1 ENS Live Breaking News

అప్పన్నకు ఎస్టీ కమిషన్ చైర్మన్ పూజలు..

ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బాధతలు స్వీకరించాక  కుంభా రవిబాబు తొలిసారి శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారిని సతీ సమీతంగా దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్థంబాన్ని ఆలింగన చేసుకున్నారు. పదవి వస్తే స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని రవిబాబు మీడియాతో తెలిపారు. అంతకుముందు ఆలయం పక్కనున్న  రాజగోపురం, కాశీవిశ్వేశ్వర స్వామివారిని కూడా ఆయన  దర్శించుకున్నారు.

Simhachalam

2021-08-02 15:05:37

పోర్టిపైడ్ బియ్యంతో సూక్ష్మపోషకాలు..

ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమ్ బి12 పుష్కలముగా లభించే పోర్టిపైడ్ బియ్యంతో చిన్నారులకు పరిపూర్ణ అరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బియ్యం వాడడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్త హీనతను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.  సోమవారం కలెక్టరేట్ లో పోర్టిపైడ్ బియ్యంపై ప్రజలకు అవగాహన కలిగేందుకు కరపత్రాలను పంపిణీ చేసి బియ్యాన్ని గ్రీవెన్సు వద్ద ప్రదర్శించారు. ఈ పోర్టిపైడ్ బియ్యంతో మెదడు, నాడిమండలం పనిచేయుటలో, ఎర్రరక్త కణాలు ఉత్పత్తి సక్రమంగా జరుగుతుందన్నారు.  గర్బిణీలు తినడం వల్ల గర్బిస్థ శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు.  ఇవి సాధారణ బియ్యమేనని, వీటికి పోషకాలు జత చేయడం జరిగిందని, అపోహలు వీడి అందరు వినియోగించాలని కోరారు. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, గ్రామవాలంటీర్ల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

 

Vizianagaram

2021-08-02 14:37:21

థర్డ్ వేవ్ ఎదర్కోవడానికి సిద్ధంగా ఉండాలి..

కోవిడ్‌ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సంసిద్దంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు. మూడోద‌శ రాకూడ‌నే కోరుకుంటున్నామ‌ని, ఒక‌వేళ వ‌స్తే, దానిని ఎదుర్కొనేందుకు గాను, ఆసుప‌త్రుల్లో అన్ని మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ మూడోద‌శ సన్న‌ద్ద‌త‌పై వైద్యారోగ్య‌శాఖ అధికారులు, వైద్యులు, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల ప్ర‌తినిధులు, ఆసుప‌త్రుల ఇన్‌ఛార్జి అధికారుల‌తో,  మూడోవిడ‌త‌ స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం జ‌రిగింది. జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, అన్ని కోవిడ్‌ ఆసుపత్రుల్లోని ప‌డ‌క‌ల‌కూ ఆక్సీజ‌న్ స‌దుపాయాన్ని క‌ల్పించాల‌ని ఆదేశించారు. ప‌డ‌క‌ల సంఖ్య‌లో క‌నీసం 70శాతం ఆక్సీజ‌న్ కాన్‌సెంటేట‌ర్ల‌ను స‌మ‌కూర్చి సిద్దంగా ఉంచాల‌ని సూచించారు. కొన్ని ఆసుప‌త్రుల‌కు ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను, ట్యాంక‌ర్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని, వెంటిలేట‌ర్ ప‌డ‌క‌ల‌ను సిద్దం చేయాల‌ని చెప్పారు.  జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంట‌క‌ట‌రావు మాట్లాడుతూ, ఆసుప‌త్రుల‌వారీగా స‌న్న‌ద్ద‌త‌పై స‌మీక్షించారు. ప‌డ‌క‌ల సంఖ్య‌, ఆక్సీజ‌న్ బెడ్లు, వెంటిలేట‌ర్లు, ఆక్సీజ‌న్ సిలండ‌ర్లు, కాన్‌సెంటేట‌ర్లు, ఆక్సీజ‌న్ ప్లాంట్ల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై, ఆయా ఆసుప‌త్రుల ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. కోవిడ్ ఆసుప‌త్రులకు ప్ర‌భుత్వం నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను అన్నిటినీ పూర్తి చేసి, ఆసుప్ర‌తుల‌ను ఆగ‌స్టు 15లోగా అన్నివిధాలా సిద్దం చేయాల‌ని ఆదేశించారు.  

             క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే కోవిడ్ మూడోద‌శ మొద‌లైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌న్నారు. అందువ‌ల్ల ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా, జిల్లాలోని కోవిడ్ ఆసుప‌త్రుల‌ను సంసిద్దం చేయాల‌ని సూచించారు. ఏ వ్య‌క్తి కూడా కోవిడ్ చిక‌త్స కోసం బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి రాకూడ‌ద‌ని, అన్ని వ‌న‌రుల‌ను సిద్దం చేయాల‌ని చెప్పారు. మూడోద‌శ‌లో కోవిడ్ పిల్ల‌ల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో, పిల్ల‌ల‌కు చికిత్స‌ను అందించేందుకు అనువైన మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ స‌మావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ఎపిఎంఐడిసి ఇఇ స‌త్య‌ప్ర‌భాక‌ర్‌, వివిధ ఆసుప‌త్రుల నాన్‌మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ఆసుప‌త్రుల ప్ర‌తినిధులు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-02 13:45:14

స్పందన దరఖాస్తులకు సత్వర పరిష్కారం..

స్పందన దరఖాస్తులపై అధికారులు సత్వరమే స్పందించాలని పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌తీ సోమ‌వారం నిర్వహించిన స్పంద‌న కార్య‌క్ర‌మానికి మొత్తం 282 విన‌తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు దరఖాస్తు చేసుకున్న సమస్యలపై పరిష్కారం ఎన్ని రోజుల్లో చేస్తామో తెలియజేయాలన్నారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహిచడం వలన జిల్లా కేంద్రాలకు అర్జీదారులు వచ్చే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకొని గ్రామ సచివాలయాల్లో స్పందన నిత్యం జరిగేలా చూడాలని గ్రామ సచివాలయ జాయంట్ కలెక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్లు డా.జి.సి. కిషోర్ కుమార్,  డా. మహేష్ కుమార్, మయూర్ అశోక్, జె.వెంకటరావు, డి.ఆర్.ఓ. గణపతిరావు, డిపియం పద్మావతి,మత్స్యశాఖ అదనపు సంచాలకులు ఎన్.నిర్మల కుమారి, ఇతర జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-02 13:37:12

స్పందన అర్జీలపై అధికారులు శ్రద్ధపెట్టాలి..

ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల నుంచి స్వీక‌రిస్తున్న అర్జీలను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌ని.. సంతృప్తిక‌ర‌, నాణ్య‌త‌తో కూడిన సేవ‌లు అందేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత స్పంద‌న కార్య‌క్ర‌మం గ‌త సోమ‌వారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆధ్వ‌ర్యంలో ప్రారంభ‌మైంది. రెండో వారం కార్య‌క్ర‌మం కొత్త‌గా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన హ‌రికిర‌ణ్ నేతృత్వంలో సోమ‌వారం జ‌రిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు రావ‌డంతో క‌లెక్ట‌రేట్ కిట‌కిట‌లాడింది. క‌లెక్ట‌ర్‌తో పాటు జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, జేసీ (గృహ‌నిర్మాణం) ఎ.భార్గ‌వ్‌తేజ, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రులు అర్జీలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌తి సోమ‌వారం ఉద‌యం 9.30 గం. నుంచి 10 గం. వ‌ర‌కు అంత‌కుముందు వారం స్పంద‌న‌కు వ‌చ్చిన అర్జీల ప‌రిష్కారం ప్ర‌గ‌తిపై స‌మీక్షించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. నిర్ణీత గ‌డువులోగా ప‌రిష్క‌రించ‌ని అర్జీల‌పై ఆయా శాఖ‌ల అధికారులు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. స్పంద‌న వేదిక ద్వారా వ‌చ్చే అర్జీలు, ప‌రిష్కారం అంశానికి సంబంధించి జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) నోడ‌ల్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్నారు. ప్ర‌తి సోమ‌వారం జ‌రిగే స్పంద‌న కార్య‌క్ర‌మానికి అధికారులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని వివిధ దూర ప్రాంతాల నుంచి వ‌చ్చి మ‌న‌పై ఎంతో న‌మ్మ‌కంతో అర్జీలు స‌మ‌ర్పిస్తార‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో ఆయా సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. 

గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బందికి బ‌యోమెట్రిక్ హాజ‌రు త‌ప్ప‌నిస‌ర‌ని, ఈ విష‌యంపై నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. డిప్యుటేష‌న్ అనేది మాన‌వ‌తా దృక్ప‌థంతో ఉండాలే త‌ప్ప వెసులుబాటుగా ఉండ‌కూడ‌దన్నారు. డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయిలో అధికారులు స‌చివాలయాల ప‌నితీరును నిరంత‌రం ప‌రిశీలించాల‌ని, ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ద్వారా పూర్తిస్థాయిలో ల‌బ్ధిదారుల‌కు ఫ‌లాలు అందేలా చూడాల‌న్నారు. త‌నిఖీల ప్ర‌క్రియ‌ను నిరంత‌రం కొన‌సాగించాల‌ని స్పష్టం చేశారు. కింది స్థాయిలో స‌రిగా త‌నిఖీలు చేప‌ట్ట‌కుంటే ఆ ప్ర‌భావం ఉన్న‌త‌స్థాయిలో ప‌డుతుంద‌న్నారు. క‌లెక్ట‌రేట్‌లో స్పంద‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా ప‌టిష్ట జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని, ఇదే విధంగా ఇత‌ర కార్యాల‌యాల్లోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వైర‌స్ వ్యాప్తిచెంద‌కుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. 

Kakinada

2021-08-02 13:19:41

మాస్కుధారణతోనే క‌రోనాను జ‌యిద్దాం..

మాస్కు ధ‌రించి క‌రోనాను జ‌యిద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. కోవిడ్ మూడోద‌శ‌ను ఎదుర్కొన‌డానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై విస్తృత ప్ర‌చార కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. కోవిడ్ పై  విస్తృత‌ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల్లో భాగంగా సోమ‌వారం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ప్ర‌చార ర‌థాల‌ను క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, స్థానిక‌ ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించారు.అంత‌కుముందు మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, నివాళుల‌ర్పించారు. అనంత‌రం వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో కోవిడ్ అవ‌గాహ‌నా ర్యాలీని నిర్వ‌హించారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ను అల‌వ‌ర్చుకోవాల‌ని, త‌ర‌చూ  చేతుల‌ను శుభ్రం చేసుకోవాల‌ని, ప్ర‌తీఒక్క‌రూ వేక్సిన్ వేయించుకోవాల‌ని నినాదాలు చేశారు. కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌పై క‌ర‌ప‌త్రాల‌ను పంపిణీ చేశారు. ప్ర‌త్యేకంగా నో మాస్క్‌-నో ఎంట్రీ, నో మాస్క్‌-నో రైడ్‌, నో మాస్క్‌-నో సేల్ అంటూ విస్తృతంగా ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.

            ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జిల్లా యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ నాగ‌భూష‌ణ‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, సెట్విజ్ సిఇఓ విజ‌య‌కుమార్‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, మెప్మా పిడి కె.సుగుణాక‌ర‌రావు, డిపిఆర్ఓ డి.ర‌మేష్‌, డిప్యుటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఫోర‌మ్ ఫ‌ర్ బెట‌ర్ విజ‌య‌న‌గ‌రం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో, నీడ్‌, నేచ‌ర్‌, స్వీట్‌, జిఓ ఎన్‌జిఓ(కోవిడ్ ఫోర‌మ్‌), స్వార్డ్, ఉజ్వ‌ల, చేయూత‌ త‌దిత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-02 07:18:18

Simhachalam

2021-08-02 06:47:47

12వ స్థానంతో సరిపెట్టుకున్న తూ.గో.జీ

వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో 12వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో మొదటి స్థానాన్ని విజయనగరం జిల్లా కైవసం చేసుకోగా..గుంటూరు 13వ స్థానంలో నిలిచింది. మొదటి ఐదు స్థానాల్లో విజయనగరం, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు నిలిచాయి. గతంలో ఓసారి పోటీపడిన తూర్పుగోదావరి జిల్లా ఎందుకనో తరువాత ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి రాష్ట్రంలో అత్యధిక రెండవస్థాయి అధిక మండలాలున్న జిల్లాయే అయినా పెన్షన్ పంపిణీలో మాత్రం వెనుబడిపోయి కేవలం 72.33 మందికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయగలిగారు. అయితే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఈ జిల్లాలోనే నమోదు కావడం కూడా ఈ వెనుకబాటుకు మరోకారణంగా చెప్పవచ్చు.

Kakinada

2021-08-01 15:53:06

విజయనగరంలో కలెక్టరమ్మ మార్కు..

విజయనగరం జిల్లాలో కలెక్టరమ్మ సూర్యకుమారి మార్కు వైఎస్సార్ పెన్షన్ కానుకలోనే జిల్లాకి తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పించన్ల పంపిణీలో విజయనగరం జిల్లాను తొలిస్థానంలో నిలుచోబెట్టి అందరి ద్రుష్టినీ ఆకర్షించారు. కానీ ఇది కలెక్టరమ్మ మార్కు విజయంలో చాలా చిన్నఅంశం. ఏ పనిచేపట్టినా కలెక్టరమ్మ తనదైన భాణీలో  దూసుకు వెళుతుంటారు. ఈమె దుర్గగుడి ఈఓగా పనిచేసే కాలంలో కూడా ఎవరూ చేయని సంస్కరణలు చేపట్టి ప్రక్షాళన చేసిన తీరు రాష్ట్రం మొత్తం చూసింది. అదొక్కటే కాదు.. ఎక్కడ పనిచేసినా ఆ పనిలోనూ..అక్కడి ప్రగతిలోనూ కలెక్టరమ్మపేరే కనిపిస్తుంటుంది. హంగు ఆర్బాటాలు ఉండవు.. కానీ పనిమాత్రం అందరికంటే ముందుగా తొలిస్థానంలోనే ఉంటుంది. ఇలాంటి ఫస్ట్ మార్కు విజయాలు మరిన్ని విజయనగరం వాసులు, అధికారులు చూడబోతారనడంలో ఎలాంటి సందేహం లేదు..

Vizianagaram

2021-08-01 14:08:25

స్పంద‌న‌ ను స‌ద్వినియోగం చేసుకోవాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఈ నెల 2వ తేదీన సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్‌లోని స్పంద‌న హాల్‌లో ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి నిర్వహించే జిల్లాస్థాయి స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయన సూచించారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను క‌లెక్ట‌ర్, జిల్లాస్థాయి ఉన్న‌తాధికారులు నేరుగా స్వీకరిస్తారని, సదరు అర్జీల సత్వర ప‌రిష్కారానికి తక్షణ చ‌ర్య‌లు తీసుకోవడం జరుగుతుందని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

Kakinada

2021-08-01 13:49:27

కలెక్టరేట్ విభాగాలు తనిఖీ చేసిన కలెక్టర్..

మాన‌వ వ‌న‌రుల స‌మ‌ర్థ వినియోగం, విధుల నిర్వ‌హ‌ణ‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌మ‌య‌పాల‌నతో ప‌నిచేసేచోట మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. శ‌నివారం జిల్లాకు కొత్త‌గా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన హ‌రికిర‌ణ్ ఆదివారం జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లోని వివిధ విభాగాల‌ను సంద‌ర్శించారు. ఏ-హెచ్ సెక్ష‌న్ల‌ను సంద‌ర్శించి, ఆయా సెక్ష‌న్ల ప‌నితీరును త‌నిఖీ చేశారు. అదే విధంగా రికార్డు గ‌దులను ప‌రిశీలించి వాటి భ‌ద్ర‌త‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను సూచించారు. పెస్ట్ కంట్రోల్ చ‌ర్య‌ల‌తో పాటు అగ్ని ప్ర‌మాదాలు చోటుచేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఎన్నిక‌లు, ఈ-గ‌వ‌ర్నెన్స్‌, ఎన్ఐసీ, డ్వామా, ప్రణాళిక‌, వికాస, స్పంద‌న త‌దిత‌ర విభాగాల‌ను ప‌రిశీలించారు. క‌లెక్ట‌రేట్‌లో అధికారులు, సిబ్బంది ఖాళీలపై నివేదిక స‌మర్పించాల‌ని ఆదేశించారు. నైపుణ్య శిక్ష‌ణ‌కు స‌మాంత‌రంగా యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వికాస అధికారుల‌కు సూచించారు. క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చే వివిధ ర‌కాల ద‌ర‌ఖాస్తుల త‌క్ష‌ణ ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు.

Kakinada

2021-08-01 13:48:27

సమన్వయంతో పనులు పూర్తిచేయాలి..

సర్పంచులు, నాయకులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్ లను పూర్తిచేయాలని సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కెశ్రీనివాసులు వెనుకబడిన 10 మండలాల పంచాయతిరాజ్ ఇంజినీర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు,ఎం.పి.డి.ఓలు, తహశీల్దార్లును ఆదేశించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్.బి.కె, పంచాయతీ భవనాలు, హెల్త్ క్లినిక్ నిర్మాణాలపై సమీకా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  జె.సి మాట్లాడుతూ జిల్లాలో  చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలో సోంపేట, ఆమదాలవలస, వీరఘట్టం, నందిగాం, జలుమూరు,మెలియాపుట్టి,కవిటి,కంచిలి,ఇచ్చాపురం మరియు పొందూరు మండలాలు పురోగతిలో చివరి స్థానంలో ఉన్నాయన్నారు. ఈ పది మండలాలు కేవలం 29.82 శాతం మాత్రమే నిధులు ఖర్చుచేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.నిర్మాణాలలో స్థానికంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించి త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు. రానున్న వారం రోజుల్లో ఆయా మండలాల్లోని పనులు పూర్తిచేసి మొదటి స్థానంలోకి రావాలని కోరారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే సర్పంచులు, స్థానిక నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని కోరారు.

 అలాగే ప్రభుత్వం తరపున తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జె.సి.హామీ ఇచ్చారు.  నిర్మాణ స్థలాలన్ని జియో ట్యాగింగ్ అయినందున ప్రభుత్వం నిర్ణయించిన స్థలంలో నిర్మాణాలు పూర్తిచేయా ల్సిందేనని, ఇందులో ఎటువంటి ఒత్తిడిలకు గురికావద్దని జె.సి తెలిపారు. అలాగే నిర్మాణాలలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు,ఏజన్సీలకు బిల్లులు చెల్లింపులు జరగలేదని కొన్నిచోట్ల నిర్మాణాలు నిలిపివేయడం జరిగిందని, వారి బిల్లులు ఆన్ లైన్ నందు నమోదు చేయకపోవడంతో బిల్లులు చెల్లింపులు జరగలేదని జె.సి తెలిపారు. కాంట్రాక్టర్లు, ఏజెన్సీ లను  చైతన్యపరచి ఇంతవరకు ఖర్చు చేసిన నిధులకు చెందిన బిల్లులను తక్షణమే ఆన్ లైన్ నందు నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని జె.సి తేల్చిచెప్పారు. అలాగే ఏ రోజు జరిగిన పనులు ఆరోజే ఆన్ లైన్ నందు నమోదు చేయాలని  చెప్పారు. అధికారులు ప్రతి రోజు దిన చర్యగా ఆన్ లైన్ నందు స్థానాన్ని పరిశీలించు కొని, మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూసుకొని చేపట్టాల్సిన పనులు గురించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తద్వారా త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రథమ స్థానానికి రావాలని జె.సి ఆకాక్షించారు. ఈ సమావేశంలో   పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్ గుర్రం బ్రహ్మయ్య, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా నీటియాజ మాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్,మండలాల పంచాయతిరాజ్ ఇంజినీర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు,ఎం.పి.డి.ఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-01 12:56:33

క్రిష్ణా వరదనీటి ఉదృతిని ఎదుర్కోవాలి..

నాగర్జునసాగర్ ప్రాజెక్టు నుండి భారీ మొత్తంలో నీటి విడుదల కారణంగా కృష్ణానదిలో వరదనీటి ఉదృతి పెరగనున్న నేపథ్యంలో జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల గ్రామాలలో, లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైన సహాయకచర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాలు, లోతట్టు గ్రామాలలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి తో కలిసి రెవెన్యూ, పంచాయితీ, వ్యవసాయ, పశుసంవర్థక, ఇరిగేషన్, విద్యుత్, వైద్య,ఆరోగ్యశాఖ, పోలీస్ అధికారులతో టెలికాన్ఫర్ ద్వారా ఆదివారం మధ్యాహ్నానం సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదిలో వరదనీటి ఉధృతి పెరుగుతుందని ఆదివారం అర్ధరాత్రి కి ఐదులక్షల క్యూసెక్యుల వరద నీరు నాగర్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలే అవకాశం ఉందన్నారు. నాగర్జునసాగర్ నుంచి విడుదలైన వరద నీరు పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మీదుగా ప్రవహిస్తున్నందున కృష్ణానదికి సమీపంలో గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రెంటచింతల, మాచవరం, గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, తుళ్ళూరు, తాడేపల్లి,  తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, బట్టిప్రోలు, రేపల్లే మండలాలోని గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. 

వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, మండల, డివిజన్ స్థాయిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.   వరద నీటి ముంపుపై సంబంధిత గ్రామ ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను ముందస్తుగా అలెర్టు చేయాలన్నారు.   కృష్ణానదికి సమీపంలో ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలలోకి వరదనీరు చేరే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.  కృష్ణానది వరద నీటి ఉధృతికి కరకట్టకు గతంలో గండ్లు పడిన ప్రాంతాలను  ఇరిగేషన్, పంచాయితీ, రెవెన్యూ,పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించాలని, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలలో బాగంగా బలోపేతం చేయాలని, గండ్లు పడిన వెంటనే పూడ్చేందుకు అవసరమైన ఇసుక సంచులు ఇతర సామగ్రి కూలీలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. కృష్ణానదిలో వరద నీటి ఉధృతి కొనసాగుతున్నందున చేపలు పట్టేవారిని, ఈతకు వెళ్ళేవారిని, పశువులను మేపే వారిని నది వైపుకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు, లోతట్టు గ్రామాల వారికి  పంపిణీ కోసం అవసరం మేరకు నిత్యావసర సరుకులు సిద్దం చేయాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలలోని పంట పొలాల సశ్యరక్షణ చర్యలకు వ్యవసాయం అధికారులు ప్రణాళికలు ముందుగానే రూపొందించాలన్నారు. 

గ్రామాల్లో వరద నీటి వలన పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడకుండా పంచాయితీ అధికారులు ముందస్తుగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలన్నారు. లోతట్టు, ముంపు గ్రామాలలో వరద నీరు చేరితే వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు అవసరమైన పడవలను మత్య్స శాఖ అధికారులు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ముంపు, లోతట్టు గ్రామాల పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను, సమీపంలోని పీహెచ్సీలలో అత్యవసర వైద్యసేవలను అందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. నాగర్జునసాగర్ నుంచి, పులిచింతల ప్రాజెక్టు నుంచి, ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రవహిస్తున్న వరదనీటి వివరాలను, కృష్ణానది పై ప్రకటిస్తున్న ప్రమాద హెచ్చరికలను ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు రియల్టైంలో జిల్లా అధికారులకు అందించాలన్నారు. వరదనీటి ప్రవాహం పై జిల్లా కేంద్రం నుంచి అందుతున్న సూచనలను గ్రామ స్థాయిలోని ప్రజలకు నిరంతరం చేరేవేసేందుకు సచివాలయ, రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు, వాలంటీర్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విపత్కర పరిస్థితులలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో కృష్ణానది వరద నీటి ఉధృతి వలన ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై డివిజన్ స్థాయిలోని అధికారులు మండల, గ్రామ స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు ప్రణాళికలు పక్కాగా రూపొందించి అమలు చేయాలన్నారు.

సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వరదనీటి ఉధృతిని పర్యవేక్షించే ముంపు, లోతట్టు మండలాల అధికారులకు నిరంతరం  సమాచారం అందించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లోను, గుంటూరు, గురజాల, తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోను ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. వరద నీటి వలన తొలుత మునిగిపోయే గ్రామాలను ముందస్తుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ముంపు గ్రామాలకు అవసరమైన నిత్యావసర సరుకులను సమీపంలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో సిద్ధంగా ఉంచుకోవాలని సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులకు సూచిచటం జరిగిందన్నారు.

సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి మాట్లాడుతూ కృష్ణానది ఎగువ, దిగువ ప్రాంతాల్లోని ముంపు గ్రామాల్లోని సచివాలయ సిబ్బంది కృష్ణానదిలో  వరదనీటి ఉధృతి తగ్గేవరకు సచివాలయ ఉద్యోగులు 24 గంటలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు. నీరు ప్రవహించే లో లెవల్ కల్వర్టుల వద్ద ప్రజలు రాకపోకలు లేకుండా పోలీస్, పంచాయితీ ఇంజనీరింగ్ అధికారులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర వైద్యసేవలకు అనుగుణంగా అవసరమైన మందులను వెద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధంగా ఉంచుకొన్నారన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ బాబురావు, నాగర్జున సాగర్ కెనాల్ ఎస్ఈ గంగరాజు, పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు, కృష్ణారివర్ కన్జర్వేటర్ ఈఈ స్వరూప్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయితీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-01 12:54:39

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలి..

కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, అందుబాటులో ఉన్న డోసులు ఆధారంగా స‌చివాల‌యాల వారీగా ల‌బ్ధిదారుల‌ను గుర్తించి టీకా పంపిణీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆదివారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో జిల్లా వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మైన క‌లెక్ట‌ర్‌.. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వైర‌స్ వ్యాప్తి ప‌రిస్థితి, వైర‌స్ క‌ట్ట‌డి కార్యాచ‌ర‌ణ‌, ఆసుప‌త్రుల్లో వ‌స‌తుల క‌ల్ప‌న ప‌రంగా లోపాల‌ను స‌వ‌రించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌, మూడో వేవ్ స‌న్న‌ద్ధ‌త‌పై స‌మీక్షించారు. తొలుత జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి.. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ‌, గిరిజ‌న ప్రాంతాల్లో న‌మోద‌వుతున్న కేసులు; డివిజ‌న్ల వారీగా పాజిటివిటీ ట్రెండ్‌, కోవిడ్ కేసుల మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, మూడో వేవ్ స‌న్న‌ద్ధ‌త కార్యాచ‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల 26న జిల్లా వ్యాప్తంగా చేప‌ట్టిన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ద్వారా రాష్ట్రంలోనే అత్య‌ధికంగా ఒక్క‌రోజులోనే 1,91,850 డోసుల‌ను పంపిణీ చేసిన‌ట్లు వివ‌రించారు. కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న స‌మ‌యంలో రోజుకు ప‌దివేల వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, ప్ర‌స్తుతం రోజుకు ఆరువేల వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మూడో వేవ్ ముప్పు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో ప్ర‌త్యేకంగా పీడియాట్రిక్ ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేస్తుండ‌టంతో పాటు ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు అమ‌లాపురం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోనూ వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌ణాళిక‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు జేసీ (డీ) వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ మాట్లాడుతూ టీకా డోసుల ల‌భ్య‌త‌నుబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ పూర్తిచేయాల‌ని.. రెండుమూడురోజుల్లో 90 శాతం ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని ఆదేశించారు. తొలుత రెండోడోసు ల‌బ్ధిదారుల‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని, అనంత‌రం మొద‌టి డోసు పంపిణీ చేయాల‌న్నారు. జ‌నాభాకు అనుగుణంగా పీహెచ్‌సీల వారీగా టెస్టింగ్‌కు సంబంధించి శాంపిల్ సేక‌ర‌ణ ల‌క్ష్యాల‌ను నిర్దేశించి, వాటిని చేరుకునేలా ప్రోగ్రామింగ్ అధికారులు చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ల‌క్ష్యాల‌ను చేరుకున్న‌, చేరుకోని పీహెచ్‌సీల నివేదిక‌ల‌ను (exception report) ఎప్ప‌టిక‌ప్పుడు పంపాల‌ని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియను అంతా ఒకే గొడుకు కింద‌కు తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పాజిటివ్ కేసుల కంటైన్‌మెంట్ విష‌యంపై దృష్టిసారించాల‌ని.. ప్ర‌స్తుతం పాజిటివిటీని దృష్టిలో ఉంచుకొని ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ జాగ్ర‌త్త‌లు, నిబంధ‌న‌ల‌ను పాటించేలా చూడాలన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉల్లంఘ‌న జ‌ర‌క్కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు పోలీసు శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.
మూడో వేవ్ స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా ఆసుప‌త్రుల్లో ఏర్పాటుచేస్తున్న ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉండేలా చూడాల‌ని, ప్ర‌తి ప‌డ‌క వ‌ద్ద ప్రెజ‌ర్ అబ్జ‌ర్వేష‌న్‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న దాదాపు 1400 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల ప‌నితీరును ప‌రిశీలించి, ఏవైనా మ‌ర‌మ్మ‌తులు అవ‌స‌ర‌మైతే వెంట‌నే చేయాల‌న్నారు. ఆక్సిజ‌న్ పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ట్యాంకుల స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌న్నారు. కోవిడ్ ఆసుప‌త్రుల‌పై ఒత్తిడిని త‌గ్గించేందుకు వీలుగా ట్రాన్సిట్ ఆసుప‌త్రుల ఏర్పాటుపై ప‌రిశీల‌న చేయాల‌న్నారు. ప్ర‌ధానంగా కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అమ‌లాపురం, రాజోలు త‌దిత‌ర ప్రాంతాల నుంచి విదేశాల‌కు రాక‌పోక‌లు సాగించే వారిపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి వీసా వ్యాలిడిటీ ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, ఇన్‌చార్జ్ డీఎస్‌వో డా. నాగ‌భూష‌ణం, డీసీహెచ్ఎస్ డా. ర‌మేష్ కిశోర్‌, కాకినాడ ల్యాబ్ ఉన్న‌తాధికారి డా. మూర్తి, డీఐవో డా. భ‌ర‌తల‌క్ష్మి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-01 12:37:57

తెలుగు అకాడమిని త్వరలోనే ఉద్ధరింస్తాం..

రాష్ట్ర తెలుగు అకాడమిని ఉద్దరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షులు డా. నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలుగు అకాడమీ అధ్యక్షులు గురుగుబెల్లి లోకనాథం రచించిన గులోనా గుళికలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. తెలుగును బ్రతికించుటకు సంస్కృతాన్ని అకాడమీలో చేర్చారని చెప్పారు. తెలుగు ప్రాకృతంలో పుట్టిందని, పాళీ భాషలో అమరిందని అనేక భాషలను తనలో చేర్చుకుంటూ భాషలలో ప్రత్యేక భాషగా ఉద్భవించిందని ఆమె వివరించారు. ఉపనిషత్తుల ద్వారా సంస్కృతం దేవ భాషగా మారిందని, తెలుగు భాష సంస్కృతాన్ని ఇమిడించుకుందనీ ఆయన చెప్పారు. రెండు భాషలు లీనమైపోయాయని ఆమె తెలిపారు. భాష నిరంతర ప్రవాహం అన్నారు.సంస్కృతులు, సంప్రదాయాలు కలుపుకొని సాగే గుణం తెలుగు భాషకు ఉందనీ చెప్పారు. విశాలతత్వం తెలుగు భాషకు ఉందనీ ఆమె తెలిపారు. రాష్ట్రంలో పేదల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని అయితే తెలుగు విధిగా నేర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు.నాసా సంస్కృతానికి పెద్ద పీట వేసిందని అన్నారు. గులోనా గుళికలు వ్యాస సంపుటి ఎంతో చక్కని, సమాజానికి  ఉపయోగడే అంశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్య అతిథి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రచనలు తరతరాలకు సూచికగా నిలుస్తాయన్నారు. సమాజాన్నిరచయితలు సంస్కరించాలని పిలుపునిచ్చారు. రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రచనల ముద్రణకు తెలుగు అకాడమి ప్రయత్నించాలని సూచించారు. రచయితలకు మంచి స్థానం కల్పించాలని పేర్కొంటూ గులోన మరిన్ని రచనలు చేయాలని ఆకాక్షించారు. 

గులోనా గుళికలు రచయిత గురుగుబెల్లి లోకనాథం మాట్లాడుతూ సమాజంలో జరుగతున్న సంఘటనల సంపుటి ఈ రచన అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ హెచ్. లజపతిరాయ్, పాత్రికేయులు నల్లి ధర్మారావు, రచయిత అట్టాడ అప్పలనాయుడు, వైద్యులు దానేటి శ్రీధర్,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-01 12:33:34