1 ENS Live Breaking News

రేడియో సిటీఎఫ్ఎం కి ఐకాన్ అవార్డు..

విశాఖ లోని వివిధ వ్యాపార సంస్థలకు చెందిన వారికి శ్రోతలతో కాంటెస్ట్ నిర్వహించి వచ్చిన ఓట్ల ఆధారంగా రేడియో సిటీ ఐకాన్ అవార్డును నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖను,  అభివృద్ధి చేయడంలో మీరంతా తోడ్పాటు అందించాలని,  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపార సంస్థల ప్రతినిధులు మేయర్ ఆలోచనలకు స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో రేడియో సిటీ ఆర్.జె. బాలు కుటుంబం మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-06 14:36:44

ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం..

ద్రవిడ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నవారి సమస్యలను పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ బిసి కమిషన్ మెంబర్ అచారి తల్లోజు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ద్రావిడ యూనివర్సిటీ నందు ఉద్యోగస్తులు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో  రెక్టార్ ఆచార్య సి హెచ్ ఏ.రాజేంద్ర ప్రసాద్,రిజిష్ర్టార్ ఆచార్య కె.వేణుగోపాల్ రెడ్డి, వర్సిటీ బిసి లైజనింగ్ అధికారి ఆచార్య  మస్తాన్, లతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  ముందుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాసులు మాట్లాడుతూ ద్రావిడ యూనివర్సిటీ లో గత 22 సంవత్సరాలుగా అవుట్ సోర్స్ అటెండర్ గా  ఉద్యోగం చేస్తున్నను నాకు పర్మినెంట్ చేయాలని  కమిషన్ మెంబర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్. మోహన్  మాట్లాడుతూ నేను రజక కులానికి చెందిన వాడని గత 22 సంవత్సరాలుగా అటెండర్ గా పని చేస్తున్నాను.నాకు అన్ని అర్హతలు వున్నాను నాకు పదోన్నతి కల్పించలేదని,  కోర్టుకు తిరిగి కోర్టు  ఆర్డర్ ఇచ్చినను నాకు ప్రమోషన్ ఇవ్వలేదని, నకిలీ కుల ధృవ పత్రాలతో  ఉద్యోగాలు పొంది ప్రమోషన్లు పొందుతున్నారని, ఇలాంటివి ద్రావిడ యూనివర్సిటీ లో చాలా అవినీతి జరుగుతుందని దీనిపై ఎవ్వరు పటించుకోలేదని, నాకు కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని దరఖాస్తు ను కమిషన్ మెంబర్ కు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మదీన వల్లి మాట్లాడుతూ ద్రావిడ యూనివర్సిటీ లో 267 మంది గత 24 సంవత్సరాల గా సలిశాలని జీతంతో అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్న  మా గురించి కుటుంబాల గురించి యూనివర్సిటీ విసి, రిజిస్టర్,రెక్టర్ ఏ ఒక్కరు కూడా మా సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఇక్కడ 267 మంది అవుట్సోర్సింగ్ లో పని చేస్తుంటే అందులో 167 మంది బీసీ కులాల వారు ఉన్నారని, 54 మంది మహిళలు ఉన్నారని మాపై దయవుంచి మాకు తగిన న్యాయం చేయాలని కమిషన్ మెంబర్ కు విన్నవించుకున్నారు.  విసి  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. ఉద్యోగుల,విద్యార్థుల నుంచి అర్జీలు స్వకరించి వారి సమస్యలను విన్న తర్వాత   జాతీయ బిసి కమిషన్ మెంబర్ మాట్లాడుతూ అన్ని చోట్ల బిసిలకు అన్యాయం జరుగుతుందని,బిసిలు  ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ బిసి కమిషన్ ఏర్పాటు చేయడం అందులో భాగంగానే ఈ రెండు సంవత్సరాల్లో దేశంలోనే సుమారు 50 విశ్వవిద్యాలయాలను కమీషన్ మెంబర్లు  పరిశీలించి అక్కడ  ఉద్యోగస్తులు విద్యార్థులు జరుగుతున్న సమస్యలను తెలుసుకొని కొంతవరకు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఉన్న అధికారలను  బిసి కమిషన్ కు ఇవ్వాలని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా   ప్రధానమంత్రి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్న అధికారాలను బిసి కమిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

చదువుకున్న మేధావుల వద్దే  బిసిలకు అన్యాయం జరుగుతుంటే వారు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఈరోజు ద్రావిడ యూనివర్సిటీ లో ఉద్యోగస్తుల సమస్యలను విన్న తర్వాత నిజంగానే ఇక్కడి సమస్యలు ఉన్నాయని విసి గారు నాకు చెప్పటం జరిగిందని తెలిపారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఈ యూనివర్సిటీ లోనే 24 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు చేస్తున్న సమస్యలను ఆగస్టు 15 తర్వాత ఢిల్లీలో  జాతీయ బిసి కమిషన్ చెర్మన్ అధ్యక్షత న సంబంధిత శాఖ మంత్రి యూనివర్సిటీ విసిలు, రిజిస్టర్లలు,సమస్యలు తో ఉన్న ఉద్యోగుల తో  సమావేశం నిర్వహించి  సమస్యలను పరిష్కారం చేయుటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ద్రావిడ యూనివర్సిటీ లో జరుగుతున్న దానిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భారతదేశంలో రిజర్వేషన్లు ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రం తమిళనాడు అని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీరామారావు వచ్చిన తర్వాత కొంత వరకు బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు.  ఉద్యోగాలలో బిసి లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉన్నను దీన్ని ఎవరు పాటించడం లేదని తెలిపారు. ఈ కమిషన్ వచ్చిన తర్వాత కేంద్ర విద్యాలయం లో సైనిక పాఠశాలలో విద్యార్థులకు  రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ యూనివర్సిటీ  ఉద్యోగుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Kuppam

2021-08-06 14:26:41

సంక్షేమ పథకాలపై అవగాహన ఉండాలి..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పట్ల పూర్తి  అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.  శుక్రవారం  పాత వెంకోజిపాలెం, రజక వీధి-1, దుర్గానగర్-1 సచివాలయాలను జాయింట్  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  సచివాలయంలో  పని చేస్తున్న సిబ్బంది  సంక్షేమ పధకాలను  పూర్తిగా తెలుసుకొని  లబ్దిదారులకు వివరించే విదంగా ఉండాలన్నారు. బయో మెట్రిక్ సమయ వేళలను పాటించాలన్నారు. సిబ్బంది  డ్రస్ కోడ్ నిబందనలను పాటించాలన్నారు.  స్పందనలో వచ్చిన ధరఖాస్తులను సంబందిత  కార్యాలయాలకు  నిర్ణీత సమయంలో  చేరే విదంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు  కోవిడ్ నిబంధనలను  పాటించేలా  చర్యలు చేపడుతూ సామాజిక దూరాన్ని  పాటించాలన్నారు. రిజిష్టర్లను సక్రమంగా అమలు పర్చాలన్నారు. 
అర్బన్ హెల్త్ క్లినిక్ లను తనిఖీ చేసిన  జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పి .అరుణ్ బాబు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో భాగంగా రజక వీధి , పాత వెంకోజిపాలెం, దుర్గానగర్ లకు సంబందించి అర్బన్ హెల్త్ క్లినిక్ల ను  ఆకస్మిక తనిఖీలు చేసి వ్యాక్సినేషన్ విదానాన్ని పరిశీలించారు.  వైద్య సిబ్బంది కోవిడ్ నిబంధనలను కచ్చితంగా  పాటించాలని  ఆదేశించారు. 45 సంవత్సరం లు దాటిన  ప్రతి ఒక్కరూ  వ్యాక్సినేషన్ వేసుకొనే విదంగాను అదే విదంగా  ఒక డోసు వేసుకున్నవాళ్లు రెండవ డోసు వేసుకొనే విదంగా  చర్యలు చేపట్టాలన్నారు. 

విశాఖ సిటీ

2021-08-06 14:22:57

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రికి ఘన స్వాగతం..

శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో రెండు రోజుల  పర్యటన నిమిత్తం  వచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్ కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లబించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాద్,  ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎస్ రావత్,  జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, పార్లమెంట్ సభ్యులు  జి.వి.ఎల్ . నర్సింహరావు, బొడ్డేడ మాదవి, రామోహన్నాయుడు,  ఎం ఎల్ సి లు  పి.వి.ఎన్ .మాధవ్, సోము వీర్రాజు, కష్టమ్స్  చీఫ్ కమిషనర్ రమేష్, డి సి పి గౌతమ్ శాలిని, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రంగయ్య,  ఆర్ డి ఓ పెంచల కిషోర్,  తదితరులు  కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. 

Visakhapatnam

2021-08-06 14:21:36

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం..

జాతీయ చేనేత దినోత్సవం ఈ నెల 7వ తేదీన అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 10.00 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. చేనేతలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత ఎగ్జిబిషన్, ఉత్పత్తి ధరలకే అమ్మకాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా చీరాల, వేటపాలెం, అద్దంకి తదితర ప్రాంతాలలో చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కోవిడ్ పరిస్థితులలో చేనేతలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నేత కార్మికులను ఆదుకోవడానికి ఈ నెల 7 నుంచి 18వ తేదీ వరకు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నేతన్నలను ఆదుకోవాలని ఆయన కోరారు.

ఒంగోలు

2021-08-06 14:15:35

రాజ్యాధికారమే లక్ష్యంగా ఏకం కావాలి..

రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులు సంఘటితమవ్వాలని "బహుజన ఐక్య వేదిక" జిల్లా రాజకీయ సలహా కమిటీ నాయకులు చోల్లంగి వేణుగోపాల్ సూచించారు.  ఐక్య వేదిక జిల్లా కమిటీ అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, కార్యదర్శి సబ్బతి ఫణీశ్వరరావు ఆధ్వర్యంలో బీసీ సంఘ నాయకుల సమన్వయ సమావేశం కాకినాడ కచరిపేట లోని డా.బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగింది. "బహుజన ఆత్మభిమానం - 
రాజ్యాధికారం" అంశంపై జరిగిన ఈ సమావేశానికి చోల్లంగి వేణుగోపాల్ ముఖ్య సలహాదారుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బహుజన (బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ) వర్గాలు సమైక్యమై రాజ్యాధికారం దిశగా  సమన్వయం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సమావేశంలో పాల్గొన్న బిసి సంఘ నాయకులు మాకిరెడ్డి భాస్కర్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో బహుజన ఐక్యత సాధించాలన్నారు. తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దెంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  బహుజనులు తమ ఆత్మభిమానాన్ని  కాపాడుకుని, రాజ్యాధికారం దిశగా బలపడాలని హితవుపలికారు. గత అనుభవాలను పరిగణలోనికి తీసుకుని, బహుజనుల ఐక్యతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో ఐనవిల్లి నారాయణ, ఆవుపాటి ఉమశంకర్, న్యాయవాదులు టి.పృద్వి రాజ్,కె. శ్రీనివాస్, వి.బద్రి, వి.సాయినాధ్, పి.దుర్గ రమేష్,డి.అబ్రహం, మాణిబాబు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-06 14:10:07

నిర్మాణాలపై అధికారులు ద్రుష్టిపెట్టాలి..

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ఫ‌లాల‌ను పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందించ‌ డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు త‌దిత‌రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దికన పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం అనుసంధానంతో చేప‌డుతున్న శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లో బాగా వెనుక‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గాల పంచాయ‌తీరాజ్ ఈఈ, డీఈ, ఏఈల‌తో శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. కొత్త‌పేట‌, మండ‌పేట‌, రాజోలు, పి.గ‌న్న‌వ‌రం, తుని, ముమ్మిడివ‌రం, అమ‌లాపురం నియోజ‌వ‌ర్గాల్లో గ్రామ స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు త‌దిత‌రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు సంబంధించి క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు, వాటిని ప‌రిష్క‌రించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప‌నుల్లో పురోగ‌తి ఆధారంగా ఎప్ప‌టిక‌ప్పుడు బిల్లుల‌ను అప్‌లోడ్ చేస్తూ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలు త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తిచేసేలా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. 

ఇసుక స‌ర‌ఫ‌రా, భూమి త‌దిత‌రాల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే జాప్యం చేయ‌కుండా జిల్లాస్థాయి అధికారుల స‌హాయంతో త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికీ ప్రారంభం కాని భ‌వ‌నాలకు సంబంధించి వెంట‌నే గ్రౌండింగ్ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. క్షేత్ర‌స్థాయిలో విలేజ్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్లు రూపంలో స‌మ‌ర్థ‌వంత‌మైన సిబ్బంది అందుబాటులో ఉన్నార‌ని, వారికి మార్గ‌నిర్దేశనం చేస్తూ వీలైనంత త్వ‌ర‌గా భ‌వ‌నాల‌ను వినియోగంలోకి తీసుకురావాల‌ని సూచించారు. మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌) క‌న్వ‌ర్జ‌న్స్ ప‌నుల్లో జిల్లాను ముందువ‌రుస‌లో నిలిపేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు లోపాల స‌వ‌ర‌ణ‌తో, స‌మ‌ర్థ‌వంత‌మైన కార్యాచ‌ర‌ణ‌తో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో పంచాయ‌తీరాజ్ సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్ బీఎస్ ర‌వీంద్ర‌; రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అమ‌లాపురం, కాకినాడ ఈఈలు ఏబీవీ ప్ర‌సాద్‌, కె.చంటిబాబు, బీవీఎస్ఎన్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఏడు నియోజ‌క‌వ‌ర్గాల డీఈలు, ఏఈలు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-06 14:04:30

కోవిడ్ నిబంధనలతోనే పంద్రాగస్టు వేడుకలు..

కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వ‌హించ‌నున్న జిల్లా స్థాయి వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్ల‌ను జె.సి. శుక్ర‌వారం రెవిన్యూ అధికారుల‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. వేదిక‌పైకి ప్ర‌ముఖులు మిన‌హా ఇత‌రులు ఎవ్వ‌రూ వెళ్ల‌కుండా నిరోధించాల్సి వుంద‌ని ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్ కు సూచించారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌కోసం కేటాయించిన సీట్ల‌ను వారికే వ‌దిలిపెట్టాల‌ని, ఇత‌రులు వాటిని ఆక్ర‌మించ‌కుండా చూడాల‌న్నారు. ప్ర‌ముఖుల‌కు ఎక్క‌డా అతిథి మ‌ర్యాద‌ల్లో లోపం లేకుండా ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాల‌న్నారు. అవార్డుల కోసం వేదిక‌పైకి వ‌చ్చేందుకు ఆయా శాఖ‌ల సిబ్బంది క్యూ వ‌రుస‌ల్లో నిల్చొనేలా ఏర్పాట్లు చేయాల‌ని పేర్కొన్నారు. వేదిక ముందు గుంపులుగా ప్ర‌భుత్వ సిబ్బంది గుమికూడ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. వేడుక‌లు జ‌రిగే స‌మ‌యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి అంత‌రాయం లేకుండా చూడాల‌న్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్‌, త‌హ‌శీల్దార్ ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-06 13:53:58

పదోన్నతులపై పీఆర్ ఉద్యోగుల హర్షం..

ఎంపిడిఓలకు ప‌దోన్న‌తుల‌ను క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల పంచాయితీరాజ్ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ‌కాలంగా దాదాపు 25 ఏళ్ల నుంచీ ఎటువంటి ప‌దోన్న‌తి పొంద‌కుండా ఒకే కేడ‌రులో ప‌నిచేస్తున్న సుమారు 255 మంది ఎంపిడిఓల‌కు, పంచాయితీరాజ్ శాఖ సిబ్బందికీ ఈ నిర్ణ‌యం ఎంతో మేలు చేస్తుంద‌ని వారు పేర్కొన్నారు.  స్థానికంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఎంపిడిఓల సంఘం జిల్లా నాయ‌కులు కె.రాజ్‌కుమార్, కె.రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ, ఈ నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌నిచేస్తున్న సుమారు 18,500 మంది పంచాయితీరాజ్ ఉద్యోగుల‌కు కూడా, వారి హోదాను బ‌ట్టి ప‌దోన్న‌తులు ల‌భిస్తాయ‌ని చెప్పారు. ఈ నిర్ణ‌యం తీసుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి, పంచాయితీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి, జిల్లా మంత్రుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. విలేక‌ర్ల స‌మావేశంలో పిఆర్ మినిస్టీరియ‌ల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్య‌క్షులు ఏ.సురేష్‌, కార్య‌ద‌ర్శి సిహెచ్ ముర‌ళి, ప‌రిష‌త్ యూనిట్ అధ్యక్ష‌, కార్య‌ద‌ర్శులు పిజె అమృత‌, పి.కిర‌ణ్‌, పిఆర్ విస్త‌ర‌ణాధికారుల సంఘం నాయ‌కులు సురేష్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-06 13:52:58

జాతీయ రహదారి పనులు వేగం పెంచాలి..

రాయిపూర్ –విశాఖపట్నం 6  లైన్ల  జాతీయ రహదారి కి సంబంధించి  559.50  హెక్టార్లలో  జరగాల్సిన   పనులను  వేగంగా  పూర్తయ్యేలా చూడాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి   అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులు త్వరగా పూర్తి ఆయితే  పర్యాటకం, పరిశ్రమల  అభివృద్ధి వేగంగా జరుగుతుందని,  అందువలన ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. శుక్రవారం జాతీయ రహదారుల పనుల పై భూ సేకరణ అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు.  జాతీయ రహదారుల డిప్యూటీ మేనేజర్  ప్రశాంత్ మిశ్ర పనుల పురోగతిపై కలెక్టర్ కు వివరించారు.  రాయిపూర్ నుండి  విశాఖపట్నం జాతీయ రహదారి  సివిల్ పనుల పురోగతి  పాకేజ్ 1 నుండి 4 వరకు ఏ ఏ  స్థాయిలలో ఉన్నాయో   సమీక్షించారు.  గ్రామాలలో  అటవీ క్లియరెన్స్ , ఉద్యాన పంటల, ఇతర ఆస్తుల  లెక్కింపు త్వరిత గతిన పూర్తి చేసి  పరిహారం చెల్లింపులు త్వరితగతిన జరగాలని  సూచించారు. అటవీ క్లియరెన్స్ కు సంబంధించి అటవీ శాఖ అధికారులు స్వయంగా  వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.    భూ సేకరణ కు సంబంధించి తహసిల్దార్ల సమక్షం లో తప్పకుండా గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్  డా. జి.సి .కిషోర్ కుమార్ మాట్లాడుతూ  రాయిపూర్ – విశాఖ రహదారి కి సంబంధించి పర్యావరణ అనుమతులు ఇప్పటికే పొందడం జరిగిందని అటవీ క్లియరెన్స్  పాకేజ్ 1,2 కు సంబంధించి 6.40 కిలో మీటర్లలో 29.18 హెక్టార్ల భూమి కి సంబంచించి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.   పాకేజ్ 1 నుండి 4 వరకు  అవసరమగు అదనపు భూమి కోసం  3 డి పబ్లికేషన్ పూర్తి చేసామని  తెలిపారు. పాకేజ్ 1,2,3 పనులు పురోగతి  లో ఉన్నాయని, పాకేజ్ 4 లో కోర్ట్ కేసు లు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించి పనులు వేగంగా జరిగేల చూస్తామని తెలిపారు. ఈ సమావేశం లో సబ్ కలెక్టర్ భావన,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, రెవిన్యూ  డివిజినల్ అధికారి  భవాని శంకర్, ఉప కలెక్టర్  వెంకటేశ్వర్లు ఉద్యాన, జలవనురుల, విద్యుత్, ఆర్.డబ్లు..ఎస్. శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-06 13:52:09

క్రిస్టియన్, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి..

రాష్ట్రం లో క్రిస్టియన్, మైనారిటీ వర్గాల  అభ్యున్నతికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సేవలు అందించే కు స్మశాన వాటికల అంశానికి  తొలి ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ అన్నారు.  త్వరలోనే ఆయా జిల్లాల కలెక్టర్లు తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ పదవి అలంకారం కాదని, బాధ్యతని సంపూర్ణంగా స్వీకరించి క్రిస్టియన్ లు  అందరికీ న్యాయం చేస్తామని అన్నారు.    చర్చిలకు సంబంధించి అధిక ఆస్తులు వున్నా అంతర్గత విభేదాల కారణంగా కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అటువంటి ఆస్తులను పరిరక్షించుకుంటామన్నారు. ప్రార్ధన మందిరాల నిర్మాణాలకు నిబంధనల సడలింపు నకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని అన్నారు. జెరూసలేం, ఈజిప్ట్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు నిజమైన పేదలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. "నవరత్నాల" ద్వారా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పధకాలను చేరువ చేస్తామని తెలిపారు.
మిగిలిన పార్టీల సంగతి ఎలా వున్నా.. వైఎస్సార్సీపీ లో కష్ట పడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తుందని చెప్పేందుకు  తనకు అప్పగించిన బాధ్యతే ఉదాహరణ అని ప్రస్తావించారు.  సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయ సాయి రెడ్డి నిజాయితీగా ఉంటూ మిగిలిన  నాయకులను సమర్ధ వంతంగా పనిచేయించ గలుగుతున్నారని అన్నారు. మనం నిజాయితీ పరులు  అయితేనే అవతలి వారిపై చర్యలుతీసుకోగలమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా  విజయ సాయి రెడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు.
మంచి తనాన్ని గుర్తించి వైజాగ్ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఒదిగి ఉండే వారికి ఉన్నత అవకాశాలు అంది వస్తాయని జాన్ వెస్లీ సాదర మనస్తత్వాన్ని  అభినందించారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి  సోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజ్ పట్నాయక్,జాయింట్ సెక్రెటరీ దాడి రవికుమార్ కార్యవర్గ సభ్యులు ఈరోతి ఈశ్వరరావు, ఎంఎస్సార్ ప్రసాద్, దొండా గిరిబాబు,డేవిడ్రాజ్, వరలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-06 10:43:08

మహిళాపోలీసుల రెగ్యులైజేషన్ పై ఎప్పీలకు డిజిపీ సూచనలు..

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి”  పై ఆంధ్రప్రదేశ్  డిజిపి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శుక్రవారం తూర్పుగోదావరి  జిల్లా నుంచి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ  గౌతమ్ సవాంగ్  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి” పై ఎస్పీలకు పలు సూచనలు చేశారు. మహిళా పోలీసుల నియామక ప్రక్రియ, దేహధారుడ్య పరీక్షా, శారీరక ప్రమాణాలు, శిక్షణ, జీత భత్యాలు, యూనిఫాం, ప్రోబేషన్ డిక్లరేషన్, ప్రమోషన్ మొదలగు సర్వీసు అంశాలపై రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారులు  జిల్లా ఎస్పీ లతో చర్చించారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డిజిపి ఆదేశాల మేరకు మహిళా పోలీసులకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు స్థానిక మీడియాకి వివరించారు.ఈ కార్యక్రమంలో లా అండర్ ఆర్డర్ అదనపు డిజిపి  రవిశంకర్ అయ్యనార్, డిఐజీ టెక్నికల్ సర్వీసెస్  పాల్ రాజు, దిశ స్టేట్ నోడల్ అధికారి రాజకుమారి పలువురు పోలీసు ప్రధాన కార్యాలయ ఉన్నత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో హాజరయ్యారు.

Kakinada

2021-08-06 09:09:04

అప్పన్నకు అదనపు కార్యదర్శి పూజలు..

సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరహా లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని ప్రభుత్వ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్ శుక్రవారం దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ అధికారులు స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ వైభవాన్ని ఆయనకు తెలియజేశారు. వేదపండితులు ఆశ్వీర్వాదాలు అందించగా, సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట యూనియన్ బ్యాంక్ ఎఫ్జీఎం కెఎస్డిఎస్వీ ప్రసాద్, జోనల్ మేనేజర్ గుణనంద్ గని, సిజిఎం ఎస్.కె.జాన్వర్, నాబార్డు డిడిఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Simhachalam

2021-08-06 03:13:49

వైఎస్సార్ జగనన్న కాలనీలు వేగంపెంచాలి..

గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ జగనన్న కాలనీలలో గ్రూప్ హౌసింగ్ విధానం అమలు చేసి ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు.  గురువారం స్థానిక కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో గుంటూరు డివిజన్ లోని ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాలలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళ పధకం వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ రోజు వారి కూలీలకు వెళ్ళే భార్య భర్తలు సొంతంగా గృహ నిర్మాణం చేసుకోవడం కష్టంతో కూడుకున్న విషయమని, వీరికి ఆప్షన్ మూడు ద్వారా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా లే అవుట్లలో రెండు రోజుల్లో పెండింగ్ లో ఉన్న విద్యుత్ పనులను పూర్తి చేయాలన్నారు.  ప్రతి లే అవుట్ లో సాండ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం ప్లాస్టిక్ పట్టాలతో భూమిలో సంపులను నిర్మించాలన్నారు. లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాల  పర్యవేక్షణకు వీలుగా తాత్కాలికంగా అధికారులు ఉండేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.  ఇళ్ళ నిర్మాణంకు అవసరమైన కంకర సరఫరా కోసం క్వారీ యజమానులతో సమావేశం నిర్వహించి, తక్కువ ధరకు కంకర సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో వైఎస్సార్ జగనన్న లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. 

  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో జగనన్న కాలనీలలో 1.22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు  మంజూరు చేసారన్నారు.  ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఇళ్ళు నిర్మించుకునే వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా  మెప్మా, బ్యాంకర్ల తో లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెగా గ్రౌన్దింగ్ మేళా లో 91,343 గృహాలకు శంఖుస్థాపన చేసామని, లబ్దిదారుల వివరాలు ఆన్ లైన్ చేసి, జియో ట్యాగింగ్, ఇళ్ళ మ్యాపింగ్ చేస్తున్నామన్నారు.  అన్ని లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా విద్యుత్, నీరు, ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

  గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవి, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడు  మాట్లాడుతూ  జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంలో పురోగతి కనిపిస్తున్నదని, ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన మెటిరియల్, స్టేజ్  వైజ్ నిధులు సకాలంలో అందేలా అధికారులు సహకరించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలో అవసరమైన అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ తరపున అమలు జరుగుతున్న పధకాల ద్వారా ఆర్ధిక సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. 

  సమావేశంలో సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి,  హౌసింగ్ పీడీ వేణు గోపాల రావు, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాల  హౌసింగ్, రెవిన్యూ, పంచాయితీ, విద్యుత్, ఇంజనీరింగ్, నగరపాలక సంస్థ  అధికారులు పాల్గొన్నారు.  

Guntur

2021-08-05 17:24:09

మట్టికొట్టుకు పోతావు ఆడదాని ఉసురుపోసుకుంటే..

ఒక ఆడబిడ్డను ఏడిపించి వేధింపులకు గురిచేస్తే మట్టికొట్టుకుపోతావంటూ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై  నిజంగానే మట్టిని విసిరికొట్టారు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఈ సంఘటన గురువారం విశాఖలోని డిసి కార్యాలయంలో జరిగింది. తనను పదే పదే ఏడిపించడం, వివిధ కారణాలతో తన కింది స్థాయి సిబ్బందితో లాలూచీ పడుతున్నట్టు చిత్రీకరిస్తూ వివిధ మీడియాల్లో వార్తలు రాయిస్తున్నారని, పైగా తనను వేధిస్తున్నారని ఏసి మీడియా ముందు బోరున విలపించారు అసిస్టెంట్ కమిషనర్. మహిళనైన తనపై వేధింపులు తట్టుకోలేకే ఈరోజు డిసిపై నిజంగానే మట్టిని విసిరి కొట్టానని కన్నీటి పర్యంతమై చెప్పారు. కిందిస్థాయి సిబ్బంది తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి తప్పితే వాటిని తనకు ఎలా ఆపాదిస్తారని ఆరోపించారు. వేరొక ప్రాంతం నుంచి కుటుంబాన్ని వదలి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని, అయినా తనపై పదే పదే వేధింపులకు డిప్యూటీ కమిషనర్ దిగుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని తమ శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్టు ఆమె ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగా తెలియజేశారు. ఈయన చేస్తున్న వేధింపులపై గతంలోనే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ సమయంలో కూడా ఆయన హాజరు కాలేదన్నారు. అయితే జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా డిసి చెప్పడం విశేషం. తన వ్రుత్తి ధర్మంగానే తాను వ్యవహరించానని ఆయన కూడా మీడియాకి వివరించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత కారణాలు, ఆలోచనలు లేవని చెప్పుకొచ్చారు. దేవాదాయశాఖ డిసిపై మహిళా ఏసి మట్టి విసిరి కొట్టం చర్చనీయాంశమవుతోంది. అయితే గతంలో ఓ దేవస్థానంలో సుమారు రూ.7లక్షల దేవుని హుండీ ఆదాయం కాజేశారనే ఆరోపణలు క్రింది స్థాయి సిబ్బందిపై ఉన్నాయి. ఆ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరుగుతున్న సమయంలో కాన్ఫిడెన్సియల్ ఇన్ఫర్ మేషన్ మీడియాకి లీక్ చేశారనే ఆరోపణలు కూడా డీసి పై ఉన్నాయి. సాధారణంగా కాన్ఫిడెన్సియల్ సమాచారాన్ని ఏ ప్రభుత్వ అధికారి మీడియాకి వివరించ కూడదు. ఈ విషయంలో డిసిని ఉన్నతాధికారులు మందలించినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి వుంది..

Visakhapatnam

2021-08-05 17:18:25