1 ENS Live Breaking News

సచివాలయాల నిర్మాణాలు వేగవంతం కావాలి..

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్, మిల్క్ బల్క్ సెంటర్లభవన నిర్మాణ పనులు వేగవంతం చేసి, వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మిస్తున్న గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్ లు, మిల్క్ బల్క్ సెంటర్ల పనుల పురోగతిపై పంచాయతీరాజ్ ఇంజనీర్లు,ఈఈ,డీఈఈలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 381 గ్రామ సచివాలయాలు, 74 రైతు భరోసా కేంద్రాలు, 60 ఆరోగ్య క్లినిక్ లు పూర్తి అయినట్లు ఆయన తెలిపారు..పనులు పూర్తి అయిన వాటికి బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.వివిధ నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్ భవనాలు తప్పనిసరిగా మార్చి 31 నాటికి పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన భవనాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జేసి (డబ్ల్యూ) జి.రాజకుమారి, పంచాయతీ రాజ్ సూపరిండిడెంట్ ఇంజనీర్ ఎం నాగరాజు ,ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.

Kakinada

2021-03-12 19:47:48

వేదపాఠశాలలో వారంతా బాగానే ఉన్నారు.

తిరుమల వేద పాఠశాల లో కోవిడ్ సోకిన 57 మంది విద్యార్థులు, ఒక అధ్యాపకుడు క్షేమంగా ఉన్నారని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి చెప్పారు.  స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని శుక్రవారం సాయంత్రం చైర్మన్, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, తుడా చైర్మన్, శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి చైర్మన్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరికి మాత్రమే జలుబు ఉందని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ వివరించారు. 57మంది విద్యార్థులు, ఒక అధ్యాపకుడిని ప్రత్యేకంగా రెండు వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆమె చెప్పారు.  చైర్మన్, ఈవో విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహారం గురించి తెలుసుకున్నారు.   స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేద పాఠశాల విద్యార్థులందరూ బాగా ఉన్నారని ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో చెప్పారు.  ప్రభుత్వ అనుమతి మేరకు ఇటీవలే వేద పాఠశాల పునః ప్రారంభించామన్నారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.   టీటీడీ నిర్మించదలచిన చిన్న పిల్లలు ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో శంఖుస్థాపన చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముంబైకి చెందిన ఒక భక్తుడు ఆసుపత్రి నిర్మాణం, పరికరాల ఏర్పాటు,నిర్వహణ విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. ఆసుపత్రికి నిర్మాణానికి 10 ఎకరాల భూమి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఎంఓయు జరిగిందన్నారు.

Tirupati

2021-03-12 18:14:54

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోనే అభివ్రుద్ధి..

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాలని   జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన  "ఆజాదీ కా స్వర్ణోత్సవ్"  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం అనేక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.  విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక, విజ్ఞాన, సామాజిక రంగాలలో మనం ఇంకా ఎంతో సాధించవలసి ఉందన్నారు.  ఆర్థిక, సామాజిక, లింగ భేదాలను అధిగమించాలన్నారు. పౌరులందరికీ సమానమైన మౌలిక వసతుల కల్పించాలన్నారు.  ఇవన్నీ సాధించాలంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు,  ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు సంకల్పంతో, నిబద్ధతతో పనిచేయాలన్నారు.  మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి  దేశంలో 90 శాతం నిరక్షరాశ్యత వుందని, ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశంగా వుండేదన్నారు.  డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం లిఖిత కమిటీని ఏర్పాటు చేశారన్నారు. 2 సం.ల 11 నెలల్లో రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. 1950 నుండి పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, బ్యాంకుల జాతీయకరణ, భారీ పరిశ్రమల ఏర్పాటు మొదలైన వాటితో పాటు విద్య, వైద్య, వ్యవసాయ, మౌలిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు.           జివియంసి కమిషనరు నాగలక్ష్మి మాట్లాడుతూ భావి తరాలకు స్వాతంత్ర్యోద్యమాన్ని గూర్చి,  జాతీయసమైక్యతా స్ఫూర్తిని గూర్చి తెలియ జేయాలన్నారు.  జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లు అవుతున్న సందర్భంగా  75 వారాలు ముందు నుండి వివిధ కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  అంతకుముందు జిల్లా కలెక్టరు తదితరులు మహాత్మా గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేశారు.  జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ కళాశాల, పాఠశాల విద్యార్ధినీ విద్యార్దులు జాతీయ గీతాలాపనలు, నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. నాగరాజ్ పట్నాయక్ దర్శకత్వంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్ర్స్ కళాకారులు ప్రదర్శించిన  బహుభాషా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయంట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, డి.ఆర్.ఓ.  ఎ.ప్రసాద్, జెడ్.పి. సిఈఓ నాగార్జున సాగర్, డిఆర్ డిఎ  పి.డి. వి.విశ్వేశ్వరరావు, జె.డి. రమణమూర్తి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది  ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-03-12 18:13:29

మూమెంట్ రిజిస్టర్ రాయకపోతే ఇంటికే..

విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని ప‌లు స‌చివాల‌యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ శుక్ర‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప‌ట్ట‌ణంలోని కొత్తఅగ్ర‌హారం ప్రాంతంలో 24,28,29 స‌చివాల‌యాల‌ను ఆయ‌న త‌నిఖీ చేశారు. ముందుగా ఆయ‌న హాజ‌రు ప‌ట్టీని, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్‌ను ప‌రిశీలించారు. గైర్హాజ‌రైన సిబ్బంది గురించి ఆరా తీశారు. వారిపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రికి హాజ‌రుప‌ట్టీపై ఆబ్‌సెంట్ న‌మోదు చేశారు. ఈ సేవ పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పై ప్ర‌శ్నించారు.  ఈ సంద‌ర్భంగా స‌చివాల‌య సిబ్బందితో మాట్లాడుతూ, బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఖ‌చ్చితంగా మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్‌లో న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌క‌రంగా బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని 28వ నెంబ‌రు స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చిన ఫిర్యాదులు, అర్జీల‌పై త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సూచించారు. ప్ర‌తీ స‌చివాల‌య ప్రాంగ‌ణంలో మొక్క‌ల‌ను నాటాల‌న్నారు. సిబ్బంది నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు స‌క్ర‌మంగా సేవ‌లందించాల‌ని కోరారు.

Vizianagaram

2021-03-12 18:06:30

కౌంటింగ్ కు పక్కగా ఏర్పాట్లు చేయాలి..

తూర్పుగోదావరి జిల్లాలో ఏడు మునిసిపాలిటీలు, మూడు న‌గ‌ర పంచాయ‌తీల్లో ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈ నెల 14వ తేదీన జ‌రిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు సూచించారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌రేట్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అవ‌స‌ర‌మైన‌న్ని కౌంటింగ్ టేబుళ్ల‌ను ఏర్పాటుచేసి, వీలైనంత త్వ‌ర‌గా కౌంటింగ్ పూర్త‌య్యేలా చూడాల‌ని  సూచించారు. విద్యుత్ సౌక‌ర్యం ఉండేలా చూసుకోవాల‌ని, జ‌న‌రేట‌ర్‌/ఇన్వ‌ర్ట‌ర్ల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, సీసీ కెమెరాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌న్నారు. కౌంటింగ్ సిబ్బందిని పూర్తిస్థాయి శిక్ష‌ణ‌తో సిద్ధం చేయాల‌న్నారు. అదే విధంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే కొత్త ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించాల‌ని ఆదేశించారు. ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌కు మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప‌రంగా పెండింగ్ ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ అభిషిక్త్ కిషోర్‌, డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, ఇత‌ర మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు పాల్గొన్నారు.

Kakinada

2021-03-12 18:02:21

ఆక్వాకల్చర్ కోసం మండల కమిటీలు..

అనంతపురం జిల్లాలో అప్సడ యాక్ట్ కింద నూతనంగా ఆక్వాకల్చర్ పాండ్స్ ఏర్పాటు కోసం మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మీనీ కాన్ఫరెన్స్ హాల్లో అప్సడ యాక్ట్, ప్రధాన మంత్రి మత్స్యసాగు యోజన తదితర పథకాలపై ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ డిస్టిక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అప్సడ యాక్ట్ అమలు కోసం మండల స్థాయిలో  కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆక్వా కల్చర్ కింద వంద ఎకరాల్లో సాగు జరుగుతుండగా, ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చిన చేపల గుంతలు (ఆక్వాకల్చర్ పాండ్స్) కు సంబంధించి ఎండార్స్మెంట్ చేయాల్సి ఉండగా, అప్సడ యాక్ట్ లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. నూతనంగా ఆక్వాకల్చర్ పాండ్స్ ఏర్పాటు చేయనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రధాన మంత్రి మత్స్యసాగు యోజన కింద 2021-2022 సంవత్సరానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అలాగే 2020-21లో థిలాపియా బ్రూడ్ బ్యాంక్ ను పిఎబిఆర్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రస్థాయి కమిటీకి వివరాలు పంపించేందుకు డిస్టిక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగిందన్నారు.  ఈ సమావేశంలో మత్స్య శాఖ డిడి శ్యామలమ్మ, సిపిఓ ప్రేమచంద్ర, డి ఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభ స్వరూపరాణి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, మత్స్యశాఖ ఎఫ్ డి వో ఆసిఫ్, వివిధ శాఖల అధికారులు, మస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

Anantapur

2021-03-12 17:58:23

డీసీసీబీని మరింత అభివ్రుద్ధి చేసుకోవాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంకును మరింత చేరువగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలని జెసి, పర్శన్ ఇన్చార్జి డిసిసిబి కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో డిడిసిబి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణపై జేసీ స‌మీక్ష నిర్వ‌హించారు. డీసీసీబీ ప‌ర్స‌న్ ఇన్‌-ఛార్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టి బోర్డు స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ ఆర్థిక అంశాలు చ‌ర్చకు వ‌చ్చాయి. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణపై చ‌ర్చించి ప‌లు అంశాల‌పై మార్గ‌నిర్దేశ‌కాలు చేశారు. జిల్లాలో డీసీసీబీ సేవ‌లు మ‌రింత ఉన్న‌తంగా అందించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని జేసీ ఈ సంద‌ర్భంగా సూచించారు. డీసీసీబీ అధికారులు, మేనేజ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-12 17:56:28

ధాన్యం కొనుగోలు లక్ష్యాలు చేరుకోవాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్‌లో అంద‌రూ స‌మ‌న్వ‌యంతో  వ్య‌వ‌హ‌రించ‌టం వ‌ల్ల 4.43 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయ‌గ‌లిగామ‌ని జేసీ కిశోర్ కుమార్ పేర్కొన్నారు. అయితే వ్య‌వ‌సాయ శాఖ నివేదిక‌ల ప్ర‌కారం మ‌రో 12 వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం ఇంకా రైతుల వ‌ద్ద ఉన్న‌ట్లు తేలింద‌ని, ఆ మిగులు ధాన్యం నిర్ణీత కాలంలో కొనుగోలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఖ‌రీఫ్ సీజ‌న్‌లో జ‌రిగిన ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియపై జేసీ కిశోర్ కుమార్ శుక్ర‌వారం జిల్లాలోని మిల్ల‌ర్లతో, సంబంధిత అధికారుల‌తో త‌న ఛాంబర్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం నిర్ధేశించిన ల‌క్ష్యం దాదాపు చేరుకున్నామ‌ని, ఈ అద‌న‌పు ధాన్యం కూడా సేక‌రించేస్తే పూర్తి ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పీపీసీల్లో కొనుగోలు చేసి ఇంకా మిల్ల‌ర్ల వ‌ద్ద‌కు చేర‌ని ధాన్యం వివ‌రాల‌ను మిల్ల‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్‌లో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి రబీలో మ‌రింత ప‌క‌డ్బందీగా ధాన్యం కొనుగోలు చేప‌ట్టాల‌ని, త్వ‌ర‌లోనే ర‌బీ ప్ర‌క్రియ‌పై స‌మావేశం నిర్వ‌హించి విధివిధానాలు ఖరారు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మిల్ల‌ర్ల‌ స‌మ‌స్య‌లపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో డీఎస్‌వో పాపారావు, సివిల్ సప్లై డీఎం భాస్క‌ర‌రావు, ఆర్డీవో భ‌వానీ శంక‌ర్, రైస్ మిల్ల‌ర్ల సంఘం జిల్లా అధ్య‌క్షుడు కొండ‌బాబు, ప‌లువురు మిల్ల‌ర్లు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-12 17:52:59

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..

క్రిష్ణాజిల్లాలో ఈనెల 14న జిల్లాలో జరగనున్న ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎ న్నికల అధికారి కె. విజయానంద్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ క్యాంపు కార్యాలయం నుంచి, సిపి కార్యాలయం నుండి సిపి బత్తిన శ్రీనివాసులు, మచిలీపట్నం నుండి యస్‌పి విజయకుమార్ , కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ ఆదివారం నిర్వహించే ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎ న్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో 50 ప్రాంతాలలో 51 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలో 6,424 మంది ఉపాధ్యాయ యంయల్‌సి ఎ న్నికలలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటుహక్కు కలిగి ఉన్నారన్నారు. వారిలో 3,619 మంది పురుషులు, 2,804 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఓటుహక్కు కలిగి ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 ఫ్లయ్యింగ్ స్క్వాడ్స్, 34 స్టాటిస్టికల్ సర్వైయల్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆరు హైపర్ సెన్సిటివ్, 15 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, రాష్ట్ర ఎ న్నికల కమిషన్ ఆదేశాల మేరకు 26 పోలింగ్ స్టేషన్ల పరిధిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 25 కేంద్రాలలో వీడియో కవరేజీ కూడా ఏర్పాటు చేశామన్నారు. రెండు దశల్లో ఎ న్నికల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల ఎ డమచేతి మధ్యవ్రేలిపై ఇంకుముద్ర వేయడం జరుగుతుందని, ఈవిషయమై సిబ్బందికి తగిన సూచనలు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 63 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం ఉండగా 142 బాక్స్‌లు సిద్ధంగా ఉంచామన్నారు. 65 మంది పిఓలు, 65 మంది ఏపిఓలు, 118 ఓపిఓలు, 70 మంది మైక్రో అబ్జర్వర్స్‌ను నియమించడం జరిగిందని కలెక్టరు వివరించారు. ఎ న్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా 53 బృందాలు ద్వారా పరిశీలన చేయడం జరుగుతుందన్నారు.

Vijayawada

2021-03-12 16:50:21

మంచినీటి ఇబ్బందులు రాకుండా చూడాలి..

ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చేదిశలో ఆర్ డబ్ల్యుయస్ అధికారులు క్షేత్రస్ధాయిలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికమేరకు పూర్తి చేయాలని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయలో ఆర్ డబ్ల్యుయస్ మండల క్షేత్రస్ధాయి సిబ్బందితో ఆర్ డబ్ల్యుయస్ పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ క్షేత్రస్ధాయిలోని ఆర్ డబ్ల్యుయస్ అధికారులు వారికి నిర్ధేశించిన పనులను హేబిటేషన్స్ వారీగా లక్ష్యాల ప్రగతిసాధనకు చొరవ చూపాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజల త్రాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఓహెచ్‌యస్ఆర్ ల నిర్వాహణా పనులను పూర్తి చేయాలన్నారు. జలజీవన్ మిషన్ క్రింద జిల్లా వ్యాప్తంగా 361 పనులను నిర్ధేశించుకోవడం జరిగిందన్నారు. ఇందుకోసం రూ. 512 లక్షల రూపాయల పనులకు ప్రతిపాదనలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో రూ. 5 లక్షల రూపాయల లోపు పనులకు సంబంధించి 318 పనులు చేపట్టాల్సి ఉంటుందని వీటిని మార్చి 31 లోపులో పూర్తి చేయాలన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీ క్రింద జిల్లాలో 595 పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. వీటికి సంబంధించి క్షేత్రస్ధాయిలో పనులను ప్రారంభించాలని ఇందుకు సంబంధించి మౌలికవసతులు తదితర అంశాలపై నివేదికలను రూపొందించుకోవాలన్నారు. వీటిలో రూ. 5 లక్షల రూపాయలు లోపు పనులను ఏప్రిల్ 20 కల్లా పూర్తి చేయాలని కలెక్టరు ఇంతియాజ్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 39 సిపిడబ్ల్యు పనులను చేపడుతున్నామని వీటిని త్వరితగతిన పూర్తి చేసేలాగా క్షేత్రస్ధాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని రక్షిత త్రాగునీటి సరఫరా చేసే ఓవర్ హెడ్‌టాంకుల ఫిల్టర్ బెడ్‌లు, తదితర మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంతియాజ్ స్పష్టం చేశారు. రక్షిత త్రాగునీటి సరఫరా లక్ష్యంగా ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చే అంశంపై క్షేత్రస్ధాయి అధికారులు మరింత శ్రద్ధకనబరచాలని, పూర్తి చేసిన పనుల వివరాలను కూడా ఎ ప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన బంటుమిల్లి, మండవల్లి, తిరువూరు, విస్సన్నపేట, నాగాయలంక, అవనిగడ్డ, జగ్గయ్యపేట, తదితర మండలాల అధికారులతో పనులలో ప్రగతిని చూపించాలని కలెక్టరు స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్ధాయిలో పనులపై మరింత దృష్టి కేంద్రీకరించాలని వచ్చే 24 గంటల్లో పనుల ప్రగతిలోనూ డేటాను అప్‌లోడ్ చేయాలన్నారు. ఈసమావేశంలో ఆర్ డబ్ల్యుయస్ యస్ఇ సాయినాధ్, ఇఇలు, డిఇలు, ఏఇలు, తదితరులు పాల్గొన్నారు.

Vijayawada

2021-03-12 16:44:40

కెజిహెచ్ కు సిఫారసులు ఉండరాదు..

శ్రీకాకుళం జిల్లా నుంచి కెజిహెచ్ కు సిఫారసులు ఉండరాదని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. స్థానికంగా వైద్యం అందించే పరిస్థితి లేనపుడు అత్యంత అత్యవసర కేసులు మినహా ఏ కేసులు సిఫారసు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాలో నిపుణులు అయిన వైద్యులు ఉన్నారని ఆయన చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మాతృ, శిశు మరణాలపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వెళ్లే సమయంలో అత్యవసర శస్త్ర చికిత్సలు అవసరం అయితే, పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వందల కొద్ది కిలోమీటర్లు ఎందుకు ప్రయాణించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శస్త్ర చికిత్సలకు, వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రి ఉందని, అవసరమైతే ఇంకా సమకూర్చుటకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. స్థానికంగా రక్తపు యూనిట్లు, అన్ని సౌకర్యాలు లభ్యంగా ఉన్నప్పటికీ సిఫారసు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రాన్సిట్ చేయడం వలన మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించారని అభినందిస్తూ ప్రసవ సమయంలో సైతం అటువంటి సేవలు కొనసాగాలని అన్నారు. గర్భిణి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని తదనుగుణంగా అవసరమైనప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండాలని సూచించారు. అన్ని కేసులను కెజిహెచ్ కు పంపించాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. వైద్య పరీక్షలు పక్కాగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలు ఉండరాదని ఆయన పేర్కొన్నారు.    ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి తదితర ప్రాంతాల నుండి శ్రీకాకుళం, విశాఖపట్నం ఆసుపత్రులకు సిఫారసు చేయడం పట్ల వైద్యుల వివరణ కోరారు. పాలకొండలో ఫిజీషియన్, ఇతర వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికి ఆ చుట్టుపక్కల నుండి కె.జి.హెచ్ కు పంపించడం పట్ల ప్రశ్నించారు. మూడవ, నాలుగవ సారి గర్భం ధరించకుండా తగిన అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. ఏడవ సారి గర్భం ధరించిన వారు కూడా ఉండటం విచారకరమన్నారు.  ఇది కేవలం సిబ్బంది వైఫల్యంగానే పరిగణించడం జరుగుతుందని ఆయన అన్నారు. యూరిన్ నమూనాలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. జలుమూరు పి.హెచ్.సి పరిధిలో ఒక కేసుపట్ల శ్రద్దవహించని ఆశా కార్యకర్తకు మెమో జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ సార్లు గర్భం ధరించడం వలన వచ్చే ఆరోగ్య, ఆర్ధిక ఇబ్బందులను భార్య భర్త, అత్తామామ లకు వివరించాలని ఆదేశించారు. గిరిజన, మారుమూల ప్రాంతాల పట్ల దృష్టి సారించాలని పేర్కొన్నారు. మొదటిసారి గర్భం దాల్చినప్పుడే తగు ఆరోగ్య సూచనలు చేయాలని, ఆడ, మగ బిడ్డలలో ఎవరైనా సమానమేనని చైతన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఉద్బోధించారు. లింగనిర్ధారణలో సైతం  మహిళా పాత్ర ఉందని, పురుషుల క్రోమోజోమ్ ఆధారంగా జరుగుతుందని స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణులు అంగన్వాడీ వద్ద పౌష్టికాహారం పొందుతున్నది లేనిది పరిశీలించాలని అన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అవసరమని ఆయన పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.బ్లడ్ స్టోరేజి కలిగిన ఆసుపత్రులు రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్త దాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.  క్రిటికల్ కేర్ అవసరమైన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సంభవించిన మరణాలను విశ్లేషిస్తే 8 మరణాలు అరికట్టి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరణించిన వారిలో 4, 7 వ సారి డెలివరీకి వచ్చిన వారు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రసవ సమయంలో మరణించడం సరికాదని పేర్కొంటూ అరికట్టగలిగే  ఎటువంటి కేసు మరణానికి గురికారాదని కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, వైద్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా.ఏ.అనురాధ, డా.లీల, డా.ఎన్. ఏ.వి.వి.వి.పి.రామి రెడ్డి,  వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-12 14:14:15

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్కాగా జరగాలి..

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశ భవనంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా చేపట్టాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఓటు విలువైనదేనని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదని, కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమన్నారు. కౌంటింగ్ హాల్లో ఫ్యాన్లు, నీటి సరఫరా, లైటింగ్ సౌకర్యం కల్పించాలని, గాలి వెలుతురు వచ్చేలా చూడాలని, అన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం ఉండాలని, జనరేటర్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా కౌంటింగ్ చేపట్టాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పనిచేయాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మరియు సిబ్బంది అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.  జిల్లాలో ఒక నగర పాలక సంస్థ, 10 మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 10వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా పూర్తయిందని, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా సజావుగా జరిగేలా అన్ని విధాల సిద్ధం కావాలన్నారు. ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజయవంతంగా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ను చేపట్టామని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కూడా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించామని, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జయప్రదం చేయాలన్నారు. ఇందుకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై నిబంధనల గురించి జిల్లా కలెక్టర్ కూలంకషంగా వివరించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కౌంటింగ్ ఎలా చేపట్టాలి అనే అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి,  మాస్టర్ ట్రైనర్  మరియు రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, కౌంటింగ్ సూపర్ వైజర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-03-12 14:11:47

ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే చోట 144 సెక్షన్ అమలు..

తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టనట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన పోలింగ్ సందర్భంగా  పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల వృత్త పరిధిలో ఉదయం 7 గం.ల నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకూ సిఆర్పిసి సెక్షన్-144 అమలులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే ఈ ఎన్నికల కౌంటింగ్ జరిగే  కాకినాడ జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ  200 మీటర్ల వృత్త పరిధిలో సిఆర్పిసి సెక్షన్-144 అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.  సెక్షన్-114 అమలు దృష్ట్యా ఆయా తేదీలలో నిర్థేశించిన సమయాల్లో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎటువంటి సమావేశాలు, ఊరేగింపులు, 4గురు అంతకంటే ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు గుమిగూడడం, ఆయుధాలతో కానీ, ఆయుధాలు లేకుండా గానీ సంచరించడం నిషేధించినట్టు కలెక్టర్ వివరించారు. 

Kakinada

2021-03-12 13:59:03

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపును ఈ నెల 14న ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు త‌గిన  ఏర్పాట్లూ చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ చెప్పారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌లోని 5వ డివిజ‌న్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి మృతి చెందిన కార‌ణంగా శుక్ర‌వారం జ‌రిగిన ఎన్నిక‌ ప్ర‌క్రియ‌ను ఆయ‌న ప‌రిశీలించారు. మొత్తం ఐదు పోలింగ్ బూత్‌ల‌ను సంద‌ర్శించి, అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. ఓట‌ర్ల‌తో మాట్లాడి, వారి స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. ఓట‌ర్ల‌కు ఎండ‌వ‌ల్ల ఇబ్బంది క‌ల‌గ‌కుండా క్యూలైన్ల‌ను మార్పు చేయించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మీడియాతో మాట్లాడారు.   రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జారీ చేసిన ప్ర‌త్యేక ఆదేశాల‌కు అనుగుణంగా 5 డివిజ‌న్‌లో ఎన్నిక నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఎప్ప‌టిలాగే ఇక్క‌డ కూడా ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రుగుతోంద‌న్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను, ఇప్ప‌టికే ఓట‌ర్ల‌కు ఓటర్ స్లిప్పుల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ, ఎవ‌రైనా మిగిలిపోయి ఉంటే, అటువంటి వారికోసం ప్ర‌త్యేకంగా ఒక కౌంట‌ర్‌ను ఏర్పాటు చేసి, కంప్యూట‌ర్ ద్వారా వారి ఓటు వివ‌రాల‌న శోధించి, అక్క‌డిక‌క్క‌డే ఓట‌ర్ స్లిప్పుల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.               ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా, ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు త‌గిన ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. నెల్లిమ‌ర్ల మిన‌హా, మిగిలిన నాలుగు మున్సిపాల్టీల‌కు న‌లుగురు ఐఏఎస్ అధికారులను ప్ర‌త్యేకాధికారులుగా నియ‌మించామ‌ని, వీరంతా కౌంటింగ్‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు.  కౌంటింగ్ సిబ్బందికి రెండో విడ‌త శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఆయా మున్సిపాల్టీల కౌంటింగ్ సెంట‌ర్ల‌లోనే శిక్ష‌ణ ఏర్పాటు చేశామ‌ని, కౌంటింగ్ న‌మూనా కూడా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రించిన‌ట్లుగా, కౌంటింగ్‌ను కూడా ప్ర‌శాంతంగా పూర్తి చేసేందుకు రాజ‌కీయ పార్టీలు త‌మ సంపూర్ణ స‌హ‌కారాన్ని అందించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.                ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, ఇత‌ర ఎన్నిక‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-12 11:51:59

పారదర్శకంగా మున్సిపల్ ఓట్ల లెక్కింపు..

విశాఖ  జిల్లాలో జివిఎంసి, ఎలమంచిలి, నర్సీపట్నం  మున్సిపాలిటీలకు నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని  జిల్లా ఎన్నికల అథారిటీ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  గురువారం వి.ఎం.ఆర్.డి.ఎ.చిల్డ్రన్ ఎరీనా లో  ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆయన పలు సూచనలు చేశారు. బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని   బ్యాలెట్ పేపర్  అభ్యర్థుల తరపున ఏజెంట్లకు చూపించే లెక్కింపు చేయాలన్నారు.   బ్యాలెట్ పేపర్ ల చెల్లుబాటుకు సంబంధించి అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు.  ఓట్ల లెక్కింపులో తెలిసి చేసినా, తెలియక చేసినా చర్యలు తప్పవని గుర్తించాలన్నారు.  ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించాలని, తరువాత మిగిలిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించడం మొదలవుతుందన్నారు. లెక్కింపునకు సంబంధించి వివిధ ప్రొఫార్మాలను   ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రౌండ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ఏజెంట్లకు వివరాలను తెలియజేసి వారి సంతకాలు తీసుకోవాలన్నారు. రౌండ్లవారీ లెక్కింపులో పొరపాట్లు రాకుండా చూసుకోవాలన్నారు.  స్ట్రాంగ్ రూమ్ నుండి బ్యాలెట్ బాక్సులు వచ్చిన వెంటనే  25 చొప్పున కట్టలు కట్టాలని, లెక్కింపు పూర్తయిన వెంటనే అభ్యర్థుల వారీగా కట్టకు 50 చొప్పున  భద్రపరచాలన్నారు.  ప్రణాళిక ప్రకారం లెక్కింపు నిర్వహించినట్లైతే ఎటువంటి తప్పులకు అవకాశం ఉండదన్నారు.  కార్యక్రమం ప్రారంభంలో జీవీఎంసీ కమిషనర్ అదనపు ఎన్నికల అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ  ప్రాధమికమైన సమాచారాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించే క్రమంలో వారికి నియమ నిబంధనలు గూర్చి,  కరోనా జాగ్రత్తలను గూర్చి తెలియజేయాలన్నారు.  జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జునసాగర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు విధివిధాలను వివరించారు.  ఈ సమావేశంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, జి.వి.యం.సి ఎడిషనల్ కమీషనర్ ఆశా జ్యోతి , జోనల్ కమీషనర్ లు, ఆర్.ఓ.లు, ఎ.ఆర్.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-11 20:26:59