1 ENS Live Breaking News

Vizianagaram

2021-10-17 16:42:36

పైడితలమ్మ సిరిమాను ఉత్సవానికి అంతా సిద్ధం..

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరి కొలిచేవారి కొంగుబంగారం.. విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు జిల్లా కేంద్రం సిద్ధమయ్యింది. సోమ, మంగళ వారాల్లో జరిగే తోలేళ్ళ ఉత్సవం, సిరిమాను ఉత్సవాల నిర్వహణ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం తో పాటు నగరంలోని ప్రధాన ఆకర్షణలు కోట, గంటస్తంభం తదితర ప్రదేశాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆధ్వర్యంలో అధికారులు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు మద్యం షాపులను అధికారులు మూయించేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు కూడా ఏర్పాటు చేశారు.

Vizianagaram

2021-10-17 16:41:24

మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..

మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అ ఉపముఖ్యమంత్రి ఇ ధర్మాన కృష్ణదాస్ అన్నారు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ముగింపు ఉత్సవాలను నరసన్నపేటలో నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు అనంతరం నరసన్నపేట లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పట్ల దృష్టి సారించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు. మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెజారిటీ పథకాల్లో లబ్ధిదారులు మహిళలేనని ఆయన పేర్కొన్నారు. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుందని తద్వారా రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ ఆలోచన అన్నారు. మాట ఇచ్చిన విధంగానే 4 విడతల్లో అక్క చెల్లెమ్మలకు ఆసరా అందుతుందని కృష్ణ దాస్ చెప్పారు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు మహిళల పేరుమీదే ఇచ్చామని ఆయన అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళ ఎదగాలని వారికి సమాన అవకాశాలను సీఎం జగన్ కల్పిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, డీఅర్డిఎ పీడీ బి.శాంతి శ్రీ, ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, పొందర, కూరాకుల, వెలమ కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రతినిధులు రాజాపు అప్పన్న, పంగ బావాజీ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పొన్నాన దాలినాయుడు.,కె సి హెచ్ బి. గుప్త,  స్థానిక సర్పంచ్ బురెళ్ళ శంకర్, జెడ్పీటీసీ ప్రతినిధులు చింతు రామారావు, మెండ రాంబాబు, ముద్దాడ బైరాగి నాయుడు, తంగి మురళీకృష్ణ, సురంగి నరసింగరావు, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Narasannapeta

2021-10-17 12:05:16

సింహాద్రి అప్పన్నకు మంత్రి అవంతి పూజలు..

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా సింహాచలం లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు పలికారు. ఈక్రమంలో శనివారం రాత్రి కొండ దిగువున ఉన్న బంగారమ్మ తల్లి ఆలయంలో హుండీ దొంగతనం జరగడంతో మంత్రి ఆలయ ఈవో సూర్యకళతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో దొంగతనం జరగడం విచారకరమని అన్నారు. రాత్రి ఆలయంలో నైట్ వాచ్ మెన్ ను విచారించి, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించాలని 24 గంటల్లో దొంగల్ని పట్టుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆలయ ఈవో, పోలీసులకు మంత్రి సూచించారు.

Simhachalam

2021-10-17 11:33:54

కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు వినియోగించుకోవాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే పిలుపునిచ్చారు. ఆదివారం సర్క్యూట్ హౌస్ లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కులాంతర వివాహాలకు రూ 2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ముద్ర యోజన, ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, జన్ యోజన మొదలైన పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల వారికి చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రశంసించారు.  స్వర్గీయ డాక్టర్ వైయస్ శేఖర్ రెడ్డి తో తనకు గల అనుబంధాన్నితలచుకున్నారు.  మీడియా వారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు తోడ్పడాలని కోరారు.   ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక అధ్యక్షులు బి అనిల్ కుమార్, ఏపీ తెలంగాణ ఇంచార్జ్ బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-17 11:25:48

20న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం..

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20వ తేదీ అన్నాభిషేకం జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా ఉద‌యం 8 నుంచి 11 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులను అన్నలింగ దర్శనంకు అనుమ‌తిస్తారు.

Tirupati

2021-10-17 08:46:35

Simhachalam

2021-10-16 13:46:48

కనీస మద్దతుధరపై అవగాహన కల్పించాలి..

ఖరీప్ 2021-22 పంట కాలనాకి కనీస మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేసే విధంగా పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించాలని ఇన్ చార్జి కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశపు మదిరంలో నెలవారీ జిల్లా స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశం నిర్వహించారు. వరికి కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలకు రూ. 1940 లు, 75 కేజీ బస్తా రూ. 1455 లు, గ్రేడు ‘ ఎ ’ రకము క్వీంటారుకు రూ. 1960లు, 75కేజీ బస్తా రూ.1470లు ప్రభుత్వ ధరగా నిర్ణయించామన్నారు. సందేహాల కొరకు కంట్రోల్ రూం నెం.0884-6454341 సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాశాఖ జాయిట్ డైరెక్టర్ ఎన్.వియజకుమార్, ఇతర వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-16 12:40:09

పోస్టల్ కస్టమర్లకు టెక్నాలజీ ఆధారిత సేవలు..

తపాలాశాఖ ద్వారా వినియోగదారులకు సాంకేతిక ఆధారిత సేవలు అందిస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఎన్.సోమశేఖరరావు అన్నారు. విశాఖలోని పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 75వ జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు కార్యక్రమం(వినియోగదారుల సదస్సు)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ పోస్టల్ శాఖలో కూడా మొబైల్ డెలివరీ విధానాన్ని(పోస్టల్ మొబైల్ యాప్) ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. అదేవిధంగా నోడల్ డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అక్టోబరు 9వ తేది నుంచి 16వ తేదీ వరకూ వారోత్సవాలు ఎంతోబాగా జరిగాన్నాయన్నారు. ఆఖరిరోజు పోస్టల్ డేని నిర్వహించారు. పలువురు వినియోగదారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆదిత్యకుమార్, వై.నర్శింగరావు, ఇతర అధికారులు,  తపాలాశాఖ ప్రభుత్వ వినియోగదారలు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-10-16 12:06:35

రైతులకు ఈ-క్రాప్ లో నమోదు తప్పనిసరి..

పంటల  నమోదు జరగక పోతే  రైతుకు రావలసిన రైతుకు భరోసా, పంటల నష్టం తదితర పధకాలు  వర్తించవని సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.  కౌలు రైతులు, ఈనాం భూముల్లో పండించే రైతులు, ప్రభుత్వ భూముల్లో పండించే రైతులు ఎవరైనా గానీ  వాస్తవంగా పంటలువేసే రైతులందరూ ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన తెలిపారు.  గ్రామ స్థాయి  వ్యవసాయ సహాయకుల వద్ద కు వెళ్లి వెంటనే ఈ.కే.వై.సి  నమోదు చేసుకోవాలన్నారు. శనివారం  కల్లెక్టరేట్ సమావేశ మందిరం లో వ్యవసాయాధికారులతో  ఈ క్రాప్ నమోదు,  గులాబ్ తుఫాన్ నష్టాల అంచనా, ధాన్యం సేకరణ  తదితర అంశాల పై సమీక్షించారు.  ఈ క్రాప్ నమోదు లో కురుపాం, మెరకముడిదం మండలాల్లో శత శాతం నమోదు జరిగినందుకు ఆయా అధికారులను అభినందించారు. బాడంగి మండలం అతి తక్కువగా నమోదు చేసినందున ప్రత్యెక దృష్టి పెట్టాలని సూచించారు. ఇటీవల   సంభవించిన గులాబ్  తుఫాన్  కు జరిగిన పంట నష్టాల పై ఆరా తీసారు.   వ్యవసాయ శాఖ కు సంబంధించిన 1580 హెక్టార్లలో , ఉద్యాన పంటలకు సంబంధించి 750 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాలు వేయడం జరిగిందన్నారు.  పంటల వారీగా,  మండల వారీగా నివేదికలను పూర్తి స్థాయి లో వెంటనే అందజేయాలని వ్యవసాయాధికారులకు ఆదేశించారు.  పంటల నష్టాల అంచనాలను సంబంధిత శాసన శాసన సభ్యుల దృష్టి లో కూడా పెట్టాలని సూచించారు. 

ధాన్యం సేకరణ  కేంద్రాలను ప్రారంభించాలి:
జిల్లాలో నున్న 624 రైర్తు భరోసా కేంద్రాల్లో, 230  ధాన్యం సేకరణ కేంద్రాల్లో   ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లను గావించాలని జే.సి ఆదేశించారు. సోమవారం  అన్ని చోట బ్యానర్లను పెట్టి ప్రారంభించాలని అన్నారు.  ప్రతి కేంద్రం వద్ద తేమ యంత్రాలను సిద్ధం చేయాలన్నారు.  డ్వాక్రా సభ్యలకు, గిరి మత్ర లకు, రైతు భరోసా కేంద్రాల  సిబ్బందికి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి  వారిని సమాయత్తం చేయాలనీ,  సమావేశపు మినిట్స్ ను పంపలన్నారు.   నవంబర్ నాటికీ 9150  మెట్రిక్ టన్నుల పంట వచ్చే అవకాశం ఉన్నందున అందుకు  తగ్గట్టుగా ఏర్పాట్లు గావించాలన్నారు.  జనవరి కి మరో 2 లక్షల మెట్రిక్ తన్నులు వస్తుందని, వచ్చిన పంటను ఎప్పటికప్పుడు సేకరించి మిల్లర్లకు ఇవ్వాలని,   పెండింగ్ ఉండే  సహించేది  లేదని స్పష్టం చేసారు. రానున్న మూడు రోజుల్లో భారి వర్ష సూచన ఉన్నందున పొట్ట  దశ లో నున్న పంట నష్టం జరగకుండా రైతు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  నీరు పొలం లో నిల్వ ఉండకుండా  బయటకు పంపే లా ప్రణాళికలు వేసుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారులంత రైతులకు పంట నష్టం జరగకుండా జాగ్రతలు తీసుకునేలా  అవగాహన కలిగించాలన్నారు.  ఈ సమావేశం లో డి డి లు  నందు, ఆనంద్,  ఎ.డి. అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-10-16 09:10:06

విద్యుత్ కోతలపై వచ్చే వదంతులు నమ్మొద్దు..

విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు. దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేసారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్రప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు సీఎండీ..

Visakhapatnam

2021-10-16 08:30:50

పీహెచ్సీల్లో బయోమెట్రిక్ వేస్తేనే జీతం వస్తుంది..

రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీల్లోనూ నవంబర్ 1 నుంచి బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని బయోమెట్రిక్ లేనివారు తక్షణమే కొత్తవి కొనుగోలు చేసి ఏర్పాటుచేసు కోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. పి.హెచ్.సీల్లోని సిబ్బంది విధులకు వచ్చినపుడు,వెళ్లే సమయంలో తప్పనిసరిగా బియోమెట్రిక్ అటెండన్స్ ఉండాలని, విధులకు హాజరుకాని రోజులకు జీతం చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కమీషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖకు ఇవ్వని విధంగా వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులకు సకల సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. ఇన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసినప్పటికి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెలుతున్నారని, ఇందుకు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరనే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే రోగులకు అన్నివిధాల ఆదుకుని, వారికి పూర్తి భరోసాను ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దినపుడే ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెరుగుతుందని ఆ దిశగా పి.హెచ్.సి వైద్యులు,సిబ్బంది కృషిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న వైద్యులు,నర్సులు,లాబ్ టెక్నిషియన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోఉండబోరని,  మంచి అనుభవం, అర్హతలు కలిగిన సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నారని ఆ భరోసా ప్రజలకు కలిగించాలని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో పి.హెచ్.సీల్లో ప్రసవాలు తక్కువగా జరిగాయని, ఇది సిబ్బంది నిర్లక్ష్యవైఖరికి నిదర్శమని అన్నారు. ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదని, అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణీ స్త్రీలను  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి 108 వాహనాలు ఉన్నాయని, అలాగే ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ఉన్నాయన్నారు. అలాగే గర్భిణి స్త్రీలకు అవసరమైన మందులను సకాలంలో అందజేసి, ప్రసవాలకు ఆసుపత్రులకు తరలించి, ప్రసవం అనంతరం ఇంటికి తరలించాల్సిన బాధ్యత ఆశావర్కర్లపై ఉందని, కానీ ఆ విధమైన చర్యలు తీసుకోక పోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందువలనే మాత, శిశు మరణాలు సంభవిస్తున్నాయని ఇకపై ఇటువంటివి జరగ రాదని, నిర్లక్ష్యం వహించిన అధికారులను విధుల నుండి తొలగించడానికి కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. గ్రామంలోని గర్భిణీలు పి.హెచ్.సీల్లోనే ప్రసవాలు వేసుకునేలా, వారికి అవసరమైన మందులు, వైద్యం, భోజన వసతి, బేబీ కిట్స్ తదితర సౌకర్యాలు అందేలా వైద్యులు కృషిచేయాలని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.గౌరీశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సంభవించిన మాత, శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇకపై ఎటువంటి మాత,శిశు మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పి.హెచ్.సీలకు అవసరమైన మందులను ఇప్పటికే సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. సిబ్బంది లేనిచోట సిబ్బందిని సమకూరుస్తున్నామని వివరించారు. ప్రసవాలు పి.హెచ్.సీల్లోనే జరిగేలా ఆశా సిబ్బందికి ఆదేశాలు జారీచేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-14 13:29:23

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సిజె..

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ దర్శించుకున్నారు.   ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, అర్చ‌కులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.


Tiruchanur

2021-10-14 12:56:19

నైపుణ్యా భివృద్ధి శిక్షణ తో  స్వయం ఉపాధి..

యువతకు నచ్చిన రంగం లో నైపుణ్యా భివృద్ధి శిక్షణ   ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించడం లేదా ఆసక్తి గల వారికి   స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని సంయుక్త కలెక్టర్ ఆసరా జే. వెంకట రావు తెలిపారు.  అందు కోసం టార్గెట్  గ్రూప్ లను గుర్తించాలని అన్నారు.   గురువారం  అయన ఛాంబర్ లో స్కిల్ డెవలప్మెంట్  పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.  ఫుడ్ ప్రాసెసింగ్ , డైరీ అభివృద్ధి, మేషన్, ప్లంబింగ్ , ఎలక్ట్రికల్  తదితర రంగాల్లో ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉందని, ఆయా రంగాల్లో ఆసక్తి ఉన్న యువకులను గుర్తించి శిక్షణ కు సిద్ధం చేయాలనీ అధికారులను ఆదేశించారు.  మత్స్య , ఉద్యాన  శాఖలలో  మార్కెటింగ్ స్కిల్ల్స్ ను నేర్పించడం ద్వారా సుస్థిరమైన ఆదాయం అందుకునేలా  చేయవచ్చని అన్నారు.    ప్రతి శాఖ వారి పరిధి లో గల అవకాశాలను గుర్తించి, శిక్షణ కోసం  టార్గెట్ గ్రూప్ లను కూడా గుర్తించాలన్నారు.  ఈ సమావేశం లో డి.అర్-.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్, వ్యవసాయ సఖ జే.డి ఆశ దేవి, పశు సంవర్ధక జే.డి డా. రమణ,  స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్  శ్రీనివాస్,  సెట్విజ్ సి .ఈ.ఓ  ఉద్యాన, మత్స్య, పరిశ్రమల, కార్మిక  శాఖల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-14 12:51:08

ప్రతీఒక్కరూ చేతుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి..

ప్ర‌తీఒక్క‌రూ త‌మ‌ చేతుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి సూచించారు. చేతుల‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా, చాలా వ‌ర‌కూ వ్యాధుల‌ను నివారించ‌వ‌చ్చ‌ని అన్నారు. గ్లోబ‌ల్ హేండ్ వాషింగ్ డేకి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను గురువారం త‌న ఛాంబ‌ర్‌లో  క‌లెక్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఇత‌ర ప్ర‌చార సామ‌గ్రిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానంద‌కుమార్‌, జిల్లా పంచాయితీ అధికారి సుభాషిణి, డ్వామా పిడి ఉమా ప‌ర‌మేశ్వ‌రి, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఇఇ వై.గోవింద‌రావు, ఎస్‌డిసి వెంక‌టేశ్వ‌ర్లు, హెచ్ఆర్‌డి క‌న్స‌ల్టెంట్ టి.సుధాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-14 12:49:32