అనంతపురం జిల్లాలో భూగర్భ జల నీటి మట్టం గణనీయంగా పెరిగిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది తుఫానుల ప్రభావం వల్ల కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు పదేళ్ల కిందటి స్థాయిలకు చేరుకున్నాయన్నారు. 2020లో సగటు భూగర్భ జల మట్టం 12.29 మీటర్లు కాగా గత పదేళ్లలో ఎప్పుడూ ఇంతపైకి నీటి మట్టం చేరలేదన్నారు. కేవలం 2010లో మాత్రమే భూగర్భం జలం ప్రస్తుత స్థాయి కంటే పైన 9.71 మీటర్లుగా నమోదైందన్నారు. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే నవంబరు నాటికి సగటున 10.77 మీటర్ల పైకి భూగర్భం జలం చేసుకుందన్నారు. 2019 మే నాటితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ జల మట్టం 13.67 మీటర్లపైకి చేరుకుందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 52 శాతం అధికంగా వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో సగటు వర్షపాతం 491.50 మిల్లీమీటర్లు ఉండగా ఈ ఏడాది 747.30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. మొత్తంగా జిల్లాలో 504.80 టీఎంసీల వర్షపు నీరు కురియగా... జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా అందులో 60.58 టీఎంసీల నీరు భూగర్భ జలంగా మారిందన్నారు.
తాడిపత్రి మండలంలోని అవులతిప్పాయ పల్లి గ్రామంలో కేవలం పది సెంటీ మీటర్ల లోతులోనే నీరు లభిస్తోండటం కరువు జిల్లాగా పేరు తెచ్చుకున్న అనంతపురం జిల్లా సస్యశ్యామలంగా మారే దిశగా సాగుతోందని చెప్పేందుకు చిన్న ఉదాహరణ మాత్రమేనన్నారు.
గత ఏడాది మూడు మీటర్ల లోపే నీరు లభించే మండలం జిల్లావ్యాప్తంగా ఒక్కటి కూడా లేదనీ.. ప్రస్తుతం ఐదు మండలాల్లో మూడు మీటర్లలోపే నీరు లభిస్తోందన్నారు. 3 నుంచీ 8 మీటర్లలోపు నీరు లభించే మండలాల సంఖ్య 15 నుంచి 22కు పెరిగిందన్నారు. 8 నుంచి 15 మీటర్లలోపు 16 మండలాలు, 15 నుంచి 30 మీటర్ల లోపు 17 మండలాలు, 30 మీటర్ల కన్నా లోతులో నీరు లభించే మండలాలు 3 ఉన్నాయన్నారు.
విస్తారంగా వర్షాలు కురవడం..అలాగే హెచ్చెల్సీ, హంద్రీనీవాల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో భూగర్భజల పరిస్థితి బాగా మెరుగైందనీ.. రానున్న ఎండాకాలంలో తాగునీటికి, సాగునీటికీ ఇబ్బంది ఉండదని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
జివిఎంసి పరిధిలో గల ఉత్తర నియోజక వర్గంలోగల అర్హులైన పేద లబ్దిదారులకు ప్రభుత్వం నవరత్నాల పధకాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండ్ల పట్టాల పంపిణీ చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. ఆదివారం జిల్లా కలక్టరు వి. వినయచంద్, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనలతో కలిసి ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాల ఫలాలను రాష్ట్రంలోని అర్హులైన అందరికి నవరత్నాల పధకం క్రింద నిరంతరం అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని, ఎన్నికల మేనిఫెస్టో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ వలే నమ్మి పలు సంక్షేమ పనులు చేపదుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రివర్యులు డిశంబర్ 25 తేదిన తూర్పు గోదావరి జిల్లాలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంబించగా, ఈ రోజు నగరంలోని ఉత్తర నియోజక పరిధిలో టిడ్కో పధకంలో ఇండ్లు, అర్హులైన లబ్ది దారులకు ఇండ్ల స్థలాల మంజూరు లేఖను, బి.ఎల్.సి. లబ్దిదారులకు పొజిషన్ ధ్రువపత్రాలను మంజూరు చేపట్టామన్నారు. సాంకేతిక సమస్యలు తొలగిన వెంటనే ఇండ్ల స్థలాలు లబ్దిదారులకు అప్పజెప్పి, కాలనీలు ఏర్పాటు చేసి, రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి మౌళిక సదుపాయాలు కల్పిస్తామని సభాముఖంగా తెలిపారు.
రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన సుధీర్ఘ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల అవసరాలను తీర్చడానికి పలు కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేపడుతున్నారని, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ముఖ్యంగా మహిళలకు సామాజిక ఆర్ధికంగా ఎదుగుదలకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిరంతరం చేపడుతున్నదని చెపారు. ఎంతో పారదర్శకంగా ఇండ్ల పంపిణీ పధకాన్ని కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నదని, అవినీతికి తావులేకుండా గృహాలను, ఇండ్ల స్థలాలను మహిళల పేరుతోనే పంపిణీ చేయబడుతుందని తెలిపారు.
జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదలందరికీ ఇళ్ళు మంజూరు చేసే సంకల్పంతో నవరత్నాల పధకంలో భాగంగా క్రిస్మస్/ వైకుంఠ ఎకాదశి నాడు 31 లక్షల మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంనకు శ్రీకారం చుట్టారు. సచివాలయాలు ద్వారా అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి ఎంతో పారదర్శకతతో పరిశీలించి అర్హులైన వారందరికీ ఈ కార్యక్రమంలో పట్టాల పంపిణీ జరుగుచున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం సుమారు 12 రోజులు వరకు కొనసాగిస్తామని ఇది నిరంతర ప్రక్రియని, ఎవ్వరైనా అర్హులు ఉండి దరఖాస్తు చేయనివారు కూడా ప్రస్తుతం వార్డు సచివాలయాలలో ఇండ్ల స్థలం కొరకు దరఖాస్తు తీసుకోవచ్చని సూచించారు. నగర పరిధిలో ఉన్న లబ్దిదారులకు, పట్టణ సివారు ప్రాంతాలైన ఆనందపురం. సబ్బవరం, పెందుర్తి వంటి మండలాలకు చెందిన గ్రామాలలో ఖరీదైన భూ స్థలాలను ప్రభుత్వం కేటాయిస్తున్నాదని చెప్పారు. ప్రైవేట్ లే-అవుట్లకు తలదన్నే విధంగా లే-అవుట్లను ఏర్పాటుచేసి కాలనీలు నిర్మిస్తామన్నారు.
జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ, నగరపరిధిలో సుమారు 2 లక్షల పై చిలుక లబ్దిదారులకు ఇండ్ల లేని కొరత తీర్చే యజ్ఞంలో తనను భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మూడు ఆప్షన్లలో, లబ్దిదారులు సూచించిన ఒక ఆప్షన్ ప్రకారంగా ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు. ఈ పధకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఎవరైనా అర్హులైన లబ్దిదారులు ఉంటే, వార్డు సచివాలయంలో ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారు. ఇంకను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పంపిన సందేశాన్ని సభకు చదివి వినిపించారు.
ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన పాదయాత్రలో చెప్పిన విధంగా సామాజిక న్యాయానికి, విద్య, ఆర్ధికాభివృద్ధికి, మహిళా సాధికారతకు పాటు పడుతున్నారని, మరీ ముఖ్యంగా వాలంటరీ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ముంగిట్లో ప్రభుత్వ సేవలు అందిస్తున్నదుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నవరత్నాలలో భాగంగా ఉత్తర నియోజిక వర్గంలో 4219 మందికి టిడ్కో ఇళ్ళు 370 కోట్ల వ్యయంతో, 27603 మంది లబ్దిదారులకు రూ. 496 కోట్లుతో ఇండ్ల నివేశన స్థలాలు ఏర్పాటు, 5కోట్లతో 394బిఎల్.సి. పధకంలో ఇండ్ల ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
చివరగా రాష్ట్ర మంత్రులు చేతుల మీదుగా ఉత్తర నియోజక వర్గం పరిధిలోని లబ్ధిదారులైన కట్టా జయలక్ష్మి, ఫాతిమా సుల్తాన్ బేగం, అప్పయ్యమ్మ లకు టిడ్కో గృహాల మంజూరు పత్రాలను, ఆవాల లక్ష్మికి ఇండ్ల నివేశన స్థల హామీ లేఖను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జివిఎంసి యు.సి.డి. ప్రాజెక్టు డైరెక్టరు వై. శ్రీనివాసరావు, విశాఖ ఆర్.డి.ఓ కె.పి.కిషోర్, నాల్గవ జోనల్ కమిషనర్ సింహాచలం, రెండవ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, నాల్గవ జోన్ కార్యనిర్వాహక ఇంజినీరు, పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది, టిడ్కో అధికారులు, వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు, వార్డు సచివాలయాల కార్యదర్శులు, వాలంటీర్లు, సి.ఓ. లు, ఆర్.పి.లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
"మన అనంత - సుందర అనంత" కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా చరిత్రను సాక్షాత్కరించేలా, ఆకట్టుకునేలా వేసిన బొమ్మల పెయింటింగ్ దృశ్యాలు అపురూపంగా మారి జనం మదిమెచ్చిన సిత్రాలుగా నిలుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవిరళ కృషి ఫలితంగా అపురూప చిత్రాల దృశ్యమాలిక ఆవిష్కృతం కాగా, ఆదివారం "మన అనంత - సుందర అనంత" కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా చరిత్రను సాక్షాత్కరించేలా, ఆకట్టుకునేలా వేసిన బొమ్మల పెయింటింగ్ దృశ్యాలను తిలకించేందుకు నగరంలో పాత్రికేయుల బృందం పర్యటించింది.
ఈ ఏడాది జనవరి 26వ తేదీన అనంతపురం నగరంలో ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా ఆకట్టుకునేలా, చరిత్ర తెలిసేలా బొమ్మలు వేసే కార్యక్రమంను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ ఒక లక్షా 75 వేల రూపాయలను తన జీతం నుంచి వెచ్చించారు. జనవరి లో మొదలైన కార్యక్రమం డిసెంబర్ నెల వరకు పనులు జరగ్గా.. ఇప్పటివరకూ నగర వ్యాప్తంగా ఒక లక్ష 50 వేల చదరపు అడుగుల మేర బొమ్మలు వేశారు. ఇందుకు గాను దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేశారు. అనంతపురం మున్సిపాలిటీ నిధులు కొంత అహుడా నిధులు కొంత ఉపయోగించి ఆకట్టుకునే చిత్రాలను వేసే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్న అపురూప చిత్రాలు :
అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గోడలపై కంబళి తయారు చేసే విధానం, పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా ఆకట్టుకునే బొమ్మలు, రచ్చబండ కబుర్లు తదితర చిత్రాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ చిత్రాలు ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి కి ఎదురుగా ఉన్న గోడలపై పిల్లల ఆటలు, చిన్ననాటి క్రీడలు, కోతికొమ్మచ్చి ఆట, ఉప్పాట, కొబ్బరి మట్టలు లాగుట తదితర గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న క్రీడలను గోడలపై బొమ్మలు గా చిత్రీకరించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అలాగే రుద్రం పేట బైపాస్ ఫ్లైఓవర్ కింద అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను అని వేసిన భారీ బొమ్మలు, ఎంతో సహజంగా అశోకుడు చెట్లు నాటిస్తున్న బొమ్మ, నాటిన చెట్లను చూపరులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. అంతే కాకుండా దానికి ఎదురుగా రాజ్యాంగ నిర్మాణం ఘట్టాలు, 1941లో పార్లమెంట్లో నెహ్రూ, డా.అంబేద్కర్ లు మాట్లాడుతున్న దృశ్యాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, డా. అంబేద్కర్ తదితరులు రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కు రాజ్యాంగం అందిస్తున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కదిరి రోడ్డులోని సత్యసాయి కళాశాల గోడలకు వేసిన వజ్రకరూరు వజ్రాల వేట దృశ్యాలు, వేరుశనగ కాయలు, గ్రామీణ క్రీడలు, గోలీలాట, తొక్కుడు బిళ్ళ ఆట, గ్రామీణ క్రికెట్, కోడిపందాలు, వ్యవసాయ పంట, వరి నాట్లు నాటడం, బొప్పాయి తోట, బత్తాయి తోట, ద్రాక్ష తోట, మొక్కజొన్న తోట, దానిమ్మ తోట, టైరు ఆట, ఉపాధి హామీ పథకం పనులు, మన ప్రత్యేక వంటలు, జొన్న రొట్టెలు, మిరపకాయ బజ్జీలు, ఓలిగలు, వగ్గాని బజ్జి, రాగి సంకటి నాటుకోడి పులుసు, ధర్మవరం పట్టుచీరలు నేయుట, కూరగాయల సంత తదితర అన్ని రకాల బొమ్మలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న జెఎన్టియు గోడలపై గొరువయ్య, సోది చెప్పుట బొమ్మలు కూడా కనువిందు చేస్తున్నాయి. అంతేకాకుండా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల గోడలు, సత్యసాయి కళాశాల రోడ్, కోర్ట్ రోడ్ లో న్యాయ వ్యవస్థకు సంబంధించిన చిత్రాలు, టవర్ క్లాక్ వద్ద నున్న ఫ్లైఓవర్, డా. బి.ఆర్ అంబేద్కర్ (రాంనగర్ ) ఫ్లైఓవర్, ప్రధాన కూడళ్లలో రోడ్లకు ఇరువైపులా ఉన్న డివైడర్స్ పై ఆకట్టుకునే విధంగా పలు చిత్రాలను పెయింటింగ్ వేయించడంతో చూపరులను వాటివైపు ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా కేంద్రం లో గోడలు, రహదారుల్లో పెయింటింగ్ తో పలు అందమైన చరిత్ర తెలిసేలా చిత్రాలు రూపొందించడంతో అవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
నగరంలో గోడలపై అపెక్స్ క్వాలిటీతో వెదర్ ఫ్రూప్ కలర్ ని ఉపయోగించి ఆకట్టుకునేలా బొమ్మలు ఎక్కువ కాలం చెదిరిపోకుండా ఉండేలా వేసినట్లు శ్రీ విజయ అసోసియేట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహమ్మద్ అలీ తెలిపారు. ఒక టీం కి 8 మంది చొప్పున 6 టీం లతో పెయింటింగ్ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా ఆకట్టుకునేలా, చరిత్ర తెలిసేలా బొమ్మలు వేసే కార్యక్రమంను చేపట్టామని, నగర వ్యాప్తంగా ఒక లక్ష 50 వేల చదరపు అడుగుల మేర బొమ్మలు వేశామని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న భారత దేశ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి పలువురు ప్రజా ప్రతినిధులు , అధికారులు ఆదివారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో- దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జిఎడి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, నగర పోలీస్ కమీషనర్ బి .శ్రీనివాసులు, విఎంసి కమీషనర్ వి ప్రసన్న వెంకటేష్ , సబ్ కలెక్టర్ హెచ్ ఎమ్ ధ్యానచంద్ , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జి.మధుసూదన్ , విమానాశ్రయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు .
ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు ఆత్కురు లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కి చేరుకొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పోలీస్ గౌరవ వందవందనాన్ని స్వీకరించారు. రాత్రి ఎస్ బి టి నందు బస చేస్తారు. రెండవ రోజైన సోమవారం ఉదయం సీపెట్ (ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమ ) శిక్షణ , ఉత్పత్తి సంస్థ , సూరంపల్లి ను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖీ లో పాల్గొంటారు , సాయంత్రం స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని , శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందచేస్తారు .
మూడవ రోజైన మంగళవారం రాష్ట్రములోని మూడు రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఉప రాష్ట్రపతి బెంగుళూరు బయలుదేరి వెళతారు.
పీలేరు నియోజకవర్గ సమ గ్రాభివృద్దికి కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రా మీణాభివృద్ది శాఖా మాత్యు లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. శనివారం పీలేరులో రూ. 24 కోట్లతో నిర్మించనున్న100 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణా భివృద్ది శాఖామాత్యులు మరియు రాజంపేట పార్ల మెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, పీలేరు శాసన సభ్యులు చింతల రామ చంద్రా రెడ్డి, తంబళ్ళపల్లి శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిల తో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల నుద్దేశించి మంత్రి మాట్లా డుతూ పీలేరు లో 100 పడ కల ఆసుపత్రి నూతన భవ న నిర్మాణమును ఒక సంవ త్సరంలో పూర్తి చేస్తామని, ఈ ఆసుపత్రి నిర్మాణానికి భూమిని ఇచ్చిన దాతలను ఈ సందర్భంగా మంత్రి అభి నందించారు.
పీలేరు లో త్రా గు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామ ని తెలిపారు.పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా రూ.97 కోట్ల 70 లక్షలు వివిధ అభివృద్ది పను లకు మంజూరు చేయగా, త్రాగునీటి సమస్య పరిష్కా రానికి రూ. 19 కోట్ల 17 లక్ష లు మొత్తం దాదాపు గా రూ. 120 కోట్లు మంజూరు చేసి నట్లు తెలిపారు.రాష్ట్ర ము ఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల కష్టాల ను తెలుసుకొని అందుకు అనుగుణంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొం దించి అధికారంలోని వచ్చిన 18 నెలలలో 90 శాతం ఎ న్నికల హామీలను అమలు చేయడం జరిగిందని తెలి పారు.రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ సంవత్సరం 15 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను ప్రా రంభించడం జరుగు తుంద ని తెలిపారు.పాడి రైతుల కు మేలు చేకూర్చేలా లీటర్ కు రూ .4 ప్రోత్సాహకం అందించడం జరుగుచున్న దని, గ్రామ సచివాలయ వ్య వస్థ ద్వారా ప్రభుత్వ సేవల ను ప్రజల ఇంటి ముంగిటికే తీసుకొని రావడం జరిగిం దని, భారత దేశం లో ఈ రాష్ట్ర లో లేని విధంగా 50 ఇండ్ల కు ఒక వాలంటీర్ ను నియామకం చేయడం జరి గిందని,ఈ వాలంటీర్ వ్యవ స్థ ద్వారా ప్రతి నెల ఒకటవ తేదీన 98 శాతం పెన్షన్ పం పిణీ జరుగుచున్నదని,4,4 00 జబ్బులకు ఆరోగ్య శ్రీ వర్తింప చేయడం జరిగిం దని, అమ్మ ఒడి,వై.ఎస్. ఆర్ ఆసరా, చేయూత, జగ నన్న విద్యాదీవేన, వసతి దీవెన ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదని తెలిపారు.
రాజంపేట పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ పీలేరు ప్రజల చిరకాల వాంఛ అయిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కల సాకారం అవ్వడానికి పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి కృషి ఎక్కు వగా కలదని తెలిపారు. మదనపల్లి-తిరుపతి నాలు గు వరసల రోడ్ నిర్మాణ పనుల మంజూరుకు కేంద్ర మంత్రి నితిన్ గట్కరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ద్వారా లేఖను అందజేశామని, కేం ద్ర మంత్రి వర్యులు ఈ విష యమును అతి ముఖ్యమై నదిగా గుర్తించాలని కోరా మన్నారు. పార్టీలకు అతీ తంగా అన్నీ వర్గాల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తు న్నదని,కబ్జాకు గురైన ప్రభు త్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పారద ర్శకంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుచున్నదని తెలిపారు.
పీలేరు శాసన సభ్యులు మాట్లాడుతూ పీలేరు లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చరిత్రలో మైలు రాయి అని, ఈ ఆసుపత్రి ద్వారా ఆర్థో,ఈ ఎన్ టి, డెర్మటాలజీ, రేడియాలజీ, పాథాలజీ, జనరల్ మెడి సిన్, గైనకాలజీ, పిడియా ట్రిషన్, అనస్తీషియా, డెం టిల్, జనరల్ సర్జరి విభా గాలలో సేవలు అందించడం జరుగుతుందని, ఈ ఆసుప త్రి భవన నిర్మాణ పనులను ఒక సంవత్సరంలో పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు. పీ లేరులో 6,500 ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరుగు చున్నదని, ఇళ్ల పట్టాల పం పిణీ కార్యక్రమంలో ప్రజ లు ఎవరు దళారులను ఆశ్ర యించవద్దని, పారదర్శ కంగా వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ జరుగు తుందని తెలిపారు. పీలేరు లో త్రాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అడవి పల్లి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేసేం దుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఐ టి ఐ కళాశాలకు శాశ్వత భవనమును మం జూరు చేయాలని మంత్రిని కోరారు.
తంబళ్ళపల్లి శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు ద్వారా అన్నీ వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ, డి సి హెచ్ ఎస్ లు డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సరళమ్మ, ఏపిఇ ఐ డి సి ఎస్సీ ధనంజయ రెడ్డి, పీలేరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, సింగల్ విండో ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, డి సి సి బి డైరెక్టర్ స్టాంపుల మస్తాన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గిరిధర్, ఏ జి ఎం ఎస్ ఐ డి ఛైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపీడిఓ జయరాజ్, ఎం ఆర్ ఓ పుల్లా రెడ్డి, నాయకులు ఇక్బాల్ అహమ్మద్, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతోందని, ఈ ప్రక్రియ కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులతో కలిసి యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని లేఅవుట్ ప్రాంతాన్నికలెక్టర్ సందర్శించారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీకి మొత్తం 46 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వివరించారు. ఈ మొత్తం కార్యక్రమంలో వార్డు అమెనిటీస్, సంక్షేమ, ప్లానింగ్ కార్యదర్శులతో పాటు గ్రామ సర్వేయర్లు కూడా భాగస్వాములవుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ప్లాట్లను చూపించి, అక్కడ ఫొటోలు తీసేందుకు 50 మంది సర్వేయర్ల బృందాన్నిఅందుబాటులో ఉంచామన్నారు. లేఅవుట్లలో ఇళ్లనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అందుబాటులో ఉంచిన మూడు ఆప్షన్లపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, వారి నిర్ణయమే అంతిమమని పేర్కొన్నారు. లేఅవుట్‌లోని మోడల్ హౌజ్‌ను లబ్ధిదారులకు చూపించి, అదే విధంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుందనే దానిపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట రంపచోడవరం ఐటీడీఏ పీవో సీవీ ప్రవీణ్ ఆదిత్య, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ తదితరులు ఉన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ నవీన్‌కుమార్ కూడా శనివారం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్ లో పేదవారి కష్టాలను దృష్టిలో ఉంచుకొని, వారి రోజువారీ ఉపాధికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వమే పూర్తిగా ఇంటిని కట్టించి ఇచ్చే ఆప్షన్‌ను కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారని సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఏపీ హౌజింగ్ స్పెషల్ కమిషనర్ హరినారాయణ, జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తదితరులతో కలిసి కొమరగిరిలోని భారీ లేఅవుట్ ప్రాంతాన్ని ప్రవీణ్ ప్రకాశ్ సందర్శించారు. లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, ఆప్షన్ల గుర్తింపు కార్యక్రమాన్నిపర్యవేక్షించారు. అధికారులు లబ్ధిదారులకు లేఅవుట్‌లోని ప్లాట్లను చూపిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులతో కలిసి ప్రవీణ్ ప్రకాశ్ కొంతమంది లబ్ధిదారులను స్వయంగా ప్లాట్ల వద్దకు తీసుకెళ్లి, వారితో ఫొటోలు దిగారు. లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు లేఅవుట్ ప్రాంతంలో పర్యటించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులు ఇచ్చిన ఆప్షన్లను అడిగి తెలుసుకున్నారు. తమ ప్లాట్లను గుర్తించడంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సర్వేయర్లకు సూచించారు. ప్లాట్లను తేలిగ్గా గుర్తించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రవీణ్ ప్రకాశ్ అధికారులకు సూచించారు. గతంలో ఎప్పడూ లేని విధంగా గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో అమలవుతోందని, పేదలకు సొంతింటి కల సాకారమవుతోందని ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాశ్ వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ తదితరులు ఉన్నారు.
అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పద్మనాభం మండలం అయినాడ, బి.ఆర్. తాళ్లవలస గ్రామాలలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమం క్రింద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తీర్చాలని వారికి అవసరమైన ఏమిటో తెలుసుకున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి పక్కా ఇల్లు అందజేయాలని ముఖ్యమంత్రి సంకల్పించి పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇల్లు లేని పేద వారిని గుర్తించి కుటుంబంలో మహిళ పేరున భూమి పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. అయినాడ గ్రామంలో తమ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలో రూ.5 లక్షల సంక్షేమ కార్యక్రమాలు రూ 2 లక్షల 68 అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం రూ. 7 లక్షల 75 చేపట్టామన్నారు.
అనంతరం బి.ఆర్ తాళ్లవలస గ్రామం లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 999 కుటుంబాలకు ప్రభుత్వ అభివృద్థి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు రూ. 4 కోట్ల 75 లక్షలు లబ్ది చేకూరిందని తెలిపారు. పాండ్రంగి వద్ద నిర్మించే బ్రిడ్జికి రూ 14 కోట్లు, రేవిడి వెంకటాపురం రోడ్డు కి రూ.16 కోట్ల, రెడ్డిపల్లి పద్మనాభం రోడ్డు రూ. 10 కోట్లు, అనంత పద్మనాభ స్వామి కొండరోడ్డుకు రూ 5 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మండల కేంద్రమైన పద్మనాభం లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ, బి.ఆర్. తాళ్లవలస గ్రామంలో 92 మందికి మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందిస్తున్నామన్నారు. పట్టాలు ఇచ్చిన స్థలాల్లో రూ.లక్షా ఎనభై వేల తో ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఇంటి నిర్మాణం కోసం మంజూరు పత్రం, ఒక సంవత్సరంలో గా నిర్మాణం చేసి ఇస్తారని కరెంట్, రోడ్లు, అంగనవాడి, త్రాగునీరు, డ్రైనేజీ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో లక్ష 16 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి అందిస్తున్నామని, జీవీఎంసీ పరిధిలో లక్షా 75 వేల పట్టాలు మంజూరు చేసినప్పటికీ కోర్టు ఉత్తర్వుల మూలంగా అందించలేక పోతున్నట్లు తెలిపారు. బుడ్డి వలస గ్రామం లో కొత్తగా సచివాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలియజేశారు. గృహాలు మంజూరు నిరంతర ప్రక్రియని చెప్పారు.
లబ్ధిదారులు రంగాల ఉగాది, మందల ఆశ మాట్లాడుతూ ఇంత త్వరలో సొంత ఇల్లు సాకారం అవుతుందని తాము ఎప్పుడూ ఊహించలేదన్నారు. తమకు ఇంటి స్థలాన్ని అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారులకు మంత్రి గారికి ఎప్పటికి రుణపడి ఉంటామని ఆనందంతో చెప్పారు. మరో లబ్దిదారు స్వర్ణలత వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఫీజు రియంబర్సుమెంటు పొందామని ఇప్పుడు జగనన్న సి.యం.గా వచ్చినప్పుడు ఇంటి స్థలం పొందానన్నారు జగనన్న పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఆదుకొంటున్నారు. ముఖ్యమంత్రిగా చిరకాలం వుండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.పెంచల కిషోర్, తాహసీల్దారు శ్రీనివాసరావు ఎంపీడీవో చిట్టి రాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
లిక్కర్ మాఫియా దొంగ, భూ అక్రమార్కుడు వెలగపూడి రామకృష్ణబాబుకి దమ్ము ధైర్యం లేక నిన్న సవాల్ విసిరిన దానికి సమాధానం చెప్పలేక బాబా గుడికి రాలే కపోయారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల గారు ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈస్ట్ పాయింట్ కాలనీ శిరిడి సాయిబాబా దేవాలయం వద్ద పెద్దఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిని విమర్శించే స్థాయి లిక్కర్ మాఫియా డ్రగ్స్ వ్యాపారైన టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కు లేదన్నారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైన కారుకూతలు కూస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా దమ్ముంటే ఈ రోజే శిరిడి సాయిబాబా దేవాలయానికి వచ్చి ఉండేవారని అటువంటి ధైర్యం చేయలేనపుడు సవాల్ విసరడం దేనికని ప్రశ్నించారు. దైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల్లో నీకెంత విలువుందో తెలుస్తుందన్నారు. ఇప్పటికై అవ్వాకులు చెవ్వాకులు పేలకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా కార్పొరేటర్ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివితే జగనన్న వసతి, విద్యా దీవెన వర్తించబోవంటూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 77ను తక్షణమే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యాన విద్యార్థులు శనివారం ఉక్కునగరంలో ఆందోళనకు చేశారు. జిఒ ప్రతులను దగ్ధం చేస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రభుదాస్, ఎల్‌జె.నాయుడు మాట్లాడుతూ, 2020 - 21 విద్యా సంవత్సరాల్లో ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న పీజీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన వర్తించబోవంటూ ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. తాజా జిఒ వల్ల రాష్ట్రంలో పేద ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 - 19, 2019 - 20 విద్యా సంవత్సరాలకుగానూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇప్పటికే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని తెలిపారు.
విద్యా సంక్షేమం కోసం పాదయాత్ర సమయంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్నవాటిని తెగ్గోయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 158 సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్ పొందారని, వీరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పీజీ కాలేజీలు అతి తక్కువగా ఉండటంతో గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఇప్పటికే అందని ద్రాక్షలా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ 77 వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని రద్దు చేసి అర్హులందరికీ జగనన్న వసతి, విద్యా దీవెనను వర్తింపజేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.చిన్నారి, నగర నాయకులు బి.కుసుమ, వై.అప్పలరాజు, కె.రాకేష్, ఎం.రాజశేఖర్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా, ఎంపికైన 44 మునిసిపల్ పాఠశాలలను 65 కోట్ల వ్యయంతో నాడు-నేడు తరహాలో స్మార్ట్ క్యాంపస్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు కమిషనర్ డా.స్రిజన తెలియజేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు జోన్ 1, 3, 4, 5 , 7కు సంబంధించిన 43 పాఠశాలలలో, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ, తల్లిదండ్రులు, యాజమాన్యం మొదలగు వారితో సమావేశాలు ఏర్పాటుచేసి, వినూత్నముగా సిద్ధము చేయబడిన ప్రణాళికలను వారి ముందుంచి, అభిప్రాయ సేకరణ చేసినట్టు వివరించారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదేవిధంగా జోన్ 5లోని MH కాలనీ ప్రాధమిక పాఠశాలలో అభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేయటానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వివరించారు. అంతేకాకుండా మోడల్ పాఠశాలగా ఎంపిక కాబడిన H.B కాలనీ ప్రాధమిక పాఠశాల యొక్క ప్రణాళికలను తయారు చేసి టెండర్ కి ప్రకటన కూడా ఇచ్చినట్టు తెలియజేశారు.
కొవిడ్-19లో ప్రజలకు మెరుగైన సేవలందించినం ఉత్తరాంధ్ర కొవిడ్ ప్రత్యేక అధికారి,ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్‌ను శనివారం నేవల్ డాక్‌యార్డ్ (కేటిబి) ఉద్యోగుల సంఘం ఎఎంసి కళాశాలలో ఘనంగా సత్కరించింది. సుధాకర్ విశేష సేవలందించారని సంఘం నేతలంతా కొనియాడారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, అందరి సహకారంతోనే కొవిడ్ నుంచి మెరుగ్గా బయటపడగలిగామని అన్నారు. ప్రజలు అందించిన సహకారంతో పాటు,ప్రభుత్వం కూడా సకాలంలో అన్ని చర్యలు చేపట్టిందని, దీంతో పాటు మీడియా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ సమన్వయంగా పనిచేసిందన్నారు. ఉత్తరాంధ్రలో కొవిడ్‌ను సకాలంలో అదుపుచేయగలిగామన్నారు. ఇప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సుధాకర్ సూచించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులకు మెరుగైన సేవలందించి వారికి అండగా నిలిచినందుకు రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.ఆనందరావును సంఘం నేతలంతా ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తమ అసోసియేషన్ సభ్యలు సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కొవిడ్ వారియర్స్‌ను సత్కరించుకోవటం తమ బాధ్యతగా బావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బత్తుల చిరంజీవి,కార్యదర్శి భాస్కరరావు,ఇతర ప్రతినిధులు శ్రీనువాస్,గవర సోమశేఖర్,సన్యాసిరావు,బంగిన శ్రీనువాస్,చిన్నారావు,నాగార్జున,తేజ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే 100 శాతం ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు ఎవరికి కేటాయించిన ఇంటి స్థలంలోనే వారిని నిలబెట్టి పట్టాలు ఖచ్చితంగా అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమం పై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, హౌసింగ్ పిడి, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డివో లు, తహసీల్దార్లు, హౌసింగ్ ఈ ఈ లు, డి ఈ లు, ఏ ఈ లు, విఆర్వో లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఒక్క స్థాయిలో అధికారులంతా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే ఇంటి పట్టాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని, ఖచ్చితంగా పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన రోజున లేఔట్ స్థలంలోనే ఎలాంటి ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు పట్టాలివ్వాలన్నారు. ఇంటి పట్టాల తో పాటు ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వాలని, ఇందుకు సంబంధించి ఎన్ని ఇంటి పట్టాలు ఇవ్వాల్సి ఉంది, ఎన్ని పటాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్స్ ఇచ్చారు అనేది వేర్వేరుగా ప్రతి లేఔట్ కు సంబంధించి 100 శాతం రిపోర్ట్ లు తమకు అందజేయాలని హౌసింగ్ పిడి, స్పెషలాఫీసర్ లను ఆదేశించారు. ప్రతిరోజు ఇంటి పట్టాల పంపిణీ పై సాయంత్రం 6 గంటల కల్లా రిపోర్టులు పంపించాలని, మండల స్థాయిలో తహసీల్దార్లు లేఔట్ ప్రకారం వివరాలు పంపించాలన్నారు.
ఇంటి పట్టాల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు మినిట్ టూ మినిట్ ముందుగానే సిద్ధం చేసుకుని క్రమ పద్ధతిలో కార్యక్రమంను నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ఒక అధికారిని నియమించాలన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో ఎవరి స్థలంలో వారిని నిలబెట్టి పట్టాలు అందించాలని, దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
పట్టాలు ఇచ్చేందుకు ఎవరైనా డబ్బులు అడిగినా, మళ్ళీ ఇస్తామని చెప్పడం గానీ ఎక్కడైనా జరిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం :
పట్టాలు ఇచ్చేందుకు ఎవరైనా డబ్బులు అడిగినా, మళ్ళీ పట్టాలు ఇస్తామని చెప్పడం గానీ ఎక్కడైనా జరిగినట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇంటి పట్టాల కార్యక్రమం నిర్వహించిన రోజు ప్రతి ఒక్క లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే ప్రొసీడింగ్స్ ఇస్తున్నారో అక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలన్నారు. ఇందుకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, గ్రామాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్, మున్సిపాలిటీలలో కమ్యూనిటీ అసిస్టెంట్లు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఎటువంటి సపోర్ట్ కావాలి అనేది లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహకారాలు అందించాలని, ప్రతిచోట ఇళ్ల నిర్మాణం తక్షణం మొదలు పెట్టించాలని కలెక్టర్ ఆదేశించారు.
1902 టోల్ ఫ్రీ నెంబర్ పై లబ్ధిదారులకు అవగాహన వచ్చేలా ప్రచారం చేయాలి :
ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే తెలియజేసేందుకు కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిందని, 1902 టోల్ ఫ్రీ నెంబర్ పై లబ్ధిదారులకు అవగాహన వచ్చేలా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి ఏఈ, డిఈ, ఈఈ, హౌసింగ్ పిడి, డ్వామా పిడి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వరకు కు హౌసింగ్ కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా ఎవరికి ఫిర్యాదు పంపించాలి, ఫిర్యాదు వచ్చాక ఎన్ని రోజులలో దానిని పరిష్కరించాలి, ఒకవేళ మీ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే ఆ ఫిర్యాదును ఎవరికి పంపించాలి, ఇందుకు సంబంధించి ఆ అధికారి సమస్యను ఎన్ని రోజులలో పరిష్కరించాలి అనేది ప్రతి ఒక్కరికి ప్రభుత్వం టైమ్లైన్ ఇచ్చిందని, రోజుల నుంచి 30 రోజుల్లోపు వచ్చిన ఫిర్యాదును పరిష్కరించాలన్నారు.
అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని ఆయా మతాల సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్క లేఔట్ లోనూ మూడు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అందులో ఇంటిగ్రేటెడ్ కాలనీలకు సంబంధించి ప్రతి ఒక్క లేఔట్ దగ్గర ఫ్లెక్సీ ఉండాలని, ప్రతి ఫ్లాటు లబ్ధిదారుల పేరు, ఫ్లాట్ నెంబర్, వివరాలతో సహా ఒక ఫ్లెక్సీ ఉండాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మోడల్ హౌస్ యొక్క ఫ్లెక్సీ ఉండాలని, 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించిన ఫ్లెక్సీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ అభినందనలు :
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్, హౌసింగ్ పిడి, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డివో లు, తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విఆర్వో లు, సర్వేయర్లను జిల్లా కలెక్టర్ అభినందించారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి యంత్రాంగ వరకు అందరూ బాగా పని చేశారని జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది అనేది లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని, ఇంటి పట్టాలను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.