అనంతపురం జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్స్ లో ఏర్పాట్లు, ఓటరు స్లిప్పుల పంపిణీ పై జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ లు, నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మునిసిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద త్రాగునీరు, కుర్చీలు, టేబుళ్లు, మైకు,మెడికల్ క్యాంపు, టాయిలెట్స్, శానిటేషన్, పోలింగ్ కేంద్రాల రూటు నెంబర్స్ తో వాహనాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇతర అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బు, మద్యం, తాయిలాలను పంపిణీ చేసే అభ్యర్థులపై, ఖర్చు పై గట్టి నిఘా పెట్టాలని, మోడల్ కోడ్ ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఓటరు స్లిప్పులను వంద శాతం ఆయా బి.ఎల్.ఓ ల ద్వారా పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఇంకా ఎక్కడైనా మిస్ అయిన ఓటర్లు ఉంటే అటువంటి వారికి బి.ఎల్.ఓ ల ద్వారా ఓటరు స్లిప్పులను పంపిణీ చేయించాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు ఓటర్ల నుండి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి, మైక్రో అబ్జర్వర్లకు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాల వద్ద మంచి భోజన సదుపాయాలు, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ విధులకు కేటాయించిన సిబ్బంది ఎవరైనా గైర్హాజరైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఓటరు అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ తో పాటు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎస్.ఈ.సి నిబంధనల మేరకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తీ చేయాలన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మీడియాకు ఇబ్బంది లేకుండా ఒక మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్, కౌంటింగ్, ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది లేకుండా మంచి ఆహారాన్ని అందించాలన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి నిర్దేశిత ప్రొఫార్మా లో పోలింగ్ రిపోర్ట్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి అందజేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్న మున్సిపల్ ప్రాంతాల్లో స్థానికంగా సెలవును ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాలను జారీ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయితీల్లో దుఖానాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు కూడా మున్సిపల్ ప్రాంతాల్లో సెలవు వర్తిస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేసేందుకు, ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు వీలుగా ఈ నెల 9,10వ తేదీల్లో సెలవు ప్రకటించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు జరిగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ నెల 14న సెలవు ప్రకటిస్తూ, జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని తొలి స్వాతంత్ర్య సమరయోధురాలు, దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేసే బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా.ఎం.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో సిపిఎంజీ కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దువ్వూరి సుబ్బమ్మ పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిజమైన గాంధేయవాదిగా పేరొందినది సుబ్బమ్మ మాత్రమేనన్నారు. రాజమండ్రిలో ఉప్పుసత్యాగ్రహంలో ఎంతో చురుకుగా పాల్గొనడంతోపాటు, ఖాదీ వస్త్రాలు వినియోగంలోనూ, పేదలకు పంచడంలోనూ ప్రజల్లో బాగా చైతన్యం తేవడంతో కీలక పాత్ర పోషించారన్నారు. దేశీయ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో రాజమండ్రి, రాయవెల్లూర్ జైళ్లలో జైలు శిక్ష అనుభవించారని గుర్తుచేశారు. ఆమె చరిత్ర ప్రజలకు బాగా చేరువ కావాలనే ఉద్దేశ్యంతోనే ఈపోస్టల్ కవర్ ను తీసుకు వచ్చామని అన్నారు. అంతకు ముందు మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టల్ కవర్ల ద్వారా ప్రజలకు, చరిత్రకారుల విలువలు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్పీ సోమశేఖరరావు, ఎస్పీ ప్రసాదబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ నాగాదిత్యకుమార్, పి.ఆనందరావు, కార్యాలయంలోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలు సమాఖ్యంగా కృషి చేయాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పిలుపునిచ్చారు. మార్పు తీసుకొచ్చేందుకు ఓ నాలుగు బాధ్యతలు చేపట్టాలని.. ప్రత్యేక తీర్మాణాల ద్వారా వాటిని అమలు చేయాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డెంకాడ ఇందిరా స్వయం సహాయక సంఘ సభ్యులను సత్కరించిన సందర్భంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఇందిరా గ్రూపు ప్రెసిడెంట్ చిన్నాలు, సెక్రటీరీ ఆదిలక్ష్మి నాయకత్వం, సభ్యులు చూపిన చొరవ ప్రోత్సహించతగ్గ విధంగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రగతి ఇంతిటితో ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని మార్పులకు నాంది పలకాలన్నారు.
మరిన్ని అభివృద్ధి ఫలాలు చూసేందుకు ముఖ్యంగా...
1. చదువు లేని గ్రామం ఉండకూడదు.
2. పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
3. చెరువులను సంరక్షించుకోవాలి.
4. స్వచ్ఛమైన గాలి, నీరు అందించేందుకు.. మొక్కలు నాటాలి అనే నాలుగు తీర్మాణాలు చేసుకొని ప్రతి సంఘం ముందుకు సాగాలని, జిల్లాను ప్రగతి పథంలో నడపాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నేపథ్యంలో అక్రమ మద్యం ఉంటే సమాచారం అందించాలని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ అజిత పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. మద్యం అక్రమంగా తరలించేవారిని పట్టుకోవడానికి 12 ప్రత్యేక బృందాలుతో వాహనాలు 24 గంటలు తనిఖీ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం పై నిరంతరం గట్టి నిఘా పెట్టామన్నారు. మద్యం నిల్వ ఉన్నా, వాహనాల పై తరలించినా కంట్రోల్ రూమ్ నంబర్ సమాచారం అందించాలని తెలిపారు. కంట్రోల్ రూం నంబర్ .9440904317 కు తెలియజేయవలసినదిగా కోరారు.
పురపాలక సంఘాలకు జరిగే ఓట్ల లెక్కింపులో సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా విధులను నిర్వహించాలని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు. విజయవాడలోని ఐ వి ప్యాలస్ లో సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు పై సూపర్వైజర్స్ ను నిర్వహించినా శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, పురపాలక సంఘాలకు ఈ నెల10న జరిగే పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు 14 వ తేదీ ఆదివారం ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ చాలా కీలకం అన్నారు. కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పంచాయతీ ఎన్నికలకు, పురపాలక సంఘాల ఎన్నికల లో గెలుపు ఓటములకు చాలా తక్కువ వత్యాసం ఉండే అవకాశం ఉన్నందున విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ తేదీకి, కౌంటింగ్ తేదీకి మధ్య 3 రోజుల సమయం ఉన్నందున అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేసుకోవాలని , జిల్లాలో పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశామని ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం లయోలా కాలేజీ విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు.
దాదాపు ఓట్ల లెక్కింపు మధ్యాన్నం సమయానికి పూర్తి అవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో వ్యాలీడ్, ఇన్ వ్యాలీడ్ ఓట్ల లెక్కింపు చాలా కీలకం కానున్నాయన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్(సంక్షేమం), మాస్టర్ ఆఫ్ ట్రైనర్ కె. మోహన్ కుమార్ మాట్లాడుతూ, ఈ శిక్షణా తరగతులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా పురపాలక సంఘం పరిధిలో ఓట్లకు అనుగుణంగా టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ సారద్యంలో అధికారుల స్వచ్చంద బాగస్వాంతో పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా నిర్వహించ గలిగామన్నారు. అదే స్ఫూర్తితో, పురపాలక ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించకుందామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సూపర్వైసర్స్ కు సందేహలకు జేసి నివృత్తి చేశారు.
అనంతపురము జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్న పట్టణ ప్రాంతాల్లో మద్యం షాపుల మూసివేతపై జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు మరియు పోలింగ్ నిర్వహించే ప్రాంతాలకు 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తయ్యే వరకూ మద్యం షాపుల బంద్ కొనసాగుతుందన్నారు. ఎక్కడైనా రీపోలింగ్ అనివార్యమైతే మార్చి 13న రీపోలింగ్ నిర్వహించనున్నందున ఆయా ప్రాంతాల్లో మార్చి 11 సాయంత్రం 5 గంటల నుంచి 13న పోలింగ్ పూర్తయ్యేవరకూ మద్యం షాపులు మూసివేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం మార్చి 14 నాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కారణంగా మద్యం షాపులు బంద్ చేయవలసి ఉంటుందన్నారు.
జిల్లాలోని 11 పట్టణాలలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లోని ఆబ్కారీ శాఖ హోల్ సేల్ డిపోలు, రిటెయిల్ ఔట్ లెట్లు, కల్లు దుకాణాలు మొదలగునవి నిర్దేశించిన సమయాల్లో మూసివేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.
జివియంసి ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సామగ్రి పంపిణీ చేయడం, పోలింగ్ పూర్తయిన తరువాత స్వీకరించేందుకు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని జిల్లా ఎనికల అథారిటీ, జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన, జివియంసి కమిషనర్ నాగలక్ష్మి నగరంలోని పంపిణీ కేంద్రాలైన ఎ.యు. ఇంజనీరింగ్ కళాశాల, జ్ఞానాపురం సోఫియా కళాశాల, బి.హెచ్.పి.వి ఉన్నత పాఠశాల, వేపగుంట రవినగర్ భాష్యం కళాశాలలను సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. బస్సులు, వాహనాలు వచ్చిపోయేందుకు విశాలమైన మైదానంలో లోపలికి, బయటకు వేరుగా మార్గాలు వుండాలన్నారు. సామగ్రి పంపిణీ కౌంటర్ల ప్రాంగణం విశాలంగా వుండాలని, పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయాలు అందుబాటులో వుండాలని, వేసవి మొదలైనందున ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటర్ల వద్ద అందరికీ కనిపించే విధంగా బోర్డుల ఏర్పాటు, మైకులలో ప్రకటిస్తూ వుండాలన్నారు. ఎవరికీ ఇబ్బందిలేకుండా తగిన సమాచారం అందజేస్తూ వుండాలన్నారు. పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణ కూడా జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవాలన్నారు. కౌంటర్ల వద్ద తశీల్దార్ లేదా ఎంపిడివో స్థాయి అధికారులను నియమించాలన్నారు. అధికారులు సమన్వయంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా పటిష్టంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.పెంచల కిషోర్, ప్రత్యేక ఉపకలెక్టర్లు అనిత, పద్మలత, జివియంసి ఎస్.ఈ. వెంకటేశ్వరరావు, జోనల్ కమిషనర్లు సింహాచలం, చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగ్గాలలో ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న జిల్లా స్థాయి మహిళ అధికారులను ఆదర్శంగా తిసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినిలకు సూచించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని అకడమిక్ టూర్ లో భాగంగా కాకినాడ విచ్చేసిన ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులతో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డి మురళీధర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల పిల్లలకు చదువు పై సరైన అవగాహన లేక చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం,ఏదో ఒక చిన్నపాటి వృత్తికే పరిమితం అవుతున్నారు. ఈ అకడమిక్ టూర్ లో భాగంగా 9,10 తరగతులకు చెందిన 54 మంద విద్యార్థినిలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఇతర ప్రాంతాలను చూపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనప్పటికీ దానితోపాటు ఇంకా ఉత్తమమైన వృత్తులు చాలా ఉన్నాయన్నారు.తాను విధుల్లో భాగంగా రంపచోడవరం ఇతర ఏజెన్సీ ప్రాంతాల పర్యటనలో భాగంగా వివిధ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారి ఆలోచనలు చాలా చిన్నవాటికె పరిమితమవడం గమనించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అత్యధిక శాతం మహిళలే జిల్లాస్థాయి అధికారులుగా ఉత్తమంగా రాణిస్తున్నారని అటువంటివారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని విద్యార్థినిలకు కలెక్టర్ సూచించారు. అకడమిక్ టూర్ లో భాగంగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి,కలెక్టరేట్ లో వివిధ విభాగాలు, అధికారుల కార్యాలయాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని రంపచోడవరం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె శ్రావణి తెలిపింది. తొలుత మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినిలు,కలెక్టరేట్ సిబ్బందితో కలిసి కలెక్టర్ కేకును కట్ చేశారు. అనంతరం ఏపీ రైఫిల్ షూటింగ్ ఓపెన్ కాంపిటీషన్ లో జూనియర్ ,యూత్ విభాగాలలో రెండు కాంస్య పతకాలు గెలిచిన లోకజ్ఞను కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఎం సరస్వతి, మెప్మా పీడీ కెశ్రీరమణి, ఎడిసి సిహెచ్ నరసింహారావు,కలెక్టరేట్ మహిళల సిబ్బంది పాల్గొన్నారు.
కుటుంబ సక్రమ నిర్వహణతో పాటు ఉద్యోగ జీవితంలో పనిచేసే తీరు.. ఆలోచనా విధానంలో పురుషులతో పోల్చితే మహిళలు ఒక మెట్టు పైనే ఉంటున్నారని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి తదితరులతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళా ఉద్యోగులను ఉద్దేశించి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడారు. అత్యధిక జనాభా.. జనసాంద్రత.. సామాజిక, ఆర్థిక సవాళ్లు.. అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొంటూ తూర్పుగోదావరి జిల్లాను ప్రగతిపథంలో నడిపించడంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న మహిళా అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ విభాగాల కీలక స్థానాల్లో మహిళలు ఉన్నారని, ఇద్దరు జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ట్రెయినీ కలెక్టర్ అందరూ మహిళామణులేనని వివరించారు. కోవిడ్-19 క్లిష్ట సమయంలో బాధితులకు సొంత కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న పరిస్థితుల్లో జేసీలు కీర్తి చేకూరి, జి.రాజకుమారి విధి నిర్వహణలో చూపిన చొరవ మరువలేనిదని, వారిద్దరికీ జిల్లాలోని దాదాపు 56 లక్షల మంది ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. వీరితో పాటు ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూంలు, వలస కార్మికుల కేంద్రాలు.. ఇలా వివిధ చోట్ల అంకితభావంతో కోవిడ్ విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణ సమయంలో కొందరికి కోవిడ్ సోకినా భయపడకుండా ముందడుగు వేశారన్నారు. జిల్లాలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, సిబ్బంది ఉండటం నిజంగా అదృష్టమని కలెక్టర్ పేర్కొన్నారు.
కలల్ని కనే ధైర్యం ఉండాలి: జేసీ(డీ) కీర్తి చేకూరి
ఇంటి నుంచి బయటకు రావడమే సాధికారత కాదని.. ధైర్యంగా కలలు కని, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని జేసీ (డీ) కీర్తి చేకూరి పేర్కొన్నారు. సంకుచిత మనస్తత్వం నుంచి బయటపడి విశాల దృక్పథాన్ని పెంపొందించుకొని ఎదిగినప్పుడే నిజమైన సాధికారత సొంతమవుతుందన్నారు. మన ముందు తరాల మహిళలు చేసిన కృషివల్లే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రతి మహిళా మార్పు దిశగా ముందడుగు వేయాలని సూచించారు. జిల్లాలో ప్రతి విభాగంలోనూ మహిళా అధికారులు, సిబ్బంది ఉన్నారని.. నిర్దేశ సమయంలో పనిపూర్తిచేయడంలో వారి పాత్ర కీలకమైందని ప్రశంసించారు. జాయింట్ కలెక్టర్‌గా తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉండటానికి తన తల్లిగారు కారణమని పేర్కొన్నారు.
చేసే ప్రతి పనినీ ఆస్వాదించాలి: జేసీ(డబ్ల్యూ) జి.రాజకుమారి
ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తిచేస్తారనే నమ్మకం జిల్లాలోని మహిళా ఉద్యోగులు, అధికారులపై కలెక్టర్ మురళీధర్‌రెడ్డి గారికి ఉందని.. ఆయన అందిస్తున్న విశేష మద్దతుతోనే ఈ రోజు చక్కగా పనిచేస్తున్నామని జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి పేర్కొన్నారు. దిశ వన్‌స్టాప్ సెంటర్, శిశుగృహాలు, స్వాధార్‌హోంలు.. ఇలా వివిధ కేంద్రాల్లో మహిళలు అందిస్తున్న సేవలు మరువలేనివని ప్రశంసించారు. కన్నతల్లిని మించి వారు చిన్నారులపై చూపిస్తున్న ప్రేమానురాగాలు ఎంతో గొప్పవన్నారు. చేసే ప్రతి పనినీ ఆస్వాదించినప్పుడే సానుకూల శక్తి లభిస్తుందని, మహిళా ఉద్యోగులు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకొని ముందడుగు వేయాలని సూచించారు. కోవిడ్ సమయంలో సేవలందించిన వైద్యులు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మన లోపలి ప్రపంచాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే బయటి ప్రపంచంలో మనం ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. పుస్తక పఠనం వంటి ఏదైనా హాబీని అలవరుచుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
లక్ష్మీ శ్రీలేఖకు సత్కారం:
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ; నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడిగా నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంటు ఫెస్టివల్-2021లో జిల్లా, రాష్ట్ర స్థాయులను దాటుకొని ఫైనల్స్‌కు చేరుకొని, తూర్పుగోదావరి జిల్లా కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డి.లక్ష్మీ శ్రీలేఖను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సత్కరించారు. ఆమె నేటి రోల్‌మోడల్ అంటూ ప్రశంసించారు. శ్రీలేఖ.. గౌరవ ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌తో పాటు విద్యాశాఖ, యువజన వ్యవహారాల శాఖ మంత్రుల ముందు పార్లమెంటులో ఫైనల్స్‌లో భాగస్వామ్యమయ్యారు. లక్ష్మీ శ్రీలేఖ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అమ్మమ్మ, అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ రోజు ఇంతమంది ముందు నిలబడగలిగానన్నారు. మహిళలు చెప్పాలనుకున్నది ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలని పేర్కొన్నారు.
సందడిగా మహిళా దినోత్సవ వేడుకలు:
కలెక్టరేట్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో స్వాధార్‌హోంకు చెందిన చిన్నారుల నృత్యాలు అలరించాయి. మహిళా దినోత్సవం, బాల్య వివాహాల నిర్మూలన అంశాలపై నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో విశేష సేవలందించిన 50 మంది మహిళలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, అతిథులు ప్రశాంసా పత్రాలు, బహుమతులు అందించారు. బాలికలు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన సంరక్షణకు సంబంధించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ రూపొందించిన స్వేచ్ఛ పోస్టర్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ బి.పద్మావతి, జేజేబీ మెంబర్ వై.పద్మలత, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్బలక్ష్మి, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ సునీత, బీసీ వెల్ఫేర్ డీడీ మయూరి, ఐసీడీఎస్ పీడీ డి.పుష్పమణి, ఏపీడీ డి.విజయలక్ష్మి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీముఖలింగంలో నిర్వహించే శివరాత్రి మహోత్సవ లకు స్థానికులకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జె నివాస్ తెలిపారు. బయటి నుంచి వచ్చే భక్తులకు అనుమతి ఉండదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసారు. కోవిడ్ రెండవ దశ వ్యాప్తిలో ఉన్నందున ఉత్సవాలు నిర్వహించుటకు, ఎక్కువ మంది గుమిగూడుటకు అనుమతించడం లేదని సోమవారం ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 216, ఏపిడమిక్ చట్టం కింద మతపరమైన వేడుకలు భారీ ఎత్తున చేయుట, ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీముఖలింగంలో జరిగే శివరాత్రి మహోత్సవాలు శ్రీముఖలింగం మరియు శ్రీముఖలింగాయానికి అతి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు మాత్రమే 11వ తేదీన దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత తహశీల్దార్లు, పోలీసు సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్నిచోట్ల కోవిడ్ నియమ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే చుట్టు పక్కల గ్రామాల భక్తులు సైతం మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ ఉపయోగించాలని ఆదేశించారు. ప్రజలకు లౌడ్ స్పీకర్ల ద్వారా తగిన అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఎక్కువ మంది ఎక్కడా గుమిగూడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఏ వ్యక్తి అయినా కరోనా లక్షణాలతో ఉన్నట్లు గుర్తిస్తే తక్షణం అతన్ని పరీక్షలకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హాస్టల్లోను, రెస్టారెంట్లు ఇతర ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనల అమలు తీరును తహశీల్దార్లు నిశితంగా తనిఖీ చేయాలని ఆయన పేర్కొన్నారు. టెక్కలి సబ్ కలెక్టర్, పాలకొండ ఆర్డిఓ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు విపత్తుల చట్టం, ఐపిసి 188 సెక్షన్ కింద శిక్షార్హులు అవుతారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్ నియంత్రణలో ఉండుటకు జిల్లా ప్రజలు సహకరించారని పేర్కొంటూ, రానున్న కొద్ది రోజుల పాటు సహకారాన్ని అందించి కోవిడ్ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. కోవిడ్ టీకా ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను జీతాల ఖాతాగా నమోదుచేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తమ పథకాల ప్రదర్శన, అవగాహన కార్యక్రమాన్ని సోమ వారం ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు అనుసంధానంతో అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రధామంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.ఏ.వై) అటాల్ పెన్షన్ యోజన( ఏ.పి.వై), ఎస్.పి.ఎస్.వై తదితర పథకాలు ప్రజలకు మంచి ఉపయోగకరమని పేర్కొన్నారు. ఉద్యోగులు బ్యాంకు ఖాతాలను సాధారణ ఖాతాలుగానే వినియోగించడం జరుగుతుందని, దానిని జీతాల ఖాతా (శాలరీ అకౌంట్)గా నమోదు చేసుకోవడం వలన ప్రమాద బీమా రూ.20 లక్షల వరకు వర్తిస్తుందని అన్నారు. ప్రతి ఉద్యోగి దీని పట్ల శ్రద్ద వహించాలని కోరారు. ఎస్.బి.ఐలో ఖాతాలు కలిగి ఉన్న ఉద్యోగులకు జీతాల ఖాతాగా నమోదుకు చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అధికారికి, ఎస్.బి.ఐ అధికారులకు సూచించారు. ఎస్.బి.ఐ రీజనల్ మేనేజర్ తపోదన్ దెహీరి మాట్లాడుతూ బ్యాంకు పూర్తి స్ధాయిలో డిజిటలైజేషన్ అయిందని, డిజిటలైజేషన్ సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. ఎస్.బి.ఐ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఎస్.బి.ఐ గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, ఎస్.బి.ఐ అధికారులు కామేశ్వర రావు, వి.ఎస్.ఎన్ సాహూ, వెంకట రమణ, కిరణ్ బాబు, గణేష్, సత్యప్రియ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ ఆరోగ్యం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగులకు ప్రత్యేక మెగా వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేసింది. ఈ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పురుషులు మాత్రమే కాకుండా మహిళల ఆరోగ్యం కూడా అత్యావశ్యమన్నారు. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తరచూ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించడం వలన ఆరోగ్య సమస్యలు ఉంటే తెలుస్తాయని సూచించారు. జెమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కుటుంబ సభ్యులందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటి నివారణకు అవసరమగు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం అని అన్నారు. వైద్య శిబిరంలో ఇసిజి, 2డి ఎకో, బీపీ, షుగర్, పేప్స్మియిర్, బోన్ మినరల్ డెన్సిటీ, కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్లు సుమీత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, డిఆర్ఓ బి.దయానిది, జెమ్స్ వైద్యులు డా.కె.సుధీర్, డా.డి ప్రవీణ్ , జెమ్స్ మేనేజర్లు పెదబాబు, రామ్మోహన్, రెవిన్యూ, పంచాయతీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, ఇతరులు శిబిరంలో పాల్గొని వివిధ వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.
ప్రమాదాలు అనేవి పరిశ్రమలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పరిసరాల్లో ఉన్న వారికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిమీద ఉందని అటువంటి ప్రమాదాలను గురించి విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అన్నారు. 50 వ జాతీయ భద్రతా వారోత్సవాలను చిత్తూరులోని ప్రభుత్వ ఐటిఐ సంస్థలో సి పి ఎఫ్ కోళ్ల దానా పరిశ్రమ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భోపాల్ దుర్ఘటన 1972 లో జరిగిందని దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికీ ఆ కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి నెలకొని ఉందని అటువంటి దుర్ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఈ భద్రతా వారోత్సవాలు యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఐటిఐ లో చదివే విద్యార్థులు ప్రధానంగా పారిశ్రామిక సంస్థలు క్షేత్ర స్థాయి ఉద్యోగాలు ఎక్కువగా చేయడం జరుగుతుందని వారిలో మొదట అవగాహన కల్పిస్తే బాగుంటుందని అందుకే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అంతేకాకుండా ప్రతి ఒక్కరూ విద్యతో పాటు నైపుణ్యానికి సంబంధించిన ఏదో ఒక ప్రత్యేక విద్యను నేర్చుకోవటం జరుగుతుందని ఆ తర్వాత ఎక్కడ ఉద్యోగం చేసినా నా ఈ ప్రమాదాలకు సంబంధించి తెలిసి ఉంటే కొంతవరకు తీవ్రతను తగ్గించవచ్చు నని అన్నారు. భావి భారత పౌరులు అయినా విద్యార్థులలో భద్రత గురించి అవగాహన కల్పిస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం తోపాటు సామాజిక పరంగా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివ కుమార్ రెడ్డి ఇ మాట్లాడుతూ ఫ్యాక్టరీలలో జరిగే ప్రమాదాలలో ఎక్కువమంది కేంద్ర స్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడడం జరుగుతుందని మొట్టమొదటి వారే ప్రమాదానికి గురికావడం జరుగుతుందని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని విద్యార్థులలో అవగాహన కల్పించడం వల్ల రాబోవు కాలంలో ప్రధానంగా ఐటిఐ చదివే విద్యార్థులు ఫ్యాక్టరీ లో చేరిన తర్వాత ఇబ్బందులు పడకుండా చూసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. భద్రత గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల లో గత రెండు సంవత్సరాలుగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని వారిలో అవగాహన కల్పించేందుకు వ్యాస రచన వకృత్వ డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం నుంచి కరోనా ప్రభావంతో ఎక్కడ నిర్వహించలేదని నేటి నుంచి తిరిగి ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా మొదలుపెడతామని అన్నారు. ఈ సందర్భంగా ఐటిఐ సంస్థలలో నిర్వహించిన వ్యాస రచన వకృత్వ డ్రాయింగ్ పోటీలలో విజేతలకు బహుమతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కల్నల్ కిరణ్ రెడ్డి, ఐటిఐ విద్యాసంస్థల కోఆర్డినేటర్ గణేష్, చిత్తూరు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి విద్యార్థులు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళా వివక్షత నిర్మూళనకు ప్రతీ ఒక్కరూ ముందుకి రావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలోని రెవెన్యూ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సఫాయి కర్మచారీ మహిళలు, మహిళా అధికారులు మరియు ఇతర మహిళలకు జిల్లా కలెక్టర్ సన్మానించారు. వేడుకలలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు లేకపోతే మనమెవరమూ లేమన్నారు. చరిత్రలో ఎన్నో కట్టుబాట్లు దాటుకుని మహిళలు ఈరోజు హక్కులు, అవకాశాలు సంపాదించుకున్నారన్నారు. సతీసహగమనం, బాల్య వివాహాలు, విద్యకు దూరంగా ఉంచడం, బయటి ప్రపంచానికి కనిపించకుండా చేయడం వంటి ఎన్నో కట్టుబాట్లు ఒకప్పుడు ఉండేవని.. ఈనాటికీ ఇంట్లో ఆడపిల్లలను ఒకలా, మగ పిల్లల్ని ఒకలా చూసే అలవాటు చూడటం తల్లిదండ్రుల్లో కనిపిస్తోందన్నారు. ఆ వివక్ష, కట్టుబాట్లు నశించాలన్నారు. రెండు వందల ఏళ్ల క్రితం సావిత్రి బాయ్ ఫులే అనే మహిళ ఆనాటి కట్టుబాట్లను కాదని తాను చదువు కోవడమే గాక దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించిందన్నారు. ప్రతి మహిళా ఓ సావిత్రి బాయ్ ఫులే కావాలని ఆకాంక్షించారు.
ఈ సామాజిక కట్టుబాట్లనుంచి బయటికి వచ్చే మహిళలకు అండగా ఉండటంలో జిల్లా యంత్రాంగం ముందువరుసలో ఉంటుందన్నారు. బాలికే భవిష్యత్తు వంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టి బాలికలు, మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, ఎంత చేసినా అది తక్కువేనన్నారు.
మహిళను అయినందుకు గర్విస్తున్నా: జేసీ సిరి
జాయిట్ కలెక్టర్ ఏ.సిరి(అభివృద్ధి) మాట్లాడుతూ మహిళగా పుట్టినందుకు గర్విస్తున్నానన్నారు. పిల్లలని కని, పెంచి వారికి ఒక మంచి భవిష్యత్తును అందించడంలో మహిళల పాత్రే కీలకమన్నారు. ఆధునిక మహిళలు వృత్తి, ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు కుటుంబానికి, వృత్తికి సమతుల్యత పాటించడానికి మించిన సవాలు మరొకటి ఉండదన్నారు. కూతురిగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా ఎన్నో పాత్రలను మహిళ సమర్థవంతంగా పోషిస్తోందన్నారు.మన తల్లులు మన పిల్లల్ని చూసుకుంటూ మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని,
నా విజయానికి కారణం మా అమ్మ అని చెప్పారు.. ఉద్యోగం చేస్తున్న మహిళలు ఒక వైపు వృత్తి ధర్మం నిర్వహిస్తూనే,
బిడ్డకు జన్మనిస్తూ, వారి ఆరోగ్యం, వారి చదువు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారని ఆమె గుర్తు చేసారు.
అన్నింటా మహిళలు ముందున్నారు: సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి
సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళలందరికీ పండగ రోజన్నారు. మహిళలు తమ హక్కులకోసం చేసిన పోరాటం నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం ఉద్భవించిందన్నారు. స్త్రీలు పురుషుల కంటే ఎందులోను తక్కువ కాదన్నారు. ప్రపంచంలోని అన్ని రంగాల్లో మహిళలు ముందు వరసలో ఉన్నారన్నారు. ఈరోజు ఆటో నడపడం దగ్గర్నుంచి అంతరిక్షంలో కాలు మోపే వరకూ అన్ని చోట్లా స్త్రీలు సత్తా చాటుతున్నారన్నారు. మహిళ పాత్ర తన వ్యక్తిగత విజయాలకు పరిమితం కాదన్నారు. పురుషులను మంచి మార్గంలో నడిపించడం, వెన్ను తడుతూ వారి విజయానికి తోడ్పాటు అందించడంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అలాంటి మహిళలను గౌరవించుకోవాలన్నారు. స్త్రీల మీద జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. అన్ని వర్గాల మహిళలకు సన్మానం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకి కృతజ్ఞతలు తెలిపారు.
వేడుకలలో సఫాయి కర్మచారులు నారాయణమ్మ, నాగమణి, మంగమ్మ లను కలెక్టర్ సన్మానించారు. అనంతరం జిల్లా మహిళా అధికారులు, అంగన్వాడీ వర్కర్లు, కోవిడ్ సమయంలో విశేషంగా సేవలందించిన పలువురు మహిళా ఉద్యోగులను కలెక్టర్ సన్మానించారు.
కలెక్టర్ సన్మానించిన వారిలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి(అభివృద్ధి), సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి, ఆర్డీటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్, రెడ్స్ సంస్థ భానుజ, ఐసిడిఎస్ పీడీ విజయలక్ష్మి, డిపిఓ పార్వతి, హార్టికల్చర్ డిడి పద్మలత,అగ్రికల్చర్ ఏ డి విద్యావతి, ఒకరోజు కలెక్టర్ శ్రావణి, కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన రిత్విక శ్రీ, పలువురు జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీవోలు శ్రీదేవి ,లలిత తదితరులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు..