1 ENS Live Breaking News

సింహాద్రి అప్పన్నకు అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత రెండవ సారి స్వామికి చందనం సమర్పించిన స్వామివారిని మంత్రి దర్శించుకుని, ఆపై  కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు.  ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి  ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

Simhachalam

2021-05-28 14:02:13

ఆదివారం మాంసం అమ్మకాలు నిషేధం..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ద్రుష్ట్యా  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం మాంసం, చేపలు, రొయ్యలు  అమ్మకాలు నిషేధిస్తున్నాట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ప్రకటించారు. అధికంగా మాంసం దుకాణాల దగ్గర జనం అత్యధికంగా గుమిగూడుతున్నట్టు తమ ద్రుష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం  కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇకపై కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని, కోరనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వివరించారు.

GVMC office

2021-05-28 13:54:14

పార్కు అభివ్రుద్ధి కౌన్సిల్ ఆమోదం పొందింది..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ఇటీవల ముడసర్లోవ పార్కు అభివృద్ధి కి సంబంధించి రాజ్యసభ సభ్యులు   విజయసాయి రెడ్డి, జివిఎంసి కమిషనర్, విఎంఆర్ డి ఎ కమిషనర్, జాయింట్ కలక్టరు, ఇతర ఉన్నతాధికారులు పర్యటించారు. ఈ పర్యటనకు సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోయానని తెలిపారు. జనసేన పార్టి కార్పొరేటర్  పి.ఎల్.వి. నారాయణమూర్తి సామాజిక మాధ్యమాలలోను, కొన్ని మీడియా గ్రూపులలోను కార్పొరేటర్లు మరియు అఫీసర్సు వాట్స్ యాప్ గ్రూపులలోను ముడసర్లోవ పార్కు అభివృద్ధి పై జరిగిన పర్యటనపై అసత్య ఆరోపణలు చేసారని వాటిని ఖండిస్తున్నానని మేయర్ తెలిపారు. ముడసర్లోవలోని పర్యటనకు ముందస్తు సమాచారం ఉందని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు వలన మీటింగుకు హాజరు కాలేకపోయానని, ముడసర్లోవ పార్కుకు సంబంధించిన డి.పి.ఆర్.ను కౌన్సిల్ ఇప్పటికే ఆమోదించిందని తెలిపారు. ఈ ఆమోదానికి లోబడి మాత్రమె పార్కును సందర్సించడమైనదని, కాబట్టి ఇందులో ఎటువంటి కుట్రలు మరియు కబ్జాలు లేవని, చేయవలసిన అవసరం కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వారికి లేదని ఇందుమూలంగా తెలియజేయడమైనదని, ఈ విషయంపై ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత అధికారులతో చర్చించి స్పష్టత తీసుకోనవచ్చునని మేయర్ తెలిపారు.  

Visakhapatnam

2021-05-28 13:48:28

అర్హులందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలి..

విశాఖ జిల్లాలో  45 సం.లు దాటిన వారందరూ కోవిడ్ టీకా తప్పక వేయించుకోవాలని జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరెడ్డి పిలుపు నిచ్చారు.  శుక్రవారం ఆయన పరవాడ, అచ్యుతాపురం లలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాలను పరిశీలించారు. వాక్సినేషన్ కు వచ్చినపుడు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని,  మాస్కు ధరించాలన్నారు.  టీకా వేసుకున్న తరువాత  కూడా కరోనా జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.  ప్రజలందరికీ ఈ విషయాలపై క్షుణ్ణమై అవగాహ కలిగించాలని అధికారులను ఆదేశించారు.   ముందుగా ఆయన  పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వాక్సినేషన్ ను పరిశీలించారు.  అనంతరం  అచ్యుతాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.  వాక్సినేషన్ జరుగుతున్న తీరును గూర్చి వైద్యాధికారులతో మాట్లాడారు.  వారికి సూచలు చేశారు.  జేసీ వెంట  అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి సీతారామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Paravada

2021-05-28 13:41:33

అప్పన్నకు సేవచేసే యోగం రావడం ఎంతో అదృష్టం..

దేవాలయాల్లో సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని
 రాష్ట్ర  పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల సింహాచలం ట్రస్టుబోర్డుకి ప్రత్యేక ఆహ్వానితులు నియమితులైన సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో కలిసి మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు అద్యాత్మిక, ప్రశాంతతకు మారు పేరు అని అన్నారు. అంతేకాకుండా ఆ భగవంతుని సేవ చేసుకోవడానికి  సభ్యులకు చక్కని అవకాశం కలిగిందన్నారు.  సభ్యులు దేవున్ని స్మరించుకుంటూ భక్తులకు మెరుగైన సేవలందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి అందరు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీసుబాబు , మేడిద మురళీకృష్ణ , దశమంతుల మాణిక్యాలరావు మంత్రికి సింహాద్రినాధుడి జ్ఞాపికను బహుకరించి స్వామివారి శేషవస్త్రాన్ని అందజేశారు.

Seethammadara

2021-05-28 09:18:45

తక్షణమే కాలువలు శుభ్రం చేయండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లోని కాలువలు తక్షణ శుభ్రం చేయాలని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఐదవ జోన్, 61వ వార్డు నందు పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. రోడ్లను, కాలువలను శుభ్రం చేసి వెంటవెంటనే డంపింగ్ యార్డ్ తరలించాలని శానిటరి సూపర్వైజర్ ను ఆదేశించారు. కాలువలలోను,   రోడ్లపైన ఎక్కడా చెత్త కనిపించకూడదని, ప్రతిరోజూ  శానిటరి ఇన్స్పెక్టర్ మరియు వార్డు సచివాలయ శానిటరి  కార్యదర్శిలు వారి పరిధిలోని రోడ్లను, కాలువలను పరిశీలించాలని, పారిశుద్ధ్య సిబ్బందికి తడి-పొడి చెత్త వేరువేరుగా తీసుకునే విధంగా  సూచనలు ఇవ్వాలని, స్థానిక ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని, రోడ్డుపైన, కాలువలలోను చెత్త వేసినచో   ఆ చుట్టు ప్రక్కల ఉన్నఇళ్లకు, దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. ప్రతీ దుకాణం ముందు మూడు డస్ట్ బిన్లు ఉండేలా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు దృష్టిలో ఉంచుకొని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా, కుండీలలోని నీరు ఎక్కువకాలం నిల్వ ఉంచకూడదని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఇంటి ఆవరణలో కొబ్బరి బొండాలు గాని, ప్లాస్టిక్ వస్తువులు గాని లేకుండా చూడాలని, పూల కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిని ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-05-27 17:25:12

ప్రారంభమైన మొటి డోసు కోవిడ్ టీకా..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేస్తున్నట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసి పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, ఆరిలోవ, మల్కాపురం FRU సెంటర్ల లోను, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేస్తున్నట్టు తెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ వేయించుకుని 84 రోజులు పూర్తయిన వారికి రెండవ డోస్ వేయడం జరుగుతుందని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా, ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని 45సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించి, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్ తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద రద్దీ దృష్ట్యా పోలీసుల సహాయం తీసుకోవాలని, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి ని ఆదేశించారు.    

GVMC Park

2021-05-27 17:22:16

పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య నిర్వహణ..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పిన్ పాయింట్ విధానంలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. గురువారం ఐదవ జోన్ 44వ వార్డు పరిధిలోని  రామచంద్ర నగర్ తదితర ప్రాంతాలలో  కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని ఉండేలా చూడాలని ఎఎంఓహెచ్ ను ఆదేశించారు. ఎవరికి నిర్దేశించిన పాయింట్ లో వారే విధులు నిర్వహించాలని, ఒక్కొక్క పిన్ పాయింట్ లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని వారిని సర్దుబాటు చేయాలని వారే డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని తెలిపారు.  తడి-పొడి చెత్త వేరువేరుగా తీసుకోవాలని, తడి-పొడి చెత్తను వేరువేరుగా ఇచ్చే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ, రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలని ఆవిధంగా ఎవరైనా చెత్త వేసినచో ఆ చుట్టుప్రక్కల ఉన్న ఇళ్ళకు మరియు దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని, ప్రతి దుకాణం ముందు డస్ట్    బిన్లు ఉండేలా చూడాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రజల కోరిక మేరకు ఎవరైనను యుజిడి కనెక్షన్ తీసుకుని లేనియెడల వారికి కొత్తగా కనెక్షన్ ఇవ్వాలని పర్యవేక్షక ఇంజనీర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అయిదవ జోనల్ కమిషనర్ సింహాచలం,  పర్యవేక్షక ఇంజనీర్ వేణుగోపాలరావు, ఎఎంఓహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజనీర్ (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.      

Visakhapatnam

2021-05-27 17:19:54

అలిపిరి వరకు గరుడవారధి..

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పూర్తయ్యే ప్రాంతంలో జరుగుతున్న పనులను టిటిడి చైర్మన్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్లేవారు నేరుగా టోల్ గేట్ ద్వారా, నడచి వెళ్లేవారు అలిపిరి కాలినడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  టిటిడి చైర్మన్ వెంట చీఫ్ ఇంజినీర్  రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tirupati

2021-05-27 17:10:39

కోవిడ్ చికిత్స మరింత మెరుగుపరచాలి..

కోవిడ్ ఇన్‌పేషెంట్ రక్షణ మరియు చికిత్స నిర్వహణ మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం రిమ్స్‌లో ఈ విషయంపై కోవిడ్ డ్యూటీ డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేషెంట్‌కేర్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీలులేదన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మానసికంగా ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. చికిత్స చేస్తున్న వైద్యులను దేవుళ్లుగా బాధితులు భావిస్తున్నారని, వైద్య ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా
కఠినచర్యలు తప్పవని చెప్పారు. బెడ్ మేనేజ్‌మెంట్ పకడ్భందీగా ఉండాలని కలెక్టర్ పునరుద్ఝాటించారు. రోగుల పరిస్థితిని నిరంతరం గమనిస్తూవుండాలని, కోలుకున ్నవారిని వెంటనే డిశ్చార్జీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలవల్ల ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదని ఆయన ప్రకటించారు. ఆక్సిజన్ వినియోగంలో వృధాను అరికట్టాలని చెప్పారు. కోవిడ్ విధుల్లో పాల్గొంటున్న జూనియర్ డాక్టర్లకు, ఇతర కింది స్థాయి సిబ్బందికి ఒక రోల్‌మోడల్‌గా నిలువాలని వైద్యులకు ఆయన సూచించారు. నోడల్ ఆఫీసర్ గా వున్న జాయింట్ కలెక్టర్ కె. క్రి ష్ణవేణి మాట్లాడుతూ వైద్య సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే బాధితులు త్వరగా కోలుకుంటారని అన్నారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అందరూ మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం వుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డిప్యూటి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణారెడ్డి, ఆర్.ఎమ్.ఓ. వేణుగోపాల రెడ్డి, ఎ.పి.ఎమ్.ఎస్. ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-05-27 10:54:50

రేపు డిసిసి సమావేశం-కలెక్టర్..

ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశం 28వ  తేదీన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్పందన సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ, కట్టడి చర్యలు, ఆయా కార్యకలాపాలపై  సమీక్ష జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఇంన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  పి. విశ్వరూప్, రాష్ట్ర విద్యుత్, అటవి శాస్త్ర సాంకేతిక పర్యావరణశాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాలోని శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొంటున్నారని కలెక్టర్ చెప్పారు. జిల్లా అధికారులంతా సకాలంలో హాజరుకావాలని ఆయన తెలిపారు.

Ongole

2021-05-27 10:40:40

కేలండర్ ప్రకారమే సంక్షేమ పథకాలు..

రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ కేలండ‌ర్ ప్ర‌కారం వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌ని, పూర్తిస్థాయిలో వీటి ఫ‌లితాలు ల‌బ్ధిదారుల‌కు స‌రైన స‌మ‌యంలో అందించ‌డంలో బ్యాంకులు కీల‌క‌పాత్ర పోషించాల్సి  ఉంటుందని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి సంప్ర‌దింపుల క‌మిటీ (డీసీసీ) స‌మావేశం వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగింది. జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డ‌బ్ల్యూ) జి.రాజ‌కుమారి పాల్గొన్న ఈ స‌మావేశంలో వివిధ ప‌థ‌కాలు, వార్షిక రుణ ప్ర‌ణాళిక కింద వివిధ రంగాల్లో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో బ్యాంక్ సంబంధిత అంశాల్లో పురోగ‌తిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మ‌ధ్యాహ్నం 12 గం. వ‌ర‌కు జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌ను బ్యాంకుల‌లోకి అనుమ‌తించి, ఆపై సాయంత్రం 5 గం. వ‌ర‌కు అందుబాటులో ఉన్న స‌మ‌యాన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం, అంత‌ర్గ‌త బ్యాంకు వ్య‌వ‌హారాల‌కు ఉప‌యోగించాల‌ని సూచించారు. స‌మాచార మార్పిడికి సంబంధిత విభాగాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ కార్య‌క‌లాపాలు సాగించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో బ్యాంకులు క్రియాశీల‌పాత్ర పోషించాల‌ని, రుణాల మంజూరు, ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం త‌దిత‌ర అంశాల్లో పురోగ‌తిపై ప్ర‌తివారం స‌మీక్షించ‌నున్న‌ట్లు తెలిపారు. 2021, మే 26 నాటికి జ‌గ‌న‌న్న తోడు (గ్రామీణ‌) కింద 96.26 శాతం మేర రుణాల పంపిణీ పూర్త‌యింద‌ని, అదే విధంగా పీఎం స్వానిధి కింద 19,464 మందికి రుణాలు మంజూరైన‌ట్లు తెలిపారు. వైఎస్సార్ బీమాకు సంబంధించి డేటా ఎన్‌రోల్‌మెంట్ ప్ర‌క్రియ‌ను వెంట‌నే పూర్తిచేయాల‌ని సూచించారు.
   వైఎస్సార్ సున్నా వ‌డ్డీ పంట రుణాల ప‌థ‌కం కింద ఎక్కువ మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గాలంటే ఖ‌రీఫ్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా రుణాల మంజూరుకు చ‌ర్య‌లు తీసుకోవాలని, స‌మ‌యాన్ని ఆదాచేసేందుకు ఆర్‌బీకేల స్థాయిలో డాక్యుమెంటేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. ఇందులో వీఏఏలు, బిజినెస్ క‌ర‌స్పాండెంట్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కలెక్టర్ సూచించారు.  స‌మావేశంలో ఎల్‌డీఎం జె.ష‌ణ్ముఖ‌రావు, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, వివిధ బ్యాంకుల కోఆర్డినేట‌ర్లు, కంట్రోల‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-27 10:35:24

సర్వేయర్లకు రోవర్స్ తో సర్వేలో శిక్షణ..

రోవర్స్ అనే ఆధునిక పరికరంతో భూ సర్వేపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని సర్వే శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర రావు తెలిపారు. ఆధునిక పరికరాలు లభ్యతతో భూ సర్వే సమర్ధవంతంగా చేపట్టవచ్చని ప్రభాకర చెప్పారు. శిక్షణా కార్యక్రమాన్ని ఆర్ అండ్ బి అతిధి గృహం సమీపంలోగల మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సర్వేయర్లు రోవర్స్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేసారు. ఒక ప్రాంతంలో రోవర్స్ పరికరం గాలిలో వినియోగించడం వలన ఆ ప్రాంతంలోని భూ సర్వే చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ కె.ఈశ్వర దొర, డిప్యూటి ఇన్ స్పెక్టర్లు జి.వెంకట రావు, సారంగ పాణి, కొండల రావు, మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-27 10:29:32

ట్రాన్స్ జెండర్స్ కు ఆర్థిక సహాయం..

ట్రాన్స్ జెండర్స్ కు ఆర్థిక సహాయం అందజేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,  వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు కె.జీవనబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు కరోనా కష్ట సమయంలో రూ.1500 ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. ఆర్ధిక సహాయం పొంఫుటకు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. దరఖాస్తును  http://www.nisd.gov.in  వెబ్ సైట్ లో సమర్పించాలని వివరించారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, బ్యాంకు పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ తదితర వివరాలను సమర్పించాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ అందరు సద్వినియోపరచు కోవాలని ఆయన కోరారు.

Srikakulam

2021-05-27 10:27:31

దివ్యాంగులకు సుగమ్యా భారత్ యాప్..

దివ్యాంగులకు సుగమ్యా భారత్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,  వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సుగమ్యా భారత్ యాప్ ను జాతీయ స్థాయిలో ప్రారంభించారన్నారు. సమాజంలో తమ జీవన విధానంలో  వివిధ సదుపాయాల లభ్యతను దివ్యాంగులు తెలుసుకునే అవకాశం సుగమ్యా భారత్ యాప్ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్స్, వైద్య శాలల్లో సులభంగా నడిచే దారులు,   వాహానాల పార్కింగ్, సులభమైన భవన ప్రవేశ ద్వారాలు, అంతర్గత సదుపాయాలు, సులభమైన కారిడార్, రిసప్షన్, లిఫ్ట్ ఎలివేటర్, మరుగుదొడ్లు, మెట్ల మార్గం, మంచినీళ్ళ సదుపాయం, సులభమైన సంకేతాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. దివ్యాంగులు సుగమ్యా భారత్ యాప్ ను ఆన్ లైన్ ద్వారా తెరచి వారి సలహాలు, సూచనలు పొందుపరచ వచ్చని తెలిపారు. పొందుపర్చిన విషయాలను నేరుగా భారత ప్రభుత్వ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకొని చర్య చేపడుతుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా దివ్యాంగులు అందరూ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. యాప్ ను మోబైల్ ఫోన్ లో  ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని అన్నారు. డౌన్ లోడ్ అనంతరం భారత ప్రభుత్వం జారీ చేసే యూనిక్ డిజెబిలిటీ ఐడి కార్డు సెంటర్ తో అనుసంధానం అయి వినియోగించ వచ్చని సూచించారు.

Srikakulam

2021-05-27 10:24:17