1 ENS Live Breaking News

ఇల్లు లేని పేదలందరికీ సొంతిళ్ళు..

రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత ఇల్లు   కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పర్యాటకశాఖ మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం పెందుర్తి మండలం వాలిమెరక గ్రామంలో పేదలందరికి ఇల్లు పథకం లో మహిళలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో  ఆయన పాల్గొని మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రకటించిన పేదలందరికీ ఇల్లు భారీ సంక్షేమ కార్యక్రమం అని తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో మూడు పండుగలు జరుగుతున్నాయని, ముక్కోటి ఏకాదశి, క్రిస్టమస్, మహిళలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే పండగ అని మంత్రి వర్ణించారు.   సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నామని,   మహిళలకు గౌరవం ఇచ్చిన చోట  దేవతలు నడయాడు తారని రాష్ట్రం సుభిక్షంగా ఉందని  అని చెప్పారు. మహిళలపై ఎటువంటి అఘాయిత్యం జరిగిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేస్తున్నారని చెప్పారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 2 లక్షల   96 వేల మందికి పట్టాలు మంజూరు అయ్యాయని, అందులో లక్ష 75000వేల జీ.వీ.ఎం.సీ పరిధిలో ఉన్నాయని తెలిపారు. 99 శాతం లబ్ధిదారులకు సొంత పంచాయతీలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. భూమిని చదును చేసి ప్లాట్లు వేసి చక్కని వాతావరణంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని దరఖాస్తు చేసుకున్నవారికి 90 రోజులలో మంజూరు    చేస్తామని తెలిపారు.పెందుర్తి శాసనసభ్యులు ఏ అదీప్ రాజు  మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో 7042 మందికి, మండలంలో 2395 మందికి ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయన్నారు. వాలిమెరక గ్రామంలో 327 మందికి పట్టాలు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం రూ.7 లక్షలు ఉందని చెప్పారు.  తరువాత మంత్రి మహిళలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. లబ్ధిదారులు మేరీ కుమారి, వాణి విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో ఉన్న తమ కలలు సాకారం అయ్యాయని ఎంతో సంతోషంగా ఉందని జగనన్న పేదల గుండెల్లో  నిలిచి ఉంటారని చెప్పారు. అంతకు ముందు మంత్రి శ్రీనివాసరావు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎం.పీ బి.సత్యవతి జె.సి. ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ఎస్.డి.సి సూర్యకళ, ఆర్డీవో పెంచల కిషోర్, తాసిల్దార్ రామారావు ఎం.పీ.డీ.వో. మంజుల వాణి తదితరులు పాల్గొన్నారు. 

Pendurthi

2020-12-25 20:09:53

పేకల సొంతింటి కల ప్రభుత్వం తీర్చింది..

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసి వీటి ద్వారా సామాన్యుడి స్వప్నాన్ని నిజం చేసిందని కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాఫిజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డా.సుధాకర్ లు పేర్కొన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభోత్సవం లో భాగంగా శుక్రవారం కర్నూలు మండలం రుద్రవరం గ్రామం వద్ద కర్నూలు నగర పాలక పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్  ఇంటి స్థలాలకు పట్టాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూలు నగర పాలక పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, డి.ఆర్.ఓ పుల్లయ్య, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ హాజరై పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ, తొలివిడత పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో కూడిన జగనన్న కాలనీలను నిర్మించడం ఎంతో సంతోకరమన్నారు. పేదల మోములో చిరునవ్వును చూడటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు  నివేశన స్థలాల కేటాయింపులో మొదటి నుంచి జిల్లా అధికార యంత్రాంగం ఎంతో శ్రమించిందని వారి కృషి అభినందనీయమన్నారు. కుట్రలు, కుత్రంతాలతో కొందరు ప్రతిపక్ష నాయకులు నిరుపేదలు అభివృద్ధి చూసి ఓర్వలేక వారికి ఇంటి పట్టాలను పంపిణీ చేయనేయకుండా ఉండేందుకు కోర్టుల్లో పిల్ వేసి రాక్షస ఆనందం పొందారని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే డా.సుధాకర్ మాట్లాడుతూ, పట్టాల పంపిణీకి కేవలం అర్హులకు మాత్రమే అధికారులు పెద్దపీట వేశారని..పూర్తి పారదర్శకంగా కేటాయింపు ప్రక్రియ జరిగిందన్నారు. భవిష్యత్ లో జగనన్న కాలనీలు ఓ మినీ మునిసిపాలిటీలుగా మారుతున్నాయని వెల్లడించారు. అంతకుముందు కాకినాడ నుంచి లైవ్ లో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని  వినిపించారు. కార్యక్రమంలో మునిసిపల్ ఎస్ఈ సురేంద్రబాబు, డిఈ రాధాకృష్ణ, నగర పాలక ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Rudravaram

2020-12-25 19:59:03

వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై భ‌క్తుల సంతృప్తి..

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ముందుగా ప్ర‌క‌టించిన స‌మ‌యం కంటే ఒక‌టిన్న‌ర గంట ముందుగా సామాన్య భ‌క్తులకు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభించ‌డంపై భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ విఐపిలు పూర్తి స‌హ‌కారం అందించ‌డంతో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, టైంస్లాట్ స‌ర్వ‌ద‌ర్శ‌నాల‌ను నిర్ణీత స‌మ‌యం కంటే ముందుగా ప్రారంభించిన‌ట్టు తెలిపారు. మొద‌టిసారిగా దాత‌ల‌కు, వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవ‌ల భ‌క్తుల‌కు కూడా ద‌ర్శ‌నం క‌ల్పించామ‌ని, ఆఫ్‌లైన్‌లో 1000 శ్రీ‌వాణి టికెట్లు కేటాయించామ‌ని చెప్పారు. భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ టిటిడికి పూర్తిగా స‌హ‌క‌రించి ప్ర‌శాంతంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్న‌ట్టు తెలిపారు.

Tirumala

2020-12-25 19:07:40

చరిత్రలో నిలిచేలా ఇళ్ల పట్టాలు పంపిణీ..

రాష్ట్ర చరిత్రలో నిలిచేలా మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, పాల ఉత్పత్తి అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి డా, సిదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణ పురం లే అవుట్ వద్ద నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో భాగంగా మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్దాల కాలం పాటు పాలించిన ప్రభుత్వాలు 45 లక్షలు ఇల్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు, పేదవాడి గుండె చప్పుడు ముఖ్యమంత్రి తెలుసుకొనవలెనే ఇది సాధ్యపడింది అన్నారు. ముఖ్యమంత్రి సంకల్పం చరిత్రలోనీ నిలిచిపోతుందన్నారు. వైయస్సార్ జగనన్న కాలనీలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి శాశ్వత నివాసానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడతామన్నారు.  జిల్లాలో మొదటి దశలో 17 వేల గ్రామాలు, రెండో దశలో 17వేల గ్రామాలు  నిర్మిస్తామన్నారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి 15వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3016 మందికి ఇళ్ల పట్టాలు, 2017 మంది సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణం చేయుటకు, 972 మందికి టిడ్కో హౌసింగ్ ద్వారా ఇల్లు మంజూరు చేస్తామన్నారు.లేఅవుట్లు, టిడ్ కో హౌసింగ్ జాబితాలు పేరు లేని వారు ఆందోళన చెందనవసరం లేదని గ్రామ సచివాలయంలో నమోదు చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు ఎన్నాళ్ళనుంచో వేచి చూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ దశ లో ఉందని పూర్తి చేసి పట్టణ ప్రజలకు బహుమతిగా అందిస్తానని వెల్లడించారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం కింద ప్రీతి గిరిజనుడికి సాగు హక్కు కల్పించి భూమి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలోనే ఆఫ్ షోర్ రిజర్వాయర్ టెండర్ ప్రక్రియ పూర్తి కానుందని,  రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని అన్నారు.  భూసేకరణ కు భూమి ఇచ్చిన రైతుకు సకాలంలో పరిహారం ఇచ్చేందుకు నిరంతరం శ్రమించి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టిన యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం పలువురు మహిళలకు మంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముంద ప్రాజెక్టు విలువ సుమారు రూ.4,554 లక్షల వ్యయంతో 2,530మంది లబ్ధిదారులకు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో భాగంగా వైయస్సార్ జగన్ అన్న కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ గతంలో పట్టాలు ఇచ్చి ఇల్లు స్థలం చూపించేవారు కాదని, ప్రస్తుతం నిర్మించిన లే అవుట్ లలో లబ్ధిదారునికి స్థలం చూపించి పట్టా పంపిణీ చేపడుతున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయం వద్ద ప్రదర్శించడం జరుగుతుందని పారదర్శకతకు ఇదేంది నిదర్శనమని అన్నారు. ప్రైవేట్ లేవుట్ లకు మించి సుందర లే అవుట్ లుగా తీర్చిదిద్దా మన్నారు. పట్టాలు పంపిణీ కాకుండా ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. లే అవుట్ ల వద్ద అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా,కిల్లి కృపారాణి, పలాస వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ పి.సతీష్ ,జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ సూరజ్ గనూర్ ధనుంజయ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ నారాయణ, తాసిల్దార్ మధుసూదన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-25 19:01:32

నిరుపేదల ఇంటి సమస్యకు పరిష్కారం..

ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ద్వారా పేద‌ల సొంతింటి క‌ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి నెర‌వేర్చార‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా నన‌డుచుకొని, వారి ఆశ‌ల‌ను నెర‌వేర్చే ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చీపురుప‌ల్లిలో శుక్ర‌వారం 473 ఇళ్ల ప‌ట్టాల పంపిణీ చేశారు. అనంత‌రం ల‌బ్దిదారుల‌కు గృహ‌నిర్మాణాన్ని ప్రారంభించారు. అంత‌కుముందు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి సందేశాన్ని వినిపించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాద‌శి, క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం రోజు రాష్ట్రంలో 30లక్ష‌ల 78వేల మందికి ఇళ్ల ప‌ట్టాల పంపిణీకి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి శ్రీకారం చుట్టార‌ని, వీరంద‌రికి ద‌శ‌ల‌వారీగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామ‌న్నారు. ల‌బ్దిదారులు త‌మ‌కు న‌చ్చిన విధానంలో త‌మ ఇంటి నిర్మాణాన్ని చేసుకోవ‌చ్చ‌ని, ప్ర‌భుత్వం ఇచ్చిన మూడు అవ‌కాశాల‌నూ వివ‌రించారు.  ఇళ్ల ప‌ట్టాల పంపిణీని అడ్డుకొనేందుకు ప్ర‌తిప‌క్ష టిడిపి ఎన్నో కుయుక్తులు ప‌న్నిన‌ప్ప‌టికీ, వాటిని ఎదుర్కొని ఇన్నాళ్ల‌కి పేద‌ల క‌ల‌ల‌ను నెర‌వేర్చామ‌ని చెప్పారు. ఒక్క‌ చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 694 లేఅవుట్ల‌ను రూపొందించామ‌ని, సుమారు 6,323 మందికి ప‌ట్టాలు ఇస్తున్నామ‌ని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం మొత్తం 103.50 ఎక‌రాల భూమిని సేక‌రించామ‌ని తెలిపారు. దీనిలో ప్ర‌భుత్వ భూమి 87.50 ఎకరాలు కాగా, ప్ర‌యివేటు భూమి 16 ఎక‌రాలు ఉంద‌ని చెప్పారు. ద‌శ‌ల‌వారీగా అంద‌రికీ ఇళ్లు నిర్మించ‌డం జ‌రుగుతంద‌ని తెలిపారు.              వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి త‌రువాత అంత జ‌న‌రంజ‌కంగా పాలిస్తున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు.  ఎటువంటి సిఫార్సుల‌కు, ప‌క్ష‌పాతానికి తావులేకుండా అర్హులంద‌రికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామ‌ని, ఇప్ప‌టికీ అర్హులెవ‌రైనా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే, 90 రోజుల్లో ప‌ట్టాలు ఇస్తామ‌ని తెలిపారు. పేద‌ల‌కు శాశ్వ‌త భూ హ‌క్కు క‌ల్పించేందుకు, వారి భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు స‌మ‌గ్ర భూ స‌ర్వే చేప‌ట్టామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. దీనిపైనా ప్ర‌తిప‌క్షం త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని, అటువంటి వారిని ఊరి పొలిమేర‌ల‌కు త‌రిమివేయాల‌ని అన్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మోసం చేశార‌ని విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్ర‌కారం ఇప్ప‌టికే తొలివిడ‌త రుణ‌మాఫీ మొత్తాన్ని ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. ల‌క్షా, 40వేల మందికి స‌చివాల‌యాల్లో ఉద్యోగాలు ఇచ్చి, ద‌ళారులు లేని కొత్త పాల‌నావ్య‌వ‌స్థ‌ను శ్రీ‌కారం చుట్టార‌ని అన్నారు. కోడి కూయ‌క‌ముందే పింఛ‌న్‌ను అంద‌జేసి, పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి ద‌క్కిందని అన్నారు.                 ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఒకేసారి 30 ల‌క్ష‌ల‌మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయ‌డం, ఒకేవిడ‌త‌లో 15ల‌క్ష‌ల ఇళ్లు నిర్మాణాన్ని ప్రారంభించ‌డం ఒక చారిత్రక‌ ఘ‌ట్ట‌మ‌న్నారు. మిగిలిన 16ల‌క్ష‌ల మందికి కూడా రెండోద‌శ‌లో ఇంటి నిర్మాణం జ‌రుగుతుంద‌ని చెప్పారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా, మ‌హాత్మా గాంధీ క‌ల‌లు గ‌న్న‌ గ్రామ స్వారాజ్య వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చార‌ని అన్నారు. ద‌ళారీలు, మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా అర్హులంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌ని, ఇది ముఖ్య‌మంత్రి దూర‌దృష్టికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా, వైఎస్ఆర్ జ‌ల‌క‌ళ ప‌థ‌కం ద్వారా వారి సాగుభూముల‌కు నీటిని కూడా అందించే గొప్ప ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి తీసుకువ‌చ్చార‌ని బెల్లాన చెప్పారు.               జి.అగ్ర‌హారం వ‌ద్ద నిర్మించిన కెజిబివి నూత‌న భ‌వ‌నాన్ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, స్పెష‌ల్ ఆఫీస‌ర్ సాల్మ‌న్ రాజు, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, డ్వామా పిడి ఏ.నాగేశ్వ‌ర్రావు,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర నాయ‌కులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

చీపురుపల్లి

2020-12-25 18:38:01

సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం..

రాష్ట్రంలో 30 లక్షల మందికి  ఇళ్ళూ, ఇళ్ల పట్టాలను అందించడం సరికొత్త చరిత్ర అని ఉపముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.  ఇది సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని అభిప్రాయపడ్డారు.  కురుపాం నియోజకవర్గం కురుపాంలో శుక్రవారం ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, సబ్ కలెక్టర్ విధేఖర్ జ్యోతి.ప్రజ్వల చేసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ళ పట్టాలు, 70 వేల ఎకరలాలో,17 వేల కాలనీలు ఏర్పాటుచేసి  30 లక్షల ఇళ్ళ పట్టాలు అందించే ఘనత మన గౌరవ ముఖ్య మంత్రి జగనన్నకే దక్కింది అన్నారు.  నాకు ఓటు వేయక పోయినా ఆర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలనే ముఖ్య ఉదేశ్యంతో వొలెంటిర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని, ప్రభుత్వ అభివృధి సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ఉదయాన్నే తలుపుకొట్టి అందించే ఘనత మన గౌరవ ముఖ్య మంత్రి వర్యులది అన్నారు.  పార్టీలకు,రాజకీయాలకు  అతీతంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి అందజేయాలన్నదే ముఖ్య మంత్రి ప్రధాన లక్ష్యం అన్నారు.    రాష్ట్రంలో 13 వేల గ్రామాలు ఉండగా 17 వేల కాలనీల నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.  వాస్తవంగా ఇళ్ళ పట్టాలు ఉగాది నాటికే అందజేయాల్సి ఉందని కానీ ఆలస్యం అవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కారణమన్నారు.  గౌరవ ముఖ్య మంత్రి వెనుకడుగు వేయకుండా పేదవాడికి ఇచ్చిన ప్రతి హామీ అందిస్తూ ముందుకు వెళుతున్నారని అన్నారు.  పథకాలలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, అమ్మవడి, మహిళలకు చేయూత, వై.ఎస్.ఆర్.ఆశ్రా, వడ్డీలేని రుణాలు అంతే కాకుండా బి.సి.కార్పొరేషన్, మార్కెట్ యార్డ్ పదవులలో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించారు అన్నారు.  రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు రద్దు చేసిన ఘనత గౌరవ ముఖ్య మంత్రి వర్యులకే  దక్కిందన్నారు. కరోనా తో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన ఎ పథకం ఆపకుండా కొనసాగించే ఘనత గౌరవ ముఖ్య మంత్రి కి దక్కిందన్నారు.  అలాగే జనవరి 9 న రెండవ విడత అమ్మవడి కి సంబంధించి తల్లుల ఖాతాలో జమచేయడం జరుగుతుంది అన్నారు. అలాగే రాష్ట్రంలో అందరు జిల్లా కలెక్టర్లు మారినా విజయనగరం జిల్లా కలెక్టర్ మారక పోవడానికి ప్రధాన కారణం వారి పనితీరుకు నిదర్శనం అన్నారు, జిల్లాకు 16 జాతీయ పురస్కారం అవార్డులు రావడం వారు చేస్తున్న కార్యక్రమాలే అని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టం.. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత మంచి అవకాశం దొరకడం చాలా ఆనందాన్నీ ఇస్తుంది అన్నారు. జిల్లా కలెక్టర్ గా గత ప్రభుత్వంలో వచ్చినప్పటికీ ప్రభుత్వాలు మారినా విజయనగరం జిల్లా కలెక్టర్ కొనసాగడం ఆందంగా వుంది అన్నారు. అందుకు ప్రధాన కారణం మంత్రి వర్యులు, జిల్లా ప్రజా ప్రతినిధులు కారణం అన్నారు. గౌరవ ముఖ్య మంత్రి వర్యుల ప్రోత్సాహంతో కొన సాగుచున్నను అన్నారు. లేఖ పోతే ఇంత గొప్ప అవకాశాన్ని కోల్పోయేవాడిని అన్నారు, జిల్లాలో 98 వేల మంది నిరుపేద కుటుంబాలకి ఇచే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు. అలాగే ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే యువతకు ఉద్యోగం కల్పించి వేలాది కుటుంబాలలో జ్యోతిని నింపడం జరిగిందన్నారు. అందులో భాగంగా 718 సచివాలయాలలో 15 వేలమందికి ఉద్యోగం కల్పించడం లో అవకాశం రావడంతో ఏంతో ఆనందంగా  ఉందన్నారు.     ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్, హౌసింగ్ పి.డి, రెవెన్యూ, హౌసింగ్ ఆధికారులు సిబ్బంది లబ్ధి దారులు తదితరులు పాల్గొన్నారు.

Kurupam

2020-12-25 18:10:29

దేవుని క్రుపతో కరోనా వైరస్ తరలిపోవాలి..

రాజమహేంద్రవరం స్థానిక లాలాచెరువు జంక్షన్ వద్ద హోసన్నా చర్చి లో రెవరెండ్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. క్రిస్ మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ,  వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాన్ని భరత్ రామ్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, క్రిస్ మస్ వేడుకలు సాక్షిగా ప్రపంచం నుంచి కరోనా వైరస్ తరలిపోయేవిధంగా జీసస్ క్రైస్ట్ దీవించాలని కోరుకున్నానని చెప్పారు. ప్రభువు నిర్ధేశించిన మార్గంలో నడవడం ద్వారా స్వస్తత చేకూరుతుందన్న ఎంపీ ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  లాలాచెరువు జంక్షన్ సమీపంలో మరనాత మహిమ మందిరాన్ని దర్శించుకుని ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రైజ్ ద లార్డ్ అంటూ క్రిస్మస్ చర్చిలో సహవాసులను ఉత్సాహపరిచారు.  ఆధునిక విధానంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఎంపీ వివరించారు.

Rajahmundry

2020-12-25 15:14:31

ఎపిజెన్కో ఎండిని పరామర్శించిన ఏపీ సి.ఎస్..

  శ్రీవారి దర్శనార్థం అలిపిరి కాలినడకన వెళుతున్న సమయంలో అస్వస్థతకు  గురికావడంతో  ఎపి జెన్ కో ఎండి . శ్రీధర్ గురువారం   స్విమ్స్ నందు వెంటనే చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎపి కొత్త సి.ఎస్. ఆదిత్య నాద్ దాస్, ఎస్.ఎస్. రావత్ సి.ఎం.ఓ,  కార్తికేయ మిశ్రా , సత్యనారాయణ ఐ ఆర్ ఎస్ ,  నేటి ఉదయం పరామర్శించిన వారిలో వున్నారు. స్విమ్స్ చేరుకున్న వీరికి స్విమ్స్ డైరెక్టర్ డా. వెంగమ్మ, మెడికల్ సూపరినెంట్ డా. రామ్, ఆర్డీఓ కనక నరసా రెడ్డి స్వాగతం పలుకగా, కార్డియాలజీ ఐ.సి.యు.నందు పరామర్శ సమయంలో   సి. ఎం. డి. వారికి చికిత్స అందించిన కార్డియాలజీ హెచ్. ఓ.డి. డా.రాజశేఖర్ ఆరోగ్యం గా వున్నారని సకాలంలో స్టంట్ వేశామని తెలిపారు.  వీరి పర్యటనలో ఆర్.ఎం.ఓ. డా.కోటిరెడ్డి, ఎ డి రాజశేఖర్ , అధికారులు వున్నారు. త్వరగా అత్యవసర చికిత్స అందించినందులకు డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన కొత్త సి.ఎస్.

Tirupati

2020-12-25 11:42:27

స్వచ్ఛ సర్వేక్షణ్ లో మంచి ర్యాంకు రావాలి..

స్వచ్ఛ సర్వేక్షణ్ క్రింద జరిగే వివిధ నగరాల మధ్య పోటీలలో ఉన్నత స్థానాన్ని విశాఖ నగరం సాధించడానికి తోడ్పాటు అందించాలని జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన నగర పరిధిలో గల ఆర్.డబ్ల్యూ.ఎ. సమాఖ్య సభ్యులను కోరారు. వర్చువల్ సమావేశ పద్దతిలో ఆమె, సభ్యులతో చర్చిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో గుర్తించిన లోపాలను సరిదిద్ది 2021 సంవత్సరంలో ఉత్తమ ర్యాంకు సాధించడానికిగాను ఆర్.డబ్ల్యూ.ఎ. సంఘాలు సహకారంతో జివిఎంసి ప్రయత్నించాలని ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణ క్రింద శతశాతం మార్కులు సాధించాలంటే ఆర్.డబ్ల్యూ.ఎ.పాత్ర ఎంతైనా అవసరమని, అధికారులకు సూచించారు. స్వచ్చ సర్వేక్షణ్ ప్రధాన సూచికలైన గృహాల నుండి చెత్తను వేరు చేసి తడి–పొడి చెత్తగా పారిశుద్ధ్య కార్మీకులకు అందించటంలో ఇంకా పురోగతిని సాధించాలని, అందుకు గాను ప్రజలకు అవగాహన కార్యక్రమాలు సంఘ సభ్యులు ఆయా ప్రాంతాల పరిధిలో నిర్వహించాలని కోరారు. కొంతమంది సభ్యులు కమిషనర్ తో మాట్లాడుతూ మేడపైన గార్డెన్ పెంపకంకి తోడ్పాటు, కాలనీ ప్రాంతాలలో సుందరీ కరణ మొదలగు కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్ధిక సహాయం అందించాలని కమిషనర్ ను కోరారు. మరి కొంతమంది సభ్యులు జోనల్ స్థాయి అధికారులు కాలనీలో సందర్శించే నిమిత్తం షెడ్యూలు తయారుచేసి ఆర్.డబ్ల్యూ.ఎ. సంఘాల ప్రతినిధులకు తెలిపితే అధికారులతో పాటు సభ్యులు కూడా కాలనీ పర్యటనలో పాల్గొంటారని సూచించారు. దీనివలనసమస్యలు కొన్నింటిని అక్కడకక్కడే పరిష్కారమై ప్రజల వద్ద నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ సూచనలకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఆర్.డబ్ల్యూ.ఎ. ఫెడరేషణ్ సభ్యులు ప్రసంగించి వారి సూచనలు తెలిపారు.

జివీఎంసీ

2020-12-24 21:15:05

కోవిడ్ వేక్సినేషన్ కు సిద్ధం కావాలి..

జివిఎంసీ పరిధిలో చేపట్టబోయే కోవిడ్-19 వాక్సిన్ పంపిణీ అధికారులు సిబ్బంది సన్నద్ధం కావాలని  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు.  గురువారం, జివిఎంసి సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో డి.ఎం.ఓ.హెచ్ సూర్యనారాయణతో కలసి వివిధ శాఖల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ వాక్సిన్ ముఖ్యంగా మూడు విధాలుగా విభజించి ఇస్తారన్నారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్ల కు, రెండవ దశలో పారిశుద్ధ్య కార్మీకులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు శాఖలకు, మూడవ దశలో 50 సంవత్సరాలు నిండిన వారికి, 50 సంవత్సరములు లోపుల ఉన్న వ్యక్తులకు బి.పి., షుగర్ లేదా దీర్ఘకాలపు వ్యాధి ఉన్న వారికి ఇస్తారని అందుకు మీ అందరి సహకారం అవసరమని తెలిపారు. డి.ఎం.ఓ.హెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశం నుండి పోలియో వ్యాధిని లేకుండా చేసి అలాగే ఈ కోవిడ్-19 భారతదేశం నుండి పారదోరాలని, అందుకు గాను వాక్సిన్ వేసేందుకు అనువుగా ఉన్న మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, కమ్మ్యూనిటీ హాలులు మొదలైనవి గుర్తించి, మూడు రూములు ఉండే విధంగా మొదటి రూమ్ వ్యక్తీ యొక్క అధార్ డాటా తనిఖీ, రెండవ రూములో వాక్సిన్ ఇవ్వడం, మూడవ రూములో 30 నిముషాల పాటు ఆరోగ్య పరిశీలన చేసి పంపించాలని అన్నారు. జివిఎంసి సి.ఎం.ఓ.హెచ్. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ కోవిడ్ – 19 వాక్సిన్ కు పోలీసు, రైల్వే, సోషల్ వెల్ఫేర్, మీడియా సెల్, డిఫెన్సు, డి.ఇ.ఓ., లేబర్ & ఎంప్లాయిమెంట్, అర్బన్ డిపార్ట్మెంట్ మొదలైన శాఖల సహకారం అవసరమని, ముఖ్యంగా కోవిడ్ వాక్సిన్ వేసినప్పుడు రద్దీ లేకుండా చూడాలని, అందుకు ఎన్.ఎస్.ఎస్, ఎన్.వై.కె.ఎస్ మరియు ఏ.ఎన్.ఎం.లు ఎక్ష్-సర్వీస్ మెన్స్, ఎస్.హెచ్.జి. గ్రూప్స్, హోమ్ గార్డ్స్, తదితరుల సహాయ సహాకారం తీసుకోవాలన్నారు.  ఈ సమావేశంలో డి.ఎం.ఓ.హెచ్ సూర్యనారాయణ, డి.ఐ.ఓ. డా. జీవన్ రాణి, డబ్ల్యూ.హెచ్.ఓ. డా. భవాని, యు.ఎన్.డి.పి. కమలాకర్, యు.ఎన్.ఐ.డబ్ల్యూ. డా. విక్రం, సి.పి.ఎం.ఓ.ఎన్.ఓ.హెచ్.ఎం. వెంకట రమణ, ఏ.సి.ఎం.డి. లక్ష్మణ రావు, రెండవ పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.  

జివిఎంసీ

2020-12-24 20:39:54

చిత్తూరు జిల్లాలో 2,46,631 మంది లబ్ధిదారులు..

నిరుపేద‌ల సొంతింటి క‌ల‌ నెర‌వేరే శుభ సమయం ఆస‌న్న‌మ‌య్యింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి  వై.ఎస్‌.జ‌గన్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఏ.పి. ప్ర‌భుత్వం చేప‌ట్టిన న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మం వారి సొంతింటి క‌ల‌ల్ని సాకారం చేయ‌నున్నది. న‌వ‌రత్నాల్లో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు పేరుతో రాష్ట్రంలోని ప్ర‌తి అర్హులైన నిరుపేద‌కు ఇంటి స్థ‌లంతోపాటు ఇళ్లు నిర్మించుకొనేందుకు అవ‌స‌ర‌మైన ఆర్ధిక స‌హాయం అందించేందుకు రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం చర్యలు చేప‌ట్టిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబ‌రు 25 శుక్రవారం జిల్లాలో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుందని తెలిపారు. జిల్లాలోని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు, శాస‌న‌స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆ రోజు మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ప్రారంభించిన అనంత‌రం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఈనెల 28న సి.ఎం. ప్రారంభిస్తారు.           జిల్లాలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చేప‌ట్టిన ల‌బ్దిదారుల గుర్తింపు ప్ర‌క్రియ చేపట్టి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు మంజూరు చేసేందుకు గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 3760.37 ఎక‌రాల‌ను సేక‌రించడం జరిగిందని, ఇందులో 1,903.90 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని గుర్తించ‌గా, 1856.47 ఎక‌రాల డికెటి/పట్టా ల్యాండ్ సేక‌రించడం జరిగిందన్నారు. సేక‌రించిన భూముల్లో 1,267 లే అవుట్‌లు అభివృద్ధి చేసి ల‌బ్దిదారులుగా గుర్తించిన వారంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు అంద‌జేసేందుకు జిల్లా యంత్రాంగం గ‌త ఏడాది కాలంగా అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ లే ఔట్ లలో రోడ్లు, క‌మ్యూనిటీ స్థ‌లాలు త‌దిత‌ర‌ అన్ని సౌక‌ర్యాల‌తో అభివృద్ధి చేశారు. ఈ లేవుట్లలో మంజూరు చేసే ఇళ్ల ప‌ట్టాల‌న్నీ కుటుంబంలోని మ‌హిళ‌ల పేరుతోనే అందించ‌నున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తం గా 2,46,631 మంది లబ్ధి పొందనుండగా అందులో 1,41,775 ఇండ్ల పట్టాలు, 10,728 టిడ్కో ఇండ్లు మంజూరు జరుగుతుందని తెలిపారు.             ఇళ్ల స్థ‌లాల‌ను మంజూరు చేయ‌డంతో పాటు ఆయా స్థ‌లాల్లో ల‌బ్దిదారుల‌కు ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నారు. జిల్లాలో తొలివిడ‌త‌గా 1,74,240 ఇళ్లు ఒక్కొక్కటి రూ.1.80 ల‌క్ష‌ల వ్యయంతో మంజూరు చేస్తున్న‌ట్టు జిల్లా గృహ‌నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ పద్మనాభం తెలిపారు. లబ్దిదారులు తామే సొంతంగా నిర్మించుకుంటే వారికి ప్ర‌భుత్వం నుండి నిధులు మంజూరు చేస్తామ‌ని, లేదంటే ఇంటి నిర్మాణ సామాగ్రి రూపంలో ప్ర‌భుత్వ స‌హాయం కోరుకుంటే ఆవిధంగా సామాగ్రి అంద‌జేస్తామ‌ని, లేక ప్ర‌భుత్వ‌మే ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని ల‌బ్దిదారులు కోరుకుంటే నిర్మించి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో ప్ర‌భుత్వం మంజూరు చేసిన లేఅవుట్ల‌తో పాటు, సొంత ఇంటి స్థ‌లాలు క‌లిగి వుండి త‌మ స్థ‌లంలోనే ఇళ్లు నిర్మించుకొనే వారికి కూడా ఇళ్ల‌ను మంజూరు చేస్తున్న‌ట్టు తెలిపారు.                 వీటితోపాటు గ‌తంలోనే ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకొన్న 94,128 మందికి పొసెషన్ సర్టిఫికేట్లు  కూడా జారీ చేయ‌నున్నారు. ఈ నెల 28 న శ్రీకాళహస్తి ఉరందూరులో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇండ్ల  పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విచ్చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.

Chittoor

2020-12-24 20:29:52

Dr YSR కి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు..

 డా.వైఎస్సార్ కడప జిల్లాలో మూడురోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు గురువారం ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు చేరుకొని  పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రార్ధనలు చేశారు.  ముఖ్యమంత్రితో పాటు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి  ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంఎల్సీ జకియా ఖానం, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు ,మాజీ డి సి ఎం ఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, వై ఎస్ ఆర్ సీపి రాష్ట్ర కార్యదర్శి చిదంబర్ రెడ్డి,ఆసీఫ్ అలీఖాన్, గుమ్మా అమరనాధ రెడ్డి  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .  జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టరు సి.ఎం. సాయికాంత్ వర్మ, ఓఎస్డిఅనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Idupulapaya

2020-12-24 20:27:42

తక్షణమే చెత్తను అక్కడి నుంచి తరలించండి..

ఐలా ప్రాంతంలో గృహ వినియోగదారుల నుంచి సేకరించిన చెత్తను అదే ప్రాంతంలో నిల్వ ఉంచడం వలన రోగాలు ప్రభలే అవకాశం వుందని జివిఎంసి కమిషనర్ పేర్కొన్నారు. గురువారం గాజువాక పారిశ్రామికవాడలో ఐలా కమిషనర్ మరియు బోర్డు సభ్యులు ఇచ్చిన వినతి మేరకు ఆమె అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, చెత్త నిల్వల వలన దుర్వాసనతోనతోపాటు మంటలు ఏర్పడి కాలుష్యం వెదజల్లే అవకాశం ఉన్నందన్నారు. తక్షణమే  సేకరించిన చెత్తను క్లోజ్డ్ కంపోస్ట్ వాహనం ద్వారా కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించాలని ఐలా కమిషనర్ కు సూచించారు. వడ్లపూడి ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్లు అభివృద్ధి చేసేందుకు తగు అంచనాలను సమర్పించాలని ఐదవ జోన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  ఐలా బోర్డు సభ్యులు చేసిన ప్రతిపాదనలు పరిశీలించి, తగు చర్యలు చేపడతామని కమిషనర్ వారికి తెలియజేశారు. ఈ పర్యటనలో నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరు కె. వేణుగోపాల్, ఐదవ జోన్ కమిషనర్ శ్రీధర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, కార్యనిర్వాహక ఇంజినీరు, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఐలా కమిషనర్, ఐలా బోర్డు సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.  

Gajuwaka

2020-12-24 20:11:26

మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసమే..

మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనదని ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈ భూమి పైనే ఉంటుందని భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి స్పష్టం చేశారు. గురువారం ఆయన మచిలీపట్నం గొడుగుపేట లోని శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవాలయం జీర్ణోద్ధరణ గావించి నూతన దేవాలయ నిర్మాణంకు తన స్వహస్తాలతో భూమిపూజ , శంఖుస్థాపన, శిలాన్యాసంలో పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సభాధ్యక్షులుగా, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పరమహంస పరివ్రాజకులు చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ఈ రోజు తెల్లవారితే, వైకుంఠ ఏకాదశి అని ఆ సందర్భంగా మీ అందరికి ఆ వైకుంఠనాధుడు అనేక మేళ్లు కలుగచేయాలని కోరుకొంటున్నానని తెలియచేస్తూ ఇది ధనుర్మాసమని ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక అని అన్నారు ఈ మాసంలో తొమ్మిదవ రోజు నేడని ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసిందని చెబుతూ ఆండాళమ్మ వారి అనుగ్రహం మీ అందరిపైనా పుష్కలంగా ఉండాలని ప్రార్ధన చేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఒక లక్ష్యం మనందరిపైనా పెట్టారని దేవుడు సర్వాంత్యర్యామని అప్పుడప్పుడు అవతరిస్తాడని ఆ అవతరించిన సమయంలో ఏదో ఒక అవతారాన్ని ఆధారం చేసుకొని ఏర్పాటు చేసుకొన్న విగ్రహం ద్వారా మాత్రమే దైవాన్ని చూడాలని ఆండాళమ్మ వ్రత తాత్పర్యమన్నారు. ‘‘యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ ’’ పరమాత్మను ఏయే రూపంలో ఆరాధిస్తే ఆయా రూపంలోనే పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని చిన్న జీయర్ స్వామి ఉద్బోధించారు . తన ముందు ప్రసంగించిన మంత్రి పేర్ని నాని మాటలు ఎంతో అనుభవపూర్వకమైనవని ఒక అద్భుతమైన తల పండిన వేదాంతి మాదిరిగా ఆయన మాట్లాడరని చిన జీయర్ స్వామీ ప్రశంసించారు. పేర్ని నాని ఏ వేదం అభ్యసించారో తనకైతే తెలియదని చెబుతూ " తాను కాదు చేసేది.. మనం కాదు చేసేది స్వామివారు అనుగ్రహిస్తే ఆయా పనులు వాటంతట అవే చక చకా జరుగుతాయని " చెప్పే విశ్వాసం మంచి మనస్సు ఎంతో మహోన్నతమైనదన్నారు. చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికలలో ఎన్నో వాగ్ధానాలు చేస్తారని అత్యధికులు పదివి నుంచి వైదొలిగిన తర్వాతే అవి జ్ఞప్తికి వస్తాయని అందుకు భిన్నంగా పేర్ని నాని తాను ఎన్నికలలో చేసిన హామీని జ్ఞాపకం పెట్టుకొని భగవంతుడు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వగానే ఆ పని పూర్తి చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని ప్రశంసించారు. దేవుని సేవతోనే ఈ దఫా తన రాజకీయ జీవితం ప్రారంభించాలని మచిలీపట్నం గొడుగుపేట లోని శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవాలయంను పునర్నిర్మాణం చేయాలనీ సంకల్పించడం పట్ల తాను వందనాలు తెలియచేస్తున్నానని, మీ రాజకీయ జీవితంలో ప్రజలకు మరెన్నో మంచి పనులు చేసి శక్తీ భగవంతుడు మీకు ఇచ్చు గాక ! అంటూ చిన జీయర్ స్వామి సభాముఖంగా పేర్ని నానిను ఆశీర్వదించారు. గతంలో ప్రతి కళ , విద్య , వైద్యం ఆలయమే కేంద్రంగా కొనసాగేదని చెబుతూ ఏ కులభేదం జాతిభేదం వర్ణభేదం వయోబేధం లేకుండా ఒకే చోట అందరూ చేరేది నాది మాది అనుకొనే చోటు ఆలయమని అన్నారు. ఆలయం బాగుంటే సమాజం బాగుటుందని చిన జీయర్ స్వామి వక్కాణించారు. అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతో ఉదార హృదయంతో దేవాదాయశాఖ కామన్ జనరల్ ఫండ్ నుండి 1 కోటి 80 లక్షలు రూపాయలు మంజూరు చేయడం, హైకోర్టు న్యాయవాది దివంగత నల్లంచక్రవర్తుల భక్తవత్సలం కుటుంబ సభ్యులు 7 లక్షల 20 వేల రూపాయలు, మారంగంటి శోభారాణి ఆమె స్నేహితులు 2 లక్షల 62 వేల రూపాయలు , మంత్రిపేర్ని నాని 1 లక్షరూపాయలతో పాటు పలువురు స్థానికులుస్వామివారికి కానుకగా ఇవ్వడంతో ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యద్భుతంగా నిర్మాణం జరుపుకోనుందని చిన జీయర్ స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ వి. సత్యనారాయణ, డి ఇ ఈ బి. శ్రీనివాసరావు , మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ కె. శివరామకృష్ణ, దేవస్థాన కార్య నిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, ఘనాపాటి విష్ణుభట్ల సూర్య నారాయణ శర్మ, శ్రీకాకుళపు గుప్తా , గోపిశెట్టి సతీష్, ఐనంపూడి తాతారావు, ప్రధాన అర్చకులు లీలాకృష్ణ, కమిటీ సభ్యులు ఉడత్తు శ్రీనివాస్, నిమ్మగడ్డ సత్యప్రకాష్, కాండూరి పాండు, బొర్రా రాజా తదితరులు పాల్గొన్నారు.

Machilipatnam

2020-12-24 20:03:58

స్నేహలత కుటుంబానికి రూ.10 నష్టపరిహారం..

అనంతపురం దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా  ఉంటుందని,  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి, చట్టపరంగా   వచ్చే సాయం తో పాటు అదనంగా సీఎంఆర్ఎఫ్  కింద 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారని   రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటన లో  తెలిపారు. ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద బుధవారం ఎస్బిఐ లో పొరుగు సేవల ఉద్యోగి స్నేహలత హత్యకు గురికాగా, వారి కుటుంబానికి పరిహారంగా చట్టప్రకారం వచ్చేవి కాకుండా, ముఖ్యమంత్రి  మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో అదనంగా రూ.10 లక్షల ఎక్గ్రేషియా ప్రకటించారని  మంత్రి, కలెక్టర్ తెలిపారు.  ఎలాంటి పక్షపాతం లేకుండా త్వరితగతిన కేసును దర్యాప్తు చేయాలని పోలీసు శాఖకు  ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చట్టప్రకారం స్నేహలత కుటుంబానికి పరిహారంగా 8.25 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా, అందులో తక్షణ సహాయంగా 4,12,500 రూపాయల ను అందజేస్తున్నామని,  ఇందుకు సంబంధించి ట్రెజరీ లో బిల్లు పాస్ అయి బ్యాంక్ కు వెళ్లిందని, గురువారం రాత్రి లోగా ఈ మొత్తాన్ని ఆ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  మిగిలిన 4,12,500 రూపాయలను ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అందజేస్తామన్నారు. బాధిత కుటుంబానికి పేదలందరికీ ఇళ్లు పథకంలో   భాగంగా ఇల్లు, ఇంటి స్థలం అందజేస్తామని, అలాగే  స్నేహలత కుటుంబంలో ఒకరికి  శాశ్వత ఉద్యోగం, 5 ఎకరాల పొలం అందిస్తామన్నారు.  స్నేహలత కుటుంబానికి మూడు నెలలపైగా సరిపడా  100 కేజీల బియ్యం, 20 కేజీల కందిపప్పు, 10 లీటర్ల నూనె, 10 కేజీల చక్కెర, ఇతర నిత్యావసర సరకులతో పాటు వంటపాత్రలు  అందించామన్నారు.   ప్రభుత్వం నుంచి స్నేహలత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Anantapur

2020-12-24 19:53:19