1 ENS Live Breaking News

వార్డు కార్యదర్శులకు శిక్షణాతరగతులు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్  డా. జి. సృజన గురువారం జివిఎంసి ఉన్నతాధికారులు,  జోనల్ కమిషనర్లు,  వార్డు ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఎం.ఎ.&యు.డి. కి సంబందించిన ఆరు రకాల సచివాలయ కార్యదర్శులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఏపిహెచ్ఆర్ డి తరుపున ఆన్లైన్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యదర్శులందరూ ఉదయం 8.45 గంటలకు మొబైల్ ఫోన్ లోనే హాజరు అవ్వాలని, మెడికల్ లీవ్ లోనూ,  మెటర్నటీ లీవ్ లో ఉన్నవారు కూడా తమ మొబైల్ ఫోన్లో నుండి క్లాసులకు హాజరు వాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఆన్లైన్ క్లాసులో పాల్గొని తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంతం 5 గంటల వరకు వారి వారి సచివాలయాలలో యధావిధిగా విధులను నిర్వహించాలని ఆదేశించారు. అందరు జోనల్ కమిషనర్లు, నోడల్ అధికారులుగా వ్యవహరించాలని, వారి దిగువ స్థాయి సిబ్బందిని ప్రోగ్రాం ఇంచార్జ్ లుగా ఏర్పాటు చేసుకుని ఈ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.

Visakhapatnam

2021-07-29 15:05:42

విద్యార్థుల చదువులకు ఇబ్బంది రాకూడదు..

విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా జగనన్న విద్యా దీవెన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తల్లులు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు.  గురువారం విద్యా దీవెన పై వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ త్రైమాసికానికి విద్యా దీవెన తల్లులు ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా  6140 మంది విద్యార్థులకు 2 కోట్ల 81  లక్షల 8342 రూపాయలని, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 2692 మంది విద్యార్థులకు ఒక కోటి 5 లక్షల 89 వేల 103 రూపాయలని, వెనుక బడిన సంక్షేమ శాఖ ద్వారా 55864 మంది విద్యార్థులకు 26 కోట్ల 98 లక్షల 97 వేల 441 రూపాయలని, ఇబిసి ద్వారా 1902 మంది విద్యార్థులకు ఒక కోటి 4 లక్షల 74 వేల 892 రుపాయలని, మైనారిటీ సంక్షేమ శాఖా ద్వారా 145 మంది విద్యార్థులకు 6 లక్షల 34 వేల 475 రూపాయలని, కాపు సంక్షేమ శాఖ ద్వారా 991 మంది విద్యార్థులకు 68 లక్షల 34 వేల 995 రూపాయలను, క్రిస్టియన్ మైనారిటీ 15 మంది విద్యార్థులకు 81 వేల 112 రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేసినట్లు వివరించారు. 

 పాతపట్నం నియోజక వర్గం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ తల్లి, తండ్రి ఎన్నో కష్టాలు పడుతూ తమ పిల్లలను చదివిస్తున్నారని,  తల్లి తండ్రిలకు కష్టాలు లేకుండా తమ పిల్లలకు ప్రభుత్వమే ఫీజు చెల్లించే విధంగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ప్రవేశపెట్టినట్లు వివరించారు.  అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశమన్నారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు.   రాజాం నియోజక వర్గం శాసన  సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ విద్యా, వైద్యరంగాలకు ముఖ్యమంత్రి పెద్ద పీఠ వేస్తున్నారని చెప్పారు.  విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి  జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహాయం చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు  వెల్లి చదువుకోవచ్చునని, అక్షరాస్యత పెరగాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ. రత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, బిసి సంక్షేమ శాఖ డిడి కృతిక, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-29 14:06:51

సింహాద్రి అప్పన్నకు కలెక్టరమ్మ పూజలు..

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి దంపతులు గురువారం సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ  వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారికి పూజలు చేశారు.  ఇటీవలే విజయనగరం కలెక్టర్ గా నియమితులైన ఆమె స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులకు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కలెక్టర్ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఆమె శుక్రవారం విజయనగం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Simhachalam

2021-07-29 14:01:12

పుష్ప గుచ్చాలొద్దు.. పుస్తకాలివ్వండి..

విజయనగరం జిల్లా కలెక్టర్ గా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, అనధికారులు, ఇతరులు ఇకపై తనకు పూల దండలు, పుష్ప గుచ్ఛాలు తేవద్దని సూచిస్తున్నారు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న ఏ. సూర్యకుమారి. దానికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగ పడేలా నోటు పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పుష్ప గుచ్చాల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని విద్యార్థులకు ఉపయోగ పడే పనికి వినియోగించడం వల్ల ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసినట్లవుతుందని అందరూ ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ గా ఈ నెల 30న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. దీనితో నూతన కలెక్టర్ ప్రతిపాదనను అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతిస్తున్నారు.

Vizianagaram

2021-07-29 13:52:40

విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి..

విద్యార్థులు ఉన్నత చదవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లుతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెండవ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల 97 వేల మంది విద్యార్థులకు 694 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. నేరుగా విద్యార్థులు తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివితేనే తలరాతలు మారుతాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇతరులకు శత శాతం ఫీజు రీ ఎంబార్స్ మెంట్ ఉంటుందని చెప్పారు. చదువులకు పిల్లలు తల్లిదండ్రులు అప్పులు అవ్వకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకాలతో పిల్లలు భవిష్యత్తు మార్చడానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతీ త్రైమాసికానికి నేరుగా విద్యార్థులు తల్లులు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రెండవ విడత జగనన్న వసతి దీవెన డిశంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, పాతపట్నం, రాజాం శాసన సభ్యులు రెడ్డి శాంతి, కంబాల జోగులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ. రత్నం, గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, బిసి సంక్షేమ శాఖ డిడి కృతిక, రిటైర్డ్ సెట్ శ్రీ సిఇఓ సూరంగి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం  32,81,08,342 రూపాయల చెక్కును విద్యార్థులకు అందజేశారు.

శ్రీకాకుళం

2021-07-29 13:41:14

యాంత్రీకరణ పద్ధతులు అవలంబించాలి..

రైతులు యాంత్రీకరణ పద్దతులు అవలంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.   బుధవారం మబగాంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యాంత్రీకరణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక పద్ధతులు మన ముందుకు వచ్చాయని, వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  గతంలో పశువులుతో పని చేసేవారమని, ప్రస్తుతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.  యాంత్రీకరణ పై రైతులు అవగాహన పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడులు పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి ప్రతీ విషయంపై చర్చిస్తున్నట్లు చెప్పారు.  మెరుగైన వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించుకొని రాబడులు పెంచుకోవాలని పేర్కొన్నారు. మన ప్రాంతాలకు వ్యవసాయం చేయడానికి ఇతర ప్రాంతాలు నుండి వస్తారని చెప్పారు. కౌలు రైతుల్లో మనోధైర్యం నింపినట్లు చెప్పారు. రైతులు యాంత్రీకరణ పద్ధతులు ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని అందుకొని యాంత్రీకరణ పద్దతులు అవలంభించాలని రైతులకు పిలుపునిచ్చారు.  పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాలని, రైతులు కూడా నూతన పద్ధతులు, నూతన వంగడాలను అవలంభించాలని వివరించారు.  శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం యాంత్రీకరణ పద్ధతుల్లో చేయడానికి మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కూలీలు దొరకని సమయంలో యాంత్రీకరణ పద్దతులు అవలంబించి మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల్లో యాంత్రీకరణ పై అవగాహన పెంచాలని కోరారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఖర్చు తక్కువగా ఉండి దిగుబడులు ఎక్కువగా ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని చెప్పారు. రైతులు యాంత్రీకరణ పద్ధతులను అవలంభిస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. ఇలాంటి సమాశాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  సుగర్స్ ఎజిఎం మాట్లాడుతూ కూలీలు సమస్య వలన యాంత్రీకరణ పై దృష్టి సారించాలని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ మాట్లాడుతూ యాంత్రీకరణ నిరంతరం జరుగు ప్రక్రియన్నారు.  యాంత్రీకరణ సాగుతో పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందని వివరించారు. చీడ పీడల సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెప్పారు. నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని వివరించారు. అనకాపల్లి పరిశోధన సంస్థ ఎడి భరత లక్ష్మి మాట్లాడారు.

          వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్ యాంత్రీకరణ పద్దతుల పై మాట్లాడారు. రైతు వరహ నర్సింహం మాట్లాడుతూ ఎన్.ఆర్.జి.యస్. కూలీ పనులకు వెళ్లడం వలన కూలీలు దొరకడం లేదని, ఈ సమయంలో యాంత్రీకరణలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ తో ఒక రోజు కు 5 ఎకరాల భూమిని వరినాట్లు వేయవచ్చని, దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.  రైతు సింహాచలం మాట్లాడుతూ లేజర్ గైడెడ్ లెవలర్స్ జిల్లాకు తీసుకురావాలని చెప్పారు. యాంత్రీకరణ తో దిగుబడి పెరుగుతుందన్నారు. రైతు మధుసూదనరావు, పంచిరెడ్డి సింహాచలం చెరకు సాగు పద్ధతులు పై వివరించారు.  అంతకు ముందు అక్కడే ఏర్పాటు చేసిన యాత్రీకరణ లు చెరకు నరకు యంత్రం, 5 రెక్కలు నాగళ్ళు, రోటా వేటర్, కలుపు తీత యంత్రం, ధాన్యం మిల్లర్లు, తుంపర్ల సేధ్యం, వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన వరి దిగుబడి, విత్తనాలు వేయు పద్దతి, ఎరువులు స్టాల్స్ ప్రదర్శనలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కలుపు, ఎరువులు వాడకంపై బ్రోచర్లను ఆవిష్కరించారు.  భారత వాతావరణ పరిశోధనా సంస్థ ఏర్పాటు చేసిన డాము యాప్  డౌన్‌లోడ్ చేసుకుంటే ముందుగా పిడుగులు పడే సమాచారం బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఉత్తర ఆంధ్ర అగ్రి మిషన్ సభ్యులు జి. రఘురామ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సభ్యులు డాక్టర్ ఎస్. నేతాజి, సర్పంచ్ పి. దానమ్మ, ఆత్మ పిడి కె. కృష్ణారావు, ఎపిఎంఐపి పిడి జమదగ్ని, రాగోలు పరిశోధన సంస్థ డా. సత్యనారాయణ, చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:28:15

యాంత్రీకరణతో వరినాట్లు వేసిన మంత్రి..

యాంత్రీకరణతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వరి నాట్లు వేశారు. బుధవారం మబగాంలో ఏర్పాటు చేసిన యాంత్రీకరణ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉన్నారు. తుంపర్ల సేద్యంతో పంటకు రక్షణ, డ్రమ్ సీడర్ తో వరి విత్తనాలు వేయు పద్దతి, వరుసలో వరి నాట్లు వేయు పద్ధతులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  డిసిసిబి ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, ఆత్మ పిడి కృష్ణారావు, రాగోలు వ్యవసాయ క్షేత్రం , నైరా కళాశాల శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:26:23

ప్రకృతిని మనమే పరిరక్షించు కోవాలి..

ప్రకృతిని పరిరక్షించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు అన్నారు. ప్రపంచ ప్రక్రుతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శాంతి నగర్ క్రీడా సముదాయం ఆవరణలో బుధ వారం మొక్కలు నాటారు. ఈ సందర్భగా శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రకృతినీ పరిరక్షించితే అది మనలను రక్షిస్తుందని అన్నారు. ప్రకృతిని వినాశనం చేస్తే మానవుడు వినాశనాన్ని కోరుకుంటున్నట్లు భావించాలని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు ప్రకృతి వినాశనం మూలంగా జరుగుతుందనీ ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ సి.ఇ.ఓ కే. సూర్య ప్రభాకర రావు, చీఫ్ కోచ్ బి. శ్రీనివాస కుమార్, కోచ్ లు శ్రీధర్, బాలమురళి, పర్యాటక అధికారి నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:22:00

ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి..

శ్రీకాకుళం జిల్లాలోని శాఖాధిపతులు ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి కేటాయించిన నిధులలో యస్.సి , యస్.టిలకు నిధులు తప్పక కేటాయించాలని , ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యస్.సి కాంపోనెంట్ నిధులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు తమ శాఖలకు కేటాయించిన నిధులలో ప్రభుత్వ నిర్ధేశాల మేరకు కేటాయించడం సంతోషకరమని, అయితే గతేడాదిలో ఖర్చుచేసిన వివరాలతో పాటు రానున్న కాలంలో నిధులు కేటాయించేందుకు తీసుకున్న ప్రణాళికల వివరాలు కూడా సమర్పించాలని కోరారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి యస్.సి.కాంపొనెంట్ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉందని, అయితే కొన్ని శాఖలు నిల్ రిపోర్టు చూపాయని, వాటిపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని,  ప్రతీ సంక్షేమ పథకం ఏదో ఒక శాఖతో ముడిపడి ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని శాఖాధిపతులు సంక్షేమ పథకాల వారీగా కేటాయించిన నిధుల వివరాలతో పాటు యస్.సిలకు, యస్.టిలకు కేటాయించిన, ఖర్చుచేసిన, ఖర్చుచేయబోతున్న నిధుల వివరాలు అందజేయాలని ఆదేశించారు. వచ్చే నెల 4వ తేది నాటికి పూర్తి వివరాలు అందజేయాలని, తదుపరి సమావేశంలో అందజేసిన నివేదికలపై చర్చించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో యస్.సిలకు కేటాయించాల్సినవి ఏమైనా ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే మంజూరుచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  

            ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్,  జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ.రత్నం, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోధలక్ష్మీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:19:21

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి..

ఆరోగ్యకరమైన సమాజం కోసం, స్థిరమైన వాతావారణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్  జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.  ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం, వాతావరణానికి మొక్కలు పునాది వంటిదని అన్నారు. మానవజాతి దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం భూమి, దాని నుండి లభించే వనరులను ప్రకృతి వనరులుగా పిలుస్తామని, అటువంటి వనరులను భావితరాల కోసం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను ప్రకృతి తీరుస్తుందని, అటువంటి ప్రకృతిని మన అశ్రద్ధ కారణంగా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, తద్వారా స్వచ్చమైన గాలి, నీరు, వర్షం, వాతావరణం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అలాగే రెడ్ క్రాస్ సంస్థ లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పండగ రోజు, ఇతర పర్వదినాలను పురష్కరించుకొని ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు.

        ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహన రావు, కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు,  సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి కె.యస్.ప్రభాకరరావు, తహశీల్ధారు వెంకటరావు, రెడ్ క్రాస్ యం.సి మెంబర్స్ పి.శ్రీకాంత్, పెంకి చైతన్యకుమార్, సత్యనారాయణ, విజయ, శ్రీధర్, కోటేశ్వరరావు, చౌదరి రాధాకృష్ణ,లయన్స్ క్లబ్ సభ్యులు బాణాన దేవభూషణరావు, డా. చింతాడ కృష్ణమోహన్, టి.రామగోపాల్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:16:59

సమన్యాయమే తమ ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు ఎస్.సిలు, ఎస్.టిలకు కూడా సమన్యాయాన్ని అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని,   ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. జిల్లాలో ఎస్.సిలు, ఎస్.టిలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు, దాడులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రతీ ఒక్కరికి సమన్యాయం తప్పక లభిస్తుందని అభిప్రాయపడ్డారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం, అట్రాసిటీ కేసులపై విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో మెరుగైన స్థితి కనిపిస్తుందని ఇది శుభపరిణామమని అన్నారు. ఎస్.సిలు, ఎస్.టిలు తమ హక్కులు గురించి ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో, అంతే బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలోని ఎస్.సిలకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, అందువలనే జిల్లాలో వైషమ్యాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 

ఎస్.సిలు,ఎస్.టిల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎస్.సిలు, ఎస్.టిల సమన్యాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విశేషకృషి చేస్తున్నారని, వారితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. కమిటీ సభ్యురాలైన నిమ్మక కళావతి కుటుంబానికి జరిగిన విషయంపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ, కళావతి కుటుంబం ఒంటరిగా పోరాటం చేయడం బాధ కలిగిస్తుందని, ఆమె ఒంటరే అయినప్పటికీ ప్రభుత్వం అన్నివిధాల తగు న్యాయం చేస్తుందని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎస్.సిలకు, ఎస్.టిలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే తక్షణమే తమ సమీప పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని, అప్పటికీ స్పందించకుంటే తమ పై అధికారులు లేదా జిల్లా కలెక్టర్ ను సంప్రదించవచ్చన్నారు. అలాగే తమను కూడా సంప్రదించి తమ సమస్యలను తెలియజేసుకోవచ్చని, బాధ్యులు ఎంతటివారైన తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అయితే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోరాదని హితవు పలికారు. అణగారిన అన్నివర్గాల వారికి సమతుల్యత పాటిస్తూ  రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ పదవులను కట్టబెట్టడం జరిగిందని, ఉపముఖ్యమంత్రి పదవినే ఎస్.సి మహిళకు కట్టబెట్టిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. అలాగే సమర్ధవంతమైన ఎస్.సి,ఎస్.టి మంత్రులు ప్రభుత్వంలో ఎందరో ఉన్నారని, ఇది శుభపరిణామమని అన్నారు. అన్నివర్గాల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, అధికారులంటే ప్రభుత్వానికి అపారమైన గౌరవమని ఉపముఖ్యమంత్రి తెలిపారు. తప్పు జరిగితే దోషులు ఎంతటి వారైన వదలిపెట్టబోమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఉద్భోదించారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న అట్రాసిటీ, అత్యాచార కేసులను తక్షణమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని అధికారులను కోరారు. భవిష్యతులో ఏ ఒక్కరూ తమకు న్యాయం జరగలేదని రాకూడాదని, అటువంటి సమాజం జిల్లాలో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, అందరూ క్షేమంగా ఉండాలనే ప్రభుత్వం పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి వివరించారు.

        పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ తగిన న్యాయం జరగడం లేదని,  ఇప్పటికైనా మరింత న్యాయం జరిగేలా ఈ సమావేశం చర్యలు తీసుకోవాలని కోరారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో చిల్లంగి, చేతబడి పేరుతో అమాయక కుటుంబాలను మానసికంగా కృంగదీసి, అమానుషంగా గ్రామాల నుండి వెలివేస్తున్నారని, అటువంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేయగా జన విజ్ఞాన వేదిక ద్వారా మారూమూల ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించి గిరిజనుల్లో మార్పును తీసుకువస్తామని వై.సి.బి డైరక్టర్ యం.ప్రసాదరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  సీతంపేటలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలికది నిరుపేద కుటుంబమని, నివశించేందుకు సరైన గృహం కూడా లేదని, కావున ఆమెకు గృహాన్ని మంజూరుచేయాలని కోరగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే గృహంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పాలకొండ ఆర్.డి.ఓను ఆదేశించారు. తమ నియోజకవర్గంలోని పలు యస్.సి కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా నోచుకోలేదని, దీనిపై యస్.సి.కార్పొరేషన్ ను సంప్రదించినప్పటికీ ఎటువంటి నిధులు మంజూరుకాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వహిస్తున్న నాడు – నేడు కార్యక్రమం క్రింద కనీస మౌలికవసతులు కల్పించాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఎస్.సి.ఎస్.టి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయలేదని, వాటిని భర్తీచేయాలని కోరగా పోస్టుల వివరాలను సేకరించి నోటిఫికేషన్ జారీచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులను కలెక్టర్ ఆదేశించారు.

        పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ తమ నియోజక వర్గ పరిధిలో ఐదు మండలాల్లో గిరిజనులు నివశిస్తున్నారని, వారు అమాయికులని అటువంటి వారిపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. నాటుసారాలో ఉపయోగించే బెల్లం ఊటను మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు తయారుచేస్తున్నారని వదంతులు వస్తున్నాయని, నిజానికి గిరిజనులు తయారుచేయడం లేదని యస్.పి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సెంట్రల్ ఎక్సైజ్, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కలప తమ నియోజకవర్గం నుండే వెళ్తుందని, దీన్ని కూడా గిరిజనులే చేస్తున్నట్లు వదంతులు వస్తున్నాయని, వీటిపై అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోనే చివరిస్థానంలో పాతపట్నం నియోజకవర్గం ఉందని, దీన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా విద్యను అందించాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించడం వలన గిరిజనులు కూడా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు. గిరిజనుల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయని, అటువంటి ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి మూఢనమ్మకాలకు దూరంగా ఉంచాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగులో ఉన్న అట్రాసిటి, అత్యాచార కేసులను డి.ఎస్.పిలు స్వయంగా పర్యవేక్షించి బాధితులకు తగు న్యాయం చేయాలని కోరారు. రానున్న సమావేశానికి ఎటువంటి కేసులు పెండింగు లేకుండా చూడాలని, కావున వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కోరారు. ఎస్.సిలు,ఎస్.టిల మీద జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను పారద్రోలేందుకే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నామని, అందుకు తగిన విధంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్.సి,ఎస్.టిలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, బాధితులు ఎవరైనా తమకు అన్యాయం జరిగితే పిర్యాదు చేయవచ్చని చెప్పారు. కేసులను బట్టి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కొన్ని ప్ర్రత్యేకమైన కేసులను బట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, కాని నిజమైన దోషులను ఎప్పటికీ విడిచిపెట్టబోమని, బాధితులకు తగు న్యాయం తప్పక చేసి తీరుతామని ఎస్.పి హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్, పాలకొండ, శ్రీకాకుళం రెవిన్యూ డివిజినల్ అధికారులు టి.వి.యస్.జి.కుమార్, ఐ.కిశోర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ.రత్నం, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, నాన్ అఫీషియల్ సభ్యులు కంఠ వేణు, సతివాడ రామినాయుడు, బంటు దుర్గారావు, నిమ్మక కళావతి, స్వచ్ఛంధ సంస్థలు ప్రతినిధులు వై.సి.బి. డైరక్టర్ యం.ప్రసాదరావు, ఆర్ట్స్ సన్యాసిరావు, స్వీప్ కె.రమణమూర్తి, ఎస్.సి,ఎస్.టి సెల్ డి.ఎస్.పిలు, పబ్లిక్ ప్రోసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-28 15:14:19

సచివాలయాలు తనికీచేసిన ఎ.డి.హెచ్..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ హార్టికల్చర్ విభాగపు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. దామోదర రావు 5వ జోన్ పరిధిలో మాధవధారలొని నాలుగు సచివాలయాలను బుధవారం సందర్శించి సచివాలయ కార్యదర్శుల బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టరు, డైరీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని, ఎటువంటి అలసత్వం వహించరాదని కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయాలలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా సూచిక బోర్డులు, అత్యవసర్ ఫోన్ నెంబర్లు, వివిధ పధకాలు తెలిపే నోటీసు బోర్డులు ఉండాలని ఆదేశించారు. కార్యదర్శుల విధులపై బయటకు వెళ్ళినప్పుడు తప్పని సరిగా మూమెంట్ రిజిష్టర్ లో పని  పూర్తి వివరాలు వ్రాయాలని, సెలవు పెట్టవలసి వచ్చినప్పుడు జోనల్ కమిషనర్ కు తెలియపరచాలని ఆదేశించారు.   

విశాఖ సిటీ

2021-07-28 15:10:31

రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి..

రక్తదానం చేసి ఆపదలో వున్నవారి ప్రాణాలు కాపాడాలని విశాఖ నగర పాలక సంస్థ మేయర్  గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. బుధవారం ఓలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.  ఆమె 3వ జోన్ 19వ వార్డు పరిధిలోని పెద్ద జాలరిపేటలో ఓలిశెట్టి సత్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ సంస్థ ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అన్ని దానాల కంటే రక్త దానం గొప్పదని,  కరోనా వైరస్ కారణంగా రక్తదానం చేసే వారు తక్కువగా ఉన్నందున రక్త నిల్వలు తగ్గుతున్నాయని ఇటువంటి కష్ట కాలంలో చారిటబుల్ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు  చేసిందని,  రక్తదానం వలన ఎంతోమంది ప్రాణాలను కాపాడగలమని తెలిపారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నకు దాదాపు 200 మంది యువత నేడు రక్తదానం చేశారని, మరింత మంది రక్తదానం చేయాలని యువతకు మేయర్ పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఓలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ ఓలిశెట్టి గురునాథంకు మేయర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంనకు మత్స్యశాఖ చైర్మన్ కోలా గురువులు,  కార్పొరేటర్ బెహరా భాస్కర్,  స్వచ్ఛ భారత్ అంబాసిడర్ రమణ మూర్తి,  వైయస్సార్ సిపి నాయకులు అక్కరమాని వెంకటరావు,  పేడాడ రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-28 15:02:23

బలవర్ధక బియ్యంపై అవగాహన పెంచండి..

బలవర్ధక  బియ్యం(పోర్టిఫైడ్ రైస్) పై గ్రామాల్లో అపోహలున్నాయని, వాటిని పోగొట్టి ప్రజలు వినియోగించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. జె.ఎన్. టీ. యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి  బుధవారం  ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరైనారు. ఈ సందర్బంగా సర్పంచ్ లతో మాట్లాడుతూ ఫోర్టిఫైర్డ్ బియ్యం పై అవగాహన లేకనే  ప్లాస్టిక్ బియ్యమని  గ్రామాల్లో అపోహ పడుతున్నారాని,  సాధారణ ధాన్యానికి పోషకాలను కలపడం ద్వారా బలవర్ధకంగా తయారు అవుతాయని అన్నారు.  ప్రభుత్వ పథకాలపై  కూడా ప్రజలకు అవగాహన కల్పించడం,  వాటిని లబ్ది దారులకు  పారదర్శకంగా  అందించడం లో కూడా దృష్టి పెట్టాలన్నారు.  గ్రామాభివృద్ధి లో సర్పంచ్ ల దే  కీలక పాత్ర యని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుభాషిణి, డి.ఎల్.డి.ఓ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-28 13:55:27

సింహాద్రి అప్పన్నకు కాటా విరాళం..

 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారి క్రిస్టల్ ఇండస్ట్రీస్ అధినేత గ్రంధి సతీష్  200 కేజీల కాటాను అన్నదాన సత్రం కు ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ కెవి నాగేశ్వరరావు ద్వారా విరాళంగా అందజేశారు. బుధవారం ఈ మేరకు కాటాను దేవస్థానం అధికారులకు అందించారు. తొలిపూజ చేసి కాటాను ప్రారంభించారు. అనంతరం దాతలు స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు దాతలకు తీర్ధ ప్రసాదాలు అందించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-28 13:53:55