1 ENS Live Breaking News

2021-05-29 11:16:50

2021-05-29 11:16:15

జీజీహెచ్ లో మెరుగైన వైద్యసేవలు..

కాకినాడ జీజీహెచ్‌లో నిష్ణాతులైన వైద్యుల‌తో పాటు యువ నోడ‌ల్ అధికారులు, వైద్య‌, ఆరోగ్య సిబ్బందితో కోవిడ్ బాధితుల‌కు మెరుగైన సేవ‌లందిస్తున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. శ‌నివారం ఉద‌యం జాయింట్ క‌లెక్ట‌ర్ కాకినాడ జీజీహెచ్‌ను సంద‌ర్శించారు. ట్ర‌యాజింగ్ సెంటర్‌ను ప‌రిశీలించి, అక్క‌డి బాధితుల‌తో మాట్లాడారు. ఆసుప‌త్రిలో కోవిడ్ రోగుల‌కు అందిస్తున్న వైద్య‌, ఇత‌ర సేవ‌ల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ స‌హాయంతో ఇటీవ‌ల ఏర్పాటుచేసిన 10 కేఎల్ సామ‌ర్థ్య‌మున్న ఆక్సిజ‌న్ ట్యాంకు ప‌నితీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉండ‌టంతో రోగుల‌కు స‌జావుగా వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో వివిధ సంస్థ‌లు, వ్య‌క్తులు సామాజిక బాధ్య‌త‌గా జిల్లాకు దాదాపు 300 వ‌ర‌కు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించార‌ని, వీటిని కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ), గిరిజ‌న ప్రాంతాల్లోని స్థిరీక‌ర‌ణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌
డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద పేద‌ల‌కు ఉచితంగా కోవిడ్ వైద్య సేవ‌లందించ‌డంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ప్రైవేటు కోవిడ్ ఆసుప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ హెచ్చ‌రించారు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలో కోవిడ్ ఆసుప‌త్రుల్లోని వైద్య సేవ‌ల‌పై నిరంత‌ర స‌మీక్ష జ‌రుగుతోంద‌ని, ఆరోగ్య‌శ్రీ యేత‌ర కోవిడ్ చికిత్స‌కు ప్ర‌భుత్వం నిర్దేశించిన మేర‌కు మాత్ర‌మే ఫీజులు వ‌సూలు చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఎక్క‌డైనా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు తేలితే క్రిమిన‌ల్ కేసులు న‌మోదు, డీనోటిఫై చ‌ర్య‌ల‌తో పాటు లైసెన్సు కూడా ర‌ద్దుచేసేందుకు వెనుకాడబోమ‌ని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌పై ఎవ‌రైనా ఫిర్యాదు చేయొచ్చ‌ని, ఈ ఫిర్యాదుల‌ను జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీడీసీ) ప‌రిశీలించి, చ‌ర్య‌లకు సిఫార్సు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన డీసీసీబీ:
జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ రోగుల‌కు ఆపన్న‌హ‌స్తం అందించేందుకు అయిదు లీట‌ర్ల సామ‌ర్థ్య‌మున్న ప‌ది ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జీజీహెచ్‌కు అందించింది. ఈ మేర‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), డీసీసీబీ ప‌ర్స‌న్ ఇన్‌ఛార్జ్ డా. జి.ల‌క్ష్మీశ చేతుల‌మీదుగా డీసీసీబీ అధికారులు జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌కు కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. దాదాపు రూ.ఏడు ల‌క్ష‌ల విలువైన కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన డీసీసీబీకి జేసీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. మ‌రింత మంది సామాజిక బాధ్య‌త‌గా ముందుకొచ్చి కోవిడ్ చికిత్స‌లో కీల‌క‌మైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌తోపాటు ఇత‌ర వైద్య ఉప‌క‌ర‌ణాల‌ను అందించాల్సిందిగా జాయింట్ క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో జీజీహెచ్ కోవిడ్ నోడ‌ల్ అధికారి  సూర్యప్ర‌వీణ్‌చాంద్‌, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఆర్‌.మ‌హాల‌క్ష్మి, డీసీసీబీ సీఈవో పి.ప్రవీణ్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-29 11:12:31

31న ఆన్ లైన్ లో ఆసుపత్రుల శంఖుస్థాన..

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య క‌ళాశాల‌కు ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మే 31న ఉద‌యం 11 గంట‌ల‌కు తన క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చ్యువ‌ల్‌గా శంకుస్థాప‌న చేయ‌నున్నార‌ని జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్లడించారు. ఈ శంకుస్థాప‌న కార్యక్ర‌మాన్ని గాజుల‌రేగ వ‌ద్ద వైద్య క‌ళాశాల ఏర్పాటుకోసం కేటాయించిన 70 ఎక‌రాల స్థలంలో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నట్టు చెప్పారు. రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాట‌వుతోంద‌ని, క‌ళాశాల భ‌వ‌నాల నిర్మాణం ప‌నులు నిర్వహించేందుకు నిర్మాణసంస్థను కూడా ఖ‌రారు చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. వైద్య క‌ళాశాల శంకుస్థాప‌న ప‌నుల‌పై జాయింట్ క‌లెక్టర్ డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, వై.ఎస్‌.ఆర్‌.సి.పి. జిల్లా స‌మ‌న్వయ‌క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావుల‌తో క‌ల‌సి శ‌నివారం వైద్య క‌ళాశాల శంకుస్థాప‌న స్థలాన్ని ప‌రిశీలించి ఏర్పాట్లపై అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. 150 మంది ప్రాంగ‌ణంలో కూర్చొని వీక్షించేలా మూడు ఎల్‌.ఇ.డి. స్క్రీన్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. కార్యక్రమం జ‌రిగే స‌మ‌యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని విద్యుత్‌పంపిణీ సంస్థ అధికారుల‌ను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహ‌ణ‌కు వీలుగా ఫైబ‌ర్‌నెట్ ద్వారా ఇంట‌ర్నెట్ క‌నెక్షన్ ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. శంకుస్థాపన శిలాఫ‌ల‌కం, వేదిక‌ బ్యాక్ డ్రాప్ వంటి ఏర్పాట్లను ఏపి వైద్య మౌళిక స‌దుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేప‌ట్టాల‌ని ఇ.ఇ. స‌త్యప్రభాక‌ర్‌ను ఆదేశించారు. క‌ళాశాల భ‌వ‌నాల ఆకృతుల‌ను జిల్లా క‌లెక్టర్, వై.ఎస్‌.ఆర్‌.సి.పి. నాయ‌కుల‌కు ఇ.ఇ. స‌త్య ప్రభాక‌ర్ చిత్రప‌టాల ద్వారా చూపించారు. 

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య ప‌ర‌మైన సౌక‌ర్యాలు త‌క్కువ‌గా వున్నందున‌ ఏ చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా విశాఖ‌లోని కె.జి.హెచ్‌.కు వైద్యం కోసం వెళ్లే ప‌రిస్థితి వుండేద‌ని, జిల్లాలోనే ప్రభుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాటు ద్వారా జిల్లాలో పూర్తిస్థాయిలో సూప‌ర్ స్పెషాలిటీ వైద్యసేవ‌లు కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి వ‌చ్చే ప‌రిస్థితి ఏర్పడింద‌న్నారు. జిల్లాకు చెందిన మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ‌వాణి, జిల్లా ఇన్ చార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుల చొర‌వ‌తో జిల్లాకు ముఖ్యమంత్రి వైద్య క‌ళాశాల మంజూరు చేశార‌ని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న‌ ఈ క‌ళాశాల ఏర్పాటు ప‌ట్ల జిల్లా ప్రజ‌లంతా ఎంతో సంతోషంగా వున్నార‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చిన  జిల్లాలోనే త‌గిన వైద్యం ల‌భించే ప‌రిస్థితి ఏర్పడుతోంద‌న్నారు. స‌కాలంలో వైద్య క‌ళాశాల భ‌వ‌నాలు పూర్తయి త్వర‌గా జిల్లా ప్రజ‌ల‌కు అత్యాధునిక వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

వై.ఎస్‌.ఆర్‌.సి.పి జిల్లా స‌మ‌న్వయ‌క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ జిల్లా ప్రజ‌ల చిర‌కాలం వాంఛ అయిన ప్రభుత్వ వైద్య క‌ళాశాల ముఖ్యమంత్రి శ్రీ జ‌గ‌న్ గారి నేతృత్వంలో నెర‌వేర‌డం ప‌ట్ల ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా జిల్లా ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెర‌వేరుస్తున్నార‌ని పేర్కొన్నారు. గ‌తంలోనూ ప‌లువురు ముఖ్య‌మంత్రులు వైద్య క‌ళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చినా అవి నెర‌వేరలేద‌ని, ఈ క‌ళాశాల ఏర్పాటు ముఖ్యమంత్రి శ్రీ జ‌గ‌న్ గారికే సాధ్యమయ్యింద‌న్నారు. వైద్యరంగంలో ఈ ప్రాంతం వెనుక‌బడి వుంద‌న్న భావ‌న‌తోనే జిల్లాకు ప్రభుత్వం ఈ ఉన్నత వైద్య విద్యా సంస్థను మంజూరు చేసింద‌ని, రానున్న రోజుల్లో జిల్లాలోని గిరిజ‌న ప్రాంత ప్రజ‌లు స‌హా అన్ని వ‌ర్గాల వారికీ పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవ‌లు అందించేందుకు ఈ వైద్య క‌ళాశాల దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే దీని ప్రారంభోత్సవం కూడా జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

ఈ ప‌ర్యట‌న‌లో జాయింట్ క‌లెక్టర్‌(అభివృద్ధి) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌.డి.ఓ. బిహెచ్‌.భ‌వానీశంక‌ర్‌, జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వయ అధికారి డా.జి.నాగ‌భూష‌ణ రావు, త‌హ‌శీల్దార్ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-29 11:09:31

మత్స్యకారులంతా కోవిడ్ వేక్సిన్ వేసుకోవాలి..

విజయనగరం జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన మత్స్యకారులంతా ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ వేక్సిన్ వేసుకొని సురక్షితంగా ఉండాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి కోరారు. శనివారం ఈ మేరకు ఆమె మీడియాకి ప్రకటన విడుదలచేశారు. మత్స్యకార గ్రామాల్లో అందరూ ఒకే చోట గుమిగూడి సమావేశాలు పెట్టుకోవద్దని, ఖచ్చితంగా మనిషికి మనిషికీ మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు తరువాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. వేక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే తక్షణమే దగ్గర్లోని పీహెచ్సీకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం 104 కాల్ సెంటరు ను సంప్రదించాలన్నారు.

Vizianagaram

2021-05-29 03:28:55

గోకుల్ పార్కును అభివ్రుద్ధి చేయండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ నాలుగవ జోన్ పరిధిలోని 29వార్డులో గల గోకుల్ పార్కును అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారితో కలసి బీచ్ రోడ్లో ఉన్న గోకుల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోకుల్ పార్కును అభివృద్ధి పరచి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తయారు చేయాలని ఆదేశించారు. యాదవలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఒక సామాజిక భవనం నిర్మాణానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెల్తామని హామీఇచ్చారు. అనంతరం బీచ్ రోడ్డులో ఉన్న రాదాకృష్ణ మందిరానికి సందర్శించారు. ఈ పర్యటనలో నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఒమ్మి సన్యాసిరావు, మొల్లి అప్పారావు, 29వ వార్డు కార్పొరేటర్ ఉరికిటి నారాయణ రావు, 11 వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాస్, యాదవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-05-28 15:59:17

హిందూస్తాన్ లీవర్ 50 ఆక్సిజన్ మిషన్లు వితరణ..

 కోవిడ్ వైర‌స్ క‌ట్ట‌డికి, రోగుల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించేందుకు అధికార యంత్రాంగం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగ‌స్వామ్యం అవుతూ హిందుస్థాన్ యూనీలీవ‌ర్‌-హార్లిక్స్ ఫ్యాక్ట‌రీ (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) 50 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌ను క‌లిసి ఫ్యాక్ట‌రీ సైట్ హెడ్ శ్రీధ‌ర్‌, హెచ్ఆర్ హెడ్ స‌తీష్‌కుమార్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారి త‌దిత‌రులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో జేసీ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్‌) కింద కోవిడ్ రోగుల‌కు ప్రాణ‌వాయువును అందించే దాదాపు రూ.25 ల‌క్ష‌ల విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన హార్లిక్స్ ఫ్యాక్ట‌రీకి అభినంద‌న‌లు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. వైర‌స్ ఉద్ధృతి అధికంగా ఉన్న రోగులకు ప్రాణ‌వాయువు అందించేందుకు ఈ కాన్సంట్రేట‌ర్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని.. వీటిని కోవిడ్ కేర్ కేంద్రాల‌తో పాటు గిరిజ‌న ప్రాంతాల్లోని స్థిరీక‌ర‌ణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. హిందుస్థాన్ యూనీలీవ‌ర్‌-హార్లిక్స్ ఫ్యాక్ట‌రీకి జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నామ‌న్నారు. ఈ సంస్థ‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్ అనుప‌మ అంజ‌లి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-05-28 15:54:56

డార్విన్ మరో 5 ఆక్సిజన్ మిషన్లు వితరణ..

డార్విన్ ఫార్మా (విజ‌య‌వాడ‌) సంస్థ.. జిల్లాకు మ‌రో అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు సంస్థ ప్ర‌తినిధి ఎస్‌సీవీ ర‌త్నారెడ్డి శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జి.రాజ‌కుమారిని క‌లిసి కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. కోవిడ్ బాధితులకు అవ‌స‌ర‌మైన ప్రాణ వాయువును అందించే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు స‌మ‌కూర్చిన డార్విన్ ఫార్మాకు జాయింట్ క‌లెక్ట‌ర్ (డ‌బ్ల్యూ) అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో డార్విన్ ఫార్మాకు చెందిన డా. వి.ర‌వికుమార్‌, డా. ఎన్‌.ముర‌ళిలు యూఎస్ ఇండియా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఫౌండేష‌న్‌, వెస్ట్ టెక్సాస్ ఇండియ‌న్ డాక్ట‌ర్స్ గ్రూప్ స‌హ‌కారంతో ఒక్కోటి రూ.లక్షా ప‌దివేలు విలువైన అయిదు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌తో పాటు రెండు వెంటిటేర్ల‌ను ఇటీవ‌ల జిల్లాకు అందించారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-28 15:53:28

ఆ ఆసుపత్రికి రూ.22.55లక్షలు జరిమానా..

డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా కోవిడ్ చికిత్సకు సంబంధించి నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి, రూ.4,50,000 వ‌సూలు చేసినందుకు కాకినాడ‌లోని ఇనోద‌య ఆసుప‌త్రికి అయిదు రెట్లు మొత్తాన్ని రూ.22,50,000 పెనాల్టీగా విధించిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆరోగ్య‌శ్రీ కింద కోవిడ్ చికిత్స అందించేందుకు ఆసుప‌త్రిలో చేర్చుకున్న‌ప్ప‌టికీ త‌మ నుంచి రూ.4,50,000 మొత్తాన్ని వ‌సూలు చేశారంటూ రోగి ఎం.స‌త్తిరాజు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదును జేసీ (డీ) కీర్తి చేకూరి నేతృత్వంలోని డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ హెల్త్‌కేర్ ట్ర‌స్ట్ జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీసీసీ) ప‌రిశీలించింది. వివిధ ఆధారాల‌ను ప‌రిశీలించిన క‌మిటీ  రోగి నుంచి వ‌సూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఆయ‌న‌కు చెల్లించ‌డ‌మే కాకుండా.. రూ.22,50,000 పెనాల్టీ మొత్తాన్ని డీసీసీ, డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ పేరిట డీడీ తీసి అంద‌జేయాల‌ని లేదా నిర్దేశ ఖాతాకు బ‌దిలీ చేయాల‌ని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చిన‌ట్లు జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. అదే విధంగా కోవిడ్ చికిత్స నుంచి ఆసుప‌త్రిని డీనోటిఫై చేసి, క్రిమినల్ కేసు బుక్ చేశ మని,  సంబందిత ఆరోగ్య‌మిత్ర కె.నాగ‌మ‌ణికి షోకాజు నోటీసులు జారీచేసిన‌ట్లు కీర్తి చేకూరి తెలిపారు.

Kakinada

2021-05-28 15:51:53

బ్లాక్ ఫంగస్ పై మరింత అప్రమత్తం..

కరోనాతో కోలుకున్న తరువాత వచ్చే బ్లాక్ ఫంగస్ అనే కొత్త రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్యులకు సూచించారు.  శుక్రవారం ఉదయం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ వ్యాధిపై  వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ వ్యాధి జిల్లాలో ప్రబలుతున్నందున దాన్ని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధిబారిన పడిన వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, బెడ్లు, ప్రత్యేక వార్డులు వంటి కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  బ్లాక్ ఫంగస్ వివిధ ప్రాంతాల్లో విస్తృతం అవుతుందని, జిల్లాలో  బ్లాక్ ఫంగస్ విస్తృతి కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా బాధితులకు వైద్యులు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరమైన కల్చర్ టెస్ట్ నిర్వహించి దానిని పరిశీలన ఆధారంగా చికిత్స చేపట్టే అవకాశాన్ని కూడా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మ్యుకోర్ ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని, కావున కోవిడ్ బాధితుల రోగ నిరోధక శక్తి పెరుగుటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. మ్యుకోర్మికోసిస్ వల్ల కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నందున, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల ఆధారంగా తగు సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్,సుపరింటెండెంట్ కృష్ణమూర్తి,ఆర్.ఎం.ఓ అరవింద్, రిమ్స్ నోడల్ ఆఫీసర్ చలమయ్య, ప్రొఫెసర్ పరశురాం, ప్రొఫెసర్ జ్యోతిర్మయి,ప్రొఫెసర్ ఉషారాణి,ప్రొఫెసర్ ప్రభాకర్,ప్రొఫెసర్ పాపరత్నం,డాక్టర్ కళ్యాణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-28 15:46:56

ప్రశాంతి వృద్ధాశ్రమంలో కోవేక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ బంగ్లా దరి గల ప్రశాంతి వృద్ధాశ్రమంలో కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. అర్బన్ మెడికల్ ఆఫీసర్  డా. కె.కృష్ణమోహన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, వృద్ధాశ్రమంలోని 40 మంది వృద్ధులకు కోవిషీల్డ్ వేక్సినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లావ్యాప్తంగా భారీస్థాయిలో వేక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కాకుండా కోవిడ్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తొలిదశలో  60 ఏళ్లు పైబడినవారికి, ప్రంట్ లైన్ వారియర్స్ కు వేక్సినేషన్ చేసారు. మలిదశలో 45 ఏళ్లకు పైబడి రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధిగ్రస్తులకు కూడా అవకాశం కల్పించిన సంగతి అందరికి విదితమే. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి    తొలి ప్రాధాన్యతను ఇస్తూ, 45 నుండి 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వేక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం జె.ఆదిలక్ష్మీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ సిహెచ్.ఐశ్వర్య, ఆశా వర్కర్ బి.జ్యోతి, వాలంటీర్ జి.ద్రాక్షాయణి తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-05-28 15:45:06

గృహ నిర్మాణాలు ప్రారంభం కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరైన గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం కావాలని అన్నారు. మోడల్ హౌసింగ్ కాలనీ లేఅవుట్ లో వారం రోజులలో అన్ని గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. జిల్లాలో 742 లేఅవుట్లు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ పూర్తయిన మేరకు నిర్మాణ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న లబ్ధిదారులకు మంజూరైన గృహాలను కూడా తక్షణం ప్రారంభించాలని వారికి సిమెంటు, ఇనుము అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో వివిధ పథకాల కింద మొత్తం లక్షా పది వేల గృహాలు మంజూరు అయ్యాయని ఆయన వివరించారు. లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి నిర్మాణ ప్రక్రియను గూర్చి అవగాహన కలిగించాలని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలో కనీసం 20 గృహాల నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత సీజన్లో గృహ నిర్మాణ పనులు చేసుకునే అవకాశం ఉందని, లబ్ధిదారులు సిద్ధంగా ఉంటారని ఆయన పేర్కొంటూ గృహ నిర్మాణ పనులు చేసుకునే లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం క్రింద వేతనంగా దాదాపు 18 వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. పొజిషన్ సర్టిఫికెట్ అందని వారికి త్వరితగతిన అందించుటకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో కనీసం 25 వేల గృహ నిర్మాణ పనులు వారం  రోజుల్లో ప్రారంభం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గృహాన్ని మ్యాపింగ్ చేయాలని, ఇప్పటి వరకు జిల్లాలో 91 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగిందని ఆయన పేర్కొంటూ మ్యాపింగ్ జరిగిన వాటిలో 80 శాతం వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి జరిగిందని మిగిలిన వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పాలకొండ, ఇచ్చాపురం ప్రాంతాల్లో పనులు ప్రారంభంలో వెనుకబడి ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. జగనన్న ఆదర్శ కాలనీలలో పనుల చేపట్టుటకు నీటి సౌకర్యం అవసరమని, అన్ని కాలనీల్లో అవసరం మేరకు బోర్లను వేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే 504 బోర్లను వేయడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతిని గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు గుర్తించాలని అందుకు అనుగుణంగా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు ప్రారంభం కావాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రతి లేఅవుట్ వద్ద విద్యుత్, నీరు ఉండాలని తదనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టవచ్చని అన్నారు. విద్యుత్తును ఈ నెలాఖరు నాటికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించిందని, అతి త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని విద్యుత్  ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. లేఅవుట్ ల వద్ద వేసిన బోర్లకు తక్షణం విద్యుత్ సౌకర్యం కల్పించి నీటిని నిల్వ చేసే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు బోర్ల కోసం రిజిస్ట్రేషన్ చేయని వాటికి తక్షణం రిజిస్ట్రేషన్ చేయించాలని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే విద్యుత్తును అందించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి. శ్రీనివాస రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.వేణుగోపాల్, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. మశిలామణి, డిఇ జిటి ప్రసాద్, ఏడిఇ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-28 15:38:26

అంగన్వాడీలో నాడు నేడు పనులు..

 అంగన్వాడీ భవనాలను నాడు నేడు క్రింద ఆధునికీకరణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో మరమ్మతులు చేపట్టి ఆధునీకరణ చేయుటకు నిర్ణయించిందన్నారు. ఒక భవనాన్ని 9 అంశాల్లో మరమ్మతులు చేయుటకు అవకాశం కల్పిస్తూ రూ.6.90 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. జిల్లాలో 190 అంగన్వాడీ భవనాలు మొదటి దశలో చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ భవనాలలో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, పైకప్పు మరమ్మతులు, ఫ్లోరింగ్, మంచి విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, గ్రీన్ చాక్ బోర్డు, వాష్ బేసిన్, కిచెన్, విద్యుత్ కనెక్షన్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు. వీటని చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి అంశంలో నాణ్యత పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మరమ్మతులకు సంబంధించిన అంచనాలు వేయాలని, వాటిని ఫోటోలతో సహా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నాడు నేడు క్రింద పాఠశాలల్లో అత్యంత ఆహ్లాదకరంగా తయారు చేయడం జరిగిందని అవసరమైతే వాటిని సందర్శించి చక్కని వాతావరణంలో అంగన్వాడీ కేంద్రాలు ఉండే విధంగా మరమ్మతులు చేపట్టి చిన్నారులను ఆకర్షించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తించాలని, అందుకు అనుగుణంగా చిన్నారులను దృష్టిలో పెట్టుకొని పైకప్పు మరమ్మతులు చేపట్టడంలో గాని, తలుపులు, కిటికీలు అమర్చడంలో గాని రాజి వుండరాదని అన్నారు. ఫ్లోరింగ్ చక్కగా ఉండే విధంగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో మంజూరు చేసిన నిధులతో ప్రహరీ గోడలు నిర్మించరాదని స్పష్టం చేశారు. ప్రహరీ గోడలను ఉపాధి హామీ పథకంలో మాత్రమే నిర్మించాలని ఆయన అన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి. శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.వేణుగోపాల్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.జయదేవి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, విద్యుత్ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.మశిలామణి, డిఈ జి.టి ప్రసాద్, ఏడిఇ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-28 15:36:23

ఆ ఎంపీడీఓ డిడీగా ఎక్కడ పనిచేశారో..?

ఆ వివాదాస్పద ఎంపీడీఓ ఎస్.సుభాషిణి మరో కొత్త వివాధానికి తెరలేపారు. తూర్పుగోదావరి జిల్లాలోని కెఆర్ పురం ఎంపీడీఓగా పనిచేస్తూ అవినీతి ఆరోపణలపై సస్పెండై 8నెలల తరువాత ఆమె విజయనగరం జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసి)గా విధుల్లోకి చేరారు. చేరిన రోజే తన సర్వీసులో ఎక్కడా డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేయకుండానే తాను డిప్యూటీ డైరెక్టర్ గా వివిధ హోదాల్లో పనిచేసినట్టుగా మీడియాకి సమాచారశాఖ ద్వారా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పుదోవ పట్టించి, నమ్మించడానికే ఈ అధికారిణి ఈ విధమైన తప్పుడు ప్రచారం చేసినట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి ఈమె రెండు నెలల క్రితం విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా చేరడానికి ప్రభుత్వ జీఓతో విశ్వప్రయత్నాలు చేసి వెనుతిరిగారు. అపుడు విశాఖ జిల్లా మంత్రి అవంతిశ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఈమెను విధుల్లోకి చేర్చుకోలేదు. అంతేకాకుండా కాకుండా తూ.గోజిల్లాలో పిడింగొయ్యి పంచాయతీ విషయంలో సుమారు రూ.73.50 లక్షల అవినీతి వివాదంలో ఆమె బాధ్యత వహించాలటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జారీచేసిన నోటీసు  లో (1363546/cpr&rd/a2/2021,dated-26-03-2021) జిల్లా పంచాయతీ అధికారి పేర్కన్న అంశాన్ని ప్రధానంగా తెలియజేశారు. కొన్ని శాఖపరమైన విచారణలు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ  ఈమె డిపీఓ(ఎఫ్ఏసి) జీఓ రద్దై,  ఓ అధికారిణి  వేసిన కోర్టు కేసు పెండింగ్ లో ఉండగానే, విజయనగరం జిల్లా పంచాయతీ అధికారిణా విధుల్లోకి చేరడం, అదేరోజు తాను ఎంపీడీఓతోపాటు, డిప్యూటీ డైరెక్టర్ గా హోదాల్లో పనిచేశానని చేయని హోదాకి మీడియాకి ప్రకటన ఇవ్వడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈమె తన సర్వీసులో కేవలం ఎంపీడీఓగా మాత్రమే పనిచేశారు తప్పా మరెక్కడా డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన దాఖలాలు గానీ, ప్రభుత్వ ఉత్తర్వులుగానీ ఎక్కడా లేవు. ఆ విషయం తూర్పుగోదావరి జిల్లా పిడింగొయ్యి పంచాయతీలో జరిగిన అవినీతి వ్యవహారంలో కమిషనర్ ఇచ్చిన లేఖలోనే ఈమెను ఎంపీడీఓగానే కమిషనర్ గిరిజాశంఖర్ కూడా పేర్కొన్నారు. అలాంటిది చేయని హోదా చేసినట్టు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో అర్ధం కాని ప్రశ్నగా మారింది.  ఈ ఎంపీడీఓ చేయని హోదాలో పనిచేసినట్టుగా ప్రకటించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం జిల్లాలో డీపీఓగా జాయినింగ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ విధంగా ప్రజాప్రతినిధుల దగ్గర చెప్పినమ్మించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా 73,53,720 రూపాయలకు ఎంపీడీఓ ఎస్.సుభాషిణిని బాధ్యురాలిని చేయాలని కూడా కమిషనర్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం, ఈమె అవినీతిపై వచ్చిన వార్తలు, విశాఖలో డీపీఓగా చేరాలని ప్రయత్ని విఫలయత్నం చేసిన అంశం, జిల్లా  మంత్రి తిరస్కరించిన అంశం, ఈ తరుణంలో ఓ పత్రికకు పరువునష్టం దావా వేసిన అంశం యొక్క ఆధారాలన్నీ విజయగనం జిల్లాలోని కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే ద్రుష్టికి వెళ్లినట్టు సమాచారం. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను తప్పుదారి పట్టించే విధంగా చేసే అధికారిణి కమిషనరేట్ లో జిల్లా పంచాయతీ అధికారిణిగా ఎలా ఉత్తర్వులు ఇచ్చారనేది, ఆపై జిల్లాలో ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది..ఈ విషయంలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాలి..!

విజయనగరం

2021-05-28 15:31:30

జిల్లా పంచాయితీ అధికారిణిగా సుభాషిణి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా పంచాయితీ అధికారి(ఎఫ్ఏసీ)గా ఎస్‌.సుభాషిణి శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆమె ఇంత‌కుముందు తూర్పుగోదావ‌రి జిల్లాలో డిప్యుటీ డైరెక్ట‌ర్ హోదాలో, ఎంపిడిఓగా విధులు నిర్వ‌హిస్తూ జిల్లాకు డిపిఓగా బ‌దిలీపై వచ్చారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను క‌లిసి, అనుమ‌తి తీసుకున్న అనంత‌రం, స్థానిక పంచాయితీ కార్యాల‌యంలో విధుల‌ను చేప‌ట్టారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా, స‌చివాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన‌ సేవ‌లను అందించేందుకు కృషి చేస్తామ‌ని, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు ప‌రుస్తామ‌ని, కోవిడ్ నిర్మూల‌నా కార్య‌క్రమాల‌ను వేగ‌వంతం చేస్తామ‌ని, ఈ సంద‌ర్భంగా సుభాషిణి తెలిపారు.

Vizianagaram

2021-05-28 14:21:56