1 ENS Live Breaking News

సీఎం పర్యటన విజయవంతం చేయండి..

రాష్ట్రంలో 30 శాతం కంటే అధికంగా పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటటం పై చైతన్యం కలిగించే లక్ష్యంతో ఆగష్టు 5 వ తేదిన వనమహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. మంగళగిరి వద్ద అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్ ) లో గురువారం జరిగే 72వ వనమహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నందున అక్కడి ఏర్పాట్లను  మంగళవారం  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎయిమ్స్ వద్ద ముఖ్యమంత్రి మొక్కలు నాటే ప్రాంతంను, సభా స్థలం, వేదిక, ముఖ్యఅతిధులు ప్రయాణించే మార్గలలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించి పర్యవేక్షణ అధికారులకు సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంకు విధులు కేటాయించిన అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 72వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఐదవ తేదీ మంగళగిరి ఎయిమ్స్లో జరిగే కార్యక్రమంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటుతారన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విధ్యార్ధులు, వాలంటీర్లు, మహిళలు పాల్గొని రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్, ఎయిమ్స్లో పచ్చదనం కోసం నిర్దేశించిన ప్రాంతాలలో మొక్కలు నాటతారన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయటం జరుగుతుందని, వేదిక, బ్యారికేటింగ్, రూట్ ప్లాన్, పార్కింగ్ పై పోలీస్, అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో బహిరంగ సభా స్థలిలో సీటింగ్ ప్రతి కూర్చికి ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని,  ప్రతి ఒక్కరు మాస్క్ ఖచ్చింతంగా ధరించేలా సభా  స్థలంలో మాస్క్లు అందుబాటులో ఉంచుతున్నామని, కోవిడ్ ప్రవర్తన నియామవళి  ఖచ్చితంగా అమలు చేస్తూ  అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ శాఖ ద్వారా టీ షర్టులు, క్యాప్లు అందించటం జరుగుతుందన్నారు.

అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 5వ తేది మంగళగిరిలో ఎయిమ్స్లో జరిగే వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతా  పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆగస్టు 5వ తేదీ ముఖ్య అతిధులు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ మళ్ళింపు ప్రణాళికపై  ముందుగానే సమాచారం అందించి సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం  సజావుగా కొనసాగేలా, విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి  చేస్తామన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) కే. శ్రీధర్ రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి (టెరిటోరియల్) రామచంద్రావు, మంగళగిరి– తాడేపల్లి కార్పోరేషన్ నిరంజన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ హేమమాలిని రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి, గుంటూరు రెవెన్యూ డివిజన్ అదికారి  భాస్కర రెడ్డి, మంగళగిరి తహశీల్దారు శివ రామ్ ప్రసాద్, ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-03 14:22:58

అధ్యాపకులు కాంట్రాక్టు రెన్యూవల్ చేసుకోవాలి..

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులు రెన్యువల్ చేసుకొనుటకు ధరఖాస్తులను కోరుతున్నట్లు ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకులు డా.చప్పిడి కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు. 2020-21 విద్యా సం.లో ఈ ఏడాది మార్చి 31 నాటికి ఒప్పంద అధ్యాపకులు గా పనిచేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. 2021-22 సం.లో పనిచేయుటకు ఆసక్తి గల అధ్యాపకులు ఆగస్ట్ 6వ తేదీ సాయంత్రం 5.00 గం.ల లోగా  తమకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రెన్యూవల్ కొరకు వచ్చిన దరఖాస్తులను ఆగస్ట్ 7వ తేదీన జిల్లా ఐడి ప్రిన్సిపాల్ కు సమర్పించాలని సూచించారు. ఈ నెల 10న రెన్యూవల్ కొరకు వచ్చిన దరఖాస్తులను జిల్లా సెలక్షన్ కమిటీ సమక్షంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. ఆగస్ట్ 12న  రెన్యూవల్ అయిన ఒప్పంద అధ్యాపకులు 2021-22 విద్యా సం.నకు గాను అగ్రిమెంట్ చేసుకోవలసి ఉంటుందని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Srikakulam

2021-08-03 14:21:44

శ్రీవాణి ట్రస్ట్ కు ఇంజినీరింగ్ విభాగం..

శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలపై తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ సహాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ముందే ఆలయం స్థల పురాణం, ప్రాశస్త్యం, ఇప్పటిదాకా పూజలు జరుగుతున్నాయా అనే అంశాలు పరిశీలించాలని చెప్పారు. ట్రస్ట్ నిధులతో ఆలయం పునరుద్ధరణ, లేదా అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల భక్తులకు ఎంత మేరకు ఉపయోగం ఉంటుందనే విషయం కూడా తెలుసుకోవాలని ఈవో చెప్పారు. ప్రతిపాదన నుంచి పని పూర్తి చేసే వరకు వ్యవధి నిర్ణయించుకోవాలన్నారు. టీటీడీ అనుబంధ, విలీన ఆలయాల్లో మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టేలా శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఈ ఆలయాల్లో నీటి సరఫరా,ఇతర మౌళిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు నిర్మాణం పనులు కూడా చేపట్టాలన్నారు. పురాతన ఆలయాల మరమ్మతుల సమయంలో  నిర్మాణం డిజైన్ దెబ్బ తినకుండా చూడాలని చెప్పారు. తిరుమలలో రోడ్లు, ఫుట్ పాత్ నిర్వహణ చక్కగా ఉండాలని, సంబంధిత అధికారులు వారానికోసారి స్వయంగా వీటిని చూడాలని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నుంచి పలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అనుమతి మంజూరు చేశారు.   అదనపు ఈవో  ధర్మారెడ్డి, జెఈవో  సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డిప్యూటి ఈవో  రమణ ప్రసాద్ ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

Tirupati

2021-08-03 14:20:40

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలిన..

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీకేష్  లాఠకర్, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ మంగళ వారం పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన పొందూరు రానున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థ మరియు సొసైటిను సందర్శించారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయునున్న సభా స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు, బందోబస్తు తదితర కార్య్రమాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పీ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-03 14:19:29

5న జిల్లాలో వన మహోత్సవం..

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 5న 72వ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ జిల్లా అటవీ శాఖ అధికారి సచిన్ గుప్త పేర్కొన్నారు.   ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు. ఆగష్టు 5వ తేదీ ఉదయం 9.00గం.లకు  స్థానిక పురుషుల పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. వీరితో పాటు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొంటారని తెలిపారు.  ఈ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను నాటి ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో నిండేలా చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరం పది మొక్కలు ప్రతిన బూని నాటుదాం అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు  ఆయన  ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2021-08-03 14:18:39

యాంత్రీకరణ దిశగా అడుగు వేయాలి..

యాంత్రీకరణ దిశగా రైతులు అడుగు వేయాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.  శ్రీకాకుళం రూరల్ మండలం లంకం గ్రామంలో అగ్రికల్చర్ పరిశోధన కేంద్ర ( రాగోలు ) సౌజన్యంతో మంగళవారం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు వరి నాటు వేసే యంత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరినాటు వేసే యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులు వరి నాటు వేసే యంత్రం ద్వారా నాటు వేస్తే తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో నాటు వేయవచ్చన్నారు. కూలీలు సైతం తక్కువగా ఉపయోగపడతారని, పని ముట్లను ఉపయోగిస్తే ఖర్చు ఆదా అవుతుందన్నారు. అగ్రికల్చర్ పరిశోధన కేంద్ర ( రాగోలు ) వారి సౌజన్యంతో విత్తనాలు వేసి - కోత వరుకు బాధ్యత తీసుకునే కార్యక్రమం, యంత్రం ద్వారా నాటు వేయటం వల్ల కలిగే లాభాలను రైతులకు శాస్త్రవేత్త డా.పి.వి.వి. సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పద్మావతీ,  ఆచార్య ఎన్.జి రంగ బోర్డ్ సభ్యులు డా. నేతాజీ, ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత, మాజీ ఎంపిపి అంబటి శ్రీనివాస్ బాబు, సర్పంచ్ ప్రతినిధి చిట్టి రవికుమార్, మాజీ జెడ్పిటిసి సభ్యులు చిట్టి జనార్ధన, సర్పంచ్ గెదల చంగల్ రావు, అల్లు లక్ష్మీనారాయణ, గోండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లంకం

2021-08-03 14:17:32

7న కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటన..

కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ నెల 7వ తేదీన రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటనపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళ వారం సంబంధిత అధికారులు, బ్యాంకులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆయన ఆదేశించారు. పొందూరు ఖాదీతో పాటు చేనేతకారుల అంశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ పథకాల క్రింద రుణాలు పంపిణీ ఉంటుందని ఆయన చెప్పారు. పొందూరు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగతుందన్నారు. అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శించాలని ఆయన సూచించారు. బ్యాంకులు సైతం తమ కార్యలాపాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. యు బి శత శాతం బ్యాంకు డిజిటలైజేషన్ ప్రక్రియను మంత్రి ప్రారంభించు అవకాశం ఉందని ఆయన తెలిపారు. లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బాలివాడ దయానిధి, ఆర్డీఓ ఐ.కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం బి. గోపాల కృష్ణ, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, యుబిఐ జోనల్ మేనేజర్ కే.ఎస్. డి.శివ వర ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జివిబిడి హరి ప్రసాద్, నాబార్డు డిడిఎం మిలింద్ చౌసాల్కర్,ఎస్బిఐ ఆర్ఎం తపోధన్ దేహారి, డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, డిఆర్డిఎ పిడి బి. శాంతి శ్రీ, డా. పద్మ,  స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పడాల భూదేవి, ఎం. ప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-03 14:16:19

ప్రమాణాలు పెంచేందుకే నూతన విద్యావిధానం..

 విద్యాప్ర‌మాణాలు పెంచేందుకే నూత‌న విద్యావిధానాన్ని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతోంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో, జాతీయ విద్యావిధానం-2020 పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం అవ‌గాహ‌నా స‌ద‌స్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యావ్య‌వ‌స్థ‌పై సుదీర్ఘ అధ్య‌య‌నం త‌రువాతే ప్ర‌భుత్వం కొన్ని సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతోంద‌ని అన్నారు. పిల్ల‌ల వ‌య‌సు, వారి అభ్య‌స‌న సామ‌ర్థ్యం, తోటిపిల్ల‌ల‌తో మెలిగే తీరు త‌దిర ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని కొత్త విధానాన్ని ఖ‌రారు చేశార‌ని అన్నారు. ఈ విధానాన్ని త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని కేంద్రం ఆదేశించ‌లేద‌ని, కేవ‌లం సూచ‌న మాత్ర‌మే చేసింద‌ని చెప్పారు. కేంద్రం సూచించిన నూత‌న విద్యావిధానాన్ని బాగా అధ్య‌య‌నం చేసి, కొన్ని మార్పుల‌తో రాష్ట్రం కొత్త విద్యావిధానాన్ని ఖ‌రారు చేసింద‌న్నారు. కేవ‌లం విద్య మాత్ర‌మే కాకుండా, సంస్కృతి, క‌ళ‌లు, క్రీడలు త‌దిత‌ర అన్ని అంశాల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని నూత‌న విద్యావిధానాన్ని రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ కొత్త విధానంలో ఏ ఒక్క‌రినీ తొల‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లా భౌగోలిక ప‌రిస్థితులూ, అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని, మార్పులు చేర్పులు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల విలువైన సల‌హాలు, సూచ‌న‌లూ అంద‌జేయాల‌ని జెసి కోరారు. ఈ స‌దస్సులో జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగ‌మ‌ణి, ఉప విద్యాశాఖాధికారి బ్ర‌హ్మాజీ, ఇత‌ర అధికారులు, వివిధ పాఠ‌శాల‌ల హెడ్‌మాష్ట‌ర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-03 07:40:37

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చూడాలి..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దృష్టి సారించాలని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన  శానిటరీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె 3వ జోన్ 24వ వార్డు పరిధిలో తులసి పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీహనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, కాలువలలో స్ప్రేయింగు చేయించాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ప్రతి శుక్రవారం “డ్రైడే” పాటించేలా చూడాలని, డెంగ్యూ, మలేరియ కేసులు నమోదు అవకుండా చూడాల్సిన బాధ్యతా మలేరియా  సిబ్బందిపై ఉందని కమిషనర్ తెలిపారు. పారిశుధ్య సిబ్బందిచే 8గంటలు పని చేయించాలని రోడ్లు, కాలువలు శుభ్రపరచాలని ప్రతీ ఇంటి నుండి తడి-పొడి మరియు ప్రమాదకరమైన చెత్తను సేకరించాలని కమర్షియల్ ఏరియాలలో కూడా చెత్త సేకరణ జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మీకులను సర్దుబాటు చేయాలని, ఎ పనికి నిర్దేశించిన పారిశుధ్య కార్మీకులను ఆ పనికే ఉపయోగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆదేశించారు. వార్డులో త్రాగు నీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్య కారీకుల పనితీరుపై స్థానిక ప్రజలను అడిగి తెలుసికున్నారు. ఈ పర్యటనలో 3వ జోనల్ కమిషనర్ కె.శివ ప్రసాద్, కార్యనిర్వాహక ఇంజనీర్ చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ జనార్ధన, శానిటరీ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-08-02 16:52:54

అభివృద్ధి ప‌నుల‌ను తనిఖీచేసిన‌ సివిఎస్వో..

తిరుమలలో వివిధ ప్రాంతాల్లో, అలిపిరి న‌డ‌క మార్గంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను సోమ‌వారం టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి ఇంజనీరింగ్, అట‌వీ, విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా సివిఎస్వో జిఎన్‌సి సమీపంలోని పాత వ్యూ పాయింట్‌ను సందర్శించి, అక్క‌డ అవ‌స‌ర‌మైన అభివృద్ధి, పచ్చదనం పెంపొందించేందుకు చెప‌ట్ట‌వ‌ల‌సిన ప‌నుల‌ను ఇంజనీరింగ్, అటవీ అధికారులకు సూచించారు. తరువాత జిఎన్‌సి సమీపంలోని ప‌న‌స వనం, ఔటర్ రింగ్ రోడ్‌లోని అభివృద్ధి పనులను ప‌రిశీలించారు.  సివిఎస్వో తనిఖీలో భాగంగా అలిపిరి న‌డ‌క‌మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆల‌యం ప్రక్కన ఆధునీక‌రించిన గూర్ఖా సెక్యూరిటీ పోస్ట్‌ని సందర్శించారు. ఇదివ‌ర‌కు ఆయ‌న తనిఖీ సమయంలో ఘాట్ రోడ్ విధుల్లో ఉన్న ఘూర్ఖాస్‌కి ఉండే ఈ సెక్యూరిటీ పోస్ట్ సౌక‌ర్య‌వంతంగా లేదని గమనించి ఆధునీక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్ని వ‌స‌తుల‌తో ఆధునీక‌రించిన ఘూర్ఖా పోస్ట్‌ను ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా నేపాల్, డార్జిలింగ్ మొదలైన ప్రాంతాలకు చెందిన ఘూర్ఖాస్ రాత్రి, ప‌గలు విశేషంగా సేవలు అందిస్తున్నార‌ని ప్రశంసించారు. త‌రువాత వారితో కలిసి సివిఎస్వో  భోజనం చేశారు.  తనిఖీలో ఎస్ఇ- 2 జగదీశ్వర్ రెడ్డి, డిఎఫ్‌వో  చంద్రశేఖర్, ఈఈ 1  జగన్మోహన్ రెడ్డి, విజివో  బాలి రెడ్డి, ఎవిఎస్వోలు  గంగరాజు,  పవన్ కుమార్, శైలేంద్ర ఉన్నారు.


Tirumala

2021-08-02 16:47:19

శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టిటిడి సారె..

తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టిటిడి అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం సమర్పించారు. టిటిడి ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్‌  జయశంకర్‌, దేవాదాయ శాఖ‌ జాయింట్ కమిషనర్  ప‌రంజ్యోతి ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు. కాగా భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన  శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణ ప్రశస్త్యం. టిటిడి 2006 నుండి ఆడికృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తుంది.   తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ''ఆరుపడైవీడు'' లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.  ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృతిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.

Tirupati

2021-08-02 16:40:29

ఆత్మీయ సమావేశం..జిల్లా అభివ్రుద్ధికి నిర్ధేశం..

విజయనగరం జిల్లా కలెక్టరమ్మ ఏ.సూర్యకుమారి ఏ కార్యక్రమం చేపట్టినా చాలా వినూత్నంగా వుంటుంది.. ఇటీవలే విధుల్లోకి చేరిన కలెక్టర్ జిల్లా అధికారులందరినీ ఒకేసారి పరిచియం చేసుకోవడంతోపాటు, వారి శాఖలు తెలుసుకునేందుకు అధికారులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం సోమవారం రాత్రి ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్లుగా వున్నవారు ముఖ్యమైన రోజుల్లోనే మాత్రమే నిర్వహిస్తుంటారు. కానీ మనం పనిచేయడం ప్రారంభించిన రోజే చాలా ముఖ్యమైన రోజుగా భావించే కలెక్టరమ్మ అధికారులందరితో ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో జిల్లా అధికారులంతా ఒక్కసారి కలెక్టర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని తమను తాము పరిచియం చేసుకుంటూ జిల్లా అభివ్రుద్ధిలో మీవెంటనే మేమంటూ పదం కలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్క జిల్లా అధికారిణీ కలెక్టర్ స్వయంగా పలుకరించారు. జిల్లాని రాష్ట్రంలో ప్రగతి పధంలో నిలబెట్టడానికి అధికారులంతా సమిష్టిగా కలిసి పనిచేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో
జిల్లా ఎస్పీ దీపిక పాటిల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, జాయింట్ కలెక్టర్ లు డా జి.సి. కిషోర్ కుమార్, డా మహేష్ కుమార్, మయూర్ అశోక్,  జె. వెంకట రావు, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావ్నా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి, జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఇందులో పాల్గొన్నారు. మహారాజా సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

Vizianagaram

2021-08-02 16:28:41

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది..

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని, రైతు శ్రేయస్సు కోరి నియోజకవర్గ, మండల స్థాయిల్లో రైతు భరోసా కేంద్రాలు వ్యవస్థ తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి అన్నారు. జిల్లాలో 627 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని. ఇప్పటికే 80 పూర్తయి రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు మరిన్ని పెంచుతామని అన్నారు. ఈ-క్రాప్ విధానంలో రైతులందరినీ నమోదు చేసి.. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇనాం భూముల్లో రైతు భరోసా కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వ ఘనత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఉంటేనే బోరు వేసుకునే సౌలభ్యం ఉందని. ఎకరం ఉన్న రైతులకు కూడా ఆ సౌకర్యం కల్పించే విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. జిల్లాలోని సబ్బవరంలో ఏర్పాటు చేసిన సీడ్ ప్రాసెస్సింగ్ ప్లాంట్ మంజూరైందని. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. సాయిల్ టెస్టింగ్ లాబ్స్ విశాఖ, అనకాపల్లిలో ఉన్నాయని, నర్సీపట్నంలో ఏర్పాటు చేయాలని సూచించామని అన్నారు. వ్యవసాయ సంబంధిత సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 756 కోట్లు రైతు భరోసాగా ఇచ్చిందని అన్నారు.
ఇకపై ప్రతినెలా 3వ శుక్రవారం వ్యవసాయ అడ్వైజరీ సమావేసం నిర్వహిస్తామని అన్నారు. ఈ తరహా సమావేశాలు అడ్వైజరీ బోర్డు చైర్ పర్సన్, సభ్యుల సమక్షంలో నియోజకవర్గ, మండల స్థాయిల్లో ప్రతినెలా జరిగేలా చూస్తామన్నారు. జైజవాన్, జైకిసాన్, రైతును రాజు చేస్తామని గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయని.. సీఎం జగన్ మాత్రం వాటిని ఆచరణలో పెట్టారని అన్నారు. వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండడుగులు వేస్తే, జగన్ నాలుగడుగులు వేస్తున్నారని అన్నారు. గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని వైఎస్ అంటే. ఎద్దేవా చేసారని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని ఈసందర్భంగా మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
అంతకు ముందు అగ్రికల్టర్ ఎడ్వయిజరి బోర్డు సమావేశం నిర్వహించ బడింది.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ మరియు సంబంధిత అధికారులు మంచి దిగుబడుల కు,  ఆదాయానికి గాను  రైతులకు  సలహాలు సూచనలు ఇన్యాలని, మేలైన విత్తనాలు,, ఎరువుల ను అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రోగ్ర సి వ్ రైతులు  పలు సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు. జిల్లా కలక్టరు డా. ఎ. మల్లి ఖార్జున మాట్లాడుతూ , అధికారులు రైతుల తెలిపిన అంశాల పై తన తో చర్చించాలన్నారు. కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తుఫానులో తమలపాకుల రైతులు నష్టపోతున్నారని ఈ పంటను రైతు భరోసా పరిధిలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో  విప్ బూడి ముత్యాల నాయుడు- పాయకరావుపేట శాసనసభ్యులు గొల్లబాబురావు, పాడేరు శాసనసభ్యులు కె.భాగ్యలక్ష్మీ, ఎలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు, గాజువాక శాసనసభ్యులు తిప్పలనాగిరెడ్డి, అరకు శాసనసభ్యులు శెట్టి ఫాల్గున, విశాఖ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ వెస్ట్ శాసనసభ్యులు పి.వి.జి.నాయుడు, డిసిఎమ్ ఎస్ ఛైర్మన్, వుడా ఛైర్మన్ అక్కరమాని విజయనిర్మల, జాయింట్ కలెక్టర్ యం .వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర అగ్రికల్చర్ లీలావతి, సెరి కల్చర్, హార్టి కల్చర్, ఎనిమల్ హస్బెండరీ, సివిల్ సప్లయిస్, ఎపిఇపిడిసిఎల్, ఎడి మార్కెటింగ్, తదితర అధికారులు,  ప్రోగ్రసివ్ రైతులు సరస్వతి, గంగు నాయుడు, ఆనంద్, రమణ, పాండు, సూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-02 15:53:30

బదిరులకు ల్యాప్ టాప్, మొబైల్స్ పంపిణీ..

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ చ‌దువుతున్న బ‌ధిర (మూగ, చెవిటి) విద్యార్థులతో పాటు డిగ్రీ, పీజీ చదువుతున్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్ల‌ను సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కామరాజు, జాయింట్ కలెక్టర్ (ఆసరా,సంక్షేమం) జి.రాజకుమారి సమక్షంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ప‌ది మంది విద్యార్థుల‌కు అందజేశారు.
- కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇంద్రపాలెం వాసి సూరంపూడి మాధవ స్థానిక ఐడియ‌ల్ కళాశాలలో24 సంవత్సరాలు నుంచి అటెండర్‌గా పనిచేస్తున్నాన‌ని, 2020లో కోవిడ్ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందని ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు అర్జీని అందించ‌గా.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ఐవోను పరిష్కరించాలని ఆదేశించారు.
- పెదపూడి మండలం, గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన ఆర్‌వీఎం ఆచార్యులు తనకు 2013లో చొల్లంగి వద్ద రాజీవ్ స్వగృహలో గృహం మంజూరైంద‌ని, అక్కడ సరైన తాగునీరు, రోడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తాగునీరు స‌ర‌ఫ‌రా, రోడ్లు వేయాలని కలెక్టర్‌కు విజ్ఞ‌ప్తి చేయ‌గా స‌మ‌స్య‌ను పరిష్కారించాల్సిందిగా రాజీవ్ స్వగృహ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
- మండపేట మండలం, కేశవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి జాన్ ప్రసాదు తమ నివాసాలకు దగ్గరలో డ్రైనేజీ నిమిత్తం కేటాయించిన స్థలంలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేయాలంటూ కలెక్టర్‌కు విజ్ఞ‌ప్తి చేయ‌గా పరిష్కరించాల్సిందిగా మండపేట ఎంపీడీవోను ఆదేశించారు.

Kakinada

2021-08-02 15:51:16