రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళ భద్రతకు ప్రవేశపెట్టిన దిశా యాప్ మహిళలకు గొప్ప వరం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు ఆదివారం జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ లో జరిగిన దిశా యాప్ అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి, నేరస్తులను త్వరితగతిన శిక్షించడానికి ముఖ్యమంత్రి మహిళకు భద్రత కల్పించాలనే సదుద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని రూపొందించారని చెప్పారు . ప్రస్తుత కాలంలో దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరగడంతో దేశంలో నిర్భయ చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో మహిళల రక్షణకు ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి దిశ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. అత్యాచారం జరిగిన ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో విచారణ చేపట్టి 21వ రోజున శిక్షపడేలా దిశా యాప్ పని చేస్తుందని అన్నారు. మహిళలపై సామాజిక మాధ్యమం లలో అసభ్యకరమైన పోస్టులు పెడితే రెండు సంవత్సరాల శిక్ష విధిస్తారని, తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తప్పు మరోసారి చేస్తే నాలుగు సంవత్సరాల శిక్ష విధించడంతో పాటు మరొకసారి తప్పుకు 10 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఇటీవల చిత్తూర్ లో ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం అలాగే విజయవాడలో చిన్నారి బాలిక పై అత్యాచారం చేసిన ఘటనలో దోషులకు ఉరి శిక్ష విధించడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 10 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ,వీటికి 40 మంది సిబ్బంది ని ఇచ్చినట్లు తెలిపారు. గతంలో కేసులు చాలా సంవత్సరాల వరకు విచారణ లో ఉండేవని ప్రస్తుతం దిశ ద్వారా 7 రోజుల్లో నేరస్తులను పట్టుకుని 14 రోజుల్లో విచారణ చేపట్టి, 21 రోజుల్లో శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం దిశా యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మన రక్షణ మన బాధ్యత ను మహిళలందరూ గుర్తించి దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. మహిళ లే కాకుండా పురుషులు కూడా దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు అందరికీ అన్ని రకాలభద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఆమె వెల్లడించారు. జగ్గంపేట నియోజకవర్గంలో దిశ యాప్ అవగాహన సదస్సు ఏర్పాటుకు సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటి ను మంత్రి అభినందించారు
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా)రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టడానికి దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలకు రక్షణ కల్పించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఐ జి మోహన్ రావు మాట్లాడుతూ లో దిశా యాప్ మహిళలకు భద్రతతో పాటు ధైర్యం కూడా కల్పిస్తుందని అన్నారు.
జిల్లా ఎస్పి ఎం రవీంద్ర బాబు మాట్లాడుతూ గతంలో అత్యాచారాలు జరిగినప్పుడు దోషులని పట్టుకోవడంలో జాప్యం జరిగేదని, ఈ యాప్ ద్వారా తక్కువ సమయంలో నేరస్తులను పట్టుకుని శిక్షపడేలా గా యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలందరూ తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో దిశ యాప్ డౌన్లోడ్ లో తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల సహకారంతో , ప్రజాప్రతినిధులతో లక్ష మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు
ఇంకా ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు ధనలక్ష్మి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షర్మిలారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హిమ శైలు జక్కంపూడి విజయలక్ష్మి , డ్రామా పిడి అడపా వెంకటలక్ష్మి, తదితరులు దిశ యాప్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముందు గండేపల్లి మండలం మురారి గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి హోంమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మల్లేపల్లి లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా సీడ్ బాల్స్, మొక్కలు హోంమంత్రి స్థానిక శాసనసభ్యులు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో మల్లి బాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, పెద్దాపురం డీఎస్పీ ఏ శ్రీనివాసరావు జిల్లా పోలీసు అధికారులు మాజీ శాసనసభ్యులు పంతం గాంధీ మోహన్ సర్పంచి కందుల చిట్టిబాబు నియోజకవర్గంలోని మహిళలు పోలీస్ సిబ్బంది ఈ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముందుగా అవగాహన సదస్సును మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం
అనంతరం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం లో రాజుపాలెం గ్రామం నుండి రామవరం గ్రామం వరకు 11కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సు చరిత, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు తో కలిసి శంకుస్థాపన చేశారు.