1 ENS Live Breaking News

నగరవాసుల సహకారంతోనే స్వచ్ఛ కాకినాడ..

నగరవాసుల సహకారం ఉంటేనే స్వచ్చ్ కాకినాడ సాధ్యపడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం ఉదయం 10వ వార్డులో పర్యటించిన ఆయన పారిశుధ్య కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ కాకినాడ ప్రజలు స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, అదే ఉత్సాహంతో ఈ సారి కూడా స్వచ్ఛ సర్వేక్షన్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమతోపాటు తమ చుట్టుపక్కల వారు కూడా పరిసరాలను కలుషితం చేయకుండా చూడాలన్నారు. స్ధానిక పారిశుధ్య కార్మికుల పనితీరుపై అసంత్రుప్తిని వ్యక్తం చేసిన ఆయన విధులలో అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-10-11 13:36:45

కోటప్పకొండపై ప్రెస్ అకాడమీ చైర్మన్ పూజలు..

కోటప్పకొండపై కొలువైయున్న శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయంలో దేవిరెడ్డి శ్రీనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ పరిపాలన అధికారి రామకోటిరెడ్డి  రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కు త్రికోటేశ్వరస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అంతకు ముందు కోటప్పకొండ దేవస్థానం చేరుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ను నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, జిల్లా సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ అబ్ధుల్ రఫీక్, త్రికోటేశ్వర స్వామి ఆలయ పరిపాలన అధికారి రామకోటిరెడ్డి, నరసరావుపేట తహాశీల్ధార్ రమణా నాయక్ లు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలను అందజేశారు. అనంతరం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దంపతులు తాడేపల్లిలోని స్వగృహానికి బయలుదేరి వెళ్ళారు.

Kotappakonda

2021-10-11 12:56:37

పురోగతికి మహిళా సారికాధికరత అవసరం..

సమాజ పురోగతికి  మహిళా సారికాధికరత అవసరమని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం అక్కులుపేట గ్రామంలో సోమ వారం జరిగిన వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. సభాపతి మాట్లాడుతూ సమాజం పురోగతి సాధించాలoటే మహిళలకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని ఆయన చెప్పారు. ఆసరా కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని అందులో భాగంగా ఇప్పటికీ రెండు విడతలుగా రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుల నిమిత్తం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని విద్యా దీవెన, వసతి దీవెన తో మరింత సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. రైతు భరోసా కార్యక్రమం క్రింద రైతులకు ఏడాదికి 13,500 రూపాయలు చెల్లిస్తున్న ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. వాహనమిత్ర , జగనన్న తోడు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బెoడి గోవిందరావు, బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-11 12:50:21

ఆసరా సహాయంతో ఆర్థికంగా బలపడాలి..

ఆసరా సహాయం కుటుంబాల ఆర్థిక బలోపేతానికి వినియోగించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామ పంచాయతీ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమ వారం జరిగిన వైయస్సార్ ఆసరా రెండో విడత నిధులు విడుదల సంబరాలకు ముఖ్య అతిథిగా  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. ఆశీస్సులు, ఆ దేవుని చల్లని దీవెనలతో దేశంలో అత్యుత్తమ సీఎంలలో జగన్ మూడవ స్థానంలో ఉన్నారన్నారు. రాజకీయాలు అంటే గొప్ప పాలన, పారదర్శకత అనుకునేలా తీర్చిదిద్దారని ఆయన చెప్పారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో గొప్ప చదువులు చదువుకావాలని ముఖ్య మంత్రి ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టారని తెలిపారు. పేదల ఇళ్ళు కోసమని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాతిక వేల కోట్ల రూపాయలతో భూసేకరణ చేసి లక్షలాది కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని నింపామని చెప్పారు. వైయస్సార్ ఆసరా నిధులను కుటుంబాల ప్రగతి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం సక్రమంగా వినియోగించుకావాలని ఆయన కోరారు. పలు ప్రైవేటు భాగస్వాములతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, వాటిలో దేని ద్వారా ప్రయోజనం కలుగుతుందో వాటిని ఎన్నుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికార అనధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

Srikakulam

2021-10-11 12:49:03

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి..

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్య‌క్ర‌మానికి  వచ్చిన అర్జీల‌ను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్.వి.ఎస్ సుబ్బలక్ష్మి, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ సునీత‌ త‌దిత‌రులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన అర్జీలు, రీఓపెన్ అర్జీల ప‌రిష్కారంలో పురోగ‌తిపై జేసీ లక్ష్మీశ  స‌మీక్షించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖల ప‌రిధిలో ఉన్న కోర్టు కేసులపై  ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించే విధంగా చూడాల‌ని ఆదేశించారు. ఈ అంశంపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాల‌న్నారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి  ప్రజలు పాల్గొని, ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ ఉపాధి కల్పన, పెన్ష‌న్లు, ఉపకార వేతనం, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరు, బీమా, భూముల స‌ర్వే తదితరాలకు సంబంధించి సుమారు 425 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-11 12:46:51

మైనార్టీ పేదలకు సాయం అభినందనీయం..

అనంతపురంలో మైనార్టీ పేదలకు జమాతే ఇస్లామి హింద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆదర్శ నగర్లో జమాతే ఇస్లామి హింద్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లింల అభివృద్ధి కోసం పెన్షన్ స్కీమ్ ప్రారంభ  కార్యక్రమంలో మేయర్ తోపాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ఇస్లామి లేని వారికి ఉన్నవారు ఇమ్మని చెపుతోందని జమాతే ఇస్లామి హింద్ ఇస్లాం ధర్మాన్ని పాటిస్తోందని అభినందించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్, వైకాపా నాయకులు కొండ్రేడ్డి ప్రకాష్ రెడ్డి,జమాతే ఇస్లామి హింద్ సంస్థ ప్రతినిధులు సాదిక్, యాసిర్ అహ్మద్,వలీ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-11 12:35:59

విజయనగరం జిల్లా స్పందనకు 290 వినతలు..

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమ వారం నిర్వహించే స్పందన కు 290 వినతులు అందాయి.   ఈ వినతులను  సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్,  డి.ఆర్.ఓ గణపతి రావు,  స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు అందజేసారు. సోమవారం రెవిన్యూ కు సంబంధించి 200  దరఖాస్తులు,  డి.ఆర్.డి.ఎ  కు 48,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు  చెందినవి 18, డి.సి.హెచ్.ఎస్  కు 18 ,  దరఖాస్తులు అండగా పౌర సరఫరాలకు సంబంధించి 6 దరఖాస్త్హులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-10-11 12:34:16

అన్నదాన కార్యక్రమంలో నగర మేయర్..

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని నగర మేయర్ గొలగాని  హరి వెంకట కుమారి అన్నారు.  సోమవారం ఆమె 3వ జోన్ 23 వ వార్డు పరిధిలోని చైతన్య నగర్ లో దుర్గా దేవి  నవరాత్రుల మహోత్సవ ఈ సందర్భంగా వార్డ్ కార్పొరేటర్  గుడ్ల విజయసాయి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదాన  ప్రసాదములను  అందించి, దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,  నగర అభివృద్ధి జరగాలని,  కరోనా నుండి ప్రజలను  కాపాడాలని  వేడుకున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు సత్యరెడ్డి,  స్థానిక నాయకులు,  ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-11 09:22:38

ఆధ్యాత్మిక శక్తులను మిలితం చేసిదే పండుగ..

భారతదేశంలో జరిగే అన్ని పండుగలు కూడా చెడును విడనాడి మంచిగా ముందుకు సాగాలనే సూచిస్తాయని ప్రజాపిత బ్రహ్మాకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బికె రామేశ్వరి పిలుపునిచ్చారు.  సోమవారం విశాఖ డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మాకుమారీస్‌, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బికె రామేశ్వరి మాట్లాడుతూ చెడు గుణాలు, వ్యసనాలు విడిచిపెట్టాలన్నదే నవరాత్రులు సూచిస్తున్నాయన్నారు. అయితే అది ఒక్క రోజులో పూర్తికాకపోయినా తరువాత దశల వారీగా మంచి అలవాటులతో ముందుకు సాగాలన్నారు. పండగలు ఆధ్యాత్మికశక్తులను ఒకే చోట మిలితం చేస్తాయన్నారు. అయా పండుగులను బట్టి ప్రజలు సంప్రదాయాలను పాటిస్తూనే జరుపుకోవడం అనావాయితీగా వస్తుందన్నారు. దసరా నవరాత్రులు అంటేనే చెడుపై మంచి సాధించే విజయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సింహచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో ఇచ్చాశక్తి, జ్ఙానశక్తి, క్రియశక్తుల ద్వారా మానవ సంకల్పం నేరవేర్చుకోవచ్చున్నారు. అంతేకాకుండా దసరా నవరాత్రుల్లో  అత్యధిక శాతం ప్రజలు అమ్మవారులను పూజించడం జరుగుతుందన్నారు. మంచి సంకల్పంతో జ్ఞాన శక్తిని పెంపొందించుకుని అనుకున్న పనులను, కోర్కెలను శరన్నవరాత్రుల్లో క్రియాశక్తి ద్వారా సాధించుకోవచ్చున్నారు. బ్రహ్మకుమారీస్‌ అన్ని పండగులు జర్నలిస్టులతో మమైక్మమై జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజెఎఫ్‌ కార్యదర్శి ఎస్‌.దుర్గారావు మాట్లాడుతూ ప్రతి పండుగను బ్రహ్మకుమారీలు తమ ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. దానివల్ల పండుగల ప్రత్యేకతలు నేటి తరం తెలుసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఎంతో మందికి ఆధ్యాత్మిక శక్తిని పంచిపెట్టేది ప్రజాపిత బ్రహ్మాకుమారీలనేని కొనియాడారు. విజెఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, బ్రహ్మకుమారీస్‌ రైల్వేన్యూకాలనీ శాఖ ప్రతినిధి శశికళ, విశాలాక్ష్మీనగర్‌ శాఖ ప్రతినిధి రూప,మౌంటాబుకు చెందిన ప్రతినిధి కన్నాలు,ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు, తొలుత దసరా పండుగను ప్రతిబింబించే విధంగా గోడపత్రికను ఆవిష్కరించి అందరికీ విజయతిలకం దిద్ది మిఠాయిలు పంపిణీ చేశారు.

Visakhapatnam

2021-10-11 08:07:20

సచివాలయ స్పందననూ సద్వినియోగం చేసుకోవాలి..

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు నగరపరిధిలోని వార్డు సచివాలయాల్లో జరిగే స్పందనను సద్వినియోగం చేసుకోవాలని  నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలో స్త్రీ శక్తి భవనంలో జరిగిన స్పందనలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ సచివాలయంలో కూడా రోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్యాలయానికి రాలేనివారు సచివాలయంలో సంప్రదించవచ్చనన్నారు. అక్కడ పరిష్కారం లభించని పక్షంలో తమని నేరుగా సంప్రదించాలన్నారు. అదేవిధంగా 18004250325 నెంబరుకు ఫోను చెయ్యడం ద్వారా ఇంటినుంచే స్పందనలో సమస్యని తెలియజేయవచ్చునని కమిషనర్ సూచించారు.

Kakinada

2021-10-11 07:25:11

విశాఖజిల్లా నలుచెరగులా ‘దిశ’యాప్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు, విద్యార్ధినిలు, గ్రుహిణిల సంరక్షణార్ధం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశ యాప్ విశాఖజిల్లా నలు చెరగులా దావానంలా వ్యాప్తి చెందుతుంది. జిల్లా ఎస్పీ డా.బొడ్డేపల్లి క్రిష్ణారావు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, గ్రామసచివాలయాల పరిధిలోని 630 మంది మహిళా పోలీసులతో దిశ యాప్ ను జిల్లా అంతటా విస్తరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70లక్షల మంది ఈ దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోగా ఒక్క విశాఖ రూరల్ జిల్లాలోనే 4లక్షల మందికి పైగా దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దిశయాప్ ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించడంతో ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ దిశ యాప్  వినియోగం, ఇనిస్టాలేషన్స్ పై ప్రత్యేకంగా మండల, డివజనల్ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి మరీ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని దిశ ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో కూడా ఉంచారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో  నెట్ వర్క్ ఉన్న చోట్ల దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించే కార్యక్రమాన్ని గ్రామసచివాలయ సిబ్బంది ముఖ్యంగా మహిళా పోలీసులు చేపడుతున్నారు.  చదువు రాని వారు కూడా  మొబైల్ ను 5 సార్లు షేక్ చేస్తే  ఎస్.ఓ.ఎస్ ఓపెన్ అవుతుందనే విషయాన్ని గిరిజనులకు తెలియజేసి అవగాహన కల్పిస్తున్నారు. దీని ద్వారా వారికి అవసరమైన రక్షణ అందుతుందనే భరోసా కల్పిస్తున్నారు. గత సంవత్సరం నుండి దిశా చట్టం మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుండటం కూడా దిశయాప్ ప్రజల్లోకి త్వరగా వెళ్లడానికా ఆస్కారం ఏర్పడింది.  దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నది.  ప్రతి ఇంటిలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకొనే  విదంగా  అవగాహన కలిగించేలా ఆ బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు తీసుకునేలా జిల్లా అధికారులు సైతం క్యాంపైన్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ ను ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల దిశయాప్ ను పురుషులు సైతం తమ మొబైల్స్ లో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో ఉన్నవారికి సహాయం అందిచడానికి వీలుపడుతుందే జిల్లా పోలీసు సందేశాన్ని ప్రతీఒక్కరూ స్వీకరిస్తున్నారు. ఈ విషయంలో మీడియా ప్రత్యేక పాత్ర పోషించడం, దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి వెంటేనే తీసుకెళ్లడంలో తమవంతు బాధ్యతను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ, పత్రిక, ఆన్ లైన్ మీడియా కంటే, మొబైల్ న్యూస్ యాప్స్ ద్వారా సత్వరమే ప్రజలకు సమాచారం తెలుస్తున్నది. రాష్ట్రప్రభుత్వం దీనిని పూర్తిస్థాయిలో చట్టంగా మారిస్తే మరిన్ని ఫలితాలు రావడానికి, ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అన్ని వేళల్లో ఉపయోగపడి.. ఒక రక్షణ కవచంలా మారివుంది. రానున్న రోజుల్లో ప్రతీ ఒక్కరి మొబైల్ లోనూ దిశయాప్ ఒక అత్యవసర వనరుగా ఉపయోగపడి రాష్ట్రప్రభుత్వ ఆశయం, మహిళలకు 24 గంటలూ రక్షణ కల్పించేలా మరింత అభివ్రుద్ధి చెందాలని ఆశిద్దాం..!

Visakhapatnam

2021-10-11 06:21:13

అభివృద్ధికి అంధత్వం ఎప్పుడూ అడ్డురాదు..

ఆర్థిక అభివృద్ధికి అంధత్వం అడ్డురాదని కీ.శే పబ్బరాజు వెంకటేశ్వరరావు కృషితో నిరూపించారని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన శ్రీ  షిర్డీ సాయి దీనజన సేవా సమితి ఆధ్వర్యంలో కీ.శే పబ్బరాజు వెంకటేశ్వరరావు 87వ జయంతి గుంటూరు లో ఘనంగా జరిగింది. 25 సంవత్సరాల క్రితం పబ్బరాజు వెంకటేశ్వర్లు ఇద్దరు అంధుల తో ప్రారంభించిన అంధుల పాఠశాల దినదినాభివృద్ధి చెంది వందలాది అంధుల జీవితాల్లో వెలుగులు నింపిందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.దాదాపు 200 మంది అంధులు ప్రభుత్వ ఉద్యోగాలు పొంది నేడు అభివృద్ధి పథంలో ముందుకు నడవటానికి దిక్సూచిగా  పబ్బరాజు వెంకటేశ్వర్లు జీవితం నిలిచిందన్నారు. గుంటూరు బ్రాడీపేట 2/12 లో గల  500  చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అంధుల పాఠశాలకు శాశ్వత చిరునామాగా ఏర్పాటు చేస్తామని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హామీ ఇచ్చారు. దాతలు ఇచ్చిన విరాళాలను సక్రమంగా వినియోగించి దాదాపు 2.5 కోట్ల నిధులను ప్రభుత్వ  బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచడం పబ్బరాజు వెంకటేశ్వరరావు నిజాయితీకి నిదర్శనమన్నారు. సమాజంలో ధాత్రుత్వం మరింత పెరగాలని తద్వారా పేద,బలహీన వర్గాల సాధికారత సాధ్యమౌతుందని అన్నారు. శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి అధ్యక్షులు అనంగి పూర్ణచంద్రరావు ప్రసంగిస్తూ కీ.శే.పబ్బరాజు వెంకటేశ్వర్లు పేరుతో స్మారక మానవీయ సేవా పురస్కారాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించి లక్ష రూపాయల అవార్డును అందిస్తామన్నారు. త్వరలో వృద్ధాశ్రమం,అనాధాశ్రమం నిర్మించాలని తలపెట్టినామని తెలిపారు.ఈ కార్యక్రమం లో కేతరాజు నరసింహారావు,యన్.తిరుపతయ్య, దాసరి హనుమంతరావు, రిటైర్డ్ హెడ్మాస్టర్ వేమూరి శ్రీరామమూర్తి, పన్నాల సత్యనారాయణమూర్తి, వెలగపూడి పాండురంగారావు, ఆవుల మర్రిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Guntur

2021-10-10 11:21:43

మత్తు పానీయలపై రాష్ట్రవ్యాప్త కళాజాత..

మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీ నుండి డ్రగ్స్,మత్తు పానీయాల పై  కళాజాత నిర్వహిస్తామని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.  యువత,విద్యార్థులలో డ్రగ్స్,మత్తు పానీయాల దుష్ఫలితాల పై సాంస్కృతిక కార్యక్రమాలను నవంబర్ 1వ తేదీన కర్నూల్ నుండి ప్రారంభించి 13 జిల్లాలలో పై కళాజాత నిర్వహించి లక్షలాది విద్యార్థిని, విద్యార్థులను చైతన్యవంతులను చేస్తామన్నారు. తన పదవీ కాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి లక్ష్మణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.రోటరీ క్లబ్ మాజీ గవర్నర్,గుంటూరు రెడ్ క్రాస్ చైర్మన్ వడ్లమాని రవి ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి గత నలభై సంవత్సరాలుగా సామాజిక రుగ్మతలపై నిరంతరం పోరాడుతున్నారని,1990 వ దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం,మద్య నియంత్రణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. మద్య నియంత్రణ ఉద్యమంలో రోటరీ క్లబ్ భాగస్వామ్యమౌవుతుందని  పేర్కొన్నారు. గుంటూరు రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి రక్తదాన ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా రక్తం కొరత ను తీర్చడానికి తన వంతు బాధ్యత గా కృషి చేస్తూ రెడ్ క్రాస్ కు తోడ్పాటును అందిస్తున్నారని,తన స్వగ్రామమైన కారుమంచి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి తో గత నలభై సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందని ప్రజా చైతన్య వేదిక,జనవిజ్ఞాన వేదిక,భారత జ్ఞాన విజ్ఞాన సమితి,జనచైతన్యవేదిక ల ద్వారా సదస్సులు,చర్చాగోష్టు లు,కళాజాత లను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు.మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ గా గత రెండు సంవత్సరాలుగా కళా బృందాల ద్వారా ఇంజనీరింగ్,యూనివర్సిటీ ప్రాంగణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థినీ,విద్యార్థులను జాగృతలను చేస్తున్నారని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్,రంగం కళా బృందం కార్యదర్శి రాజేష్, అవగాహన సంస్థ నేతలు  శేఖర్,కృష్ణ,రెడ్ క్రాస్ సంస్థ నేతలు రావి శ్రీనివాసరావు,సుబ్బారావులు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-10-10 11:20:51

సిఎం వైఎస్.జగన్ పర్యటన ఏర్పాట్లు పూర్తి..

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల తిరుపతి పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ప్రారంభోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ నెల 11వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా  తిరుపతిలో రూ 25 కోట్ల ఖర్చుతో నిర్మించిన  చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్సల ఆసుపత్రి  తాత్కాలిక భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు రూ 25 కోట్లతో దాత నిర్మించిన పైకప్పును,  అలిపిరి వద్ద మరో దాత రూ 15 కోట్లతో నిర్మించిన  గోమందిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం తిరుమల చేరుకుని గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. 12వ తేదీ మంగళవారం తిరుమలలో  దాత నిర్మించిన నూతన బూందీపోటును,  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ,హింది ఛానళ్లను ప్రారంభిస్తారనితెలిపారు. తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, టీటీడీ  జెఈవోలు  సదా భార్గవి, వీరబ్రహ్మం, వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, సిఎస్ఆర్ఎంఓ శేష శైలేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-10 11:18:32

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

మ‌హిళా సాధికార‌త ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్నార‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకొని కుటుంబాల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుకోవాల‌ని కాకినాడ ఎంపీ వంగా గీత‌, కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ల‌బ్ధిదారుల‌కు సూచించారు. వైఎస్సార్ ఆస‌రా రెండో విడ‌త సంబ‌రాల్లో భాగంగా ఆదివారం కాకినాడ అన్న‌మ్మ గాటీసెంట‌ర్ ప్రాంతంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని 20 నుంచి 29వ వార్డు వ‌ర‌కు గ‌ల ప‌ది వార్డుల ప‌రిధిలోని 1,075 స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు 6,94,01,231 రూపాయ‌ల మెగా చెక్‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న 31 ప‌థ‌కాల వివ‌రాల‌ను ఈ సంద‌ర్భంగా ఎంపీ వంగా గీత మ‌హిళ‌ల‌కు వివ‌రించారు. ఎమ్మెల్యే చంద్రేశేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ 2019, ఏప్రిల్ 11 నాటికి ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును నాలుగు విడ‌త‌ల్లో అందించే వైఎస్సార్ ఆస‌రా కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్పుడు రెండో విడ‌త సొమ్మును ఖాతాల్లో జ‌మ‌చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ప‌ది రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఆస‌రా సంబ‌రాల‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు. ఆస‌రా సొమ్మును ఇంటి నిర్మాణం లేదా సుస్థిర జీవ‌నోపాధి త‌దిత‌రాల‌కు ఉప‌యోగించుకోవాల‌ని ఎంపీ, ఎమ్మెల్యే ల‌బ్ధిదారుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి, డిప్యూటీ మేయ‌ర్‌-2 వెంక‌ట స‌త్య‌ప్ర‌సాద్‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, స్థానిక కార్పొరేట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-10 10:46:43