1 ENS Live Breaking News

కరోనాను నియంత్రణలో NGOలు కీలకం..

శ్రీకాకుళం జిల్లాలో కరోనాను ఆరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు (ఎన్. జి.ఓ) కీలక పాత్ర పోషించాలని సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనువాసులు పిలుపునిచ్చారు. 32 ఎన్.జి.ఓల సభ్యులతో  సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనువాసులు సమీక్షాసమావేశం నిర్వహించారు. జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి 8 వందల సచివాలయాల్లో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో  కోవిడ్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన  సూచించారు.  45 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సినేషన్  అందేలా చూడాలని  ఆయన అన్నారు. 60 సంవత్సరాలు పైబడినవారికి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి  ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయితీ సర్పంచ్ లు , వాంటీర్లతో కలసి కరోనాపై  తీసుకోవలసిన జాగ్రత్తలు, వాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో కోవిడ్ భారీన పడిన వారికి  కోవిడ్ మెడికల్ కిట్స్ అందజేశామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కూడా మెడికల్ కిట్స్ అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కోవిడ్ బారిన పడిన వారికి వెంటనే  వైద్య సదుపాయాలు అందించడానికి సరిపడా అంబులెన్స్ లు, 104 వాహనాలు కూడా అదనంగా పెట్టామని  దీనిపై అవగాహన  కల్సించవలసిన భాద్యత ఎన్.జి.ఓలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల్లో సహజంగా దొరికే   నిమ్మ, తాజాకూరగాయలు, పండ్లు, పసుపు తదితర పౌష్టికాహారం తీసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జెసి అన్నారు. ప్రస్తుతం  పెళ్లిళ్ల సీజన్ అని విందులు, వినోదాల్లో ఎక్కువ జనం గుమికూడకుండా ఉండేటట్లు చూదాలని సూచించారు. పంచాయతీ సర్పంచులు, వలంటీర్స్ తో  కలసి సమన్వయం చేయాలని అన్నారు.  కరోనాతో ప్రతీ ఒక్కరూ సహజీవనం చేయవలసందేనని, కరోనా భారిన పడకుండా ఉండాలంటే బౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, మాస్కు ధరించడం చేయాలని సూచిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలని అన్నారు.

 
రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ  కరోనా భారీన పడి మృతి చెందిన 160  మృతుదేహలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా దహన సంస్కారాలు చేశామన్నారు. అనాథ మృత దేహలను కూడా దహన సంస్కారాలు కార్యక్రమాలు చేశామన్నారు. అనేక మందికి ప్లాస్మా డోనేషన్ చేశామన్నారు. లాక్ డౌన్ సమయంలో  ప్రతి రోజు సుమారు వెయ్యి  మందికి భోజనం అందిస్తున్నామన్నారు. పేదలకు  మాస్కులు, శానిటేజర్స్ అందజేస్తున్నామన్నారు.  ప్లాస్మామా డోనర్స్ ఎవరైనా ఉంటే  మాకు తెలియపర్చాలని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ వలన కరోనాపై అవగాహన, వైద్య సదుపాయాలు, ప్రభుత్వం అందించే ఇతర సహాయ సహాకారాలు అందించడం వేగవంతంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. యూత్ క్లబ్ బెజ్జిపురం రెడ్ క్రాస్ సొసైటీకి రూ.20 వేలు చెక్కును అందజేశారన్నారు. ప్రభుత్వం తరుపున  సహాయ అందిస్తే   రెడ్ క్రాస్ తరపున  మరిన్నీ సహాయ కార్యక్రమాలు  చేపడతామన్నారు.

 
 బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు యం.ప్రసాద రావు మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో  కరోనా పై  అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. లావేరు మండల గ్రామాల్లో ఎం.డి ఒ, ఎం.ఆర్.ఓల  ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు పంపణీ చేశామన్నారు. 120 అంగన్వాడీ కేంద్రాల్లో యోగ క్లాసులు నిర్వహించామన్నారు. 126  ప్రభుత్వ పాఠశాలలో  కరోనాపై అవగాహన, యోగ  క్లాసులు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో  92 మంది ట్రాన్స్ జండర్స్ కి  రూ.15 వందల ఆర్థిక సహాయంపై అవగాహన కల్పిస్తూ  ఆన్ లైన్  చేశామన్నారు. జిల్లాలో 9 మంది హెచ్.ఐ.వి భారిన పడిన వారికి ఇంటి వద్దకే  తీసికెళ్లి మందులు అందచేశామన్నారు. అలాగే తల్లిదండ్రులను కొల్పోయిన పిల్లలకు సహాయ సహాకారాలు అందిస్తున్నామని అన్నారు.

           సి.ఏ.వి.ఎస్ ఎన్.జి.ఓ వ్యవస్థాపకులు  పి.భూదేవి మాట్లాడుతూ  15 మంది సిబ్బందితో కలసి గ్రామాల్లో కరోనా పై అవగాహన కల్పిస్తూ  సిరిదాన్యాలు  అందజేశామన్నారు. జిల్లాలో 600 మెడికల్ కిట్స్ అందజేశామన్నారు. జిల్లాలో న్యూట్రిషన్ ఫుడ్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు చేయిస్తున్నామన్నారు.  ఈ సమావేశంలో ఇతర ఎన్.జి.ఓల సిబ్బంది  పాల్గొన్నారు.

Srikakulam

2021-05-29 12:03:05

మే 31న సుంద‌ర‌కాండ పారాయ‌ణం..

క‌రోనా వ్యాధి నిర్మూలన‌కు శ్రీ వేంకటేశ్వ‌ర‌స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఇప్ప‌టివ‌ర‌కు అనేక ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని, ఇందులో భాగంగా మే 31వ తేదీన అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో గ‌ల ప్రార్థ‌నా మందిరంలో శ‌నివారం అఖండ పారాయ‌ణం ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని కోరారు.  అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ హ‌నుమంతుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం నుండి లంఘించి సీతాన్వేష‌ణ కోసం ఏవిధంగా అవిశ్రాంతంగా క‌ర్త‌వ్య‌దీక్ష చేశారో అదేవిధంగా ఉద‌యం 6 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు 16 గంట‌ల పాటు నిరంత‌రాయంగా అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇందుకోసం నాలుగు బృందాల్లో 40 మంది పండితులు పారాయ‌ణం చేసేందుకు వీలుగా ఇక్క‌డి ప్రార్థ‌నా మందిరంలో ఏర్పాట్లు చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. హోమం ఏర్పాటు చేసి ప్ర‌తి శ్లోకం త‌రువాత హ‌వ‌నం చేస్తామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంద‌ని, భ‌క్తులు త‌మ ఇళ్ల నుండే శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. పారాయ‌ణం చేయ‌లేని వారు శ్లోకాల‌ను వినాల‌ని కోరారు. అదేవిధంగా ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సార‌మ‌య్యే స‌మ‌యంలో టీవీ సౌండ్ పెంచ‌డం ద్వారా మంత్ర‌పూర్వ‌క‌మైన శ్లోకాల శ‌బ్ద త‌రంగాలు వాతావ‌ర‌ణంలో క‌లిసి శ్రీ‌వారి ఆనుగ్ర‌హం క‌లుగుతుంద‌న్నారు.  ఈ స‌మావేశంలో టిటిడి బోర్డు స‌భ్యులు  శివ‌కుమార్‌, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్  కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీబీసీ సీఈవో  సురేష్‌కుమార్‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-05-29 11:59:56

వేదవిజ్ఞాన పీఠంలో పూర్వాషాడా నక్షత్రేష్టి..

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ‌నివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో పూర్వాషాడా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు.  ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పూర్వాషాడా మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు.  మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్ 15వ తేదీ వరకు జరుగనుంది. కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు  శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు.  ఆ తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము‌, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు. కార్యక్రమంలో పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, టిటిడి బోర్డు స‌భ్యులు శివ‌కుమార్‌ పాల్గొన్నారు.

Tirupati

2021-05-29 11:55:52

కరోనా నిబంధనలు తప్పక పాటించాలి..

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ప్రభుత్వ నిబంధనలను, ఆరోగ్య జాగ్రత్తలను తూ. చ. తప్పకుండా పాటించాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో 30 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో జిల్లాలోనే మొట్టమొదటి 'క్రౌడ్ ఫండెడ్ కోవిడ్ హాస్పిటల్' జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారినుండి ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు అనవసరంగా బయటకు వస్తున్నారని, గుంపులుగుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారని అందువల్ల కరోనా ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు కూడా కరోనా కట్టడికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మవరం దాతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని , భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Dharmavaram

2021-05-29 11:52:59

సరిపడ ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు సిద్దం..

కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) రోగుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను కూడా అందుబాటులో ఉంచిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. శ‌నివారం ఉద‌యం జేసీ (డీ) వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లిసి కాకినాడ జేఎన్‌టీయూ కోవిడ్ కేర్ కేంద్రాన్ని సంద‌ర్శించారు. రిసెప్ష‌న్‌, రిజిస్ట్రేష‌న్ కేంద్రాన్ని ప‌రిశీలించిన అనంత‌రం బాధితుల‌తో మాట్లాడారు. అవ‌స‌రం మేర‌కు కాన్సంట్రేట‌ర్ల ద్వారా ఆక్సిజ‌న్ అందిస్తున్న తీరును ప‌రిశీలించారు. కాన్సంట్రేట‌ర్ల‌లో స‌మ‌స్య‌లు త‌లెత్తితే వెంట‌నే తెలియ‌జేయాల‌ని, బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్ల స‌హాయంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌ని తెలిపారు. పారిశుద్ధ్యం, భోజ‌నం విష‌యంలో రాజీ లేకుండా ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. రోగుల ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, అవ‌స‌రం మేర‌కు సేవ‌లు అందేలా చూడాల‌ని కీర్తి చేకూరి పేర్కొన్నారు. జేసీ (డీ) కీర్తి చేకూరి వెంట కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, రెసిడెన్షియ‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆర్ఎంవో) డా. ఆర్‌.సుద‌ర్శ‌న్‌బాబు త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2021-05-29 11:51:29

యుజిడీలో నగర వాసులు డైపర్స్ వేయకూడదు..

భూగర్భ మురుగునీటిలో నగర వాసులు డైపర్స్ వేయకూడదని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన సూచించారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎనిమిదవ జోన్ పరిధిలోని 98వ వార్డు వేపగుంట సింహపురి కోలనీ లో శనివారం కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ మురుగునీరు కొన్ని చోట్ల బ్లాక్ అయి పొంగుచున్నదని ముఖ్యంగా గృహాలలో మహిళలు, పిల్లలు వాడే డైపర్స్ లు వేయటంవలన డ్రైనేజి లో అడ్డంకులు ఏర్పడి మురుగునీరు బ్లాక్ అయి ఎక్కడికక్కడ పొంగి పోతుందని అందువలన డైపర్స్ లాంటివి డ్రైనేజి లో వేయరాదని సూచించారు. వెంటనే మ్యాన్ హొల్స్ తెరచి వాటి అడ్డంకులను తొలగించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. కాలువలు, రోడ్లను శుభ్రంగా చేయాలని, ప్రతిరోజూ చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతీ రోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. తడి-పొడి చెత్త వేరు వేరుగా పారిశుధ్య సిబ్బందికి అందించాలనారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని రోడ్లు మరియు కాలువలో చెత్త వేస్తే ఆ చుట్టు ప్రక్కలున్న ఇళ్ళకు అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. కారులు పెట్టుకొనుటకు రోడ్లను ఆక్రమించి షెడ్లు నిర్మించడం గమనించి వెంటనే వాటిని తొలగించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. అందరు కోవిడ్ నిబంధనలను పాటించాలని కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటెనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధుకుమార్, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.  

Vepagunta

2021-05-29 11:49:09

ఇళ్ల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలి..

పేదలందరికీ ఇళ్ళ పథకం  లే అవుట్ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసి లబ్దిదారుల ఇళ్ళు నిర్మాణం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నర్సరావుపేటలో ఉప్పలపాడు వద్ద ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ను, నర్సరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటరును, మేడికొండూరు మండలం జంగంగుంట్ల పాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. నర్సరావుపేట ఉప్పలపాడు వద్ద పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నర్సరావుపేట శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివారెడ్డి, నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.  లే ఆవుట్లో ప్లాట్ మార్కింగ్, అదనపు భూమి సమీకరణపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ అప్రూవల్ కు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లే అవుట్ ప్లాన్ను వెంటనే తయారు చేసి జిల్లా కమిటీ వద్ద అనుమతి తీసుకొని మార్పుల పనులు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే  మార్కింగ్ చేసిన ప్లాట్లను జియో ట్యాగింగ్ చేసి , ఇళ్ళ నిర్మాణంను ప్రారంభించాలన్నారు. లే అవుట్ విస్తరణకు అవసరమైన భూముల సమీకరణ వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ యజమానులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు వారిని ఒప్పించి భూములు సమీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నర్సరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను, జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటరును పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి కోవిడ్ కేర్ సెంటరును వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ మేడికొండూరు మండలంలోని జంగంగుంట్ల పాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, ఆర్బీకే భవనాలను పరిశీలించారు. నిర్దేశిత సమయంలో భవనాల నిర్మాణం పూర్తి అయ్యేలా పనులు  వేగవంతం చేయాలని  అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్ల భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, బీఎంసీలు, ఏఎంసీల నిర్మాణానికి  అవసరమైన భూములు గుర్తించేందుకు తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తహశీల్దారు రమణా నాయక్, ఎంపీడీవో బూసిరెడ్డి, మేడికొండూరు తహశీల్దారు కరుణ కుమార్, ఎంపీడీవో శోభారాణి , పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Narasaraopeta

2021-05-29 11:45:45

వేక్సిన్ కు డబ్బులు తీసుకుంటారా..?

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్లో ఆశా వర్కర్ డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదు పై జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి స్పందించి కేంద్రాన్ని సందర్శించారు. డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేస్తున్నట్లు వస్తున్నా ఫిర్యాదుపై మేయర్ ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం పరుస్తూ తక్షణమే విచారణ చేపట్టాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ వేస్తున్నట్లు విచారణలో తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ జివిఎంసి అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలోను, ఆరిలోవ మరియు మల్కాపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్లోను వేయబడుచున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జివిఎంసి అన్ని సెంటర్లలోను ఉచితంగా వ్యాక్సిన్ వేయబడుచున్నదని, వ్యాక్సిన్ కొరకు ఎవ్వరూ ఎటువంటి డబ్బులు చెల్లించనవరసం లేదని, ఎవ్వరైనా వ్యాక్సినేషన్ కొరకు డబ్బులు డిమాండ్ చేసినయడల వెంటనే జివిఎంసి టోల్ ఫ్రీ నెం. 1800 4250 0009 లేదా 0891-2869100కి తెలియపరచవలెనని, వారిపై వెంటనే కఠినచర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ఎటువంటి అపోహలకు పోకుండా 45సంవత్సరములు దాటిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ వేసే సిబ్బందికి సహకరించాలని మేయర్ ప్రజలకు సూచించారు.    

Arilova

2021-05-29 11:42:34

నాడు నేడు వచ్చే 20లోగా పూర్తికావాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌న‌బ‌డి నాడు - నేడు తొలివిడ‌త లో చేప‌ట్టిన ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌ల ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను జూన్ 20లోగా పూర్తిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా, సంక్షేమం) జె.వెంకట‌రావు ఇంజ‌నీరింగ్ విభాగాల‌ను ఆదేశించారు. జిల్లాలో తొలివిడ‌త‌లో 1060 పాఠ‌శాల‌ల్లో ఆరు ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని వీటిల్లో చేపట్టిన పనులన్నీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాడు- నేడు పనులపై జె.సి. శనివారం కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో సమీక్షించారు. పాఠశాలల కు మెటీరియల్ సరఫరా చేసే సరఫరా దారు డ్యూయెల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డ్, తాగునీటి శుద్ధి పరికరాలు, టీవీ లు, ఫర్నిచర్ ఇప్పటికే అందజేసారనీ వాటి ఏర్పాటు జూన్ 6వ తేదీ నాటికీ పూర్తి కావాలన్నారు. వాల్ ఆర్ట్, పెయింటింగ్స్ 20 నాటికీ అన్ని స్కూళ్ళలో పూర్తికావాలని గిరిజన ప్రాంత పాఠశాలల్లో పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, సమగ్ర శిక్ష ఏపిఓ గోపి, ఇ.ఇ. శివానంద్, ఏ.పి.ఇ.డబ్ల్యు.డి.సి. శామ్యూల్, విఎంసి ఇ.ఇ. దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-29 11:38:07

జూన్2న అప్పన్న హుండీ లెక్కింపు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం హుండీల లెక్కింపు జూన్2న చేపట్టనున్నట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు. ఈ మేరకు శనివారం దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేవాదాయశాఖ కమిషనర్ సూచనల మేరకు వచ్చే నెలలో లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. దీనికోసం కొండపైనా బేడా మండపంలో కోవిడ్ నిబంధనలు ద్రుష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేపట్టనున్నామన్నారు ఈఓ. ప్రస్తుతం నిబంధనలు అనుసరించి భక్తులకు స్వామివారి దర్శనాలు చేపడుతున్నామని చెప్పారు.

Simhachalam

2021-05-29 11:36:28

కరోనా కట్టడికి అందరి భాగస్వామ్యం అవసరం..

 కరోనా కట్టడికి అందరి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.  శనివారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 30  పడకల సామర్థ్యంతో జిల్లాలోనే ప్రప్రథమంగా నిర్మించిన  క్రౌడ్ ఫండెడ్ కోవిడ్ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ బాధితుల కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోందన్నారు. గడచిన రెండు నెలల కాలంలో ఏప్రిల్ మొదటి వారంలో 3.10 శాతం, రెండో వారంలో 7.54, మూడో వారంలో 10.96,  నాలుగో వారంలో 21.43 శాతం, మే నెల మొదటి వారంలో 30.47 శాతం, రెండవ వారంలో 37.08, మూడోవారంలో 32.18, నాల్గవ వారంలో 24.70 శాతంగా పాజిటివ్ రేటు నమోదైందన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్ మొదటి వారం నుండి క్రమంగా పెరుగుతూ మే మూడో వారం నుండి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది విడతల ఫీవర్ సర్వే చేపట్టి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. 

తాడిపత్రి ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ బెడ్ లతో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి, అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 250 ఆక్సిజన్ బెడ్లతో జర్మన్ హ్యాంగర్స్ పద్ధతిన తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాట్ల పనులు తుదిదశకు  చేరుకున్నాయన్నారు. గ్రామస్థాయిలో కరోనా కట్టడి చేయడానికి ప్రత్యేక వసతి సౌకార్యలు లేనివారికోసం ప్రతి గ్రామంలో విలేజ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు , దాతలను సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. కరోనా కట్టడికి సర్పంచుల ఆధ్వర్యంలో కరోనా కట్టడి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మండల,మున్సిపల్ స్థాయిలలో కరోనా కట్టడికి కరోనా వార్ రూములు కూడా ఏర్పాటు చేశామన్నారు. మొదటి దశలో కరోనా వ్యాప్తి పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉండగా, రెండో దశలో గ్రామీణ ప్రాంతాలలో కూడా కరోనా వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో మరియు పట్టణంలోని దాతల సహకారంతో ఇటువంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు


 ప్రైవేట్ ఆస్పత్రుల పై కఠిన చర్యలు తప్పవు :జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరిక

కోవిడ్ రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులకు జరిమానా విధించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా రోగుల నుండి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు యాజమాన్యం వసూలు చేసిన ఫీజుకు పది రెట్లు అధికంగా జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మొదటి తప్పుగా జరిమానా అనంతపురం లోని నాలుగు ఆసుపత్రులపై  సుమారు రూ. 9లక్షల 55 వేలు జరిమానా విధించడం జరిగిందని, రెండోసారి తప్పులు చేస్తే ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ లింగాల నిర్మల, ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Dharmavaram

2021-05-29 11:23:44

2021-05-29 11:18:58

2021-05-29 11:18:30

2021-05-29 11:17:56

2021-05-29 11:17:24