1 ENS Live Breaking News

కోవిడ్ వాక్సిన్ వేసుకున్న జె.సి..

శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ కోవిడ్ వాక్సిన్ ను బుధవారం వేయించుకున్నారు. జిల్లాలో జనవరి 16వ తేదీన వైద్యులు, వైద్య సిబ్బందికి వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైన సంగతి అందరికి విదితమే. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఇచ్చే కార్యక్రమం జిల్లాలో ప్రారంభమై, దశల వారీగా టీకా అందరికి వేయడం జరుగుతుంది. అందులో భాగంగా  శ్రీకాకుళం పట్టణంలోని బర్మా కాలనీలో గల  అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యు.పి.హెచ్.పి)లో బుధవారం భారత్ బయోటెక్ తయారు చేసిన కో-వాక్సిన్ టీకాను జె.సి వేయించుకున్నారు. బర్మా కాలనీ యు.పి.హెచ్.పి ఎ.ఎన్.ఎం టి.శేషకుమారి ఈ టీకాను సంయుక్త కలెక్టర్ కు వేసారు. కో వాక్సిన్ టీకాను వేయడం జరిగిందని, 28 రోజుల తరువాత మరో డోస్ కో వాక్సిన్ టీకాను వేయించుకోవలసి ఉంటుందని టి.శేషకుమారి సంయుక్త కలెక్టర్ కు సూచించారు. టీకా తీసుకున్నప్పటికి మాస్కుధారణ, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని జె.సికు ఆమె సూచించారు. టీకా తీసుకొనుటకు యు.పి.హెచ్.పి కేంద్రానికి చేరుకున్న సంయుక్త కలెక్టర్ కు బర్మా కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు డా. నిర్మలా మల్లేశ్వరి,  ప్రత్యేక అధికారి పి.వి.యస్.ప్రసాదరావు  స్వాగతం పలికి టీకా ఇస్తున్న వివరాలను తెలిపారు. టీకా తీసుకున్న అనంతరం సంయుక్త కలెక్టర్ అబ్జర్వేషన్ రూమ్ లో 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం కె.లలిత కుమారి, ఎ.నిర్మల, ఫార్మాసిస్ట్ ఎ.శాంతిశ్రీ, ల్యాబ్ టెక్నిషీయన్ జి.శ్రీరాములు, సచివాలయ సిబ్బంది పి.సూర్యకళ, ఆశా వర్కర్ కె.పావని తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-02-10 13:29:32

ఈవీఎంలకు పటిష్ట భద్రత కల్పించాలి..

తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) యూనిట్ల భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కాకినాడ క‌లెక్ట‌రేట్ ప‌క్క‌న ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేశారు. ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీ చేసి, నివేదిక‌లు సమ‌ర్పించే ప్ర‌క్రియ‌లో భాగంగా క‌లెక్ట‌ర్‌.. అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ నిర్వ‌హించారు. గోదాములోని ఈవీఎం, వీవీప్యాట్ యూనిట్ల భ‌ద్ర‌త‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు సూచ‌న‌లు ఇచ్చారు. ఫిజికల్‌ వెరిఫికేషన్‌లో భాగంగా ఈవీఎం బాక్సుల బ్యాలెట్‌ యూనిట్ల బార్‌కోడ్ స్కాన్ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. త‌నిఖీలో క‌లెక్ట‌ర్ వెంట డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు ఎం.జ‌గ‌న్నాధం, ర‌మేశ్ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.

కాకినాడ

2021-02-09 18:58:00

విజయవాడ నగరాభివ్రుద్ధికి రూ.600 కోట్లు..

విజయవాడ నగర అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గత ప్రభుత్వంతో పోలిస్తే విజయవాడ అభివృద్దికి ఎక్కువ నిధులు కేటాయించి నగరాన్ని సుందరీకరిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విజయవాడ సెంట్రల్‌ ‌నియోజకవర్గంలో రూ.93 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ‌శాసనసభ్యులు  మల్లాది విఘ్ణ, మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌వి. ప్రసన్న వెంకటేష్‌తో కలసి మంత్రి సుచరిత ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మట్లాడుతూ అజిత్‌సింగ్‌ ‌నగర్‌లో 28.50లక్షలతో నిర్మించిన సిహెచ్‌ ‌రాఘవచారి పార్కును, రాజీవ్‌నగర్‌లో రూ.26 లక్షలతో నిర్మించిన తెలుగు తల్లి పార్కును, కండ్రికల్లో  రూ.37.8 లక్షలతో నిర్మించిన సెంట్రర్‌ ‌లైంటింగ్‌ను ఈ రోజు ప్రారంభించామని, ఇంకనూ  నగర అభివృద్దికి అనేక ప్రణాళికలు సిద్దం చేశామని మంత్రి అన్నారు. విజయవాడ నగరాన్ని రూ.600 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని, విజయవాడ నగరాభివృద్ది పై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మెహన్‌రెడ్డి ప్రత్యేక శద్ద వహిస్తున్నారని మంత్రి అన్నారు. నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా పార్కులను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. నగరంలో డ్రెయిన్‌ల నిర్మాణం త్రాగునీటి సరఫరా మొదలగు మౌలిక సదుపాయలకు ప్రాధాన్యత ఇస్తూన్నామని మంత్రి అన్నారు. నగరంలో నివసిస్తున్న వేలాదిమంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని మంత్రి అన్నారు. రానున్న రోజులో విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ది చేసి దేశంలోనే ముఖ్య నగరాల్లో ఒకటిగా నిలుపుతామని మంత్రి అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేసి పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూందని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ సమావేశంలో పోలిస్‌, ‌మున్సిపల్‌ ‌శాఖాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. 

Vijayawada

2021-02-08 21:15:10

ఫేజ్-1లో 10 లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు..

తూర్పుగోదావరి జిల్లాలో ఫేజ్-1 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంగళవారం అత్యధికంగా సుమారు 10 లక్షల మంది ఓటర్లు పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఫేజ్- 1 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 9 వ తేదీన జరుగు పోలింగ్ ప్రక్రియకు సోమవారం పెద్దాపురం మండలానికి సంబంధించిన మహారాణి కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ పోలింగ్ సిబ్బందితో  మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రిజర్వ్ సిబ్బంది విధుల్లో కొనసాగాలని తెలిపారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు-2021లో భాగంగా జిల్లాలో ఫేజ్ -1 కింద  పెద్దాపురం,  కాకినాడ డివిజన్లలో 20 మండలాల్లో మంగళవారం  ఉదయం 6.30 గంటల నుండి 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఫేజ్-1 ఎన్నికల్లో 366 గ్రామ పంచాయితీలకు గాను 336 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, సుమారు 10 లక్షల మంది ఓటర్లు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఫేజ్ -2 ప్రక్రియకు సంబంధించి ఈరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఫేజ్- 3 కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఫేజ్-1 ఎన్నికల్లో సుమారు 13000 మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించడం జరిగిందని, వీటికి సంబంధించి మైక్రో అబ్జర్వర్లు, విడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ రోజున జాయింట్ కలెక్టర్లు, డివిజనల్ అధికారులు సమస్యాత్మక గ్రామాల్లో  పోలింగ్ ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందని, పోలీసుశాఖ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిష్పక్షపాత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశానికి ముందు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది హాజరు నమోదు చేసే కౌంటర్ ను, సిబ్బందికి ఏర్పాటు చేసిన టిఫిన్, భోజనం కౌంటర్లను పరిశీలించారు.         ఈ పరిశీలనలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, ఎంపిడివో ఎ.రమణారెడ్డి, తహశీల్దార్ బి.శ్రీదేవి, డీఎల్ పీవో వై. అమ్మాజీ, ఈవోపీఆర్డీ హిమ మహేశ్వరి, పోలింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-02-08 20:46:23

తడి, పొడి చెత్తను వేరుగా ఇచ్చేలా చూడాలి..

తడి చెత్త, పొడి చెత్తను ప్రజలు వేరు చేసి ఇచ్చే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డా. వి సన్యాసిరావు అధికారులు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా, 5వ జోన్ పరిధిలోని 61వ  వార్డులోని చిన్నగంట్యాడ, చైతన్య నగర్, జడ్పీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాలువలను, డ్రైన్స్ ను శుభ్రం చేయాలని, రోడ్డుపై ఉన్న చెత్తలను వెంటవెంటనే వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించాలని, శానిటరీ ఇన్ స్పెక్టరు ను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను సేకరించే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం, చెత్త తరలించే వాహనాలకు వెహికల్ ట్రాక్స్ ను పరిశీలించారు. ఈ  పర్యటనలో 61వ వార్డు శానిటరి ఇన్ స్పెక్టరు,  వార్డు శానిటరీ  కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-02-08 20:44:10

మావోయిస్టు ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తిచేయాలి..

ఏజెన్సీలో మావోయిస్టు ప్ర‌భావిత పంచాయ‌తీల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని క్షేత్ర‌స్థాయి ఎన్నిక‌ల అధికారుల‌కు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి సూచించారు. ఆయా ప్రాంతాల్లో మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే పోలింగ్ జ‌రుగుతుంద‌నే విష‌యంపై విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌న్నారు. సోమ‌వారం జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జిల్లాస్థాయి అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో మూడో విడ‌త ఎన్నిక‌లు జ‌రిగే రంప‌చోడ‌వ‌రం, ఎట‌పాక డివిజ‌న్ల‌లో స‌న్న‌ద్ధ‌త‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పోలింగ్ కేంద్రాల మార్పు, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు; పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేప‌ర్లు, ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌న త‌దిత‌ర అంశాల‌పై స‌న్న‌ద్ధ‌త ప్ర‌ణాళిక‌ను 11  మండ‌లాల ఎంపీడీవోల నుంచి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల మార్పుపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌక‌ర్యం ఉండేలా చూసుకోవాల‌న్నారు. మండ‌ల స్థాయిలో రిసోర్స్ ప‌ర్స‌న్ల ద్వారా ప్రిసైడింగ్‌, స‌హాయ ప్రిసైడింగ్ అధికారుల‌కు పూర్తిస్థాయి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు పంపే వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. దూర ప్రాంతాలు కాబ‌ట్టి ఎన్నిక‌ల సామ‌గ్రి కొర‌త లేకుండా చూసుకోవాల‌ని సూచించారు. చివ‌రి క్ష‌ణంలో ఇబ్బందులు త‌లెత్త‌కుండా ర‌వాణాకు సంబంధించి ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ‌స‌‌మావేశంలోరంప‌చోడ‌వ‌రం ఐటీడీఏ పీవో ప్ర‌వీణ్ ఆదిత్య‌, చింతూరు ఐటీడీఏ పీవో ఎ.వెంక‌ట‌ర‌మ‌ణ‌, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డివిజ‌న్‌, మండ‌ల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-02-08 20:37:59

చక్కగా ఎన్నికల విధులు నిర్వహించాలి..

అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న తొలివిడత గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కదిరి డివిజన్ లోని నల్ల చెరువు మండలంలో పర్యటించారు.  ముందుగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తిచేసుకుని చేసుకుని భోజనాలు చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు. పంపిణీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భోజన వసతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యాకేజ్డ్ ఆహారమే అందుతోందా, మండల అధికారులు ఉద్యోగులు ఉన్న చోటికే ఆహారం మరియు ఎన్నికల సామాగ్రి అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. భోజన వసతులు బాగున్నాయని ఉద్యోగులు చెప్పినప్పటికీ వారికి అందించిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని పాఠశాల అవరణంలోని మండల వనరుల కేంద్ర భవనంలో రుచి చూసారు.  పోలింగ్ విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో మండల కేంద్రాల్లోని పంపిణీ కేంద్రాల వద్ద మరియు పోలింగ్ కేంద్రాల వద్ద అన్నిరకాల వసతులు కల్పించామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పింఛన్లు అవ్వా, తాతల దగ్గరికి వెళ్లి ఇచినట్టుగా ఉద్యోగుల దగ్గరికే సామాగ్రి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉద్యోగులు కూడా ఓటర్ ఫ్రెండ్లీ ఎన్నికలే ధ్యేయంగా పని చేయాలన్నారు. విజయవంతంగా పోలింగ్ పూర్తి చేయాలని కోరుతూ.. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.  ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ, పబ్లిక్ ఫ్రెండ్లీ ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. పోలింగ్ సమయం పెంపు  పోలింగ్ సమయాన్ని ఉదయం 6.30 గంటల నుంచే మొదలు పెట్టి సాయంత్రం 3.30 గంటల వరకూ కొనసాగిస్తామన్నారు. ఇది గతంలో కేటాయించిన పోలింగ్ సమయం కంటే మూడు గంటలు ఎక్కువన్నారు. అలాగే వలసలు ఎక్కువగా ఉండే కదిరి డివిజన్ లో వారిని తిరిగి రప్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.  పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనంతరం నల్ల చెరువు మండలంలోని ఎర్రగుంట పల్లి(తలమర్ల వాండ్ల పల్లి గ్రామ పంచాయితీ) గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన వసతులు తొందరగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఓటింగ్ ప్రక్రియకు గానీ, ప్రజలకు గానీ చిన్న ఇబ్బంది కూడా రాకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లపై అధికారులను ప్రశ్నించారు. కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు, కేంద్రంలో వసతుల ఏర్పాట్లు పోలింగ్ మొదలయ్యే సమయానికి సిద్ధం చేసుకుని ఉండాలని   కలెక్టర్ ఆదేశించారు. 

Anantapur

2021-02-08 20:35:36

ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతం..

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు  మంగళ వారం జరగనున్న మొదటి విడత పోలింగుకు ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతంగా జరిగింది. మొదటి విడత ఎన్నికలు జరనున్న ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల ప్రధాన కేంద్రాలలో మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం నుండి ప్రారంభించారు. విధులకు హాజరు కావలసిన మండలాలకు పోలింగు సిబ్బంది చేరుటకు సోమ వారం ఉదయం 5 గంటల నుండి ఆర్.టి.సి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్ ఇతర అధికారులు సామగ్రి పంపిణీని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అన్న మండలాల్లో పంపిణీ కార్యక్రమం సజావుగా, సక్రమంగా జరిగింది.         ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఏకగ్రీవాలు మినహాయించగా 282 గ్రామ పంచాయతీలలో పోలింగు జరుగుతుందని ఆయన చెప్పారు. మద్యం దుకాణాలను కౌంటింగు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అభ్యర్ధులు ప్రచార కార్యక్రమాలను 44 గంటలు ముందుగా నిలిపివేయాలని పేర్కొన్నారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డా.కరుణాకర రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-02-08 19:59:39

ప్రభుత్వ నిబంధనల మేరకే ఎన్నికలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కోవిడ్ నియమ నిబంధనల అనుసరించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 9 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా చిత్తూరు డివిజన్ కు సంబంధించి 20 మండలాలలోని 342 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో 468 గ్రామ పంచాయతీలకు గాను వివిహ కారణాల వలన 14 పంచాయతీలకు, 138 వార్డులకు ఎన్నికలు నిర్వహించబడడం లేదు. కాగా 454 గ్రామ పంచాయతీలకు మరియు 4,142 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించవలసి ఉండగా అందులో 112 గ్రామ పంచాయతీలు, 2,635 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినందున మిగిలిన 342 సర్పంచ్ లకు మరియు 1,507 వార్డు మెంబర్ లకు మంగళవారం నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతలో 342 సర్పంచ్ స్థానాలకు గాను 925 మంది, 1,507 వార్డ్ మెంబర్ల స్థానాలకు గాను 2,928 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 2,241 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 355 అత్యంత సమస్యాత్మక మరియు 401 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 137 మంది మైక్రో అబ్జర్వర్లను, 117 వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందని మరియు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3,672 పెద్దవి, 1,901 చిన్న బ్యాలెట్ బాక్స్ లను ఇప్పటికే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నాయని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు స్టేజ్ – 1 కు 98 మంది ఆరో లు, స్టేజ్ – 2 కు 454 మంది ఆర్ఓ లను, 2609 మంది పోలింగ్ అధికారులు, 4,282 మంది ఓపిఓ లను, 86 మంది జోనల్ ఆఫీసర్లను, 127 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 182 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 20 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కోవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి 8,964 మాస్కులు, 2,241 లీటర్ల హ్యాండ్ స్యానిటైజర్లు, 27,500 హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని ఎంపిడిఓ లకు సమకూర్చడం జరిగిందన్నారు.  మొదటి విడత ఎన్నికలను ఉదయం 6.30 గం. ల నుండి మ.3.30 గం. ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ వెంటనే ఓట్ల లెక్కింపుకు సంబంధించి 342 మంది సూపర్ వైజర్లు, 684 మంది కౌంటింగ్ స్టాఫ్ ను నియమించడం జరిగిందన్నారు.  

Chittoor

2021-02-08 19:56:16

దేశం గర్వించే స్థాయికి యువత ఎదగాలి..

దేశం గర్వించే స్థాయికి యువత ఎదగాలని ఆంధ్రాయూనివర్శిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని వచ్చిన విద్యార్థులను ఆయన తన కార్యాలయంలో అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో గర్వకారణమన్నారు. ఇటువంటి అరుదైన అవకాశాలు విద్యార్థి దశలో లభించడం చిరాస్థాయిగా గుర్తుంటాయన్నారు. ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలను స్ధిరపరచుకుని వాటిని సాధించే దిశగా ప్రయత్నించాలన్నారు. తమ ప్రతిభతో వర్సిటీకి, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చే దిశగా పాటు పడాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సమన్వయకర్త ఆచార్య ఎస్‌.‌హరనాథ్‌, ‌పెరేడ్‌లో పాల్గొన్న విద్యార్థులు డి.యువరాజ్‌, ‌బి.అనీల్‌ ‌కుమార్‌, ‌బి.గాయత్రి తుషార, బి.ఏంజిలీనా, ఎం.భావన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరేడ్‌ ‌విశేషాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Andhra University

2021-02-08 19:41:44

అనంతలో పోలింగ్ సమయం పెంపు..

అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీలలో నాలుగు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్  నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా  గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ నిర్వహించాలని  రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  పెరిగిన పోలింగ్ సమయాన్ని  గమనించి ,  కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రజలు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవలసిందిగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

Anantapur

2021-02-07 20:41:30

500 మంది పీఓలకు నోటీసులు..

అనంతపురం జిల్లాలోని కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించే తొలి దశ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరుకాని 500 మందికి పైగా పిఓలకు కదిరి ఆర్డీవో మరియు డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ వెంకటరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శిక్షణ తరగతులకు హాజరు కాని పీఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎన్నికల విధులకు హాజరు కాకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కదిరి ఆర్డీవో మరియు డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ హెచ్చరించారు. ఎన్నికల విధులకు కేటాయించిన పీఓలు, ఇతర సిబ్బంది ఖచ్చితంగా వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలని సూచించారు.

కదిరి

2021-02-07 18:05:13

అన్ని ఏర్పాట్లతో పోలింగ్ కి సిద్దంగా ఉండాలి..

విశాఖ జిల్లాలో అన్ని ఏర్పాట్లతో పోలింగ్ కు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటి వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  అనకాపల్లి డివిజన్ కు సంబంధించి ఆయా నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్థార్, ఎంపిడిఓలతో పోలింగ్ ఏర్పాట్లపై ఆయన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ప్రతి మండలంలోని ఎంపిడిఓలు, మండల స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.  పోలింగ్ సిబ్బంది ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు.  ప్రతి రిటర్నింగ్ అధికారి, ప్రెసైడింగ్ అధికారులతో సిబ్బందితో సమీక్షించుకోవాలన్నారు.  పోలింగ్ మెటీరియల్ జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్య సమస్యలు ఉంటే అందుబాటులోని 108, 104 వాహనాలు ఉంటాయని, కోవిడ్ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.  పోలింగ్ కేంద్రాల వారీగ మెటీరియల్ పెట్టుకోవాలని, రవాణా వాహనాలు సిద్దం చేసుకోవాలని వివరించారు.  భోజన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  పోలింగ్ పూర్తి అయినంత వరకు రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఏ విధమైన తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని, పోస్టర్లు, ప్రలోబాలు, తదితరమైనవి లేకుండా చూసుకోవాలని చెప్పారు. తహసిల్థార్లు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్,అంతరాయం లేకుండా చూసుకోవాలని, మరుగుదొడ్లు, త్రాగునీరు, తదితరమైనవన్ని చూసుకోవాలని తెలిపారు.  అభ్యర్థుల జాబితాను డిసిప్లే, తదితరమైనవి మండల ప్రత్యేక అధికారులు, ఎంపడిఓలు ఛూసుకోవాలని చెప్పారు.  పోలింగ్ సిబ్బంది తప్పనిసరిగా, సమయానికి హాజరు కావాలని, హాజరు కాకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రవాణా సౌకర్యంనకు ఆర్టిసి బస్సులు కాకుండా అదనంగా వాహనాలు ఉంటాయని, వాటిని అవసరానికి వినియోగించుకోవచ్చునని చెప్పారు.  మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు మండల స్థాయిలో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. రిసెప్షన్ కేంద్రాలకు పోలింగ్ అయిన మెటీరియల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అందిన తర్వాతే సిబ్బందిని పంపాలన్నారు.   ఆర్.ఓ.లు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.  కౌంటింగ్ లో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలన్నారు.  కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ పత్రాలను సబ్ ట్రజరీలో భద్రపరచాలన్నారు.  బస్సులను గుర్తించే విధంగా స్టిక్కర్లు, సంఖ్యను వేయాలని చెప్పారు.   కౌంటింగుకు సంబంధించి పలు సూచనలు చేశారు.  పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్లలోపు ఇతరులు ఎవరూ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఎన్నికల సిబ్బందితో పాటు బస్సులలో ప్రయాణించాలని చెప్పారు.  పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి, బ్యాలెట్ పత్రాలను సబ్ ట్రజరీలో భద్రపరిచే వరకు ప్రతి విషయంలోను స్పష్టతతో నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు.  పోలింగ్ 44 గంటల ముందు నుండి ప్రచారాలు జరుగరాదని, దీన్ని పరిశీలించాలని, డబ్బు, మద్యం పంపిణీలు జరుగకుండా తహసిల్థార్లు, ఇన్ స్పెక్టర్లు పరిశీలించాలని పేర్కొన్నారు.   జిల్లా జాయింట్ కలెక్టర్-1 ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది, పోలింకు కేంద్రాలు సరిపోయిన సిబ్బంది శిక్షణ ఇవ్వడమైనదన్నారు.  సిబ్బంది హాజరు తీసుకోవాలని చెప్పారు.  పోలింగ్ మెటీరియల్ ఇప్పటికే మండలాకు సరఫరా చేయడమైనదని, తెలిపారు.  సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో సూక్ష్మ పరిశీలకులు ఉంటారని, మాక్ పోలింగ్ చేసినపుడు వీడియో తీయాలని చెప్పారు.   జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది, మెటీరియల్ తీసుకువెల్లేందుకు 304 ఆర్.టి.సి. బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  బస్సులు వెళ్లని ప్రాంతాలకు టాటా మ్యాజిక్ లు ఏర్పాటు చేయడమైనదని, ప్రతి మండలానికి అదనంగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  అవసరాన్ని బట్టి వాటిని వినియోగించుకోవాలన్నారు.     వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్-3 ఆర్. గోవిందరావు, డిఆర్ఓ ఎ. ప్రసాద్, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, జడ్పి సిఇఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, వ్యవసాయశాఖ జెడి లీలావతి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి డి.వి. రమణమూర్తి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ఉప కమీషనర్ టి. శ్రీనివాసరావు, డిఇఓ లింగేశ్వర్ రెడ్డి, ఎస్ఎస్ఎ పిఒ మళ్లిఖార్జున రెడ్డి, ఎపిఐఐసి జిఎం రామలింగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-07 17:07:49

పచ్చదనం పెంపులో భాగస్వాములు కండి..

ప‌్ర‌తి ఒక్క‌రూ ‌త‌మ‌వంతు బాధ్య‌త‌గా పెద్ద ఎత్తున మొక్క‌లు నాటి వాటి సంర‌క్ష‌ణపై కూడా శ్ర‌ద్ధ వ‌హిస్తే జిల్లాను హ‌రిత వ‌నంగా రూపొందించవ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. మొక్క‌లు, ప‌చ్చ‌ద‌నంతోనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌తను కాపాడ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. హ‌రిత‌విజ‌య‌‌నగ‌రం కార్య‌క్ర‌మంలో భాగంగా భోగాపురం మండ‌లం రాజాపులోవ గ్రామంలోని ఒల‌వ‌రాజు చెరువు గ‌ట్టుపై మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ నేతృత్వంలో ఆదివారం తెల్ల‌వారుఝామున చేప‌ట్టారు. మండ‌ల అధికారులు, స‌చివాల‌య ఉద్యోగులు, వలంటీర్లు, ఉపాధిహామీ వేత‌న‌దారులు, రెడ్‌క్రాస్ సంస్థ స‌భ్యులు, గ్రామ‌స్థులంతా ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద ఎత్తున పాల్గొని 200 కోనా కార్ప‌స్ మొక్క‌ల‌ను చెరువుగ‌ట్టుపై నాటారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మొక్క‌లు నాట‌డంతోపాటు అన్ని మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేసి గ్రామ‌స్థులే మొక్క‌లు పెంప‌కంలో బాద్య‌త వ‌హించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా జిల్లా కలెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెల్ల‌వారుఝామున చేరుకొని సుమారు గంట‌కుపైగా మొక్కలు నాటే కార్య‌క్ర‌మంలో హ‌రిత విజ‌య‌న‌గ‌రం బృందం స‌భ్యులు జిల్లా సామాజిక అట‌వీ అధికారి జాన‌కిరావు, డా.వెంక‌టేశ్వ‌ర‌రావు, రామ్మోహ‌న్ త‌దిత‌రుల‌తో క‌ల‌సి పాల్గొన్నారు. కార్య‌క్ర‌మానికి అవ‌స‌ర‌మైన‌ మొక్క‌ల‌ను అంద‌జేసిన మొద‌ల‌వ‌ల‌స గ్రామానికి చెందిన‌  వై.కృష్ణ అనే వ్య‌క్తిని జిల్లా క‌లెక్ట‌ర్ అభినందించారు. భోగాపురం మండ‌ల త‌హ‌శీల్దార్ రాజేశ్వ‌ర‌రావు, ఎంపిడిఓ బంగార‌య్య‌, ఉపాధిహామీ ఏపిఓ ఆదిబాబు, హ‌రిత విజ‌య‌న‌గ‌రం స‌భ్యులు ఎం.ర‌మేష్‌బాబు, వి.నాని, ఎస్‌.గోపి, వి.స‌త్యారావు, జిల్లా ఆర్‌.ఎం.పి. అసోసియేష‌న్ ప్ర‌తినిధులు గౌరినాయుడు, చిరంజీవి తదిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-07 16:59:35

ఎన్నికల సంఘం నిబంధనలు అమలు చేయాలి..

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లుచేయాల‌ని.. అదే విధంగా సున్నిత‌, అత్యంత సున్నిత ప్రాంతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో క‌లిసి క‌లెక్ట‌ర్‌.. రెండో ద‌శ ఎన్నిక‌లు జ‌రిగే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, రామ‌చంద్రాపురం డివిజ‌న్ల ప‌రిధిలోని అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పోలింగ్ కేంద్రాల మార్పులపై వ‌చ్చే అభ్యంత‌రాలు, వాటి ప‌రిష్కారం; ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు; పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సౌక‌ర్యాలు త‌దిత‌ర అంశాల‌పై స‌న్న‌ద్ధ‌త ప్ర‌ణాళిక‌ను 15 మండ‌లాల ఎంపీడీవోల నుంచి అడిగి తెలుసుకున్నారు. సున్నిత‌, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల నియామ‌కం, వీడియోగ్ర‌ఫీల‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. మండ‌ల స్థాయిలో రిసోర్స్ ప‌ర్స‌న్ల ద్వారా ప్రిసైడింగ్‌, స‌హాయ ప్రిసైడింగ్ అధికారుల‌కు పూర్తిస్థాయి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు. పోలింగ్‌, కౌంటింగ్ కేంద్రాల‌ను నిశితంగా ప‌రిశీలించి.. ఇంకా చేయాల్సిన ఏర్పాట్లు ఏవైనా ఉంటే వెంట‌నే పూర్తిచేయాల‌ని, విద్యుత్‌, తాగునీరు వంటివాటిపై దృష్టిసారించాల‌న్నారు. ఎన్నిక‌ల సామ‌గ్రి కొర‌త లేకుండా చూసుకోవాల‌ని అదే విధంగా కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌కు అవ‌స‌ర‌మైన థ‌ర్మ‌ల్ స్కాన‌ర్లు, మాస్కులు, శానిటైజ‌ర్ల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. మండ‌ల స్థాయిలో నియ‌మితులైన వ్య‌య పరిశీల‌కుల స‌హాయంతో అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చు ప‌రిమితుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ‌‌ఎన్నిక‌ల్లో పాల్గొనే పంచాయ‌తీరాజ్‌, రెవెన్యూ త‌దిత‌ర విభాగాల సిబ్బందికి కోవిడ్‌-19 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను రెండు రోజుల్లో పూర్తిచేయాల‌ని సూచించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్ అనుప‌మ అంజ‌లి, డివిజ‌న్‌, మండ‌ల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-02-06 21:17:52