1 ENS Live Breaking News

జెర్సీ కోడెదూడలను వదిలిపెడితే చర్యలు..

పాలుతాగే జెర్సీ కోడెదూడలను రైతులు వదిలించుకోవాలన్న ఉద్దేశంతో వాటిని తొలి పావంచ దగ్గర విడిచిపెట్టడం మహాపాపమని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. సింహాచలం కొండకింద తాత్కాలిక షెల్టర్ లో ఉంచిన జెర్సీ, సంకరజాతి కోడెదూడలను మంత్రి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లి నుంచి లేలేత దూడలను వేరుచేయడం సరికాదని..  ఇకపై అలాంటివాటిని తీసుకొస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. సింహాచలం చుట్టుపక్కలా చెక్ పోస్టులు పెట్టి వాటిని ఎవరైనా తీసుకొస్తే వెనక్కి పంపాలని సూచించారు. జబ్బుతో ఉన్నవాటిని తీసుకురావడం మహో ఘోరమన్నారు. దేవునికి నైవేధ్యం పెట్టేటప్పుడే ఎంతో జాగ్రత్తగా ఉంటామని అలాంటిది మొక్కుబడులు తీర్చుకోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు సూచించారు. ఇంట్లో జబ్బుతో ఉన్నమనిషుంటే బయట పారేస్తామా అంటూ ప్రశ్నించారు.  గోవులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న మంత్రి గోవులను  కూడా రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. కాశీవెళ్లి గంగలో మునిగినప్పుడు మనకిష్టమైనవి వదిలేస్తామని కష్టమైనవికాదన్నారు. అలాంగే వదింలించుకోవాలనుకున్న సంకరజాతి, జబ్బుతో ఉన్న లేగదూడలను వదిలించుకోవడం సరికాదన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దేశవాళి ఆవులనే శ్రీ సింహాద్రి అప్పన్నస్వామికి మొక్కులుగా సమర్పించాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.  ముందుగా మనిషినని.. తర్వాత అప్పన్నస్వామి భక్తుడినని.. ఆ పైనే మంత్రినని చెప్పుకొచ్చారు అవంతి. గోవులు, దేవాలయానికి చెందిన ఏ విషయంపైనైనా స్పందిస్తానన్నారు.  గోవుల విషయంలో పోలీసు, దేవస్థానం, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు.  జెర్సీ కోడెదూలను విడిచిపెట్టరాదంటూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు.

Simhachalam

2021-08-18 14:11:43

అప్పన్నకు రూ.2.276లక్షలు విరాళం..

సింహాచలం శ్రీశ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న) స్వామి వారికి రాష్ట్ర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  కె.వెంకటేశ్వరావు రూ.2.276లక్షలు విరాళంగా సమర్పించారు. దాత తల్లిండ్రులు కొల్లా చిన్న, చిన్నమ్మడులు పేరిట అన్నదానం చేయాలని కోరారు. ఆ చెక్కును  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో చందన సమర్పణకు కలిపి ఆ మొత్తాన్ని సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకొని మొక్కలు తీర్చుకున్నారు. వీరితో పాటు మరికొందరు భక్తులు చందన, అన్నప్రసాదం కు విరాళాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హేమంత్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అలయ అర్చక స్వాములు పాల్గొని స్వామివారి పూజలు నిర్వహించారు.

Simhachalam

2021-08-17 16:14:13

థర్డ్ వేవ్ కి ముందస్తు చర్యలు చేపట్టండి..

కోవిడ్ మహమ్మారి మూడవ దశ వ్యాప్తికి ఇప్పటినుండే ప్రత్యేక చర్యలు చేపట్టాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జివిఎంసి సమావేశ మందిరంలో డా. జి. సృజనతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ విస్తృతంగా వ్యాక్సినేషన్ వేయించాలని, కోవిడ్ పరీక్షలు చేసి వ్యాధి సోకిన వారికి ప్రత్యేకమైన వైద్యం అందించాలని, జివిఎంసి పరిధిలో ఉన్న అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని, కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ అయిన రోగిని హాస్పిటల్ కి తరలించుటకు 108, 104 వాహనాలను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, వార్డుల వారీగా కంటైన్మేంట్ జోనులు ఏర్పాటు చేయాలని, బరియల్ గ్రౌండ్లో అందరికీ తెలిసే విధంగా దహనానికి అయ్యే ఖర్చులను నోటీస్ బోర్డ్ లో పెట్టాలన్నారు. జోనల పరిధిలోని హాస్పిటల్స్, వెంటిలేటర్లు, బెడ్డులను గతం కంటే అధికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హైపోక్లోరైట్, బ్లీచింగ్, శానిటైజర్లు వంటివి నిల్వ చేసుకోవాలని, సీజనల్ వ్యాధులు అయిన మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టాలని, అందుకు ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఫీవర్ సర్వే ఆపకుండా నిరంతరం సర్వే చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ ఎ.వి.రమణి, డి.ఎం.ఒ.హెచ్. డా. సూర్యనారాయణ, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి .శాస్త్రి, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, కోవిడ్ నోడల్ ఆఫీసరు డా. మురళి మోహన్, సిసిపి. విద్యుల్లత, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు,  పి.డి.(యు.సి.డి.) వై.ఎస్.ఆర్. శ్రీనివాస రావు, చీఫ్ వెటర్నరి డా. కిషోర్, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

GVMC office

2021-08-17 16:04:01

పెండింగు దరఖాస్తులను పరిష్కరించండి..

పెండింగు లో ఉన్న స్పందన గ్రీవెన్స్ దరఖాస్తుల సర్వీస్ రిక్వెస్ట్ ను వెంటనే పరిష్కరిం చాలని ముఖ్య మంత్రి కార్యదర్శి సోల్మన్ ఆరోగ్య రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి కార్యదర్శి, జాయింట్ కలెక్టర్లు, అందరు మున్సిపల్ కమిషనర్లతో,  “సిస్కో వెబెక్ష్”  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగు లో ఉన్న ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ఏ ఏ స్థాయిలో పెండింగు లో ఉన్నాయో, పరిశీలన చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు. అన్ని సంక్షేమ పధకాలు అందరికి సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సంక్షేమ పధకాలు ఆన్లైన్లలో పొందు పరిచే సమయంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా లేదా అని తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలియజేశారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన బదులిస్తూ జివిఎంసి పరిధిలోని పెండింగు లో ఉన్న అన్ని ఆర్జీలను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అని తెలియజేశారు.

GVMC office

2021-08-17 15:49:12

అల్పపీడనం పట్ల అప్రమత్తంగా ఉండలి..

అల్పపీడనం ఏర్పడడంతో రానున్న 2, 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జివిఎంసి కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె 3, 4వ జోన్ల పరిధిలోని పాండురంగా పురం, ఆర్. కె. బీచ్, ఫిషింగ్ హార్బర్, పాత పోస్టాఫీసు, ఇందిర ప్రియదర్శిని స్టేడియం రోడ్డు, కాన్వెంట్ జంక్షన్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనంతో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడా గెడ్డలు, కాలువలు పొంగకుండా వాటిలోని వ్యర్దాలను తొలగించాలని, కాలువలు శుభ్రంచేసిన వెంటనే కాలువలపై కప్పులు మూయాలని ఆదేశించారు. పాండురంగాపురం పరిధిలో కేబుల్ వైర్లు చాల చోట్ల అస్తవ్యస్తంగా కింద పది ఉన్నాయని, వీటిని వెంటనే తొలగించాలని, డిప్లోయ్మెంట్ ప్లాన్ ప్రకారం పారిశుధ్య కార్మీకులకు సర్దుబాటు చేసి, ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని శానిటరీ సూపర్వైజర్ను ఆదేశించారు. చాల చోట్ల, చెట్ల కొమ్మలు పడియున్నాయని,   బహిరంగ ప్రదేశాలలో చెత్త కుప్పలు అధికంగా కనిపిస్తున్నాయని వాటిని యుద్ద ప్రాతిపదికన తొలగించాలని, రాత్రిలు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసిన వాహనాలు కింద చెత్త అధికంగా ఉంటుందని, వాటిని శుభ్రం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాదికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శివప్రసాద్, కార్య నిర్వాహక ఇంజినీరు  చిరంజీవి, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-17 15:41:57

గాజువాక జర్నలిస్టులకు మద్దతుగా APUWJ

జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహారదీక్షకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ విశాఖ రూల్ కమిటీ  సంఘీభావం తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులను పరామర్శించింది. వారికి సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొంది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడలు పసుపులేటి రాము, రూరల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ బీఎల్ స్వామిలు పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులందరికీ పాత నిబంధనల ప్రకారమే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న మధ్య తరగతి పత్రికలకు జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పెద్ద పత్రికలు, మీడియా మాదిరిగా అన్ని రకాల పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ అడిక్రిడేషన్ కమిటీ సభ్యులు చంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు, గాజువాక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2021-08-17 15:25:42

ఆర్బీకేల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలి..

ఆర్ బి కె ల ద్వారా ఎరువులు, పురుగుమందులను రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో  కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖకు సంబందించి   ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, పంటల యొక్క స్థితిగతులపై మండల వ్యవసాయ అధికారులు   రోజు వారి జాగ్రత్తలపై రైతులకు  తెలియజేయాలని ఆదేశించారు. రైతుల పంటలకు సంబందించి  ఈ క్రాప్ బుకింగ్ ను  ఖచ్చితంగా నమోదు చేయాలని అదే విధంగా ఈ కె వై సి  కూడా త్వరితగతిన ముగించాలన్నారు. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.  రైతులకు ఆధునిక వ్యవసాయం పై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధకం, ఉద్యానవనం, మైక్రో ఇరిగేషన్, మత్స్యశాఖలలో జరుగుతున్న పనుల ప్రగతి పై కలెక్టర్ సమీక్షించారు.  ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, వ్యవసాయ శాఖ జె డి లీలావతి, పశుసంవర్ధకం, ఉద్యానవనం, మైక్రో ఇరిగేషన్, మత్స్యశాఖల జాయింట్ డైరక్టర్లు, ఇతర అధికారులు హాజరైయారు. 

Visakhapatnam

2021-08-17 14:50:33

హౌసింగ్ నిర్మాణ పనుల్లో పురోగతి పెరగాలి..

గృహనిర్మాణ పనులకు సంబంధించి ప్రతి వారం పురోగతి కనిపించాలని,  ఇంకా గ్రౌండింగ్ కాని గృహనిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ .డా. ఎ.మల్లిఖార్జున  సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  ప్రతి వారం నిర్వహించే సమీక్షలో భాగంగా  ఆయన మాట్లాడుతూ  జగనన్న  కాలనీల లే అవుట్లలో మౌళిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. బేస్ మెంట్ లెవెలింగ్, ఇంటర్నల్  రోడ్లు, బోర్ వెల్స్, నీటి సరఫరా, విద్యుత్తు తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. హౌసింగ్ ఇన్ స్పెక్టర్లు ఎప్పుటి కప్పుడు  క్షేత్ర స్థాయి తనిఖీలు చేయాలన్నారు.  లే అవుట్ లలో గృహాలు నిర్మించుకొనే విధంగా లబ్దిదారులను ప్రోత్సహించి  ప్రోగ్రస్ పెంచాలన్నారు.  లే అవుట్ లకు సంబందించి ఎక్కడైనా  వివాదాలు  ఉంటే  సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రూరల్ హౌసింగ్ కు సంబందించి ప్రతిపాదనలను వారాంతంలో గా పూర్తి చేయాలన్నారు.  ఇసుక, ఇనుము, సిమెంటు అవసరం మేరకు  ముందుగానే ఇండెంట్  పెట్టాలన్నారు.  మెటీరియల్ ను పెట్టడానికి గొడౌన్ లను సిద్దం చేసుకోవాలన్నారు. టిడ్కో గృహాలకు సంబందించి  మంజూరైన యూనిట్ లు అన్నింటికి మౌళిక వసతులను కల్పించాలన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ .గోవిందరావు,  హౌసింగ్, డ్వామా పిడిలు  ఎం . శ్రీనివాసరావు, సంధీప్, ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీ రాజ్, టిడ్కో  ఎస్ ఇ లు రవికుమార్, సుధాకర్ రెడ్డి, కుమార్, జి.వి.ఎం .సి, ఆర్ అండ్ బి,  ఇ పి డి సి ఎల్ శాఖల అధికారులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-08-17 14:49:43

కె.ఆశాలత అనే నేను.. సుడా అధ్యక్షునిగా..

శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ ఛైర్పర్సన్ గా కోరాడ ఆశాలత గుప్త మంగళ వారం ప్రమాణ స్వీకారం చేశారు. బాపూజీ కళామందిర్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి  ధర్మాన క్రిష్ణ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకులు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలకు గౌరవం కల్పించాలని ముఖ్య మంత్రి ఉద్దేశం అన్నారు. శ్రీకాకుళం నగరాన్ని చక్కగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. బాధ్యతాయుతంగా  ఉండాలని ఆయన పేర్కొన్నారు. అందరూ సమష్టిగా పనిచేద్దామని ఆయన కోరారు. ముఖ్య మంత్రి జిల్లాకు ప్రాధాన్యతను ఇచ్చి పదవులను వివిధ కులాలకు ఇచ్చారని ఆయన చెప్పారు. పేదల మనస్సుల్లో నిలిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. భావనపాడు పోర్టు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. 

కిడ్నీ ప్రాంతంలో కిడ్నీ రిసెర్చ్ కేంద్రం ఏర్పాటు, రూ. 7 వందల కోట్లతో శుద్ధ తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి బలమైన పునాది వేస్తున్నారని కృష్ణ దాస్ చెప్పారు. కౌలు రైతుకు రైతు భరోసా కల్పించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ సతీమణి ధర్మాన పద్మ ప్రియ, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రెడ్డిక  కార్పొరేషన్ ఛైర్పర్సన్ దుక్క లోకేశ్వర రెడ్డి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బల్లాడ హేమమాలిని రెడ్డి, కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అందవరాపు సూరి బాబు, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, వెలమ, పొందర, శ్రీశయన కార్పొరేషన్ చైర్ పర్సన్ ప్రతినిధులు పంగ బావాజీ నాయుడు, రాజపు అప్పన్న హైమవతి, చీపురు రాణీ కృష్ణమూర్తి, ఆరంగి మురళి, నగర కళింగ కోమటి మహిళ అధ్యక్షురాలు కిల్లంశెట్టి ధనలక్ష్మి, సురంగి మోహన రావు, కోణార్క్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
 

Srikakulam

2021-08-17 13:51:33

కార్పోరేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య..

విద్య అనే అస్త్రాన్ని ఉప‌యోగించి పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్త‌మ నాణ్యతా ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ బడుల రూపురేఖలను స‌మూలంగా మార్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సింగంశెట్టి ప్రభావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు-నేడు తొలిద‌శ‌ను ప్రజలకు అంకితం చేయడంతో పాటు రెండో దశ పనులను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాలల‌ పునఃప్రారంభం నేపథ్యంలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓ మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారంచుడుతున్నాం.. ఈరోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బ‌డులు తెరుచుకుంటున్నాయి.. కోవిడ్ తీవ్ర‌త వ‌ల్ల బ‌డులు ఇప్ప‌టి వ‌ర‌కు మూసిఉన్నాయి.. పిల్ల‌లు ప‌రీక్ష‌లు రాసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. డ‌బ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ సూచ‌న‌ల మేర‌కు ప్ర‌స్తుతం అన్ని విధాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ, కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ బ‌డులు తెరుస్తున్నాం. గ్రామ స‌చివాల‌యం యూనిట్‌గా తీసుకొని కోవిడ్ పాజిటివిటీ రేటు ప‌ది శాతం కంటే త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో పాఠ‌శాల‌ల‌ను తెరుస్తున్న‌ట్లు వివ‌రించారు. ఒక్కో గ‌దిలో 20 కంటే ఎక్కువ మంది లేకుండా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తామ‌ని, అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటే రోజువిడిచి రోజు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. టీచ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ దాదాపు పూర్త‌యింద‌న్నారు. 

ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌నూ కార్పొరేట్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ప‌ది మార్పులు ప్ర‌స్ఫుటంగా క‌నిపించేలా నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా ఆధునికీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఫ‌ర్నిచ‌ర్‌, స్వ‌చ్ఛ‌మైన తాగునీరు, అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు, కిచెన్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌, గ్రీన్ చాక్‌బోర్డ్ త‌దిత‌రాల‌ను నాణ్య‌త ప‌రంగా రాజీప‌డ‌కుండా ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 56 వేల‌కు పైగా పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్లు, జూనియ‌ర్ క‌ళాశాల‌లు త‌దిత‌ర విద్యాసంస్థ‌ల్లో రూ.16 వేల కోట్ల మేర ఖ‌ర్చుతో మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. మంచినీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించి పీహెచ్ స్థాయిని సైతం ప‌రీక్షించే ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామంటే ఏ స్థాయిలో సౌక‌ర్యాల క‌ల్ప‌న జ‌రుగుతోందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. ఏ నిర్ణ‌యం తీసుకున్నా చెల్లెమ్మ‌ల‌కు అన్న‌గా, అక్క‌ల‌కు త‌మ్ముడిగా.. పిల్ల‌ల‌కు మేన‌మామ‌గా ఆలోచించి తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేష‌న్ అనంత‌రం మంచి వేత‌నాల‌తో ఉద్యోగాలు ల‌భించేలా చేయాల‌నే ల‌క్ష్యంతో విద్యాసంస్థ‌ల‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని.. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, విద్యా కానుక, నాడు-నేడు, విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన వంటి ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండేళ్ల కాలంలో విద్యా రంగంలో ఈ విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మాల అమ‌లుకు దాదాపు రూ.32 వేల 714 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపారు. పిల్ల‌ల‌కు మ‌నం ఇవ్వ‌గ‌లిగే ఆస్తి విద్యేన‌ని.. వారిలో పోటీ త‌త్వాన్ని పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల వ‌ల్ల విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగింద‌ని పేర్కొన్నారు. పిల్ల‌లు డిగ్రీ లేదా ప్రొఫెష‌న‌ల్ కోర్సును చ‌ద‌వ‌డం అనేది ఓ హ‌క్కుగా అందించేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.

జ‌గ‌న‌న్న విద్యా కానుక కిట్ల ద్వారా పాఠశాల బ్యాగులు, ద్విభాషా పాఠ్య‌పుస్త‌కాలు, నోట్ పుస్త‌కాలు, వ‌ర్క్ బుక్స్‌, ఆక్స్‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీ, యూనిఫాం, బూట్లు, సాక్సులు వంటివి విద్యార్థుల‌కు అందిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. అయిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు బొమ్మ‌ల‌తో కూడిన డిక్ష‌న‌రీని అందిస్తున్నామ‌న్నారు. రెండేళ్ల కాలంలో జ‌గ‌న‌న్న విద్యాకానుక ప‌థ‌కం కోసం దాదాపు రూ.1380 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. నాణ్య‌త ప‌రంగా అత్యుత్త‌మంగా ఉండేవిధంగా చూస్తున్నామ‌న్నారు. గ‌తంలో చోటుచేసుకున్న లోపాల‌ను స‌వ‌రించి ప్ర‌స్తుతం రెండో విడ‌త కానుక‌ను అంద‌జేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇక‌పై పాఠ‌శాల‌ల‌ను ఆరు ర‌కాలుగా ఏర్పాటు చేస్తున్నామ‌ని.. అవి 1. శాటిలైట్ ఫౌండేష‌న్ స్కూల్స్‌, 2. ఫౌండేష‌న్ స్కూల్స్‌, 3. ఫౌండేష‌న్ స్కూల్స్ ప్ల‌స్‌, 4. ప్రీ హైస్కూల్స్‌, 5. హైస్కూల్స్‌, 6. హైస్కూల్ ప్ల‌స్‌గా వ‌ర్గీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఏఎస్ఈఆర్ స‌ర్వే ప్ర‌కారం మూడో త‌ర‌గ‌తి విద్యార్థులకు రెండో త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కాలు ఇవ్వ‌గా 22 శాతం మంది మాత్ర‌మే చ‌ద‌వ‌గ‌లిగార‌ని..  ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి అయిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు 18 స‌బ్జెక్టులు ఉంటే ఒకే టీచ‌ర్ అన్ని స‌బ్జెక్టుల‌ను బోధిస్తుండ‌టం వ‌ల్ల విద్యార్థుల‌కు స‌రైన విద్య అంద‌డం లేద‌ని పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయ‌, విద్యార్థి నిష్ప‌త్తి ప్ర‌మాణాల మేర‌కు లేద‌ని.. ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు విద్యార్థుల్లో నైపుణ్యాల‌ను పెంచేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలోనే పాఠ‌శాల వ్య‌వ‌స్థ‌ను ఆరు ర‌కాలుగా వ‌ర్గీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. కొత్త విధానంలో ప్ర‌తి స‌బ్జెక్టుకు ఓ టీచ‌ర్ అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న విద్యారంగ కార్య‌క్ర‌మాల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలను గ‌మ‌నిస్తే.. 2018-19లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు 37 ల‌క్ష‌ల 20 వేల మంది విద్యార్థులు ఉండ‌గా.. ప్ర‌స్తుతం ఆ సంఖ్య 43 లక్ష‌ల 43 వేల‌కు పెరిగింద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

అంతకు ముందు మొద‌టి ద‌శ నాడు-నేడు కార్య‌క్ర‌మంలో భాగంగా  పాఠశాలలో ఏర్పాటుచేసిన భవిత కేంద్రం, ఫిజియోథెరపీ, అదనపు తరగతి గదులు, గ్రంథాలయం, వంటశాల, డిజిటల్ తరగతి, మంచినీటి సరఫరా వ్యవస్థ తదితర సౌక‌ర్యాల‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు‌, రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ , రాష్ట్ర పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ త‌దిత‌రుల‌తో ముఖ్యమంత్రి పరిశీలించి విద్యార్థుల‌తో ముచ్చటించారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కలెక్టర్ సి.హరికిరణ్.. ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో జ్యోతిప్ర‌జ్వ‌ల‌న చేసి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల‌లు వేసి ముఖ్య‌మంత్రి నివాళులు అర్పించారు. 

పి.గన్నవరం

2021-08-16 15:06:24

నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి..

విశాఖజిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ది పధకాల పనులను  నిర్దేశించిన లక్ష్యాల మేరకు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  ఆర్ డబ్ల్యు ఎస్, డ్వామా, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమకు కేటాయించిన పనులపై అలసత్వం వహించకుండా భాద్యతగా పని చేయాలని  లేని పక్షంలో వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  జలజీవన్ మిషన్ ప్రోగ్రాంకు సంబందించి ఇంటింటికి కొళాయి కనెక్షన్ పనులను వేగవంతం చేయాలన్నారు. నాడు – నేడు పథకానికి సంబందించి  మొదటి ఫేజ్ లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.  పాఠశాలలో  అభివృద్ది పనులు , సమగ్ర శిక్ష పనులు, వై ఎస్ ఆర్ రూరల్, అర్బన్ క్లినిక్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.  డ్వామా కు సంబందించి పని దినాలను శత శాతం పూర్తి చేయాలని, జగనన్న కాలనీలలో  రోడ్ల నిర్మాణాలు, ప్లాంటేషన్ తదితర పనులను  శీఘ్రంగా  చేయాలని ఎ .పి ఓ లు ఎప్పటి కప్పుడు తనిఖీలను నిర్వహించి  లక్ష్యాలను సాధించాలన్నారు. పంచాయితీ రాజ్ పనులకు సంబందించి   అన్ని సి.హెచ్ సి, పి హెచ్ సి  ల నిర్మాణాలకు సంబందించి ఖర్చు అయిన బిల్లులను  అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత  అంశాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల ను త్వరగా పూర్తి   చేయాలన్నారు.  అదే విదంగా డిజిటల్ లైబ్రేరీల పనులను కూడా వేగవంతం చేయాలన్నారు.  నిర్మాణం పూర్తి అయిన  అంగన్వాడి భవనాలను వెంటనే అప్పచెప్పాలన్నారు.  ఈ సమావేశంలో  కలెక్టరేట్ నుండి జి.వి.ఎం .సి కమిషనర్ డా. జి.సృజన ,  ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ఎస్ ఇ లు, డ్వామా, మెప్మా పిడిలు ,  సమగ్ర శిక్ష, ఎల్ డి ఎంలు తదితర అధికారులు హాజరవ్వగా వీడియో కాన్పరెన్స్ ద్వారా   ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల కృష్ణ, మండల అధికారులు హాజరయ్యారు. 

Visakhapatnam

2021-08-16 15:01:17

విద్యాభివ్రుద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెద్దపీట..

నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి.. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లాలో నాడు నేడు మొదటివిడత ద్వారా రూ.312 కోట్ల నిధులుతో  1130 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చారు. రెండవ విడతలో భాగంగా జిల్లాలోని 1235 పాఠశాలల్లో పనుల ప్రారంభానికి ఈ సందర్భంగా మంత్రి శ్రీకారం చుట్టారు. మధురవాడలోని చంద్రంపాలెంలోని హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తుపై సీఎం దృష్టి సారించిన ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. దేశంలో అమ్మఒడి ద్వారా ఏడాదికి 15,000, పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చేసిన సీఎం జగన్ ఒక్కరే అని అన్నారు. 
జిల్లాకు మొదటి విడతలో 48 కోట్లు, రెండో విడతలో 60 కోట్లు కేటాయించారని అన్నారు. టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో ఎందరో విద్యార్థినులు స్కూల్స్ మానేయడం జరిగిందని.. వారి అవస్థలు గుర్తించిన ముఖ్యమంత్రి పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించారని అన్నారు.  ఇందుకు జగన్ కు ఉన్న మంచి మనసు కారణమని అన్నారు. 

పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులుకు పుస్తకాలు, కిట్లు, డిక్షనరీ  ఇవ్వడం అభినందనీయమని మంత్రి అన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఘనత సీఎంకు దక్కుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సువర్ణాధ్యాయం వస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాలో 40వేలు జాయినింగ్స్ పెరిగాయని అన్నారు.   ప్రైవేట్ స్కూల్స్ కంటే.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు.  వచ్చే మూడేళ్ళలో ఇక్కడకు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని మంత్రి అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జీవితంలో పైకి రావాలని అన్నారు. 

          జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.. 18 నెలలుగా జిల్లాలో నాడు-నేడు పనులు చేస్తున్నామని.. కరోనా సమయంలో కూడా పనులు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశామని అన్నారు. బ్లాక్ బోర్డు స్థానంలో గ్రీన్ బోర్డు, బెంచ్ లు, ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్స్.. ఇలా ఎన్నో మౌలిక వసతులు కల్పించామని అన్నారు. నాడు నేడులో భాగంగా చంద్రంపాలెం పాఠశాలను 1.25 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. ఏజెన్సీలో పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. జిల్లాలో 60కోట్లతో నాడు నేడు పనులు చేపట్టామని అన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని.. కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అన్నారు. టీచర్లకు వాక్సినేషన్ పూర్తయిందని అన్నారు. 

       జీవీఎంసీ చీఫ్ విప్, ఆరో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు  పాఠశాలల రూపురేఖలు మార్చడం దేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికె సాధ్యమైందని అన్నారు. 

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మంత్రి జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే అదీప్ రాజ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్లు మళ్ళ విజయ ప్రసాద్, కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, పిల్లా సుజాత,  కార్పొరేటర్లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Madhurawada

2021-08-16 14:46:10

వెంగమాంబకు ఘనంగా పుష్పాంజలి..

భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు సోమ‌వారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జ‌రిగిన వ‌ర్ధంతి ఉత్స‌వాలు ముగిశాయి. ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య కళామందిరంలో ముందుగా శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన  ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి,  కోనేరు ల‌క్ష్మీరాజ్యం బృందం సంగీత స‌భ, ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు తిరుపతికి చెందిన  పి.జ‌యంతి సావిత్రి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈఓ  విజయసారథి, తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత, సూపరింటెండెంట్  జి.నాగమణి, సీనియర్ అసిస్టెంట్  బి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-16 14:37:37

నాడు-నేడుతో పాఠశాల విద్యావ్యవస్తే మారిపోయింది..

మ‌న బ‌డి నాడు-నేడు, జ‌గ‌న‌న్న విద్యాకానుక ప‌థకాలతో భావిత‌రాల‌కు బంగారు భ‌విష్య‌త్తు సిద్ధిస్తుంద‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి ఆశాభావం వ్య‌క్తం చేశారు. వైకాపా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ద్వారా విద్యారంగంలో విప్లవాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటాయ‌ని పేర్కొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని డెంకాడ మండ‌లం ర‌ఘుమండ గ్రామంలో సోమ‌వారం జ‌రిగిన‌ మ‌న‌బడి  నాడు-నేడు, జ‌గ‌న‌న్న విద్యాకానుక ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌నూ కార్పొరేట్ పాఠ‌శాల‌కు దీటుగా అభివృద్ధి చేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని, ఆ దిశ‌గా ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింద‌ని పేర్కొన్నారు. గ‌త ప్రభుత్వ హయాంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయ‌ని, సుమారు ఆరు వేల పాఠ‌శాల‌లు మూత‌ప‌డ్డాయన్నారు. కానీ వైకాపా ప్ర‌భుత్వ హయాంలో విద్యావ్య‌వ‌స్థ‌ అభివృద్ధికి స‌మున్న‌త స్థానం ద‌క్కింద‌ని, రాష్ట్రంలో సుమారు ఆరు ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప్ర‌యివేటు పాఠ‌శాల‌లను వీడి ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో చేరారని గుర్తు చేశారు. పిల్ల‌ల‌కు మ‌న‌మిచ్చే విలువైన ఆస్తి చ‌దువే అని ఎప్పుడూ ముఖ్యమంత్రి అంటుంటార‌ని.. త‌ల్లిదండ్రులు ఈ మాట‌ను గుర్తు పెట్టుకొని పిల్ల‌ల చ‌దువుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. మ‌న‌బ‌డి నాడు-నేడు ప‌థ‌కంలో భాగంగా మొద‌టి ద‌శ ప‌నుల‌కు గాను రూ.278 కోట్లను రాష్ట్ర ప్ర‌భుత్వం జిల్లాకు కేటాయించింద‌ని పేర్కొన్నారు. సుమారు 1060 పాఠ‌శాలల్లో అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తులు క‌ల్పించామ‌ని గుర్తు చేశారు. ఇప్ప‌టి పిల్ల‌లు చాలా అదృష్టవంతుల‌ని.. మా చిన్న‌త‌నంలో చ‌దువులు నేల‌పై సాగేవ‌ని.. మ‌రుగుదొడ్లు ఉండేవి కావ‌ని.. భోజ‌నానికి రెండు కిలోమీట‌ర్ల మేర న‌డిచి వెళ్లి వ‌చ్చేవార‌మ‌ని ఆమె ప్ర‌స్తావించారు. కానీ ఈ రోజు మ‌న‌బ‌డి నాడు-నేడు ప‌థకంలో భాగంగా ప్ర‌తి పాఠ‌శాలా అద్భుతంగా రూపుదిద్దుకుంద‌ని, అన్ని ర‌కాల వ‌స‌తులు స‌మ‌కూరాయ‌ని వివ‌రించారు. అధునాతన‌ స‌దుపాయాలతో కూడిన త‌ర‌గ‌తి గ‌దులు, శుద్ధమైన తాగునీరు, భోజ‌న శాల‌లు, మ‌రుగుదొడ్లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని.. ఇదంతా వైకాపా ప్ర‌భుత్వ సాధించిన ఘ‌న‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లీషు మీడియం చ‌దువులు డ‌బ్బున్నోళ్ల‌కే అనే నానుడి ఉండేద‌ని.. ఇప్పుడు ప్ర‌తి పేదింటి బిడ్డ‌కూ ఇంగ్లీషు మీడియం చ‌దువు ఉచితంగా అందుతుంద‌ని పేర్కొన్నారు. పిల్ల‌ల ఆరోగ్యం దృష్ట్యా ప్ర‌భుత్వం సంపూర్ణ పోష‌ణ‌, సంపూర్ణ పోష‌ణ + ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని గుర్తు చేశారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా ఉప ముఖ్య‌మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు మ‌న‌బ‌డి నాడు-నేడు ప‌థ‌కంలో భాగంగా ర‌ఘుమండ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగిన అభివృద్ధి ప‌నుల‌ను, ఫోటో ఎగ్జిబిష‌న్ ను, ఆధునికీక‌రించిన భోజ‌న శాల‌ను, అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్వో వాట‌ర్ ప్లాంట్‌ను ప‌రిశీలించారు. 

అనంత‌రం డీఈవో విద్యారంగంలో జ‌రిగిన అభివృద్ధి నివేదిక‌ను చ‌దివి వినిపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం జిల్లాకు రూ.278 కోట్లు కేటాయించింద‌ని, మొద‌టి ద‌శ‌లో 1060 పాఠ‌శాల‌ల అభివృద్ధికి సంక‌ల్పించ‌గా ప్ర‌స్తుతానికి 990 పాఠ‌శాల‌ల్లో ప‌నులు పూర్త‌య్యాయ‌ని, మిగిలిన వాటిని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేస్తామ‌ని తెలిపారు. రెండో ద‌శ‌లో భాగంగా 884 పాఠ‌శాల‌లను ఆధునికీక‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అలాగే జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా 2.26 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు కిట్ల‌ను పంపిణీ చేశామ‌ని వివ‌రించారు. గ‌త విద్యా సంవ‌త్స‌రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 10,784 మంది విద్యార్థులు ప్ర‌యివేటు పాఠ‌శాల‌లను వీడి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేరార‌ని వివ‌రించారు. పాఠశాల‌ల్లో ఇంగ్లీషు ల్యాబ్‌లు, ఇత‌ర 9 ర‌కాల వ‌స‌తుల‌ను క‌ల్పించామ‌ని పేర్కొన్నారు. అలాగే జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం ద్వారా 1.94 ల‌క్ష‌ల మందికి పౌష్టికాహారం అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా జిల్లాలో 2.50 ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూరింద‌ని గుర్తు చేశారు.

జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి మాట్లాడుతూ మ‌న‌బ‌డి నాడు - నేడు ప‌థ‌కం చ‌రిత్ర‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని పేర్కొన్నారు. ఆడ‌పిల్ల‌ల చ‌దువుకు త‌ల్లిదండ్రులు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. మూఢ‌న‌మ్మ‌కాల‌ను, అపోహ‌ల‌ను విడ‌నాడాల‌ని క‌నీసం డిగ్రీ వ‌ర‌కైనా చదివించాల‌ని సూచించారు. 

ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖర్ మాట్లాడుతూ విద్యారంగంలో స‌మూల మార్పులకు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింద‌ని, దీని వ‌ల్ల పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మ‌ధ్య‌వ‌ర్తులు, ద‌ళారీలు లేని పాల‌న అందుతోంద‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు.

నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఆధ్వ‌ర్యంలో నేడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధి ప‌నుల‌ను వివ‌రించారు. రూ.50 లక్ష‌ల‌తో ర‌ఘుమండ‌ జిల్లా పరిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో చేప‌ట్టిన‌ అభివృద్ధి ప‌నుల వ‌ల్ల రూపురేఖ‌లు మారిపోయాయ‌న్నారు. అధునాత‌న స‌దుపాయాల‌తో కూడిన త‌ర‌గ‌తి గ‌దులు, భోజ‌న శాల‌, మ‌రుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయ‌ని గుర్తు చేశారు. ఈ అవ‌కాశాన్ని విద్యార్థులు వినియోగించుకొని బాగా చ‌దువుకోవాలని, ఐఎస్‌లు, ఐపీఎస్‌లు కావాల‌ని, ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ‌, స్థానిక ప్ర‌జాప్రతినిధులు, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ప‌థ‌కాల‌పై వారి అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. 

ప‌థ‌కాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఆహుతుల‌ను అల‌రించాయి. చివ‌రిగా జ‌గ‌న‌న్న విద్యాకానుక కిట్ల‌ను అతిథుల చేతుల మీదుగా విద్యార్థుల‌కు పంపిణీ చేశారు.

కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు సురేష్ బాబు, పాక‌లపాటి ర‌ఘువ‌ర్మ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఆర్. మ‌హేష్ కుమార్‌, డీఈవో జి. నాగ‌మ‌ణి, ప్ర‌త్యేక అధికారి, డీఎస్‌వో పాపారావు, స‌మ‌గ్ర శిక్షా అభియాన్ ఏపీసీ కీర్తి, ఆర్డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, ర‌ఘుమండ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల హెచ్‌.ఎం. సౌభాగ్య ల‌క్ష్మి, పాఠ‌శాల విద్యా క‌మిటీ ఛైర్మ‌న్‌, డీసీసీబీ ఛైర్మ‌న్‌, స్థానిక స‌ర్పంచు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, తదిత‌రులు పాల్గొన్నారు.

Nellimarla

2021-08-16 14:29:34

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు రండి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల అభివృద్దికి, కొత్త ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు జిల్లా యంత్రాంగం సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తుంద‌ని క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి హామీ ఇచ్చారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం, లేదా ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను విస్త‌రించ‌డం ద్వారా మ‌రింత మందికి ఉపాది క‌ల్పించాల‌ని ఆమె కోరారు. సామాజిక కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.  జిల్లాలోని వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌రేట్ లో సోమ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు విస్తృత‌మైన అవ‌కాశాలున్నాయ‌ని చెప్పారు. ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి ఎవ‌రు ముందుకు వ‌చ్చినా, సింగిల్ విండో విధానం ద్వారా అనుమ‌తిస్తామ‌ని అన్నారు. వారికి కావాల్సిన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డ‌మే కాకుండా, అవ‌స‌ర‌మైన నైపుణ్యం గ‌ల కార్మికుల‌ను అందించ‌డానికి కూడా సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు. దీనికోసం యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసి, స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్ కార్మికుల‌ను త‌యారు చేస్తామ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదురైనా, త‌మ దృష్టికి తీసుకువ‌స్తే, ప‌రిష్క‌రిస్తామ‌ని అన్నారు. రాయ‌పూర్‌-విశాఖ‌ప‌ట్నం గ్రీన్‌ఫీల్డు హైవే పూర్త‌యితే, ర‌వాణాకు ఎంతో సుల‌భం అవుతుంద‌ని, దూరం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని చెప్పారు. వీటిన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప‌రిశ్ర‌మల స్థాప‌న‌కు ముందుకు రావాల‌ని సూచించారు. సామాజిక బాధ్య‌త క్రింద జిల్లాలోని పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రుల‌ను అభివృద్ది చేయాల‌ని, వాట‌ర్ హార్వెస్టింగ్ క‌ట్ట‌డాల నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని పారిశ్రామిక వేత్త‌ల‌ను కోరారు. కోవిడ్ నియంత్ర‌ణ‌లో పారిశ్రామిక వేత్త‌లు భాగ‌స్వాములు కావాల‌ని, పాఠ‌శాల‌ల‌కు మాస్కులు, శానిటైజ‌ర్లు అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

         జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ముఖ్యంగా ప‌ర్యాట‌క రంగాభివృద్దికి ఎంతో అవ‌కాశం ఉంద‌న్నారు. ఎస్‌.కోట‌, బొడ్డ‌వ‌ర‌, సాలూరు, పార్వతీపురం, పూస‌పాటిరేగ‌, భోగాపురం  లాంటి చోట్ల ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుంద‌ని సూచించారు. జిల్లాలో ప‌ర్యాట‌క ప్రాజెక్టుల స్థాప‌న కోసం బ‌య‌ట ప్రాంతాల‌నుంచి పారిశ్రామిక‌వేత్త‌లు ఆస‌క్తి చూపిస్తున్నారని, జిల్లాలోని పారిశ్రామిక వేత్త‌లు కూడా దీనిపై దృష్టి పెట్టాల‌ని కోరారు. కోవిడ్ స‌మ‌యంలో జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌లు అందించిన స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని అభినందించారు. ఇక‌ముందు కూడా ఇదే స‌హ‌కారాన్ని అందించి, త‌మ సామాజిక బాధ్య‌త క్రింద జిల్లా అభివృద్దిలో భాగ‌స్వాములు కావాల‌ని జెసి కోరారు.  ఈ స‌మావేశంలో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌సాద‌రావు, స‌హాయ సంచాల‌కులు సీతారామ్‌, వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-16 14:27:39