1 ENS Live Breaking News

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు..

విశాఖ జిల్లాలో ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియాలకు చెందిన అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్లు మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ ఎ. మ‌ల్లిఖార్జున సంబంధింత అధికారుల‌ను ఆదేశించారు.  జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ స‌మావేశం శ‌నివారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో ఆయ‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. దీనిలో భాగంగా ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో. నెం.142లో పేర్కొన్న నిబంధ‌న‌లు, అర్హత‌ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ముందుగా ఆన్‌లైన్ ప్ర‌క్రియ ద్వారా స్వీక‌రించిన ద‌ర‌ఖాస్తులు, ప‌రిశీల‌న ప్ర‌క్రియ గురించి స‌మాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాల‌కులు వి. మ‌ణిరామ్‌ క‌మిటీకి వివ‌రించారు. కొంత‌మంది అర్హ‌త క‌లిగిన‌ప్ప‌టికీ సంబంధిత ప‌త్రాలు ఆన్‌లైన్లో స‌మ‌ర్పించ‌లేద‌ని క‌మిటీకి తెలిపారు. దీనిపై స్పందించిన క‌లెక్ట‌ర్‌, క‌మిటీ ఛైర్మ‌న్ వారంద‌రికీ త‌గిన స‌మ‌యం ఇచ్చి సంబంధిత ధృవ‌ప‌త్రాలు స‌మ‌ర్పించుకోమ‌ని చెప్పాల‌ని స‌మాచార శాఖ అధికారుల‌కు సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్‌, క‌మిటీ ఛైర్మ‌న్ ఎ. మ‌ల్లిఖార్జున మాట్లాడుతూ తొలి రెండు జాబితాల్లో క‌లిపి మొత్తం 474 మంది అక్రిడిటేష‌న్ల‌కు అర్హ‌త సాధించార‌ని పేర్కొన్నారు. రెండు ద‌ఫాల్లో కలిపి ప‌త్రికా రంగానికి సంబంధించి 291 మందికి, ఎల‌క్ట్రానిక్ మీడియాకు సంబంధించి 183 మందికి అక్రిడిటేష‌న్ల మంజూరు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. మిగిలిన వారు నిర్ణీత గ‌డువులోకా సంబంధిత ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. త‌దుపరి స‌మావేశం ఆగ‌స్టు 20వ తేదీన నిర్వ‌హించ‌నున్నామ‌ని ఈ లోగా అర్హ‌త ఉండి కూడా సరైన ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించని వారు నిర్ణీత గ‌డువులోగా సంబంధిత ప‌త్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. వారి ద‌ర‌ఖాస్తులు ప‌రిశీలించి త‌దుపరి స‌మావేశంలోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని స‌మాచార శాఖ ఉప సంచాల‌కుల‌కు సూచించారు. స‌మావేశంలో అక్రిడిటేష‌న్ క‌మిటీ మెంబ‌ర్ క‌న్వీన‌ర్‌, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాల‌కులు వి. మ‌ణిరామ్‌, స‌భ్యులైన డీఎం&హెచ్‌వో పి.ఎస్. సూర్య‌నారాయ‌ణ‌, హౌసింగ్ పీడీ శ్రీ‌నివాస‌రావు, ఏపీఎస్ ఆర్టీసీ రీజన‌ల్ మేనేజ‌ర్ బి. అప్ప‌ల‌నాయుడు, అసిస్టెంట్ లేబ‌ర్ కమిష‌న‌ర్ సునీత‌, ఏసీటీవో పి. శ్వేత, స‌మాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇంజినీర్ ఇంద్రావ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-07 15:26:07

సీఎంను అభినందించిన ఎంపీడీవోలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని జిల్లా ఎంపీడీవోల సంఘం అభినందించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో దీర్ఘకాలికంగా ప్రమోషన్లపై ఉన్న పరిస్థితిని తొలగిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా, ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉందని, సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందేలా కృషిచేస్తామని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. 
గ్రూప్-1 ద్వారా నియమితులైన ఎంపీడీవోలు, గడిచిన 25 సంవత్సరాల నుంచి ఒక్క పదోన్నతికి నోచుకోకుండా పడుతున్న మనోవేదనను అర్థం చేసుకుని, పదోన్నతికి అడ్డంకిగా ఉన్న సమస్యను వన్ టైం సెటిల్మెంట్ (One Time Measure) విధానం ద్వారా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్ మోహన్ రెడ్డి,  పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ లకు జిల్లా ఎంపిడీవోల సంఘం ధన్యవాదాలను తెలియజేసింది.

ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ద్వారా పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగి, ఎంపిడీవో మొదలుకొని దిగువ స్థాయిలోని పన్నెండు కేడర్లకు చెందిన వేలాది మంది పంచాయతీ రాజ్ ఉద్యోగుల పదోన్నతి అవకాశాలు మెరుగుపడటం పట్ల ఎంపిడీవోలు, పంచాయితీ రాజ్ ఉద్యోగులు హర్షాతిరేకాలను వ్యక్తం చేసారు. దీని ద్వారా జిల్లా పరిషత్ సిఈఓ, డిప్యూటీ సిఈఓ, డివిజనల్ అభివృధ్ధి అధికారులు వంటి వివిధ రకాల పోస్ట్ లు రెగ్యులర్ బేసిస్ లో భర్తీ కానున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో న్యాయం చేసిన ముఖ్యమంత్రి,  పంచాయతీ రాజ్ మంత్రి, జిల్లా మంత్రులకు ప్రత్యేక  ఎంపీడీఓల సంఘం తెలియ జేసింది. ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు యం.రోజారాణి, రాష్ట్ర సంఘం సభ్యులు హేమసుందర్, కిరణ్ కుమార్, విద్యాసాగర్ , వెంకటరమణ మరియు జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Srikakulam

2021-08-07 15:21:31

పొందూరు ఖ్యాతి మరింత పెంచాలి..

పొందూరు ఖ్యాతి మరింత పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పొందూరులో చేనేత దినోత్సవ కార్యక్రమంలో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర  ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియను సీతారామన్ పరిశీలించారు. 50 నేత విధానాన్ని పరిశీలించారు. ఖాదీ వడికే విధానం, చరఖాలను ఏర్పాటు చేశారు.  ఖాదీ భవనం శిథలావస్థలో ఉండటం వలన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటి మొక్కల ప్రశస్తిని తెలిపారు. మహాత్మ గాంధి పొందూరు ఖాదీ నాణ్యత పట్ల ఎంతో ఆసక్తి చూపారని అన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఖాదికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఖాదీ బాగుపడాలనీ పిఎం చాలా పథకాలు ప్రకటించారను ఆమె అన్నారు. పిఎం జాతీయ చేనేత దినోత్సవంను జరుపుకునే ఏర్పాట్లు చేశారనీ అన్నారు. 2014 సంవత్సరంలో రూ.9 వేల కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18 వేల కోట్లకు పెరిగిందని ఆమె వివారించారు. ఖాదీకి చాలా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. అయితే కార్మికులకు గిట్టుబాటు ధరలు లేదని ఆమె పేర్కొంటూ మెగా హండ్లుమ్ క్లస్టర్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. 

రాష్ట్రంలో మంగళగిరిలో ఒక క్లస్టర్ వచ్చిందని, పొందూరులో సంఖ్య తక్కువగా ఉండటంతో  క్లస్టర్ ఏర్పడలేదని గ్రహించామని చెప్పారు. పొందూరు లో క్లస్టర్ ఏర్పాటుకు టెక్స్ టైల్ మంత్రి తో మాట్లదాడుతామని మంత్రి తెలిపారు. ముద్ర లోన్ ల ద్వారా అనే రంగాలకు రుణాలు ఇవ్వవచ్చనీ, ప్రతి బ్యాంకు బ్రాంచ్ ద్వారా స్టాండ్ అప్ లోన్ ఇవ్వాలని ఆమె వివరించారు. 5 మంది  చేనేత కారులు పొందూరు లో ఉన్నారనీ వారికి రుణాలు మంజూరు చేయడం ద్వారా ప్రోత్సహించాలని ఆదేశించారు. పొందూరు మరియు చుట్టు ప్రక్కల అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారని వారికి నాబార్డు బ్యాంకు, లీడ్ బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.  మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. బ్యాంకుల ద్వారా ఎంత మంది కార్మికలకు రుణాలు ఇచ్చారో బ్యాంకులు మరోసారి ఏర్పాటు చేసే ప్రదర్శనలలో పెట్టాలని కోరారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వ తేదీ నాటికి 50 శాతం రుణాలు పెంచాలనీ బ్యాంకులను ఆదేశించారు. జేమ్ - ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు అమ్మకాలకు మంచి ప్లాట్ ఫారం అని దానిలో పొందూరు ఖాదీ నీ చేర్చాలని జిల్లా కలెక్టర్ ను సూచించారు. పొందూరు పేరెన్నిక గల ప్రదేశం అని, అందరికి మనసులో పొందూరు ఉందని అన్నారు. పొందూరు గ్రామంలో గడపడం ఆనందంగా ఉందనీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పలువురు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసారు. ప్రదర్శనలను పరిశీలించారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ  పొందూరు ఖద్దరు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్య్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. సూర్యోదయం నుండి శ్రమించే శ్రామికులు ఉన్నారని ఆయన పేర్కొంటూ చేనేత, ఖాదీనీ ప్రోత్సహించాలని కోరారు.  రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నూలు పోగుతో సాంస్కృతిక బంధం ఉందన్నారు. గాంధీజీ తన కుమారుడిని పొందూరు పంపించి నాణ్యతను పరిశీలించనున్నారు. ప్రతిభా పాటిల్ కూడా ఇక్కడి వస్త్రాలను ధరించేవారు. బిల్ క్లింటన్ సైతం ఖాదీ వస్త్రాలు చూసి మురిసి పోయారని చెప్పారు. నేతన్నకు ఆదాయం లేక, తగిన వసతి లేక నిరాశ నిస్పృహలకు లోను అవుతున్నారని చెప్పారు. ఖాదీనీ నిర్లక్ష్యం చేస్తే సంస్కృతికి చెదలు పట్టినట్లే అని ఆయన వివరించారు. ఖాదీ ఫర్ నేషన్ , ఖాదీ ఫర్ ఫేషన్ గా చేసుకోవాలని పిలుపు నిచ్చారు. నేతన్నలకు ఆర్థిక సహాయంను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఖాదీ అభివృద్ధి సంస్థకు వై.యస్. ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందించామని తెలిపారు. 

ఖాదీ అభివృద్ధికి సహకరించాలని, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సామర్థ్యం పెంపు చేయాలని, ఆధునాతన పరికరాలు అందజేయాలని కోరారు. పొందూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పొందూరు ఖాదీ ఒక సాంప్రదాయం, సంస్కృతి అన్నారు. జియోగ్రాఫికల్ ఐడెన్ ఐడెంటిటి కల్పించాలన్నారు.  జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమం ఆధారంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖాదీ ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఆర్థిక సహాయక కార్యక్రమాలను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయం విధానం ద్వారా పారదర్శకంగా సామాజిక ఆడిట్ సాగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక మార్పు రాగలదని భావిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పార్లమెంట్ సభ్యులు జి.వి.ఎల్. నరసింహా రావు,  బెల్లం చంద్రశేఖర రావు, శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, శాసన సభ్యులు గొర్లే కిరణ్ కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశ్ కౌశిక్, సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, ఆర్. శ్రీరాములు నాయుడు, వివిధ బ్యాంకుల సిఎండిలు తదితరులు పాల్గొన్నారు.


Srikakulam

2021-08-07 14:35:25

కేంద్ర ఆర్థిక మంత్రికి ఘన స్వాగతం..

కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి భవనానికి ముందుగా ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జి.వి.ఎల్. నరసింహా రావు,ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్, దువ్వాడ శ్రీనివాస్,ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, వీవర్స్ సెల్ రాష్ట్ర సభ్యులు బండారు జై ప్రతాప్ కుమార్,కేంద్ర అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్,ఖాదీ గ్రామ పరిశ్రమ కమీషన్ ఆర్ధిక సలహాదారు ఆషిమా గుప్త,జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్,  ఎస్.పి అమిత్ బర్దార్,టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు కేంద్ర మంత్రికి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ఆవరణలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలను, నూలు మాలను వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో ఖాదీ పరిశ్రమ సంచాలకులు ఎస్.రఘు, సౌత్ జోన్ డిప్యూటీ సి.ఇ. ఓ ఆర్.ఎస్.పాండే,బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి.కె.ప్రసాదరావు, కార్యదర్శి దండ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ రేగిడి లక్ష్మి , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-07 14:30:01

23శాతం జివిఎంసీ విద్యార్ధులకు ఏ గ్రేడ్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెందిన పాఠశాలలోని 10వ తరగతి విద్యార్ధినీ, విద్యార్ధులు అత్యధిక సంఖ్యంలో ఏ గ్రేడ్ సాధించారని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు తెలియజేశారు. ఈమేరకు శనివారం ఆయన తన చాంబర్ లో మీడియాతో మాట్లాడారు. 2020-21వ సంవత్సరానికి 2367 మంది విద్యార్ధులు  హాజరు కాగా వారిలో 544 మంది విధ్యార్ధులకు 10 జి.పి. “ఎ” గ్రేడ్ సాధించారని, ఇది 23శాతం ఉందని  ఇంత మంది విద్యార్ధులకు 10 జి.పి. “ఎ” గ్రేడ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ ద్వారా విద్యార్ధులకు విద్యాబోధన మాత్రమే జరిగిందని.. ఆ విషయంలో జివిఎంసీ ఉపాధ్యాయులు ఎంతో శ్రమించారని అన్నారు. ఈ సందర్భంగా వారిని కూడా అదనపు కమిషనర్   అభినందించారు.         

విశాఖ సిటీ

2021-08-07 14:26:12

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి..

ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌పై స‌త్వ‌ర‌మే స్పందించి త్వ‌రిత‌గ‌తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. మ‌ల్లిఖార్జున గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల‌ను ఆదేశించారు. స్థానిక 28వ వార్డులోని వెంక‌టేశ్వ‌ర‌మెట్ట -1,2 స‌చివాల‌యాల‌ను ఆయ‌న శ‌నివారం ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ఉద్యోగుల ప‌నితీరు, హాజ‌రు ప‌ట్టీ, ఇత‌ర రికార్డుల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌యాల్లో సాంకేతిక ప‌రిక‌రాలు అవ‌స‌రం ఉంద‌ని అక్క‌డ సిబ్బంది క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకు రాగా సంబంధిత అధికారుల‌తో మాట్లాడి అక్క‌డిక‌క్క‌డే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. సచివాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ సేవ‌లందించాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. రైస్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను నిర్ణీత గ‌డువులోగా జారీ చేయాల‌ని సూచించారు. ప‌నితీరులో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. అనంత‌రం స‌చివాల‌య ఆవ‌ర‌ణ‌లో క‌లెక్ట‌ర్ మొక్క‌లు నాటి, నీరు పోసి వాటికి ర‌క్ష‌ణ క‌వ‌చాలు ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మంలో ఆయ‌న వెంట ఫోర్త్ జోన్‌ క‌మిష‌న‌ర్ బి.వి. ర‌మ‌ణ‌, ప్ర‌త్యేక అధికారి సీహెచ్‌. పార్వ‌తి, 33వ వార్డు కార్పొరేట‌ర్ బి. వ‌సంత‌ల‌క్ష్మి త‌దిత‌రులు ఉన్నారు.

విశాఖ సిటీ

2021-08-07 14:13:16

జిల్లాలో 103 కేంద్రాల్లో వాక్సినేషన్..

విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకూ కోవిడ్ వాక్సిన్ వేయించుకోని వారి కోసం జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి వెల్లడించారు. జిల్లాలోని 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 103 ప్రదేశాల్లో ఉదయం 8-00 గంటల నుంచి వాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే టీకాయే ముఖ్యమని అందువల్ల కోవిడ్ టీకాలు తీసుకొని వారంతా తప్పనిసరిగా ఈ కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా వాసులను కోరారు. 

Vizianagaram

2021-08-07 14:11:48

జిల్లా అభివ్రుద్ధికి కలసికట్టుగా పనిచేయాలి..

ప్రజా సమస్యల పరిష్కారానికి  జిల్లా సమీక్షా సమావేశం చక్కని వేదిక అని, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టి గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు.  కలెక్టరేట్   ఆడిటోరియం లో శనివారం జిల్లా ఇంచార్జ్ మంత్రి   అధ్యక్షతన జిల్లా  సమీక్షా సమావేశం జరిగింది.  వ్యవసాయం , నీటిపారుదల, కోవిడ్, హౌసింగ్ , ఉపాధి హామీ తదితర అంశాల పై  జిల్లా సమీక్షా సమావేశం లో  చర్చించారు.  ఈ సందర్భంగా  ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ  సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువుగా పాలన  అందిస్తూ సంక్షేమ పధకాలను పారదర్శకంగా ప్రజలకు అందించడం జరుగుతొందన్నారు.  సంక్షేమ పధకాల అమలులో జిల్లా ప్రధమ స్థానం లో ఉండడం ఆనందంగా ఉందని,    సమీక్షా సమావేశం లో ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి  ఆమోదయోగ్యమైన  చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.
          ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ  తోటపల్లి ప్రాజెక్ట్  నిర్వాశితులకు పునరావాస ప్యాకేజి త్వరగా అందేలా చూడాలని అధికారులను కోరారు.  నీటి పారుదల, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా ఆర్ అండ్ ఆర్  చెల్లింపుల పై బాధ్యత తీసుకొని ఆలస్యం కాకుండా చెల్లింపులు చేయాలనీ సూచించారు.  ప్రభుత్వం నుండి   రైతుకు అందే లాభాలన్నీ ఈ  క్రాప్ నమోదు ద్వారానే అందుతున్నాయని,  సచివాలయాల్లో ఈ-క్రాప్ నమోదు సక్రమంగా జరగడం లేదని తన దృష్టికి వచ్చిందని, వ్య్వవసాయ అధికారులకు, సచివాలయ సిబ్బందికి మధ్య సమన్వయం లోపం లేకుండా చూడాలని  అన్నారు.   వికలాంగ పించన్ల ను ఎలాంటి సమాచారం  లేకుండా రద్దు చేసేసారన, అర్హులైన వారందరికి పునరుద్ధరించాలని కోరారు.  ఈ సందర్భంగా శాసన సభ్యులు కోలగట్ల వీర భద్ర స్వామి, రాజన్న దొర కలుగ చేసుకొని తమ పరిదిలోనున్న పించన్లు కూడా చాల వరకు రద్దు చేసారని , అందులో అర్హులైన వారు కూడా ఉన్నారని అన్నారు. . సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్ మాటలాడుతూ వికలాంగుల పించన్ 3 వేలు అందుకుంటున్న వారిలో  కొంత మంది దీర్ఘ కాలిక  వ్యాధుల పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అందువల్ల వారికీ డూప్లికేట్ ఐ.డి కార్డులు  వచ్చాయని, అందువలన పించన్ రద్దు అయ్యిందని వివరించారు.  అయతే  తను సెర్ప్ అధికారులతో మాట్లాడానని, జాబితాలను రీవెరిఫై చేస్తున్నామని , అర్హులైన వారందరికి సెప్టెంబర్ నెల నుండి పించన్ వస్తుందని వివరించారు.  మంత్రి  బొత్స   స్పందిస్తూ     నియోజకవర్గం వారీగా జాబితాలను పునః పరిశీలన చేసి సంబంధిత శాసన సభ్యులకు  సమాచారం అందించాలని సూచించారు.  అనర్హులను జాబితా లోచేర్చి, అర్హులకు మంజూరు చెయ్యడం లో  నిర్లక్ష్యంగా వ్యవహరించిన  వారి పై  చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసారు.  అనర్హులైన వారు ఎందుకు అనర్హులో స్పష్టంగా కారణాలను కూడా పెర్కొనా లన్నారు.
       పురపాలక , పట్టాణాభివృద్ధి శాఖా మంత్రి   బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  ప్రస్తుతం జిల్లాలో వర్ష పాతం  మైనస్ 22 శాతం  నమోదైన దృష్ట్యా  వర్షాభావ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని, అందుకు ప్రత్యామ్నాయ  ప్రణాళిక తో సిద్ధంగా ఉండాలని వ్యవసాయ , నీటి పారుదల అధికారులకు సూచించారు.  ఈ నెలలో కూడా వర్షం పడక పోతే  వరి నారు  కోసం స్వంతంగా ఏర్పాట్లు గావిన్చుకునేలా రైతులకు  ఆర్.బి.కే ల ద్వారా అవగాహన కలిగించాలని సూచించారు.  విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని ,  పరిస్థితుల పై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సమీక్షించాలని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు ద్వారా నే రైతులకు ఉపకరణాలను  అందిస్తుందని,  ప్రభుత్వ పాలసీ కి విరుద్ధంగా ఏమి జరగకూడదని అన్నారు.   జలవనరుల ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు.  తోటపల్లి, తారక రామ తీర్ధ సాగర్,   మిగిలిన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పై త్వరలో ఉన్నత స్థాయి సమావేశాన్ని  ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని జలవనరుల చీఫ్ ఇంజినీర్ కు సూచించారు.
        కోవిడ్ థర్డ్ వేవ్ కు ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని, ఆసుపత్రులలో అవసరమగు  వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలని,   ఆక్సిజన్ ,మందులు బెడ్స్ తదితర వసతులను  ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. కోవిడ్ లక్షణాలున్న వారికీ ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించాలన్నారు.   45 ఏళ్ళు నిండిన వారందరికి వాక్సినేషన్  వేయాలని , ప్రభుత్వ నిబందనల ననుసరించి తల్లులకు, గర్భిణీలకు కూడా  వాక్సిన్ వేయాలన్నారు.  వై.ఎస్.ఆర్. జల కళ పధకం క్రింద బోర్లు  మంజూరు  చేసిన వివరాలను  నియోజక వర్గం వారీగా సంబంధిత  శాసన  సభ్యులకు  రిమార్క్ ల  తో  అందజేయాలని  సూచించారు.  జగనన్న పచ్చ తోరణం క్రింద  1200 కి.మీ లలో అవెన్యూ ప్లాంటేషన్ జరపాలని, మొక్కలను నాటడమే కాకుండా బతికేలా ట్రీ గార్డ్ లను ఏర్పాటు చేయాలనీ డుమా పి.డి కు  ఆదేశించారు.  జగనన్న కాలనీ లలో బోర్లు, విద్యుత్ కనెక్షన్  తదితర మౌలిక వసతలును   కల్పించాలన్నారు.
       గృహ నిర్మాణాలకు, ఆర్ అండ్ ఆర్ పనులకు ఇసుకను  తరలించే నాటు  బండ్లను అడ్డుకోవద్దని పోలీస్ అధికారులకు సూచించారు.  ట్రాక్టర్ల ద్వారా తరలించే వాటికి  రసీదులు చూపించాలని అన్నారు.
          జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి  సభ్యులకు  స్వాగతం  పలికారు.  సమావేశం అనంతరం ఆమె  మాట్లాడుతూ  గౌరవ సభ్యుల సూచనలను సలహాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేసేలా చూస్తామన్నారు.  జిల్లా అభివృద్ధికి  ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని, అందరి నీ సమన్వయం చేసుకుంటూ ప్రగతి సాధిస్తామని తెలిపారు.

          సమావేశం లో శాసన  మండలి సభ్యులు డా. సురేష్ బాబు , శాసన  సభ్యులు  కోలగట్ల వీర భద్ర స్వామి,  బొత్స అప్పల నరసయ్య, బడ్డుకొండ అప్పల నాయుడు, అలజంగి జోగా రావు, కడుబండి శ్రీనివాస రావు,  శంబంగి  వెంకట చిన్న అప్పల నాయుడు,  రాజన్న దొర, సంయుక్త కలెక్టర్  జి.సి.కిషోర్ కుమార్,  వెంకట రావు , సబ్ కలెక్టర్ భావన, ఐ.టి.డి.ఎ పి.ఓ కుర్మనాద్, , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-08-07 13:24:43

మత్స్యకారులకు ద్విచక్రవాహనాల పంపిణీ..

 మ‌త్స్య‌సంప‌ద యోజ‌న ప‌థ‌కం క్రింద జిల్లాలోని 35 మంది మ‌త్స్య‌కారుల‌కు ద్విచ‌క్ర వాహ‌నాలు, ఐస్ బాక్సులు, ఇత‌ర సామ‌గ్రిని స‌బ్సిడీపై పంపిణీ చేశారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద శ‌నివారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్, క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కార్య‌క్ర‌మంలో పాల్గొని, ల‌బ్దిదారుల‌కు యూనిట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా మ‌త్స్య‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ ఎన్‌.నిర్మ‌లాకుమారి మాట్లాడుతూ, మ‌త్స్య‌కారుల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు  పిఎంఎంఎస్‌వై 2020-21 ప‌థ‌కం క్రింద జిల్లాలోని 35 మంది మ‌త్స్య‌కారుల‌కు ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను, ఐస్‌బాక్సుల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ వాహ‌నాలు  మ‌త్స్య‌సంప‌ద‌ను జాప్యం లేకుండా, వినియోగ‌దారుల‌వ‌ద్ద‌కు తీసుకువెళ్లి విక్ర‌యించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అన్నారు. దీనివ‌ల్ల ఇటు వినియోగ‌దారుల‌కు కూడా ప్ర‌యోజనం చూకూరుతుంద‌ని చెప్పారు. ఒక్కో యూనిట్ విలువ రూ.75వేలు అని, దీనిలో ఎస్‌సి, ఎస్‌టి, మ‌హిళ‌ల‌కు రూ45వేలు స‌బ్సిడీ, ఇత‌రుల‌కు రూ.30వేలు స‌బ్సిడీని ఇస్తున్నామ‌ని చెప్పారు. జిల్లాలో మంజూరు చేసిన యూనిట్ల‌లో ఐదు ఎస్‌సిల‌కు, ఐదు ఎస్‌టిల‌కు, 5 మ‌హిళ‌ల‌కు, 20 ఇత‌రుల‌కు మంజూరు చేసిన‌ట్లు డిడి తెలిపారు.
             ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎంఎల్‌సిలు, ఎంఎల్ఏలు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర‌ ఉన్న‌తాధికారుల‌తోపాటుగా, మ‌త్స్య‌శాఖ ఏడి వి.కిర‌ణ్ కుమార్‌, ఎఫ్‌డిఓలు టి.నాగ‌మ‌ణి, యు.చాందినీ, అసిస్టెంట్ ఇన్‌స్పెక్ట‌ర్ సంతోష్‌కుమార్‌, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-07 10:55:32

చేనేతరంగానికి పూర్వవైభవం తీసుకువస్తాం..

 చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద ఏర్పాటు చేసిన చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను,  రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ది, పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి శ‌నివారం ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచిన వ‌స్త్రాల‌ను, నూలు ఒడికే రాట్నాన్ని ఆశ‌క్తిగా తిలికించారు. ఈ సంద‌ర్భంగా చేనేత జౌళిశాఖ జిల్లా స‌హాయ సంచాల‌కులు పెద్దిరాజు మాట్లాడుతూ, చేనేత రంగానికి ప్రాధాన్య‌త నివ్వ‌డంతోబాటు, నేత‌న్న‌ను గౌర‌వించ‌డం కోసం 2015 నుంచి ప్ర‌తీఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్స‌వాన్ని జ‌రుపుకోవ‌డం జ‌రుగుతోంద‌న్నారు. చేనేత రంగానికి దేశంలో అతి ప్రాచీన చ‌రిత్ర ఉంద‌ని, భార‌తీయ చేనేత వ‌స్త్రాల‌కు దేశ‌విదేశాల్లో ఎంతో పేరుప్ర‌ఖ్యాతులు ఉన్నాయ‌ని చెప్పారు. జిల్లాలో నేత కార్మికుల‌కోసం ప్ర‌భుత్వ ప‌రంగా ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. దీనిలో భాగంగానే, చేనేత వ‌స్త్రాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో నారాయ‌ణ‌పురం, కొట్ట‌క్కి, కోట‌గండ్రేడు, డెంకాడ చేనేత స‌హ‌కార సంఘాలు త‌మ ఉత్ప‌త్తుల‌తో పాల్గొంటున్నాయ‌ని ఏడి పెద్దిరాజు తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, జె.వెంక‌ట‌రావు, ఇత‌ర‌ ఉన్న‌తాధికారుల‌తోపాటుగా, అప్కో డిఎంఓ బివి ర‌మ‌ణ‌, మేనేజ‌ర్ చిన్నారావు, చేనేత జౌళిశాఖ అభివృద్ది అధికారులు శ్రీ‌నివాస‌రావు, వ‌సంత‌, ఏడిఓలు వ‌ల్లి, ర‌మ‌ణ‌, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-07 10:45:59

వైఎస్సార్ కాలనీలు వేగవంతం కావాలి..

వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం అయ్యేలా విద్యుత్, నీరు తదితర మౌళిక సౌకర్యాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో సత్తెనపల్లి, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గలలో  నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణ ప్రగతి పై సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాలలోని లే అవుట్ల వారీగా మౌళిక సదుపాయాల పెండింగ్ పనులపై, ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న తీరు సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్) అనుపమ అంజలి, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబుతో కలిసి సమీక్షించారు. లే అవుట్లో పెండింగ్లో ఉన్న విద్యుత్, నీటి సౌకర్యం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణంకు అనుగుణంగా అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము సరఫరాకు ప్రతిపాదనలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జియోట్యాగింగ్, ఇళ్ళ మ్యాపింగ్ నూరు శాతం పూర్తి చేయాలన్నారు.

 ఇళ్ళ నిర్మాణంకు అవసరమైన ఇసుక శాండ్ రీచ్ల ద్వారా ప్రత్యేక క్యూలైన్లు, స్లాట్ టైం కేటాయించేలా హౌసింగ్ అధికారులు రీచ్ నిర్వహుకులకు సూచించాలన్నారు.  ఇళ్ళ నిర్మాణం వేగవంతం అయ్యేందుకు హౌసింగ్ అధికారులు సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణం వేగంగా జరుగుతున్న లే అవుట్లకు వెంటనే   సిమెంట్, ఇనుము  సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్లలో పెండింగ్లో ఉన్న మౌళిక సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గల హౌసింగ్, రెవెన్యూ, పంచాయితీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-06 16:37:05

బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించండి..

బలహీన వర్గాలకు అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారం జిల్లాలోని వివిధ శాఖలలో  ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ పోస్టులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ హాలులో రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్స్, రోస్టర్ పాయింట్స్ మరియు  మెయిన్టెన్స్ ఆఫ్ రోస్టర్ రిజిస్టర్స్ పై నిర్వహించిన వర్క్షాపులో  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బ్యాక్ లాగ్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం జిల్లాలోని వివిధ శాఖలు భర్తీ చేయాల్సిన పోస్టులపై అందించిన ప్రతిపాదనలపై కొన్ని అభ్యంతరాలను గుర్తించటం జరిగిందన్నారు. శాఖలలో ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల  బ్యాక్ లాగ్ల పోస్టులను ప్రభుత్వ నిబంధన ప్రకారం గుర్తింపు చేసే విధానం పై అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటానికి ప్రత్యేకంగా  వర్క్షాపు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ వర్క్షాపుల వలన శాఖలో రోస్టరు పాయింట్ల గుర్తింపు, రోస్టర్ రిజస్టర్ల నిర్వహణకు  అధికారులకు, సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వర్క్షాపును సద్వినియోగం చేసుకొని ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలను సక్రమంగా అందించాలన్నారు. అదే విధంగా శాఖలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల రోస్టర్ పాయింట్ల పై కలెక్టర్ కార్యాలయం నుంచి అందించిన 1ఏ, 1బి, 1సీ ఫార్మేట్ ప్రకారం నివేదికలు అందించాలన్నారు. వర్క్షాపులో రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్స్, రోస్టర్ పాయింట్స్ మరియు  మెయిన్టెన్స్ ఆఫ్ రోస్టర్ రిజిస్టర్స్ పై సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, జిల్లా పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ విజయ సారధి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.  కార్యక్రమంలో  ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెచ్వోడీలు, సూపరింటెండెట్లు, సంబంధిత సీటు ఉద్యోగులు పాల్గొన్నారు.

Guntur

2021-08-06 16:34:53

అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ సస్పెన్షన్..

విశాఖలోని సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దేవదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ కే. రామచంద్ర మోహన్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ భూములకు సంబంధించి దేవదాయ ధర్మాదాయ శాఖ విశాఖపట్నం ఉపకమిషనర్ ఈ.వి.పుష్పవర్ధన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా రామచంద్ర మోహన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇదివరలోనే ఆయనను దేవదాయ శాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసిన సంగతి తెలిసిందే.ఈ భూములు. కాపాడ్డంలో భాద్యతలు సక్రమంగా నిర్వర్తించని ఇప్పటి సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పటి జిల్లా సహాయ కమీషనర్ ఎన్. సుజాత ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణి మోహన్ ఆదేశాలు జరీచేసారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు దేవాదాయశాఖలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి.

Simhachalam

2021-08-06 16:30:17

సెలవుల్లో బీచ్ రోడ్డు ప్రవేశం నిషేధం..

విశాఖలోని శని,ఆదివారాలు, ప్రభుత్వ సెలవు  రోజులలో రామక్రిష్ణా బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.  ఈనెల 4వతేదీన పర్యాటక  శాఖ మంత్రి ముత్తoశెట్టి శ్రీనివాసరావు 3వదశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు,అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ నిషేధం ఉత్తర్వులు  జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం  ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వ సెలవు దినాలు, శనివారం, ఆదివారం రోజులలో  సాయంత్రం 5.30 గంటల నుండి మరుసటిరోజు ఉదయం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. మూడవ దశ కొవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగామాస్క్ ధరించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Visakhapatnam

2021-08-06 16:25:05

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లుపూర్తి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శుక్రవారం పొందూరులో ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7 వ తేదీన  జాతీయ చేనేతకారుల దినోత్సవం అని, ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారని వివరించారు. పొందూరులో జాతీయ చేనేతకారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొందూరులో ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘం సంస్థను సందర్శిస్తారని అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం, వివిధ పథకాల క్రింద సహాయక కార్యక్రమాల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు 50 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పి ఎం. మహేంద్ర, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, డిఅర్డిఏ పిడి బి.శాంతి, ఎల్.డి.ఎం జివిబిడి హరిప్రసాద్, డిఎంహెచ్ఓ కే. సి. చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-06 16:13:22