1 ENS Live Breaking News

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.03 కోట్లు..

విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి హుండీ ఆదాయం ఒక కోటి మూడు లక్షల 35వేల 857 రూపాయలు వచ్చిందని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. భారత దేశ కరెన్సీతోపాటు ఆరు దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా స్వామివారి హుండీ లెక్కింపులో లభ్యమైందని ఈఓ తెలియజేశారు. ట్రస్టుబోర్టు సభ్యులు, ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, ఇతర సభ్యులు, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో పరకామణి లెక్కింపు కార్యక్రమం చేపట్టిన్టు చెప్పారు. దీనికోసం ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసినట్టు చెప్పారు.

సింహాచలం

2021-08-04 14:02:14

అన్నదాతలకు అండగా నిండుగా రైతు భరోసా కేంద్రాలు..

 రైతు బాగుంటేనే రాష్ట్రం ఆన్ని విధాలా అభివృధి చెందుతుంది, వ్యవసాయంతో ఆహార భద్రత కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగు తాయనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మార్పులు చేశారు ఆని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. బుధవారం కురుపాంలో  ఉప ముఖ్యమంత్రి రైతు భారోసా కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భం గా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ, రైతులకు బహుళ ప్రయోజనాలు కలిగించే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాలలోనే  విత్తనం నుండి పండించిన పంట అమ్మకం వరకు సేవలందిస్తోంది అన్నారు. అలాగే వై.ఎస్.అర్. రైతు భరోసా సన్న చిన్నకారు రైతుల పంటల కాలం ప్రారంభమైన  నుండి చివరివరకు సాగు పెట్టుబడికి అవసరమైయ్యే ఖర్చులకు సకాలంలో చెల్లిస్తేనే రైతుకు ప్రయోజనం చేకూరుతుందని భావించి వై ఎస్.ఆర్ రైతు భరోసా క్రింద సంవత్సరానికి 13,500 చొప్పున 5 సంవత్సరాలు ప్రతి రైతుకు రూ.67,500 సాయం అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు,. దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వై.ఎస్.ఆర్ రైతుభరోసా క్రింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వై.ఎస్.ఆర్.ప్రభుత్వం అని పేర్కొన్నారు. 

        ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్. కూర్మనాథ్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం లో విజ్ఞానాన్ని, వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సబ్సిడీ వంటి సౌకర్యాలు ఒకే దగ్గర పొందడానికి  రైతు భరోసా కేంద్రం అన్నారు.

Vizianagaram

2021-08-04 11:04:19

అధికారాలను భర్తలకు ఎప్పుడూ అప్పగించకూడదు..

నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన మహిళలు ఎక్కువగా ఉన్నారని, వారిని చూస్తుంటే ఆనందంగా ఉందని, అయితే  వారి అధికారాన్ని భర్తలకు అప్పగించకుండా వారే చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి తెలిపారు.  శిక్షణ లో నేర్చుకున్న అంశాలను పాలనలో  అమలు చేయాలనీ అన్నారు.  జే. ఎన్.టి యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణా ముగింపు   కార్యక్రమం లో బుధవారం కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు.  సర్పంచ్ అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి అని, గ్రామానికి మంచి జరిగినా , చెడు జరిగినా  పూర్తి బాధ్యత సర్పంచ్ లదే నని అన్నారు.  ఉన్నటువంటి వనరులతోనే అభివృద్ధిని చేయవచ్చని ముందుగా ఆ గ్రామానికి ఏం కావాలో గ్రామ సభల ద్వారా తీర్మానం చేసుకోవాలని, పార్టీల కతీతంగా ప్రజలంతా మనవాళ్ళే అనుకోని పని చేయాలనీ హితవు పలికారు.  మంచి పనులు చేస్తే  సర్పంచ్ మాటకు గ్రామస్తులంత గౌరవిస్తారని, సంక్షేమ పధకాల పై పూర్తి  అవగాహన కలిగించుకొని, పారదర్శకంగా వాటిని ప్రజలకు అందేలా చూడాలని అన్నారు.  అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేలా చూస్తే గ్రామం లోని పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఆశ వర్కర్స్ ప్రతి రోజు గ్రామానికి వచ్చి ఫీవర్ సర్వే చేస్తే గ్రామస్తులంత ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యతలను   పెట్టుకోవాలని, బహిరంగ  మల ముత్రాదుల విసర్జనలు లేకుండా  పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.  శిక్షణ నుండి గ్రామానికి వెళ్ళగానే  జగనన్న  పచ్చతోరణం  క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.  ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రం లో కార్నాల్ గ్రామం లో గ్రామస్తుల శ్రమదానం తో  మురుగు నీరు నుండి మంచి నీరు వచ్చేలా నిర్మించుకున్న 3 రకాల చెరువుల గురించి వివరిస్తూ  ఆ విజయ గాధ  షార్ట్ ఫిలింను పిపిటి  ద్వారా ప్రదర్శించారు.  ప్రతిది డబ్బు తోనే ముడిపెట్ట కూడదని, ప్రజలంతా ఏకమైతే  శ్రమదానం ద్వారా గ్రామాల అవసరాలను కొన్ని తీర్చుకోవచ్చునని తెలిపారు.  అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ లను అందజేశారు. 
ఫోర్టి ఫైడ్  బియ్యం అంటే బలవర్ధక బియ్యం :  సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ 
ఫోర్టిఫైడ్  బియ్యం అంటే సాధారణ ధాన్యం లో పోషకాలను కలిపి మిల్లు ఆడిస్తామని,  అవి బలవర్ధకంగా తయారవుతాయని   సంయుక్త కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. సర్పంచ్ ల శిక్షణ ముగింపు లో కలెక్టర్ తో  పాటు పాల్గొన్న జే.సి. ఫోర్టి ఫైడ్ బియ్యం పై సర్పంచ్ లకు అవగాహన కల్పించారు. ఫోర్టి ఫైడ్ బియ్యం పై ముద్రించిన కర పత్రాలను,  గోడ పత్రికలను,  ప్ల కార్డులను సర్పంచ్ లకు అందజేశారు.  గ్రామాల్లో ఈ బియ్యం పై అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు వినియోగించేలా చూడాలన్నారు.  ఈ బియ్యం లో సూక్ష్మ పోషకాలు మెండుగా ఉంటాయని, రక్త హీనత నివారణ లో, నాడీ వ్యవస్థ అభివ్రుది, గర్భస్థ శిశువు  వికాసం జరుగుఉందని, చిన్న పిల్లలు, గర్భిణీలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.  సర్పంచ్ లు  ఈ విషయాలన్నిటిని ప్రజలకు అర్ధమయ్యేలా హేప్పలన్నారు.  ఈ సమావేశం  డి.పి.ఓ  సుభాషిని, డి.ఎల్.డి.ఓ రామచంద్ర రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-04 11:00:21

ప్రతీవారం పురోగతి తప్పక పెరగాలి..

 భవన నిర్మాణాలను వేగంగా  నిర్దేశించిన  సమయానికి  పూర్తి చేసి  ప్రతీ వారం పురోగతి  సాధించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున  స్పష్టమైన  ఆదే్శాలు జారీ చేసారు.  అభివృద్ది పనుల్లో  ప్రతీ వారం ప్రోగ్రస్ చూపించాలని  గణాంకాలు చూపిసై  క్రాస్ చెక్ చేయిస్తానన్నారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయం  సమావేశమందిరం నుండి , ఉపాధి హామి పనులు, మనబడి, నాడు నేడు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు ,వై ఎస్ ఆర్  హైల్త్ క్లీనిక్ లు, అంగన్వాడీ కేంద్రాలు, జగనన్న పచ్చతోరణం, పశుగ్రాస పెంపకం, స్పందన ఫిర్యాదుల పరిష్కారం, జనగన్న పాలవెల్లువ పై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో   వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  ఉపాధి హామిలో  చేపట్టి పూర్తి చేసిన పనుల స్దాయిలకు  ఎక్సపెండిచర్ బుక్ చేయాలని  ఆదేశించారు.   మంజూరు చేసిన ప్రతి పని ప్రారంభించాలని చెప్పారు.  మనబడి నాడు నేడు పనులు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు సకాలంలో   పూర్తి చేయడానికి   ప్రత్యేక దృష్టి సారించాలని  సంబంధిత అధికారులను  ఆదేశించారు.  
 వై ఎస్ ఆర్ డిజిటల్ లైబ్రెరీలు నిర్మాణానికి  అవసరమైన స్థలాలను  గుర్తించాలని  తాహశీల్థారులకు సూచించారు. ఉపాధి హామి పధకంలో      రూ. 2 కోట్ల 34 లక్షలు లేబర్ బడ్జెట్  లక్ష్యంగా  నిర్దేశించామని, జూలై నాటికి  రూ. 1కోటి 64 లక్షలు పూర్తి చేసారని అన్నారు. ఈ నెలాఖరు నాటికి  మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని  ఆదేశించారు.  పశుగ్రాస పెంపకంపై  పశుసంవర్ధక శాఖ అధికారులను  అడిగి తెలుసుకున్నారు. పశుగ్రాసం  పెంపకంపై డ్వామా, పశుసంవర్ధక శాఖ అధికారులు  రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  వై ఎస్ ఆర్ జలకళ ప్రోగ్రాంలో  344 బోర్ వెల్స్ వేశామని  డ్వమా పి.డి. వివరించారు.  అర్భన్ ప్రాంతాలలో  జరుగుతున్న మనబడి నాడు – నేడు , అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలపై ఆరాతీసారు. 
ఈ నెల 18వ తేది నుంచి పాలసేకరణ
జగనన్న పాల వెల్లువ – ఆంధ్రప్రదేశ్  అమూల్ ప్రాజెక్టులో  ఈ నెల 18వ తేదీ నుంచి పాలసేకరణ ప్రారంభిస్తామన్నారు.  మహిళా సంఘాలతో  డైరీ ఏర్పాటు చేస్తామన్నారు.  మొదటి దశలో  123 గ్రామాల్లో  పాలు సేకరిస్తారని  పేర్కొన్నారు. 
ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్ ఇ సుధాకర్ రెడ్డి, డ్వామా పి.డి.  ఇ. సందీప్, డి ఇ ఓ  లింగేశ్వరరెడ్డి, పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డా.ఎన్. కరుణాకరరావు, పంచాయితీ రాజ్  పి .ఐ .యు. ఈ ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-04 10:10:37

Simhachalam

2021-08-04 07:19:29

7న జిల్లా స‌మీక్ష స‌మావేశం..

విజ‌య‌న‌గ‌రం  జిల్లా స‌మీక్ష మండ‌లి(డి.ఆర్‌.సి.) స‌మావేశం ఈనెల 7వ తేదీన జ‌ర‌గ‌నుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో ఆరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని జిల్లా కలెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ. సూర్య‌కుమారి తెలిపారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్య‌మంత్రి శ్రీ‌మ‌తి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లాకు చెందిన శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు, పార్ల‌మెంటు స‌భ్యులు ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు. ఖ‌రీఫ్ సీజ‌నుకు సంబంధించి పంట‌ల సాగుకు ఏర్పాట్లు, జ‌ల‌వ‌న‌రుల శాఖ ప‌నులు, కోవిడ్‌-19 నియంత్ర‌ణ చ‌ర్య‌లు, ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్స్ ప‌నులు, గృహ‌నిర్మాణంలో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షిస్తారు.

విజయనగరం

2021-08-03 17:14:17

విభిన్నంగా జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు..

విజయనగరం జిల్లాలో ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను విభిన్నంగా నిర్వ‌హించాల‌ని, అందుకు ప‌క‌డ్భందీగా ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్లో మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జాయింట్ క‌లెక్ట‌ర్(రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ, ఇప్ప‌టి వ‌ర‌కూ స్వాంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించిన విధానాన్ని, వివిధ శాఖ‌లు ప్ర‌తీఏటా చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు.  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, సంప్ర‌దాయ‌భ‌ద్దంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఈ ఏడాది కూడా కోవిడ్ కార‌ణంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను వేడుక‌ల‌కు అనుతించ‌బోమ‌ని, స్క్రీన్స్ ఏర్పాటు చేసి లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్ర‌సారం చేస్తామ‌ని చెప్పారు. స్టాల్స్‌, శ‌క‌టాల‌ను ఈ ఏడాది ర‌ద్దు చేస్తూ, వాటికి బ‌దులుగా, న‌వ‌ర‌త్నాలు, వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప్రాధాన్య‌త‌ల‌ను  వివ‌రిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కూడిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను, ప‌రిమిత సంఖ్య‌లో ఏర్పాటు చేయాల‌ని సూచించారు. వివిధ శాఖ‌ల వారీగా చేయాల్సిన ప‌నుల‌ను సూచించి, ఈ నెల 12వ తేదీలోగా ఏర్పాట్ల‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ స‌మావేశంలో జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఎఫ్ఓ స‌చిన్ గుప్తా, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-08-03 16:39:53

సచివాలయాల్లోనే సేవలన్నీ అందాలి..

గ్రామ సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి నమ్మకంతో సృష్టించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కలెక్టర్ సి.హరికిరణ్ మంగళవారం  క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు.ఈ నేపథ్యంలో కాకినాడ గ్రామీణ మండలం నేమాం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా  సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ,సర్పంచ్ ల భాగస్వామ్యం,సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. కోవిడ్ రెండవ దశ తగ్గుముఖం పట్టినందున  తిరిగి సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సచివాలయ సిబ్బందికి సంబంధించి డిప్యుటేషన్ లు రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని , సిబ్బంది  అత్యవసర పరిస్థితుల్లో మినహా తమకు కేటాయించిన సచివాలయంలోనే విధులు నిర్వహించాలన్నారు. నేమాం గ్రామానికి సంబంధించి సిబ్బంది గడువులోనే  సేవలందిస్తున్నారని, త్వరలోనే నూతన భవన సముదాయాలు అందుబాటులోకి రానున్నాయాన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అమలు తీరుకు సంబంధించి సచివాలయంలో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, జాబితాలోని  వివరాలను, సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు , నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు నిర్మాణం‌ , గ్రౌండింగ్  పరిస్థితి, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు మంజూరు,మత్స్యకార భరోసా తదితర అంశాలపై సిబ్బందిని కలెక్టర్ ఈ సందర్భంగా వివరాలు అడిగి తెలుసుకుని,క్షుణ్ణంగా రిజిస్టర్ లను తనిఖీ చేశారు .
         అనంతరం నేమాం గ్రామానికి సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ,బల్క్ మిల్క్  సెంటర్ భవనాలను కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, భవనాల నిర్మాణ పనుల పురోగతిని ఆయా విభాగాల ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి నేమాం  లేఅవుట్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా లేఅవుట్ లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న గృహ సముదాయలను పరిశీలించి , ఇళ్ల  నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం నుంచి అందుతున్న సదుపాయాలను కలెక్టర్ నేరుగా లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు.  ఈ పర్యటనలో కలెక్టర్ వెంట  కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పీ.నారాయణ మూర్తి, హౌసింగ్ డీఈ గుప్త , పంచాయతీ రాజ్ డీఈ కె.శ్రీనివాసు,నేమాం సర్పంచ్ చిన్న ,ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

2021-08-03 15:55:51

త్వ‌రిత‌గ‌తిన ఈ-క్రాప్ న‌మోదు చేయాలి..

ఈ-క్రాప్ బుకింగ్‌కు సంబంధించి రైతుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఫిజిక‌ల్ ర‌శీదు అందించాల‌ని, ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయాధికారులతో మాట్లాడారు. సచివాలయాల వారీగా ఈ-క్రాప్ నమోదు శతశాతం జరగాలన్నారు. రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ, భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణ‌కు సంబంధించి రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను రెండోద‌శ‌లో మండ‌లానికి ఓ గ్రామంలో చేప‌ట్ట‌నున్నందున స‌న్న‌ద్ధత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. సీసీఆర్‌సీ కార్డుల జారీకి సంబంధించి పెండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌న్నారు. అమ‌లాపురం, రామ‌చంద్రాపురం డివిజ‌న్ల‌లో ఇళ్ల స్థ‌లాల లేఅవుట్ల లెవెలింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. క్షేత్ర‌స్థాయిలో కోవిడ్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి కిట్లు అంద‌జేయాల‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. 104 కాల్‌సెంట‌ర్‌కు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆగ‌స్టు 10న నేత‌న్న హ‌స్తం కార్య‌క్ర‌మం ఉన్నందున ఇందుకు సంబంధించి ల‌బ్ధిదారుల బ‌యోమెట్రిక్ అథింటికేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి సూచించారు. ఆగ‌స్టు 10న 17 వేల  ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ ప్రారంభ‌మై, 25 నాటికి బేస్‌మెంట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా చూడాల్సి ఉంద‌ని జేసీ(హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ పేర్కొన్నారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, జేడీ(ఏ) ఎన్.విజ‌య్‌కుమార్, పీడీ హౌసింగ్ వీరేశ్వ‌ర ప్ర‌సాద్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-03 15:15:03

థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే..

కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని.. మ‌న జిల్లాలోనూ కొన్ని మండ‌లాల్లో పాజిటివిటీ పెరుగుతున్నందున అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించాలని.. మండ‌ల‌, డివిజ‌న్ స్థాయిలో వారానికి క‌నీసం రెండుసార్లు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీల స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి, జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ, జిల్లాస్థాయి అధికారుల‌తో క‌లిసి మండ‌ల‌, డివిజ‌న‌ల్ అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు; రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఇందుకు ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో ముందుకెళ్లాల‌న్నారు. ప్రతి ఒక్క‌రూ కోవిడ్ నిబంధ‌న‌లను క‌చ్చితంగా పాటించేలా చూడాల‌ని, ఉల్లంఘించిన వారిపై నిబంధ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, పోలీసు శాఖ స‌హ‌కారంతో జ‌రిమానా విధింపులు జ‌రిగేలా చూడాల‌న్నారు. 50, ఆపై ప‌డ‌క‌లున్న కోవిడ్ ఆసుప‌త్రుల‌కు అనుబంధంగా ట్రాన్సిట్ ఆసుప‌త్రుల ఏర్పాటుపై దృష్టిసారించాల‌ని సూచించారు. ఆగ‌స్టు 10 త‌ర్వాత ముహూర్తాలు ఉన్నందున వివాహాల‌కు త‌హ‌సీల్దారు అనుమ‌తులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని, 150 కంటే ఎక్కువ మంది వివాహ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాకుండా చూడాల‌న్నారు.  
జిల్లాలో స‌మ‌ర్థ‌వంత‌మైన అధికార బృందం ఉంద‌ని.. ప్రభుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల అమ‌లు పురోగ‌తిలో ఇది ప్ర‌స్ఫుటం కావాల‌న్నారు. ప్ర‌జా ఫిర్యాదుల వేదిక స్పంద‌న కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌న్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా నాణ్య‌మైన సేవ‌లు అందించాల‌ని.. బియ్యంకార్డు, పెన్ష‌న్‌కార్డు, ఆరోగ్య‌శ్రీకార్డు, 90 రోజుల్లో ఇంటి ప‌ట్టాకు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను నిర్ణీత ఎస్ఎల్ఏ గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యాల సిబ్బందికి బ‌యోమెట్రిక్ హాజ‌రు త‌ప్ప‌నిస‌ర‌ని, ఈ అంశంపై క్షేత్ర‌స్థాయి అధికారులు దృష్టిసారించాల‌న్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; ఆర్‌బీకేలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తిచేయాల‌ని ఆదేశించారు. 
స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, జేడీ(ఏ) ఎన్.విజ‌య్‌కుమార్, పీడీ హౌసింగ్ వీరేశ్వ‌ర ప్ర‌సాద్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-03 15:14:01

సీఎం పర్యటన విజయవంతం చేయండి..

రాష్ట్రంలో 30 శాతం కంటే అధికంగా పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటటం పై చైతన్యం కలిగించే లక్ష్యంతో ఆగష్టు 5 వ తేదిన వనమహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. మంగళగిరి వద్ద అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్ ) లో గురువారం జరిగే 72వ వనమహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నందున అక్కడి ఏర్పాట్లను  మంగళవారం  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎయిమ్స్ వద్ద ముఖ్యమంత్రి మొక్కలు నాటే ప్రాంతంను, సభా స్థలం, వేదిక, ముఖ్యఅతిధులు ప్రయాణించే మార్గలలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించి పర్యవేక్షణ అధికారులకు సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంకు విధులు కేటాయించిన అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 72వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఐదవ తేదీ మంగళగిరి ఎయిమ్స్లో జరిగే కార్యక్రమంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటుతారన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విధ్యార్ధులు, వాలంటీర్లు, మహిళలు పాల్గొని రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్, ఎయిమ్స్లో పచ్చదనం కోసం నిర్దేశించిన ప్రాంతాలలో మొక్కలు నాటతారన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయటం జరుగుతుందని, వేదిక, బ్యారికేటింగ్, రూట్ ప్లాన్, పార్కింగ్ పై పోలీస్, అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో బహిరంగ సభా స్థలిలో సీటింగ్ ప్రతి కూర్చికి ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని,  ప్రతి ఒక్కరు మాస్క్ ఖచ్చింతంగా ధరించేలా సభా  స్థలంలో మాస్క్లు అందుబాటులో ఉంచుతున్నామని, కోవిడ్ ప్రవర్తన నియామవళి  ఖచ్చితంగా అమలు చేస్తూ  అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ శాఖ ద్వారా టీ షర్టులు, క్యాప్లు అందించటం జరుగుతుందన్నారు.

అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 5వ తేది మంగళగిరిలో ఎయిమ్స్లో జరిగే వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతా  పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆగస్టు 5వ తేదీ ముఖ్య అతిధులు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ మళ్ళింపు ప్రణాళికపై  ముందుగానే సమాచారం అందించి సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం  సజావుగా కొనసాగేలా, విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి  చేస్తామన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) కే. శ్రీధర్ రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి (టెరిటోరియల్) రామచంద్రావు, మంగళగిరి– తాడేపల్లి కార్పోరేషన్ నిరంజన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ హేమమాలిని రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి, గుంటూరు రెవెన్యూ డివిజన్ అదికారి  భాస్కర రెడ్డి, మంగళగిరి తహశీల్దారు శివ రామ్ ప్రసాద్, ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.

Guntur

2021-08-03 14:22:58

అధ్యాపకులు కాంట్రాక్టు రెన్యూవల్ చేసుకోవాలి..

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులు రెన్యువల్ చేసుకొనుటకు ధరఖాస్తులను కోరుతున్నట్లు ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకులు డా.చప్పిడి కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు. 2020-21 విద్యా సం.లో ఈ ఏడాది మార్చి 31 నాటికి ఒప్పంద అధ్యాపకులు గా పనిచేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. 2021-22 సం.లో పనిచేయుటకు ఆసక్తి గల అధ్యాపకులు ఆగస్ట్ 6వ తేదీ సాయంత్రం 5.00 గం.ల లోగా  తమకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రెన్యూవల్ కొరకు వచ్చిన దరఖాస్తులను ఆగస్ట్ 7వ తేదీన జిల్లా ఐడి ప్రిన్సిపాల్ కు సమర్పించాలని సూచించారు. ఈ నెల 10న రెన్యూవల్ కొరకు వచ్చిన దరఖాస్తులను జిల్లా సెలక్షన్ కమిటీ సమక్షంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. ఆగస్ట్ 12న  రెన్యూవల్ అయిన ఒప్పంద అధ్యాపకులు 2021-22 విద్యా సం.నకు గాను అగ్రిమెంట్ చేసుకోవలసి ఉంటుందని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Srikakulam

2021-08-03 14:21:44

శ్రీవాణి ట్రస్ట్ కు ఇంజినీరింగ్ విభాగం..

శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలపై తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ సహాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ముందే ఆలయం స్థల పురాణం, ప్రాశస్త్యం, ఇప్పటిదాకా పూజలు జరుగుతున్నాయా అనే అంశాలు పరిశీలించాలని చెప్పారు. ట్రస్ట్ నిధులతో ఆలయం పునరుద్ధరణ, లేదా అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల భక్తులకు ఎంత మేరకు ఉపయోగం ఉంటుందనే విషయం కూడా తెలుసుకోవాలని ఈవో చెప్పారు. ప్రతిపాదన నుంచి పని పూర్తి చేసే వరకు వ్యవధి నిర్ణయించుకోవాలన్నారు. టీటీడీ అనుబంధ, విలీన ఆలయాల్లో మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టేలా శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఈ ఆలయాల్లో నీటి సరఫరా,ఇతర మౌళిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు నిర్మాణం పనులు కూడా చేపట్టాలన్నారు. పురాతన ఆలయాల మరమ్మతుల సమయంలో  నిర్మాణం డిజైన్ దెబ్బ తినకుండా చూడాలని చెప్పారు. తిరుమలలో రోడ్లు, ఫుట్ పాత్ నిర్వహణ చక్కగా ఉండాలని, సంబంధిత అధికారులు వారానికోసారి స్వయంగా వీటిని చూడాలని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నుంచి పలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అనుమతి మంజూరు చేశారు.   అదనపు ఈవో  ధర్మారెడ్డి, జెఈవో  సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డిప్యూటి ఈవో  రమణ ప్రసాద్ ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

Tirupati

2021-08-03 14:20:40

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలిన..

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీకేష్  లాఠకర్, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ మంగళ వారం పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన పొందూరు రానున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థ మరియు సొసైటిను సందర్శించారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయునున్న సభా స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు, బందోబస్తు తదితర కార్య్రమాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఐ.కిషోర్, డిఎస్పీ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-03 14:19:29

5న జిల్లాలో వన మహోత్సవం..

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 5న 72వ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ జిల్లా అటవీ శాఖ అధికారి సచిన్ గుప్త పేర్కొన్నారు.   ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేసారు. ఆగష్టు 5వ తేదీ ఉదయం 9.00గం.లకు  స్థానిక పురుషుల పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. వీరితో పాటు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొంటారని తెలిపారు.  ఈ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను నాటి ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో నిండేలా చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరం పది మొక్కలు ప్రతిన బూని నాటుదాం అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు  ఆయన  ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2021-08-03 14:18:39