1 ENS Live Breaking News

పేదరికాన్ని పారద్రోలడానికి సంక్షేమ పథకాలు..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదరికాన్ని పారద్రోలడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు. వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి మండలం రొట్ట వలస గ్రామంలో శుక్రవారం ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. అధికంగా పాల్గొన్న మహిళా సంఘాలు ముందుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సరుబుజ్జిలి మండలంలో 611 సంఘాలకు 4 కోట్ల 50 లక్షల రూపాయల నమూనా చెక్కును డ్వాక్రా చెల్లెమ్మలకు స్పీకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో  అనేకమంది ముఖ్యమంత్రులను చూశానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంత పరిణితి చెందిన ముఖ్యమంత్రి చూడలేదని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో ప్రామాణికం కలిగిన పాలన అందిస్తున్నారని, అర్హత ప్రామాణికంగా పాలన సాగిస్తున్నారన్నారు. పిల్లలను బడికి పంపిస్తే ఆ పిల్లలకి ఉన్నత చదువులు చదివిస్తానని చెప్పి విద్య కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారం రెండో విడత డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నేడు నగదు జమ చేశారని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.వి.జి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ శివానందమూర్తి (బాబు), జెడ్ పి టి సి సురవరపు నాగేశ్వరరావు, బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కోవిలాపు శేఖర్, స్థానిక సర్పంచ్ ముడాడ్ల రమణ, అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-22 12:40:33

స్వచ్ఛ కాకినాడకు నగరవాసులు సహకరించాలి..

కాకినాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా  తీర్చిదిద్దేందుకు కాకినాడ నగర పాలక సంస్థ అహర్నిశలు కృషి చేస్తుందని కమిషనర్   స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శుక్రవారం  కాకినాడ నగరంలోని పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లకు ఇరువైపులా ఎటువంటి వ్యర్థాలు ఉండకూడదని పారిశుద్ధ్య కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. నగరవాసులు కూడా రోడ్లకు ఇరువైపులా ఎటువంటి వ్యర్థాలను వేయకూడదని, ఎటువంటి ఆక్రమణలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు.  ఒకవేళ పారిశుధ్య కార్మికులు వ్యర్ధాల సేకరణకు రాకపోతే 18004250325 నెంబరుకు ఫోను చెస్తే 24 గంటల లోపల పారిశుధ్య కార్మికులు ఇంటికే వచ్చి  వ్యర్ధాలను సేకరిస్తారని తెలిపారు.   దుకాణదారులకు డస్ట్ బిన్ ను తప్పనిసరిగా షాపు ముందు ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. స్థానికులు అందరూ పర్యావరణ పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం హర్షదాయకమని పేర్కొన్నారు. కొంత శ్రద్ధతో తడి, పొడి, హానికర వ్యర్ధాలను విడివిడిగా ఇవ్వడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలను భద్రపరిచగలమని కమిషనర్ గారు స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

Kakinada

2021-10-22 12:18:55

జర్నలిస్టులకు అండగా ఉంటాం.. విజయసాయిరెడ్డి..

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత  ఇవ్వడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డిని జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను విజయసాయిరెడ్డి వద్ద శ్రీనుబాబు ప్రస్తావించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి వీలైనంత మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయ్ సాయిరెడ్డిని శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

GVMC Park

2021-10-22 10:05:43

గోశాలకు రెండు ఆవులు, దూడల విరాళం..

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక చైర్మన్  శివకుమార్ సుందరన్ కాంక్రీజ్ జాతికి చెందిన రెండు ఆవులు,  2 దూడలను శుక్రవారం దానంగా సమర్పించారు.  ఆ పత్రిక ప్రతినిధి  సందీప్ టిటిడి చైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి ద్వారా ఆవులు, దూడలను గోశాలకు అందించారు. ఈ సందర్భంగా  సుబ్బారెడ్డి రెడ్డి ఆవులకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని అందుకున్నారు. అనంతరం  సుబ్బారెడ్డి గోశాలను పరిశీలించారు. శ్రీవారి నవనీత సేవకు అవసరమయ్యే  వెన్న తీయడానికి ఎన్ని లీటర్ల పాలు అవసరమవుతాయి,  ఎన్ని పాలిచ్చే ఆవులు ఉండాల్సిన అవసరం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా చైర్మన్  సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.  తిరుమలలో శ్రీవారికి దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడానికి తిరుమల లోని గోశాలను విస్తరించడం జరుగుతుందన్నారు.  ఇక్కడ సుమారు 150 పాలిచ్చే ఆవులను ఉంచడం కోసం రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ 60 దేశీయ  జాతి ఆవులు ఉన్నాయని,  మరో 70 నుంచి 80 ఆవులను దానంగా ఇచ్చేందుకు అనేకమంది దాతలు ముందుకొచ్చారని చైర్మన్ చెప్పారు. కోవిడ్ తగ్గు ముఖం పట్టినందువల్ల నవంబరు, డిసెంబరు మాసాలకు సంబంధించి రూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు,  సర్వ దర్శనం టికెట్ల సంఖ్య గత నెల కంటే పెంచామని చెప్పావు. శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసిన గంటన్నరలోనే  బుక్ చేసుకున్నారని చెప్పారు. జియో క్లౌడ్ పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులు సైతం మొబైల్ ఫోన్ ద్వారా కూడా దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాక  తిరుపతిలో కొంత మేరకు సర్వ దర్శనం టికెట్లు జారీ చేసే ఆలోచన చేస్తామని  సుబ్బారెడ్డి వివరించారు.  ఈ ఏడాది మే నుంచి అమలు చేస్తున్న గో ఆధారిత నేవేద్యం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సహించడం లో భాగంగా  అక్టోబర్ 30 మరియు 31 వ తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రముఖులను ఆహ్వానించామన్నారు.  టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో  హరీంద్ర నాథ్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు  శివ కుమార్ పాల్గొన్నారు.

Tirumala

2021-10-22 08:06:01

స‌చివాల‌యాన్ని ఆకస్మికంగా త‌నిఖీచేసిన క‌లెక్ట‌ర్‌..

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని కెఎల్‌పురం-2 వార్డు స‌చివాల‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి శుక్ర‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్ రిజిష్ట‌ర్‌ను ప‌రిశీలించారు. పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పై ఆరాతీశారు. స‌చివాల‌య ప‌రిధిలో జ‌రిగిన‌ కోవిడ్‌ వేక్సినేష‌న్‌, రైస్ కార్డుల జారీ, ఈకెవైసి న‌మోదు, జ‌గ‌న‌న్న శాశ్వ‌త గృహ హ‌క్కు ప‌థ‌కాల గురించి ప్ర‌శ్నించారు. న‌ర‌త్నాల అమ‌లుపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. స్పందన కార్యక్రమం ద్వారా  ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే ద‌ర‌ఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాల‌ని, అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అందించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఉద్యోగులంతా సమయపాలన పాటించాలన్న కలెక్టర్ సిబ్బంది మొత్తం అంతా మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.  ప్రజలకు ఏ ఒక్క సేవలోనూ అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

Vizianagaram

2021-10-22 06:27:30

తేడా రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్..

తెలుగు దేశం పార్టీని వ్యతిరేకిస్తూ జనం చీకొడుతున్నా ప్రతిపక్ష నాయకుడు చంద్రబా బునాయుడుకు సిగ్గురావడం లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. గురువారం నరసన్నపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తో కలిసి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత నరసన్నపేట నియోజకవర్గంలో పర్యటించారు. కోమర్తి, చితవానిపేట, తలసముద్రంలలో రూ.35 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆయన తన అనుచరులతో మాట్లాడించిన తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజలు కష్టాలున్న సమయంలో విజయవాడలో లేని వ్యక్తి ముందస్తు ప్రణాళికల ప్రకారం రెచ్చగొట్టారని ఆరోపించారు. సుపరిపాలన అందిస్తున్న సీఎంను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడాలి అనే ధోరణిలో చంద్రబాబు తీరు ఉండడం ఎంతో దారుణమన్నారు. రాజకీయ వికృతి క్రీడలో భాగంగా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేయించారన్నారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంయమనం తో ఉండాలని తమను కోరారన్నారు. అయినా కార్యకర్తలు, నాయకులు సంయమనం కోల్పోయే పరిస్థితికి చంద్రబాబు తెస్తున్నారని, చంద్రబాబు మాట్లాడే భాష ప్రజలు చూస్తున్నారని. వారే మళ్లీ గుణ  పాఠం నేర్పుతారని అన్నారు, 

మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని అన్నారు. అది చూసి ఓర్వ లేక ప్రతిపక్షం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు  కొద్దీ తీరు దారుణంగా తయారైందన్నారు. సిగ్గుమాలిన వ్యక్తిగా చంద్రబాబు రూపాంతరం చెందారన్నారు. పట్ట్బాలి నూట్లాడిన మాటలు కన్న తల్లులు, అడవారిని కించపరిచే లా లేవా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని అన్నారు. అవినీతి రహిత పాలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. 

యువ నాయకులు పోలాకి జడ్పిటిసి సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ  అభివృద్ధి, సంక్షేమ పథకాల కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని చెప్పారు. టీడీపీ ఎన్ని ప్రేలావనలు చేసినా విజ్ఞత గల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు సంయమనం కోల్పోరనీ, కానీ ఎల్లవేళలా సహనంతో ఉంటారని అనుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో  జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాడ కృష్ణచైతన్య, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వర్ రావు, ఐసిడిఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-21 08:57:53

సమాజంలో అతిముఖ్యమైనది పోలీస్ వ్యవస్థ..

తల్లి తండ్రి తరువాత అతి ముఖ్యమైన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అని అయితే ఇందులోని మంచిని గుర్తించకుండా కొంతమంది చెడును బహిర్గతం చేయకుండా మనకోసం మన సమాజం కోసం అసువులు బాసిన వారిని మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జి వై వి ఎన్ బి జి పార్థసారథి అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరులకు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ సెంథిల్ కుమార్ లతో పాటు అమరవీరుల ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మన వ్యవస్థకు ఎంతో గొప్ప కుటుంబాన్ని అదేవిధంగా అమర వీరులను ఇవ్వడం జరిగిందని వీరి ద్వారా మనం రక్షించబడుతున్నామని ప్రజలు సుఖంగా ఉండడానికి కారణం ఒక రక్షణ వ్యవస్థ అని రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోతున్నా మన్నా అందుకు పోలీసులే కారణమని సాధారణంగా మంచి చేసే వారి విషయంలో కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది .అయితే ఎప్పుడూ ఆ వ్యతిరేకతను మర్చిపోయి వారిలోని  సేవలను గుర్తించాలని అన్నారు. కోర్టు కన్నా ముందే ఏ సమస్య అయినా పోలీస్ స్టేషన్ కు వెళుతుందని పోలీసులు స్నేహ పూర్వక వాతావరణంలో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని అన్నారు. అదేవిధంగా రాత్రింబవళ్లు సెలవులు లేకుండా పనిచేయడం వల్ల వారు కొంత చిరాకు పడటం జరుగవచ్చునని అయితే బాధితులు కూడా వారి కష్టాలను అర్థం చేసుకోని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు.
 జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ మాట్లాడుతూ ఎవరైతే మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం ప్రాణాలు అర్పించారో వారిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మొదట ఈ సంఘటన 1959 అక్టోబర్ 21న జరగడంతో అమరవీరుల సంస్మరణ దినాన్ని అదేరోజున జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు, వారు చేసిన సేవలను మననం చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము జరుగుతోందన్నారు.  ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా క్లిష్ట సమయంలో  ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి,పోలీసు వ్యవస్థ వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజల కోసం చేసిన సేవలు మర్చిపోలేమని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ ప్రజలకు సేవ చేసే సమయంలో ఎంతోమంది అశువులు బాయడం కూడా జరిగిందని అటువంటి క్లిష్ట సమయంలో కూడా పోలీసు శాఖ అందించిన సేవలను మర్చిపోలేమ న్నారు. కొంతమంది హక్కులను కాలదోసి సంఘంలో గొడవలు సృష్టించే సమయంలో కూడా పోలీసులు అందించినసేవలు మరువలేనివని వారికుటుంబసభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాని అమరులైన వారికి జోహార్లు అని అన్నారు.
త్యాగనిరతి కి ప్రతిరూపంగా పోలీసుల అమరవీరుల దినంగా అక్టోబర్  21 ని భావిస్తున్నామని ఎంతోమంది విధినిర్వహణలో అమలు కావడం జరిగిందని వారందరినీ మననం చేసుకునేందుకే అమరవీరుల దినోత్సవం ను జరుపుకుంటున్నా  మన్నారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ ను ఎదుర్కొనేందుకు పోలీసుల సేవలు అందించడం జరిగిందని నిరంతరం ప్రజల కోసం సేవలందిస్తూ కొంతమంది అశువులు బాయడం కూడా జరిగిందని అన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ప్రజల సంరక్షణ ప్రధమ బాధ్యతగా పోలీసుల సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం స్పెషల్ ఫోర్స్ మెంట్ ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అమరవీరుల పేర్లను చదువుతూ అందరికీ మననం చేశారు. ఈ సందర్భంగా వారికి గౌరవసూచకంగా అందరూ గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘవిద్రోహ శక్తుల చేతిలో మరణించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన హుస్సేన్ భాష, సురేంద్ర, జవహర్ లాల్ నాయక్, దేవేంద్ర కుమార్, ఆంజనేయులు, ఈశ్వరయ్య, ముని శంకర్, ప్రదీప్ కుమార్, మోహన్ కిషోర్, కృష్ణమూర్తి  కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సంవత్సరం మరణించిన ఏ ఆర్ ఎస్ ఐ ఆంజనేయులు కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు, ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు, మునిశంకర్ కుటుంబ సభ్యులకు 10.5 లక్షలు జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు అందించారు.ఈ  కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులతో పాటు అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Chittoor

2021-10-21 05:49:11

శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం..

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం అన్నాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వ‌హించారు.  ఇందులో భాగంగా  ఉద‌యం సుప్రభాత సేవ‌తో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం, అన్నలింగ అలంకరణ చేపట్టారు. అంతకుముందు శుద్ధోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.  అనంతరం సుమారు 150 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవ‌ట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం అన్నలింగ దర్శనం అనంతరం, అన్నలింగ ఉద్వాసన చేశారు. స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.

Tirupati

2021-10-20 13:58:43

అయ్యవార్లను అధిక భక్తులు దర్శించుకోవాలి..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆలయాలను ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని జెఈఓ శ్రీ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించామని, వారు చక్కగా విధులు నిర్వహించి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. రాబోయే ఆరు నెలల్లో ఆలయాల వారీగా అభివృద్ధిని చేసి చూపాలన్నారు. ఆలయాల స్థలపురాణం, ప్రాశస్త్యం భక్తులకు తెలిసేలా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి సప్తగిరి మాసపత్రిక, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, సామాజిక మాధ్యమాలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. టిటిడి వెబ్ సైట్ లో ఆలయాల స్థల మహత్యం, చరిత్ర, వసతులు ఇతర విషయాలను వివరంగా పొందుపరచాలని, తద్వారా సుదూర ప్రాంతాల భక్తులు సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. ముఖ్యంగా సంబంధిత ఆలయాల్లో భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు ఉండేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీనియర్ అధికారులు ఆయా ఆలయాలను సందర్శించినప్పుడు చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.   ఈ సమావేశంలో ఎఫ్ఎ అండ్ సిఎఓ  బాలాజి, న్యాయాధికారి  రెడ్డప్ప రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, డెప్యూటీ ఈఓ జనరల్  రమణ ప్రసాద్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-20 13:44:45

27 నుంచి జెడ్పీ స్థాయీ సంఘ స‌మావేశాలు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాప‌రిష‌త్ స్థాయీ సంఘ స‌మావేశాలు అక్టోబ‌రు 27 నుంచి 29 వ‌ర‌కు మూడు రోజుల‌పాటు జిల్లాప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌ర‌గ‌నున్నాయ‌ని ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి టి.వెంక‌టేశ్వ‌ర‌రావు తెలిపారు. మొద‌టి, రెండో స్థాయీ సంఘ స‌మావేశాలు 27న ఉద‌యం 10.30 గం.ల‌కు, 12.30 గం.ల‌కు జెడ్పీ ఛైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న వారి ఛాంబ‌రులో జ‌రుగుతాయ‌న్నారు. 28న ఉద‌యం 10.30 గం.ల‌కు 4వ‌, 12.30 గంట‌ల‌కు 7వ స్థాయీ సంఘ స‌మావేశాలు జెడ్పీ ఛైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న ఆయ‌న ఛాంబ‌రులోనే జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. 29న ఉద‌యం 11 గం.ల‌కు 3వ స్థాయీ సంఘ స‌మావేశం, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు 5వ స్థాయీ సంఘ స‌మావేశం, 4 గంట‌ల‌కు 6వ స్థాయీ సంఘ స‌మావేశం జెడ్పీ మినీ మీటింగ్ హాలులో జ‌రుగుతాయ‌న్నారు. ఆయా స్థాయీ సంఘ స‌భ్యులు, అధికారులు షెడ్యూలు ప్ర‌కారం హాజ‌రు కావాల‌ని కోరారు.

Vizianagaram

2021-10-20 13:26:14

అందుకే ఆ జిల్లా కలెక్టర్ అందరికీ ఆదర్శం..

రథసారధి బాగుంటే రధం సాఫీగా ప్రయాణం చక్కాగా సాగుతుంది.. అదే జిల్లా రథసారధి మనసు పెట్టి పనిచేస్తే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయి..ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరతాయి..అలా జరగాలంటే ఐఏఎస్ లు జిల్లా కార్యాలయాలు వీడి క్షేత్రస్థాయిలో పర్యటించాలి.. అపుడే ప్రజలు పడే బాధలు తెలుస్తాయి.. అలా ప్రజల బాధలు తెలుసుకోవడానికి విజయనగం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పల్లెబాట పట్టారు. ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే తప్పా మిగిలిన రోజులన్నీ రోజుకో గ్రామం చొప్పున జిల్లా మొత్తం చుట్టేస్తూ..ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నారు.. తమ పర్యటనలో చూసిన, తెలుసుకున్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ ఎందరో అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. అంతేకాదు విధినిర్వహణలో మండల, డివిజన్ స్థాయి అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏకరవు పెడుతున్నారు. ఒక జిల్లా కలెక్టర్ రోజుకో గ్రామాన్ని తిరగడం చూస్తున్న విజయనగరం జిల్లా అధికారులకు కంటిమీద కునుకు ఉంటం లేదు. సమస్యలు పరిష్కారం అయిపోతాయని కాదు..ఎక్కడ తమ లొసులుగులు, నిర్లక్ష్యం బయటపడుతుందోనని.. ఈ క్రమంలోనే బుధవారం జిల్లా క‌లెక్ట‌ర్  వేపాడ మండ‌లంలో తన పర్యటన చేపట్టారు.. జాకేరులో గ్రామ స‌చివాల‌యం, రైతుభ‌రోసా కేంద్రాల‌ను త‌నిఖీ చేశారు. వాటి ప‌నితీరు, ప్ర‌జ‌ల‌కు ఆయా కార్యాల‌యాల ద్వారా అందుతున్న సేవ‌లు త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. ముందుగా గ్రామ స‌చివాల‌యం త‌నిఖీ చేసి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందుతున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. స‌చివాల‌యానికి వ‌చ్చిన విన‌తులు ఏ మేర‌కు ప‌రిష్కారం అవుతున్న‌దీ తెలుసుకున్నారు. స‌చివాల‌య సిబ్బంది స‌కాలంలో విధుల‌కు హాజ‌రువుతున్న‌దీ లేనిదీ ప‌రిశీలించారు. స‌చివాల‌యంలోని ప‌లు రిజిష్ట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు. గ్రామ స‌చివాల‌య సిబ్బంది సిటిజెన్ ఔట్ రీచ్ కార్య‌క్ర‌మంపై అధికంగా దృష్టి సారించి ఆయా ప‌థ‌కాలు ఏవిధంగా అర్హుల‌కు అందుతున్న‌దీ తెలుసుకోవాల‌న్నారు. అర్హులైన వారు ఇంకా మిగిలి వుంటే వారికి ప‌థ‌కాలు అందించే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ పై కూడా క‌లెక్ట‌ర్ ఆరా తీశారు. గ్రామంలో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్న‌దీ ఆరోగ్య స‌హాయ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు. శ‌త‌శాతం వ్యాక్సినేష‌న్ లక్ష్యంగా ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అనంత‌రం రైతుభరోసా కేంద్రాన్ని ప‌రిశీలించారు. గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కుడితో మాట్లాడి ఇ-పంట న‌మోదు, ఇటీవ‌ల వ‌ర్షాల‌కు పంట‌న‌ష్టం వివ‌రాల న‌మోదు త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. గ్రామంలో ఏయే పంట‌లు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్న‌దీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ స‌ర్పంచ్‌, ఎంపిటిసి త‌దిత‌రులు కూడా ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్నారు.

Vepada

2021-10-20 13:24:28

ప్లంబింగ్ లో ఉచిత శిక్షణకు ధరఖాస్తులు ఆహ్వానం..

నిర్మాణ రంగం లో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నేక్) ద్వారా, ప్లంబర్ లకు రెండురోజుల ఉచిత శిక్షణ కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ సహాయ సంచాలకులు ఎస్ వి ఎస్ రవి కుమార్ తెలిపారు.  ఈనెల 26,27 తేదీలలో  విశాఖపట్నం  జిల్లాపరిషత్ వద్ద గల "నేక్"  కేంద్రం లో శిక్షణ ఇస్తామని చెప్పారు. 18 సం..లు నిండి, ప్లంబింగ్ పనిలో  అనుభవం కలిగి ఉండాలని శిక్షణకు ఎటువంటి రుసుము లేదని శిక్షణ రెండు రోజులు ఉచిత భోజనం, స్టేషనరీ సరఫరాతో శిక్షణానంతరం కిర్లోస్కర్ కంపెనీ వారిచే (కే.బీ.ఎల్) సర్టిఫికేట్, కేంద్ర ప్రభుత్వం చే వేరొక సర్టిఫికేట్ అందజేయ బడుతుందని ఆయన వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆధార్ కార్డ్ జిరాక్స్, 4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో 22వతేదీ లోగా 8500502395 లేదా 9866883199  ఫోన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Visakhapatnam

2021-10-20 11:55:17

చిరు వ్యాపారులకు వడ్డీ నుంచి విముక్తి ..

చిరు వ్యాపారులకు , సంప్రదాయ  వృత్తుల వారికి జగనన్న  తోడు ఎంతో బాసటగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న తోడు నగదు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలోకి బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పనలో ఈ కార్యక్రమంతో ప్రభుత్వం తరఫున చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా ఆసరాగా ఉంటుందని చెప్పారు. తోపుడు బళ్ళు, బడ్డీలపై టిఫిన్ వ్యాపారం, కూరగాయలు వ్యాపారం, వీధుల్లో తిరుగుతూ అమ్ముకొనే వారికి బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చేందుకు సహాయ సహకారాలు ఉండవని, పూచీ లేనందు వలన బ్యాంకులు రుణాలు ఇవ్వరని తెలిపారు.  ఇలాంటి సమయంలో వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తీసుకొని రోజు వారీ వచ్చే లాభాన్ని వడ్డీ వ్యాపారులకు చెల్లించాల్సి వస్తుందన్నారు.  ఈ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని , ఇక పై  డిసెంబర్, జూన్ నెలలో  సంవత్సరానికి రెండు సార్లు ఈ కార్యక్రమం ఉంటుందని, రుణాలు  తీసుకున్న తర్వాత తిరిగి పూర్తి గా చెల్లించిన మీదట రుణం మళ్లీ తీసుకోవచ్చునని చెప్పారు. సకాలంలో అప్పులు చెల్లించేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.   తీసున్న రుణంను టైం ప్రకారం చెల్లించాలని, ఒకవేళ కట్టకపోతే డ్యూ ఉంటుందని రుణం పొందుటకు కులం, మతం, పార్టీ లేదని అర్హులందరికి ఈ వర్తిస్తుందని వివరించారు. ఈ పధకం క్రింద జిల్లాలో 22,879 మందికి 79.51 లక్షల రూపాయలు లబ్ది చేకూరింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో   రాష్ట్ర పట్టణాభి వృద్ధి, మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ,  జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా.మహేష్ కుమార్, డి.ఆర్.డి.ఏ పి.డి అశోక్, మెప్మా పి.డి సుధాకర్ రావు  తదితరులు పాల్గొన్నారు. అనంతరం  జగనన్న తోడు లబ్ధిదారులకు  మెగా  చెక్కును  అందజేశారు.

Vizianagaram

2021-10-20 10:54:01

శ్రీరామ చరిత్రను రసరమ్యంగా అందించిన వాల్మీకి..

శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ   పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని  పేర్కొన్నారు. వాల్మీకి పూర్వశ్రమ జీవితం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందని అన్నారు. ఆ కథనం ప్రకారం వాల్మీకి బందిపోటుగా బాటసారుల నుండి సొత్తును దోచుకొని జీవితం సాగించేవాడని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించుకోవడం, ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఆయన రచించిన రామాయణం దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, జె.వెంకట రావు , జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  బి.సి.సంక్షేమ శాఖాధికారి డి.కీర్తి, బి సి కులాల కు చెందిన ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-20 10:51:10

పేదల కోసమే 24గంటలు పనిచేస్తున్న సీఎం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలూ పని చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్రారంభించిన జగనన్న తోడు కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 31465 మందికి లబ్ది చేకూరేలా బ్యాంకులకు కట్టిన వడ్డీ కోటి తొమ్మిది లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి అన్నారు.  లబ్దిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. అయితే.. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికీ కొందరు లబ్ధిదారులు బ్యాంకు వడ్డీలు కట్టనివారు త్వరగా చెల్లించాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు వారిలో అవగాహన తీసుకురావాలని మంత్రి అన్నారు. వడ్డీ పూర్తిగా కట్టని వారు డిసెంబర్ లోపు పూర్తిగా చెల్లిస్తే.. డిసెంబర్ లొనే జరిగే మలివిడత జగనన్న తోడు కార్యక్రమంలో ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది వీధి వ్యాపారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వం పేదలకు స్వర్ణయుగంగా మారిందని మంత్రి ఈసందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణు గోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, విశ్వేశ్వర రావు, ప్రాజెక్టు అధికారి,  డిఆర్‌డిఎ,  పలువురు అధికారులు,లబ్దిదారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-20 08:50:08