జీవిఎంసీ అన్నివార్డుల పరిధిలో మౌళిక వసతులు కల్పిస్తామని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. గురువారం ఆమె 5వ జోన్ 40వ వార్డు పరిధిలోని మల్కాపురం, ఎకెసి కోలనీ 1 & 2 పరిసర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ & మౌళిక వసతుల శాఖ (ఎపిఇడబ్ల్యూ & ఐడి కార్పోరేషణ్) చైర్మన్ మళ్ళ విజయప్రసాద్, వార్డు కార్పొరేటర్ జి. నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ సంయుక్తంగా మాట్లాడుతూ కాలనీలో అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తామని తెలిపారు. కాలనీలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, సచివాలయ వాలంటీర్లు ప్రభుత్వ సేవలు అందించడం వాటిపై స్థానిక ప్రజలును అడగగా, త్రాగు నీరు సమృద్ధిగా వస్తుందని, పారిశుధ్య సిబ్బంది ప్రతీరోజు చెత్త సేకరిస్తున్నారని, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలు వివరిస్తున్నారని తెలిపారు. ఎకెసి కోలనీలోని గెడ్డకిరువైపులా రీటైనింగ్ వాల్ నిర్మించాలని, ఎ.కె., ఎ.ఎస్.సి కొలనీలో సుమారు 436 రేకుల ఇళ్లలో ప్రజలు నివసిస్తున్నారని వారికి, వారికి ప్రభుత్వ స్కీము ఇళ్ళలో సదుపాయాలు కల్పించి ఆ ప్రదేశాలలో జి+3 ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నారు. ఎకెసి కోలనీ-1లో మెయిన్ రోడ్ నుండి ఇ.ఎస్.ఐ. హాస్పిటల్, అమ్మవారి గుడి వరకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ వారి భూమి ఖాళీగా ఉన్నందున వారితో మాట్లాడి ఆ స్థలాన్ని ఇప్పించిన యడల, అక్కడ ఉన్న ప్రజలకు మౌళిక సదుపాయాలు, ప్రధాన రహదారికి చేరుకోవాడానికి 2వ రహదారి నిర్మించవచ్చునని, గొల్లపాలెం వాణిజ్య సముదాయంలో బినామీలు ఉన్నారని, వైఎస్అర్ సిపి సమన్వయ కర్త, ఎపిఇడబ్ల్యూ & ఐడి కార్పోరేషణ్ చైర్మన్, కార్పొరేటర్ తెలపగా మేయర్, కమిషనర్ స్పందిస్తూ పైన తెలిపినవి పరిగణలోకి తీసుకుని వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రీటైనింగ్ వాల్ నిర్మాణమునకు అంచనాలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గొల్లపాలెంలో వాణిజ్య సముదాయాలలో బినామీలను కార్పొరేటర్ గుర్తించి వారి లేకుండా చూడాలని ఆదేశించారు. హాకర్స్ జోన్ క్రమబద్ధీకరణ చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఎకెసి కోలనీ-1లో శిధిలమైన భవనాలను గుర్తించి వాటిని మరమ్మతులు చేపట్టడానికి అంచనాలు తయారుచేసి, స్టాండింగ్ కమిటీలో పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొలనీలో ఉన్న బ్లాక్ లో అన్ని తనిఖీ చేసి వాటికి సెప్టిక్ ట్యాంక్ లు లేని యెడల వాటిని నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని సామాజిక బవనంపై సచివాలయ కార్యాలయం నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వహాక ఇంజినీర్లు చిరంజీవి, వెంకటరావు, రత్నాలరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధు కుమార్, ఎఎంఒహెచ్. డా. రాజేష్, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.