1 ENS Live Breaking News

పోర్టిఫైడ్ రైస్ ను ఉపయోగించుకోవాలి..

ప్రజారోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వం సరఫరా చేస్తున్న సూక్ష్మ పోషకాలు కలిగిన బలవర్ధకపు బియ్యం (పోర్టిఫైడ్ రైస్) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కోరారు.  కురుపాంలో మంగళవారం పోర్టిఫైడ్ బియ్యం పంపిణీని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు ఉన్నాయని అయితే ఇవి ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు పోషకాలను కలిపిన సాధారణ బియ్యమేనని స్పష్టం చేసారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల కుటుంబాలకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలకు పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
ఇవి సాధారణ బియ్యం కాదని ప్లాస్టిక్ బియ్యమని  కూడా కొందరు అపోహపడుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే కొంతమంది ఈ బియ్యాన్ని తాము సద్వినియోగం చేసుకోకుండా మార్కెట్లో ఇతరులకు ఇచ్చేయడం లాంటి పనులు చేస్తున్నారన్నారు. అయితే ఈ బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఈ బియ్యాన్ని మిల్లింగ్ చేసే సమయంలో వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 కలుపుతారని వివరించారు. ఈ సూక్ష్మసోషకాలను కలగలిపిన ఈ బియ్యాన్ని తిన్నవారికి పోషకాలు బాగా అందుతాయని, శరీరంలో నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుందని, గర్భిణీ స్త్రీలలో పిండం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం కురుపాం  నియోజకవర్గంలో 5 మండలాల్లో 73,391 బియ్యం కార్డులు ఉన్నాయని, ప్రతి నెలా 1620 మెట్రిక్ టన్నుల బియ్యం నియోజక వర్గంలో ఫిబ్రవరి 2021 నుండి 108 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా ఇంటింటికీ బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ నెల నుంచి కురుపాం నియోజక వర్గం ఆన్ని మండలాల్లోని ఫోర్ట్ ఫెడ్ బియ్యం సూక్ష్మ పోషకలున్న బలవర్ధక బియ్యాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు.ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ బియ్యాన్ని తయారు చేయించి పంపిణీ చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల కార్డుదారులకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలను పరిరక్షించడానికి, పేదలకు కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రూ.8 వేల కోట్లతో నిర్మించనున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసారు. అత్యవసరమైన వైద్య సేవలు, అత్యాధునిక చికిత్సల కోసం రాష్ట్రానికి చెందిన ప్రజలు ఇతర రాష్ట్రాలలోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా మొత్తం 16 ప్రాంతాల్లో మెడికల్ హబ్ లను ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని పుష్ప శ్రీవాణి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేకర, కురుపాం గ్రామ సర్పంచ్ గార్ల సుజాత, కళింగ వైశ్య, ఐరక కార్పొరేషన్ డైరెక్టర్లు కె.సురేష్, గవర విజయ్, కళింగ వైశ్య జిల్లా అధ్యక్షుడు అందవరపు కోటేశ్వరరావు, నాయకులు శెట్టి నాగేశ్వరావు, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

Kurupam

2021-06-01 11:45:10

అనాధలైన చిన్నారుల వివరాలు తెలియజేయండి..

కరోనా వైరస్ భారినపడి తల్లిదండ్రులు మృతిచెంది అనాధలైన చిన్నారుల వివరాలు తెలియ జేయాలని విశాఖ అర్భన్ తహసీల్దార్ జ్నానవేణి కోరారు. మంగళవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కారణం తల్లిదండ్రులు మృుతి చెంది అనాధలైన చిన్నారులకు ప్రభుత్వం జీవో నెంబరు 243ని అనుసరించి  రూ.పది లక్షలు ఎక్స్ గ్రేషియా మొత్తం బ్యాంకులో ఫిక్సిడ్ జిపాజిట్ చేస్తుందన్నారు. అలాంటి వారి సమాచారం తెలియజేయాలని వార్డు కార్పోరేటర్లను, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేశామన్నారు. అనాధలైన పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలన్నారు. అలాంటి వారి వివరాలను స్వయంగా తన నెంబరుకు 9849903824  తెలియజేయవచ్చునన్నారు. అనాధలైన చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని తహసీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.

Visakhapatnam

2021-06-01 04:30:44

అనంతలో శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో జిల్లాలో ఆక్సిజన్ నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టడంలో భాగంగా శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ ఏర్పాటు చేశామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి  అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని  కాపాడేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా జిల్లాలో నెలకొన్న లిక్విడ్ ఆక్సిజన్ కొరత తీర్చేందుకు 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ శాశ్వత క్రయోజనిక్ ట్యాంకర్ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసి ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రూ .24 లక్షల వ్యయంతో శాశ్వతంగా క్రయోజనిక్ ట్యాంక్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎక్కడైనా ,ఏదైనా ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఇదివరకే జిల్లాకు వాహనం పైన అమర్చబడి ఉన్న క్రయోజనిక్ ట్యాంకర్ ను  తెప్పించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు డి ఆర్ డి ఓ సహకారాలతో జిల్లాలోఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్లు  మంజూరు అయ్యాయని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  మహమ్మద్ వసీం సలీం, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా ) నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్( గ్రామ , వార్డు సచివాలయం )  డా. ఏ. సిరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి ఎస్ ఎన్ మూర్తి , ఆర్ఎం ఓ డా.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-31 15:57:21

సత్వర వైద్య సహాయమే ప్రభుత్వ లక్ష్యం..

కోవిడ్ నేపథ్యంలో  ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు . ముఖ్యంగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య నిధుల నుంచి కూడా ఒక శాశ్వత ట్యాంకర్ ను జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. దీనివల్ల కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా ఆక్సిజన్ నిల్వలు పెంచుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో బయట ప్రాంతాల నుండి వచ్చే ఆక్సిజన్ పై ఆధారపడే వారమని ప్రస్తుతం ఆసుపత్రిలోనే స్వతహాగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకొని వాడుకునే విధంగా క్రయోజనిక్ ట్యాంకర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.గత ఏడాది మార్చి నుండి ఒక సంవత్సర కాలంలో సుమారు 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ,కదిరి, గుంతకల్లు ఏరియా ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.కరోనాబాధితులకు తాడిపత్రిలో 500 పడకలు, అనంతపురం సూపర్ స్పెషాలిటీ వద్ద 250 పడకలతో తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటు చర్యలు తీసుకున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  మహమ్మద్ వసీం సలీం, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా ) నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్( గ్రామ , వార్డు సచివాలయం )  డా. ఏ. సిరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి ఎస్ ఎన్ మూర్తి , ఆర్ఎం ఓ డా.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-31 15:54:32

500 పడకల ఆసుపత్రి త్వరలోనే ప్రారంభం..

తాడిపత్రి ప్రాంతంలోని ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆసుపత్రి వద్ద పూర్తి అయిన పనులను  జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ పరిశీలించారు. సోమవారం తాడిపత్రి వద్ద ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆసుపత్రి పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పనులు పూర్తి స్థాయిలో పూర్తి అయిన వని అతి త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని, ఎలక్ట్రిసిటీ, శ్యానిటేషన్ అప్రోచ్ రోడ్డు , ఫెన్సింగ్ మరియు ఆక్సిజన్ సప్లై పనులు అన్నీ పూర్తి అయినాయని,  తాత్కాలిక బాత్ రూం ల యందు వాటర్ సప్లై , బాత్ రూం ఔట్ పుట్ నందు సంపులు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచాలని ఆదేశించారు. డాక్టర్లు మరియు నర్స్ లకు సంబంధించి రోజువారీ ఆహారము మరియు వారు నివాసం  ఉంటున్న టేక్ ఇంజనీరింగ్ కాలేజీ నందు ప్రత్యేకంగా తనిఖీ చేసి, వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఇంఛార్జి అధికారులకు సూచించారు;  కార్యక్రమంలో  ఏపీఎంఎస్ఐడిసి డిఈ చంద్రశేఖర్ రెడ్డి, తహశీల్దార్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Tadipatri

2021-05-31 15:52:46

11.30 వరకే అప్పన్న ప్రసాద విక్రయాలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న  దర్శనాల సమయం పెంచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. సోమవారం ఆమె ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనాలు జరుగుతున్న సమయం అంటే 11.30 వరకూ మాత్రమే ప్రసాదాల విక్రయాలు జరుగుతాయని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం రూ.300, 100, టోల్ గేట్ల టిక్కెట్లను ఒకే చోట అందించే ఏర్పాటు చేశామన్నారు.  కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో పెట్టుకొని క్యూలైన్య శానిటైజేషన్ చేయించినట్టు చెప్పారు. భక్తులంతా ఖచ్చితంగా మాస్కులు ధరించి ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఈఓ తెలియజేశారు.

Simhachalam

2021-05-31 15:49:38

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు..

వైద్య సేవ‌లు, ఇత‌ర చికిత్సలు అందించిన త‌ర్వాత క‌రోనా రోగుల నుంచి నిబంధ‌న‌ల మేర‌కే ఫీజులు వ‌సూలు చేయాల‌ని, అలా కాకుండా అధికంగా వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జేసీ ఆర్‌. మ‌హేష్ కుమార్ హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం ఇటీవ‌ల జారీ చేసిన‌ జీవో నెం.185లో పేర్కొన్న ప్ర‌తి నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని, నియ‌మావ‌ళిని అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. కోవిడ్ సేవ‌లు, ఫీజుల వ‌సూలు, మందుల స‌ర‌ఫ‌రా త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించేందుకు జేసీ ఆర్‌. మ‌హేష్ కుమార్ సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మావేశం నిర్వ‌హించారు. 185 జీవో ప్ర‌కారం ఆరోగ్య శ్రీ సేవ‌ల‌కు, ప్రయివేటు సేవ‌ల‌కు ఎంతెంత‌ ఫీజు వ‌సూలు చేయాలో స్ప‌ష్టంగా పేర్కొన‌డ‌మైన‌ద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. చికిత్స అనంత‌రం నాన్ మెడిక‌ల్ నోడ‌ల్ ఆఫీస‌ర్ ప‌రిశీలించి కౌంటర్ సంత‌కం చేసిన త‌ర్వాతే బిల్లులు మంజూర‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను, నిబంధ‌న‌లను పాటించ‌ని ఆసుప‌త్రుల యాజ‌మాన్యాల‌కు మూడు సార్లు జరిమానా విధిస్తామ‌ని.. త‌ర్వాత చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఆసుప‌త్రుల్లో అందే చికిత్స‌, ఇత‌ర సేవ‌ల‌పై నోడ‌ల్ ఆఫీస‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. థ‌ర్డ్ పార్టీ బృందం బిల్లుల విష‌యంలో.. సేవ‌ల విష‌యంలో రోగుల‌తో మాట్లాడి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వివ‌రించారు. అలాగే ఆసుప‌త్రుల్లో అందే సేవ‌ల‌పై, ఇత‌ర ప్ర‌క్రియ‌ల‌పై ఇంటిలిజెన్స్ నిఘా ఉంటుంద‌ని జేసీ వెంక‌ట‌రావు అన్నారు. బిల్లు త‌యారు చేసేట‌ప్ప‌డు ఏక మొత్తం వేయ‌రాద‌ని, ఏ సేవ‌కు ఎంత ఫీజు వ‌సూలు చేస్తున్నారో స్ప‌ష్టంగా పేర్కోవాల‌ని సూచించారు. క‌రోనా రోగుల‌ను ఉద‌యం 8.00 గంట‌లకు ముందు, రాత్రి 10.00 గంట‌ల త‌ర్వాత డిశ్చార్జి చేయ‌డానికి వీలులేద‌ని చెప్పారు. 

బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌పై ప్ర‌త్యేక దృష్టి..

బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించిన వెంట‌నే చికిత్స అంద‌జేయాల‌ని, ఆల‌స్యం చేయ‌రాద‌ని జేసీ మ‌హేష్ కుమార్ సూచించారు. వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన వెంట‌నే డీసీహెచ్‌స్‌ను లేదా మిమ్స్ ఆసుప‌త్రిలో సంప్ర‌దించాల‌ని అక్క‌డ వ్యాధిని నిర్ధారించాక తదుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే కోవిడ్ రోగుల‌కు గానీ, బ్లాక్ ఫంగ‌స్ రోగుల‌కు గానీ అవ‌స‌ర‌మైన‌ మందుల ఇండెంట్‌ను ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎం.డి.ఎ.పి. యాప్ ద్వారానే పెట్టాల‌ని సూచించారు. రోగుల‌కు వైద్య ప‌రమైన సేవ‌లందిచ‌టంలో నోడ‌ల్ ఆఫీస‌ర్లు బాధ్య‌తాయుతమైన పాత్ర పోషించాల‌ని పేర్కొన్నారు.

సమావేశంలో జేసీలు ఆర్‌. మ‌హేష్ కుమార్‌, జె. వెంక‌ట‌రావు, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, డీఎం&హెచ్‌వో ర‌మ‌ణ కుమారి, ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేట‌ర్ అప్ప‌ల‌రాజు, వైద్యాధికారులు, ప్ర‌యివేటు ఆసుపత్రుల నిర్వాహ‌కులు, ఆరోగ్య శ్రీ కార్య‌క‌ర్త‌లు, ఫార్మసిస్టులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Vizianagaram

2021-05-31 15:39:38

అన్నదానం, ప్రసాదం కేంద్రాల ఆధునీకరణ డిజైన్లకు ఆహ్వానం..

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో భక్తులకు అత్యంత నాణ్యమైన అన్న ప్రసాదాలను అందించాలని ట్రస్టు బోర్డు ఛైర్మన్ సంచయిత గజపతి, సభ్యులు, ఈఓ  ఎంవీ సూర్యకళ నిర్ణయించారు. ట్రస్టు బోర్డు సూచనల మేరకు అన్నదానం, ప్రసాదం తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో  ఆధునీకరణ కోసం ఈఓ ఆసక్తి ఉన్నవారి నుంచి డిజైన్లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఈఓ మీడియాతో మాట్లాడుతూ,  దైవభక్తి ఉన్న ఔత్సాహిక  డిజైన్లను ట్రస్టు బోర్డు  పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.  దాతలు ముందుకొచ్చి అన్న ప్రసాదాల కిచెన్ల ఆధునీకరణలో పాల్గొనవచ్చున్నన్నారు. ఎక్కువ మంది భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు  ఆటోమేటిక్ మెకనైజ్డ్ , శానిటైజ్డ్ కిచెన్లు  ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. దేవస్థానం ఇచ్చిన టెక్నికల్ క్రైటీరియా పాటిస్తూ సింహాచలం అన్నదానం , కిచెన్ల ఆధునీకరణ చేసేవారు డిజైన్లు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం దేవస్థానం వెబ్ సైట్  www.simhachalamdevasthanam.net  లేదా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్   www.tender.apeprocurement.gov.in  లను చూడవచ్చు. EOI (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇట్రస్టు)  గురించి వివరాలు తెలుసుకోవడానికి దేవాలయం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవిరాజుకు 9618072527 ఫోన్ చేసి తెలుసుకోవచ్చనన్నారు.  

                   దేవస్థానంలో ప్రస్తుతం ప్రతి రోజూ మ్యాన్యువల్ గా 15,000 పులిహోర ప్యాకెట్లు, 20,000 లడ్డూ ప్యాకెట్లను తయారు చేస్తోందని ఇకపై భక్తుల అవసరాలను దృష్టిలోపెట్టుకుని  వీటి తయారీకి మెషీన్లు కూడా వినియోగించనున్నామన్నారు. రోజుకు దాదాపు 15,000 మందికి అన్నప్రసాదం అందించేలా అన్నప్రసాదం గ్రౌండ్ ఫ్లోర్ , సెంట్రల్ స్టోర్ కిచెన్ ను యాంత్రీకరించనున్నామని  ఈఓ తెలిపారు.  డిజైన్లు చేసిన వారికి ఎలాంటి పారితోషకం ఇవ్వరని, కేవలం స్వామివారిపై ఉన్న భక్తితోనే ఉచితంగానే డిజైన్లు సమర్పించాల్సి వుంటుందని పేర్కొన్నారు.

Simhachalam

2021-05-31 15:38:22

వారానికి ఒకరోజు డ్రైడే తో వ్యాధులన్నీ దూరం..

మహావిశాఖనగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా వారానికి ఒక రోజు డ్రైడే పాటించడం ద్వారా వ్యాధులను నియంత్రించడానికి వీలుపడుతుందని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన పిలుపునిచ్చారు. సోమవారం మూడవ జోన్ 24వ వార్డు నక్కవాని పాలెం ప్రాంతంలో   కమిషనర్  పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలతో మాట్లాడుతూ రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవాలని, ఇళ్ళలో వాడే నీటికుండీలను ప్రతీ రెండు రోజులకు ఒక్కసారి నీటిని మార్చాలని, నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇంటి పరిసరాలలో ఉండకుండా చూడాలని, ప్రతీ ఒక్కరూ ప్రతీ శుక్రవారం “డ్రై” డే గా పాటించాలని సూచించారు. ఇంటి ముందు ఉన్న కాలువలకు అడ్డంగా రాళ్ళను పెట్టడం వలన నీరు నిల్వ ఉంటుందని వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా కాలువలకు అడ్డంగా రాళ్ళు, జాలీలు లాంటివి పెట్టినట్లయితే ఆ ఇంటి నుండి అపరాధ రుసుం వసూలు చెయాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. రోడ్లను, కాలువలను ప్రతీ రోజు శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. గృహ నిర్మాణ వ్యర్ధాలను వెంటవెంటనే తొలగించాలని, వ్యర్ధాలు తొలగించని యడల గృహ యజమానికి అపరాధ రుసుం వసూలు చేయాలని ఆసిస్టంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, కార్య నిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఆసిస్టంట్ సిటీ ప్లానర్ ప్రసాద బాబు, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరి సూపర్వైజర్ జనార్ధన్,   శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.   

Nakkavanipalem

2021-05-31 13:28:11

రభీ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తాం..

రబీ ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, దళారులు, ఏజెంట్ల మాయ మాటలు నమ్మి రైతులెవరూ ఆందోళన, నిరాశలతో తక్కువ ధరకు తమ ధాన్యం అమ్మి నష్ట పోవద్దని  జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి కోరారు.  సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జిల్లాలో రైతుల రబీ ధాన్యానికి మద్దతు ధర కల్పించేదుకు, దళారుల బారి నుండి కాపాడేందుకు చేపట్టిన చర్యలను వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల రబీ ధాన్యానికి ఏ గ్రేడు రకానికి క్వింటాలుకు 1888 రూపాయలు ( 75 కేజీల బస్తాకు 1416 రూపాయలు), కామన్ రకానికి క్వింటాలుకు 1868 రూపాయలు (75 కేజీల బస్తాకు 1401 రూపాయలు) చొప్పున మద్దతు ధరను ప్రకటించిందని, జిల్లాలో రైతులందరూ తమ ధాన్యానికి ఈ కనీస మద్దతు ధరలు పొందేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు.   రైతులెవరు దోపిడి చేసేందుకు ద‌ళారులు, క‌మిష‌న్ ఏజెంట్లు ప్రచారం చేసే వదంతుల‌ను నమ్మవద్దని , ముఖ్యంగా బోండాలు (ఎంటీయూ 3626) ర‌కం పండించిన రైతులు ఆందోళ‌న‌తో ఎంఎస్‌పీ కంటే త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని, ఏవైనా సందేహాలుంటే వెంట‌నే రైతు భ‌రోసా కేంద్రాల‌ను, హెల్ప్ లైన్ ను సంప్ర‌దించాల‌ని సూచించారు.  ప్ర‌స్తుతం జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 865 రైతు భరోసా కేంద్రాలు ప‌నిచేస్తున్నాయ‌ని.. వీటిని 400 రైస్ మిల్లుల‌తో అనుసంధానించిన‌ట్లు తెలిపారు. సొంత వినియోగం పోనూ  సుమారు 11 లక్షల ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా కాగా,  ఇప్పటి వరకూ రైతుల నుండి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో దాదాపు 2.25 లక్షలు టన్నులు బొండాల రకం ధాన్యమే ఉందన్నారు.  రైతుల నుండి 852 కోట్ల 91 లక్షల విలువైన ధాన్యాన్ని పిపిసిల ద్వారా కొనుగోలు చేసి, ఇప్పటికే 255 కోట్ల 35 లక్షల మొత్తాన్ని వారి ఖాతాలకు జమచేశారన్నారు.  ఎక్కువ ధాన్యం గత వారంలోనే కొనుగోలు చేసారని, రానున్న  వారం, 10 రోజుల్లో మొత్తం సొమ్ము చెల్లింపు పూర్తి కానుందన్నారు.
         రైతుల పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, రైతులెవరూ దళారులు, కమీషన్ ఏజెంట్ల మోసపూరిత మాటలు, వదంతులను నమ్మి నష్టపోవద్దని జిల్లా కలెక్టర్ కోరారు.  రైతులను ఎవ్వరైనా తప్పుద్రోవ పట్టించేందుకు ప్రయత్నించినా, తక్కవ ధరకు అమ్మాలని నిర్బంధించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. అటువంటి వారి నుండి ఏ విధమైన సమస్య ఎదురైనా రైతలు వెంటనే రైతు భరోసా కేంద్రాలకు గానీ, జిల్లా స్థాయిలో 8886613611 హెల్ప్ లైన్ నెంబరుతో ప్రతి రోజూ ఉదయం 6 నుండి రాత్రి 6 గంటల వరకూ పనిచేసేలా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు.  ఇప్పటి వరకూ 450 మంది రైతులు ఈ  హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవడం జరిగిందన్నారు. 
సమావేశంలో జాయింట్ కలెక్టర్  డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం విక్రయానికి 97,824 మంది రైతులు ఆన్ లైన్  నమోదు చేయించుకున్నారని,  రైతులు తమ ధాన్యాన్ని నిర్థేశి ప్రమాణంలోపు తేమను నియంత్రించేలా బాగా ఆరబెట్టుకుని, తప్ప, తాళు లేకుండా సగటు నాణ్యత ఉండేలా శుబ్ర పరచు కొవాలని కోరారు.  అమలాపురం ఏరియాలో ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయని, రుతుపవన రాకతో వర్షాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ధాన్యం తడవ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

Kakinada

2021-05-31 13:20:56

ఆక్సిజన్ మిషన్లు అందించిన ఎస్బీఐ

విశాఖజిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఇచ్చిన పిలుపుతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు కరోనా సమయంలో తమ సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఎస్బీఐ ఫౌండేషన్ ఇనాక్సిల్ టెక్నాలజీస్ కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడానికి సుమారు 20 లక్షల విలువైన 5 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను చెస్ట్ ఆసుపత్రికి అందజేసింది. వాటిని ఆంధ్రామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.పివిసుధాకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కెవివి విజయకుమార్, లింక్ కన్సల్టెన్సీ డైరెక్టర్స్ లక్ష్మీ కామేశ్వరిల పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-05-31 11:36:35

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్యవిద్య కు అత్యధిక ప్రాధన్యం..

విద్యా, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి & ఎక్సైజ్ వాణి జ్య పన్నుల శాఖ మంత్రి  కె.నారా యణ స్వామి పేర్కొ న్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం లో రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేశారు.  ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా మదన పల్లి ఆరోగ్య వరం వద్ద రూ.475 కోట్ల వ్యయం తో 95.44 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతు లతో నిర్మించ బోతున్నమదనపల్లి, ప్రభుత్వ మెడికల్ కాలేజి శిలాఫలకంను రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి & ఎక్సైజ్ వాణిజ్య పన్ను ల శాఖ మాత్యులు కె.నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ  మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూ రు,తిరుపతి పార్లమెంట్ స భ్యులు ఎన్. రెడ్డప్ప, గురుమూర్తి,పీలేరు,మదనపల్లి,తoబల్లపల్లి,పలమనేరు,చిత్తూరు శాసన సభ్యులు చిం తల రామ చంద్రారెడ్డి, నవాజ్ భాష,పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి, వెంకటే గౌడ్,ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ లు ప్రారంభించారు.  

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధా న్యత ఇస్తూ  అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోందని నవ రత్నాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథ కాల లబ్ధి చేకూరు తుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం నిమి త్తం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగం నకు అధిక ప్రాధా న్యత నిస్తూ నాడు- నేడు కింద ప్రభుత్వాసు పత్రిలో మౌలిక సదుపా యాలను కల్పించడం జరుగుతున్నదని తెలి పారు... అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రైతు భరోసా, ఇన్సూరెన్స్ జలయజ్ఞం, వైఎస్ఆర్ జలకళ ఇలా పథకాల తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ లకు రాజకీయ సమానత్వం ఇచ్చిన ఘనత ముఖ్య మంత్రి కే దక్కుతుందని తెలిపారు... ఈ ప్రాంతం లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం  సంతోషం అన్నారు..

 రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం  రెండేళ్లు పాలనలో  లబ్ధిదారుల ఖాతాలకు సంక్షేమ పథకాల లబ్ధి ని జమ చేయడం జరిగిం దని, అభివృద్ధి సంక్షేమ మే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.. అన్ని ప్రభు త్వ పాఠశాలలను, ప్రభుత్వ ఆసుపత్రుల ను నాడు -నేడు కింద ఆధునీకరణ చేయడం జరుగుతున్నదని తెలి పారు. సన్న,చిన్న కారు రైతుల కు వై ఎస్ ఆర్ జలకళ  ద్వారా బోర్లు వేయడం జరుగు చున్నదని,సాగు,త్రాగునీటి కి ఇబ్బంది లేకుం డా చర్యలు చేపడు తున్నామని మూడు రిజర్వాయర్ ల ను ఒక సంవత్సరం లోపు పూర్తి చేసేందుకు కృత నిశ్చ యంతో ఉన్నామని తెలిపారు. మదనపల్లి, మెడికల్ కళాశాలను 95.44 ఎకరాలలో రూ. 475 కోట్లతో నిర్మించ డం ఈ ప్రాంతంలో వైద్య సేవలను పేద వారికి అందించేలా ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ఒక వరమ ని,రాబోయే తరా ల కు ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో  వైద్య సేవలు అందించేoదుకు ఉప యోగపడుతుందన్నారు.భారతదేశం లోనే ఒకే సారి 16 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయడం, 15 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కు తుందన్నారు.. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకం, సచివాలయం వ్యవస్థ ద్వారా పౌర సేవలు ప్రజలు ఇంటి ముంగిటకే తీసుకురావడం జరిగిం దని తెలిపారు..

 చిత్తూరు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రా ల ముఖ్యమంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శప్రాయుడని, కుల, మత,పార్టీ లకు అతీతంగా సంక్షేమ పథ కాలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమా నికి కృషి చేస్తున్నారని తెలిపారు... కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి రావాల్సిన మెడికల్ కళాశాలకు నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం చాలా అదృష్టం అని, నిరంతరం ప్రజల సంక్షేమానికి ముఖ్య మంత్రి కృషి చేస్తున్నా రని తెలిపారు...

 తిరుపతి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శవంతం  గా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన  సాగుతోందని, దేశ చరిత్రలో ఒకేసారి 16 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసి ఘన త ముఖ్యమంత్రి కే దక్కు తుందన్నారు..  అత్యాధునిక పరికరాల తో వైద్య సేవలు అందిం చడం,104,108 వాహ నాలు అన్ని ప్రాంతాలకు వెళ్లి వారికి వైద్య సేవలు  వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ లు ఇలా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు..

 మదనపల్లి శాసన సభ్యులు మాట్లాడుతూ మదనపల్లిలో మెడికల్ కళాశాల మంజూరు చేయడం ఈ ప్రాంత వాసులు అదృష్టమని సుదీర్ఘ పాదయాత్రలో ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ను మంజూరు చేస్తానని హామీ ఇచ్చా రని ఆ హామీనినిలబెట్టు  కుంటూ మెడికల్ కళా శాల ను మంజూరు చేశారని...ఈ ప్రాంతం రానున్న కాలంలో మరింత అభివృద్ధి చెందేందుకు  కృషి చేస్తామని తెలిపారు..

 పీలేరు శాసనసభ్యులు  మాట్లాడుతూ నేడు ఒక చారిత్రాత్మక ఘట్టమని దాదాపు వంద సంవత్స రాల నుండి టీవీ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్య వరం ప్రసిద్ధిగాంచిందని, మద నపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజి ద్వారా ఈ ప్రాం తంలో ఉపాధి అవ కాశాలు పెరుగు తాయని తెలిపారు

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్ పర్సన్ రెడ్డమ్మ, జిల్లా జాయిం ట్ కలెక్టర్ (అభివృద్ధి) వి.వీర బ్రహ్మo, మదన పల్లి సబ్ కలెక్టర్ జాహ్న వి, ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎం. విశ్వ నాదం,ఏ పి ఎం ఐ డి సి ఈఈ ధనుంజయ రెడ్డి, మదనపల్లి మునిసి పల్ చైర్మన్ మనుజా, తహశీల్దార్ కుప్ప స్వామి, ఎంపీ డీఓ లీలా మాధవి, పోత బోలు సర్పంచ్ ఈశ్వ రయ్య,ఇతర ప్రజా ప్రతినిధులు, అధి కారులు పాల్గొన్నారు

Madanapalle

2021-05-31 10:54:27

3న ఇళ్ల నిర్మాణానికి గొట్లాంలో శ్రీ‌కారం..

పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో జిల్లాలోని ఇళ్లులేని  నిరుపేద కుటుంబాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 3వ తేదీన శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్ల‌డించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర్చ్యువ‌ల్ విధానంలో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభిస్తార‌ని తెలిపారు. గ‌జ‌ప‌తినగ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాంలో జ‌గ‌న‌న్న హౌసింగ్ కాల‌నీల ఏర్పాటులో భాగంగా రూపొందించిన  ఇళ్ల స్థ‌లాల లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి ఆన్ లైన్‌లో ప్రారంభిస్తార‌ని పేర్కొన్నారు. ఈ లే అవుట్‌లో 185 ఇళ్ల నిర్మాణం ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. జ‌గ‌న‌న్న  కాల‌నీ ఏర్పాటులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 928 లే అవుట్ల‌ను అభివృద్ధి చేయ‌డం జ‌రిగింద‌న్నారు.  రాష్ట్ర  గృహ‌నిర్మాణ సంస్థ, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా, విద్యుత్ పంపిణీ సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే ఈ కాల‌నీల్లో ఇళ్ల నిర్మాణానికి వీలు క‌ల్పించేలా నీటివ‌స‌తి క‌ల్పించేందుకు బోర్ల త‌వ్వ‌కం, అంత‌ర్గ‌త రోడ్ల నిర్మాణం, విద్యుత్ స‌ర‌ఫ‌రా లైన్ల ఏర్పాటు వంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం వంటి మౌళిక స‌దుపాయాల ప‌నులు ముమ్మ‌రంగా చేప‌ట్ట‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు.

జిల్లాలో త‌మ సొంత స్థ‌లాల్లో ప్ర‌భుత్వ అందించే రూ.1.80 ల‌క్ష‌ల‌ ఆర్ధిక స‌హాయంతో ఇళ్లు నిర్మించుకొనేందుకు ముందుకు వ‌చ్చిన వారితో, అదేవిధంగా ప్ర‌భుత్వం జిల్లాలో అభివృద్ధి చేసిన 928 జ‌గ‌న‌న్న హౌసింగ్ కాల‌నీల లేఅవుట్ల‌లో ప్ర‌భుత్వం అందించే స‌హాయం వినియోగించుకొని త‌మంత‌ట తాముగా ఇళ్లు నిర్మించుకొనే వారితో ముందుగా ఇళ్ల‌నిర్మాణాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు గృహ‌నిర్మాణ‌సంస్థ జిల్లా ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి తెలిపారు. జిల్లాలో తొలివిడ‌త‌గా 98,286 ఇళ్ల‌ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ చెప్పారు.

Vizianagaram

2021-05-31 10:45:00

సమాచారశాఖ డిడిగా బి.పూర్ణచంద్రరావు..

తూర్పు గోదావరి జిల్లా, సమాచార పౌర సంబంధ శాఖ నూతన ఉప సంచాలకులుగా బి.పూర్ణచంద్రరావు సోమవారం ఉద్యోగ భాద్యతలు స్వీకరించారు.  అసిస్టెంట్ డైరక్టరుగా విజయవాడ సమాచార శాఖ కమీషనరేట్ లో ప్రత్యేక విధులు నిర్వహిస్తూ ఆయన డిప్యూటీ డైరక్టరుగా పదోన్నతిపై తూర్పు గోదావరి జిల్లాలో నియమితు లైయ్యారు.  గతంలో ఆయన శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ డైరక్టర్ గానూ,  ప్రకాశం, గుంటూరు జిల్లాల డిపిఆర్ఓగాను పనిచేశారు.   డిప్యూటీ డైరక్టర్, తూగో జిల్లా పదవి బాధ్యతలను ఆయన సోమవారం ఉదయం ప్రస్తుతం ఈ పదవి  ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న జోన్-2 జాయింట్ డైరక్టర్ ఎల్.స్వర్ణలత నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా డిడి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని జిల్లా ప్రజలకు, ప్రజల అభిప్రాయాలను, ఆకాంక్షలను ప్రభుత్వానికి సమాచార శాఖ ద్వారా తెలియజేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే మీడియా సంస్థలు, ప్రతినిధులకు ప్రభుత్వ పరమైన సంక్షేమాలు సమగ్రంగా అందేలా కృషి చేస్తాని తెలియజేశారు. ఆయనకు కార్యాలయ డివిజనల్ పిఆర్ఓలు పి.రవి (కాకినాడ), యండి.విలాయత్ ఆలీ (అమలాపురం), వి.వి.రామిరెడ్డి (రాజమహేంద్రవరం), ఐ.సాయిబాబు (పెద్దాపురం), ఏపిఆర్ఓ కె.రవి, ఎవిఎస్ డి.ధర్మరాజు, పబ్లిసిటీ అసిస్టెంట్ సిహెచ్.రాంబాబు,  సీనియర్ అసిస్టెంట్ వి. శేఖర్, టైపిస్టులు బషీర్ అహ్మద్, జి.స్వరాజ్యకుమారి, సిబ్బంది ఎన్.చిట్టిరాజు, కె.గోపీకృష్ణ, యం.మాధవకృష్ణ, లక్ష్మీకాంతం, ఎస్.రాజేష్, యం.సతీష్, సూర్యనారాయణ, సూరిబాబు తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

Kakinada

2021-05-31 10:30:34

పుట్టినరోజు ఖర్చుతో పేదల ఆకలి తీర్చారు..

కరోనా సమయంలో తన బిడ్డ పుట్టిన రోజు వేడుక కోసం చేయాలనుకున్న ఖర్చుతో ఆపన్నుల ఆకలి తీర్చాలినుకున్నాడా  చిన్న ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ 4వ తరగతి కాంట్రాక్టర్ కాకి రవిబాబు. రాజమండ్రి  క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఈయన తన కూతరు ప్రియాంక పుట్టిన రోజు సందర్భంగా వారే స్వయంగా వంట చేసుకొని భార్య ప్రేమజ్యోతి, కొడుకు గుణసాయితేజ, కూతుర్లు, కుటుంబ సభ్యులతో స్వయంగా వాటిని తీసుకెళ్లి  పేదలకు ఒక పూట కడుపు నింపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రాజమండ్రిలోని సేవా తపన సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆన్నదానం కార్యక్రమం చేపట్టి ఆహారాన్ని పొట్లాలుగా చేసి పండ్లు, మంచినీటి ప్యాకెట్లతో సహా పంపిణీ చేశారు. వీరింట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి ప్రతీకగా పేదల కడుపు నింపే అన్నదానం చేస్తారీ కుటుంబ సభ్యులు. కరోనా సమయంలో మనసున్న దాతలు ఈ విధంగా ఆలోచిస్తే ఎందరో అభాగ్యులకు ఒక్కపూట ఆకలితీరుతుంది.. ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న..!

Rajahmundry

2021-05-31 09:32:31