1 ENS Live Breaking News

కోవిడ్ లక్షణాలతో ఉన్నవారిని గుర్తించండి..

శ్రీకాకుళం  జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించుటకు ప్రత్యేక డ్రైవ్ ను సోమవారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. ఆదివారం మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులతో నిర్వహించిన టేలి కాన్ఫరెన్స్ లో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లక్షణాలతో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాలని, ఈ మేరకు వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, క్షేత్ర సహాయకులు తదితర గ్రామస్థాయి నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో దీన్ని చేపట్టి జిల్లాలో తగ్గుముఖం పడుతున్నా కరోనా కేసులను పూర్తిగా రూపుమాపేందుకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని జిల్లాను ఆరోగ్య దిశగా తీసుకు వెళ్లాలని అన్నారు. ప్రజల్లో అవగాహన వచ్చిందని, మరింత అవగాహన పెంచాలని ఆయన సూచించారు. గత నాలుగు రోజులుగా జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని పేర్కొంటూ ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో కరోనాను పారద్రోలాలని ఆయన కోరారు. ప్రస్తుత వివాహ వేడుకల సీజన్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వివాహ వేడుకలను అధికారులు తనిఖీ చేసి చర్యలు చేపడుతున్నారని ఆయన అభినందించారు. పాతపట్నం మండలంలో ఒక వివాహ వేడుకను తనిఖీ చేసి అపరాధ రుసుము విధించడం పట్ల పాతపట్నం తాసిల్దార్ కాళీ ప్రసాద్ కు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కుమార్ కు ఆయన అభినందించారు. వేడుకలలో ఎక్కువ మంది పాల్గొనడం వలన కరోనా వ్యాప్తి జరుగుతుందని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.

 ఆలయాల్లో కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని,  భక్తులకు ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేస్తూ వివిధ ఆలయాలను పరిశీలించాలని అన్నారు.  గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొంటూ జిల్లాలో ఇప్పటి వరకు 1049 కేంద్రాలను గుర్తించి 733 పడకలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం 38 మంది కరోనా బాధితులు గ్రామ కేంద్రాల్లో సేవలు పొందుతున్నారని ఆయన చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-30 08:06:32

అప్పన్న దర్శన సమయం 2 గంటలు పెంపు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో  జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న దర్శన సమయాన్ని మరో రెండుగంటలు పెంచుతున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఆదివారం ఈమేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యర్ధం ఉదయం 7:30 గంటల నుంచి 11:30 వరకూ సమయాన్ని పెంచినట్టు వివరించారు. ఆ నాలుగు గంటలసమయంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవచ్చని  ఈఓ  తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ తప్పక ధరించాలని, హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరని, భౌతిక దూరం పాటిస్తూ స్వామిని దర్శించుకోవాలన్నారు.   టికెట్ కౌంటర్ల దగ్గర- క్యూ లైన్లలో భక్తులకు ఎలాటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈఓ వివరించారు.

Simhachalam

2021-05-30 07:59:47

అప్పన్న ఆయలంలో క్లీన్ డ్రైవ్ తో మెరుపులు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారి ఆలయంలో ప్రత్యేక శుభ్రత కార్యక్రం చేపట్టారు. చాలా కాలం నుంచి శుభ్రపరచి ఆలయంలోని ఇత్తడి, రాగి గ్రిల్స్ ను నేడు ప్రత్యేకంగా శుభ్రపరిచారు. అంతేకాకుండా కళ్యాణ మండపంలోని అన్ని గ్రిల్స్ ను పాలిష్ చేశారు. దీనితో స్వామివారి ఆలయంలోపల అన్ని గ్రిల్స్ కొత్తవాటిలా తళ తళ మెరుస్తూ కనిపించాయి. ఆలయంలోకి వచ్చే భక్తులకు లోపలి వాతావరణం అంతా చాల పరిశుభ్రంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక క్లీన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టినట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై ఎప్పటికప్పుడు చేపట్టి భక్తులకు ఆలయంలో సరికొత్త అనుభూతి కలిగించే ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 

Simhachalam

2021-05-30 07:46:51

సత్వరమే కాలువలు శుభ్రం చేయాలి..

అనంతపురం నగరంలో ప్రధాన కాలువల్లో మరువంతక పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ వసీం శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు ధరణి కేఫ్ నుంచి అశోక్ నగర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న పూడికతీత పనులను శనివారం మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంను  దృష్టిలో ఉంచుకుని కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి వర్షం నీరు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని త్వరితగతిన పనులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా మరువ వంక చివరి వరకు పూడికతీత పనులు చేపట్టాలని తద్వారా వర్షపునీరు ముందుకు వెళ్లేందుకు ఆటంకం లేకుండా ఉంటుందని సూచించారు. కేవలం మరువ వంకలోనే కాకుండా చిన్న కాలువల్లో కూడా పూడికతీత చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు సోని రమణ, నరసింహులు, డి ఈ రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-29 16:00:25

శంఖుస్థాపన మహోత్సవంలా జరగాలి..

కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో జూన్ 1 నుండి 7వ తేదీ వరకూ జగనన్న కాలనీల శంఖుస్థాపన మహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హౌసింగ్ అధికారులను ఆదేశించారు.  శనివారం మంత్రి కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో  హౌసింగ్ అధికారులతో  సమావేశమై కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పధకం మొదటి దశ క్రింద ఎంపికైన  13585 మంది లబ్ధిదారులతో జూన్1నుంచి7వరకు నిర్వహించనున్న జగనన్న కోలనీల శంఖుస్థాపన మహోత్సవాల కార్యక్రమాల్లో ఇళ్ల నిర్మాణానికి   గ్రౌండింగ్ కు చేపట్ట వలసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ఫిల్టర్ పాయింట్లు, బోర్ వెల్ లు, విద్యుత్ సరఫరా వంటి మౌళిక సదుపాయాలను నియోజకవర్గ పరిధిలోని 49 లేఅవుట్ లలో వెంటనే కల్పించాలని అయన అధికారులను ఆదేశించారు. అలాగే లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామాగ్రి  అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే  నియోజకవర్గంలో రెండవ దశ గృహాల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టులు సమర్పించాలని మంత్రి హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ హౌసింగ్ డిఈఈ కెవిఆర్ గుప్తా, ఏఈ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Kakinada

2021-05-29 14:40:56

రేపు విశాఖలో కోవిడ్ వేక్సినేషన్ లేదు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వేక్సిన్ ఆదివారం జరపడం లేదని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈమేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నగరంలోని  ఆరిలోవ, మల్కాపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్లలో వ్యాక్షినేషన్ చేయడం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మళ్లీ  వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడు చేస్తున్నారనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తామని  కమిషనర్ తెలిపారు. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అంతేకాకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంటి పట్టునే ఉండాలని కోరారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.

GVMC office

2021-05-29 14:07:35

ప్రతీ రోజు త్రాగునీరు సరఫరా కావాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తూ నిత్యం మంచినీరు సరఫరా చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు.  శనివారం గాజువాక జోన్ 65వ వార్డు పరిధిలోని సుందరయ్య కోలనీలో  కమిషనర్  పర్యటించారు. సుందరయ్య కోలనీలో మంచినీరు ప్రతి రోజు ఇవ్వడం లేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమె సుందరయ్య కోలనీలోని పంపు హౌస్ ను సందర్శించి మంచినీరు ప్రతీ రోజు ఇవ్వకపోవడం పై గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని మోటార్లు పని చేయడం లేదని, అందువలన ప్రతీ రోజు మంచినీరు అందించడంలో ఇబ్బందులు తలెత్తాయని పర్యవేక్షక ఇంజినీరు బదులిచ్చారు. మోటారులను వెంటనే రిపేరు చేయించాలని అంతవరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మంచి నీరు అందించాలని పర్యవేక్షక ఇంజినీరును ఆదేశించారు.  ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్.రవి, కార్యనిర్వాహక ఇంజినీరు   పి. వెంకటరావు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు (ఎలక్ట్రికల్) లక్ష్మోజీ తదితరులు పాల్గొన్నారు.    

Gajuwaka

2021-05-29 14:01:10

పీఎం స్వ‌నిధి ప‌థ‌కానికి దరఖాస్తు చేసుకోవాలి..

ప్ర‌స్తుతం కోవిడ్ రెండోద‌శ స‌మ‌యంలో పీఎం స్వ‌నిధి ప‌థ‌కం ద్వారా 10,150 మంది ల‌బ్ధిదారుల‌కు త్వ‌రిత‌గ‌తిన రుణాల మంజూరుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), డీసీసీబీ ప‌ర్స‌న్ ఇన్‌ఛార్జ్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చిరువ్యాపారం, వీధివ్యాపారాలు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్న‌వారికి డీసీసీబీ ద్వారా రూ.10 వేలు చొప్పున రుణాలు మంజురు జ‌రుగుతుంద‌ని తెలిపారు. మ‌ధ్యాహ్నం 12 గం. నుంచి ఉద‌యం 6 గం. వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉన్నందున వీధి వ్యాపారులు, ఇత‌ర చిరు వ్యాపారాలు చేసుకొనే వారికి ప్ర‌యోజ‌నం క‌లిగించే ఉద్దేశంతో పీఎం స్వ‌నిధి ప‌థ‌కం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం రుణాల మంజూరుకు మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చిన‌ట్లు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో జిల్లాలో ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లోని 13 డీసీసీబీ శాఖ‌ల ద్వారా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రుణాల మంజూరుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జేసీ ల‌క్ష్మీశ తెలిపారు. 

ప‌థ‌కం వివ‌రాలు:
- ల‌బ్ధిదారుల నుంచి ఎలాంటి చ‌ర‌, స్థిర ఆస్తుల‌ను సెక్యూరిటీగా తీసుకోబ‌డ‌దు.
- మున్సిప‌ల్ విభాగం, మెప్మా ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ద్వారా ల‌బ్ధిదారుల గుర్తింపు జ‌రుగుతుంది.
- ల‌బ్ధిదారుల‌కు గుర్తింపు కార్డుతో పాటు లెట‌ర్ ఆఫ్ రిక‌మెండేష‌న్ (ఎల్‌వోఆర్‌) మంజూరు చేయ‌డం జ‌రుగుతుంది.
- ల‌బ్ధిదారుడు 12 స‌మాన సెల‌స‌రి వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించాలి.
- రుణాన్ని స‌కాలంలో చెల్లించిన వారికి ఏడు శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.
- ప‌థ‌కానికి క్రెడిట్ గ్యారెంటీ ట్ర‌స్ట్ ఫండ్, మైక్రో స్మాల్ ఎంట‌ర్‌ప్రైజెస్ క్రెడిట్ గ్యారెంటీ వ‌ర్తిస్తుంది.
- ప‌థ‌కం ద్వారా మంజూరు చేసిన అప్పు మొత్తాన్ని నాబార్డు నుంచి బ్యాంక్ రీఫైనాన్స్ పొందొచ్చు.
- పొదుపు ఖాతా ప్రారంభింప‌జేయ‌డం, రుణ ద‌ర‌ఖాస్తు పూరించ‌డం, ఉద‌య్ మిత్రా పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేసే బాధ్య‌త‌ల‌ను మున్సిప‌ల్ వార్డు స‌చివాల‌య సిబ్బంది (సీవో, ఆర్‌పీ) నిర్వ‌ర్తిస్తారు. మే 31 లోగా రుణాల మంజూరు ల‌క్ష్యాలను చేరుకోవాల్సి ఉంది.

Kakinada

2021-05-29 12:43:24

మే 30న అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో మే 30న స్వామివారి స్వర్ణపుష్పార్చన నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. శనివారం ఈ మేరకు ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారికి నిర్వహించే స్వర్ణ పుష్పార్చనలో భక్తులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన వచ్చునన్నారు. దానికి గాను ముందుగా టిక్కెట్టు చెల్లించిన వారికి ఆన్ లైన్ యూట్యూబ్ లింక్ పంపిస్తామని చెప్పారు. భక్తులు ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపూ టిక్కెట్టు మొత్తం ఆన్ లైన్ పేమెంట్ చేయవచ్చునన్నారు. దానికోసం భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని,  నిర్ణీత రుసుము చెల్లించి స్వర్ణ పుష్పార్చనలో పాల్గొనవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-29 12:41:03

తడి పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. శనివారం జివిఎంసీ పరిధిలోని  రెండవ జోన్ 11వ వార్డు పరిధిలో ఆరిలోవలో శనివారం ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్ల ను ఆమె పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, హెచ్.పి.సి.ఎల్ 23వేల డస్ట్ బిన్లను జివిఎంసికి అందించిందని మేయర్ తెలిపారు. విశాఖను సుందర నగరంగాను, చెత్త రహిత నగరంగాను తీర్చిదిద్దవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు.  ముఖ్యంగా మహిళలుగా ఆ బాధ్యత మనపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రతి రోజు సిబ్బంది డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయడం జరుగుతుందని, తడి-పొడి చెత్త మరియు ప్రమాదకరమైన చెత్త వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని మేయర్ సూచించారు. చెత్తను రోడ్ల పైన కాలువలలోను వేయరాదని ప్రజలకు సూచించారు. ప్రతీ దుకాణాల ముందు మూడు డస్ట్ బిన్లు ఉండాలని సూచించారు. హెచ్.పి.సి.ఎల్. యాజమాన్యం ఈ డస్ట్ బిన్లను సమకూర్చిందని వారికి మేయర్ ధన్యవాదాలు  తెలియజేశారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి.రాము, వెటర్నరి డాక్టరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.     

విశాఖ సిటీ

2021-05-29 12:30:21

జూన్ 1నుంచి బలవర్ధపు బియ్యం పంపిణీ..

సూక్ష్మ పోషకాలున్న బలవర్దపు (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని జూన్ 1వ తేదీ నుండి జిల్లా అంతటా పంపిణీ చేయనున్నట్లు సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కీషోర్ కూమర్ తెలిపారు.  ప్రస్తుతం బొబ్బిలి, పార్వతిపురం తెర్లాం, సాలూరు నియోజక వర్గాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  శనివారం  కలెక్టరేట్ ఆడిటోరియం లో పాత్రికేయుల సమావేశం లో ఆయన మాట్లాడరు. ఈ బియ్యం పై ప్రజల్లో రక రకాల  అపోహలు ఉన్నాయని, నిజానికి ఈ బియ్యం సాధారణ బియ్యమేనని, అయితే మిల్లింగ్ సమయం లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12  ను జత చేయడం  జరుగుతుందని తెలిపారు.  దీని వలన రక్త హీనత రాకుండా చేయడమే కాకుండా, పోషకాలు  లభిస్తాయని, గర్భిణీ లలో పిండం అభివృద్ధి, నాడీ వ్యవస్థ పని తీరు సాధరణంగా ఉంటాయని తెలిపారు.  ప్రజల్లో  అపోహ పోయి, అవగాహన పెంచాలని అన్నారు. జూన్ 1 నుండి  జిల్లాలోనున్న  7 లక్షల కార్డు దారులకు ఈ బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
        ఈ ఏడాది మొక్క జొన్న ఇంతవరకు 38 వేల మెట్రి టన్నులు సేకరించడం  జరిగిందని,  గత ఏడాది 60 వేల మెట్రి టన్నులు సేకరించామని అన్నారు. పంట ఎక్కువ వచ్చినందున గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ చేస్తామని తెలిపారు.  రైస్ కార్డ్ లలో విభజనలు,  జత చేయడం తొలగింపులు,  సరండర్ చేయుటకు 10 రోజులు గడువు ఉందని,  ఇంతవరకు 1లక్ష 42 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు.  ఏం.డి.యు వాహనాల ద్వారా రేషన్ సరఫరా లో ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లా మొదటి స్థానం లో ఉందని పేర్కొన్నారు.   ఖరీఫ్ లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని రబీ లో ఇంతవరకు 26 వేలను  సేకరించడమైందని,  మరో 10 వేల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. పండించిన ప్రతి గింజను కొంటామని, రైతులు ఆందోళన చందనవసరం లేదని అన్నారు.  రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని, విత్తనాలు,  పురుగుమందులు, , ఎరువులు అవసరమైనన్ని సరఫరాచేయడం  జరుగుతుందన్నారు.         ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా  రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-29 12:26:17

వైఎస్సార్ చేయూతకి ఆధార్ అనుసంధానం..

వైఎస్ఆర్ చేయూత ప‌థకం కోసం, 45 ఏళ్లు నిండి, కొత్త‌గా ఈ ఏడాది ద‌ర‌ఖాస్తు చేసుకొనే మ‌హిళ‌లు మాత్ర‌మే త‌మ ఆధార్‌కు సెల్ నెంబ‌ర్‌ను అనుసంధానం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. గ‌తేడాది ఈ ప‌థ‌కం కింద, రూ.18,750  ల‌బ్ది పొందిన‌వారికి మ‌ళ్లీ ఆధార్ లింకింగ్ అవ‌స‌రం లేద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాది ఆగ‌స్టు 12 నాటికి 45 సంవ‌త్స‌రాలు నిండుతున్న వారు మాత్ర‌మే, ఆధార్ కేంద్రాల‌కు వెళ్లి, త‌మ ఫోన్ నెంబ‌రును లింక్ చేసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కానికి అర్హ‌త పొంది, ఇది వ‌ర‌కూ ఆధార్ లింక్ చేసుకున్న‌ మ‌హిళ‌లు, మ‌రోమారు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అలాగే ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్త‌యిన వారికి ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌ద‌ని, వారి పేర్లు తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని వాలంటీర్లు, స‌చివాల‌య సిబ్బంది ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పేందుకు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు కృషి చేయాల‌ని కోరారు. ఆధార్ అనుసంధాన కేంద్రాల‌కు వెళ్లేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని, చేతుల‌ను శానిటైజ‌ర్‌తో శుభ్రం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.

Vizianagaram

2021-05-29 12:17:11