1 ENS Live Breaking News

విశాఖ జీవిఎంసీపై YSRCP జెండా..

రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక మహా విశాఖ నగరపాలక సంస్థ పై వెస్సార్సీపీ జెండా ఎగురవేసింది. ప్రత్యర్ధి టిడిపి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత రాజకీయం నడిపినా ప్రజలు మాత్రం వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. మేజిక్ ఫిగర్ సంఖ్యలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు గెలిచి జీవిఎంసీ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించినా విశాఖ ప్రజలు తిప్పికొట్టినట్టుగా వైస్సార్సీపీకి ప్రజలు వెన్నదన్నుగా నిలిచారు. విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే వైఎస్సార్సీపీని ఓడించాలని ప్రతిపక్షాలు నెత్తీనోరు కొట్టుకున్నట్టు రాజకీయం చేసినా ఫలితం లేకపోయింది. 55 స్థానాలకు పైగా గెలుచుకొని మహావిశాఖనగర పాలక సంస్థ పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఆది నుంచి ప్రకటిస్తున్నట్టుగా విశాఖను పరిపాలనా రాజధానిని చేయడానికి జీవిఎంసి గెలుపు కూడా నేడు ఊతమిచ్చింది.  మొత్తం 98 వార్డులకు గాను 55కి పైగా స్థానాలు వైఎస్సార్సీ సొంతం చేసుకొని విజయ దుందుబీ మోగించింది. 

Visakhapatnam

2021-03-14 15:31:06

విశాఖలో దుమ్మురేపిన విశాఖ నగర అధ్యక్షుడు వంశీ..

 వైఎస్సార్సీపీ మహావిశాఖ నగర అధ్యక్షులు సిహెచ్.వంశీక్రిష్ణ శ్రీనివాస్ జివిఎంసీ ఎన్నికల్లో దుమ్మురేపారు..ఏకంగా 4వేల ఓట్ల మెజార్టీలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా వంశీ ముందు నిలవలేకపోయింది. ఆది నుంచి జివిఎంసీ మేయర్ అభ్యర్ధిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వంశీ గెలుపు, మెజార్టీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సమయంలో ప్రత్యర్ధులు ఫ్యాన్ గాలికి ఎగిరిపోయారు. అందరూ అనుకున్నట్టుగానే ఈయన గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. అంతేకాకుండా టిడిపి పత్తాలేకుండా పోయింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నిరుపేదలకు తోచిన సహాయం ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా వంశీ అన్నింటిలనూ ముందుండేవారు. చాలా కాలం తరువాత వంశీకి విశాఖ వాసులు రుణం తీర్చుకునే అవకాశం రావడంతో అత్యధిక మెజార్టీని అందించి విశాఖ వైఎస్సార్సీపీలో తిరుగులేని నేత ఈయనేనని రుజువుచేసి చూపించారు. ఈ విజయం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలన నేతగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఓ వెలుగు వెలిగారు..

విశాఖపట్నం

2021-03-14 15:25:01

మున్సిపల్ కౌంటింగ్ కలెక్టర్ స్వీయ పరిశీలన..

విజయనగరం జిల్లాలోని మున్సిపల్ కౌంటింగ్ ను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.హరిజవరహర్ లాల్ స్వయంగా పరిశీలించారు. ఆదివారం కౌంటింగ్ జరుగుతున్న అన్ని టేబుళ్లను కలెక్టర్ వెళ్లి తనిఖీ చేశారు. అదే సమయంలో అభ్యల గెలుపుపై కూడా డిజిటల్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని కూడా అక్కడి అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా మంచినీరు, మందులు కూడా అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. ఇటు మీడియాకి కూడా ఎప్పటి కప్పుడు వివరాలు అందించేందుకు మైకుల ద్వారా ప్రకటనలు చేయాలని కూడా సూచించారు. కౌంటింగ్ లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఒకటికి రెండు సార్లు బ్యాలెట్ పేపర్లు చూసిన తరువాత మాత్రే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ఎన్నికల సిబందిని, అధికారులను కోరారు. కౌంటింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Vizianagaram

2021-03-14 09:48:58

వేద పాఠశాల విద్యార్థుల‌కు ప్రోటీన్ పౌడ‌ర్..

తిరుమల ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థుల‌కు తిరుప‌తిలోని స్వీమ్స్ జ‌నరిక్ మెడిక‌ల్ షాపువారు రూ.45 వేలు విలువైన జ‌న ఔష‌ధి ప్రోటీన్ పౌడ‌ర్‌ను శ‌నివారం సాయంత్రం అందించారు. టిటిడి చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు స్వీమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల‌కు, ధర్మగిరి వేద పాఠశాలలోని అధ్యాప‌కుల‌కు, విద్యార్థుల‌కు అందించారు. దీనిని పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల‌న శ‌రీరంలో హ్యూమినిటి పెరుగుతుంద‌ని దాత‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌నరిక్ మెడిక‌ల్ షాపు ప్రొప్రైట‌ర్  ర‌వికుమార్‌, ఇంచార్జ్ మూర్తి,  ప్ర‌స‌న్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుపతి

2021-03-13 21:06:29

శ్రీకాకుళంలో కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి..

శ్రీకాకుళం  జిల్లాలో ఆదివారం జరగనున్న ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కౌంటింగ్ ఏర్పాట్లుతో పాటు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీలో రెండు కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించామని చెప్పారు. ఇచ్చాపురంకు సుమిత్ కుమార్, పలాసకు డాక్టర్ కే. శ్రీనివాసులు, పాలకొండకు ఆర్. శ్రీరాములు నాయుడును ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన చెప్పారు. ఇచ్చాపురం లో జ్ఞాన భారతి స్కూల్ లో, పలాసలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను, పాలకొండలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసు శాఖ బందోబస్తును గట్టిగా ఏర్పాటు చేస్తూ మూడు పట్టణాల్లోనూ సెక్షన్ 30 ను అమలు చేయడం జరిగింది. పోలీసు కవాతు లను కూడా పట్టణాల్లో నిర్వహించి బందోబస్తు ఏర్పాట్లు గట్టిగా చేసినట్లు తెలియజేశారు. పాలకొండలో 18 వార్డులకు ఎన్నికలు జరుగగా 14,600 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలాస - కాశీబుగ్గలో 29 వార్డులకు ఎన్నికలు జరుగగా 31,356 మంది, ఇచ్చాపురంలో 23 వార్డులు వార్డులకు ఎన్నికలు జాతుగాగా 20,433 మంది వెరసి 70 వార్డులులో 66,389 మంది  అనగా 72.5 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Srikakulam

2021-03-13 18:58:53

కౌంటింగ్ కి పకడ్బందీ ఏర్పాట్లు..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు ప‌క‌డ్భందీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ప్రత్యేకాధికారుల‌తో శ‌నివారం క‌లెక్ట‌ర్ టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కౌంటింగ్ ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కౌంటింగ్ హాలులో ఎటువంటి లోపాలూ లేకుండా చూడాల‌ని ఆదేశించారు. కౌంటింగ్ నిర్వ‌హించేట‌ప్పుడు సిబ్బంది ఇబ్బంది ప‌డ‌కుండా, త‌గిన వెలుతురు, గాలి ఉండాల‌న్నారు. కౌంటింగ్ హాలుకు నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా చూడాల‌న్నారు. గ‌దుల్లో త‌గిన‌న్ని టేబుల్స్, బారికేడింగ్ ఏర్పాటు చేయాల‌న్నారు. మీడియా పాయింట్‌ను, ఎప్ప‌టిక‌ప్పుడు ఫ‌లితాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు అవ‌స‌ర‌మైన‌ ఏర్పాట్లును చేయాల‌న్నారు. కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిగా వీడియో ద్వారా చిత్రీక‌రించాల‌ని సూచించారు. పోస్ట‌ల్ బ్యాలెట్ల విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. కౌంటింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత గెలిచిన అభ్య‌ర్థుల‌కు డిక్ల‌రేష‌న్ అంద‌జేయాల‌న్నారు. సామ‌గ్రి సీల్ చేసేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించారు. కౌంటింగ్ ప్ర‌క్రియలో ఎటువంటి వివాదాల‌కు అవ‌కాశం లేకుండా, పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.      టెలీకాన్ఫ‌రెన్స్‌లో మున్సిప‌ల్ కౌంటింగ్ ప్ర‌త్యేకాధికారులు, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-13 16:55:54

సమగ్రభూసర్వేలో సాంకేతికత వినియోగం..

‌రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డుతున్న భూముల స‌మ‌గ్ర రీస‌ర్వేను సాంకేతికంగా  మ‌రింత‌గా మెరుగుప‌ర‌చాల్సి ఉంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జె.సి. కిషోర్ కుమార్ ఈ ప్రాజెక్టు జిల్లాలో అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షిస్తున్న భూస‌మ‌గ్ర స‌ర్వే ప్రాజెక్టు డైర‌క్ట‌ర్‌కు సూచించారు. కృష్ణా, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ ప్రాజెక్టు అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షిస్తున్న డి.ఎల్‌.ఆర్‌.ఎం.పి. ప‌థ‌క సంచాల‌కులు ఎం.శ్రీ‌నివాస‌రావు గ‌త రెండు రోజులుగా జిల్లాలో ప‌ర్య‌టిస్తూ ఈ ప‌థ‌కం జిల్లాలో అమ‌లుపై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో భేటీ అయి గ‌త రెండు రోజులుగా తాను క్షేత్రస్థాయిలో సేక‌రించిన సమాచారంపై జె.సి.తో చ‌ర్చించారు. పార్వ‌తీపురంలో డివిజ‌ను ప‌రిధిలోని డిప్యూటీ త‌హ‌శీల్దార్‌లు, రెవిన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ల‌తో, గ్రామ‌, మండ‌ల స‌ర్వేయ‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. ల‌క్ష్మీపురం, మ‌ర్రివ‌ల‌స గ్రామాల‌కు చెందిన ఓ.ఆర్‌.ఐ. చిత్రాలు వ‌చ్చాయ‌ని, వీటి ఆధారంగా ఆయా గ్రామాల్లో క్షేత్ర‌స్థాయికి వెళ్లి భూములు త‌నిఖీ చేశామ‌న్నారు. స‌ర్వే విభాగానికి చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్లు, ఇన్‌స్పెక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మై ఈ స‌మ‌గ్ర భూస‌ర్వే ప్రాధాన్య‌త‌ను వివ‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. అనంతరం జె.సి. రాష్ట్రస్థాయి ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ స‌మావేశంలో స‌ర్వే విభాగం ఏ.డి. పి.వి.నాగేంద్ర‌కుమార్ కూడా పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-13 16:52:06

శ్రీ పద్మావతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి..

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ లు కలసి శనివారం ఉదయం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.  శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి, తిరుచానూరు అమ్మవార్లను దర్షించుకోవడం నా అదృష్టం అని, ఆంధ్రరాష్ట్ర , భారత దేశప్రజలు శుభిక్షం గా ఉండాలని,   శ్రీవారి అమ్మవార్ల ఆస్సీసులతో కోవిడ్ నుండి బయటపడతామని ఆసిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి,  జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్,  టిటిడి జెఇఒ  సదాభార్గవి, ఆర్డీఓ కనకనరసా రెడ్డి, ఏఈఓ మల్లీశ్వరి, తహసీల్దార్ , భాగ్యలక్ష్మి, టిటిడి అధికారులు ఆలయమర్యాదలతో  స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.వీరి వెంట రైల్వే జి.ఎం.గజనన్ మాల్యా, డిఆర్ ఎం ఆలోక్ తివారి,తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం బయలుదేరి వెళ్లారు.

Tiruchanur

2021-03-13 16:24:08

ఉపాధ్యాయులు ఓటు సద్వినియోగం చేసుకోవాలి..

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉపాధ్యాయులు తమ తమ ఓటుహక్కును నిర్బయంగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పటిష్టంగావించడం జరిగిందని  సబ్‌ ‌కలెక్టరు అనుపమ అంజలి అన్నారు. శనివారం ఆమె స్దానిక సబ్‌ ‌కలెక్టరు కార్యాలయంలో పోలింగ్‌ ‌సామాగ్రి పంపిణీ కేంద్రంలో బ్యాలెట్‌ ‌పేపర్లు సీళ్లను ఓపెన్‌ ‌చేసి బ్యాలెట్‌ ‌పేపర్లు విభజించి ఆయా పోలింగ్‌ ‌కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి అందజేసారు,  అనంతరం వారు వారికి కేటాయించిన పోలింగ్‌ ‌కేంద్రాలకు పోలీసు బలగాలతో బస్సులలో బయలుదేరి వెళ్లారు, డివిజన్‌లో పొలింగ్‌ ‌పక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్నిరకాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని పోలింగ్‌ ‌వారికి కేటాయించిన విధులు, భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ పోలింగ్‌ను స్చేచ్చాయుత వాతావరణంలో అప్రమత్తతో నిర్వహించాలని ఆమె పోలింగ్‌ ‌సిబ్బందికి సూచించారు.పోలింగ్‌ ‌కేంద్రాలలో అన్నిరకాలు కనీసవసతులు కల్పించడం జరిగిందని పోలింగ్‌ ‌ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని ఆమె పోలింగ్‌ ‌పిబ్బందికి  సూచించారు.పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద శాంతి భద్రతలు పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పక్కాగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం వారి నిబంధనలు అన్ని  తప్పసరిగా పాటించాలని ఆమె స్ఫష్టం చేసారు. పోలింగ్‌ ‌సిబ్బందికి అవసరమైన కనీసవసతులు అన్నింటికి ఆయా కేంద్రాల వద్ద కల్పించడం జరిగిందన్నారు.  డివిజన్‌ ‌పరిధిలో  మూడు జోన్లు, మూడు రూటుగాను విభజించడం జరిగిందన్నారు. డివిజన్‌ ‌పరిధిలో 9 పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.  ఉదమం 8 గంటలనుండి సాయంత్ర 4 గంటలవరకు పోలింగ్‌ ఉం‌టుందన్నారు. ఒక్కొక్క పోలింగ్‌ ‌కేంద్రంలో 5 గురు పోలింగు సిబ్బందితోపాటుగా మరోకరిని వెబ్‌ ‌కాస్టింగు కొరకు నియమించడం జరిగిందన్నారు.  1,923 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసారు. రిసెప్షన్‌ ‌కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియులో ఏర్పాటు చేయడం జరిగిందని పోలింగ్‌ ‌పక్రియ ముగిసిన పిదప బ్యాలెట్‌ ‌బ్యాక్సులను ఇతర పోలింగ్‌ ‌సామాగ్రిని కాకినాడలో అప్పగించాలన్నారు.  ఈనెల 17వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ కాకినాడ జెఎన్‌టియు విశ్వవిద్యాలయంలో ఉంటుందన్నారు.  అనంతరం ఆమె కోరుకొండలోని మండల ఎడ్యుకేషన్‌ ‌రిసోర్సు సెంటరు నందు ఏర్పాటు చేసిన  పోలింగ్‌ ‌కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలనాధికారిణి దేవి. కొరుకొండ మండల తాహసిల్దారు పాపారావు, ఎంపిడిఓ నరేష్‌కుమార్‌  ‌డిప్యూటీ డిప్యూటీ తాహసిల్దార్లు పవన్‌, ‌పరిమిళ, రెవిన్యూ సిబ్బంది రాము  తదితరులు పాల్గోన్నారు.  

Rajahmundry

2021-03-13 16:14:21

ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించాల్సిందే..

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్కాగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హిందూపురం ఎంజీఎం మున్సిపల్ హైస్కూలు లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. కౌంటింగ్ ను వీడియో తీయించాలని, కౌంటింగ్ కేంద్రంలో నీటి సరఫరా చేపట్టాలని, విద్యుత్ నియంత్రణ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మీడియో కేంద్రం ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరితగతిన కౌంటింగ్ పూర్తి చేసేలా పకడ్బందీగా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఎస్పీ మహబూబ్ బాషా, తహసీల్దార్ శ్రీనివాసులు,  మున్సిపాలిటీ డి ఈ మల్లికార్జున, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

అనంతపురం

2021-03-13 16:05:39

మునిసిప‌ల్ ఓట్ల లెక్కిపున‌కు ఏర్పాట్లు పూర్తి

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, న‌గ‌ర పాల‌క‌సంస్థ‌, న‌గ‌ర పంచాయ‌తీల సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఓట్ల‌‌లెక్కింపున‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. ఓట్ల‌లెక్కింపుకోసం ఐదు చోట్లా ప‌క్కా ఏర్పాట్లు చేశామ‌ని పేర్కొన్నారు. ఓట్ల‌లెక్కింపు  ప్ర‌క్రియ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంద‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. అంత‌కుముందే అభ్య‌ర్ధుల స‌మ‌క్షంలో స్ట్రాంగ్‌రూంలు తెర‌చి బ్యాలెట్ పెట్టెల‌ను కౌంటింగ్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.   విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌కు సంబంధించి స్థానిక రాజీవ్ స్టేడియంలో ఓట్ల‌లెక్కింపు కోసం చేసిన ఏర్పాట్ల‌ను క‌లెక్ట శ‌నివారం‌ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఓట్ల‌లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ప‌నితీరు, పోలింగ్ ఏజెంట్లు, అభ్య‌ర్ధులు కూర్చొనేందుకు ఏర్పాట్లు, కౌంటింగ్ సూప‌ర్ వైజ‌ర్లు, స‌హాయ‌కుల సీటింగ్ ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించి క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.    ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్‌ మీడియాతో మాట్లాడుతూ నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయ‌తీకి సంబంధించి మ‌హాత్మా జ్యోతిబా పూలే బి.సి.సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌లో, పార్వ‌తీపురం, బొబ్బిలి, సాలూరు మునిసిపాలిటీల‌కు సంబంధించి ఆయా పుర‌పాల‌క సంఘ కార్యాల‌యాల్లో ఓట్ల‌లెక్కింపున‌కు ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. విజ‌య‌న‌గ‌రంలో 25, సాలూరు, బొబ్బిలిలో 15 చొప్పున‌, పార్వ‌తీపురంలో 12, నెల్లిమ‌ర్ల‌లో 10 టేబుళ్లు క‌ల‌సి మొత్తం జిల్లాలో 77 టేబుళ్లు ఏర్పాటు చేశామ‌న్నారు. ప్ర‌తి మునిసిపాలిటీకి ఒక ప్ర‌త్యేకాధికారిని నియ‌మించామ‌ని ఆ అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కౌంటింగ్ జ‌రుగుతుంద‌న్నా‌రు. విజ‌య‌న‌గ‌రంకు జె.సి.(అభివృద్ధి) డా.మ‌హేష్ కుమార్ రావిరాల‌, సాలూరుకు డా.జి.సి.కిషోర్ కుమార్‌, పార్వ‌తీపురంకు ఐటిడిఏ పి.ఓ. ఆర్‌.కూర్మ‌నాథ్‌, బొబ్బిలికి జె.సి(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, నెల్లిమ‌ర్ల‌కు ఆర్‌.డి.ఓ. బిహెచ్‌.భ‌వానీశంక‌ర్ త‌దిత‌రుల‌ను నియ‌మించామ‌న్నారు. వీరి ఆధ్వ‌ర్యంలో ఓట్ల‌లెక్కింపు చేప‌ట్టేందుకు 207 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 90 మంది కౌంటింగ్ సూప‌ర్ వైజ‌ర్ల‌ను నియ‌మించామ‌న్నారు.  కౌంటింగ్ కేంద్రాల్లో ప్ర‌క్రియ‌నంత‌టినీ సిసి కెమెరాలు, వీడియోగ్ర‌ఫీ ద్వారా ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతుంద‌ని, మోనిట‌రింగ్ స్క్రీన్ల‌పై అన్ని టేబుళ్ల‌లో జ‌రుగుతున్న ప్ర‌క్రియ తెలుసుకొనే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అన్ని టేబుళ్ల వ‌ద్ద బారికేడ్ల ఏర్పాట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశామ‌న్నారు. కౌంటింగ్ హాళ్ల‌లో లోనికి ప్ర‌వేశించేందుకు, బ‌య‌ట‌కు వెళ్లేందుకు వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేశామ‌న్నారు.  కౌంటింగ్ ప్ర‌క్రియ గురించి వివ‌రిస్తూ ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కిస్తార‌ని, ఆ త‌ర్వాత సాధార‌ణ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ చేప‌డ‌తార‌ని వెల్ల‌డించారు. బ్యాలెట్ బాక్కుల నుంచి తీసిన బ్యాలెట్ల‌ను 25 చొప్పున క‌ట్ట‌లుగా క‌ట్టి ఆ త‌ర్వాత వాటిని లెక్కించ‌డం ప్రారంభిస్తార‌ని తెలిపారు. అభ్య‌ర్ధుల వారీగా వ‌చ్చిన ఓట్ల‌ను కౌంటింగ్ సూప‌ర్‌వైజ‌ర్ న‌మోదుచేసి రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశార‌ని ఆ రౌండుకు సంబంధించి లెక్కింపు పూర్త‌యిన త‌ర్వాత రిట‌ర్నింగ్ అధికారి ఫ‌లితాన్ని ప్ర‌క‌టిస్తార‌ని తెలిపారు.   కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఆటంకం లేకుండా స‌ర‌ఫ‌రా ఇవ్వాల‌ని ఇ.పి.డి.సి.ఎల్‌. అధికారుల‌కు ఆదేశాలు జారీచేశామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. జిల్లాలోని మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు అన్ని మునిసిపాలిటీల వ‌ద్ద మీడియా పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని, క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో క‌మాండ్ కంట్రోల్ రూం ద్వారా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల ఫ‌లితాలు సేక‌రించి ఎన్నిక‌ల క‌మిష‌న్ కు, మీడియాకు అందించే ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఓట్ల‌లెక్కింపున‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్ధుల త‌ర‌పు ఏజెంట్ల‌కు కూడా పాస్‌లు జారీచేస్తున్నామ‌ని, ఆయా అభ్య‌ర్ధులు అంద‌జేసిన పేర్ల‌ను పోలీసుల‌తో త‌నిఖీ చేయించిన మీద‌ట పాస్‌లు జారీచేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. మేయ‌ర్‌/ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక ప్ర‌క్రియ అదే  రోజు ప్రారంభం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలిచిన అభ్య‌ర్ధుల‌కు మేయ‌ర్‌, మునిసిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక‌కు సంబంధించి ఏర్పాటు చేసే ప్ర‌త్యేక స‌మావేశానికి హాజ‌రుకావాల‌ని కోరుతూ జిల్లా క‌లెక్ట‌ర్ ద్వారా జారీఅయిన‌ నోటీసులు అదే రోజున గెలుపొందిన అభ్య‌ర్ధుల‌కు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీల్లో మేయ‌ర్‌, చైర్‌ప‌ర్స‌న్‌ల ఎన్నిక‌కు కూడా ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మిస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్‌ చెప్పారు. మార్చి 18వ తేదీన ఆయా న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క సంస్థ‌ల్లో ఈ ఎన్నిక జ‌రుగుతుంద‌న్నారు. ప‌రోక్ష ప‌ద్ధ‌తిలో ఈ ఎన్నిక జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఆరోజు కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం ఎన్నిక నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. జిల్లా క‌లెక్ట‌ర్ వెంట ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్‌, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్‌.ఎస్‌.వ‌ర్మ‌, మునిసిప‌ల్ ఇంజ‌నీర్ దిలీప్ త‌దిత‌రులు ఉన్నారు.

Vizianagaram

2021-03-13 16:01:57

ఓట్ల లెక్కింపున‌కు ర్యాండ‌మైజేష‌న్..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్లను లెక్కించేందుకు గానూ, ర్యాండ‌మైజేష‌న్ ద్వారా సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నిక‌ల సాధార‌ణ ప‌రిశీల‌కులు కాంతిలాల్ దండే, జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అథారిటీ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆధ్వ‌ర్యంలో స్థానిక ఎన్ఐసి కార్యాల‌యంలో శ‌నివారం కంప్యూట‌ర్ ద్వారా ఈ ప్ర‌క్రియను నిర్వ‌హించారు. విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌తోపాటు, బొబ్బిలి, పార్వ‌తీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయితీల‌కు ఓట్ల లెక్కింపు చేప‌ట్టేందుకు టేబుళ్ల‌వారీగా ర్యాండ‌మైజేన్ నిర్వ‌హించి, కౌంటింగ్ సూప‌ర్‌వైజ‌ర్‌, స‌హాయ‌కుల‌ను ఎంపిక చేశారు. కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో సుమారు 100 మంది సూప‌ర్‌వైజ‌ర్లు, 200 మంది స‌హాయ‌కులు విధుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ ర్యాండ‌మైజేన్ ప్ర‌క్రియ‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, డిఐఓ ఆర్‌.న‌రేంద్ర‌, ఏడిఐఓ ఏ.బాల సుబ్ర‌మ‌ణ్యం, క‌లెక్ట‌రేట్ ఏఓ దేవ్ ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-13 15:57:50

పెద్ద ఎత్తున అజాదీ కా అమృత్ దినోత్సవ్..

 స్వాతంత్య్రం వచ్చి 2022 ఆగస్టు 15 కి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 'అజాదీ కా అమృత్ దినోత్సవ్' పేరుతో 75 వారాల ముందు నుంచే జిల్లాలో సంబరాలు నిర్వహించుకుందామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. వేడుకలకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకలలో నిర్వహించే కార్యక్రమాల  షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. మహోన్నత వ్యక్తులు, వారి పోరాటాలను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లానుంచి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తుల చరిత్రను వెలికితీయాలన్నారు. మరుగున పడిన స్వాతంత్య్ర సమర యోధుల చరిత్రను భావితరాలకు చెప్పాలన్నారు. స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టాలకు వేదికైన ప్రాంతాలను అన్వేషించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు వేడుకలలో పెద్ద ఎత్తున విద్యార్థులను పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. కాన్ఫరెన్సులు, సెమినార్లు, సింపోజియాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నిశాంతి, డీఆర్వో గాయత్రీ దేవి,   అనంతపురం నగర కమిషనర్ మూర్తి, ఆన్సెట్ సిఈవో హరిప్రసాద్, యూనివర్సిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 75 వారాల ముందు నుంచే నిర్వహించదలిచిందని, మార్చి 12 న మహాత్మా గాంధీ దండి యాత్రను ప్రారంభించిన సందర్భంగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' ఆరంభ వేడుకలను గుజరాత్ లో ప్రారంభించారని కలెక్టర్ తెలిపారు. నేడు ప్రారంభమైన ఆరంభ వేడుకలు ఏప్రిల్ 5 (దండి యాత్ర ముగిసిన రోజు) వరకూ కొనసాగుతాయని, అనంతరం 2022 స్వాతంత్ర్య దినోత్సవానికి 75 వారాల ముందు నుంచి 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకూ వేడుకలు కొనసాగుతాయన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మన జాతీయ జెండాను ఆవిష్కరించిన పింగళి వెంకయ్య కుమార్తెను సత్కరించటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో 'అజాదీ కా అమృత్ దినోత్సవ్' ఆరంభ వేడుకలను అధికారికంగా ప్రారంభించారని ,రేపు జిల్లాలో  'అమృత్ దినోత్సవ్' ఆరంభ వేడుకలను ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు..

Anantapur

2021-03-12 20:09:22

వాతావరణానికి అనుగుణంగా కార్యాచరణ..

వ్యవసాయ అనుబంధ రంగాలలో వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉపయోగపడే  పలు రకాలైన ప్రాజెక్టులను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా.జి లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్ షాప్ కు జేసి లక్ష్మీ శ , వాతావరణ నిపుణులు డా.టీ రవిశంకర్,జాతీయ జలశాస్త్ర నిపుణులు డా వై ఆర్ సత్యాజిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ నాబార్డు ద్వారా నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ ను వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ శాఖల లో వాతావరణ మార్పులకు అనుగుణంగా పలు రకాలైన ప్రాజెక్టును సిద్ధం చేసి నాబార్డు కు పంపించాలని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఆయా అంశాలపై నిపుణులైన శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని జేసి తెలిపారు. జిల్లాలో వాతావరణ మార్పులు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు సంబంధించి చేపట్టవలసిన నూతన ప్రాజెక్టుల అవకాశాలు, ఉపయోగాల గురించి వాతావరణ నిపుణులు డా.టీ రవిశంకర్,జలశాస్త్ర నిపుణుడు డా.వై ఆర్ సత్యాజిరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. కృష్ణాజిల్లా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఎం రామసుబ్రహ్మణ్యం ఆక్వా, మడ అడవుల్లో చేపల పెంపకం అభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణంగా ద్వీపాలను (ఐలాండ్స్) కాపాడుకొనె టెక్నాలజీని, తన పరిశోధన అనుభవాలు ఇతర అంశాలను ఈ సందర్భంగా జిల్లా అధికారులతో చర్చించారు. వాతావరణ మార్పులకు సంబంధించి వివిధ రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థల ద్వారా చేపట్టగలిగే పలు రకాలైన ప్రాజెక్టుల మార్గదర్శకాలను నాబార్డు డీడీఎం వై.సోమినాయుడు అధికారులకు వివరించారు.   ఈ వర్క్ షాప్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ జేడి డా ఎన్ టి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ డీడీ విటి రామారావు, హార్టికల్చర్ డీడీ రామ్మోహన్ రావు,సీపీఓ బాలాజీ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-03-12 19:55:03