శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో మొదటి ఎం.బి.బి.ఎస్ బ్యాచ్ (2008) విద్యార్ధులు సూపర్ స్పెషాలిటిలో డి.ఎం సీట్లు సాధించడంలో హవా కొనసాగించారని ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటిండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీట్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారని ఆయన పేర్కొన్నారు. డా.పల్లి షర్మిల సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎండోక్రినాలజిలో డి.ఎం సీట్ పొందగా, డా.యమునా రాణి గుంటూరు వైద్య కళాశాలలో న్యూరాలజి విభాగంలోను, డా.త్రిమూర్తులు లక్నోలోని ఎస్.జి.పి.జి.సంస్ధలో క్రిటికల్ కేర్ విభాగంలోను, డా.లక్ష్మి నారాయణ విశాఖపట్నం మహాత్మ గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఆంకాలజీ విభాగంలోను డి.ఎం సీట్లు సాధించారని తెలిపారు. మరిన్ని మంచి విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి పట్టాలను మంజూరు చేసి, పేదల కళ్లలో ఆనందం చూడటమే సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఏ. హాఫిజ్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం నవరత్నాలు--పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కర్నూలు మండలం రుద్రవరం గ్రామం వద్ద ప్రభుత్వం గుర్తించిన లేఅవుట్ లో ఇంటి స్థలాల సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, డి.ఆర్.ఓ పుల్లయ్య హాజరై పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగనన్న కాలనీల నిర్మాణంలో ఇప్పటికే శంకుస్థాపన చేశామని 17,000 ఇళ్ళను నిర్మించి లక్ష జనాభాకు సరిపడ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. అలాగే 1 రూపాయికే టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. మేము పాలకులుగా కాకుండా సేవకులుగా ప్రజలకు సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
అనంతరం కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ...మొత్తం 377 ఎకరాల లేఅవుట్ ను 39 బ్లాక్కులుగా విభజించడానికి మునిసిపల్, రెవెన్యూ, సర్వే, ప్లానింగ్ సెక్రెటరీలు, సచివాలయ సిబ్బంది అహర్నిశలు శ్రమించారని..వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆదేశాల మేరకు అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి ఇంటి పట్టాలను అందించడానికి కృషి చేశామన్నారు. పట్టాలు అందని లబ్ధిదారులు మీ పరిధిలోకి వచ్చే వార్డు సచివాలయ వి.ఆర్.ఓ ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, నగర పాలక ఎస్ఈ సురేంద్రబాబు, కర్నూలు అర్బన్ తహసీల్దార్ తిరుపతి సాయి, డిఈ రాధాకృష్ణ, ఏఈ జనార్ధన్, తాలూకా సిఐ విక్రమ్ సింహ తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలోని అన్ని ప్రజామరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నగర పరిధిలోని ఐదవ జోన్ లో 58వ వార్డులోని పారిశుద్ధ్య పనులను క్షేత్ర పర్యటనలో తనిఖీ చేసారు. ఈ సందర్భంగా నాతయ్యపాలెం, అక్కిరెడ్డి పాలెం ప్రాంతాలలో పర్యటించి ప్రజా సౌకర్యార్ధం ఏర్పరిచిన ప్రజా మరుగుదొడ్ల పనితీరు సంబందించి శానిటరీ ఇన్ స్పెక్టర్లతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరుగుదొడ్లలో గుర్తించిన చిన్న చిన్న రిపేర్లను వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. త్వరలోని ఓ.డి.ఎఫ్. బృందం తనిఖీలు నిర్వహించే అవకాసం ఉన్నందున మరుగుదొడ్లలో అన్ని సామాగ్రీలు ఉన్నట్లు చూసుకోవాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. వార్డులో పర్యటిస్తూ చెత్తను వేరుచేసి చేపడుతున్న సేకరణను క్షేత్రస్థాయిలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చెత్తను వేరు చేసి ఇవ్వడంపై ప్రజలకు మరింత అవకాసం కల్పించాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు, వార్డు శానిటరీ కార్యదర్శులకు సూచించారు. సీజనల్ వ్యాదులపై నిరంతరం చేస్తున్న సర్వేను ఏ విధంగా చేస్తున్నారో అని శానిటరీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో 58వ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2021-2022 కాల పరిధి కి సంబంధించి అర్హత ఉన్న 515 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రెడిటేషన్ లు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క ఆక్రెడిటేషన్ దరఖాస్తు ను కూడా రిజెక్ట్ చేయలేదని, జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 142 లో ఉన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించి అర్హులందరికీ అక్రెడిటేషన్ మంజూరు చేశామని తెలిపారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇవ్వడానికి కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో అర్హత ఉన్న 515 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రెడిటేషన్ లు మంజూరు చేశామన్నారు.
అక్రెడిటేషన్ మంజూరు కానివారు రాష్ట్ర సమాచార శాఖ ఆన్ లైన్ /వెబ్ సైట్ ను రీ ఓపెన్ చేసిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆ కాపీలను అనంతపురం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం అప్లోడ్ చేసిన దరఖాస్తులను పరిశీలన చేసి రెండవ విడత సమావేశంలో అర్హత ఉన్న వారికి అక్రెడిటేషన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటి కన్వీనర్, సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు జయమ్మ , సభ్యులు డిఎంఅండ్హెచ్ఓ డా. కామేశ్వరరావు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ రఘురాములు, హౌసింగ్ పిడి వెంకటేశ్వర్రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే పి ఆర్ ఓ ప్రశాంత్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ హరి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో ప్రత్యేక కేంద్రాల నుంచి 19 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు మంగళవారం 19 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం గ్రామం వద్ద రూపొందించిన అతిపెద్ద లేఅవుట్‌లో సుమారు 12,301 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి పట్టాల పంపిణీ చేస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్నిఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఉదయం 11.10 గంటలకు ముఖ్యమంత్రి జిల్లాలో అడుగుపెడతారు. గుంకలాంలో పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఇక్కడ నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలిస్తారు. సభావేదిక వద్ద ఇళ్ల లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి, ఇంటి నిర్మాణాలను ప్రారంభించిన అనంతరం సుమారు 1.10 గంటల సమయంలో తిరుగుప్రయాణం అవుతారు.
విజయనగరం పట్టణంలోని పేద ప్రజల కల నెరవేరే సమయం ఆసన్నమయ్యింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత సుమారు 21,945 మంది పట్టణవాసులు సొంత ఇంటివారు కాబోతున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద, గుంకలాం లేఅవుట్‌లో 12,301 మంది పేదలకు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పట్టాలను పంపిణీ చేసి, విజయనగరం నియోజకవర్గంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ లేఅవుట్‌లోని ఇళ్లన్నిటినీ మొదటి విడతలోనే నిర్మాణం చేయనున్నారు. విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం, కొండకరకాం, జమ్మునారాయణపురం, సారిక వద్ద మొత్తం 554.82 ఎకరాల భూమిని సేకరించి, సుమారు రూ.5.75 కోట్ల ఖర్చుతో నాలుగు లేఅవుట్లను రూపొందించారు. ఈ నాలుగు లేఅవుట్లలో పట్టణం మొత్తంమీద 21,945 మందికి పట్టాలు ఇవ్వనున్నారు. వీరిలో నవరత్నాలు పథకం క్రింద 19,662 మంది, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 2,283 మంది, టిట్కో లబ్దిదారులు 3,776 మంది ఉన్నారు. టిట్కో లబ్దిదారుల్లో 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్దిదారులు 2016 మంది, 365 చదరపు అడుగుల లబ్దిదారులు 448 మంది, 430 అడుగుల లబ్దిదారులు 1312 మంది ఉన్నారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటుగా విజయనగరం జిల్లాలో కూడా ఈ నెల 25నే, విజయనగరం మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమం క్రింద మొత్తం లక్షా, 08వేల, 230 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీని దశలవారీగా జనవరి 7వ తేదీ వరకు జరుగుతుంది. నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న 71,249 మందికి, అలాగే 90 రోజుల కార్యక్రమం క్రింద సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 3,659 మందికి, మొత్తం 74,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అదేవిధంగా 8,048 మందికి టిట్కో ఇళ్లు, గ్రామకంఠాలు తదితర చోట్ల నివాసం ఉంటున్న 25,261 మందికి, ఆక్రమిత స్థలాల్లో ఉన్న 13 మందికి పొజిషన్ పట్టాలను మంజూరు చేసి, వారిని సొంత ఇంటివారిని చేయనున్నారు. లబ్దిదారుల్లో 10355 మంది ఎస్సీలు, 7660 మంది ఎస్‌టిలు, 73,970 మంది బిసిలు, 6301 మంది ఓసిలు ఉన్నారు. టిట్కో లబ్దిదారుల్లో 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్దిదారులు 5568 మంది, 365 చదరపు అడుగుల లబ్దిదారులు 643 మంది, 430 అడుగుల లబ్దిదారులు 1840 మంది ఉన్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1164 లేఅవుట్లను రూపొందించారు. కేవలం భూసేకరణకు సుమారు రూ.228కోట్లను ఖర్చు చేశారు. జిల్లా వ్యాప్తంగా తొలిదశ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.1769 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలిదశలో 98,286 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి, కేవలం 18 నెలల్లో వీటిని పూర్తి చేసి, రెండో దశ నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇంగ్లాండ్ (UK) నుండి విశాఖపట్నం వచ్చిన విమాన ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 28వ తేదీ నుండి డిశంబరు 25వ తేదీ వరకు ఇంగ్లాండ్ నుంచి జిల్లాకు రెండు విడతలుగా 216 మంది ప్రయాణికులు వచ్చారని వారిలో 209 మందిని గుర్తించామన్నారు. ఏడుగురు ప్రయాణికులు జిల్లా నుండి బయటకు వెళ్లిపోయారని తెలిపారు. వారిలో 192 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని 17 మంది రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రయాణికులతో సన్నిహితంగా మెలిగిన 580 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 390 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. 190 మందికి సంబంధించిన రిపోర్టులు రావలసి ఉన్నాయని వెల్లడించారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే "న్యూస్ట్రైన్ సార్స్" నిర్ధారణకు వారి 'స్వాప్' ముందుగా హైదరాబాద్ సిసిఎంబి ల్యాబ్ కు పంపిస్తారని, తర్వాత పూర్తి స్థాయి పరీక్షలకు పూణే పంపించాల్సి ఉంటుందని వివరించారు.
తిరుపతి పర్యటన లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ శ్రీ పద్మావతి అతిధి గృహం సమీపం లోని శ్రీ వెంకటేస్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీని ( శ్వేతా బవనము) సందర్శించారు. ఈ సందర్భంగా శ్వేతా భవన్ డైరెక్టర్ డా.రామాంజనేయ రెడ్డి చేర్మన్కు బొకే అందచేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ గౌరవ చేర్మన్ శ్వేతా బవనము లోని కాంటీన్ అలాగే ఆన్లైన్ లో కోవిడ్ అవగాహన పై టీ.టీ.డీ. ఉద్యోగులకు ఇచ్చే వీడియో కాన్ఫెరెన్స్ ను పరిశీలించారు. అలాగే శ్వేతా భవన్ డైరెక్టర్ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్వేతా భవన్ డైరక్టర్ డా.రామాంజినేయ రెడ్డి చేర్మన్ కు శాలువా కప్పి, శ్రీ వేంకటేశ్వరస్వామి స్వామివారి చిత్రపటం అందచేసి శ్రీవారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో శ్వేతా బవనము సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారంతా అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టరేట్ లో నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగులు మరణించిన అనంతరం వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే మానవతా ద్రుక్పదంతో కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టామని వివరించారు. నలుగురిని నాలుగు శాఖల్లో నియమించారు. అంతేకాకుండా మిగిలిన కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా తక్షణమే శాఖాపరమైన పనులు పూర్తిచేసి వారికి కూడా నియమాకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి పాల్గొన్నారు.
వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అమలాపురం షాధీఖానా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగుల న్యాయపరమైన అన్ని కోరికలు నెరవేర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని,వికలాంగుల కోరిక మేరకు వచ్చే డిసెంబర్ మాసానికి అమలాపురం లో వికలాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు సంభందించి అమలాపురం లో 5 సెంట్లు ప్రభుత్వ భూమి కొరకు మునిసిపల్ కమీషనర్ కు సూచిస్తానని మంత్రి తెలియ చేసారు. అలాగే వికలాంగులు ప్రస్తుతం వికలాంగులు తీసుకుంటున్న 3 వేల రూపాయల పెన్షన్ ను 5 వేలు చేయాలని కోరారని, ఈ విషయాన్ని కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని,అవసరమైతే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి న్యాయమైన మీ కోరిక ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకు వెళతానని మంత్రి తెలియ చేసారు. మీకు ఎంత సహాయం చేసినా తక్కువే అవుతుందని మంత్రి అన్నారు.అలాగే వికలాంగుల కార్పోరేషన్ లో డైరెక్టర్ గా అమలాపురానికి చెందిన దివ్యాంగుల్లో ఒకరికి స్థానం కల్పించాలనే మీ కోరికను దృష్టి లో వుంచుకొని తప్పక అమలాపురం నుంచి మీరు ప్రతిపాదించిన వ్యక్తికి రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ లో డైరెక్టర్ గా నియమించేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు.అలాగే ఒంటెద్దు వెంకన్నాయుడు వికలాంగుల అనేక సమస్యలను నా దృష్టి తీసుకు వచ్చారని వాటన్నిటినీ డి.టి.పి. చేయించి నాకు ఇస్తే వాటన్నింటి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని మంత్రి తెలియ చేసారు. అలాగే ట్రై సైకిల్స్ కావలసిన దివ్యాంగుల వివరాలు నాకు ఇస్తే రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వారందరికీ ట్రై సైకిల్స్ వచ్చేలా చేస్తానని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో దివ్యాంగులకు ఆహార పొట్లాలు,దుప్పట్లు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ దివ్యాన్గుల సంక్షేమ సంఘం జే.ఏ.సి. గౌరవ అధ్యక్షులు ఒంటెద్దు వెంకన్నాయుడు, చెల్లు బోయిన శ్రీనివాస్, వాసంసెట్టి సుభాష్,డా.పినిపే శ్రీకాంత్,కోనసీమ డివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు,అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అమలాపురం డివిజన్ అధ్యక్షులు పెనుమాళ్ళ నాగరాజు, ఏ.పి. రాష్ట్ర దివ్యాంగుల మహా సంఘటన్ అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్,అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అమలాపురం పార్లమెంట్ నియోజక వర్గం యించార్జ్ బొంతు శ్రీనివాస్,దొమ్మెటి రాము, జంపన రమేష్ రాజు, కొల్లాటి దుర్గాబాయి,తోట శ్రీను,నక్కా సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని చెప్పారు. విజయనగరం జిల్లా వ్యవసాయాధారిత జిల్లా అని, రైతు అభివృద్ది చెందితే, జిల్లా కూడా అభివృద్ది చెందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా, నివార్ తుఫాను బాధితులకు పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మంగళవారం తాడిపత్రి నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, రైతులతో ఆయన మాట్లాడారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాలులో రైతు భరోసా, నివార్ తుఫాను బాధితులకు పెట్టుబడి రాయితీ సొమ్మునకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడో విడత రైతు భరోసా క్రింద, 2లక్షల, 91వేల, 791 మంది రైతులకు రూ.69.35 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. కౌలు దారులు, అర్జీదారులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఈ సారి రైతు భరోసాను విడుదల చేసినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగకు ముందే రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. అలాగే నవంబరు నెలలో వచ్చిన నివార్ తుఫాను కారణంగా జిల్లాలోని శృంగవరపుకోట, లక్కవరపుకోట, విజయనగరం, జామి, గంట్యాడ, కొత్తవలస, సీతానగరం మండలాల్లోని సుమారు 564.771 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. దీనివల్ల మొత్తం 2,513 మంది రైతులు నష్టపోయారని, వీరికి పెట్టుబడి రాయితీ క్రింద రూ.84.72కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. తుఫాను నష్టం జరిగిన నెల రోజులలోపే రైతులను ఆదుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక కొత్త చరిత్రను సృష్టించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, ఏడిఏలు ఆర్.శ్రీనివాసరావు, ఎల్.విజయ, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో నేషనల్ కేడెట్ కార్పస్(ఎన్‌సిసి) అవగాహన ఒప్పందం చేసుకుంది. మంగళవారం ఏయూ వీసీ కార్యాలయంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ ఎన్‌సిసి గ్రూప్ విశాఖపట్నం కెప్టెన్ నీరజ్ సిరోహిలు సంతకాలు చేశారు. అనంతరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిసి అధికారులకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో పిజి డిప్లమో సర్టిఫీకేట్లు ప్రధానం చేసే దిశగా ఈ ఎంఓయూ నిలుస్తుందన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఎన్‌సిసి అధికారులకు సర్వీస్ ట్రైనిగ్, ఐదేళ్ల ఉద్యోగ బాధ్యతలు పూర్తిచేసిన వారికి ఈ సర్టిఫీకేట్‌ను అందించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎన్‌సిసికి అందిస్తున్న ప్రోత్సాహం పట్ల ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ నీరజ్ సిరోహి సంతోషం వ్యక్తం చేశారు. అంధ్రవిశ్వవిద్యాలయం సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీన్ సంచాలకులు ఆచార్య కె.నిరంజన్, అకడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఉజ్వల్ కుమార్ ఘటక్,ఎన్‌సిసి అధికారులు డి.టి ఆంతోని, ఎం.డి సజిత్, కె.జె శర్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా జాతీయ వినియోగదారుల వారాంతపు వేడుకలను నేడు నిర్వహిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ వినియోగదారుల వారోత్సవ వేడుకలను ఈ నెల 24 నుండి నిర్వహిస్తున్న సంగతి అందరికి విదితమే. అందులో భాగంగా జిల్లాస్థాయిలో వారాంతపు వేడుకలను డిసెంబర్ 30 ఉదయం 11.00గం.లకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల రక్షణ చట్టం – 2019 – కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం జరుగుతుందని జె.సి స్పష్టం చేసారు.
శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ ( విడబ్ల్యుయస్ అండ్ డి ) మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన ఛార్జ్ వారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో 2020-21 సం.నకు నూతన పుస్తకాలు కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం, జిల్లా గ్రంధాలయ సంస్థ మరియు అన్ని శాఖా గ్రంధాలయాలకు అవసరమైన ఫర్నిచర్ , కంప్యూటర్లు, ఎయిర్ కండీషనర్లు కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం అదనపు భవన నిర్మాణం, జిల్లా కేంద్ర గ్రంధాలయం కాంపౌండ్ వాల్ , ఆమదాలవలస శాఖ గ్రంధాలయం మరామ్మతులు వంటి పనులు ప్రతిపాదనలు ఆమోదం కొరకు చర్చించడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
రైతులపై ప్రేమ, మమకారంతో, బాధ్యతతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ రైతు భరోసా మూడవ విడత పంపిణీ కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైయస్సార్ రైతు భరోసా పి. ఎం. కిసాస్ పథకం కింద రైతులకు, అర్హులైన కౌలు రైతులకు సాగుదార్లకు ఏటా రూ.13,500 చొప్పున, అయిదేళ్లలో రూ.67,500 అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్రములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా సొమ్మును "వైయస్సార్ రైతు భరోసా పి.ఎం.కిసాన్ పథకం" క్రింద మొదట విడతగా - ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500; రెండో విడతగా - అక్టోబరులో ఖరీఫ్ పంట కోత లేదా రబీ అవసరాలకు రూ. 4000; మూడో విడతగా - ధాన్యం ఇంటికి చేరేవేళ, సంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 ఇవ్వడం జరుగుతోందన్నారు.
2019-20 సంవత్సరములో "వైయస్సార్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం"కింద, రాష్టములోని 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6,534 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో మొదటిస రెండవ విడతలో రాష్ట్రములోని 50.47 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,805 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరం మూడవ విడతలో రాష్ట్రములోని 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ. 1120 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 18 నెలల కాలంలో రైతుల కోసం రాష్ట్రంలో రూ.61,400 కోట్లు ఖర్చు చేసామని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ అందించుటకు 10 వేల మెగా వాట్ల సోలార్ పవర్ కు టెండర్లు పిలిచామని ముఖ్య మంత్రి చెప్పారు.
2019-20 సంవత్సరములో "వైయస్సార్ రైతు భరోసా - పి. ఎం.కిసాన్ పథకం"కింద శ్రీకాకుళం జిల్లాలోని 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగింది. 2020-21 సంవత్సరంలో రెండు విడతల్లో శ్రీకాకుళం జిల్లాలోని 3.68 లక్షల రైతు కుటుంబాలకు రూ. 423 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగింది. 2020-21 సంవత్సరంలో మూడవ విడతగా శ్రీకాకుళం జిల్లాలోని 3.81 లక్షల రైతు కుటుంబాలకు రూ. 85.78 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగింది. ఇందులో గ్రీవిన్స్ లో పెట్టిన 12,801 మంది రైతులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ప్రత్యేక అంశంగా చెప్పవచ్చును.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, ఎడి ఆర్.రవి ప్రకాష్., ప్రకాష్, మహిళా సంఘాల సభ్యులు సుగుణ,ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం కు చెందిన గుండ ఫాల్గుణ ఆమదాలవలస మండలం లొద్దలపేట కు చెందిన పూజారి వెంకట కాంతారావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.