"స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ వాయిస్ వినిపించడానికి 20వ తేదీన పాదయాత్ర చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు". మంగళవారం పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈనెల 20వ తేదిన నిర్వహించే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట మహా పాదయాత్రలో నగర ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలన్నారు. మొత్తం 22 కిలోమీటర్లు సాగే పాదయాత్ర నగరంలోని అన్నినియోజకవర్గాలను కలుపుకుంటు యాత్ర కొనసాగుతుందన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు..వైఎస్సార్సీపీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందన్న మంత్రి దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు..స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తాము ముందు ఉండి పోరాడతామన్నారు..మాతో వచ్చే వారిని కలుపుకుంటు ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలు మాతో కలిసి వచ్చే పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలియజేశారు. మేము చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేట్టన్నారు. నారా లోకేష్ కు రాష్ట్ర ప్రయోజనాలు కంటే రాజకీయ ప్రయోజనలు ముఖ్యమన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దీక్ష చేస్తుంటే సంఘీభావం తెలపడానికి వచ్చిన లోకేష్ ప్రక్కనే దీక్ష చేస్తున్న కార్మికులనే కలవలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీకి లేఖ రాయాలన్నారు. చంద్రబాబుకి లేఖ రాసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఓర్పుని టీడీపీ వాళ్ళు పరీక్షించవద్దు హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని ఎదో సాధించాలని చూశారని కానీ దానికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారన్నారే విషయాన్ని టిడిపి గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, బాబురావు ,మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కర్తలు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మొదటి, రెండో విడత కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమంపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయితీ రాజ్, మున్సిపల్ సిబ్బందికి ప్రస్తుతం కోవిడ్-19 వేక్సినేషన్ జరుగుతోందన్నారు. తమ సిబ్బందికి వేక్సినేషన్ వేయించే బాధ్యతను ఆయా శాఖాధిపతులు తీసుకోవాలని, హెచ్ఓడిలకు ఉద్యోగుల జాబితాలను అందజేయాలని సూచించారు. ప్రతీ శాఖకూ నిర్ణీత సమయం, ప్రదేశాన్ని కేటాయించి, వారికి వేక్సిన్ వేయాలని, దానికి అనుగుణంగా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ నెల 18 నాటికి వేక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మాట్లాడుతూ కోవిడ్ వేక్సినేషన్‌పై మరింత ప్రచారం జరగాలని, సంబంధిత శాఖలకు ముందుగానే సమాచారాన్ని అందజేయాలని సూచించారు. తొలివిడతలో వైద్యారోగ్యసిబ్బంది 17,590 మంది పేర్లు నమోదు చేయగా, ఇప్పటివరకు 11,201 మందికి వేక్సిన్ వేయడం పూర్తయ్యిందన్నారు. రెండోవిడతలో రెవెన్యూ, పంచాయితీరాజ్ సిబ్బంది 21,432 మంది పేర్లు నమోదు చేయగా, వీరిలో ఇప్పటివరకు 6,499 మందికి వేక్సిన్ వేశారన్నారు. మున్సిపల్ సిబ్బంది 4169 మంది పేర్లు నమోదు చేయగా, 1,035 మందికి వేక్సినేషన్ జరిగిందని జెసి తెలిపారు.
సమావేశంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, డిపిఓ కె.సునీల్‌రాజ్‌కుమార్, సిపిఓ జె.విజయలక్ష్మి, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహన్, డిఐఓ డాక్టర్ నారాయణ, యుఎన్‌డిపి కన్సల్టెంట్ కమలాకర్, ఇంకా డాక్టర్ రవికుమార్, డాక్టర్ అశోక్ తదితర అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయం విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ వినూత్నంగా నిరసన తెలియజేస్తూవచ్చింది. ఇపుడు ఏకంగా మరోసారి జనాల్లోకి స్టీలు ప్లాంట్ విషయాన్ని తీసుకెళ్లేందుకు రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ఫిబ్రరి 20న మరో పాదయాత్ర చేపడుతున్నారు. ఈమేరకు 22 కిలోమీటర్లు జరిగే ఈ పాద యాత్రలో విశాఖలోని అన్ని నియోజకవర్గాలను కలుపుకొని ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. 20వ తేదీ ఉదయం 8.30 గంటలకు విశాఖలోని జీవిఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం పాదయాత్ర సాగనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా సిద్దమైంది. ఈ పాదయాత్రకు అన్ని కార్మిక సంఘాలు కూడా సంఘీబావం తెలియజేశాయి. ఈ పాదయాత్ర అనంతరం ప్రధాని నరేంద్రమోడీని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరనున్నారు. స్టీలుప్లాంట్ ప్రైవేటీకరణను నిరశిస్తూ సాగే ఈ పాదయాత్రలో అత్యధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, పలు పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలోని కార్పోరేటర్ అభ్యర్ధులు ఫుల్ జోష్ తో ఉన్నారు. ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న జీవిఎంసి ఎన్నికలకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపడంతో ఎన్నికల హడావిడి మొదలైంది. మార్చి 10 విశాఖ జివిఎంసీకి ఎన్నికలు జరుగుతుండగా, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ మేరకు ప్రకటన జారీ చేయడంతో మహానగరంలోని కార్పోరేటర్ అభ్యర్ధులంతా తమ పనిలో బిజీగా మారిపోయారు. ఈ సుమారు పదేళ్ల తరువాత జీవిఎంసీకి ఎన్నికలు జరుగుతుండటంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభ్యర్ధులు తమ స్థానాన్ని, సీటును పదిల పరుచుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారపార్టీ అభ్యర్ధులు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుంటే ప్రతిపక్షం ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్య పరిచే పనిలో పడింది. ఇప్పటికే వివిధ పనులపై రాష్ట్ర, జిల్లా, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. అందులోనూ జివిఎంసీ శివారు వార్డుల్లో నెలకొన్న సందిగ్దతపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో కార్పోరేట్ అభ్యర్ధులు రంగంలోకి దిగిపోయి తమ తమ వార్డుల్లోని ఓటర్లను ప్రశన్నం చేసుకుంటన్నారు. కొందరు నాయకులు గత సంవత్సరం నుంచే వార్డుల్లోని ప్రధాన సమస్యలను గుర్తిస్తూ...వాటి పరిష్కారానికి కూడా అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేసుకుంటూ వచ్చారు. పంచాయతీ ఎన్నికలు రెండవ దశ పూర్తవుతున్న తరుణంలోనే వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ అభ్యర్ధులకు చేతినిండా పనిచెప్పింది. ఇదే సమయంలో అన్నిస్థానాల్లో అభ్యర్ధులు గెలుపొందడానికి అధిష్టానం ఇప్పటికే దిశానిర్ధేశం కూడా చేయడంతో ఎవరు పనుల్లో వారు బిజీబిజీగా ఓటర్లను ప్రశన్నం చేసుకుంటున్నారు. అధికారికంగా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మార్చి 10 నుంచి 14 వరకూ అధికారిక హడావిడి నెలకొననుంది..!
తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి మార్చి 14న పోలింగ్ జరగనుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ కలెక్టర్ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్‌పి షేముషి బాజ్‌పాయ్, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబుతో కలిసి కలెక్టర్.. ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల స్టాండింగ్ కమిటీ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన మంగళవారం నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి, 24వ తేదీన పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల ఉప సంపహరణకు ఈనెల 26వ తేదీ ఆఖరు తేదీ కాగా, పోలింగ్ మార్చి 14వ తేదీన ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకు జరుగుతుందన్నారు. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మార్చి 22 తేదీకి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు.
రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్:
ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికలకు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారిగా, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కె.వెంకటరమణ, తూ.గో. జిల్లా డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, ప.గో. జిల్లా డీఆర్‌వో ఎస్.శ్రీనివాసమూర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని తక్షణం పరిష్కరించేందుకు వీలుగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఛైర్మన్‌గా స్టాండింగ్ కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు వివిధ విభాగాల జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఉంటారన్నారు.
ఈ నెల 16 నుంచి నామినేషన్లు:
ఎన్నికల్లో పోటీచేయాలనుకునే అభ్యర్థులు కాకినాడలో జిల్లా కలెక్టరు కార్యాలయంలోని కోర్టు హాలులో ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు అన్ని పనిదినాల్లో ఉదయం 11 గం.ల నుంచి మధ్యాహ్నం 3 గం.ల వరకు తమ నామినేషన్లు ఫారం-2ఈ లో దాఖలు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ శెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. అభ్యర్థి నామినేషన్ తో పాటు ఫారమ్-26లో నోటరీ చేయించిన అఫిడవిట్ సమర్పించాలని, అన్ని కాలమ్ లు విధిగా నింపాలన్నారు. నామినేషన్ ను 10 మంది తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాద్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఓటర్లు ప్రతిపాదించాల్సించి ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఫారమ్ – AA, ఫారమ్-BB సమర్పించాలని తెలిపారు. అభ్యర్థి వయస్సు 30 కంటే తక్కువ ఉండకూడదన తెలియజేశారు.
ఈ నెల 5వ తేదీన ప్రచురించిన తుది జాబితా ప్రకారం తూ.గో. జిల్లా పరిధిలో 9,560; ప.గో. జిల్లా పరిధిలో 7,725 వెరసి మొత్తం 17,285 మంది ఓటర్లు నమోదయ్యారని.. ఇప్పటికీ నమోదుకాని, అర్హులైన ఓటర్లు ఈ నెల 23వ తేదీ లోపు ఫారమ్-19 ధరఖాస్తు ఫైల్ చేసి ఓటర్లుగా నమోదు కావచ్చునని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికల నిర్వహణకు తూర్పు గోదావరి జిల్లాలో 67, పశ్చిమగోదావరి జిల్లాలో 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని.. జిల్లా, డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఈ నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎంసీసీ పర్యవేక్షణకు మెప్మా పీడీని నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. ఫ్లయింగ్, స్టాటిక్ సర్వయిలెన్స్ బృందాలతో చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఎస్‌పీల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ ఫారాల సరఫరా, ఇతర సమాచారం, సామగ్రి అందించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ పనిచేస్తుందన్నారు. ప్రజలు సమాచారం కోసం కాల్ సెంటర్ టోల్ ఫీ నెంబరు 1950ను సంప్రదించవచ్చని తెలిపారు... కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ధ్రువీకరణపత్రాలు ఇవ్వని కారణంగా అర్హత ఉన్నప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోలేక పోయారని బీఎస్‌పీ ప్రతినిధి ఎస్.అప్పారావు తెలియజేయగా.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో బి.వెంకటేశ్ నాయుడు (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), ఎస్.అప్పారావు (బీఎస్‌పీ), ఎ.వెంకటేశ్ (బీజేపీ), ఎం.రాజశేఖర్ (సీపీఎం), జి.సాయిబాబు (టీడీపీ), ఆర్.వెంకటేశ్వరరావు (వైఎస్సార్ కాంగ్రెస్), కాకినాడ కలెక్టరేట్ ఎన్నికల డీటీ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
నాడు- నేడు క్రింద పాఠశాలలలో చేపడుతున్న పనులను నాణ్యత తో పూర్తి చేయాలని మరియు పాఠశాలలలో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష శాఖల ఆధ్వర్యం లో మనబడి, నాడు-నేడు కు సంబంధించి జిల్లాలో జరుగుతున్న పనులను ఇతర సంబంధిత అంశాలపై ముఖ్య కార్యదర్శి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెట్రి సెల్వి, ఎ.మురళి అడ్వైజర్ (infra), ఏ పి ఈ డబ్ల్యూ ఐ సి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్ లతో కలసి సమీక్ష నిర్వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీర బ్రహ్మం, కడప ఆర్జెడి వెంకట కృష్ణా రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ వెంకటరమణా రెడ్డి, డిఈఓ నరసింహారెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్సీలు అమర్నాథ్ రెడ్డి, విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ పద్మనాభం, ఎం ఈ ఓ లు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు సమీక్ష లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలలో భాగంగా నీటి వసతి తో కూడిన మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు, త్రాగునీటి సరఫరా, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ కు ఫర్నిచర్ ఏర్పాటు, పెయింటింగ్, మేజర్ మరియు మైనర్ రిపేర్స్, బ్లాక్ బోర్డ్స్, ఇంగ్లీష్ లాబ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలో నాడు- నేడు కింద 1533 పాఠశాలలలో చేపట్టిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. నాడు- నేడు క్రింద రెండవ దశలో చేపట్టే పనులను 2021 , ఏప్రిల్ 01 నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. నాడు - నేడు క్రింద చేపట్టే పనులను వేగవంతం చేసేందుకు సచివాలయాలలో గల ఇంజనీర్ లను భాగ స్వామ్యులను చేయాలని తెలిపారు. పాఠశాలల రూపు రేఖలను మార్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహణ జరిగేలా మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుచున్నదని తెలిపారు. నాడు-నేడు పనులలో వేగవంతం చేసేందుకు ఎం. ఈ. ఓ లు, ఇంజనీర్లు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. పాఠశాలల్లో అన్నీ మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుచున్నదని, ఉపాధ్యాయులు విద్యాప్రమాణాల పెంపు పై దృష్టి సారించాలని, ఈ దిశగా ఎం.ఈ.ఓ లు కృషి చేయాలని తెలిపారు. ప్రతి పాఠశాలకు ర్యాంకింగ్ ఇచ్చే విధంగా అకడెమిక్ పర్ఫార్మన్స్ ను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో భాగంగా నాడు-నేడు క్రింద చేపట్టిన పనులను సంబందింత వెబ్ సైటు నందు అప్ లోడ్ చేయుట లో గల టెక్నికల్ ప్రాసస్ కు సంబందించిన సందేహాలు , సందేహాలపై అడ్వైజర్స్ (infra) మురళి నివృత్తి చేశారు.
జిల్లాలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని ప్రాథమిక విద్య పైన దృష్టి సారించి సత్ఫలితాలు తీసుకుని వచ్చేందుకు అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం జరుగుచున్నదని, నాడు-నేడు క్రింద చేపట్టిన పనులను పూర్తి నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ముఖ్య కార్యదర్శికి వివరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ ఐసి భవనం నుంచి సోమవారం సాయంత్రం జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది తో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ (రెవెన్యూ & రైతు భరోసా) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మొదటి, రెండో దశ ఎన్నికల కంటే మిన్నగా మూడో దశ గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోలింగ్ అధికారులు నిబంధనల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. చెల్లని ఓట్లు ఏవి, రీకౌంటింగ్ ఎప్పుడు ఎలా చేయాలి లాంటి అంశాల గురించి స్పష్టత లేకపోతే పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి, పోలింగ్ ఏజెంట్ల నుంచి సమస్యలు ఎదురవుతాయన్నారు. పోలింగ్ సరళి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంపై రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు దృష్టి సారించాలన్నారు. గంటకోసారి అందాల్సిన పోలింగ్ సరళి రిపోర్టు 15 నిమిషాల కంటే ఆలస్యం కాకూడదన్నారు. కేవలం పోలింగ్ సమాచారాన్ని అందించడానికే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలని ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డిని ఆదేశించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలోని ఓటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వద్ద పోలీసు వారి సహాయంతో బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే విధానం గురించి పోలింగ్ అధికారులకు వివరించారు. వీలైనంత తొందరగా కౌంటింగ్ పూర్తి చేసి సాయంత్రం 9.30 గంటల లోపు సర్పంచ్ ఎన్నిక, ఉప సర్పంచ్ ఎన్నికను ప్రకటించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు నిబంధనల గురించి స్పష్టత కలిగి ఉండి కాన్ఫిడెంట్ గా వ్యవహరిస్తే ఏజెంట్లు, అభ్యర్థులు సమస్యలు సృష్టించే అవకాశం ఉండదన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ (ఆసరా&సంక్షేమం) ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసుకోవాల్సిన విధానం గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు మండల స్థాయిలో గ్రామ పంచాయితీ వారీగా, పోలింగ్ కేంద్రం వారీగా ఎన్నికల సామాగ్రిని విభజన చేసుకుని పోలింగ్ అధికారులకు పంపిణీ చేయాలన్నారు. ప్యాకేజ్డ్ ఆహారంతో పాటు కనీసం రెండు నీళ్ల బాటిళ్లను ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగులలో అందించాలన్నారు. పోలింగ్ అధికారులకు వారికి అందాల్సిన సామాగ్రి గురించి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి సరిచూసుకునే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్ అధికారులకు విధుల్లో పాల్గొన్నందుకు ఇచ్చే పారితోషికాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే వేస్తున్నందున డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దే అందరి ఖాతాల వివరాల సేకరణ పూర్తి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, జిల్లా పరిషత్ సి ఈ ఓ శోభా స్వరూపరాణి, డిపిఓ పార్వతి, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ నేతృత్వంలో చేపడుతున్న పచ్చదనం పెంచే కార్యక్రమాల పట్ల రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి( విజిలెన్స్) డా. గోపీనాథ్ ఆసక్తి కనబరిచారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం చేపడుతూ అన్నీ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడాన్ని ప్రశంసించారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయం సందర్శనకు వచ్చిన ఆయనకు జిల్లా సామాజిక అటవీ అధికారి జానకి రావు, హరిత విజయనగరం సమన్వయ కర్త రామ్మోహన్ సోమవారం కలసి జిల్లాలో చేపడుతున్న పచ్చదనం కార్యక్రమాలపై వివరించి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఒక సచిత్ర నివేదిక నీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్క్వాడ్ అటవీ అధికారి సూర్యనారాయణ పడాల్, సబ్ డి.ఎఫ్.ఓ. బి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని ఈనెల 17వ తేదీన పాడేరు డివిజన్ లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు హాజరయ్యే సిబ్బంది సౌకర్యం నిమిత్తం మంగళవారం 80 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు వెళ్లేందుకు ఎలమంచిలి, చోడవరం, నర్సీపట్నం ల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఉచితంగా తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ నుండి 27 ఆర్టీసీ బస్సులు బయలుదేరుతాయన్నారు. విశాఖపట్నం అర్బన్, గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల నుండి వచ్చే వారు తెల్లవారు జామున 4-00 గం. ల నుండి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించారు. అదేవిధంగా అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల వారికి అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం నుండి చోడవరం, బుచ్చయ్యపేట, కే. కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, మండలాల వారికి చోడవరం బస్ స్టేషన్ నుండి ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల వారి సౌకర్యార్థం యలమంచిలి గురప్ప కళ్యాణ మండపం వద్ద నుండి బస్సులు జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట డుంబ్రిగుడ అరకు అనంతగిరి లకు వేర్వేరు రూట్లలో బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అనకాపల్లి నుండి అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల వారికి అరకు, అనంతగిరి మండలాలకు, ఎస్.కోట నుండి అనంతగిరి,అరకు, పాడేరు లకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు., ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన ఆయన కోరారు.
విశాఖ ఏజెన్సీలోని పాడేరు డివిజన్ లో ఈ నెల 17వ తేదీన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారు ఉదయం కలెక్టరు, 17వ తేదీన పాడేరులో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పాడేరులో ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 గం ల వరకు జరుగు పోలింగ్ కు సిబ్బంది రవాణా కు బస్సులను ఏర్పాటు గావించాలన్నారు. అక్కడ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు, సమస్యలను దృష్టిలో వుంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల డ్యూటీలు వేసిన సిబ్బంది డ్యూటీ వివరాలు,రవాణా ఏర్పాట్ల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. సిబ్బంది రవాణా విషయములో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బస్సులు బయలుదేరు పాయింట్లు :
1.ఎ.యు ఇంజనీరింగ్ కాలేజి, విశాఖ, ఎన్.టి.ఆర్. స్టేడియం, 2 గవర్నమెంటు డిగ్రీ కాలేజి, చోడవరం 3. గుర్రప్ప కళ్యాణీ మండపం,యలమంచిలి. పై పాయింట్లు నుంచి బస్సులు ఉదయం 4 గం .లకు బయలు దేరాలన్నారు. బస్సులపై ఎక్కడికి వెళ్లేది స్పష్టంగా కనపడే విధంగా స్టిక్కరింగ్ చేయాలన్నారు. పబ్లిక్ ఎడ్రస్ సిస్టమ్ ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు. అక్కడ సిబ్బందికి కాఫీ, టీ,స్నాక్స్, త్రాగునీరు, టయ్ లెట్స్, మెడికల్ క్యాంపు ఏర్పాట్లు గావించాలన్నారు. ఏజెన్సీ 11 మండలాల యం.పి.డి.ఒ.లకు ఏర్పాట్ల వివరాలను తెలియజేయాలన్నారు. ఏజెన్సీ 11 మండలాల నుండి సిబ్బంది రవాణా వివరాలను కూడా తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు, పి.ఒ. ఐ.టి.డి.ఎ. నోడల్ అధికారులు , జెడ్ పి.సి.ఇ.ఒ., డి.పి.ఒ. లు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్(ఐపిఆర్‌ఎస్), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డిపిఐఐటి) సంయుక్త నిర్వహణలో పేటెంటింగ్ విధానంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. భారత ప్రభుత్వ కామర్స్, ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, టర్న్ఐపి దీనికి సహకారం అందిస్తున్నాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.‘ వేలిడేటింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ పేటెంట్‌బులిటి యూజింగ్ గ్లోబల్ పేటెంట్ డేటాబేస్’ అంశంపై ఈ శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. ఏయూలో నెలకొల్పిన ఐపిఆర్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ నూతన కార్యక్రమాన్ని వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. తద్వారా పేటెంట్‌లు పొందే విధానంపై విద్యార్థులకు, ఆవిష్కర్తలకు అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, డిపిఐఐటి-ఐపిఆర్ చెయిర్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్.పురుషోత్తం ,ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్ సిఈఓ రవి, వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ సిఈఓ ఆదిత్య సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో పిఎంజిఎస్ వై క్రింద మంజురైన రహదారులకు సంబంధించిన అటవీ క్లియరెన్స్ లన్ని త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ సోమవారం శ్రీకాకుళం, విజయనగర, వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పి ఎం జి ఎస్ వై రహదారుల పురోగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో 15 రహదారులు ఈ పధకం క్రింద మంజూరు కాగా పనులు పురోగతి లో ఉన్నాయని వివరించారు. అటవీ క్లియరెన్స్ కోసం కొన్ని పి సి సి ఎఫ్ వద్ద, మరి కొన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ స్థాయి లోను పెండింగ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18 నాటికీ ప్రతిపాదనలను పంపించడం జరుగుతుందన్నారు. అప్లోడ్ చేయవలసినవన్ని ఈ రోజే చేయడం జరుగుతుందన్నారు. అటవీ భూముల పరిహారం క్రింద ఇవ్వవలసిన భూమిని విజయనగరం, పాచిపెంట, కొమరాడ మండలాల్లో గుర్తించడం జరిగిందని, ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాద్, రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, పంచాయతి రాజ్ ఎస్.ఈ గుప్త, ఈ ఈ విజయకుమార్ తదితరులుపాల్గొన్నారు.
విజయనగరం డివిజన్లో ఈ నెల 17న జరగనున్న పంచాయతి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి 3వ రాండమైజేషణ్ ద్వారా సోమవారం పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఎన్.ఐ.సి లో వ్యయ పరిశీలకులు సందీప్ కృపాకర్, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఈ రాండమైజేషణ్ ద్వారా పోలింగ్ అధికారులు, అదర్ పోలింగ్ అధికారులు , రిజర్వు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. 3వ దశ లో 9 మండలాల్లో జరగ నున్న 2402 పోలింగ్ కేంద్రాలకు గాను పి .ఓ లు, ఓ.పి.ఓలు కలిపి 5189 మందిని నియమించారు. మరో 309 మందిని రిజర్వు లో నియమించారు. వీరందరికీ వెంటనే ఉత్తర్వులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 21 న 10 మండలాల్లో జరగనున్న 4వ దశ పంచాయతి ఎన్నికలకు సంబంధించి 2వ రాండమైజేషణ్ ద్వారా ఎన్నికల సిబ్బందికి మండలాలను కేటాయించారు.ఈ దశ లో 2793 పోలింగ్ కేంద్రాలకు గాను 6222 ని నియమించారు. మరో 342 మందిని రిజర్వ్ లో ఉంచారు. వీరందరికీ మండలాలను కేటాయించడం జరిగింది. 3వ రాండమైజేషణ్ ద్వారా వీరికి పోలింగ్ కేంద్రాలను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి. కిషోర్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, డి.పి ఓ సునీల్ రాజ్ కుమార్, ఎన్.ఐ.సి డి.ఐ.ఓ నరేంద్ర , సహాయ అధికారి బాలసుభ్రమణ్యం, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం నగరంలోని పెన్నార్ భవన్ లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయం, జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెన్నార్ భవన్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ఆవరణంలో ఎలాంటి అపరిశుభ్రత ఉండరాదని, పరిసరాలను అందంగా ఉంచాలని, చెత్త ఉండకుండా చూసుకోవాలని ఏపిఈడబ్ల్యుసి మరియు సమగ్ర శిక్ష ఈఈని ఆదేశించారు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలపై ఉన్న రాతలను, పోస్టర్లను తొలగించాలని సూచించారు. వెల్ఫేర్ కు సంబంధించిన వివిధ పథకాల బొమ్మలను ప్రహరీ గోడలపై వేయించాలని ఆదేశించారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. కార్యాలయాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపిఈడబ్ల్యుసి మరియు సమగ్ర శిక్ష ఈఈ శివకుమార్, బిసి వెల్ఫేర్ ఈ డి యుగంధర్, సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి, డిఎస్ డి ఈ శ్రీనివాస కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.