలియజేశారు.

Kurupam

2021-11-02 07:25:35

పర్యావరణ హితంగా దీపావ‌ళి జ‌రుపుకుందాం..

ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి, ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌లు నుంచి 10 గంట‌ల మ‌ధ్య మాత్ర‌మే బాణాసంచా కాల్చాల‌ని సూచించారు. దీపావ‌ళి పండుగ‌, బాణాసంచా విక్ర‌యాల‌కు సంబంధించి, జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్‌, మ‌రియు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి సూచ‌న‌ల‌కు అనుగుణంగా  ప్ర‌భుత్వం జారీ చేసిన‌ ఉత్త‌ర్వుల‌ ప్ర‌కారం, వివిధ‌ శాఖ‌ల‌కు క‌లెక్ట‌ర్ ప‌లు ఆదేశాల‌ను క‌లెక్ట‌ర్ జారీ చేశారు. ప్రకృతికి హిత‌మైన, గ్రీన్ క్రాకర్స్ ని  మాత్ర‌మే వినియోగించాల‌ని ఆ ఉత్త‌ర్వుల్లో క‌లెక్ట‌ర్‌ పేర్కొన్నారు. దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌లు నుంచి 10 గంట‌లు మ‌ధ్య మాత్ర‌మే బాణాసంచా కాల్చాల‌ని ఆదేశించారు. బాణాసంచా విక్ర‌యించే షాపుల్లో అన్ని ర‌కాల భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని, షాపుల‌మ‌ధ్య క‌నీసం 10 అడుగుల‌ దూరం ఉండాల‌ని సూచించారు. కొనుగోలుదారుల మ‌ధ్య క‌నీసం 6 అడుగుల భౌతిక‌ దూరం ఉండేట‌ట్టుగా, షాపుల‌వ‌ద్ద క్యూ ఏర్పాటు చేయాల‌ని, షాపుల‌వ‌ద్ద శానిటైజ‌ర్ల‌ను వినియోగించ‌వ‌ద్ద‌ని, దానికి బ‌దులుగా చేతుల‌ను శుభ్రం చేసుకొనేందుకు స‌బ్బును వాడాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు మేర‌కు, త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో,  ప‌ర్యావ‌ర‌ణానికి విఘాతం క‌లుగ‌కుండా, ప్ర‌జ‌లు దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకొనేలా ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌ర‌చాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను, తాశీల్దార్లు, ఎంపిడిఓల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2021-11-01 11:47:08

ఘ‌నంగా రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల‌ను క‌లెక్ట‌రేట్‌లో ఘనంగా నిర్వ‌హించారు. సోమ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ కార్యాలయ ప్రాంగ‌ణంలోని జాతీయ ప‌తాకాన్ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆవిష్క‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్లు కిశోర్ కుమార్‌, మ‌హేశ్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, వెంక‌ట‌రావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంక‌ట‌ప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేశ్ బాబు, జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొని జాతీయ ప‌తాకానికి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడారు. త్యాగ‌ధ‌నుల ఫ‌లితంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భ‌వించింద‌ని.. వారి స్ఫూర్తిని, భావ‌జాలాన్ని భావిత‌రాల‌కు అంద‌జేయాల‌ని హితవు ప‌లికారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు దేశంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని, మంచి ప‌నితీరు, ఆద‌ర్శ భావాల‌తో జీవిస్తూ ఆ గుర్తింపును కాపాడుకోవాల‌ని పేర్కొన్నారు. మ‌ద్రాసీల నుంచి ప్ర‌త్యేకంగా విడిపోక ముందో ఇక్క‌డి నాయకులు, ప్ర‌జ‌లు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ని, అవ‌మానాలు ఎదుర్కొన్నార‌ని గుర్తు చేశారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌లు ప‌డి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో ముందంజంలో ఉండాల‌ని ఆకాంక్షించారు. పొట్టి శ్రీ‌రాములు చేసిన త్యాగ ఫ‌లితంగానే ఈ రోజు మ‌నంద‌రం ప్ర‌త్యేక రాష్ట్రంలో జీవిస్తున్నామ‌ని, ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. గుర‌జాడ చెప్పిన‌ట్లు ప‌త్రి మ‌నిషీ పౌరుల కోసం.. స‌మాజం కోసం జీవించాల‌ని హిత‌వు ప‌లికారు. వైఎస్సార్ జీవిత సాఫ‌ల్య పుర‌స్కారానికి జిల్లా నుంచి అయిదుగురు ఎంపిక‌వ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఆశాజ‌నకంగా సాగింద‌ని పేర్కొంటూ వైద్యాధికారుల‌కు, స‌చివాల‌య సిబ్బందికి క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. స్కిల్ డెవల‌ప్‌మెంట్ విభాగ అధికారులు నిర్వ‌హించిన జాబ్ మేళాలు స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. 

కార్య‌క్ర‌మంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంక‌ట‌ప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేశ్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, వెంక‌ట‌రావు, డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు, ఎస్‌డీసీ ప‌ద్మావ‌తి, విజిలెన్స్ డీఎస్పీ ర‌ఘువీర్ విష్ణు ఇత‌ర జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-11-01 07:52:36

కమిషనర్ లక్ష్మీశకు SCRWA శుభాకాంక్షలు..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)  కమిషనర్ గా లక్ష్మీశ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు .. పరిశుభ్రతకు  తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా కృషిచేస్తానని  మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు .. ఈ సందర్బంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు  జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు . విశాఖ నగరాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్బంగా  స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు .కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ. ఏ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ (సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు కాళ్ళ సూర్య ప్రకాష్ (కిరణ్),సభ్యులు కొండ్రి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2021-10-30 15:48:05